
విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. రాహుల్ గాంధీ అంశంలో చంద్రబాబుకు నోరు పడిపోయిందా అని నిలదీశారు. ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ మౌనంగా వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు.
విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కేవీపీ.. ‘ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బయటకు పంపిన ఘనుడు చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దంటూ ఏపీకి చంద్రబాబు మరణ శాసనం రాశారు.నాగార్జునసాగర్ కూడా తానే కట్టానని చెప్పగలిగే ఘనుడు చంద్రబాబు.రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు.చంద్రబాబుకు నోరు పడిపోయిందా.. రాజకీయాలే ముఖ్యమా?, ప్రశ్నించడం కోసమే తమ పార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మౌనం దాల్చడం వెనుక కారణం ఏంటి? అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment