బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన బీజేపీ నేత జీ. దేవరాజే గౌడపై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు జీ దేవరాజే గౌడను అదుపులోకి తీసుకున్నారు.
దేవరాజే గౌడ బెంగళూరు నుంచి చిత్రదుర్గకు ప్రయాణిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల ఓ మహిళ జీ దేవరాజేపై లైంగిక దాడి ఫిర్యాదు చేయగా.. పోలీసు కేసు నమోదు చేశారు. తనకు సంబంధించిన ఓ స్థలాన్ని అమ్మటంలో సాయం చేయాలని కోరగా.. తనపై దేవరాజే గౌడ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేవరాజే గౌడ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే రేవణ్ణపై ఉన్న లైంగిక ఆరోపణల విషయంలో బీజేపీ అధిష్టాన్ని అప్రమత్తం చేశారు. అదే విధంగా పొత్తులో భాగంగా హాసన్ పార్లమెంట్ టికెట్ ప్రజ్వల్‌కు కేటాయించవద్దని కూడా తెలిపారు. అయినా బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని ప్రజ్వల్ కేటాయించిన విషయం తెలిసిందే.
ఇక.. ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అభ్యంతక వీడియోలు వైరల్ తర్వాత ఆయన జర్మనీ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వంలో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ కోసం బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. ప్రజ్వల్ తండ్రి హెచ్.డీ రేవణ్ణ ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment