సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నెలల పసిపాప మొదలుకొని ఆడవారిపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల జరుగుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పద మారణాలతో ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇక.. జరుగుతున్న ఘటనలను నిలువరించలేకపోయినా.. కనీసం నిగ్గు తేల్చలేకపోతున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన, విజయనగరం జిల్లా జిలకవలస ఘటన, గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డి పాలెం ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలికి అదృశ్యమై నేటికి 10 రోజులు గడుస్తున్నా కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారిమళ్లిందా? అని అనుమానం వ్యక్తమవుతోంది. బాలిక ఆచూకీ తేలేదెప్పుడూ.. నిందితులకు శిక్ష పడేదెప్పుడూ అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు.
ఇక.. ఈ కేసులో ముగ్గురిన అరెస్ట్ చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పినా.. ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్నరాత్రి వరకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ముకాస్తున్నారని, అందుకే పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నానాయాగి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఉండి కూడా నంద్యాల ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో? లేదో? ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి చెబుతున్నారు. కానీ, ఆడపిల్లలపరై అఘాయిత్యాల కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ?
Comments
Please login to add a commentAdd a comment