ఇక తెరపైకి.. వీఐపీలు | The political pressure to oblige to the fore .. | Sakshi
Sakshi News home page

ఇక తెరపైకి.. వీఐపీలు

Published Fri, Apr 25 2014 3:59 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

ఇక తెరపైకి.. వీఐపీలు - Sakshi

ఇక తెరపైకి.. వీఐపీలు

సాక్షి, సిటీబ్యూరో : పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. గురువారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేయనున్నారు. చాలాకాలం తర్వాత రాహుల్ నగరానికి వస్తుండటంతో నగర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ నగర శివారు శాసనసభా స్థానాలపై దృష్టి సారించారు. శని, ఆదివారాల్లో నగరంలో వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement