women harassment cases
-
‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?. ..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు. -
కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నెలల పసిపాప మొదలుకొని ఆడవారిపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల జరుగుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పద మారణాలతో ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక.. జరుగుతున్న ఘటనలను నిలువరించలేకపోయినా.. కనీసం నిగ్గు తేల్చలేకపోతున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన, విజయనగరం జిల్లా జిలకవలస ఘటన, గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డి పాలెం ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలికి అదృశ్యమై నేటికి 10 రోజులు గడుస్తున్నా కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారిమళ్లిందా? అని అనుమానం వ్యక్తమవుతోంది. బాలిక ఆచూకీ తేలేదెప్పుడూ.. నిందితులకు శిక్ష పడేదెప్పుడూ అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు. ఇక.. ఈ కేసులో ముగ్గురిన అరెస్ట్ చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పినా.. ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్నరాత్రి వరకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ముకాస్తున్నారని, అందుకే పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నానాయాగి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఉండి కూడా నంద్యాల ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో? లేదో? ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి చెబుతున్నారు. కానీ, ఆడపిల్లలపరై అఘాయిత్యాల కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. -
లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
బెంగళూరు: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న విమానం టికెట్ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్ బుక్ చేసిన విమాన టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజ్వల్ బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్‌కు చెందిన జేడీఎస్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు.అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. -
లైంగిక వేధింపుల కేసు: పోలీసుల అదుపులో బీజేపీ నేత
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన బీజేపీ నేత జీ. దేవరాజే గౌడపై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు జీ దేవరాజే గౌడను అదుపులోకి తీసుకున్నారు. దేవరాజే గౌడ బెంగళూరు నుంచి చిత్రదుర్గకు ప్రయాణిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల ఓ మహిళ జీ దేవరాజేపై లైంగిక దాడి ఫిర్యాదు చేయగా.. పోలీసు కేసు నమోదు చేశారు. తనకు సంబంధించిన ఓ స్థలాన్ని అమ్మటంలో సాయం చేయాలని కోరగా.. తనపై దేవరాజే గౌడ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దేవరాజే గౌడ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణపై పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే రేవణ్ణపై ఉన్న లైంగిక ఆరోపణల విషయంలో బీజేపీ అధిష్టాన్ని అప్రమత్తం చేశారు. అదే విధంగా పొత్తులో భాగంగా హాసన్ పార్లమెంట్ టికెట్ ప్రజ్వల్‌కు కేటాయించవద్దని కూడా తెలిపారు. అయినా బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని ప్రజ్వల్ కేటాయించిన విషయం తెలిసిందే.ఇక.. ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అభ్యంతక వీడియోలు వైరల్ తర్వాత ఆయన జర్మనీ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వంలో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ కోసం బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. ప్రజ్వల్ తండ్రి హెచ్.డీ రేవణ్ణ ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. -
ఐదు నెలల్లో 1012 రేప్ కేసులు...
లక్నోః ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చినా మహిళలపై వేధింపులు, నేరాల పర్వం కొనసాగుతూనే ఉంది. అందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తాజా నివేదికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదు నెలల్లోనే మహిళలపై వేధింపులు, అత్యాచారాలల కేసులు వేలల్లో నమోదవ్వడం అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఆగస్టు 18 వరకూ 1,012 రేప్ కేసులు నమోదైనట్లు తాజా నివేదికల్లో వెల్లడించింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్ననేరాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, మహిళలపై వేధింపుల్లో ఆ రాష్ట్రం ముందున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత ఐదు నెలల్లో వేలకొద్దీ అత్యాచార కేసులేకాక, సుమారు 4,520 వేధింపుల కేసులు, 1,386 దొంగతనాలు, 86 దోపిడీ కేసులు కూడా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వ్రాత పత్రంలో పేర్కొంది. అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే సతీష్ మహానా అడిగిప ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక నేర విభాగాలను ఏర్పాటు చేశామని, నేరాలపై వెబ్ ఆధారంగా హాట్ స్పాట్ లను గుర్తించి పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు ఎమ్మెల్యేకు రాసిన సమాధానంలో సర్కారు వివరించింది.