జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి | CM Chandrababu Naidu Who Spread Lies On Polavaram Project, More Details Inside | Sakshi
Sakshi News home page

జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి

Published Tue, Jun 18 2024 4:13 AM | Last Updated on Tue, Jun 18 2024 12:49 PM

CM Chandrababu who spread lies on Polavaram

పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు  

పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్‌వేను 48 గేట్లతో సహా పూర్తిచేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 

స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ పూర్తి చేసి 2021 జూన్‌ 11న వరద మళ్లింపు.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లలో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు 

డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడానికి బాబు నిర్వాకాలే కారణం 

అదే అంశాన్ని తేల్చిన ఐఐటీ–హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు 

బాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది.. డయాఫ్రమ్‌ వాల్‌పై తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తామంట⇒ 2022 నుంచి కేంద్రాన్ని కోరుతు వచ్చిన జగన్‌ సర్కార్‌

2013–14 ధరల ప్రకారం రూ.20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం.. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్‌ 

తొలిదశ పూర్తికి రూ.12,157 కోట్లు మంజూరుకు ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జల్‌ శక్తి శాఖ ప్రతిపాదన.. అప్పటికే బీజేపీతో జతకట్టిన బాబు.. రాజకీయంగా తమకు ఇబ్బంది తప్పదని అడ్డుపుల్ల  

ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సూచిస్తున్న సాగునీటి నిపుణులు  

సాక్షి, అమరావతి:  పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్‌ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేసి 2021 జూన్‌ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మళ్లించింది. 

గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్‌ నిర్మిం­చడం ద్వారా చంద్రబాబు సర్కార్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.   

చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్‌ వాల్‌
⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్‌ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది.  

⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్‌ పనులు చేపడతా­రు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్‌ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్‌ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.  

⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరా­వాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరా­వాసం కల్పిస్తూ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు.  

⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. జూన్‌ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్‌ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.  

⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్‌ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్‌–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్‌–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.  

⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ సంస్థలు మానవ తప్పి­దం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

విధ్వంసం వల్లే పనుల్లో జాప్యం
నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ అధి­కా­రంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖా­తరు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్‌ జగన్‌ రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక  2019 నవంబర్‌లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌­వే­ను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. 

అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ చానల్‌ను పూర్తి చేశారు. 2021 జూన్‌ 11న గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగు­వ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి కావడంతో ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్ప­డిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేస్త యథాస్థితికి తెచ్చా­రు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో సమాంత­రంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిం­చి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడ­బ్ల్యూసీ తేల్చలేదు. 

సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్‌ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్‌ వాల్‌సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంత­ర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్‌ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చిం­ది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇక 2029 నాటికే.. 
వరదల ప్రభావం వల్ల నవంబర్‌ వరక⇒ పోలవరం పను­లు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్‌ జగన్‌ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
కాఫర్‌ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే 
ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపట్టడానికి వీలు­గా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్‌ గ్రౌటింగ్‌ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్‌ కాలమ్స్‌ వేసి జెట్‌ గ్రౌటింగ్‌ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్‌ గ్రౌటింగ్‌ చేసేలా డిజైన్‌లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్‌ గ్రౌటింగ్‌ చేసి కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్‌ గ్రౌటింగ్‌ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగు­వ కాఫర్‌ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాద­ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం.   

రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు 
పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చా­రు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్య­యం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్‌ 1 వర­కు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే  2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ కోరుతూ వచ్చారు. 

దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్‌ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. 

ప్రస్తుతం ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement