‘రావెల సుశీల్‌ను శిక్షించాలి’
బంజారాహిల్స్: మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధితురాలు ఫాతిమా బేగంతో కలిసి ఆమె శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
ఇంతదాకా నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. సీసీ పుటేజీల్లో రావెల సుశీల్ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని అరెస్టు చేసేదాకా ఊరుకునేది లేదని హెచ్చరించారు.