లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ! | Janata Dal MP Prajwal Revanna Back To India Tonight Ticket Sparks Buzz, More Details Inside | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ!

Published Wed, May 15 2024 2:20 PM | Last Updated on Wed, May 15 2024 3:43 PM

MP Prajwal Revanna Back To India Tonight Ticket Sparks Buzz

బెంగళూరు: హాసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్‌ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. 

ఆయన భారత్‌ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్‌ చేసుకున్న విమానం టికెట్‌ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్‌ బుక్‌ చేసిన విమాన టికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజ్వల్‌ బుక్‌ చేసుకున్న టికెట్‌ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్‌కు చెందిన జేడీఎస్‌ మహిళ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు.

అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై దర్యాప్తు కోసం ‘సిట్‌’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్‌ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్‌ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement