మంత్రి రావెలపై చంద్రబాబు ఫైర్
మంత్రి రావెలపై చంద్రబాబు ఫైర్
Published Wed, Jan 25 2017 4:52 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
అమరావతి: వివాదాలతో పార్టీని ఇబ్బంది పెడితే సహించేదే లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రావెల కిశోర్‌బాబుపై సీరియస్ అయ్యారు. బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాదాలతో పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ వివాదంతో పాటు, రావెల నియోజకవర్గం నుంచి వస్తోన్న ఫిర్యాదులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీలోకి కొత్తగా వచ్చినా అవకాశం దక్కిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ మండిపడ్డారు.
Advertisement
Advertisement