ravela kishore babu
-
టీడీపీపై రెచ్చిపోయిన రావెల కిషోర్ బాబు
-
‘ప్రజా తీర్పు’ అంటే టీడీపీకి ఎందుకు భయం?: రావెల
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు.‘‘ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్సార్సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది. జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని రావెల పేర్కొన్నారు‘‘ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలి. ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవు. న్యాయం, ధర్మం, విజయం వైఎస్సార్సీపీ వైపు ఉన్నాయి’’ అని రావెల కిషోర్ బాబు చెప్పారు. -
బహుజన హితాయ... బహుజన సుఖాయ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. అసమానతలతో నిండివున్న విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్యను అందజేశారు. పేద ప్రజల గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని పొందిన జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని బహుజనులు ఎదురుచూస్తున్నారు.తరతరాలుగా భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వలన అణచివేయబడిన వారికి రాజ్యాధికారం సాధించాలని 1935లో ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించి జీవితకాలం ఆ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పని చేశారు అంబేడ్కర్. తరువాత కాలంలో ఆ ఆశయ సాధన కోసం మాన్య కాన్షీరాం బహుజన కులాలను ఐక్యం చేయడానికి 1975లో బ్యాక్వార్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బాంసెఫ్) స్థాపించి లక్షలాది మందని సమీకరించారు. వారికి అంబేడ్కరిజాన్ని బోధించి, వారిని భారతదేశ రాజకీయ భవిష్యత్తును మార్చడానికి సమాయత్తం చేశారు. 1985లో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించి పదేళ్లలోనే దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. భారత దేశ రాజకీయాలలో కాన్షీరాం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో తమకు రావలసిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (జగనన్న) ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. ‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ’లంటూ బహుజన కులాలను సొంతం చేసుకొని వారిలో ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించి మనోబలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు.కనీస గుర్తింపునకు నోచుకోని బీసీ కులాలను గుర్తించి, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున చైర్మన్, డైరెక్టర్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ఇవ్వాళ వైఎస్సార్సీపీ తరఫున 11 మంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో నలుగురు బీసీలు ఉండటం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, శాసన మండలి డిప్యుటీ చైర్మన్, మంత్రి పదవులను బీసీలకు కేటాయించి వారికి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. 70 శాతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మైనారిటీలకి కేటాయించడం అనేది బహుజన కులాల పట్ల జగన్ చిత్తశుద్ధి, అంకిత భావాలను సూచిస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను బహుజన పేదవర్గాల సాధికారత కోసం అమలు చేస్తూ ‘బహుజన సుఖాయ బహుజన హితాయ’ అనే మౌలిక సూత్రాన్ని పాటించడం జగన్ మానవతా, సమతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. అక్షరాలా రూ.2.70 లక్షల కోట్ల నిధులను అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బహుజన వర్గాల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో దళారులతో పని లేకుండా పారదర్శకంగా జమ చేయడం సంక్షేమ రంగంలో ఒక నూతన విప్లవాత్మక సంస్కరణగా చెప్పుకోవచ్చు. దీనికి అదనంగా పరోక్షంగా రూ.1.30 కోట్లను గృహనిర్మాణం వంటి ఇతర సంక్షేమ పథకాల కోసం వినియోగించడం కూడా గమనించగలం. అసమానతలతో నిండి వున్న విద్యారంగంలో వినూత్నమైన సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన మేలైన ఆధునిక విద్యను అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.73,000 కోట్లు వెచ్చించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించేందుకు రూ.46,000 కోట్లను అమ్మఒడి పథకం ద్వారా అందించడం మరో గొప్ప అడుగు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, డిజిటల్ విద్యాబోధన, విద్యార్థులకు ట్యాబుల పంపిణీ వంటివి అమలు చేసి పేద విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేయడం జరిగింది. అర్హులైన పేద విద్యార్థుల విదేశీ విద్యకోసం ఒక్కొక్కరికి 1.25 కోట్ల రూపాయల వరకు వెచ్చించడం ఒక అద్భుతమైన అవకాశంగా గుర్తించాలి.బహుజన పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేయడం, కావలసిన నూతన వైద్య పరికరాలను సమకూర్చడం, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించడం, సమర్థవంతమైన పర్యవేక్షణతో మెరుగైన సేవలు అందించడం వంటి అనేక చర్యలను వైసీపీ ప్రభుత్వం తీసుకొంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృత పరిచి, ఒక వ్యక్తికి వెచ్చించే గరిష్ఠ పరిమితి ఖర్చును 25 లక్షలకు పెంచారు. ఉచిత కంటి పరీక్షలు, విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు, సంచార హాస్పిటల్స్ వంటి అనేక నూతన పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ఆదర్శవంతమైంది.సొంత ఇల్లు కావాలనే పేదల స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, 31 లక్షల మందికి ఇళ్ళను నిర్మించి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఈ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, కుల వివక్ష అనే సామాజిక మహమ్మారికి తావు లేకుండా సకల జనుల సహజీవనానికి నాంది పలికింది. నా అన్నవారు లేక ఆర్ధికంగా నిస్సహాయ స్థితిలో వుండే వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ రూపంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఇంటి వద్దనే ఇచ్చే పద్ధతిని అవలంబించడం అనేది నిజంగా ఒక గొప్ప పథకం. మానవతా దృక్పథంతో వృద్ధులకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచింది. 66 లక్షల మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపి వారి గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని శాశ్వతంగా పొందడం జగనన్నకే దక్కింది.మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించి ప్రభుత్వ పరిపాలనను గ్రామ స్థాయికి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పాలి. గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారి అన్ని రకాల పౌర సేవలను అందిస్తూ ప్రజల వద్దకు పరిపాలన అన్న ఉన్నత ఆశయాన్ని సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైంది. గ్రామాలలో నివసించే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దింది. సమాజంలో అన్ని రకాల అణచివేతకు, అవమానాలకు గురి అయిన స్త్రీ జాతి సాధికారతకు, రక్షణకు, ఆత్మ గౌరవానికి అనేక సంక్షేమ పధకాలలో పాటు ‘దిశ’ పోలీస్ స్టేషన్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అనేక చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను సమర్థవంతంగా జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 2.5 లక్షల ఉద్యోగాలను, ఆ యా రంగాలలో మరొక 2.5 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించి మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం జరిగింది. నాలుగు నౌకాశ్రయాలు, 14 సముద్ర పోర్టులు, ఒక పెద్ద విమానాశ్రయం, 17 మెడికల్ కాలేజీల వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అందరికీ తెలిసిన విషయమే.బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్న విషయం గ్రహించిన బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరలా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనీ, సమసమాజం నిర్మాణం జరగాలనీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.రావెల కిషోర్ బాబు వ్యాసకర్త మాజీ మంత్రి -
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
-
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రావెల...
-
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలపై విమర్శలు
-
జనసేన కార్యాలయం ఖాళీ..
సాక్షి, ప్రత్తిపాడు: గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు రావెల కిషోర్‌బాబు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో జనసేన పరాజయంతో రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో పార్టీ కార్యాలయం కూడా ఖాళీ అయింది. అలాగే ఏపీలో పలు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు జనసేన నాయకులు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి. -
జనసేనకు గుడ్‌బై చెప్పిన రావెల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామంటూ జనసేన పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన రెండోరోజే ఆ పార్టీకి షాక్ తగలింది. జనసేన పార్టీకి సీనియర్ నేత రావెల కిషోర్ బాబు శనివారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు రావెల ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని పార్టీ చీఫ్‌ను కోరారు. కాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన రావెల కేవలం 26,371 ఓట్లు సంపాదించుకోగలిగారు. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొంది, ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కాగా రావెల కిశోర్ బాబు కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపారని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
టీడీపీకి పట్టిన మైల పోయింది!
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామాతో తమ పార్టీకి పట్టిన మైల పోయిందంటూ టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేసి.. క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, నాయకుడు మమ్మూ సాహెబ్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చామన్నారు. అలాంటి వ్యక్తి నేడు టీడీపీకి రాజీనామా చేయడం దారుణమన్నారు. రావెల రాజీనామాతో పార్టీకి పట్టిన మైల పోయిందంటూ మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందునే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. రావెల రాజీనామా వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ మండలాధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్, జెడ్పీటీసీ భాగ్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.విజయ్‌బాబు తెలిపారు. ఆయన ఒంటరిగానే పార్టీని వీడారని చెప్పారు. కాగా, టీడీపీ నేతల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. మేమంటే ఇంత చిన్నచూపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? దళిత ఎమ్మెల్యే అయిన రావెలను కించపరచడం దారుణం. దళితులుంటే టీడీపీకి మైల పడుతుందా? ఇదెక్కడి దుర్మార్గం. పసుపు నీళ్లతో శుద్ధి చేసి టీడీపీకి పట్టిన మైల పోయిందంటారా? ఇది దళితుల మనోభావాలు దెబ్బతీయడమే. – కోడిరెక్క కోటిరత్నం (మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు) -
నరంలేని నాలుక మాదిరి సీఎం మాటలు
సాక్షి, అమరావతి: నరం లేని నాలుక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుందన్న సామెత మాదిరిగా సీఎం చంద్రబాబు ఏమైనా మాట్లాడతారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు శనివారం జనసేన పార్టీలోకి చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక రోజు బీజేపీని నెత్తికెత్తుకుంటారని, సన్మానాలు కూడా చేయించారని, తనకు నచ్చనప్పుడు తిడుతున్నారని విమర్శించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు కాస్తయినా జ్ఞానం వచ్చి ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుని 2014లో మద్దతు పలికినట్లు తెలిపారు. ‘అవినీతి రహిత పాలన వస్తుందని ఆశించా. కానీ ఏ మూలకెళ్లినా, ఏ నియోజకవర్గానికెళ్లినా వేల కోట్ల అవినీతి, శాంతిభద్రతలు కరువైన పరిస్థితులు, కుల రాజకీయాలు, ఆడపడుచుల మీద, అధికారుల మీద ఎమ్మెల్యేలు దాడులు చేసే పరిస్థితొచ్చింది. పాలన మీద సీఎంకు పూర్తిగా పట్టు తప్పింది’ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చంద్రబాబు వయసు అయిపోతోందని ఆయన చెబుతున్నట్టుగా విజన్ 2050 ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం అంటున్నారని.. తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినీతిలో లోకేశ్‌ది కూడా వాళ్ల నాన్న పోలికేనన్నారు. పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. సీఎంగారూ రావెలను చూసి నేర్చుకోండంటూ.. హితవుపలికారు. పార్టీ సభ్యతానికి రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు. 2019లోనూ రావెల కిషోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలుస్తారని, మంత్రి కూడా అవుతారని పవన్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు. టీడీపీలో దళితులకు పదవులిచ్చినా అధికారమివ్వరు:రావెల టీడీపీ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు పదవులు దక్కినా వాటికి సంబంధించిన అధికారాన్ని మాత్రం దక్కనీయడం లేదని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంచలన ఆరోపణ చేశారు. టీడీపీలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు అవమానాలకు గురవుతున్నారని ఆరోపించారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన శనివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రావెల దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు తనను మంత్రిని చేసినా ఆమేరకు పనిచేయనీయకుండా అవరోధాలు, ప్రతిబంధకాలు సృష్టించి.. అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చా: రావెల
సాక్షి, విజయవాడ: అవినీతి, దుర్మార్గాలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దిగజారాయని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యం, సారాస్వామ్యంగా మారిందని దుయ్యబట్టారు. శనివారం ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయనను జనసేన పార్టీలోకి సాదరంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. (చంద్రబాబుకు రావెల ఝలక్) ఈ సందర్భంగా కిషోర్‌బాబు మాట్లాడుతూ.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక టీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎంతగానో నలిగిపోయానని వెల్లడించారు. టీడీపీలో పదవులు ఉంటాయి గానీ పవర్స్ ఉండవని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని చంపులేకపోయానని అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో సమిధగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. రావెల కిషోర్‌బాబును జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి: పవన్ విజయవాడ అంటేనే కుల రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ అని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన గొడవ వల్ల కుల రాజకీయాలు ఏర్పడ్డాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లి చూసిన కనీసం వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆడపడుచులను కొట్టే నాయకులు ఎమ్మెల్యేలు కావడంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దళితులను సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. -
చంద్రబాబుకు రావెల ఝలక్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెల్ల కాగితంపై రాసి చంద్రబాబుకు పంపారు. కొన్ని నెలలుగా టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న కిషోర్‌బాబు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ చివరికి శనివారం జనసేన పార్టీలో చేరుతున్నారని ఆయన అనుచరులు చెప్పారు. అనుక్షణం అవమానభారం 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. తొలి రెండేళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి పార్టీలో ప్రత్యర్థి వర్గం ఆయనపై పైచేయి సాధించి ఇబ్బందులకు గురిచేసింది. సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడంతో జిల్లా రాజకీయాల్లో ఏకాకిగా మారారు. ఈ నేపథ్యంలో అవమానకరమైన రీతిలో 2017 మార్చిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు. మంత్రి పదవిపోయాక పార్టీలో రావెల పరిస్థితి మరింత దిగజారింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి నియోజకవర్గంలో సభ నిర్వహించిన రావెల.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుంటున్నారని, మట్టి తరలింపులో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆయన్ను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. కొద్దిరోజుల కిందట వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నేతలు దాడి చేశారు. ఆయన తలపై ఇసుకపోసి నానారభస సృష్టించారు. దీనిపై రావెల ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రావెల జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సభ్యుడు నిజ నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టారు. పార్టీలో తనపై చూపుతున్న వివక్ష, మంత్రి పుల్లారావు వర్గీయుల వేధింపులపై చంద్రబాబుకు చెప్పేందుకు ప్రయత్నించినా రెండేళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రావెల రాజీనామాను స్పీకర్ కార్యాలయం ధ్రువీకరించ లేదు. -
టీడీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి రావెల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. -
టీడీపీలో చలో ముట్లూరు టెన్షన్..!
సాక్షి, గుంటూరు: ప్రత్తిపాడు టీడీపీ నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రావెల, జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. గత నెలలో వినాయకుని విగ్రహం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రావెలపై మరో వర్గం దాడికి యత్నించిన విషయం తెలిసిందే. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మంత్రి ఒత్తిడితో అరెస్టు చేయకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేపైన దాడి జరిగి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపేందుకు కమిషన్ సభ్యుడు రాములు మంగళవారం ముట్లూరు గ్రామానికి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్ పర్యటన నేపథ్యంలో బుధవారానికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దళిత సంఘాలు మంగళవారం చలో ముట్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అర్బన్ జిల్లా పరిధిలో 30 పోలీసు యాక్ట్, వట్టిచెరుకూరు మండలంలో 144 సెక్షన్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో గత నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి పూజలు చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును ఆయన వ్యతిరేక వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై రావెల పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి నెల కావస్తున్నా, నిందితుల్లో ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రావెల వర్గీయులతో పాటు, దళిత సంఘాలు మండి పడుతున్నాయి. సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే నిందితులను అరెస్టు చేయకుండా జిల్లాలోని ఓ మంత్రితో పాటు, కొందరు ముఖ్యనేతలు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే రాజీనామాకైనా సిద్ధపడతానంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు రెండో వర్గం సైతం ఎమ్మెల్యే రావెల తమపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విదితమే. ఇలా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుండటంతో జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చలో ముట్లూరు పిలుపుతో ఉద్రిక్తత ఈ నేపథ్యంలో దళిత సంఘాల నేతలు మంగళవారం చలో ముట్లూరుకు పిలుపునివ్వడంతో ముట్లూరు గ్రామంతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చలో ముట్లూరుకు అనుమతులు లేవని, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చలో ముట్లూరుకు అనుమతి లేదు గుంటూరు: చలో ముట్లూరు కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎవరూ అనుమతులు తీసుకోని నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పోలీసు అనుమతులు లేవని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అర్బన్ జిల్లాలో పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలు, ర్యాలీలు, «నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడాన్ని అడ్డగించిన నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు ముట్లూరులో పర్యటిస్తారని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు కొనసాగించడం, అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేరమని తెలిపారు. ముట్లూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వివరించారు. డివిజన్ స్థాయి బందోబస్తుతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. టీడీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు టీడీపీ ప్రభుత్వ హయాలలో దళితులకు రక్షణలేదు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్పడినవారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యే రావెలపై దాడికి యత్నించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గాని, టీడీపీ పెద్దలు గాని ఆ విషయంపై స్పందించలేదు. అగ్రకుల అహంకారంతో దళితులను టీడీపీ పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు. దళితులకు టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయాలన్నింటిని ఎస్సీ కమిషన్ సభ్యుడికి వివరిస్తాం. –చార్వాక, అంటరానితనం నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రావెల దీక్ష
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రావెల చేపట్టిన దీక్షకు దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు -
నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటి?
గుంటూరు రూరల్: దళిత ఎమ్మెల్యేనైన తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్? అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై టీడీపీకి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. దళితుల భూములు అన్యాక్రాంతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో ఔటర్ రింగ్, కమ్యూనిటీ గృహాల సముదాయాలకు భూ సేకరణ నిమిత్తం ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల భూములను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన మనుషులు కొందరు వచ్చి.. ప్రభుత్వం ఈ భూములకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదని తమకు ఎంతో కొంతకు విక్రయిస్తే కనీసం అదైనా దక్కుతుందంటున్నారని రైతులు వాపోయారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మార్కింగ్ రాళ్లు వేశారని కన్నీరుపెట్టుకున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు పట్టాలు ఇవ్వడం వల్లే ఈ భూములను తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రావెల కిశోర్‌బాబు స్పందిస్తూ.. దళిత ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఇటువంటి దురాక్రమణలకు పాల్పడడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 200 మంది రైతుల నుంచి 160 ఎకరాలు సేకరిస్తుంటే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, మాదిగలపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అధికార మదంతో అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
వర్ల రామయ్యకు అహంకారం పెరిగింది..
సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘పదవులు మావి.. పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రావెల కిశోర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తెలుగుదేశం పార్టీలో నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఎక్కువగా ఉంది. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉన్నాయి. అధికారం చెలాయించేది మాత్రం బయటి వ్యక్తులే. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు. పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పదవిలో జవహర్ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చదువుకున్నవారు, విజ్ఞానవంతులు అంబేడ్కర్‌వాదులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు అగ్రకుల ఆధిపత్యాన్ని సహించే పరిస్థితుల్లో లేరు. వీరికి పదవులతోపాటు అధికారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ పార్టీలో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, అధికారం ఉంది అనే ఆత్మవిశ్వాసంతో వారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. నా పేరు ప్రతిష్టలు దిగజార్చారు నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తేలింది..’’ అని రావెల పేర్కొన్నారు. -
మంత్రికి తెలిసే అక్రమ మైనింగ్!
గుంటూరు రూరల్: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలుసనీ, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా ఆపలేక పోయారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేదని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రావెల మీడియాతో మాట్లాడుతూ ఓబులునాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట, పేరేచర్ల, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో నారాయణస్వామి, అశోక్ అనే వ్యక్తులు అజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. -
మంత్రి ప్రత్తిపాటికి చెప్పినా...
సాక్షి, గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినా తన నియోజకవర్గంలో భూ అక్రమాలు ఆగడం లేదని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వాపోయారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో భూ అక్రమాలు జరగడం వల్ల తన పాత్ర ఉందని చాలా మంది అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్బుద్ధి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కాగా, మంత్రికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం ఏపీలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, గుంటూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లగా మంత్రి సోమిరెడ్డిని రైతులు అడ్డుకుని నిలదీశారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లారు. పంటలను పరిశీస్తుండగా పలువురు స్థానిక రైతులు పలు సమస్యలపై మంత్రి సోమిరెడ్డిని నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు. -
‘రావెల’ ధిక్కార స్వరం
-
‘రావెల’ ధిక్కార స్వరం
సాక్షి, అమరావతి: ఆరు నెలల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తాజాగా చంద్రబాబును ధిక్కరిస్తూ మాట్లాడటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు తీరును ఎండగట్ట డం, అవసరమైతే టీడీపీని వదిలేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తన వందిమాగధులతో అప్పుడే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆరు నెలల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కిషోర్‌బాబు అప్పటి నుంచి తీవ్ర అసం తృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు దగ్గరవడం, ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తన రూటు సెపరేటని తేల్చి చెప్పారు. కృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర సభకు మద్దతివ్వడంతోపాటు నేరుగా ఫ్లెక్సీల్లో కృష్ణమాదిగ ఫొటో పక్కన తన ఫొటోలను వేసినా అభ్యంతరం చెప్పలేదు. తాజాగా గురువారం తన నియోజకవర్గం ప్రత్తిపాడులో గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభకు మందకృష్ణ హాజరవ గా అందులో పాల్గొన్న కిషోర్‌బాబు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని దీనికోసం తాను రాజీనామా చేస్తానని ప్రకటించి పార్టీ అధినేతపైనే గురిపెట్టారు. మందకృష్ణను అడ్డు కుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఉలిక్కిపడిన టీడీపీ ముఖ్య నేతలు రావెలపై ఎదురుదాడి చేయించారు. రావెలతో ఎవరో మాట్లాడిస్తున్నారని, కావాలంటే రా జీనామా చేసుకోవచ్చని ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రి జవహర్, హౌసింగ్ కార్పొరేష న్ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. నా వ్యాఖ్యలు వక్రీకరించారు: రావెల గుంటూరు రూరల్ : తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్, వర్ల రామయ్యలు పూర్తిగా వక్రీకరించారని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేటట్లు ఉన్నాయన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి జవహర్, వర్ల మాటలను ఖండిం చారు. కురుక్షేత్ర మహాసభను ప్రభుత్వం అడ్డుకుందన్న విషయం మాదిగల్లో బాగా నాటుకుపోయిందని.. తమను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాదిగలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. వర్గీకరణ జీవో–25ను ప్రభుత్వం అమలుచేయడంలేదని మాదిగలు ఆవేదన చెందుతున్నారని.. అలాగే, ఇటీవల సంక్షేమ శాఖలో కీలకమైన పదవులన్నీ మాలలకే ఇచ్చారని మాదిగలు భావిస్తున్నారన్నారు. ప్రత్తిపాడులో గురువారం జరిగిన గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో తానుగానీ, మందకృష్ణ మాదిగగానీ ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని రావెల స్పష్టంచేశారు. పార్టీని వీడతానని ప్రజల్లో అపోహలు కలిగేలా అధికార పార్టీ నేతలే తన గురించి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. -
రావెలకు మంత్రిపదవి ఇవ్వాలని..
గుంటూరు: రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా ఓ అభిమాని సెల్‌టవర్ ఎక్కాడు. గుంటూరుకు చెందిన ఒక ఆటోడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం అరండల్‌పేట 16వ లైను వద్ద ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. రావెలను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేకుంటే కిందికి దూకుతానని బెదిరించసాగాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సరిత అక్కడికి చేరుకుని అతని డిమాండ్‌ను పైఅధికారులకు తెలుపుతామని, కిందికి దిగాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కిందకి దిగిరావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
నేను రాజీనామా చేసినట్లు ఎవరు చెప్పారు?
అమరావతి: మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వార్తలపై మంత్రి రావెల కిషోర్ బాబు తీవ్రస్థాయిలో మండ్డిపడ్డారు. తాను రాజీనామా చేసినట్లు ఎవరు చెప్పారంటూ ఆయన విరుచుపడ్డారు. శనివారం సాయంత్రం మంత్రి రావెల...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఆయనను మీడియా ప్రశ్నించగా, పైవిధంగా అసహనం వ్యక్తం చేశారు. అయితే కేబినెట్ మార్పులు, చేర్పులు అనేది సీఎం నిర్ణయమని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రావెల అన్నారు. ఇక గుంటూరు జిల్లాలో అమాత్య పదవులు సంక్లిష్టంగా మారుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంత్రి పదవి ఆశిస్తున్నా ప్రస్తుతానికి ఆయనను కదిలించే పరిస్థితి లేదని టీడీపీ నాయకత్వం ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తనకు కేబినెట్లో స్థానం కల్పించకపోయినా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని స్పీకర్ చెప్పినట్టు సమాచారం. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం సేఫ్‌గానే కనిపిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తే ఆయనపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందనే ఉద్దేశంతో ఆయనను తప్పించకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజులుగా రావెల కిశోర్ బాబును తొలగిస్తారనే కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కిశోర్ బాబును తొలగిస్తే ఆయన స్థానంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబును తీసుకుంటారని సమాచారం. మరో వైపు ఎస్సీ కోటాలో కొత్తగా ఎమ్మెల్సీగా అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ జోరుగా పైరవీ చేయించుకుంటున్నారు. ఆయన రాజకీయ గురువు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ద్వారా డొక్కా పావులు కదుపుతున్నారు. -
అంతులేని అధికార దుర్వినియోగం
⇒ మంత్రి గంటాతో టీచర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఆర్ఐఓ ⇒ ఆర్సీ పురం గురుకుల పాఠశాలలో మంత్రి రావెల ఎన్నికల ప్రచారం ⇒ పట్టభద్రులు, ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ ప్రారంభించిన టీడీపీ ⇒ తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్ సీపీ నేతల మీద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ⇒ టీడీపీ నేతల మీద ఫిర్యాదులను పక్కన పడేస్తున్న పోలీసు అధికారులు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటా కింద ఎన్నిక జరుగుతున్న శాసన మండలి స్థానాన్ని గెలుపొందడానికి తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం జోరు పెంచింది. నయానోభయానో ఉపాధ్యాయుల ఓట్లు కొల్లగొట్టడానికి మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ నేతల మీద ఫిర్యాదు రావడమే ఆలస్యంగా కిడ్నాప్ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలకు ఈ చట్టాలు వర్తించవనే రీతిలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గడువు సోమవారం ముగియడంతో టీడీపీ నేతలు నగదు, స్మార్ట్ ఫోన్ల పంపకాలకు తెర లేపారు. ఉపాధ్యాయుల ఓట్ల కోసం మంత్రుల రహస్య సమావేశాలు ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓటర్ల జాబి తాలో తామే అత్యధికంగా ఓటర్లను చేర్పిం చినట్లు టీడీపీ ప్రకటించుకుంది. ఈ స్థానా లకు అసలు పోటీనే ఉండదని భావించిం ది. అయితే ఎన్నికలకు సమ యం దగ్గర పడే కొద్దీ అధికార పార్టీకి ఎదురీదాల్సిన వాతావరణం ఏర్పడింది. దీంతో గెలుపు మీద భయంతో అధికారులను అడ్డుపెట్టు కుని ఉపాధ్యాయుల ఓట్లు బలవంతంగా సంపాదించడానికి మంత్రులు నేరుగా రం గంలోకి దిగారు. మంత్రి నారాయణ ఇటీవల తన వైద్య కళాశాలలో ప్రైవేట్ టీచర్లతో సమావేశౖ మె తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మంత్రి రావెల కిషోర్ బాబు ఇదే కళాశాలలో గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అభ్య ర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. సోమవారం రాత్రి 7గంటలకు నారాయణ మెడికల్ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో మంత్రి గంటా శ్రీనివాసరా వు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీ య అధికారి బాబు జాకబ్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలల ఉపాధ్యాయులను ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించా రు. సమావేశం అనంతరం రాత్రి విందు కూడా ఏర్పాటు చేసినట్లు మెసేజ్‌లు పంపారు. అధికార దుర్వినియోగం మీద యూటీఎఫ్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు, ఆర్ఐఓ జాకబ్‌ను నిలదీశారు. దీంతో ఈ సమా వేశం రద్దు చేసి నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో అనధికారికంగా ఈ సమావే శం నిర్వహించి ఉపాధ్యాయు లందరూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి రావెల్ కిషోర్ బాబు రాత్రి 8 గంటల సమయం లో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామ చంద్రాపురం గురుకుల పాఠశాలకు వచ్చారు. ఇక్కడ ఉపాధ్యా యులందరినీ సమావేశ పరచి టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తేనే మీకు మేలు జరుగుతుందని హుకుం జారీ చేశారు. మంత్రుల వెంట సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ రహస్య సమావేశాలకు హాజరు కావ డం విమర్శలకు దారి తీసింది. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల టీచర్లందరినీ సోమవారం రాత్రి నెల్లూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో సంగంకు చెందిన ఒక రిటైర్డ్ అధికారి ద్వారా టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయించారు. వీరికి ఓటుకు నోటు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంపకాలకు తెరలేపారు పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడింది. దీంతో టీడీపీ నేతలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు రూ.4 వేల విలువ చేసే స్మార్ట్ ఫోన్లు, ఖర్చులకు నగదు పంపకాలు ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి పేరుతో పట్టభద్రుల మొబైల్ ఫోన్లకు వాయిస్ కాల్ వస్తోంది. పట్టాభి రామిరెడ్డి మీకు స్లిప్ పంపించారా? పంపి ఉంటే 1 నొక్కండి. మా వాళ్లు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. పంపక పోతే 2 నొక్కండి అని స్మార్ట్ ఫోన్ల పంపిణీకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులకు కూడా ఓటుకు నోట్లు పంపిణీ చేసే సంస్కృతి ప్రారంభించారు. పోలీసుల పసుపు సేవ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీని గెలిపించడానికి కొందరు పోలీసు అధికారులు టీడీపీ సేవలో నిమగ్నమయ్యారు. ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు ఫిర్యాదులు అందినా క్షణాల్లో కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ నాయకుల మీద ఫిర్యాదు వస్తే అస్సలు స్పందించడం లేదు. ► చిట్టమూరు మండలం మల్లాం –1, మల్లాం–2 ఇండిపెండెంట్ ఎంపీటీసీలు కత్తి చెంగయ్య, తిరుమూరు అశోక్‌ను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డితో పాటు మరికొంత మంది కిడ్నాప్ చేశారని అశోక్ అన్న చెంగయ్య మీద టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. ముందు, వెనుకా ఆలోచించకుండా పోలీసులు అమితమైన స్వామి భక్తి ప్రదర్శించి దువ్వూరు బాల చంద్రారెడ్డితో పాటు మరి కొందరిపై కిడ్నాప్.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాము స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చామని ఎంపీటీసీలు చెబుతున్నా పోలీసులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించారు. తమ కుమారుడు అశోక్‌ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మల్లాం –2 ఎంపీటీసీ అశోక్ తల్లి దండ్రులు తిరుమూరు అంకయ్య, రాజేశ్వరమ్మ విలేకరులతో చెప్పారు. తహసీల్దార్‌కు కూడా తాము ఇదే వాంగ్మూలం ఇచ్చామని, తమ కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదే చేయలేదని వారు చెప్పారు. ► నాయుడు పేట 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రమణమ్మను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నాయుడు పేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రఫీ వైఎస్సార్ సీపీలో చేరా>్చరు. దీనిని మనసులో ఉంచుకుని అదే మండలం విన్నమాల టీడీపీ ఎంపీటీసీ రమణమ్మను వీరు బెదిరించినట్లు ఫిర్యాదు ఇప్పించి ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయించారు. పోలీసు బలగాలను వీరి ఇళ్ల మీదకు యుద్ధానికి పంపి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ► కోట మండలం చిట్టేడు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు కుడుముల అంకమ్మను వైఎస్సార్ సీపీ నాయకులే కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆమె అత్త వెంకటమ్మతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అంకమ్మ శనివారం స్వయంగా తహసీల్దారు, పోలీసు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ► ఉదయగిరి మండలం చెరువుపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు అరవ వెంకటేశ్వర్లు ఈ నెల 4వ తేదీ స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ నేతలు ఆయన భార్య సునీత మీద ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నేతలు చేజర్ల సుబ్బారెడ్డి, అబ్దుల్ అహ్మద్ తమ భర్తను కిడ్నాప్ చేశారని నెల్లూరు రెండో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే వీరి మీద కేసు నమోదు చేశారు. ► ఉదయగిరి మండలం బండగాని పల్లి ఎంపీటీసీ సభ్యురాలు మేడిపల్లి వెంగమ్మ ను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, వెంగళరావు నగర్ ఎంపీటీసీ జే రమేష్ శనివారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకుని పోయారని ఆమె భర్త రామయ్య సోమవారం సాయంత్రం ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇక్కడ మాత్రం వేగంగా స్పందించలేదు. కేసు నమో దు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు వచ్చింది టీడీపీ నేతల మీద కావడం తో ఈచట్టాలు టీడీపీ నేతలకు వర్తించవనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -
మంత్రి రావెలపై కేసు నమోదుకు డిమాండ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి రావెల కిశోర్‌బాబుపై కేసు నమోదు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే జిల్లాలో అధికార పర్యటనలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలున్నాయన్నారు. వీటిని కాదని గత శనివారం మంత్రి రావెల పర్యటించడంతోపాటు గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేజేరెడ్డి ఇంట్లో సమావేశమైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వెంటనే రావెలను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే చర్యలు తీసుకునే జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు, టీడీపీ నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో టీడీపీ అభ్యర్థి ప్రచార పోస్టర్లను ఉంచినా తొలగించడం లేదన్నారు. జిల్లా అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు ఓటర్లను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో చలనం లేదన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు గఫూర్ తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా అధ్యక్షుడు కే.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
కోడ్‌కు పాతర
రెసిడెన్సియల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో మంత్రి రావెల సమావేశం - ఎన్నికల కోడ్ ఉల్లంఘన - మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాం.. కాబట్టి మాకు సహకరించాలని పిలుపు - టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం - జిల్లాలో చర్చనీయాంశంగా మారిన అధికార పార్టీ తీరు అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. కింది స్థాయి నుంచి మంత్రుల వరకు గెలుపే ధ్యేయంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ చూసినా అధికార పార్టీకి సంబంధించిన పోస్టర్లు దర్శనమిస్తుండగా.. నాయకులు నేరుగా రంగంలోకి దిగి కోడ్‌కు పాతరేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు సిటీ: ఓటమి భయం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రులే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శనివారం సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు కర్నూలులో పర్యటించారు. సాయంత్రం గాయత్రి ఎస్టేట్‌లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కేజే రెడ్డి కార్యాలయం నాల్గవ అంతస్తులో ఆల్ సర్వీస్ అసోసియేషన్స్ మీట్ ఫర్ స్ట్రెంతెనింగ్ ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రెసిడెన్సియల్ టీచర్లు, అధ్యాపకులు రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని.. రాత్రి, పగలు కష్టపడి పని చేస్తున్న సీఎంకు కృతజ్ఞతగా టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కేజే రెడ్డి, బచ్చల పుల్లయ్యలను గెలిపించాలని ఉద్యోగులను కోరారు. మీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేశామని.. మరిన్ని హాస్టళ్లను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్చనున్నామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మీతో మాట్లాడుతారు, వారు మీకు హామీలు ఇస్తారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఎన్నో రోజులుగా పెండింగ్‌లోని సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగులతో కలిసి మంత్రి ఫొటోలు దిగడం గమనార్హం. కొంత మంది మాత్రం ఎన్నికల కోడ్ ఉన్నా ఉద్యోగులతో సమావేశం నిర్వహించి బలవంతంగా రావాలని ఒత్తిడి చేయడంతో వచ్చామని చర్చించుకోవడం కనిపించింది. మీడియా వాళ్లు వీడియో, ఫొటోలు తీస్తే ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్న కొంత మంది అక్కడ నుంచి భోజనాలు చేయకుండానే వెళ్లిపోయారు. ఇదిలాఉంటే మంత్రి వెళ్లిపోతున్న సమయంలో కొందరు ఉద్యోగులు కారెక్కించి పంపడం కొసమెరుపు. -
మంత్రి రావెలపై చంద్రబాబు ఫైర్
అమరావతి: వివాదాలతో పార్టీని ఇబ్బంది పెడితే సహించేదే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రావెల కిశోర్‌బాబుపై సీరియస్ అయ్యారు. బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాదాలతో పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ వివాదంతో పాటు, రావెల నియోజకవర్గం నుంచి వస్తోన్న ఫిర్యాదులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీలోకి కొత్తగా వచ్చినా అవకాశం దక్కిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ మండిపడ్డారు. -
రోజా స్త్రీయేనా..?: రావెల
వైఎస్ జగన్, బొత్స చీడపురుగులు ప్రత్తిపాడులో మంత్రి అనుచిత వ్యాఖ్యలు ప్రత్తిపాడు: రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన జన్మభూమి–మావూరు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను అసలు స్త్రీయేనా? అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ‘‘చంద్రబాబుపై నోరుజారితే ఖబడ్దార్. నాలుకలకు కత్తెరవేస్తాం. సర్జరీ చేస్తాం. రోజా ఏం మాట్లాడుతుందండి. అసలు రోజా ఒక స్త్రీయేనా? స్త్రీజాతి సిగ్గుతో తలొంచుకోవాలి. ఆమె మాటేంటి? ఆమె వేషమేంటి? ఆమె భాషేంటి? ఆమె ప్రవర్తనేంటి? అసెంబ్లీలో బూతులు మాట్లాడేటటువంటి అరాచకవాది రోజా. అలాంటి రోజా కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు’’ అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పైనా మంత్రి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. కిశోర్ బాబంటే జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు భయం పట్టుకుందన్నారు. జగన్, బొత్సవంటి నాయకులు ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులని, వాటిని మందు వేసి తరిమికొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
న్యాయం చేయండి
♦ చెంచయ్య మృతదేహంతో కుటుంబసభ్యులు, గిరిజన సమాఖ్య నాయకుల రాస్తారోకో ♦ మంత్రి రావెల రాజీనామా చేయాలని డిమాండ్ నెల్లూరు(సెంట్రల్) : కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న కొడుకు చనిపోయాడని, ఇక మాకు దిక్కెవరని పొర్లుకట్ట ఘనటలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన తిరువాది చెంచయ్య తల్లి జానకమ్మ ఆవేదన వ్యక్తంచేసింది. చెంచయ్య కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని పొర్లుకట్ట వద్ద బాణసంచా గోదాము జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందితే కనీసం పరామర్శకు కూడా రాని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సమాఖ్య నాయకులు చెంచయ్య మృతదేహాన్ని నెల్లూరులోని వీఆర్సీ వద్ద ఉంచి రాస్తారోకో నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంధళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ దళిత, గిరిజనుల అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇప్పటివరకు బాధితుల కుటుంబాలను పరామర్శించక పోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి రావెల వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రమాదకర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని జీవిస్తున్న గిరిజనులకు ఆ శాఖ ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బాణసంచా పేలుడు ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని రెండు గంటలకు పైగా ఉంచి రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయారుు.కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని నాయకులు హెచ్చరించారు. దీం తో పోలీసులు కొందరు ఎస్పీతో ఫోన్లో నాయకులకు హామీ ఇప్పించడంతో రాస్తారోకో విరమించారు. తొలుత పొర్లుకట్ల ప్రాంతంలో మృతుల కుటుంబాలకు న్యా యం చేయాలని ధర్నా నిర్వహించారు. సమాఖ్య గౌరవాధ్యక్షుడు బషీర్, నాయకులు మానికల ఏడుకొండలు, అరవ పార్వతయ్య, తుపాకుల మునెమ్మ, సత్యవతి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘రావెలా.. చేతగాని మాటలొద్దు’
గుంటూరు: ‘రావెల కిషోర్‌బాబు.. తస్మాత్ జాగ్రత్త.. చేతగాని, ధైర్యంలేని మాటలొద్దు. దమ్ముంటే.. టైము.. ఎప్పుడు, ఎక్కడో చెప్పు... బహిరంగ చర్చకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధం’..అని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ‘గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దనైనా.. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్దనైనా చర్చ పెట్టుకుందామా’ అని ప్రశ్నించారు. 24 గంటల్లో మంత్రి రావెల చెబితే.. బహిరంగ చర్చకు తాను ఒక్కడినే వస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వైఎస్సార్ సీపీ నేతలు చర్చకు రావాలని విసిరిన సవాల్‌పై మేరుగ ఘాటుగా స్పందించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారిగా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ‘ఎన్ని రాజకీయ పార్టీల గడపలు తొక్కావో’.. అనే అంశంపై చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మంత్రి అయిన తరువాత పనితీరు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులకు మడుగులొత్తుతూ.. దళిత జాతి సంక్షేమాన్ని తాకట్టు పెడుతూ.. కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తున్న తీరుపై చర్చిద్దామా.. అని నిలదీశారు. రావెల కుమారుడు హైదరాబాద్‌లో మైనారిటీ మహిళ చేయి పట్టుకున్న విషయంలో గానీ.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్ కుటుంబాన్ని చంపుతానని బెదిరించిన విషయంలో గానీ.. అభివృద్ధి, సంక్షేమం అని చెబుతూ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అంశంలో గానీ తాము చర్చకు సిద్ధమే అన్నారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు కోసం వెచ్చించాల్సిన సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించిన పోర్ట్‌పోలియో మంత్రిగా ఉండి.. నిధులు దారి మళ్లించే జీవో జారీ విషయంలో చర్చించుకుందామా అని సవాల్ విసిరారు. దళిత, గిరిజనులకు సంబంధించి మంత్రిగా వ్యవహరిస్తూ.. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేని అసమర్థత పైన, బాబు వస్తే జాబు ఖాయమని చెప్పి నేడు దళిత, గిరిజనులు చేతులు చాచి అడుగుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని చేతకానితనంపైన చర్చిద్దామన్నారు. ఇంతవరకు ట్రైబల్ ఎడ్వయిజరీ బోర్డు గురించి పట్టించుకోకుండా, నియోజకవర్గంలో దళితులు చనిపోతే పట్టించుకోకుండా, చంద్రబాబు అమ్ముల పొదిలో రామబాణాన్ని అని చెప్పుకొనే అవినీతి బాణాలను గురించి చర్చిద్దామా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూస్తున్న కారు కూతలపైన చర్చిద్దామని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, బండారు సాయిబాబు, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, దాసరి కిరణ్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు: రాయపాటి
గుంటూరు : పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులే ఇబ్బందిపడ్డారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ నోట్ల రద్దు సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్దోళ్లు ఎవరూ నగదు రద్దు వల్ల ఇబ్బంది పడలేదని రాయపాటి వ్యాఖ్యానించారు. ఇక సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ వ్యవహారంపై వివాదం సరికాదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే పార్టీలో చర్చించుకోవాలనే కానీ, పబ్లిక్కు ఎక్కడం సరికాదని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
మంత్రి రావెల నుంచి రక్షణ కల్పించాలి
టీడీపీ నాయకుల దౌర్జన్యంపై నడింపాలెం గ్రామస్తుల ధర్నా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ ప్రత్తిపాడు (పెదనందిపాడు): ‘మా ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన భాధ్యత రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖామాత్యుడు రావెల కిషోర్‌బాబుదే’నని నడిపాలెం గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవార మధ్యాహ్నం పట్టణంలోని తహశీల్దారు కార్యాలయం వద్ద టీడీపీ నాయకుల దౌర్జన్యకాండపై చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నడింపాలెంకు చెందిన 2వ వార్డు సభ్యుడు పాలెపు నాగేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని, మంత్రి పీఎ సిద్దెల దినేష్, టీడీపీ నాయకుడు వెలివెల్లి సుబ్బారావుతో పాటు మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి రావెల తమకు రక్షణ కల్పించాలన్నారు. అనంతరం తహశీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎస్.ఐ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బి.భగత్‌సింగ్, ఉండ్రాసి నాగేశ్వరరావు, సిద్దెల దాసు, దాసరి శ్రీను, బండారు ఇస్రాయేలు, నాగార్జున, శ్యాంబాబు, ఆశీర్వాదం, రత్నబాబు మరియు గ్రామ మహిళలు తదితరలు పాల్గొన్నారు. గ్రామంలో ఉండాలంటే భయమేస్తుంది.. గ్రామంలో ఉండాలంటే భయమేస్తుంది. మా నాన్న గ్రామ సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాత్రి ఒక్కడిని చేసి దాడిచేయడం హేయం. నిందితులపై చర్యలు తీసుకోవాలి. – కోండపాటూరి బుజ్జి, బాధితుడి కుమార్తె నిందితులను అరెస్ట్ చేస్తాం.. నిందితులు ఎవరైనా çవదిలిపెట్టం. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాం. గ్రామంలో గొడవలు జరుగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశాం. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదు. – ప్రత్తిపాడు ఎస్ఐ ఎ బాలకృష్ణ -
'జానీమూన్ నా కూతురు లాంటిది'
-
'జానీమూన్ నా కూతురు లాంటిది'
జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్, మంత్రి రావెల కిషోర్‌బాబు మధ్య సయోధ్య కుదిరింది. ఈ వివాదంపై చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట జానీమూన్, రావెల ఇద్దరూ హాజరయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి మీదకు వచ్చిన రౌడీలు మంత్రికి తెలియకుండానే వచ్చారని, ఈ విషయంలో తానే తొందర పడ్డానని జానీమూన్ అన్నారు. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మైనారిటీలు తనకు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ఇక జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ తనకు కూతురు లాంటిదని, తాను రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో స్థానిక రాజకీయాలను పట్టించుకోలేదని రావెల కిషోర్ బాబు చెప్పారు. వీటిపై తనకు అంతగా అవగాహన లేదని, నియోజకవర్గంలో పర్యటించకపోవడం వల్ల తమ మధ్య అంతరం ఏర్పడిందని అన్నారు. ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని తెలిపారు. తనకు తెలియకుండా కొన్ని జరిగి ఉండొచ్చని, అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. -
జానీమూన్‌పై వైఖరి మార్చుకోని ఏపీ మంత్రి!
-
జానీమూన్‌పై తన వైఖరి మార్చుకోని మంత్రి రావెల!
గుంటూరు: గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ జానీమున్‌కు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి బెదిరింపులు కలకలం రేపాయి. టీడీపీ నేత అయినప్పటికీ మహిళా నేతలపై ఇంకా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. నిన్న (శనివారం) పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేయగా.. మరోవైపు మంత్రి రావెల మాత్రం మహిళానేత జానీమూన్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలను రంగంలోకి దించారు. క్రైస్తవ సంఘాలను ఆసరాగా చేసుకుని జానీమూన్‌పైనే ఎదురుదాడికి దిగాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జానీమూన్ వ్యవహారంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు విచారణ కోసం సీఎం చంద్రబాబు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మహిళానేతకు న్యాయం చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. మహిళ అని చూడకుండా జానీమూన్‌ను మంత్రి హోదా వ్యక్తి వేధించడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
మంత్రి రావెలను తొలగించాల్సిందే
-
మంత్రి రావెలను తొలగించాల్సిందే
►మహిళా, దళిత,ప్రజా సంఘాల డిమాండ్ ►గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్‌కు మద్దతు ►ముస్లింల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా ►మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ వివాదంపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు సాక్షి, గుంటూరు/అమరావతి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జిల్లా జెడ్పీ మహిళా చైర్పర్సన్ జానీమూన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇప్పటికే మంత్రి తన ఇంటిపై పలుమార్లు దాడి చేయించారని, కనీసం గౌరవం ఇవ్వకుండా కక్ష సాధింపునకు దిగుతున్నారని మీడియా సమావేశంలో ఆమె విలపించడం అందరినీ కలచివేసింది. తనకు భద్రత పెంచాలని, ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చాలంటూ గుంటూరు అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలకు లేఖలు రాశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ మంత్రి నుంచే అదే పార్టీకి చెందిన మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌కు వేధింపులు ఎదురుకావడం పట్ల మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. శనివారం పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు.ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వివాదం సద్దుమణిగేలా చూడండి జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ వ్యవహారంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి రావెల కిషోర్‌బాబు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోని కాకుమాను మండలం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన షేక్ జానీమూన్‌ను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. మొదటి నుంచీ మంత్రి రావెల, చైర్పర్సన్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి రావెల తనపై రాళ్లదాడికి పురిగొల్పారని, చంపుతామని బెదిరిస్తున్నారంటూ జానీమూన్ చేసిన దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉండి రచ్చ రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సమావేశంలో ‘నా సోదరి సమానులైన తెలుగు ఇంటి ఆడపడుచులు’ అని సంబోధిస్తుంటారు. అయితే, వారిపై దాడులు చేసిన, వేధించిన తన పార్టీ నేతలపై మాత్రం ఈగ వాలనివ్వరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి రావెల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే మహిళలపై వేధింపులకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జానీమూన్‌కు మద్దతుగా ర్యాలీ, ధర్నా జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్‌ను మంత్రి రావెల కిషోర్‌బాబు బెదిరించడం పట్ల ముస్లిం మైనార్టీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు గుంటూరులోని నగరంపాలెం నుంచి హిమని సెంటర్ మహత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణహాని ఉండదని స్పష్టమైన హామీ ఇవ్వాలి అప్పుడే మంత్రి రావెలతో చర్చలు : షేక్ జానీమూన్ గుంటూరు(కొరిటెపాడు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉండదని స్పష్టమైన హామీతో పాటు గతంలో తాము ప్రతిపాదనలు చేసిన పనులకు ఆమోదం లభించినప్పుడే చర్చలకు సిద్ధమని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ స్పష్టం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు శుక్రవారం రాత్రి ఫోన్ చేసి, మంత్రి రావెలతో చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఆవరణలోని తన క్యాంపు కార్యాలయంలో పలు దళిత, మైనారిటీ, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు జానీమూన్‌ను శనివారం కలసి సంఘీభావం ప్రకటించారు. -
‘రావెలపై చంద్రబాబు విచారణకు ఆదేశించాలి’
విజయవాడ: మహిళలను వేధిస్తున్న మంత్రి రావెల కిశోర్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ డిమాండ్ చేశారు. ఆమె శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి రావెలపై విచారణకు ఆదేశించాలన్నారు. గతంలో రావెల కుమారులు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సుంకర పద్మ అన్నారు. మహిళల పట్ల టీడీపీకి, చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. -
రావెల-జానీమూన్ వివాదంపై త్రిసభ్య కమిటీ
గుంటూరు: ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. తనను రావెల హత్య చేయించేందుకు యత్నించారంటూ జానీ మూన్ ఆరోపించడంతో దానిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవీ ఆంజనేయులుతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ కళా వెంకట్రావును చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది..
-
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది
విలేకర్ల ఎదుట బోరున విలపించిన జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ గుంటూరు(కొరిటెపాడు): సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట బోరున విలపించారు. స్థానిక జిల్లా పరిషత్ కాంపౌం డ్లోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాకుమాను మండలం గరికపాడులో జరిగిన చంద్రన్న రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో తమపై రాళ్లదాడి చేయాలంటూ మంత్రి రావెల తన అనుచరులను పురిగొల్పారని ఆరోపించారు. తన సొంత మండలం కాకుమానులో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం తెలియనీయవద్దని, ఆహ్వానించవద్దని అధికారులు, పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తన కుటుంబానికి ప్రాణహాని వుందని రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. చలి చీమలను చంపాలన్నా భయపడతా!: రావెల చలి చీమలను చంపాలన్నా తాను భయపడతానని, అలాంటిది కన్న కూతురు లాంటి జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ కు హాని తలపెడతాననడం హాస్యాస్పదంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పుడు మాటలు వల్లే తనపై జానీమూన్ ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. -
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది
-
దళితులు మరింత అభివృద్ధి చెందాలి
విజయవాడ (భవానీపురం) : సమాజంలో అప్పటికి, ఇప్పటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 60వ మహాపరి నిర్యాణం సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దళితులు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని ఆయన కోరారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద 250 మంది విద్యార్థులను విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు పంపామని చెప్పారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించడంతోపాటు స్ఫూర్తి భవన్‌ను నిర్మించి లైబ్రరీ నెలకొల్పుతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు రామారావు మాట్లాడుతూ దేశంలో లక్షలాది మందికి దారిచూపిన అంబేడ్కర్ మహాపరి నిర్యాణం పొందిన ఈ రోజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సౌదా అరుణ అనువదించిన 'అంబేడ్కర్ వర్ణ నిర్మూలన', 'అంబేడ్కర్ ఆత్మకథ' పుస్తకాలను మంత్రి రావెల ఆవిష్కరించారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ డైరెక్టర్లు ప్రసాద్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
'ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు'
అమరావతి: లక్ష ఎకరాల్లో గిరిజనుల ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 800 మందికి, ఎంటర్‌ప్రై న్యూర్షిప్ ప్రోగ్రామ్‌లో 220 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐదు లక్షల వరకు రుణం ఇచ్చి పండ్లతోటలు, ఎన్టీఆర్ జలసిరి కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. -
విజయనగరంలో గిరిజన విశ్వవిశవివిద్యాలయం
ద్వారకా తిరుమల : కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు భూసేకరణ కూడా జరిపినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ద్వారకా తిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల, బాలికల జూనియర్ కళాశాలలో గురువారం క్యూరియాసిటీ కార్నివాల్2016 (వైజ్ఞానిక ప్రదర్శన)ను ఆయన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు తిలకించారు. ఆ తరువాత జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది, పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు విద్యలో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు మరింతగా కృషిచేయాలన్నారు. అనంతరం మంత్రి రావెలను గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గజమాలతో సత్కరించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి, సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి వెంకటేశ్వరరావు, వెలుగు పాఠశాల ప్రిన్సిపాల్ వై.సుధారాణి పాల్గొన్నారు. -
స్వశక్తితో ఎదగాలి
ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ సభలో మంత్రి రావెల సూచన పలువురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సాక్షి, రాజమహేంద్రవరం : దళితులు, గిరిజనులు ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని వదిలి ఎవరి కాళ్లపై వారు నిలబడాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. ’ప్రభుత్వ దళిత, గిరిజన బాట’ కార్యక్రమాన్ని శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పథకాలను లబ్థిదారులకు అందించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ. 12,000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులను పూర్తి స్థాయిలో వారి అభివృద్ధికే కేటాయిస్తున్నామన్నారు. రూ.2000 కోట్ల సబ్‌ప్లా¯ŒS నిధులతో అన్ని కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. దశలవారీగా సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్సియల్ పాఠశాలలుగా మారుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలను సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.. జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో 1011 మంది లబ్థిదారులకు రూ.6.92 కోట్ల చెక్కును మంత్రి రావెల అందజేశారు. పది మంది గిరిజన జంటలకు గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందించారు. 437 డ్వాక్రా సంఘాలకు రూ.9.37 కోట్లను చెక్కును అందించారు. ఐటీడీఏ పరిధిలో బహిరంగ మలవిసర్జనలేని 37 గ్రామాలకు ప్రోత్సాహక బహుమతిగా రూ.1.85 కోట్ల చెక్కును అందజేశారు. 132 గ్రామాల్లో షెడ్లు, సోలార్ లైట్లు ఏర్పాటుకు అవసరమయ్యే రూ.2.66 కోట్ల చెక్కును అందించారు. పలువురు లబ్ధిదారులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రత్నాబాయి, అప్పారావు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అదనపు సంయుక్త కలెక్టర్ పి.రాధాకృష్ణమూర్తి, సాంఘింక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, ఐటీడీవో పీవో చక్రధరబాబు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. వెలవెల ’దళిత, గిరిజన బాట’ పేరుతో శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమం జనాలు లేక వెలవెలబోయింది. దళితులు, గిరిజనులకు వివిధ శాఖల ద్వారా అందించే యూనిట్ల ప్రదర్శన, సబ్‌ప్లా¯ŒS నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నాలుగు రోజుల నుంచి ఇతర పనులన్నింటినీ పక్కనబెట్టి ఏర్పాట్లు, జనసమీకణలో తీరకలేకుండా గడిపారు. స్థానికంగా ప్రజలు రారన్న భావనతో ఏజెన్సీ ప్రాంతం నుంచి 25 ఆర్టీసీ బస్సుల్లో గిరిజనులను తరలించారు. ఆర్ట్స్ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీగా కుర్చీలు వేయించారు. అయితే సభ ప్రాంగణం సగం కూడా నిండలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన కార్యక్రమలో ఒక్కో నేత చెప్పిందే చెప్పడంతో విగుసు చెందారు. పలువురు సభ చుట్టుపక్కల వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన కేంద్రాలను వీక్షించి వెళ్లిపోయారు. సభకు వచ్చిన జనాల కన్నా ముందు వరసలో కూర్చున్న అధికారులు, విలేకర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన సాంఘిక, సంక్షేమ వసతి గృహాల నుంచి విద్యార్థులను సభ వద్దకు తరలిచారు. -
అమ్మాయిల హాస్టల్లో రావెల అనుచరులు
గుంటూరు : మంత్రి రావెల కిశోర్ బాబు వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ‘సంక్షేమాన్ని’ విస్మరించిన మంత్రి తన అనుచరులకు ఏకంగా అమ్మాయిల హాస్టల్లోనే వసతి కల్పించారు. అధికార దర్పంతో విద్యార్థినుల భద్రతను విస్మరించిన ఈ ఘటన గుంటూరులో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిన్న ప్రభుత్వ దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి రావెల అనుచరులు వందమందికి పైగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు వచ్చారు. వారందరికీ కలెక్టరేట్ రోడ్డులోని పరివర్తన భవన్లో ఆశ్రయం కల్పించారు. ఆ భవన్‌లోనే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ తన అనుచరుల కోసం మంత్రి వాటికి తిలోదకాలిచ్చారు. కొంతమంది అధికారులు వారించినా మంత్రి పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. -
దళితుల్లో విప్లవం రావాలి
సంక్షేమ పథకాలు పెడుతున్నా ఎందుకు ముందుకు రావట్లేదు.. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల నెల్లూరు(సెంట్రల్) సమాజంలో దళితులు అభివృద్ధి చెందాలంటే వారిలో విప్లవం రావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో బుధవారం జరిగిన చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో మంత్రి రావెల ముఖ్యఅతిదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితకా ఉద్యోగాలు మాని పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఒక విప్లవంలాగా మార్పు రావాలన్నారు. ప్రభుత్వం చాలా పథకాలు అమలుచేస్తున్నా చాలామంది ముందుకు రాలేదన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపే విఽధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమలో తాము దోపిడీకి గురికాకుండా, అభివృద్ధి పథం వైపు నడవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రవేశపెట్టే పథకాలను దళితులు తెలుసుకోవాలన్నారు. రానున్న రోజులలో అర్హులైన దళితులకు జీవానోపాధికి క్యాబ్‌లను అందిస్తామన్నారు. దీంతో పాటు తిరుమలలో దళితులు షాపులు పెట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తొలుత నర్తకి సెంటరులోని నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వీఆర్సీ మైదానానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాల రాజు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు, ఎస్సీ కాఽర్పొరేషన్ ఈడీ రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి రావెలకు అసమ్మతి సెగ
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది. ప్రత్తిపాడులో మంత్రి రావెల శుక్రవారం పర్యటించారు. వట్టి చెరుకూరు మండలం వింజనంపాడులో స్థానిక టీడీపీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎటెళ్దాం!
నేడు విజయవాడలో మంత్రి రావెల సమావేశం నెల్లూరులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ పర్యటన మంత్రి, చైర్మన్ మధ్య నలిగపోతున్న అధికారులు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మధ్య ఆధిపత్య పోరు ఆయా శాఖల అధికారులకు ఉద్యోగ సంకటంగా మారింది. ఇరువురు నేతలు అధికారులను తమ ప్రాబల్యానికి వాడుకుంటున్నారు. గురువారం మంత్రి రావెల విజయవాడలో నిర్వహించే సమావేశానికి రావాంటూ సాంఘిక సంక్షేమశాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు అందాయి. అక్కడికి వెళ్దామనుకున్న సమయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం నెల్లూరుకు వస్తున్నట్లు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు రావడంతో ఎటెళ్లాలని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. నెల్లూరు (సెంట్రల్) : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్లో జరిగే ప్రతి పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారికంగా జరిగే సమావేశాలకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, అటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను పిలిపించుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మంత్రి రావెలపై అసంతృప్తిగా ఉండటతో ఆయనకు వ్యతిరేక వర్గంగా ఉన్న కారెం శివాజీని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పదవిని కట్టబెట్టించారు. మంత్రి చేస్తున్న ప్రతి పనిలో కారెం వేలు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి కూడా కారెంకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నాయి. దీంతో దళితుల్లో రెండు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చినట్లు ఆయా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రి రావెల మాటను కూడా చైర్మన్ లెక్క చేయకపోవడం ఏమిటని పలువురు దళితులు ప్రశ్నిస్తున్నారు. ఇబ్బందుల్లో అధికారులు మంత్రి రావెల కిషోర్‌బాబు గురువారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రతి జిల్లా నుంచి సంబంధిత శాఖ అ«ధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఉన్నాయి. కాని అదే సమయంలో జిల్లాలో కారెం శివాజీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటనలో తప్పకుండా ఉండాలంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాని అధికారులు ఏ పర్యటనకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సెలవుపై వెళ్లేందుకు అధికారులు? ఇరువురి నేతల మధ్య విభేదాల కారణంగా తమ జీవితాలతో ఆటలాడుకుంటున్న తీరును చూసిన పలువురు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఽఇటీవల నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో కారెం శివాజీ సమావేశం అనంతరం పలువురు అధికారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. నేడు జరుగుతున్న సమావేశానికి పలువురు అధికారులు డుమ్మాకొట్టి సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
అంటరానితనానికి విరుగుడు ఉన్నత విద్యే మార్గం
ఇప్పటికీ అనేక గ్రామాల్లో అంటరానితనం ఉందని, దీన్ని రూపుమాపాలంటే ఉన్నత విద్య అభ్యసించడమే మార్గమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదే శాల్లో విద్యనభ్యశించేందుకు ఎంపికైన విద్యార్థులతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి రావెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్, పీజీ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం మంచి అవకాశమని, దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఉన్నతులుగా మారటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ కుటుంబ నేపథ్యాలను వివరించారు. కాగా, ఇప్పటివరకు ఈ పథకం కింద 190 మంది విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లారు. ఇప్పుడు మరో 21 మంది విద్యార్థులు వెళ్లనున్నారు. ఈ పథకానికి ఎంపికైన వారిలో అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 38 మంది, గుంటూరు నుంచి 48, ప్రకాశం నుంచి 26 మంది విద్యార్థులున్నారు. ఇంజనీరింగ్‌తో పాటు పీజీ, పీహెచ్డీ, మేనేజ్మెంట్, ఫ్యూర్ సెన్సైస్, ఆర్ట్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా, నర్సింగ్ సర్టిఫికెట్ కోర్సులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. -
నిద్రలేని రాత్రులు గడపుతున్నాం..
* అన్నీ ఊరికేనా, దళితవాడను అభివృద్ధి చేయరా * మంత్రి రావెలకు గోడును వెల్లబోసుకున్న వంగిపురం దళితవాడ మహిళలు * ఎంత చెప్పినా నమ్మట్లేదంటూ మంత్రి రావెల అసహనం వంగిపురం (ప్రత్తిపాడు): ‘కాలనీలో సరైన రోడ్లు లేవు. లోతట్టు ప్రాంతంలో ఉండటం వలన ఇళ్లలోనికి నీళ్లు వస్తున్నాయి. మొన్న నిద్రలేని రాత్రి గడిపాం. అన్నీ నీళ్లే. అభివృద్ధి అంతా ఊర్లోనే చేస్తున్నారు. దళితవాడను అభివృద్ధి చేయరా’ అంటూ.. మంత్రి రావెలకు వంగిపురం దళితవాడ మహిళలు తమగోడును వెల్లబోసుకున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి రావెలను స్థానిక దళితవాడ మహిళలు చుట్టుముట్టారు. మా కాలనీకి ఎందుకు రోడ్లు వెయ్యరంటూ ప్రశ్నించారు. స్పందించిన మంత్రి రావెల కిషోర్‌బాబు పక్కనున్న పార్టీ నాయకుడు సర్పంచ్ భర్త, శెట్టిపాపయ్యను ఈ రోడ్డును మనం మంజూరు చెయ్యలేదా అంటూ ప్రశ్నించారు. మంజూరు చేశామని అయినా వాళ్లు పదేపదే చెయ్యలేదని చెబుతున్నారని తెలిపారు. దళితవాడ రోడ్లకు రూ.1.53 కోట్లు, మేడావారిపాలెం రోడ్డుకు రూ. 1.75 కోట్లు మంజూరయ్యాయని పాపయ్య వివరించారు. అయినా ఆయన సమాధానంతో మహిళలు శాంతించలేదు. దీంతో మంత్రి రావెల వీళ్లకు ఎంత చెప్పినా నమ్మట్లేదు.. అందుచేత ప్రతి గ్రామంలో మంజూరైన పనుల వివరాలు, పింఛన్లు వివరాలను పంచాయతీ కార్యాలయంపై పెయింటింగ్ వేయించాలని ఓఎస్డీ అర్జునరావుకు ఆదేశాలు జారీ ఆదేశించారు. అభివృద్ధి అంతా ఊరికే చేస్తున్నారని, మా కాలనీల ఓట్లు నాయకులకు అవసరం లేదా అంటూ మండిపడ్డారు. ఒక్కసారి ఊరు ఎలా ఉందో పల్లె ఎలా ఉందో చూడాలని వాపోయారు. -
గిరిపుత్రులంటే చులకనెందుకో
మన్యం కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేవరకూ కదలికేదీ...? వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరా తీయడంతో అప్రమత్తత వైఎస్సార్ నేతల పర్యటనలతో కళ్లు తెరిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు సాక్షిప్రతినిధి–కాకినాడ : గిరిపుత్రులంటే ఆమాత్యులకెందుకంత చులకనో. అందునా విలీన మండలాలంటే మరీను. రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గంలోని నాలుగు విలీన మండలాల్లో 350 పైనే గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో సుమారు లక్షన్నర మంది గిరిజనులున్నారు. తెలంగాణా నుంచి విడవడి మన జిల్లాలో విలీనమవడమే ఆ మండలాల ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు. వారి ఓట్లతో మనకేంటి పని అనుకున్నారో ఏమో తెలియదు కానీ వారి కష్టాలు, కన్నీళ్లు తుడవాలని జిల్లాలోని ఇద్దరు మంత్రులకు అసలు పట్టనేలేదు.అందుకే ప్రభుత్వం, మంత్రులు, జిల్లా అధికారులు కూడా ఆ మండలాల గిరిజనుల పట్ల సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. లేదంటే విలీన మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో నలుగురు గిరిజనులు మృత్యువాత పడి 32 మంది ఆసుపత్రిపాలై గిరిజనం హడలెత్తిపోతున్నప్పటికీ 30 రోజుల తరువాత గానీ గిరిజనసంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబుకు మెలకువ రాలేదు. అంతు చిక్కని వ్యాధితో విలీన మండలంలో తొలి మరణం గత నెల 14న నమోదైంది.అనంతరం వరుసగా ముగ్గురు గిరిజనులను ఈ వ్యాధి పొట్టనపెట్టుకు ంది. అలా 20 రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడినప్పటికీ బాధిత కుటుంబాలను జిల్లా నుంచి కేబినెట్లో కీలకశాఖలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధిత కుటుంబాలను కనీసం మానవతాదృక్పధంతోనైనా పలకరించిన పాపాన పోలేదు. మొదటి మరణం సంభవించి శుక్రవారానికి నెల రోజులు. నలుగురు మరణించి అంతమంది ఆస్పత్రిపాలయ్యాక 30 రోజుల తరువాత తీరిగ్గా రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు రంపచోడవరం ఏజెన్సీలో శుక్రవారం పర్యటించారు. కనీసం ఇప్పటికైనా వచ్చారని గిరిజనులు సరిపెట్టుకుంటున్న పరిస్థితి. వచ్చిన మంత్రి కూడా పర్యటనంటే జరిపారు కాని మృతుల కుటుంబాలకు ఏమాత్రం భరోసా ఇవ్వకుండానే తిరుగు ముఖంపట్టారు. మృతి చెందిన నలుగురు కోసం ఎవరిమట్టుకు వారు ఆయా కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించారు. ఒకో రోగికి లక్ష నుంచి లక్షన్నర ఖర్చు చేసినా మృతువు నుంచి బయటరాలేకపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలే. నెల తరువాత మంత్రి వస్తున్నారంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం అందుతుందని గిరిజనం గంపెడాశతో ఎదురుచూశారు. ఆర్థికంగా కూడా ప్రకటిస్తారని ఎదురుచూశారు. తీరా మంత్రి రావెల కేవలం మాటలతో సరిపెట్టేసి మృతుల కుటుంబాలకు పైసా కూడా ప్రకటించకుండానే వెళ్లిపోయారు. అక్కడికే పరిమితం కాకుండా మలేరియా మరణాలు లేవని, వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఉచిత ప్రకటనలివ్వడం పట్ల కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి మంత్రి రావెల గురువారమే ఏజెన్సీలో పర్యటనకు రావాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలు సాకుగా పర్యటన రద్దయింది. భద్రతా కారణాలతో రద్దు చేసిన మంత్రి పర్యటన భద్రతతో నిమిత్తం లేకుండానే అంత హడావిడిగా 24 గంటల్లో తెల్లవారేసరికి ఎలా వచ్చేయడం అటు అధికారులకు, ఇటు గిరిజనులకు విస్మయాన్ని కలిగించింది. విలీన మండలాల్లో అంతుపట్టని ఈ వ్యాధి, మృతుల విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి వైఎస్ఆర్సీపీ నేతలను పంపించి వారికి భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. అగమేఘాలపై మంత్రి విలీన మండలాల్లో పర్యటనకు రావడానికి ఆ మండలాల్లో మృతుల కుటుంబాల పరిస్థితిని జగన్ ఆరా తీయడమే కారణమంటున్నారు. మంత్రి పర్యటించి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ ఉండదని మృతుల కుటుంబాలు కోలుకునేలా ఆర్థిక సాయం అందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మన్యంలో మలేరియా మరణాలు లేవు రంపచోడవరం : తూర్పు మన్యంలో మలేరియా జ్వరాలు గిరిజనులను వణికిస్తూ ప్రాణాలు తీస్తుంటే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు మాత్రం మన్యంలో మలేరియా మరణాలు లేవని ప్రకటించడం ఆ ప్రాంతవాసులను ఆశ్ఛర్యపరిచింది. ఏజెన్సీ పర్యటనకు వచ్చిన మంత్రి శుక్రవారం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుకున్నారు. అనంతరం ఆయన స్దానిక విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియా ప్రభావం తగ్గిందని, మలేరియాతో మరణించిన దాఖలాలు లేవన్నారు. వీఆర్ పురం మండలం అన్నవరానికి చెందిన గిరిజనులు కాకినాడ జీజీహెచ్‌సీలో కాళ్లు వాపు వ్యాధితో చికిత్స పొందుతున్నారని వారిని పరామర్శించినట్లు తెలిపారు. రంచోడవరం ఏరియా ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇద్దరు ప్రత్యేక వైద్య నిపుణులను నియమించగా వారు మూడు నెలల కాలం పనిచేసి వెళ్లిపోయారని, కొత్త వారిని నియమిస్తామన్నారు. ఏరియా ఆస్పత్రిని వంద పడకల స్థాయి ఆసుపత్రిగా మారుస్తామని, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య సేవలు కోసం టీఎస్పీ ( ట్రైబుల్ సబ్‌ప్లాన్ నిధులు)నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఐటీడీఏలకు అంబులెన్స్‌ల సదుపాయం కల్పిస్తామని, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మందులు కొరత లేదని మంత్రి చెబుతుండగా...‘ మందులు బయట కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నా’రని ఫిర్యాదు చేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి తదితరులు ఉన్నారు. ఈ మరణాల మాటేమిటీ? గిరిజన శాఖా మంత్రి మన్యానికి వస్తున్నారంటే గిరిజనుల్లో ఏదో ఆశ. ఎంతలేదన్నా మన శాఖా మంత్రి కదా ఏదో న్యాయం చేయకపోతారా ... భరోసాగా మాట సాయమైనా ఉండకపోతుందా అని ఆశించిన గిరిజనులకు ‘మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు అదనంగా తగిలిన చందంగా’ తయారైంది. అయితే అధికారుల లెక్కల్లో...వారు రాసుకున్న లెక్కల్లో మాత్రం ఈ మరణాలు సహజ మరణాలుగానో...వేరే వ్యాధి మృతులుగానో నమోదవుతున్నాయి. వారం రోజుల కిందటే దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన పొడియం బన్ని (2) మలేరియాతోనే అసువులు బాసాడు. మంత్రి ప్రకటన నేపధ్యంలో మన్యంలోని ‘సాక్షి’ నెట్వర్క్ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది కంటే పెరిగిన మలేరియా కేసులు... గత ఏడాది కంటే మలేరియా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలున్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా వీరిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా 4,496 మందికి మలేరియా ఉన్నట్టు తేలింది. మారేడుమిల్లి పీహెచ్సీ పరిధిలో గత ఏడాది 231 మలేరియా కేసులు నమోదుగా ఈ ఏడాది 335 కేసులు నమోదైయ్యాయి. తులసిపాకలల్లో 508 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదనంగా వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మంగంపాడు పీహెచ్సీలో 440 కేసులు నమోదు కాగా 500కు పైగా నమోదయ్యాయి. విటిదబ్బల పీహెచ్సీలో గత ఏడాది 277 కేసులు నమోదు కాగా ఏడాది 439 కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేసులే లేవు ... మరణాలే లేవు ... అంతా బాగుందని మంత్రి ఎలా చెబుతారని మన్యం ప్రశ్నిస్తోంది. -
మంత్రి వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు
నెల్లిపాక: గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వాహనాన్ని ఎటపాక మండలం నెల్లిపాక జాతీయరహదారిపై పోలవరం నిర్వాసితులు అడ్డుకున్నారు. విలీన మండలాల పర్యటనకు వచ్చిన మంత్రి కూనవరం మీదుగా భద్రాచలం వస్తున్నారనే సమాచారంతో నెల్లిపాకలో అఖిలపక్షం ఆద్వర్యంలో 28 రోజులుగా దీక్షలు చేస్తున్న నిర్వాసితులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని రహదారిపై అడ్డంగా నిలిచి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అటుగా వచ్చిన మంత్రి కారును ఆపివేయటంతో ఆయన కారు నుంచి బయటకు దిగి దీక్షలు చేస్తున్న వారి వద్దకు వచ్చారు. వారి సమస్యలను విని వినతి పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంత్రి రావెల మాట్లాడుతూ ఏడు విలీన మండలాల ప్రజలకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, అయితే ముంపు ప్రాంత ప్రజలకు మెరుగైన ప్యాకేజీ, పునరావాసం కల్పించటంలో ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని, వాటిని తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ‘ప్రభుత్వం మీద నమ్మకముంచి దీక్షలు విరమించండి. మీకు న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటారు’ అని అన్నారు. మంత్రి హామీతో నిర్వాసితులు సంతృప్తి చెందారు. దాంతో దీక్షలో ఉన్నవారికి మంత్రి రావెల నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. నాయకులు కందుకూరి మంగరాజు, కొమరం ఫణీశ్వరమ్మ, కృష్ణబాబు, నలజాల శ్రీను, కరి శ్రీను, రాఘవయ్య, గంగుల నర్సింహారావు, గంజి వెంకటేశ్వర్లు, సత్యానందం తదితరులున్నారు. -
హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి : రావెల
మడకశిర : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడతామన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని శరవేగంగా అభివద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రక్షకతడుల ద్వారా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశనగను కాపాడడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు
-ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు - రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మడకశిర(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో 20 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ఒక్కో రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నాబార్డు కింద 8, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 12 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ పంటను రక్షక తడుల ద్వారా కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఉపయోగించే రెయిన్గన్లు, పైపులు, ఇంజన్లు, స్ప్రింక్లర్లు పక్కదారి పడితే బాధ్యులైన అధికారులపై గంటలోపే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. -
26, 27 తేదీల్లో జాబ్‌మేళా
గుంటూరు వెస్ట్: నిరుద్యోగ యువతకు చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరు రూరల్ చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. రావెల ట్రస్టు, వికాస ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ యువతకు ఈ మహాదావకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం విడుదల చేసినట్లు మంత్రి రావెల పేర్కొన్నారు. దేశ విదేశాలకు చెందిన 60 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 5 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి వారి అర్హతల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీలోగా ఆన్లైన్లో www.ravelatrust.org అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. -
రెసిడెన్షియల్స్‌లోకి హాస్టల్స్ విద్యార్థులు: రావెల
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి మార్చండని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం లోని ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం నిర్వహించిన 70వ స్వాతంత్య్రదినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేసి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అదనపు భవనాలకు రూ. 500 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. రూ. 21 కోట్ల నాబార్డు నిధులతో సత్తెనపల్లికి ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫైల్ ప్రాసెస్‌లో ఉందని, ఈ వారంలో క్లియర్ అవుతుందన్నారు.ఈ నిధులతో నిర్మించే భవనం ఫైవ్‌స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనం తీసుకొని ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో ఉచితంగా విద్యనభ్యసించేందుకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 200 మంది విద్యార్థులను అమెరికా వంటి దేశాలకు పంపామన్నారు. -
బాబూ... ఇదేనా మర్యాద?
-
బాబూ... ఇదేనా మర్యాద?
* గురువారం సాయంత్రం ఆర్భాటంగా పుష్కర వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం * శుక్రవారం ఉదయం లాంఛనంగా పుష్కరాలు ప్రారంభించిన సీఎం * 12 గంటలు గడిచిన తర్వాత విపక్ష నేతకు ఆహ్వానమంటూ డ్రామా సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మర్యాద తప్పి వ్యవహరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుష్కరాలకు ఆహ్వానించేందుకు.. పుష్కరాలు ప్రారంభమైన 12 గంటల తర్వాత మంత్రిని ఆయన ఇంటికి పంపింది. పుష్కరాలను అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం కొన్ని నెలల ముందే చెప్పింది. దేశ, విదేశాల్లోని ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు పలుమార్లు విలేకరులకు చెప్పారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్రమండలి సమావేశానికి వెళ్లినప్పుడే పుష్కరాలకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు. గత వారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వె ళ్లిన చంద్రబాబు మరోమారు ప్రధానిని కలసి ఆహ్వానించారు. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరినే అందరూ తప్పుపడుతున్నారు. ఇతర ప్రముఖుల మాదిరిగా ప్రతిపక్ష నేత జగన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆహ్వానించాలి. పుష్కరాలను ప్రారంభిస్తూ చంద్రబాబు దంపతులతో పాటు వివిధ పీఠాల అధిపతులు స్నానమాచరించిన తరువాత తీరికగా శుక్రవారం సాయంత్రం జగన్‌ను ఆహ్వానించేందుకు మంత్రి రావెల కిషోర్‌బాబును పంపింది. జగన్ హైదరాబాద్‌లో అందుబాటులో లేకపోవటం వల్ల ఆలస్యం చేశారా? అంటే అదీ లేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు కూడా. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారం రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వే శారు. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. కానీ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతను మాత్రం విస్మరించారు. జగన్ నివాసానికి మంత్రి రావెల పుష్కరాలకు ఆహ్వానించేందుకు జగన్ అపాయింట్మెంట్ కావాలని కోరుతూ గురువారం సాయంత్రం మంత్రి రావెల కిషోర్‌బాబు కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. అయితే జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్నారని, శనివారం ఉదయం 10 గంటలకు రావాలని పార్టీ నేతలు జవాబిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రావెల విలేకరులతో మాట్లాడారు. కొద్దిసేపటికి జగన్‌ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు రావెల వెళుతున్నారని, దీన్ని కవర్ చేయాలంటూ టీడీపీ మీడియా విభాగం విలేకరులకు ఎస్సెమ్మెస్‌లు పంపింది. రాత్రి 7.30 ప్రాంతంలో రావెల, ప్రభుత్వ విప్ రవికుమార్‌లు లోటస్‌పాండ్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేత పార్థసారథి, తదితరులు మీకు శనివారం ఉదయం సమ యం ఇచ్చారు కదా.. అనడంతో వారు వెనుది రిగారు. రాజధాని అమరావతికి భూమిపూజ, శంకుస్థాపనలను టీడీపీ సొంత వ్యవహారం లా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడూ అదే తీరులో వ్యవహరించడం విమర్శల పాలైంది. -
రావెల.. అలా ఎలా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఏపీఎస్డబ్లు్యఆర్ఈఐఎస్)లో డిప్యుటేషన్ పేరిట అడ్డగోలు బదిలీలకు తెర లేచింది. గురుకుల విద్యాలయాల్లో పని చేసే ప్రిన్సిపాళ్ళు, జూనియర్ లెక్చరర్లతో పాటు ఉపాధ్యాయులు అధికార పార్టీ నాయకుల సిఫార్సులతోనో.. లేదంటే బదిలీకి రూ.50 వేల నుంచి లక్ష వరకు డబ్బులు కొట్టి.. కోరుకున్న చోటుకు బదలీ చేయించుకుంటున్నారు. ఈ సంస్థ పరిధిలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు జూన్ 10వ తేదీన జీవో నెంబర్ 102ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు జూన్ 19న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి జోనల్ వారీగా బదిలీలు నిర్వహించారు. జోన్–1(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం)లో 38 మంది అర్హుల జాబితాను ప్రకటించగా.. జీవోలో నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హతలు ఉన్న 9 మందిని మాత్రమే సంస్థ కార్యదర్శి వి.రాములు బదిలీ చేశారు. ఇవన్నీ పారదర్శకంగానే జరిగినా.. ఆ తర్వాతే అసలు కథకు తెరలేచింది. డిప్యుటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా... సాధారణ బదిలీల్లో అవకాశం రాని వారికి డిఫు్యటేషన్ పేరిట కోరుకున్న చోటకు బదలీ చేసే తతంగానికి పాలకులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఏపీఎస్డబ్లు్యఆర్ఈఐఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే అదనుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని గురుకుల ఉపాధ్యాయులు కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. శుక్రవారం నాటికి జోన్–1 పరిధిలో 18 మందికి బదిలీ కాగా, వాటిలో పది ట్రాన్స్ఫర్లు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ∙శ్రీకాకుళం జిల్లా ఉంగరాడమెట్ట గురుకులంలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రంగారావును విశాఖ జిల్లా సబ్బవరానికి డిఫు్యటేషన్ పేరిట బదిలీ చేశారు. ఉంగరాడ మెట్టలో లెక్చరర్ల కొరత ఉన్నప్పటికీ కేవలం ఓ ప్రజాప్రతినిధి సిఫారసు మేరకు విశాఖకు బదిలీ చేసేశారు. ∙విజయనగరం జిల్లా గరుగుబిల్లి కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యాన్ని విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురుకులానికి బదిలీ చేశారు. వాస్తవానికి ఆయనకు అక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తి కాలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ సాకుతో బదిలీ చేశారు. ∙విజయనగరం జిల్లా బాడంగిలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న రాణిశ్రీని చీపురుపల్లికి బదిలీ చేశారు. వాస్తవానికి చీపురుపల్లిలో స్వర్ణలత అనే మరో లెక్చరర్ పనిచేస్తున్నారు. ఇక్కడ ఖాళీ లేనప్పటికీ రాణిశ్రీని బదిలీ చేయడం చూస్తుంటే ఈ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్ధమవుతుంది. ∙శ్రీకాకుళం జిల్లా మందసలో పనిచేస్తున్న ఇంగ్లిష్ జూనియర్ లెక్చరర్ ఎం.వి.కె శేషాద్రిని అదే జిల్లా తామరాపల్లి బాలికల కళాశాలకు బదిలీ చేశారు. ఇక్కడ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో మహిళా టీచర్ పని చేస్తున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ శేషాద్రిని బదిలీ చేశారు. ∙పదోన్నతులు పొందిన వారిని రెండేళ్ల పాటు పనిచేస్తున్న చోట నుంచి బదలీ చేయకూడదన్న నిబంధనలున్నాయి. కానీ ఐదు నెలల కిందట పదోన్నతి పొందిన శ్రీకాకుళం జిల్లా భామిని ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీహరిని విజయనగరం జిల్లా వేపాడకు బదిలీ చేశారు. ∙మందసలోనే పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డి.మన్మధరావును ఎచ్చెర్లకు బదిలీ చేశారు. డబ్బులు వెదజల్లే అర్థబలం, అధికార పార్టీ నేతల పలుకుబడి ఉన్న మాస్టార్లను ఇలా ఇష్టారాజ్యంగా కోరుకున్న చోటకు బదిలీ చేసే ప్రసహనం మునుపెన్నడూ చోటుచేసుకోలేదన్న వాదనలు ఉపాధ్యాయవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. -
హాస్టళ్లలో మంత్రి రావెల తనిఖీ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను, పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. కొండపల్లిలోని ఎస్టీ రెసిడెన్సియల్, పాఠశాల, బీసీ హాస్టల్‌ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థునుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారుండే గదులు పరిశీలించారు. వారితో పాటు సహపంక్తి భోజనం చేసి వారికి మిఠాయిలు తినిపించారు. కొండపల్లిలో స్థలం కేటాయిస్తే యూత్‌ట్రైనింగ్ సెంటర్‌కు రూ.4 కోట్లు కేటాయిస్తానన్నారు. కొండపల్లి సర్పంచి అమ్మాజీ మాట్లాడుతూ 60మంది విద్యార్థులు కలిగిన హాస్టల్‌కు పూర్తిస్థాయి వార్డెన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీపీ చీదిరాల ప్రసూన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈయన వెంట రాష్ట్ర గిరిజన సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ.బద్దయ్య, స్థానిక నాయకులు చిమటా ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మంత్రి రావెలను పట్టించుకోని అధికారులు
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా!
అధికారులపై మంత్రి రావెల మండిపాటు విజయవాడ బ్యూరో: తమాషాలు చేస్తున్నారా.. విద్యార్థులకు అందాల్సిన వస్తువులు సక్రమంగా ఇంతవరకు ఎందుకు అందలేదు. అందరికీ పాఠ్యపుస్తకాలు కూడా ఎందుకు అందలేదు. జూన్ నుంచి కాలేజీలు తెరుస్తారని మీకు తెలియదా? అంటూ సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులపై సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ఐలాపురం హోటల్లోని కాన్ఫరెన్స్ హాలులో సాంఘిక సంక్షేమ గురుకుల ప్రధానాచార్యుల రాష్ట్రస్థాయి సెమినార్ జరిగింది. సెమినార్‌ను ప్రారంభించిన మంత్రి గురుకుల కాలేజీల బాగోగులపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాల్సిన బాక్స్‌లు, బట్టలు, కాస్మొటిక్స్, బెడ్‌షీట్స్ వంటికి సరిగా పంపిణీ జరగలేదని, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవహారాలు ఆలస్యం కావడం వల్ల వెంటనే ఇవ్వలేకపోయినట్లు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇక మీదట ఇటువంటి సాకులు చెబితే సహించేది లేదన్నారు. గత సంవత్సరం ఫలితాల్లోనూ కొంత వెనుకబాటు కనిపించినట్లు మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడంపై డిప్యూటీ కార్యదర్శి ఇర్ఫాన్‌ను మంత్రి నిలదీశారు. సోమవారం తగిన ఫైల్స్‌తో తన వద్దకు రావాల్సిందిగా ఇర్ఫాన్‌ను ఆదేశించారు. సెమినార్లో గురుకుల విద్యాలయాల అదనపు కార్యదర్శి కె.వి. చైతన్య, సంయుక్త కార్యదర్శి జి రమేష్, డిప్యూటీ కార్యదర్శి ఎండి ఇర్ఫాన్, గురుకుల విద్యాలయాల ఆచార్యులు పాల్గొన్నారు. -
'మంత్రి రావెల అవివేకానికి నిదర్శనం'
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం శ్రీకాకుళంలో నిప్పులు చెరిగారు. ఆస్తుల అటాచ్మెంట్ అనే పదానికి అర్థం తెలియకుండా మాట్లాడటం మంత్రి రావెల అవివేకానికి నిదర్శనమన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఎందుకు దేశ బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. అలాగే ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి రావెల కుమారుడిని ఎందుకు రాష్ట్ర బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. ఒకే ఎఫ్ఐఆర్పై 11 ఛార్జీషీట్లు వేయడం అంటేనే అక్రమ కేసు అని అర్థమవుతుందని తమ్మినేని సీతారాం అన్నారు. -
లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం
విజయవాడ: లిడ్‌క్యాప్ వర్క్‌షాప్‌లో గందరగోళం నెలకొంది. మాదిగ వర్గానికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని మాజీ కౌన్సిలర్ నాగబాబు మంత్రి రావెల కిషోర్ బాబును కోరారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన పై రావెల అనుచరులు దాడికి దిగినట్టు నాగబాబు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నాగబాబు తెలిపారు. -
సీఎం చంద్రబాబు, మంత్రి రావెలలు రాహుకేతువులు
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు పట్నంబజారు:- రాష్ట్రానికి రాహుకేతువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి రావెల కిషోర్‌బాబులు దాపురించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్న మంత్రి రావెలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గుణపాఠం చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రావెలే పెద్ద శనీశ్వరుడన్న విషయాన్ని ఆయన గుర్తించాలని హితవుపలికారు. రావెల ఒక మానసిక రోగిలా వ్యవహరిస్తూ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాపు ఉద్యమంపై మాట్లాడే హక్కులేదు కాపు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రావెలకు ఏమాత్రం లేదన్నారు. రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టని రావెల దళిత జాతి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న జగన్‌పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. -
మేం రమ్మంటేనే రండి!
► బదిలీ అయిన ఉద్యోగులకు స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులు ► కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోని వైనం ► అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం ఉద్యోగుల క్యూ ► జాబితాలు సిద్ధం చేసి పంపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం క్లైమాక్స్‌కు చేరింది. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధి అనుమతి లేనిదేఅక్కడ ఉద్యోగంలో చేరేందుకు కుదరని పరిస్థితి. నిబంధనలు బేఖాతరు చేస్తూ తమకు అనుకూలంగా లేనివారిని వేరే చోటికి పంపించడంతో పాటు తమవారికి పోస్టింగులు ఇప్పించు కోవడానికి నేతలు రంగం సిద్ధం చేశారు. సోమవారంతో బదిలీలకు గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రెవెన్యూశాఖలో ఇటీవల జిల్లా కలెక్టర్ నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలో కొంత మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. పిట్టలవానిపాలెం, రొంపిచర్ల, నకరికల్లుకు బదిలీ అయిన తహసీల్దార్లను స్థానిక ప్రజా ప్రతినిధులు జాయిన్ కావద్దని ఒత్తిడి తేవడంతో వారికి ఎటూ పాలుపోవడంలేదు. తమకు తెలియకుండా ఎలా వస్తారని, తమకు నచ్చిన వారిని తామే ఇక్కడకు తెప్పించుకుంటామని వారితో తేల్చి చెప్పడంతో బదిలీ అయిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి రావెల్ కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో ఓ భూమి వ్యవహారంలో తహసీల్దారు కోర్టు ఆదేశాలను అమలు చేసి మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. సెలవులో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో ఆ తహసీల్దార్‌కు బదిలీ తప్పేలాలేదు. రొంపిచర్ల తహసీల్దార్‌కు పదవీ విరమణకు గడువు కేవలం రెండు నెలలు ఉంది. పదవీ విరమణకు ఆరునెలల లోపు సర్వీసు ఉన్న వారిని అధికారికంగా బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన్ను దుర్గిరాలకు బదిలీ చేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ బదిలీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించినా ఆయన ఆదేశాలు పట్టించుకోక పోవడం గమనార్హం. రెవెన్యూ శాఖలో అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకు 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు వివరాలు పంపించాల్సిందిగా డివిజన్, మండల కార్యాలయాలకు కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బదిలీల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోల బదిలీల్లో సైతం... జిల్లాలో ఎంపీడీవోల బదిలీల్లో సైతం తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నట్టు సమాచారం. బదిలీలకు సంబంధించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ సమావేశమై చర్చించినట్లు తెలిసింది. 20 శాతం అంటే దాదాపు 15 మందికి పైగా ఎంపీడీవోలకు స్థానచలనం తప్పదని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట మండల ఎంపీడీవోను బదిలీ చేయాలని సూచించినట్టు తెలిసింది. స్థానిక ఎంపీపీకి, ఎంపీడీవోకు నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న వట్టిచెరుకూరు మండల ఎంపీడీవోను సైతం తమ మాట ఖాతరు చేయడం లేదని ఇప్పటికే బదిలీ చేయాలని ఆధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ స్థానంలో పిడుగురాళ్ల ఎంపీడీవోను సిఫార్సు చేసినట్టు సమాచారం. ప్రత్తిపాడు ఎంపీడీవో గుంటూరు రూరల్ ఎంపీడీవోగా వచ్చేందుకు మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మేడికొండూరు ఎంపీడీవో సైతం ఈ నెల చివరికి రిటైర్ అవుతున్నారు. బొల్లాపల్లి, మాచవరం ఎంపీడీవోలు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నూజెండ్ల, దాచేపల్లి, పెదనందిపాడు మండల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాపట్ల, మంగళగిరి మండలాల ఎంపీడీవోలు బదిలీలకోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా బదిలీల ప్రక్రియ ఆన్‌లైనా, మాన్యువలా అన్న సందిగ్ధం ఉద్యోగుల్లో నెలకొంది. రేపటితో ముగియనున్న బదిలీల దరఖాస్తు గడువు బదిలీల దరఖాస్తు గడువు సోమవారంతో ముగుస్తుండడంతో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం కోసం అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను పంపినట్టు సమాచారం. -
ఆదర్శ రాష్ట్రంగా ‘ఆంధ్ర’
మంత్రి రావెల కిషోర్‌బాబు కొరిటెపాడు (గుంటూరు) : నవ్యాంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. కొరిటెపాడు సాయిబాబా రోడ్డులోని ఓ హోటల్లో బుధవారం జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో రెండేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి రావెల ప్రారంభించారు. అనంతరం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతిపై ప్రచురించిన పుస్తకాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్‌తో కలసి ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలి పారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక నిధులను చిత్తశుద్ధితో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయిస్తున్నట్లు వివరించారు. తూరుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు దూబి భద్రయ్య ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారని, ఈ యువకుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, కమిషనర్ నాగలక్ష్మి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, లాల్‌వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై దాడి ఘటనలో మంత్రి అనుచరుడు..
కృష్ణా జిల్లా: ఆగిరిపల్లిలో పోలీసులపై దాడులకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు పాలేటి ఉమామహేశ్వరరావు అలియాస్ పింకీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్య అనుచరుడని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఈ ఘటనపై నార్త్‌జోన్ ఐజీ కుమార్ విశ్వజిత్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పింకీ అరాచకాలపై గ్రామస్తులు ఐజీ దృష్టికి తీసుకువచ్చారు. పింకీ మంత్రి రావెల పేరుతో గ్రామంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నాడని వాపోయారు. పింకీ మంత్రితో పాటు సీఎం చంద్రబాబునాయుడితో దిగిన ఫోటోలను ఐజీకు అందించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ యువతిని వెంటాడిన సమయంలో మంత్రి రావెల తనయుడితోపాటు పింకీ కూడా పక్కనే ఉన్నట్లు ఆయనకు చెప్పారు. స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టమన్నందుకు రౌడీషీటర్‌గా ఉన్న పింకీ మరికొందరు తెలుగు తమ్ముళ్లు సోమవారం పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో టీడీపీ ఫ్లోర్ లీడర్ హరిబాబు కనకదుర్గ గుడి వద్ద హోంగార్డ్‌పై చేయిచేసుకున్నాడు. సోమవారం ఒక్క రోజే జిల్లాలో రెండు చోట్ల పోలీసులపై టీడీపీ నేతలు దాడులు చేయడంపై ఉన్నతాధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నాన్నే.. అమ్మేయాలని చూస్తున్నాడు!
గుంటూరు మెడికల్ : ‘మా నాన్న నన్ను అమ్మేయాలని చూస్తున్నాడు.. నాకు చదువుకోవాలని ఉంది.. నన్ను చదివిస్తే డాక్టర్ అవుతా.. నా విషయంలో అమ్మమ్మ నాన్నతో గొడవపడి శరీరం కాల్చుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది’ అంటూ ఓ బాలుడు ఆస్పత్రి అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లికి చెందిన నాగమ్మ 20 రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ నెల 18న ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ ఆస్పత్రిలో శానిటేషన్‌ను తనిఖీలు చేస్తున్న సమయంలో గుండా హర్షిత్ అనే 11 ఏళ్ల బాలుడు కంటపడ్డాడు. డాక్టర్ రమేష్‌ను చూడగానే ఆయన వద్దకు వచ్చి తన తండ్రి సత్యనారాయణ తనను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందువల్లే అమ్మమ్మ గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు రోదిస్తూ చెప్పాడు. శుక్రవారం సాయంత్రం ఆర్ఎంవో డాక్టర్ రమేష్ పిల్లవాడిని మంత్రి రావెల కిషోర్‌బాబు వద్దకు తీసుకొచ్చి పరిస్థితి వివరించారు బాలుడిని ఆదుకోవాలని ఆయన మంత్రిని కోరారు. బాలుడు హర్షిత్ కూడా తనకు చదువుకోవాలని ఉందనే విషయాన్ని మంత్రికి తెలియజేయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బాలుడిని చదివించేందుకు తాను సహకారం అందిస్తానని మంత్రి రావెల హామీ ఇచ్చారు. -
మంత్రి వాహనంపై కూలీల దాడి
గుంటూరు: హరిహరమహల్ సెంటర్లో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలికి వచ్చిన మంత్రి రావెల కిషోర్ బాబు వాహనంపై బాధిత కూలీల బందువులు ఆగ్రహావేశాలతో దాడికి దిగారు. దీంతో చేసేదేమీలేక మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు. హరిహరమహాల్ సెంటర్లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కూలీలు 8 మంది వరకు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా 15 మంది కూలీలతో 30 అడుగుల లోతు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పటివరకూ శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీయగా, శిథిలాల కింద చిక్కుకున్న వారంతా సజీవంగా ఉన్నారా లేదా అనే దానిపై ఆందోళన నెలకొంది. -
ప్రత్యేక హోదా చట్టంలో లేదు: మంత్రి రావెల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచలేదని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రధాని హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. శనివారం విజయవాడలో మంత్రి రావెల ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధానితో మాట్లాడతామని చెప్పారు. -
అసలు విషయాన్ని బయటపెట్టిన రావెల
బాక్సైట్ జీవో రద్దుచేయలేదని బయటపెట్టిన మంత్రి మోదకొండమ్మ జాతర సాక్షిగా బయటపడిన టీడీపీ కుట్ర కలవరపడుతున్న గిరి పుత్రులు మన్యంలో మళ్లీ రగులుకుంటున్న బాక్సైట్ ఉద్యమం అమాయక గిరిజనంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అమ్మవారి జాతరను అడ్డుపెట్టుకున్నారు.. ప్రభుత్వ ఉత్సవంగా గుర్తించామంటూనే మన్యంలో సంతోషాన్ని లాగేసుకున్నారు.. నాడు ఆదివాసీ దినోత్సవం వేదికగా బాక్సైట్ తవ్వుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, నేడు గిరిజన ఉత్సవం సందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు అదే మాటను పునరుద్ఘాటించారు. బాక్సైట్‌పై అడవి బిడ్డలు చేసిన పోరాటాలు, త్యాగాలకు తలొగ్గి వెనక్కు తగ్గినట్లు ఇన్నాళ్లూ నటించిన ప్రభుత్వం తెరవెనుక కుట్రలు బయటపడుతున్నాయి. విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను గిరిజనులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా పార్టీ యంత్రాంగం చేసిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం నేపధ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యమం సద్దుమణిగింది. ఇక బాక్సైట్ జోలికి ప్రభుత్వం రాదనుకునే సంతోషంతో గిరిజనులు మోదకొండమ్మ అమ్మవారి జాతర జరుపుకుంటున్నారు. ఈ జాతరకు వచ్చిన రాష్ర్ట గిరిజన శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు బాక్సైట్ గురించి అక్కడ ఏమీ మాట్లాడలేదు. పైగా గిరిజనులు అడవిని కాపాడుకోవడం వల్లనే పచ్చగా ఉన్నారని తేనె పలుకులు పలికి వెళ్లిపోయారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించామని, రూ.50 లక్షలను నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం ఇస్తోందని ప్రకటించారు. కానీ ఆ ఆనందాన్ని గిరజనులకు ఆయన ఎంతో సేపు నిలువనివ్వలేదు. నర్సీపట్నం వెళ్లగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తవ్వకాల కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయలేదని, గిరిజనుల ఆమోదం తోనే బాక్సైట్ తవ్వకాలకు ముందుకు వెళతామన్నారు. సోమవారం కూడా అరకులో ఇవే వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా బాక్సైట్ తవ్వుతున్నామనే విషయాన్ని కూడా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్న ఆదివాసీ ఉత్సవాల్లోనే చంద్రబాబు ప్రకటించి చిచ్చు పెట్టారు. మళ్లీ అదే విధంగా గిరిజనుల ఆనందాన్ని హరించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంపైనా కుట్ర అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కూడా ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కనీవినీ ఎరుగని రీతితో అత్యంత వైభవంగా జాతర జరిపేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న ప్రభుత్వం జాతర విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించింది. అంతేకాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంది. మరోవైపు రూ. 50 లక్షలు ఇవ్వడం ద్వారా గిరిజనులకు తామోదో మేలు చేస్తున్నట్లు చూపించి, ఇదే అదునుగా బాక్సైట్ తవ్వకాలకు మళ్లీ అంకురార్పణ చేయాలని కుట్ర పన్నింది. అదే రావెల వ్యాఖ్యల్లో బయటపడింది. ఎమ్మెల్యేకు ఎరవేసింది ఇందుకేనా! అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల టీడీపీలోకి జంపయిన విషయం తెలిసిందే. భారీగా ముడుపులు ఆశచూపి ఆయనను చేర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ముడుపులతో పాటు బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకించకుండా ఉండేలా చేయడం కూడా కిడారి చేరికలో భాగమని తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన కిడారి సొంత నియోజకవర్గంలో బాక్సైట్‌కు అనుకూలంగా మంత్రి మాట్లాడే ధైర్యం చేయడం వెనుక కుట్ర ఇదేనని గిరిజనులు భావిస్తున్నారు. కేవలం రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న కుట్రలకు కిడారి వంటి గిరిజన ద్రోహులు చేస్తున్న ప్రయత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని, అవసరమైతే మళ్లీ బాక్సైట్ ఉద్యమ దివిటీని రగిలిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా గిరిజనులు అత్యంత పవిత్రంగా, సంతోషంగా జరుపుకునే మోద కొండమ్మ జాతర సమయంలో వారి జీవితాలను చిదిమేయాలనే ప్రభుత్వ కుట్రలు బయటపడటం మన్యంలో కలకలం రేపింది. -
పరిశ్రమల ఏర్పాటుకు సహకరించండి
► ఐటీసీ సంస్థ చైర్మన్‌ను కోరిన ► సీఎం చంద్రబాబు కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఐటీసీ సంస్థ సహకారించాలని సీఎం చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. రింగ్‌రోడ్డులో ఐటీసీ సంస్థ నూతనంగా రూ.145 కోట్లతో నిర్మించనున్న మై ఫార్చ్యూన్ హోటల్‌కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. 1996లో రూ.5 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న ఐటీసీ కంపెనీ, 2014 నాటికి రూ.46 వేల కోట్ల టర్నోవర్‌కు తీసుకురావటంలో సంస్థ సీఈవో వైసీ దేవేశ్వర్ కృషి దాగి ఉందని చెప్పారు. పొగాకు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై ఐటీసీ కంపెనీ దృష్టి సారించిందని, 32 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్‌గా గుర్తిస్తున్నారని, తిరుమలలో బాలాజీని కింగ్ ఆఫ్ గాడ్స్‌గా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే రొయ్యల ఎగుమతుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గుంటూరు జిల్లాలో టెక్స్టైల్, సిమెంట్ రంగాలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి విశిష్టతను ప్రతిబింబించే వందల శిల్పాలు ఉన్నాయన్నారు. ఐటీసీ సంస్థ చైర్మన్ వైసీ దేవేశ్వర్ మాట్లాడుతూ నవ్యాంధ్రలో పెట్టుడులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిరపలో ఫెస్టిసైడ్స్, కెమికల్స్ అధిక శాతం ఉన్నట్లు గుర్తించామన్నారు. రొయ్యల ఎగుమతికి సంస్థ ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. సంస్థ వివిధ రంగాల్లో 40 బిలియన్ డాలర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మైఫార్చ్యూన్ హోటల్ శంస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐటీసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కారెం నియామకంపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శులతో పాటు కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. అలాగే శివాజీ నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది జె.ప్రసాద్‌బాబు, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు. ఐక్యతతోనే మాల, మాదిగల అభివృద్ధి: రావెల సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగలు కలసి ముందుకు సాగితేనే అభివృద్ధి సాధిస్తామని, విడిపోతే పడిపోతామని మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించే బ్యాంకర్లను జైళ్లో పెట్టించి రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. కాగా, కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.