KVP Ramachandra rao
-
నా ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపండి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్‌హౌస్‌లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా.. హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.‘‘బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
చంద్రబాబుకు మోదీ అపాయింట్మెంట్ అందుకే ఇవ్వలేదు: కేవీపీ
సాక్షి, విజయవాడ: పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డ్ చంద్రబాబుకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు, కోడిగుడ్లు విసిరించాడని, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లేయించాడని కేవీపీ గుర్తు చేశారు. ‘‘రాజకీయ చతురుడని చంద్రబాబు తనకి తానే అనుకుంటాడు. అపవిత్ర రాజకీయంలో చంద్రబాబు రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేరు. 2019లో చంద్రబాబు దేనికోసం పోరాడారు. ఏపీ భవన్లో ధర్మపోరాట దీక్ష ఏయే ప్రయోజనాలను ఆశించి చేశారు. ప్రత్యేకహోదా ఎందుకు వద్దన్నారు.. ప్యాకేజీ ఎందుకు ముద్దన్నారు. స్వీట్లు పంచి.. పండుగ చేసుకుని ఏం సాధించారు’’ అంటూ కేవీపీ ప్రశ్నించారు. ‘‘మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబుకు మోదీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాను కలవకుండా అమిత్ షా.. నడ్డా వద్దకు పంపించారు. అభద్రతాభావం కలగగానే చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తొస్తాయి. ఢిల్లీకి ఎందుకెళ్లారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే.. -
‘చంద్రబాబుకు నోరు పడిపోయిందా?.. పవన్ ప్రశ్నించరేం?’
విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు. రాహుల్ గాంధీ అంశంలో చంద్రబాబుకు నోరు పడిపోయిందా అని నిలదీశారు. ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ మౌనంగా వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కేవీపీ.. ‘ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బయటకు పంపిన ఘనుడు చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దంటూ ఏపీకి చంద్రబాబు మరణ శాసనం రాశారు.నాగార్జునసాగర్ కూడా తానే కట్టానని చెప్పగలిగే ఘనుడు చంద్రబాబు.రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు.చంద్రబాబుకు నోరు పడిపోయిందా.. రాజకీయాలే ముఖ్యమా?, ప్రశ్నించడం కోసమే తమ పార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మౌనం దాల్చడం వెనుక కారణం ఏంటి? అని ధ్వజమెత్తారు. -
పవన్ కల్యాణ్‌కి చురకలంటించిన కేవీపీ
సాక్షి, వైఎస్సార్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. జనసేన పవన్ కల్యాణ్‌కు చెందిన పార్టీ, కనుక జనసేన పొత్తుల గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుందని అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారని గుర్తు చేశారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్‌కి పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించి, నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నాడని ధ్వజమెత్తారు. ‘బద్వేలు ఉప ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతిచ్చారు. ఇప్పుడేమో టీడీపీతో కూడా పొత్తు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదని’ వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్‌ని విమర్శించేంత స్థాయి, మెచ్యూరిటీ తనకు లేదంటు చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తుందని తెలిపారు. చదవండి: ‘చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో, అర్థం కావడం లేదు’ -
వైద్యులపై దాడులు: ఆ చట్టాన్ని అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడ్డ పేషెంట్లకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు గర్హనీయమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం చేసిందని పేర్కొన్నారు. (ఆత్మీయుడిని కోల్పోయిన బాధ ఇప్పటికీ) 2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కేవీపీ రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ తర్వాత హర్యానా, తదితర రాష్ట్రాలు సైతం అదే తరహా చట్టాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ఆపత్కాల సమయంలో మనందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేయాలని పిలుపునిచ్చారు. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) -
ఏపీకి కేంద్రం అన్యాయం: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: విభజన చట్టం అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్‌కి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని.. తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను ఆయన మరిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కుంటిసాకులతో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం గ్రహించి ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని.. పారిశ్రామిక పన్ను రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేవీపీ కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా పరిశ్రమల రాకకు సహకరించాలన్నారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడే వరకు సహాయం అందించాలని లేఖలో కేవీపీ కోరారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న వాటిని చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని సూచించారు. (చదవండి: టీడీపీకి భారీ షాక్; మాజీ మంత్రి రాజీనామా) -
తీవ్ర గందరగోళం.. చైర్మన్ ఎన్నిక వాయిదా..!
సాక్షి, సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కేవీపీ రామచందర్‌రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయింది. (చదవండి : ఉత్కంఠ వీడింది.. మేయర్ పీఠం వారిదే..!) టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దరఖాస్తూ పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్త చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషనర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంప్రదించగా.. ఆయనపై విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్కు 10 మంది బలం ఉండగా.. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, సీపీఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ సంఖ్యా బలం 10కి చేరింది. ఇరు పార్టీల సంఖ్యా బలం సమానంగా మారడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవనుంది. రేపటికి వాయిదా..! సాక్షి సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా నడిచింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమంతించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్‌ను విరగ్గొట్టారు. చేతిలో ఉన్న పేపర్లను చించేశారు. దీంతో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్ఎస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గందరగోళం నేపథ్యంలో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
ఆ బాధ ఇప్పటికీ ఎంతో ఉంది: కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చరిత్రలోనే అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన స్నేహితుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. నేడు వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ... ‘ఒక ఆత్మీయుడ్ని కోల్పోయిన బాధ నాకు ఇప్పటికీ ఎంతో ఉంది. వైఎస్సార్ సంక్షేమ పథకాలు వందల ఏళ్లు ఆదర్శంగా నిలుస్తాయి. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. హైదరాబాద్ అభివృద్ధిలోనూ వైఎస్సార్‌ది చెరగని ముద్ర. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు, ఫ్లైఓవర్లు, కృష్ణా జలాల తరలింపు అంతా ఆయన దార్శనికత వల్లే సాధ్యమైంది’ అని గుర్తు చేసుకున్నారు. -
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో విచారణ జరిపించాలి
-
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ
-
ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించా : కేవీపీ
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను గురువారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గవర్నర్‌కు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పోలవరంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించానని కేవీపీ వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ (చదవండి : మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం...) -
చంద్రబాబు బీజేపీతో లాలూచీ పడ్డారు
-
బాబూ మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం...
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘మంచి పనులు చేస్తామంటే అధికారులు ఎవరూ అడ్డుపడరు. సమీక్షల పేరుతో తన అనకూల వర్గానికి బిల్లులు క్లియర్ చేయమని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. బిల్లులు క్లియర్ చేస్తే వచ్చే ప్రభుత్వానికి అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అప్పట్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వద్దని ఉద్యమం నడిపారు. ఇక మంత్రి దేవినేన ఉమ ఏకంగా కృష్ణా బ్యారేజ్ వద్ద సత్యగ్రహం చేశాడు. 2014కు ముందు చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం సందర్శించాడా?. ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే. మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం జరిగింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. సీఎం నిర్ణయం వల్లే రాష్ట్రానికి సుమారు రూ.30వేల కోట్ల అదనపు భారం పడింది.’ అని తన లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి
-
చంద్రబాబుకు కోలుకోలేని ఝులక్ ఇచ్చిన కేవీపీ
-
చంద్రబాబుకు అల్జీమర్స్: కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే ఆంధ్రా ద్రోహులు అన్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హోదా గుర్తుకు వచ్చిందా అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని, ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో ఆయన సమర్థుడని ఎద్దేవా చేశారు. కేవీపీ రామచంద్రరావు బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట. నాకు నా పార్టీకి మధ్య అగాధం సృష్టించొద్దు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం బద్ధుడినై ఉన్నా. ఆ విషయం పార్టీకి పూర్తిగా తెలుసు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అనేక సంవత్సరాలుగా పార్లమెంట్లో ఉద్యమిస్తున్నా. ఏపీ ప్రయోజనాల కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఫణంగా పెట్టా. సభలో గంటల తరబడి నిలబడి అస్వస్థతకు గురయ్యా. పెయిన్ కిల్లర్స్ స్ప్రే చేసుకొని సభలో నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నానని రాజ్యసభ చైర్మన్ సైతం అన్నారు. ఎన్నో ప్రలోభాలు, ఇబ్బందులు ఎదురైనా చిన్నతనం నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాను. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా. కాంగ్రెస్ పార్టీలోనే నా శేష జీవితం. మూడేళ్ల క్రితమే మేము రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక హోదా కోరాం. మూడేళ్ల క్రితం కోటి సంతకాలు సేకరించాం. హోదాపై చంద్రబాబు ఇప్పుడు కళ్లు తెరిచారు. ఆయనది ఓవరాక్షన్. నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. హోదాపై నా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు 14 పార్టీలు మద్దతు పలికాయి. ఆ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేరింది. పచ్చి అబద్ధాలను నిజాయితీగా చెప్పడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు అధిష్టానం పూర్తి భరోసా ఇస్తుంది. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్ధతుతోనే అన్ని కార్యక్రమాలు చేశాం. మా మధ్య ఎలాంటి అపార్థాలు లేవు’ అని స్పష్టం చేశారు. -
సీఎం కళ్లకు కమ్మిన అధికార పొరలు కరిగిపోతున్నాయ్!
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదాకు ప్రతినిధి అయినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ కావాలని నాడు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారని, ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని ఆయనే ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం హోదాను ఇవ్వడం లేదని తెలిసే.. చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని, ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని సీఎం కోరడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఎన్నికలు వస్తుండటంతో చంద్రబాబు కళ్ళకు కమ్ముకున్న అధికార పొరలు కరిగిపోతున్నాయని, మళ్ళీ ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం ఆయనకు గుర్తుకువస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేసిన పోరాటానికి ఏనాడూ చంద్రబాబు మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. కనీసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లుకు కూడా ఆయన సహకరించలేదని తెలిపారు. ఇప్పుడు హోదా అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే.. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. -
‘గతిలేకనే బీజేపీతో బాబు తెగతెంపులు’
సాక్షి, న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై టీడీపీ ఆడుతున్నపూటకో డ్రామాలు, మోసపూరిత దీక్షల గురించి ఎండగడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేవీపీ పేర్కొన్న ముఖ్యాంశాలు.. పోరాటయోధుడిగా చిత్రీకరించుకోవడానికే.. ‘గత నాలుగు సంవత్సరాలుగా అధికార మత్తులో, మోడీ మాయలో ఉన్న మీరు, ఎన్నికలు ముంగిట్లో కొచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చి హోదా ఉద్యమంలోకి హఠాత్తుగా ఊడిపడి పొద్దెరుగకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. గతిలేకనే బీజేపీతో తెగతెంపులు చేసుకొన్న మీరు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గురించి కేంద్రతో పోరాటం చేస్తున్న పోరాటయోధుడిగా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ పాత్రను తక్కువ చేసి చూపడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే మీరు, మీ పార్టీ గత నాలుగు నెలలుగా చేస్తున్న పోరాటాన్ని "స్వతంత్ర ఉద్యమ పోరాటం" స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మీ సోత్కర్ష, సెల్ఫ్ డబ్బా శృతిమించి అసహజంగా కనిపించి జనానికి రోత పుట్టిస్తున్నాయి. బరువు తగ్గడానికే దీక్షలు మీ పార్టీ వారు చేస్తున్న దీక్షలు, ధర్నాలు "బరువు తగ్గడానికి" చేస్తున్న ప్రయోగాలేనని, ఇక మీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాటా దీక్షలు.. ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మాయ చేయడానికి చేస్తున్న మీ ప్రచార ఆర్భాటాలేనని "సోషల్ మీడియా" కోడై కూస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. అసత్య ప్రచారాలు చేస్తూ, చివరకు ఆ అసత్యాలని నిజాలుగా జనాన్ని నమ్మించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు జనం విషయంలో ఎలా పనిచేస్తున్నాయో తెలియదు గాని.. మీ విషయంలో,మీ భజనబృందాల విషయంలో చక్కగా పనిచేస్తున్నాయి. దీక్షల కోసం కోట్ల ఖర్చు ఇక మీ అసత్య ప్రచారాలకు పరాకాష్ట నిన్న "ఒంగోలు ధర్మ పోరాట దీక్ష" సభలో మీ ప్రసంగం. నాలుగేళ్లు, మీ మార్గదర్శకత్వంలో, మీ దిశానిర్దేశానికి అనుగుణంగా, మీకు మాట రాకుండా.. ప్రజా ప్రయోజనాలు, విభజన హామీలు గాలికి వదిలి.. తమ సొంత పనులు చక్కబెట్టుకొంటూ.. పార్లమెంట్ సభ్యులకు సన్మానంతో మొదలైన మీ సభ.. ఆద్యంతం అసత్యాలతో, అర్ధసత్యాలతో పాటు.. ఆత్మ స్తుతి.. పరనిందలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఈ సభ వల్ల ప్రజలకు ఏ మాత్రం లాభం లేకపోగా.. దీక్షకు మీరు అట్టహాసంగా చేయించిన ఏర్పాట్ల వల్ల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడింది. అయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను మరోసారి బురిడీ కొట్టించి ఎలా అయినా అధికారం సంపాదించాలని మీరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి.. వాస్తవాలను, ముఖ్యంగా విభజన హామీల సాధన విషయంలో మీ ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడంతో పాటు.. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విభజన హామీల విషయంలో చేసిన ప్రయత్నాలు మీకు తెలిసినా.. మరిచిపోయినట్లు నటిస్తున్న మీకు మరోసారి గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం. విభజన చట్టం అమలు గురించి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్సే.. నిజానికి మార్చి2, 2014న కేంద్ర కేబినెట్ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం మరియు ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా.. ఈ రెండు అంశాలను ఆర్డినెన్సు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినా.. న్యాయశాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఇవ్వకపోవడం వల్ల.. అదే ఆర్డినెన్సును ఎన్డీయే ప్రభుత్వం మే28 న జారీ చేసినా.. దాంట్లో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం గుర్తించి.. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జూన్2, 2014నే ప్రధానికి లేఖ రాశారు. ఎన్నికలలో గెలిచి, ప్రమాణస్వీకారం, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత అట్టహాసంగా చేయాలి అని మీరు గణించుకొంటున్న రోజులవి. మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఆరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ.. మొన్న లోక్‌సభలో అవిశ్వాసం, రాజ్యసభలో స్వల్ప విరామంలో చర్చ వరకు.. రాష్ట్రస్థాయిలో, కేంద్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వవలసినదేనని పోరాటం చేస్తూనే ఉన్నది. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలను తేదీలవారీగా మీకు పంపుతున్నాను. ఒకసారి పరిశీలించండి. మీ భ్రమలు తొలిగే అవకాశం ఉన్నది. ఇక ఆ సభలో మీ ప్రవచనాలలో భాగంగా.. అనేక పార్టీల మద్దతు మీరు "కష్టపడి" కూడగట్టినట్లు పెద్ద చిట్టా చదివారు. కానీ మీరు చెప్పిన పార్టీలన్నీ.. రాజ్యసభలో నేను ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశ పెట్టిన "ప్రైవేట్ మెంబెర్ బిల్"కు అనుకూలంగా ఓటు వేయడానికి ఏప్రిల్ 2016 లోనే, అంటే రెండు సంవత్సరాలు క్రితమే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాల వల్ల సిద్ధం అయ్యారన్న విషయం మీరు ఉద్దేశ్యపూర్వకంగానే మర్చిపోయారు. అంటే.. రెండు సంవత్సారాల క్రితమే.. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. జాతీయ స్థాయిలో 14 పార్టీలు ఆంధ్రకు సహకరించడానికి ముందుకొస్తే, మీరు మాత్రం మోడీ మోజులో అప్పట్లో.. "ప్రత్యేకహోదా సంజీవని కాదు.. ప్రత్యేకహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి".. అంటూ చిలకపలుకులు పలికారు. ఇక ఆ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా.. చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా, ఒక ప్రైవేట్ మెంబెర్ బిల్ కు అనుకూలంగా తప్పనిసరిగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు విప్ జారీచేసి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని చూస్తే.. మీరు మాత్రం మీ ఎంపీలకు సభ జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్నారు ఇక జైట్లీ గారు.. ప్రైవేట్ మెంబెర్ బిల్లు మనీ బిల్లు అని ప్రకటించగానే.. మీ సభ్యులు మీ ఆదేశాలకు అనుగుణంగా బల్లలు చరిచి ఆనందం వ్యక్తం చేశారు. ఇక జూన్4, 2017న రాహుల్ గాంధీ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీల జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో సంఘీభావం వ్యక్తం చేయడానికి గుంటూరు వస్తే.. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తూ, కాన్వాయ్ లపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసరమని, ఆ సభను భగ్నం చేయమని, రాహుల్ గాంధీతో సహా ఇతర నాయకుల ఫ్లెక్సీలను చించమని, పార్టీనాయకులకు, ప్రభుత్వ అధికారులకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు ఇచ్చారు మీరు. "ప్రత్యేకహోదా కంటే మెరుగైన ప్యాకేజిని సాధించానని" శాసన సభ సాక్షిగా చెప్పిన మీరు.. "ప్రత్యేక హోదా అంటే జైలుకే" అంటూ బెదిరించిన మీరు.. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాత్రేమీ లేనట్లు చిత్రీకరిస్తూ.. కృత్రిమ కన్నీరు కారుస్తూ.. ముక్కు చీదడం ప్రజలకు వెగటు పుట్టిస్తున్నది. అవిశ్వాసానికి కాంగ్రెస్ మద్దతు.. ఇక మొన్న కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. కేవలం అందరికంటే ముందు నోటీసు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో మీ పార్టీ నోటీసు ను ముందుగా చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక అవిశ్వాస తీర్మానం పై చర్చ చేపట్టడానికి కూడా మీకున్న సంఖ్యాబలం సరిపోదని తెలిసినా.. ఆ అవిశ్వాస తీర్మానానికి మీరే కారణం అయినట్లు చెప్పుకోవడం.. ఇక కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకొని అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని చెప్పడం.. మీ అవకాశవాదానికి పరాకాష్ట. ఊసరవెల్లి కంటే ఘోరంగా.. నిజానికి కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరగకూడదనే చిత్తశుద్ధితోనే మొదటినుంచి వ్యవహరిస్తున్నది. తన మనసు ఎప్పుడు మార్చుకోలేదు.. మాట ఎప్పుడు మార్చలేదు.. కానీ ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెల్లి కంటే ఘోరంగా, వేగంగా రంగులు మార్చింది.. మాటలు మార్చింది మీరే.. ఈ విషయం మీకు గుర్తు లేకపోతే.. "ప్రత్యేక హోదా విషయంలో మొదటినుంచి మన స్టాండ్ ఎలా ఉన్నది.. మన ఏ విధంగా ముందుకు పోయాం.. ఒక్కసారి చెప్పండి".. అని మీ సీపీఆర్ఓనో, మీ మీడియా సలహాదారునో ఒక్కసారి అడగండి.. వీడియో సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతారు. లేదంటే.. "గత నాలుగేళ్లు గా అధికారం తలకెక్కి.. ప్రజలను మర్చిపోయాను.. ఇప్పుడు ఎన్నికల వస్తుండడంతో మళ్ళీ మీరు గుర్తు వచ్చారు" అని తప్పును నిజాయతీగా ప్రజలముందు ఒప్పుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించకండి. ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపండి.. నిజంగా.. విభజన హామీల సాధన పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యుంటే.. దీక్షల పేరుతో, వేదికలెక్కి.. మైకులు పట్టుకొని ఇచ్చే ఉపన్యాసాలు ఆపి, "అవసరమైతే.. న్యాయపరమైన చర్యలు తీసుకొంటామని".. ఉత్తర కుమార ప్రగల్భాలు అపి.. అవసరం వచ్చింది అని గ్రహించి.. ప్రభుత్వ పరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ముందు, విభజనచట్ట అమలుపై వివిధ కోర్టులలో ఉన్న కేసులలో ప్రభుత్వం తరుపున వాస్తవాలు వివరిస్తూ కౌంటర్లు వేయించి.. ఈ కేసులను ప్రజా ప్రయోజనార్ధం దృష్ట్యా త్వరితగతిన పరిష్కరించమని కోర్ట్ లను కోరండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. దీక్షల పేరిట ప్రజాధన దుర్వినియోగాన్ని ఆపండి. హోదాపై మీ నిజాయితినీ నిరూపించుకోండి. ప్రత్యేక హోదాతో సహా ఇతర విభజన హామీల సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను, పోరాటాన్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ పాత్రను తక్కువచేసి చూపేలా గోబెల్స్ ప్రచారాలు మానుకోండి’ అంటూ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
హోదా వద్దని ఆర్థిక సంఘం అనలేదు
-
‘హోదా వద్దని ఆర్థిక సంఘం చెప్పలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సిఫార్సు చేసినట్టు ఎక్కడా వెల్లడించలేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. అవాస్తవాన్ని నిజమని నమ్మించవచ్చని బీజేపీ విశ్వసిస్తోందని, అందుకోసమే వాళ్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హోదాపై ఆర్థిక సంఘం ఎలాంటి ప్రతికూల సిఫార్సులూ చేయకపోయినా ఎవరికీ కనిపించనివి బీజేపీకి మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రత్యేక హోదాపై ఏపీలో రోజురోజుకూ పోరు ఉధృతమవుతోందన్నారు. హోదా పోరాటం కొనసాగుతుందని, సోనియా గాంధీ సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో సహా అప్పటి ప్రధాని మన్మోహన్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ రామచంద్రరావు గురువారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కేవీపీ ప్రవేశపెట్టిన తీర్మానం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
బెజవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరం..
సాక్షి, అమరావతి : జ్యోతిరావు పూలే విగ్రహ నివాళి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు శనివారం లేఖ రాశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు. కాగా పూలే విగ్రహానికి నివాళి వివాదంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కేవీపీ సీఎస్‌కు లేఖ రాశారు. పోలీసులు మా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. -
‘ఆస్కార్‌కి మించిన నటుడు’
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్‌కి మించిన నటుడని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ లోక్ సభలో స్పృహ లేకుండా కాంగ్రెస్‌ని ఉద్దేశించి అసత్యంగా మాట్లాడారని అన్నారు. ఏపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందనే విషయం శుద్ధ అబద్ధమన్నారు. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మీద మోదీ అపారమైన జాలి, కరుణ చూపించిందనందుకు ధన్యవాదాలు అని అన్నారు. అంజయ్యని కాంగ్రెస్ చాలా అవమానించిందని మోదీ చెబుతున్నారని, లక్ష రూపాయల సూట్, కళ్ల అద్దాలు పెట్టుకుని అంజయ్య ఎప్పుడూ లేరని అన్నారు. అంజయ్య మామూలు కూలీగా, సామాన్యుడిగా బ్రతికేవారని అన్నారు. అంజయ్య 1957 నుంచి చనిపోయేంత వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. ఆయనకి కుల బలం లేదని, కానీ ప్రజాబలం ఉందని వ్యాఖ్యానించారు. అంజయ్య చనిపోయాక కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంజయ్యకి ఇన్ని చేసినా ఎస్సీ అయిన అంజయ్యని అవమానించారని మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పీవీ నరసింహారావు గురించి కూడా మోదీ చాలా బాధ పడ్డారని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకి ధన బలం లేదు, కుల బలం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోత్సాహం వలన ఆంధ్రప్రదేశ్‌కి నరసింహారావు ఎంతో మేలు చేశారని చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. అద్వానీకి మనకంటే ఎక్కువ మోదీ గురించి ఎక్కువ తెలుసునని, అలాంటి ఆయనను బొటన వేలితో తొక్కి పెట్టారని ఆరోపించారు. అద్వానీ మీద సీబీఐ కేసు పెట్టి ఈ వయసులో కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అద్వానీ ఆ రోజు చేపట్టిన పనుల వల్లే బీజేపీకి జవసత్వాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు బీజేపీ పనికిరాని డాక్యుమెంట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 202 సీట్లు మాత్రమే ఉన్నాయని, కానీ బీజేపీ అప్పుడు అడ్డుపడి ఉంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యేది కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో తాను, తన మిత్రులు కలిసి బీజేపీ వారిని బిల్లుని అడ్డుకోమని వేడుకున్నామని, కానీ ఆరోజు కాంగ్రెస్ పాత్ర చాలా చిన్నదని, బీజేపీ పాత్ర చాలా పెద్దదని వ్యాఖ్యానించారు. వారి సవరణలు అన్నీ ఉపసంహరించుకుని బిల్లుకు మద్దతు పలికారని చెప్పారు. -
ప్రధానమంత్రి హోదాను దిగజార్చారు
-
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలుపై ఏపీ ఎంపీల నిరసనలతో గురువారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కేంద్ర మంత్రులకు సమిష్టి బాధ్యత ఉంటుందని, కేబినెట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్ నిర్ణయంతో విభేదించవచ్చని, మంత్రి పదవిలో కొనసాగుతూ కేబినెట్ నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వచ్చని, సుజనా మాటలు కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దీనిపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు విభజన హామీలపై పెద్దల సభలో వాడివేడి చర్చ జరిగింది. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని గౌరవించాలని, బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. సభ్యుల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం రాజ్యసభ సభ వాయిదా అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యను ఛైర్మన్ ఎలా సమర్థిస్తారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. -
రాజ్యసభలో వెనక్కి తగ్గిన కేవీపీ!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలంటూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఓ వైపు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో టీడీపీ ఎంపీలు దాదాపు తమ పోరాటాన్ని ఆపేయగా, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గారు. రాజ్యసభలో ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డుతో పోడియం వద్ద నిరసన తెలిపారు. అయితే వెంటనే స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇది సరైన విధానం కాదని, ఈరోజు కేవీపీని అనుమతిస్తే రేపు మరొకరు ఇలా నిరసన చేస్తారన్నారు. ఇలా అయితే సభను సజావుగా నడపలేనని, వాయిదా వేస్తానని వెంకయ్య హెచ్చరించారు. కేవీపీని తన సీట్లో కూర్చునేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలని చైర్మన్ వెంకయ్య కోరారు. సభలో ఇలాంటి చర్యలకు సహకరించబోమని వెంకయ్యకి గులాం నబీ ఆజాద్ వివరణ ఇచ్చుకున్నారు. నిబంధన 255 కింద ఎంపీ కేవీపీ తన హాజరును ఉప సంహరించుకొని, సభ నుంచి నిష్క్రమించాలని చైర్మన్ ఆదేశించారు. దీంతో చేసేదేం లేక వెనక్కి తగ్గిన కేవీపీ చైర్మన్ ఆదేశానుసారం నిరసనను విరమించి తన సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. -
ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత బిల్లు తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకు బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రకటనకు చట్టబద్దత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గతేడాది ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లభించే మూడు ముఖ్య ప్రయోజనాలకు చట్టబద్దత కల్పించాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు. మూడు ముఖ్య ప్రయోజనాలు.. 1. 2015 -2020 మధ్యకాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90:10 ఉండాలి. కేంద్రం వాటాగా అందించే 90 శాతం నిధులను ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రతి ఏటా రాష్ట్రానికి అందజేయాలి. 2. 2015-2020ల మధ్యకాలంలో ఏపీలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ఇచ్చే 90 శాతం రుణాన్ని గ్రాంటుగా ఇవ్వడం. 3. ఐదు సంవత్సరాల కాలంలో ఏపీలో ప్రారంభమయ్యే అన్ని రకాల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను, పన్ను మినహాయింపులను ఇవ్వడం. కాగా, ఎంపీ రామచంద్రరావు పంపిన బిల్లును పరిశీలించిన రాజ్యసభ సెక్రటరియేట్.. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుకు కిందకు వస్తుందని పేర్కొంది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేమని బిల్లును వెనక్కుపంపింది. -
‘ఏపీకి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తా’
-
సభలో కేవీపీ నిరసన; నోరుజారిన కురియన్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంటులో ఆందోళన చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన చైర్మన్ వెల్‌లోకి చొచ్చుకెళ్లారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని రాసున్న ఫ్లకార్డును ఎత్తిపట్టుకుని అక్కడే నిలబడ్డారు. నిరసన విరమించి, సీట్లో కూర్చోవానలి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంత చెప్పినా కేవీపీ వెనక్కి తగ్గలేదు. దీంతో సహనం కోల్పోయిన కురియన్ నోరుజారారు. ‘ఈయనకు ఏమైంది? పిచ్చిపట్టిందా?’ (what is wrong with him and is he mad) అని కేవీపీని ఉద్దేశించి అన్నారు. గురువారం వెలువడిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపండి
సాక్షి, న్యూఢిల్లీ: కాకినాడ–సికింద్రాబాద్ మధ్య నడిచే గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను (12738/12737) లింగంపల్లి వరకు పొడిగించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రైల్వే మంత్రికి లేఖ రాశారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణిస్తుంటారని, వారంతా కూకట్పల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. అయితే ఈ రైలును సికింద్రాబాద్ వరకే నడపడం వల్ల అక్కడి నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న లింగంపల్లికి చేరుకోవడానికి ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకు నడపాలని కేవీపీ కోరారు. -
'వైఎస్సార్ మరణం ఏపీకి దురదృష్టకరం'
సాక్షి, పోలవరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, దాని ఫలాలు కూడా ప్రజలకు అందేవని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ నీటి విలువ తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి దురదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలతో అడుకోవద్దు: రఘువీరా ధర్నాలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. తమది పనికిమాలిన పాదయాత్ర అయితే పుణ్యాత్ములు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు తీసుకువస్తే టీడీపీ, బీజేపీలు మా కల అనడం హాస్యాస్పదమన్నారు. మూడున్నర ఏళ్లలో గోదావరి ఇసుక మొత్తం దోచేశారని.. మరో ఏడాదిన్నర కాలంలో ఇసుకను పుస్తకంలో చూడవలసిన పరిస్థితి వస్తుందన్నారు. పోలవరం వచ్చి ఒక శంకుస్థాపన, ఒక భూమి పూజ మాత్రమే చేస్తున్నారని.. కోట్లు ఖర్చు తప్పా ఏమీ జరగటం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ, టీడీపీలు ప్రాజెక్ట్ పేరుతో ప్రజలు జీవితాలతో అడుకోవద్దని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి చేసే 2019 ఎన్నికలకు వెళ్లాలని.. లేదంటే ప్రజలు తన్నుతారని రఘువీరా వ్యాఖ్యానించారు. తమకు గొప్పలు వద్దని.. మగాళ్లు అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయండని ఆయన సవాల్ విసిరారు. -
'పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి'
సాక్షి, రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. హైకోర్టుకు ఈ నెల 19 లోపు ప్రభుత్వం వాస్తవాలను చెప్పుకునే అవకాశం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై గతంలోనే ఫొటోలతో సహా సీఎం చంద్రబాబుకు లేఖ పంపించామన్నారు. చంద్రన్న మాల్స్ అనేవి ప్రభుత్వం పేరుతో జరుగుతున్న ప్రైవేట్ వ్యాపారమని విమర్శించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బెయిల్ ఇన్ చట్టం దారుణమైందని మండిపడ్డారు. ఆ చట్టం అమలైతే ప్రజలకు బ్యాంకులపై ఉన్న నమ్మకం పోతుందని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును చట్టంతోనే కొట్టేసే యత్నం చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే పటిష్టమైన మన బ్యాంకింక్ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక బాధ్యతను 1.4.2014కే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేర మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో గత వారం పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుపై మండిపడ్డ కేవీపీ
-
కేవీపీ పిల్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. 1.4.2014 నాటి ప్రాజెక్టు వ్యయానికే మాత్రమే చెల్లింపులు చేస్తామన్న ప్రకటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర నీటి వనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శులను, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కేవీపీ పిల్‌ను విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక బాధ్యతను 1.4.2014కే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేర మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో గత వారం పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
దేశంలో ఏటీఎం సేవలు విస్తృతపరచండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటీఎం సేవలను విస్తృత పరచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్రమంత్రికి లేఖరాశారు. దేశంలో ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోనేగాక అర్బన్ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే పేరుతో బ్యాంకులు ఎడాపెడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల తమ డబ్బు డ్రా చేసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దేశంలో ఏటీఎంల నిర్వహణ సంస్థలను పెంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని లేఖలో కోరారు. -
పేదల హృదయాల్లో నిలిచారు
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో కేవీపీ, రఘువీరా సాక్షి, అమరావతి: రైతులకు రైతుగా.. కూలీలకు కూలీగా.. రోగులకు డాక్టర్‌గా మహానేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల హృదయాల్లో నిలిచిపోయారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. వైఎస్ 8వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేవీపీ తదితర నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేవీపీ మాట్లాడుతూ రెండు పూటలా గంజికి లేని కుటుంబాల్లో కూడా వైఎస్ కృషితో నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. రఘువీరా మాట్లాడుతూ రాజకీయంగా వైఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా గట్టిగా నిలబడ్డారని గుర్తు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. -
సీఎం చంద్రబాబుకు ఎంపీ కేవీపీ సవాల్
-
‘బీజేపీతో చంద్రబాబు విందు రాజకీయాలు’
హైదరాబాద్: బీజేపీ దగాకోరు రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమిత్‌షాతో విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మేలుపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి పోరాడాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. -
‘రాజమండ్రి’ రన్‌వే విస్తరణకు తుది ఆమోదం
రూ.181.45 కోట్లతో విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయ రన్‌వే విస్తరణకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది. విస్తరణ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పొందింది. రూ.181.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం మధురపూడి గ్రామంలో ఈ విమానాశ్రయం ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో తదనుగుణంగా విమానాశ్రయాన్ని విస్తరించాలని ఏఏఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ఇదివరకే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదించింది. భోగాపురం విమానాశ్రయ టెండర్లకు కమిటీ సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఇంధన, మౌలిక వసతుల కల్పన ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. -
రాజ్యాంగాన్ని సవరించాలి
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభలలో ప్రధాని, కేంద్ర మంత్రులు చేసే వాగ్దానాలను అమలు చేయడం కేంద్ర మంత్రుల బాధ్యత అన్నారు. హామీలకు రాజ్యాంగపరమైన పూచీకత్తు కల్పించే పక్షంలో తదుపరి వచ్చే ప్రభుత్వాలు వాటి అమలును విస్మరించలేవన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 121 తర్వాత 121 (ఏ)ను పొందుపర్చాలని కేవీపీ ఈ బిల్లులో ప్రతిపాదించారు. -
విభజన చట్టం అమలు ప్రస్తావనేది?: కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి హోదాతో పాటు విభజన చట్టం అమలు స్థితిని రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచి రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం తన దృఢ సంకల్పాన్ని రుజువు చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశతో ఉన్నారని కేవీపీ పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన నిబద్దతను రుజువు చేసుకోవడంలో విఫలమైందన్నారు. -
చంద్రబాబుకు చురక అంటించిన కేవీపీ
-
చంద్రబాబుకు చురక అంటించిన కేవీపీ
న్యూఢిల్లీ: విభజన హామీలు ఎందుకు నెరవేర్చరని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ముఖ్యమైన 10 హామీలను ఇప్పటివరకు నెరవేర్చేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హోదాపై ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా చేశారని, వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు అనుమతించాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించిన ఘనత తమదేనని గుండెపై చేయి వేసుకుని చెప్పగలనని కేవీపీ అన్నారు. ఎక్కువకాలం పాలించిన ప్రతిఒక్కరూ ఉత్తమ పరిపాలకులు కాలేరని, ఔరంగజేబులా చంద్రబాబు ఎక్కువ కాలం పరిపాలించలేరని చురక అంటించారు. వాస్తవాలు మాట్లాడితే తన అనుయాయులతో ఎదురుదాడి చేయిస్తున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఏపీ పోలీసు అధికారుల ప్రకటనలు చూస్తుంటే వారికి రాజ్యాధికారాన్ని అప్పగించారన్న భయం కలుగుతోందన్నారు. విభజన చట్టం హామీల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. -
‘జల్లికట్టు’ స్ఫూర్తితో కేంద్రంపై యుద్ధం
సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి తమిళనాడు ప్రజల స్ఫూర్తితో అందరం కలసి పోరాడుదామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేవలం మూడు రోజుల ఉద్యమంతో తమిళులు తమ డిమాండ్‌ను సాధించుకున్నారని, మనం మూడేళ్లయినా విభజన హామీలు సాధించుకోలేకపోయామని లేఖలో పేర్కొన్నారు. (లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి ప్రజా ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిందేనన్న విషయం జల్లికట్టు విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాసాధనకు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. -
చరిత్ర హీనులుగా మిగిలిపోతాం
-
చంద్రబాబూ.. డేట్, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం చంద్రబాబుకు ఆయన మరో బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సమయం, స్థలాన్ని మీరే నిర్ణయించండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలవరంపై తాను కుట్రలు చేస్తున్నానని ఆరోపించడం సరికాదని అన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి వాటిని రుజువు చేయాలని, లేకపోతే తాను లేఖలో ప్రస్తావించినవన్నీ వాస్తవాలేనని, చంద్రబాబు అనుచరులు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని ప్రజలు అర్థం చేసుకుంటారని కేవీపీ పేర్కొన్నారు. -
ఔరంగజేబుతో పోలిక సబబే..
హైదరాబాద్: కమిషన్ల కోసమే కేంద్రం చేపట్టాల్సిన పోలవరం పనులను చంద్రబాబు తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. 24 వేల కోట్ల ప్రాజెక్టుకు బాబు తీసుకొచ్చిన నిధులు కేవలం 2 వేల కోట్లు అని కేవీపీ వెల్లడించారు. 2018లోపు పోలవరం ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లోను పూర్తి చేయలేరని, వాస్తవ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 144 కిలోమీటర్ల పోలవరం కుడికాల్వను పూర్తి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కేవీపీ గుర్తుచేశారు. ఆ కాల్వలకు మోటార్లు బిగించి నదులు అనుసంధానం చేశామని బాబు గొప్పలు చేప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆత్మీయుల హననానికి సైతం వెనుకాడని ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చడం సబబే అని పోలవరం విషయంలో మరోసారి రుజువైందని లేఖలో పేర్కొన్నారు కేవీపీ రామచంద్రరావు. -
ఔరంగజేబుతో పోలిక సబబే..
-
అది ద్రవ్య బిల్లు
కేవీపీ ప్రైవేటు బిల్లుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి వీలుగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారించారు. ఈ మేరకు చైర్మన్ ఆదేశాలను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. కేవీపీ బిల్లులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు, ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2015ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 117, క్లాజు(1)ను బట్టి ద్రవ్య బిల్లుగా నిర్ధారిస్తున్నట్టుగా కురియన్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు: కేవీపీ తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించి రాజ్యసభలో చర్చ నుంచి తొలగించడాన్ని కేవీపీ తప్పుబట్టారు. రాజ్యసభ నియమావళి 185(3) ప్రకారం కేవీపీ బిల్లును చర్చ నుంచి శుక్రవారం తొలగించారు. దీనిపై కేవీపీ స్పందిస్తూ..లోక్‌సభ స్పీకర్ ఇది ద్రవ్య బిల్లుకాదని తేల్చినా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ద్రవ్య బిల్లుగా నిర్ధారించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. -
కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..!
-
కొనుక్కున్న నేతలకు సీట్ల కోసమే..!
తెలుగుదేశం పార్టీ వాళ్లు వేరే పార్టీ నుంచి కొనుక్కున్న లేదా దత్తత తీసుకున్న ఎమ్మెల్యేలకు రేపు రాబోయే ఎన్నికలలో సీట్లు ఇచ్చుకోడానికే అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తుతో సంబంధం లేదని, అందుకే కేంద్రం ఏం చెప్పినా దానికి హర్షామోదాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు తరఫున కేంద్రంతో బేరసారాలు సాగించిన నాయకులు కూడా అదే చెప్పారన్నారు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం చంద్రబాబు చేతికి కేంద్రం డబ్బు ఇస్తుందని, అందులోంచి ఆయనకు కావల్సిన లబ్ధి చేకూర్చుకుంటారని.. ఇందులో ప్రజలకు మిగిలేది సున్నా మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ
-
పోలవరం ప్రాజెక్టుపై కుట్ర
♦ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం ♦ కమీషన్ల కోసం ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌పై ఏదో కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం, జేబులు నింపుకోడానికే తానే పోలవరం ప్రాజెక్టును చేపడుతున్నారన్నారు. కేవీవీ బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని కేంద్రం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రాజెక్ట్‌ను ఆపడానికి కుట్ర జరుగుతోందా? అనే భయాందోళనలు మొదలయ్యాయని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమా భారతికి లేఖ రాసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు. కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవరేఖ లాంటి ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, 2018కల్లా పూర్తిచేయాలని కేవీపీ కోరారు. వారిద్దరూ భట్రాజులుగా పనికొస్తారు కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం చంద్రబాబు పుష్కరాలను వాడుకున్నారని కేవీపీ మండిపడ్డారు.ఈ సందర్భంగా బాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు పరస్పరం పొగుడుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. వారు భట్రాజులుగా కూడా పనికొస్తారని అర్థమవుతోందన్నారు. దివంగత వైఎస్ వల్ల పూర్తయిన పోలవరం కాల్వల ద్వారా పట్టిసీమకు నీళ్లు అందించడం మినహా రాష్ట్రానికి ఇంకేమైనా ప్రాజెక్ట్‌ను తెచ్చారా? అని నిలదీశారు. -
వైఎస్ఆర్ ముందుచూపు వల్లే...:కేవీపీ
న్యూఢిల్లీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందుచూపు వల్లే పోలవరం కాల్వలు పూర్తయ్యాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ముందు కాల్వలు తవ్వడమేంటని ప్రశ్నించారని కేవీపీ అన్నారు. ఇప్పుడు ఆ కాల్వలతోనే బాబు నీళ్లు ఇస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ రాసినా స్పందించలేదని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కాకుండా ప్రత్యేక ప్యాకేజీ మీదే శ్రద్ద పెడుతున్నారని ఆయన విమర్శించారు. -
'బాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ'
విశాఖపట్నం : సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతి సభలో మోదీ చెప్పారన్నారు. యూపీఏ హయాంలో ప్రత్యేక హోదా పదేళ్లు అడిగిన జైట్లీ, వెంకయ్య ఇప్పుడు ప్రైవేటు బిల్లు ఓటింగ్ కూడా రాకుండా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీతో సీఎం చంద్రబాబు జేబులు నింపుకోవాలనుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఏపీకి హోదాపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ హోదాగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలలో ఆలస్యం జరుగుతుందని రఘువీరా అన్నారు. -
కేవీపీ బిల్లుపై ప్రభుత్వం అభ్యంతరం
≈ ద్రవ్యబిల్లుపై ఓటింగ్‌కు రాజ్యసభకు అధికారం లేదన్న జైట్లీ ≈ నిర్ణయం కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపిన రాజ్యసభ ≈ తానిచ్చిన హామీని గౌరవించాలన్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ≈ వెల్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. సభ సోమవారానికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించాలా? లేదా? అనే విషయాన్ని తేల్చడానికి లోక్‌సభ స్పీకర్ వద్దకు బిల్లును పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు. అప్పటివరకూ దీన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ చేపట్టాల్సిన సమయంలో బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లుగా పేర్కొంటూ..రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమన్నారు. రాజ్యాంగంలోని అర్టికల్ 117 ను ఉటంకిస్తూ, ఆ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్నారు. ద్రవ్య బిల్లు అవునా, కాదా అనే వివాదం ఏర్పడినప్పుడు లోక్‌సభ స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర పథకాలలో 90 శాతం నిధులు కేంద్రం అందిస్తుందని, అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలకు సంబంధించి నిధుల వినియోగం ముడిపడి ఉందన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నామని, రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ అభ్యంతరాలపై సభ్యుల అభిప్రాయాలను కురియన్ కోరారు. నాటి ప్రధాని హామీల మాటేమిటి? రాజ్యసభలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారా లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లు అవునా, కాదా అన్నది సమస్య కాదని, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను గౌరవిస్తారా లేదా? తేల్చాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14 వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆర్థిక మంత్రి జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని జైరాం రమేశ్ చెప్పారు. ద్రవ్య బిల్లుగా పేర్కొనడాన్ని కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ తప్పుబట్టారు. చర్చ ముగిసిన తర్వాత ద్రవ్య బిల్లు అనడం సరికాదని సమాజ్‌వాది పార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ చెప్పారు. జీఎస్టీ బిల్లును అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ చెప్పారు. ఉభయ పక్షాల వాదన విన్న తర్వాత బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపిస్తున్నట్లు కురియన్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. బిల్లుపై అనవసర రాద్ధాంతం: కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్రపతి అనుమతి ఉందని, చర్చ పూర్తయిన సమయంలో ద్రవ్య బిల్లు అనడంలో అర్థం లేదని కేవీపీ విమర్శించారు. గతంలో కూడా ఈ విధమైన రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్రం హామీలను అమలు చేయకపోవడం వల్లే బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఇవ్వవచ్చన్నారు. హామీలను అమలు చేయాలి ఏపీ విభజన సమయంలో ప్రధానిగా రాజ్యసభలో తాను ఆరు హామీలు ఇచ్చానని,వాటిని అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. అప్పట్లో విపక్షంలో ఉన్న జైట్లీ ఆ హామీలపై సంతృప్తి చెందారని, విభజన బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు.కేబినెట్లో తీర్మానించి, రాష్ట్రపతికి పంపించామని, ఎన్నికల షెడ్యూల్ వల్ల ఆర్డినెన్స్ జారీ కాలేదని తెలిపారు. అప్పటి హామీలను గౌరవించి అమలు చేయాలని ఆయన కోరారు. -
జైరాం రమేష్, కురియన్ మధ్య వాగ్వాదం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టి ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బిల్లు చర్చ ముగిసిందని కురియన్ ప్రకటించడంతో జైరాం రమేష్ అభ్యంతరం తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ అంశాలపై మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా, కేవీపీ ప్రైవేట్ బిల్లుపైనే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ సూచించారు. పునర్ వ్యవస్థీకరణపై బిల్లుపై ఇప్పటికే చాలాసార్లు చర్చించామన్నారు. కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లా కాదా అన్నదానిపైనే ప్రస్తుతం చర్చ అని కురియన్ పేర్కొన్నారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ జైరాం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత మాట్లాడిన కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్ విభజన హామీలు నెరవేర్చాలని..మనీ బిల్లు అనడం సమంజసం కాదన్నారు. అయితే కేవీపీ బిల్లు మనీబిల్లా కాదా అనేది లోక్‌సభ స్పీకర్‌ను అడుగుతామంటూ కురియన్ మరో చర్చలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకు ముందు కపిల్ సిబల్ మాట్లాడుతూ దేశ చట్టసభల్లో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క బిల్లు ద్రవ్య బిల్లేనన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణిస్తూ...ఓటింగ్ జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కపిల్ సిబల్ విమర్శించారు. అలాగే ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు..... విలువుందో లేదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని సీపీఐ ఎంపీ సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి సంబంధించి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏచూరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాగా ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా కేంద్రం పరిగణించడం సరికాదని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రైవేట్ బిల్లు ప్రతి ఒక్క సభ్యుడి హక్కు అని తెలిపారు. ఆనాడు పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నామని, ప్రత్యేక హోదా అమలు చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి అశలు వమ్ము చేయొద్దని అన్నారు. తన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్కపార్టీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేం: జైట్లీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు.. మనీ బిల్లు అని, రాజ్యాంగం ప్రకారం ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలను నెరవేరుస్తామన్నారు. అలాగే విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయన ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే తాము చూస్తున్నామని జైట్లీ తెలిపారు. విభజన హామీలపై ఇవాళ కూడా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలతో మాట్లాడామన్నారు. పార్లమెంట్‌లోని రెండు సభలకు వేర్వేరు హక్కులున్నాయన్నారు. ఆర్టికల్ 110లో ద్రవ్య బిల్లు గురించి స్పష్టంగా ఉందని జైట్లీ పేర్కొన్నారు. ద్రవ్య బిల్లును లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని, రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుకు రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించే సంప్రదాయం లేదని అందువల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టాలు చేయలేమన్నారు. ఈ సందర్భంగా కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును జైట్లీ ద్రవ్య బిల్లు అనటంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లును ఆర్థిక బిల్లు అని జైట్లీ అనడం సరికాదన్నారు. ప్రతి బిల్లు ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉందన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును జైట్లీ ద్రవ్య బిల్లు అనటంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లును ఆర్థిక బిల్లు అని జైట్లీ అనడం సరికాదన్నారు. ప్రతి బిల్లు ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉందన్నారు. -
'ప్రత్యేక' ప్రైవేటు బిల్లు ఓటింగ్‌పై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం మరోసారి చర్చకు వస్తుంది. అయితే, ఓటింగ్ నిర్వహిస్తారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రైవేటు బిల్లు నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికి విప్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తేనే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని గత కొంతకాలం ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రకాల రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రైవేటు బిల్లుపై ఏం చేస్తుందనేది వేచి చూడాలి. -
'అది తెలుగు డ్రామా పార్టీ'
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ.. తెలుగు డ్రామా పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏపీకి ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. హోదా విషయంలో ఏపీ ప్రజలను, పార్లమెంట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. హోదా ఇవ్వకపోవడానికి రాజ్యాంగాన్ని, 14వ ఆర్థిక సంఘాన్ని కారణాలుగా చూపడం సబబు కాదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ సిఫారసు చేయలేదని గుర్తుచేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి వాజ్‌పేయిని కలిశారు. అలాంటిది ఇప్పుడెందుకు స్పందించడం లేదు. ప్రత్యేక హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బీజేపీ-టీడీపీ విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. -
'జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు'
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక సంఘం అనేక సిఫార్సులు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. వాటిని అంగీకరించాలా? లేదా ? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జైరాం రమేష్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయాలు, పంపకాలపైనే అధికంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. సహజంగానే కొన్ని రాష్ట్రాలు వీటిని అంగీకరిస్తాయని చెప్పారు. కానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక సంఘం రద్దు చేయలేదన్నారు. అందుకు సంబంధించిన మేయిల్ను జైరాం రమేష్ బయటపెట్టారు. అలాగే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆ ఆర్థిక సంఘంలోని కీలక సభ్యుడు అభిజిత్ సేన్ నిన్ననే తనకు ఈ మెయిల్ చేశారని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల ఆదాయాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి మాత్రమే పెంచిందని తెలిపారు. అందులో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు అంటూ ఏమీ విడదీయలేదని వెల్లడించారు. అన్నింటికీ అదే సూత్రాన్ని వర్తింప చేసిందన్నారు. కానీ, ప్రత్యేక హోదా అంశం రద్దుకు ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. కానీ ఆర్థిక మంత్రి సభనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వాలా? లేదా? అన్నది మోదీ ప్రభత్వం ఇష్టం అని చెప్పారు. కానీ 14వ ఆర్థిక సంఘం మీద నెడుతూ... అబద్దాలు చెప్తున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తనకు తానుగానే ప్రత్యేక హోదాను రద్దు చేసిందన్నారు. దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని జైరాం రమేష్ గుర్తు చేశారు. వాటిలో ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందన్నారు. ప్రత్యేక హోదా రద్దు అన్నది రాజకీయంతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు నామమాత్రమైనవి కావని... ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఏపీ పునర్ విభజన చట్టంలో హామీలు అమలు చేయడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతి ఐఐటీ ప్రారంభానికి , తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ మొదలుపెట్టడానికి రెండేళ్ల సమయం తీసుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధమే లేదని.. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. -
పునర్విభజన చట్టం అమలుపై చర్చకు నోటీసు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. పునర్విభజన చట్టం అమలు తీరుపై ఇవాళ మధ్యాహ్నం రెండుగంటలకు రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. కాగా గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిన్న రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన చట్టం అమలుపై ఇవాళ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. -
పునర్విభజన చట్టం అమలుపై నేడు చర్చ
-
పునర్విభజన చట్టం అమలుకు నేడు చర్చ
- రాజ్యసభ చైర్మన్ చొరవతో ఫ్లోర్ లీడర్ల సమావేశంలో నిర్ణయం - చర్చ తర్వాత సమాధానమివ్వనున్న ఆర్థిక మంత్రి జైట్లీ - ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగానే తేల్చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలు తీరుపై గురువారం రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ విభజన చట్టం అమలుపై స్వల్ప వ్యవధి చర్చ జరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ విభజన చట్టం అమలు, ఏపీకి ఏ విధంగా సాయం అందిస్తున్నామనే విషయంపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రతిపాదించింది. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలోనే ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై చర్చకు అభ్యంతరం లేదని, అయితే ఓటింగ్‌కు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయని జైట్లీ పేర్కొన్న విషయం విదితమే. బుధవారం సమావేశంలో కేంద్రం ఈ విషయాన్నే పునరుద్ఘాటించింది. విభజన చట్టం అమలుపై చర్చ జరిగిన తర్వాత ఆర్థిక మంత్రి జైట్లీ జవాబిస్తారని, అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ సూచనపై కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా స్పందించలేదని తెలుస్తోంది. జైట్లీ ఇచ్చే జవాబును బట్టి తాము ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లుతో సంబంధం లేకుండా గురువారం రాజ్యసభలో మధ్యాహ్నం రెండు గంటలకు విభజన చట్టం అమలుపై చర్చ జరగనుంది. ఈ మేరకు స్వల్ప వ్యవధి చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేతలు గురువారం ఉదయం నోటీసులు ఇస్తారు. వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, విభజన చట్టం అమలుపై గురువారం చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. -
ఎలా అడ్డుకుంటారో చూస్తాం: కేవీపీ
-
స్విస్ చాలెంజ్ భేష్
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, విజయవాడ బ్యూరో : స్విస్ చాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు అభినందించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. స్విస్ చాలెంజ్ అంటే తెలియనివాళ్లు దాని గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతి డెవలప్మెంట్ కంపెనీ కూడా ప్రభుత్వానిది కాదంటున్నారని, అవన్నీ చంద్రబాబు కంపెనీలంటున్నారని, అది వాళ్ల దౌర్భాగ్యమని అన్నారు. సీఎం బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచామన్నారు. కాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్లో పెట్టిన ప్రైవేట్ బిల్లుపై చంద్రబాబు స్పందిస్తూ... ఊరికే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ బిల్లు అంటే అభిప్రాయం చెప్పడానికి తప్ప ఉపయోగం ఉండదన్నారు.బిల్లు వల్ల లాభమేమిటని ప్రశ్నించారు. తెలంగాణతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించే విషయంలో గవర్నర్ ఏమీ చేయలేరని, ఆయన చేసేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. డ్యాష్‌బోర్డు ఎలా పనిచేస్తుందంటే సాక్షి, హైదరాబాద్: సీఎం ఆఫీస్ రియల్ టైం ఎగ్జిక్యూటివ్ డ్యాష్‌బోర్డు ఎలా పనిచేస్తుంది? కమ్యూనిస్టు దేశాలు పెట్టుబడిదారి దేశాలుగా ఎలా మారాయి? మన దేశంతో రష్యా, చైనాల సంబంధాలు ఎలా ఉన్నాయి? రష్యా, చైనా దేశాల్లో నా పర్యటన ఎలా సాగిందంటే... అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నేతలకు అవగాహన కల్పించారు. కాగా సీఎం చంద్రబాబు త్వరలో తైవాన్ దేశంలో పర్యటించనున్నారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ మెంబర్ బిల్లు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కేవీపీ, రఘువీరా ఢిల్లీలో గురువారం మాట్లాడారు. కేవీపీ మాట్లాడుతూ..ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. యూపీఏ మిత్రపక్షాలన్నీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలిపాయని చెప్పారు. ఇప్పుడు అడ్డుకున్న వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. ఆంధ్రుల ప్రయోజనాల కోసం శక్తి ఉన్నంత వరకు పోరాడుతామని కేవీపీ తెలిపారు. ప్రత్యేక హోదా లేదని చెబుతున్నా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ కొనసాగడం సిగ్గుచేటని దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం ప్రైవేట్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదు, కేబినేట్ నిర్ణయమే సరిపోతుందని దిగ్విజయ్ అన్నారు. జైరాం రమేష్ మాట్లాడుతూ...ఏపీ, తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. సీట్ల సంఖ్య పెంపును ఫిరాయింపుల కోసం ఉపయోగించకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీట్ల పెంపుపైనే ఉన్నంతా ధ్యాస ప్రత్యేక హోదాపై లేదన్నారు. టీడీపీ, బీజేపీ రాజద్రోహానికి, ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా వెంకయ్యనాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు. -
సీమాంధ్రులు మిమ్మల్ని ‘ఒకే ఒక్కడు’గా భావించారు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరిగిన రోజు రాజ్యసభలో మీ హావ భావాలూ, వాక్పటిమ చూసి సీమాంధ్రను ఆదుకోవడానికి ఉన్న ‘ఒకే ఒక్కడు’గా భావించి సీమాంధ్ర ప్రజలు మీకు అత్యున్నత స్థానం కల్పించారని, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రమంత్రి వెంకయ్యకి శనివారం మూడు పేజీల లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఇలా..‘రాష్ట్ర విభజనను సీమాంధ్రకు చెందిన ఏ పార్టీ పార్లమెంటు సభ్యుడు గానీ, మంత్రులు గానీ సమర్థించలేదు. మీరు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నా సీమాంధ్ర తరఫున వకాల్తా తీసుకుని విభజన జరిగిన రోజు బిల్లును సమర్థించారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమి విజయం సాధించిందంటే దానికి కారణం మీరు రాజ్యసభలో చేసిన ప్రసంగమే. మీరు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మం త్రులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అయినా మేం సిద్ధాంతానికి కట్టుబడి సమర్థిస్తున్నామని మీరు చెప్పారు. అలాగే మేం అధికారంలోకి వస్తామని, ఇప్పుడు నేను అడుగుతున్నవన్నీ మేం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మీరే అన్నారు’ అని గుర్తు చేశారు. సవరణలు ప్రతిపాదించి.. : ‘ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వండి.. ఐదేళ్లలో పరిశ్రమల స్థాపన సాధ్యం కాదు. ఒప్పుకోని పక్షంలో నా సవరణల మీద ఓటింగ్‌కు పట్టుబడతాను అంటూ ఆరోజు హెచ్చరించారు. అలా ప్రతిపాదించి ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెంది వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.ఆ విషయం ప్రజలకు తెలియకపోవడం శోచనీయం. నాటి ప్రధాని ప్రకటనకే విలువ లేదంటున్నారు నేటి పాలకులు! నాడు, నేడు కీలకపాత్ర వహిస్తున్న మీరు కా ర్యోన్ముఖులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా కోసం నేను ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఈనెల 13న సభకు వస్తున్నందున దానికి అనుకూలంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటితో ఓటు వేయించి భారత రాజకీయ చరిత్రలో ఒక ధృవతారగా వెలుగొందాలని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. -
'చంద్రబాబూ.. మద్దతు ఇవ్వండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 13న రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు, సవరణల విషయంపై తాము ఓటింగ్‌కు పట్టుబడతామని, తెలుగుదేశం పార్టీ సభ్యులను హాజరుపరిచి బిల్లుకు మద్దతు తెలపాలని కేవీపీ కోరారు. అలాగే బీజేపీ, ఎన్డీయే పక్షాల మద్దతు కూడగట్టేందుకు కృషిచేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు. విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన, చట్టంలో పొందుపరిచిన రాయితీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. దీంతో పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ గతేడాది జూలైలో రాజ్యసభలో తాను ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. గత నెల 29న ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదనే అభిప్రాయం వచ్చేలా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి మాట్లాడారని గుర్తుచేశారు. దీంతో తాము ఓటింగ్‌కు పట్టుబడుతున్నట్టు కేవీపీ తెలిపారు. -
అమరావతిపై ప్రధాని మోదీకి కేవీపీ లేఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాలను అంచనా వేయకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. పర్యావరణ మదింపు కమిటీ పరిశీలన లేకుండానే ఎస్ఐఇఇఎఎ అనుమతులు ఇవ్వడం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడమేనని చెప్పారు. ఆదివారం ఆయన ఏపీ రాజధాని అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాని నరేందర్ మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. హడావుడిగా చేసే తాత్కాలిక రాజధాని నిర్మాణం వల్ల భారీగా ప్రజాధనం వృధా అవుతుందని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, నిర్మాణాల విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేవీపీ లేఖలో తెలిపారు. -
‘హోదా’ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు
రాజ్యసభలో ప్రవేశ పెట్టిన కేవీపీ రామచంద్రరావు సాక్షి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మీరు హామీలిచ్చారు. మేం అధికారంలోకి వస్తున్నామని విభజన వల్ల నష్టపోయే ఏపీని ఆదుకుంటామని, పదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పిస్తామని వాగ్దానం చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు దాటింది. ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సత్వరమే ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యసభలో శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును కేవీపీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను, విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఇచ్చిన హామీలను కేవీపీ ప్రస్తావించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని, రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన చర్చలోని అంశాలను గుర్తు చేశారు. వెంకయ్య వ్యాఖ్యల ప్రస్తావన.. సీమాంధ్ర ప్రాంతంలో 60 శాతం జనాభా ఉన్నప్పటికీ రెవెన్యూ 40 శాతమేనని, తాజా గణాంకాల ప్రకారం సీమాంధ్రకు రూ.15 వేలకోట్ల మేరకు లోటు ఉంటుందని, జీతభత్యాలకు కూడా నిధులుండవన్న వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను కేవీపీ ఉటంకించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జేట్లీ చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. పోలవరం అథారిటీని ఏర్పాటు చేయాలని, జాప్యం కాకుండా 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు.ఏపీ నష్టాల్లో ఉందని, కొత్త రాజధాని అభివృద్ధికి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు నిధులు సేకరించలేకపోతున్నారని, చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను తేలేక పోతున్నారని విమర్శించారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు మరో కాంగ్రెస్ ఎంపీ ఆనందభాస్కర్ మద్దతిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. బిల్లుపై చర్చ వచ్చేవారం కొనసాగనుంది. -
విష్ణు అరెస్ట్‌లో ప్రభుత్వ కుట్ర: రఘువీరా
సరిగా స్పందించలేదని నేతల్ని నిర్బంధించిన విష్ణు వర్గీయులు సాక్షి, విజయవాడ బ్యూరో: స్వర్ణ బార్లో విష ప్రయోగంతో జనం చనిపోయిన బాధాకరమైన ఘటనను కూడా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించుకోవడం దారుణమని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కల్తీ మద్యం కేసులో ఇరికించడంలో ప్రభుత్వ కుట్ర ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్యతో కలసి శనివారం విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బార్లో సేకరించిన మద్యం, నీళ్ల నమూనాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేయడంలో చంద్రబాబు తీరు దారుణంగా ఉందని, రానున్న కాలంలో ఇంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సి.రామచంద్రయ్య హెచ్చరించారు. నేతల్ని నిర్బంధించిన విష్ణు వర్గీయులు విష్ణును అక్రమంగా కేసులో ఇరికించినా పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ నాయకులపై విష్ణు వర్గీయులు ఫైర్ అయ్యారు. తొలుత కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు రఘువీరా, కేవీపీ, రామచంద్రయ్యల ముందు విష్ణుకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడంతో వివాదానికి దారితీసింది. దీంతో ఆగ్రహించిన విష్ణు వర్గీయులు కొద్దిసేపు కాంగ్రెస్ నేతల్ని కార్యాలయంలో ఉంచి నిర్బంధించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గన్మెన్లు వచ్చి తలుపు తెరిచి నాయకుల్ని బయటకు తీసుకొచ్చారు. అనంతరం సబ్‌జైలుకు వెళ్లి విష్ణును పరామర్శించి, ఆ తర్వాత ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేతలు ధైర్యం చెప్పారు. -
'అమరావతిని సేఫ్‌గా నిర్మించాలి'
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆదివారం లేఖ రాశారు. ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జరిగేలా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అమరావతిని నిర్మిస్తుందని, అడ్డగోలుగా భూములను సింగపూర్‌కు అప్పగించాలని చూస్తున్నారని కేవీపీ ఆరోపించారు. నూతన రాజధాని నిర్మాణంలో పర్యావరణం, అహార భద్రత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు పోతుందని, చెన్నై వరదలను దృష్టిలో ఉంచుకొని అమరావతి సేఫ్‌గా నిర్మించాలని ఆయన కోరారు. -
చెన్నై తరహాలో అమరావతికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: చెన్నై వరద బీభత్సం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాసిన ఈ లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు. కేవీపీ వేసిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవీ.. ► 9వ తేదీన అనుమతులు వస్తే పదో తేదీన జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఆ సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఎన్జీటీ ఆదేశించిన తరువాతే ఎందుకు ప్రచురించారు? రహస్యంగా ఎందుకు ఉంచారు? కేంద్ర పర్యావరణ శాఖ సియా అనుమతులు ఇచ్చేసిందని ఎలా ప్రకటిస్తుంది? ► పర్యావరణ ప్రభావానికి లోనయ్యే ప్రాజెక్టుకు సియా అనుమతి ఎలా ఇస్తుంది? ► ప్రభుత్వ కార్యాలయాలకు, పార్కులకు, వాణి జ్య కేంద్రాలకు, నివాస సముదాయాలకు, పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఉందని పర్యావరణ అనుమతి పత్రంలో ఉంది. పరిశ్రమల వివరాలేవీ లేకుండా పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారు? ► కొండవీటివాగు వల్ల 15 వేల ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని ఏపీసీఆర్డీఏ అధికారికంగా తెలిపింది. ఇదంతా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. చె న్నై, శ్రీనగర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదలు సంభవించిన పరిస్థితుల్లో వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించడం సమంజసమేనా? ► 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మిస్తున్నామని, ఇందులో 127 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సారవంతమైన భూములు ఉన్నాయని, అలాగే 30 నుంచి 40 శాతం వరకు ఈ ప్రాంతం కృష్ణా నదీ ప్రాంతంలో ఉందని సీఆర్డీయేనే స్వయంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నదితో పాటు సహజ వనరులు దెబ్బతినవా? ► నదీ పరీవాహక ప్రాంతమంతా కాంక్రీటు వనమైతే చెన్నై తరహాలో వరద ముప్పు సంభవించదా? -
కేవీపీపై చర్యలు తీసుకోండి : టీడీపీ
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్‌ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యురాలు అనిత స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలనూ సభా హక్కుల సంఘం పరిశీలనకు పంపిస్తామని స్పీకర్ ప్రకటించారు. -
వైఎస్ఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచండి: కేవీపీ
హైదరాబాద్ : రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. 'ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ఆర్ చిత్రపటాన్ని తొలగించడం దిగ్ర్భాంతి కలిగించిందని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ ఎనలేని సేవలందించారని, స్పీకర్ అనుమతి లేకుండా సభా ప్రాంగణంలో చిత్రపటాన్ని ఎవరూ తాకలేరని, దయచేసి తొలగించిన వైఎస్ఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని' కేవీపీ తన లేఖలో కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాంజ్‌లో.. కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వు చిందిస్తూ అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తున్నట్లుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని తీయించి వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు వైఎస్ ఫొటోను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా సిబ్బందికి సత్యనారాయణ చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వైఎస్ నిలువెత్తు ఫొటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు జరిగే సమయంలో హాజరైన ఎమ్మెల్యేలకు వైఎస్ చిత్రపటం కనిపించకుండా ముసుగు వేసేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి చిత్రపటాన్ని తొలగించారు. -
రాహుల్‌కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
హిందూపురం: అనంతపురం జిల్లా పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం చిలమత్తూరు చేరుకున్నారు. చిలమత్తూరు చెక్‌పోస్ట్ (కొడికొండ) వద్ద ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఏపీ పీసీసీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో చిలమత్తూరు చెక్‌పోస్ట్‌కు రాహుల్ చేరుకోగా ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచందర్‌రావు, సి.రామచంద్రయ్య, కనుమూరి బాపిరాజు తదితరులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ ఓబులదేవు చెరువుకు బయల్దేరి వెళ్లారు. అక్కడ గతంలో ఇందిరాగాంధీ సభ జరిగిన ప్రదేశంలో రాహుల్ మొక్కలు నాటనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఓబులదేవు చెరువు నుంచి కొండకమర్ల వరకు పది కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ఉంటుంది. -
తిట్టుకు పది కోట్ల రూపాయలా?
తిట్టే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. మనుషుల మధ్య తగాదాలు పెట్టడానికి తప్పా దేనికి పనికి రాదని నిందించకండి. నోటి తీట తీర్చడానికే తిట్లున్నాయని అపార్థం చేసుకోకండి. తిట్లపురాణమే లేకపోమే వర్తమాన రాజకీయం చప్పాగా సాగుతుందని వేరే చెప్పక్కర్లేదు. తిట్టడం, తిట్టించుకోవడం తెలిసిన వాడే నయా రాజకీయ రంగంలో రాణిస్తాడని కళ్ల ముందే ఎన్నో రుజువులు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక్కోసారి తిట్టు కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడిని కథానాయకుడు నోటికొచ్చినట్టు తిట్టి తన్నితే అభిమానులు పరమానందభరితులవుతారు. అత్తాకోడళ్లు, ఆలుమగల మధ్య తిట్లు సరేసరి. ప్రత్యర్థులను ఘాటు పదజాలంతో నొటికొచ్చినట్టు తిట్టకపోతే మన నేతాశ్రీల్లో చాలా మందికి తోచదు. కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా తమను తిట్టించుకుని ఓట్లు కొల్లగొడుతున్నారు. అధికారంలోకి వచ్చాక జనంతో తిట్టించుకుంటున్నారు. ఎన్నికల్లో నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం. తిట్టుకోసం కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తాజాగా వెల్లడైంది. ఉద్యమనేతను విమర్శిస్తే కోట్లు కుమ్మరిస్తామని యువగాంధీ వారూ ఓ నాయకుడికి ఆఫర్ ఇచ్చారట. అయితే తాను సమ్మతించలేదని సదరు నేత సావధానంగా బయటపెట్టడంతో ఈ తిట్టు బాగోతం వెలుగులోకి వచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ను విమర్శించాలని రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రాంచందర్‌రావు, జైరాం రమేష్, దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు ఫోన్ చేసి కోరారని తెలిపారు. కానీ తాను అందుకు తిరస్కరించడంతో ఫోన్ చేయడం మానేశారని రాములు నాయక్ వివరించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా తిట్టు కూడా తక్కువది కాదని. -
సూరీడుకి కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు మరోసారి తెరవెనుక చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. కూకట్పల్లి టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సూరీడును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా,తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కేవీపీ హస్తముందని తెలిపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించనివిధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. అయితే పొన్నాల నియామకం వెనుక తన ప్రమేయం ఉన్నట్టు వచ్చిన వార్తలను కేవీపీ ఖండించారు. -
రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయిన కేవీపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో స్పృహ తప్పి పడిపోయారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆదేశాలతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా చైర్మన్ పోడియం వద్ద నిలబడి ఆయన నిరసన తెల్పుతుండడంతో ఆయన అస్వస్థకు గురైయ్యారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా పెద్దల సభలో కేవీపీ తనదైన శైలిలో నిరసన తెల్పుతున్నారు. నినాదాలేవీ చేయకుండా నిశ్శబద్దంగా నిరసన కొనసాగించారు. 'యువ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అని రాసున్న ప్లకార్లును రెండు చేతులతో ఎత్తి పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలిపారు. సభా కార్యకలాపాలు జరిగినంతసేపు కదలకుండా బొమ్మలా నిలబడేవున్నారు. మిగతా పార్టీల ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తించగా, కేవీపీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన నిరసన వ్యక్తం చేయడం విశేషం. -
నిలబడి నిరసన తెలిపిన చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగుతోంది. కేవీపీ రామచంద్రరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, కావూరి సాంబశివరావు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. టి. సుబ్బిరామిరెడ్డి కూడా తన స్థానంలోనే నిలబడ్డారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో పెద్దల సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభను దారికి తెచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని చైర్మన్‌ను బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కోరారు. కేంద్ర మంత్రులు నిలబడి నిరసన తెలుపుతుంటే సభను ఎలా నడిపిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు కాని కేంద్ర మంత్రి సభలో నిరసన ఎలా తెలుపుతారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మరో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కేంద్ర మంత్రులే బిల్లు పెడతారు, అడ్డుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ రెండు చేతులు జోడించి నమస్తూ తన స్థానంలో నిలుచున్నారు. సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.