వైఎస్ మరణం రాష్ట్రానికి దురదృష్టకరం: కేవీపీ | andhra pradesh in dire condition after ys rajasekhar reddy death, says KVP ramachandra rao | Sakshi
Sakshi News home page

వైఎస్ మరణం రాష్ట్రానికి దురదృష్టకరం: కేవీపీ

Published Sat, Feb 8 2014 2:14 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వైఎస్ మరణం రాష్ట్రానికి దురదృష్టకరం: కేవీపీ - Sakshi

వైఎస్ మరణం రాష్ట్రానికి దురదృష్టకరం: కేవీపీ

హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్లే రాష్ట్రానికి దురదృష్టకరమైన రోజులు తలెత్తాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి మందగించిందని అన్నారు. కాంగ్రెస్లో నిరాశ, స్తబ్దత పెరిగాయని కేవీపీ వ్యాఖ్యానించారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి సంభవించవచ్చని... అయితే పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. దీర్ఘకాలంలో పార్టీ నిలదొక్కుకుంటుందని అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తనను గాంధీభవన్కు రానీయకుండా పార్టీలోని కొందరు ప్రయత్నించారని కేవీపీ అన్నారు. కాంగ్రెస్ తనకు అన్నీ చేసిందని.... గాంధీ భవన్ తనకు దేవాలయమని ఆయన అభివర్ణించారు. తాను కాంగ్రెస్ మనిషిగానే చనిపోతానని కేవీపీ స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలో భాగమైన తాను ఆయన చివరి కోరిక కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. వైఎస్ఆర్, తానూ తెలిసి ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement