
సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.
‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.
‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment