సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.
‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్ షాకు తెలుసు. కూటమిలో పార్ట్‌నర్ కాబట్టే అమిత్ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది.
పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్‌కు ఉంది. పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం..
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుంది
తప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.
టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జల
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్
పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని మెచ్చుకున్న పయ్యావుల
2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావుల
ఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి
వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..
- ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ
- చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?
- ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు
- 2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చింది
- ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడింది
- ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై బురద చల్లుతున్నారు
- పయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మద్దతు తెలిపారు
- చట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది
- 5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.
- టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా.?
- వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.
- రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలి
- చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణ
- టీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి
- బిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్
- రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .
- సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.
- పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.
- దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది?
Comments
Please login to add a commentAdd a comment