polavaram
-
చంద్రబాబు అవగాహనాలేమి వల్లే పోలవరం ఆలస్యం: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం(డిసెంబర్16) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు. కాఫర్‌డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్‌వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా. టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంట్లో అనలేదా. 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు..అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు?కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్సార్సీపీయే కారణం లోయర్కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి’అని అంబటి చెప్పారు. -
పోలవరం సర్వనాశనం.. ఎత్తు తగ్గించేశారు
-
మాకు అడ్డుచెప్పేదెవరు.. జనసేన నేతల కొత్త దందా!
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి పాలనలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం తమదే అన్న భావనలో తాము ఏది చేసినా చెల్లుతుందని కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దోపీడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. పోలవరం కాలువ గట్లపై జనసేన, టీడీపీ నేతలు మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చ నేతల దోపిడీని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. అడ్డు వచ్చిన స్థానికులనే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.అయితే, స్థానికంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి పోలవరం గట్లను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ!
సాక్షి, అమరావతి: కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడం ద్వారా జీవనాడి పోలవరానికి తీరని ద్రోహం చేసిన కూటమి సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంఅడ్డగోలుగా బుకాయిస్తోంది. తమకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలను వల్లె వేస్తూ తాము చేసిన ద్రోహాన్ని వైఎస్సార్సీపీ సర్కారుపై నెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అడ్డగోలుగా అబద్ధాలను వల్లె వేస్తోంది. వాస్తవాలు ఇవిగో..ప్రభుత్వంపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది... మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది... అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. పోలవరం ఎత్తును తగ్గించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే!వాస్తవంపోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) రూ.55,548.87 కోట్లుగా ఖరారు చేసిందని.. దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్సీసీ) రూ.47,725.75 కోట్లుగా లెక్కకట్టిందని పీఐబీ నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి(వ్యయ విభాగం) అధ్యక్షతన నిర్వహించిన కమిటీ చర్చల్లో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు రెండో దశలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం, అనుబంధ పనులు పూర్తి చేయడం... 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పించడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 29న పీఐబీ కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.ఈ నివేదికపై మార్చి 6న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుసుకున్న అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులు ఇస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో పోలవరంపై పీఐబీ ఇచ్చిన నివేదికను చేర్చలేదు. పీఐబీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇవ్వాలనే అంశం ఆర్థిక శాఖ ప్రతిపాదనలో లేదు. దీనిపై నాటి సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. మరి జీవనాడి పోలవరానికి ద్రోహం చేసిందెవరు? కూటమి ప్రభుత్వమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టును తొలి దశ, రెండో దశ అంటూ దశలవారీగా పూర్తి చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని పీపీఏ కుండబద్ధలు కొట్టింది.వాస్తవంవిభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకుంది. ఈ క్రమంలో తాగునీటి విభాగం వ్యయం రూ.4,068 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు ఇవ్వబోమని.. కేవలం నీటిపారుదల విభాగానికి అదీ 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనకు నాడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు మాత్రమే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీతో సమావేశమై.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పనకే రూ.33,168.24 కోట్లు వ్యయం అవుతుందని.. అలాంటప్పుడు రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని... తాజా ధరల మేరకు నిధులిచ్చి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. తాగునీటి విభాగం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని, రెండు ఒకటేనని.. తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ.. వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సూచించారు. దీంతో 2021 జూలై 8న తాగునీటి వ్యయ విభాగాన్ని నీటిపారుదల విభాగంలో కలిపేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ అంగీకరిస్తూ.. ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఏదైనా ఓ ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాది కనీస నీటిమట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత క్రమంగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని 1986 మే 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ.. పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించింది. ఇదే అంశాన్ని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ సమాధానంగా చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామంది. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం పీపీఏ చెప్పిన దాన్ని వక్రీకరించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ అడ్డగోలుగా అబద్ధాలు వల్లె వేసింది.ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఆ ప్రభుత్వం పాపమే కారణం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే వైఎస్ జగన్‌కు లేదు.వాస్తవంటీడీపీ హయాంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 డిసెంబర్లో ఒకేసారి చేపట్టారని.. 2017 జూలై నాటికి 1,006 మీటర్లు.. 2018 జూన్ నాటికి 390.6 మీటర్లు పూర్తి చేశారని.. 2017లో గోదావరి వరదలు డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడం వల్ల కోతకు గురైందని.. 2018లో వరద ఉధృతికి మరింత దెబ్బతిందని తేల్చిచెబుతూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా నిమ్మలా? ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల.. ఆ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ పాపాలు కారణం కాదా? కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా వైఎస్ జగన్ మళ్లించారు.కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను, ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ అనుసంధానాలను.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే శరవేగంగా ప్రధాన డ్యాంను పూర్తి చేస్తామని కేంద్రాన్ని వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో డయాఫ్రం వాల్ భవితవ్యంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో జీవనాడి పోలవరాన్ని జీవచ్ఛవంగా చేసిందెవరు? జీవనాడిగా మార్చిందెవరు?ప్రభుత్వంపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు 2021లోనే జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై మేం అప్పట్లో శాసనసభ లోపలా.. బయటా పోరాటం చేశాం.వాస్తవంపోలవరం స్పిల్ వేను ఇప్పటికే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించామని.. కావాలంటే టేపు తీసుకొని వచ్చి కొలుచుకోవాలని అప్పట్లో శాసనసభలో నాటి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రధాన డ్యాంను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించాలనే ప్రతిపాదన లేనే లేదని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో అటు రాజ్యసభ.. ఇటు లోక్‌సభలో నాటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు రాతపూర్వకంగా కుండబద్ధలు కొట్టారు.రాజ్యసభలో నాటి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ 2023 మార్చి 27న అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 2023 డిసెంబరు 7న అప్పటి ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. దీన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది వాస్తవం కాదా? అప్పట్లో బాబు చేసిన అసత్య ప్రచారాన్నే ఇప్పుడు కేంద్రం ఆయుధంగా మార్చుకుని నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలవరం దగ్గర నటి లయ సందడి (ఫొటోలు)
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్ జగన్ వివరించారు. ‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి.కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్ డ్యామ్ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు.మరోవైపు మెయిన్డ్యామ్కు ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్‌వర్క్‌లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్ వచ్చింది. కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్డ్యామ్పై రెండు గ్యాప్‌లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్ అయిన డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్‌వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్‌గా వెళుతున్నాయి. కాఫర్‌డ్యామ్ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్‌వాల్‌ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్జగన్ ఏకరువు పెట్టారు. -
కాఫర్ డ్యాం పనులు పూర్తికాకుండానే మెయిన్ డ్యాం పనులు మొదలు పెట్టారు
-
చంద్రబాబూ.. పోలవరంపై ఇన్ని అసత్యాలా?: అంబటి
సాక్షి,గుంటూరు : పోలవరంపై అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై జరిగిన చర్చలో తాను చేసిన తప్పిదాలను వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..ఆనాడే ఎందుకు చేపట్టలేదు?:పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చింది. అంజయ్య హయాంలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అంటున్న చంద్రబాబు, మరి వైఎస్సార్ వచ్చి పునాది వేసి, పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదు?. 1995లో మీరు సీఎం అయ్యారు. 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా, జీవనాడి ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు? పునాది వేసి పనులు ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు. కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. అదే వైఎస్సార్ 2004లో పనులు మొదలు పెట్టి, రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కుడి, ఎడమ కాల్వలు తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదు.కేంద్రమే కడతామన్నా:2014లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. పనులు వారే పూర్తి చేస్తామన్నారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు? తామే కడతామని తీసుకున్నారు. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంది? అది చరిత్రాత్మక తప్పిదం. దాని ఫలితమే ప్రస్తుత పరిస్థితి. 2016లో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన మరో తప్పిదం.. 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని ఒప్పుకోవడం. అదెలా సాధ్యం?. అంటే కేవలం కమిషన్ల కోసం, తనవారికి పనులు అప్పగించడం ఆయన లక్ష్యం, ఉద్దేశం.అయినా అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు.ఇంకా తెలంగాణ నుంచి ఏడు మండలాల విలీనం చేయడంలో తనది కీలకపాత్ర అంటున్నారు. కానీ, నిజానికి అది విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. దానిపైనా చంద్రబాబు అసత్యాలు చెబుతూ, అది తన ఘనత అంటున్నారు.ప్రాజెక్టు పనులపై ఆనాడేమన్నారు?:పోలవరం ప్రాజెక్టు పనుల్లో 72 శాతం 2019 నాటికి చేశామని, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులే చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి, ఆనాడు చంద్రబాబు ఏమన్నారు? 2018లో పోలవరం నుంచి నీళ్లిచ్చిన తర్వాతే, 2019లో ఎన్నికలకు వెళ్తామన్నారు. అదే మాట అసెంబ్లీలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.మరి పనులు పూర్తి చేశారా? పనులు చేయకపోయినా, అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. భజన చేయించుకున్నారు.మాకు నాలెడ్జ్ లేదన్నారు. మరి మీకు?:నాపైనా చంద్రబాబుగారు విమర్శ చేస్తూ.. నాకు టీఎంసీలు, క్యూసెక్స్ తెలియవని, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదని అన్నారు. ఔను నేను ఇంజనీర్‌ను కాదు. కానీ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, అన్నీ తెలుసుకున్నాను.మరి నీవు చాలా తెలివైనవాడివి కదా? గతంలో ఒకసారి ఏమన్నావ్?. ‘కాఫర్ డ్యామ్ లేకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అనుకున్నాం’ అని చెప్పావు. అది ఎలా సాధ్యం అనుకున్నావు.ఇంకా చెప్పాలంటే చంద్రబాబు చేసిన అనేక తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. ఆ ప్రాజెక్టు సర్వనాశనం అయింది. ఇది వాస్తవం.ఇదీ చంద్రబాబు తప్పిదం:అసలు ఏ ప్రాజెక్టు అయినా, కట్టేటప్పుడు నీరు మళ్లిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ. ఒక్కోసారి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కానీ, చంద్రబాబు ఏం చేశారంటే, నీరు డైవర్ట్ చేసేలా అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్‌వే.. వాటిలో ఏదీ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారు.డయాఫ్రమ్ వాల్ అంటే..ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది. అది ప్రాజెక్టు మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం మళ్లించకుండా దాన్ని కట్టడం వల్ల, వరద ఉధృతికి అది కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్‌వాల్‌ను 2016లో గ్యాప్–2 లో ప్రారంభించి చరిత్రాత్మక తప్పిదం చేశారు.పోనీ, కాఫర్ డ్యామ్ అయినా పూర్తి చేశారా? అంటే అదీ లేదు. సగం పనులు చేశారు. నది డైవర్షన్ చేయకుండా, కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుందని, దాని మధ్యలో గ్యాప్‌లు పెట్టారు. ఫలితంగా మీ హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మొదలైంది. అది ఒక్కటే కాదు.. కాఫర్‌డ్యామ్ వాల్‌కు కింద ఉన్న జెట్ డ్రౌటింగ్. అది కూడా దెబ్బతినడం మొదలైంది.నిపుణుల నోట..అదే మాట:డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత.. ఏం చేయాలన్న దానిపై చర్చించి, దేశంలో ఉన్న నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించాం. ఆ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, కేంద్రం నిపుణుల కమిటీ వేసింది. అందులో ఇద్దరు అమెరికా, ఇద్దరు కెనెడాకు చెందిన వారు. వారు ఇక్కడికి వచ్చి, అన్నీ అధ్యయనం చేసి, కేంద్ర జల స«ంఘానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. వారు చెప్పిందేమిటంటే.. నదిని మళ్లించకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేయడానికి కట్టిన కాఫర్ డ్యామ్‌లో గ్యాప్‌లు వదలడం మరో తప్పిదం అని వారు స్పష్టంగా చెప్పారు. అంటే, అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం. అయినా, చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అన్నింటినీ జగన్‌గారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపూ, ఆ పనుల్లో కమిషన్లు గుంజుకోవడం తప్ప.ఇదీ ఈ ఇరిగేషన్ మంత్రి నాలెడ్జ్:ఇప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఉన్నారు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందంటారు. కానీ, ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును, కేంద్రం రీయింబర్స్ చేస్తే, జగన్‌గారు డైవర్ట్ చేశారట. అది రాష్ట్ర ప్రభుత్వ నిధి. అంతకు ముందు ఖర్చు చేస్తే, కేంద్రం తిరిగి ఇచ్చింది. మరి ఆ నిధులు డైవర్ట్ చేయడం ఏమిటి? అదీ ఈ ఇరిగేషన్ మంత్రి పరిజ్ఞానం!ఎత్తు తగ్గింపు మరో తప్పిదం:చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారు. దాన్ని భవిష్యత్తులో కూడా సరి చేసుకోలేం. ఆనాడు పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.12 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దాని కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. దాంతో ఇటీవల కేంద్ర క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది. అయితే దానికి ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు.పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల అడుగులో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కానీ ఇప్పుడు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తూ, ప్రాజెక్టును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, ఆ నిధులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. అంటే ఇది టీడీపీ, బీజేపీ ప్రభుత్వ సంయుక్త నిర్ణయం.ఇదే నా సవాల్:కానీ, చంద్రబాబు ఏం అన్నారు? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రధానిగారు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, క్యాబినెట్ నోట్ చూపండి. అది చూపితే, నేను క్షమాపణ చెప్పి, నోరు మూసుకుంటాను. ఇదే నా సవాల్. మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది. కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలం. 195 టీఎంసీల నీరు వాడుకోలేం. దాని వల్ల చాలా నష్టం. చాలా వాటికి నీరందదు. ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తున్నారు.మా హయాంలోనే వేగంగా పనులు:మా హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. స్పిల్‌వే పూర్తైంది.మా టైమ్‌లోనే ప్రాజెక్టు గేట్లు బిగించాం. నది మళ్లింపు చేశాం. అంటే, పైలట్ ఛానల్ కూడా పూర్తి చేశాం. రెండు కాఫర్ డ్యామ్‌లు కూడా మేమే పూర్తి చేశాం.కానీ చంద్రబాబు తన హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దాన్ని తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.మరో విషయం:రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయంటే, అదంతా వైఎస్సార్ ఘనతే. వెలుగొండ కానీ, గుండ్లకమ్మ కానీ.. ఏదైనా ఆయన హయాంలోనే కట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, అది సర్వనాశనం కావడానికి చంద్రబాబే కారకుడు. ప్రపంచంలో ఎవరూ కూడా, నది డైవర్షన్ లేకుండా, ప్రాజెక్టు కట్టరు. కానీ చంద్రబాబు ఆ పని చేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. -
‘పచ్చ ముఠా’ మట్టి మాఫియా
ద్వారకాతిరుమల: పోలవరం కాలువ గట్టుపై పచ్చ ముఠా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు సాగిస్తున్న ఈ దందా రోజురోజుకు ఉధృతమవుతోంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురం, పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై పొక్లెయిన్లు పెట్టి, రాత్రీ పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి, టిప్పర్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో, ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా గట్టును తడుపుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మట్టి పొలసానిపల్లి, ఏలూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిపోతోంది. అనుమతులు ఉన్నాయంటూ దందా.. తవ్విన మట్టిని మరో ప్రాంతానికి తరలించాలంటే కచ్చితంగా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతులు తప్పనిసరి. ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంలో తవ్వకాలు జరుపుతున్న పచ్చ నేతల్లో ఒకరు సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు పొందారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందకుండానే తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని స్థానికులు ఎవరైనా ప్రశి్నస్తే మాకు అనుమతులు ఉన్నాయంటూ తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంకు చెందిన ఆయన అనుచరులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. తవ్వకాల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అనుమతులు ఉన్నాయి మీకెందుకు రిస్క్.. మీ పని మీరు చూసుకోండి అని అధికారులు చెబుతున్నారట. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ముకాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉప ముఖ్యమంత్రికి ఇవి కనబడవా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఐఎస్ జగన్నాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ జరిగిన గ్రావెల్ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాల్లో వైఎస్సార్సీపీ నాయకుల పాత్ర ఏమైనా ఉందేమో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆయనకు కనబడటం లేదా అని స్థానికులు ప్రశి్నస్తున్నారు. -
6న విదేశీ నిపుణుల బృందం పోలవరం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను ఈనెల 6వ తేదీన విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, బావర్, మేఘ ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోనున్నారు.ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజ్ వాటర్ తొలగించే పనులు జరుగుతున్నాయి. నీటిని తొలగించిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. బృందం సభ్యులు కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంపై చర్చించిన అనంతరం తుది నివేదిక తయారు చేస్తారని అధికారులు తెలిపారు. -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
పోలవరం ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్యా సదృశ్యమే: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: పోలవరం ఎత్తు తగ్గించడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎత్తు తగ్గించి నిర్మించడానికి ఇంత ధనం అవసరం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నారాయణ ప్రశ్నించారు.పోలవరం 41 మీటర్లకు తగ్గితే బ్యారేజిగా మాత్రమే పనికివస్తుందని నారాయణ అన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు రావు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పోలవరం ఇక ఉత్త బ్యారేజే -
పోలవరం ఎత్తు తగ్గింపు బాబు కుట్రే: అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు -
పోలవరం ఎత్తు తగ్గించడంపై మార్గాని భరత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
పోలవరంపై ‘సాక్షి’ ప్రశ్న.. మంత్రి నిమ్మల బుకాయింపు!
సాక్షి, విజయవాడ: పోలవరంపై సాక్షి అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర కేబినెట్ నోట్లో ఫేజ్ 1 ప్రస్తావన ఉందా..? అంటూ ప్రశ్నించగా తెల్లమొహం వేశారు. పోలవరం ఎత్తు తగించేందుకు అంగీకరించడంపై ప్రశ్నించగా.. కేంద్ర కేబినెట్ నోట్ చూపించకుండానే వెళ్లిపోయారు. 41.15 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలిపినట్టు ప్రకటించిన మంత్రి నిమ్మల.. ఫేజ్ 2 తర్వాత నిధులు వస్తాయంటూ బుకాయించారు.పోలవరంపై చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది.కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు.ఇదీ చదవండి: పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం! -
పోలవరంపై మరో కుట్ర..
-
6 నుంచి 10 వరకు పోలవరంపై వర్క్ షాప్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వచ్చే నెల 6 నుంచి 10 వరకు వర్క్ షాప్ నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్ధమైంది. ఈలోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాలని పోలవరం అధికారులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. డయాఫ్రం వాల్ నిరి్మంచే ప్రాంతాన్ని సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తు వరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసి ప్లాట్‌ఫాంను సిద్ధం చేయాలని సూచించింది.6వ తేదీన అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనుంది. ఐదు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వర్క్ షాప్‌లో చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించే విధానంతోపాటు గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం డిజైన్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.సీడబ్ల్యూసీ ఆదేశం మేరకు కాఫర్ డ్యాంల మధ్య నీటిని తోడే పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా ముమ్మరం చేసింది. గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై ప్రధాన డ్యాం ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకున్న ప్రదేశాన్ని మే నాటికే సముద్ర మట్టానికి 16 మీటర్ల ఎత్తుతో ఇసుకను నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసే పనులు పూర్తి చేసింది. సీపేజీ నీటిని పూర్తిగా తోడేశాక అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మరో మీటరు ఎత్తు పెంచడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే బెంటనైట్ మిశ్రమం, కాంక్రీట్‌ను వర్క్ షాప్‌లో పరీక్షల నిమిత్తం సిద్ధంగా ఉంచారు. -
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్‌ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్‌కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్‌ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్‌వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
పోలవరానికి ఈ ఏడాది ఎంత కావాలి?
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం (41.15 మీటర్ల కాంటూర్) స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎప్పుడు ఎంత విడుదల చేయాలో సమగ్ర ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో చర్చించి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ ఇటీవల లేఖ రాశారు. - సాక్షి, అమరావతినాడు మోకాలడ్డిన చంద్రబాబువైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు, విభాగాల వారీగా పరిమితి విధించకుండా బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు విభాగాల వారీగా విధించిన పరిమితి ఎత్తేశారు. తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించారు. తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో తొలి దశ పనులు పూర్తి, చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ధ్వంసమైన గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలో పోలవరం తొలి దశ వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల్ శక్తి శాఖ ఖరారు చేసింది. 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు పోనూ రూ.25,706.24 కోట్లు ఇవ్వాలని నిర్ధారించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో రెండో దశ కింద చేపట్టిన పనులకు రూ.1,597.56 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు పోనూ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని తేల్చింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్ ఆగస్టు 28న ఆమోదం తెలిపింది.నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైఎస్ జగన్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం మాత్రమే ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారు. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న ప్రతిపాదనకూ తలూపారు. 2013–14 ధరల ప్రకారం పాజెక్టు వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా లెక్కగట్టి.. 2024 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిజానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లు. ఇందులో భూసేకరణ, పునరవాసానికే నికే రూ.33,168.23 కోట్లు అవసరం. కానీ.. రూ.15,667.9 కోట్లు ఇస్తే చాలు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో లోగుట్టు కమీషన్లే. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు విధ్వసం చేయడమే కాదు.. నిధుల సంక్షోభంలోకి కూడా నెట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులను పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్వాకాలను కేంద్రానికి వివరించారు. తాజా ధరల ప్రకారం నిధులిస్తేనే పోలవరాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుందన్న వైఎస్ జగన్ ప్రతిపాదనతో ప్రధాని మోదీ ఏకీభవించారు. ఇలా తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నిధుల సంక్షోభం నుంచి పోలవరాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించారు.» గతేడాది జూన్ 5నే తొలి దశ, డయాఫ్రం వాల్‌కు రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం» ఈ వివరాలను సమగ్రంగా పీపీఏ ద్వారా పంపండి» అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తాం» పోలవరానికి ఆ నిధులిస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని విన్నపం» రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడి» దాంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్» రూ.12,157.53 కోట్లు విడుదలకు మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జలశక్తి శాఖ ప్రతిపాదన» అదే ప్రతిపాదనపై ఆగస్టు 28న ఆమోదం -
ఏపీకి పోలవరం జీవనాడి
-
‘కెన్–బెట్వా’లానే పోలవరం పరుగెత్తేది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం చేపట్టి ఉంటే.. ఈ పాటికి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు కేంద్రం శరవేగంగా పూర్తి చేస్తున్న కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టే ఉదాహరణ అని అధికార వర్గాలు సైతం ఉదహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 2022–23, 2023–24లో రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. 2024–25 బడ్జెట్లో రూ.4000 కోట్లు కేటాయించి.. 2030 నాటికి పూర్తి చేసేలా శరవేగంగా అడుగులు వేస్తోంది. అంటే.. కెన్–బెట్వా అనుసంధానం ప్రాజెక్టుకు ఏడాదికి సగటున రూ.4,552.50 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం 2014–15 నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో రూ.15,146.27 కోట్లు విడుదల చేసింది. అంటే.. ఏడాదికి కేవలం రూ.1,514.62 కోట్లు మాత్రమే ఇచ్చింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుంది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఓ వైపు విధ్వంసం.. మరో వైపు నిధుల సమస్యతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఈ పాపమంతా ఆయనదేనని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు.కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు ఇలాకెన్–బెట్వా నదుల్లోని మిగులు జలాలను మళ్లించి మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు (మధ్యప్రదేశ్‌లో 41 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 21 లక్షలు) అందించేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్రప్రభుత్వ సారథ్యంలో అనుసంధాన పనులు చేపట్టడానికి అంగీకరిస్తూ 2021 మార్చి 22న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రం, పది శాతం(ఆయకట్టు, తాగునీరు ఆధారంగా దామాషా పద్ధతిలో) రాష్ట్రాలు భరించేలా ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2021 డిసెంబర్ ధరల ప్రకారం రూ.44,605 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.39,317 కోట్లు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల వాటా రూ.5,293 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 2022 ఫిబ్రవరి 11న స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు అథారిటీ (కేబీఎల్‌పీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ సారథ్యంలో పనులు చేపట్టింది. 2022–23, 2023–24లో ప్రాజెక్టు పనుల కోసం రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. 2030 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులను వేగవంతం చేసింది. నదుల అనుసంధానంలో ఇదే మొదటి ప్రాజెక్టు.కమీషన్ల కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వైనంరాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్–90లో స్పష్టంగా పేర్కొంది. ఆ చట్ట ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎస్పీవీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ.. 2014 జూన్ 8 నుంచే కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు అంగీకరించడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్రానికి అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగం పనుల్లో మిగిలిన పనులకు అయ్యే వ్యయం రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పినదానికీ చంద్రబాబు తలూపారు.ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకూ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు.. కమీషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే ను పునాది స్థాయిలోనే వదిలేసి.. ప్రధాన డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ఇది చాలదన్నట్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి చేతులెత్తేశారు. దాంతో.. 2019, 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదలు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి చంద్రబాబు సర్కార్‌దే పాపమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చి చెబుతూ ఈ నెల 12న సీడబ్ల్యూసీ, పీపీఏకు నివేదిక ఇచ్చింది. ఈ విధ్వంసం వల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,761.74 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. మరో రూ.1615.47 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది.జీవనాడిని గాడిలో పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో పోలవరం పనుల్లో చంద్రబాబు చేసిన తప్పులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దుతూ ప్రాజెక్టును గాడిలో పెట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. 2021 జూన్ 11నే స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో పునాది డయా ఫ్రమ్ వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్.. జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో వరాహ అక్విడెక్టు సహా కీలకమైన పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని వైఎస్ జగన్ చెప్పిన వాస్తవాలతో ప్రధాని మోదీ ఏకీభవించారు. తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేలా వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి నిధుల సమస్యను తప్పించారు. వైఎస్ జగన్.. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులతోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్‌తో పాటు ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా, విధ్వంసం సృష్టించకుండా ఉండి ఉంటే.. 2022 డిసెంబర్ నాటికే పోలవరాన్ని వైఎస్ జగన్ పూర్తి చేసి ఉండే వారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది.