సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు.
‘‘ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్సార్‌సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది. జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని రావెల పేర్కొన్నారు
‘‘ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలి. ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవు. న్యాయం, ధర్మం, విజయం వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నాయి’’ అని రావెల కిషోర్ బాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment