
చంద్రబాబూ.. డేట్, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం చంద్రబాబుకు ఆయన మరో బహిరంగ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, సమయం, స్థలాన్ని మీరే నిర్ణయించండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలవరంపై తాను కుట్రలు చేస్తున్నానని ఆరోపించడం సరికాదని అన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి వాటిని రుజువు చేయాలని, లేకపోతే తాను లేఖలో ప్రస్తావించినవన్నీ వాస్తవాలేనని, చంద్రబాబు అనుచరులు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని ప్రజలు అర్థం చేసుకుంటారని కేవీపీ పేర్కొన్నారు.