Germani
-
లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
బెంగళూరు: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతర వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా కొన్ని అభ్యంతర వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం వదిలి.. జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్వల్ ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన భారత్ రానున్న విషయంలో.. జర్మనీ నుంచి ఇండియాకు బుక్ చేసుకున్న విమానం టికెట్ బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ప్రజ్వల్ బుక్ చేసిన విమాన టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజ్వల్ బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ఆయన ఈరోజు (బుధవారం) రాత్రికి భారత్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. హాసన్‌కు చెందిన జేడీఎస్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు.అభ్యంతర వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌పై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది. అప్పటికే జర్మనీ వెళ్లినపోయిన ప్రజ్వల్ కోసం పోలీసులు.. బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజ్వల్ ఇండియా వస్తే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. -
‘రాహుల్’ పరిణామాలను గమనిస్తున్నాం
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న రగడ ముదిరింది. ‘ రాహుల్‌కి వ్యతిరేకంగా కోర్టు తీర్పు, అనర్హత వేటు తదనంతర పరిణామాలను గమనిస్తున్నాం. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడం సమంజసమేనా? అనేది పై కోర్టులో తేలుతుంది’ అని జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోకి విదేశీ శక్తులను కాంగ్రెస్ ఆహ్వానిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. ‘ అసలైన వ్యవహారాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అదానీపై రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వడంలేదు. ప్రజల దృష్టిని మళ్లించడం కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అని డిమాండ్ చేశారు. -
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!
German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం.. ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్ ఆర్ట్ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్ వేశాడా జర్మన్ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి -
జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా: చెన్నమనేని
హైదరాబాద్: పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్!
రెండో ప్రపంచ యుద్ధంలో మృత్యు కుహరాలుగా నిలిచిన నాజీ క్యాంపులు చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన సంగతి తెలిసిందే. శత్రుదేశాల ప్రజలు, సైనికులు, ముఖ్యంగా యూదులను విషవాయువులు నింపిన గ్యాస్ చాంబర్లలోకి తరలించి అత్యంత క్రూరంగా చంపేసే కేంద్రాలే నాజీ శిబిరాలు. అలాంటి ఓ క్యాంపులో నుంచి బయటపడడమే కాక, అక్కడి దారుణాలను ప్రపంచానికి వెల్లడించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడి చరిత్రకెక్కారు.. ఆల్ఫ్రెడ్ వెజ్లర్, రుడాల్ఫ్ వెబా. వీరిద్దరూ స్లొవేకియాకు చెందిన యూదులు. ఒకరికొకరికి పరిచయం లేదు. యుద్ధ సమయంలో జర్మనీ సైనికులకు చిక్కారు. వీరిని అప్పటి జర్మనీ ఆక్రమిత పోలాండ్లోని ఆస్చ్విజ్ డెత్ క్యాంపులోకి తరలించారు. అక్కడ కలసిన వీరు, జర్మన్ సైనికుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించారు. ఓ రోజు తప్పించుకొని, శిబిరానికి బయట కొద్ది దూరంలో ఉన్న ఓ కట్టెల కుప్ప మధ్యలో దాక్కున్నారు. ఇలా గంటా రెండు గంటలు కాదు ఏకంగా నాలుగు రోజులపాటు నాజీ సైనికుల కంటపడకుండా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడి, వందలాది మైళ్లు నడిచి స్లొవేకియాకు చేరుకున్నారు. నాజీ క్యాంపుల్లోని దారుణాలపై ఒక నివేదిక తయారుచేశారు. ఇది వెబా-వెజ్లర్ రిపోర్ట్‌గా పేరు పొందింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్ వేదికగా మీడియాకు విడుదల చేయడంతో నాజీల అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఫలితంగా గ్యాస్ చాంబర్లలో యూదుల ఊచకోతకు అడ్డుకట్ట పడింది. ఆ విధంగా వెజ్లర్-వెబా(ఆస్చ్విజ్) రిపోర్ట్ లక్షల మంది ప్రాణాలు నిలిపింది. చదవండి: నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే.. -
జర్మనీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. భిక్షాటనతో నిరసన
సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి కనిపించడంలేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్మనీలో ఉన్న రమేష్ బాబును నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన చార్జీల కోసం గురువారం వేములవాడ రాజన్న ఆలయం ముందు భిక్షాటనకు దిగారు. జర్మనీ నుంచి తమ ఎమ్మెల్యేను ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావాలని డబ్బు జమ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజా సమస్యలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గతంలోనూ రమేష్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడుటలేదంటూ పోలీసులు సైతం స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. -
ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి
న్యూఢిల్లీ: భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మెర్కెల్ శుక్రవారం మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తమ భూభాగాన్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జర్మనీ చాన్స్‌లర్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి : మోదీ నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలకు ఒక శాపంలా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రపంచదేశాలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, వారి నెట్‌వర్క్‌లను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే సంస్థలను సర్వనాశనం చేయాలన్నారు. జర్మనీ వంటి సాంకేతిక, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాల సహకారంతోనే భారత నవనిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలి : మెర్కెల్ 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మరింతగా సహకరించుకోవాలని ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. మేకిన్ ఇండియా కోసం భారత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ సర్కార్ ఎంత కష్టపడుతోందో తెలుస్తుందని ఆమె కొనియాడారు. భారత్ జర్మనీ సహకారం తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
జర్మనీలో భారతీయ జంటపై దాడి
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు. -
కంటి కదలికలు నువ్వేంటో చెప్పేస్తాయ్!
మెల్బోర్న్: కంటి కదలికలతో మన వ్యక్తిత్వాన్ని గుర్తించే కొత్త రకం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జర్మనీలోని స్టట్గార్ట్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని ఫిండర్స్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో ఈ విషయాన్ని గుర్తించారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించి కంటి కదలికలకు, వ్యక్తిత్వానికి ఉన్న సంబంధాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు. యూనివర్సిటీ పరిధిలో 42 మందికి చెందిన కంటి కదలికల్ని కొన్ని రోజులపాటు అధ్యయనం చేసి, వారికి ఒక ప్రశ్నావళిని అందించి పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ఫలితాల ప్రకారం కంటి కదలికల ద్వారా ఒకరి కలుపుగోలుతనం, ఆసక్తి, నిజాయితీ వంటి అంశాల్ని గుర్తించవచ్చు. మనిషి వ్యక్తిత్వాన్ని వివరించే లక్షణాల్లో మనస్సాక్షి, మానసిక సంబంధ విషయాలు, కలుపుగోలుతనం, అంగీకారయోగ్యం వంటి విషయాల్ని అల్గారిథమ్ సాఫ్ట్వేర్ వివరిస్తుంది. ఈ ఫలితాలు మనిషి, యంత్రాల మధ్య సంబంధాల్ని అభివృద్ధి చేసేందుకు తోడ్పడతాయని టోబియాస్ లోట్షెర్ అనే పరిశోధకుడు అన్నాడు. -
జర్మనీ కూలింది
జర్మనీ... నాలుగుసార్లు చాంపియన్... మరో నాలుగుసార్లు రన్నరప్...! ప్రపంచ కప్‌లో కాలుపెట్టిందంటే కనీసం క్వార్టర్స్ ఖాయమనే బలీయ నేపథ్యం దానిది. ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేతకు నిర్వచనం అనదగ్గ జట్టు! మరీ ముఖ్యంగా గత నాలుగు కప్‌లలో ఓసారి రన్నరప్, రెండు సార్లు మూడో స్థానం, క్రితంసారి విజేత..! ఏ ఒక్కరిపైనో ఆధారపడని స్థితిలో, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందనే అంచనాలతో అమేయ శక్తిగా ఈ కప్‌లో అడుగిడింది. ...కానీ బరిలో దిగాక అనుకున్నదంతా తలకిందులైంది! తొలి మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కి విలవిల్లాడి ఓడింది. రెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై చచ్చీ చెడి నెగ్గింది. చివరి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఏకంగా చావుదెబ్బ తిన్నది. గెలుపు మాత్రమే నాకౌట్ మెట్టెక్కించే స్థితిలో బోర్లాపడింది. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తమ జట్టు చరిత్రలోనే దారుణ పరాభవం మూటగట్టుకుంది. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది. కజన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం. ఆ మాటకొస్తే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే పెను సంచలనం. చిన్న జట్లు మాజీ చాంపియన్లను నిలువరిస్తున్న ప్రస్తుత కప్‌లో దక్షిణ కొరియా ఏకంగా జర్మనీకి జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఆటలో, చరిత్రలో, ర్యాంకులో తమకంటే ఎంతో మెరుగైన డిఫెండింగ్ చాంపియన్‌ను 2–0 తేడాతో ఓడించి టోర్నీ నుంచి తమతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. కప్‌కు ముందు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండి, మొత్తం జట్టుకు జట్టే ప్రబలంగా కనిపించిన జర్మనీ... జట్టుగానే విఫలమై తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 1938 తర్వాత గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జర్మనీకిదే తొలిసారి. గెలిస్తేనే నాకౌట్ చేరే పరిస్థితుల్లో బరిలో దిగి... చావోరేవో తేల్చుకోవాల్సిన వేళ జర్మనీ చతికిలపడింది. మ్యాచ్ రెండు భాగాల్లోనూ గోల్ చేయలేకపోయిన ఆ జట్టు... కొరియాకు (90+3వ నిమిషంలో వైజి కిమ్), (90+6వ నిమిషంలో హెచ్ఎం సన్) ఇంజ్యూరీ సమయంలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇందులో రెండో గోల్ నమోదైన తీరు జర్మనీ ఆటగాళ్ల దారుణ సమష్టి వైఫల్యానికి అద్దంపట్టింది. ఆఖరి నిమిషాలు కావడంతో కీపర్ మాన్యుయెల్ న్యూర్ సహా జర్మనీ ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి రాగా, బంతిని కొరియా ఆటగాడు బలంగా అవతలి ఏరియాలోకి కొట్టాడు. సన్... వాయువేగంతో పరిగెడుతూ దానిని అందుకుని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ సమయంలో కీపర్ న్యూర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. 2014 కప్‌లో అత్యుత్తమ కీపర్‌గా ‘గోల్డెన్ గ్లౌవ్’ అందుకున్న న్యూర్... దీన్నంతటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే సమయంలో గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్ జేవో హియాన్వూకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం విశేషం. ఊదేస్తుందనుకుంటే... ఆఖరి క్షణాల్లోన్నైనా ఫలితాన్ని తనవైపు తిప్పుకొనే జర్మనీ బలాబలాల ముందు కొరియా ఏమాత్రం సరితూగనిది. దానికి తగ్గట్లే గోర్టెజ్కా, ఓజిల్, రూయిస్, క్రూస్, ఖెదిరాల సమన్వయంతో ఆ జట్టు ఆధిపత్యంతోనే మ్యాచ్ ప్రారంభమైంది. రక్షణాత్మక శైలితో ఆడిన కొరియాకు వీరిని కాచుకోవడంతోనే సరిపోయింది. అయితే, ఫ్రీ కిక్ రూపంలో మొదటి అవకాశం దానికే దక్కింది. జంగ్ వూయంగ్ షాట్‌ను కీపర్ న్యూర్ కొంత క్లిష్టంగానే తప్పించాడు. తర్వాత కూడా జర్మనీ ఒత్తిడి పెంచింది. 40వ నిమిషంలో బాక్స్ లోపల హమ్మెల్స్కు గోల్ చాన్స్ దక్కినా... హియెన్వూ తలతో పక్కకు నెట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని ఛేదించేందుకు కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకుండా, గోల్సేమీ లేకుండానే మొదటి భాగం ముగిసింది. ఎన్నో అవకాశాలు వచ్చినా... రెండో భాగంలో ఎక్కువగా డిఫెండింగ్ చాంపియన్‌కే అవకాశాలు వచ్చాయి. మూడో నిమిషంలో గోర్టెజ్కా కొట్టిన హెడర్‌ను కీపర్ హియాన్వూ డైవ్ చేస్తూ నిరోధించాడు. గోమెజ్ దాదాపు గోల్ కొట్టినంత పనిచేశాడు. అటువైపు కొరియా కూర్పు మారుస్తూ ప్రయోగంతో పట్టు కోసం ప్రయత్నించింది. ఇరు జట్లలో ఇవేవీ ఫలించలేదు. ఇంజ్యూరీలో కుదేలు... ఇంజ్యూరీ రెండు నిమిషాలు కూడా గణాంకాలేమీ నమోదు కాకుండానే సాగింది. 90+3వ నిమిషంలో మాత్రం అద్భుతం జరిగింది. కార్నర్ నుంచి అందిన బంతిని యంగ్వాన్ షాట్ కొట్టగా నేరుగా జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి చేరిపోయింది. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు వచ్చినా వీఏఆర్‌లో కాదని తేలింది. 90+6 నిమిషంలో ఇంకో అద్భుతం చోటుచేసుకుంది. న్యూర్ సహా జట్టంతా కొరియా మిడ్ ఫీల్డ్ వద్ద ఉండగా... ఇటువైపు పడిన బంతిని ఛేదించిన సన్... గోల్ అందించడంతో వారి శిబిరం భావోద్వేగంలో మునిగిపోయింది. -
మనుషుల్లాగా నడవద్దు.. ఐతే ఏం చేయాలి..!
బెర్లిన్: జర్మనీ వాసులకు డాక్టర్లు ఓ వినూత్న ఐడియాను సూచించారు. ఇకనుంచీ జర్మనీ వాసులు మనుషుల్లాగ నడవద్దని.. పెంగ్విన్స్ తరహాలో నడవాలని డాక్టర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాగే చేయాలని లేనిపక్షంలో సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ దేశ ప్రజలను హెచ్చరించారు. అసలు విషయం ఏంటంటే.. కొన్ని అమెరికన్ దేశాలతో పాటు యూరప్‌లోనూ కొన్ని నెలలపాటు మంచు కురుస్తుంటుంది. ఈ క్రమంలో మంచుపై నడుస్తున్నప్పుడు పట్టుతప్పి జారి పడిపోయే అవకాశం ఉంది. దీనిపై స్థానిక ఓ వెబ్సైట్లో జర్మన్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రౌమా సర్జన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో జర్మనీ వాసులు మంచుపై జారిపడి 750 ఎమర్జెన్సీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాబోయే శనివారం నాటికి ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. రెండేళ్ల కింద నెలకొన్ని పరిస్థితులు మరోసారి పునరావృతం కావద్దంటే ప్రజలు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలకు బెర్లిన్ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ జనాలు ఆరోపించారు. పెంగ్విన్ పక్షుల్లా నడవాలని డాక్టర్లు సూచించారు కానీ, మనుషుల నడకకు, వాటి నడకకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఇది మనకు సాధ్యం కాదని బెర్లిన్ వాసులు అంటున్నారు. పెంగ్విన్లు ఒకేసారి గెంతుతూ వెళ్తాయని, మనం అడుగు తీసి అడుగు వేస్తాం.. ఒక్క కాలు పట్టుతప్పినా జారి పడిపోయే అవకాశం ఎక్కువని వారు వాపోతున్నారు. -
ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..!
లండన్: జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు. యూకేలోని బ్లెక్లే పార్క్ నేషనల్ కంప్యూటింగ్ మ్యూజియం వాలంటీర్లు ఆన్ లైన్ మార్కెట్ ఈ-బే లో ఈ లోరేంజ్ మేషిన్లను గుర్తించారు. ఇవి జర్మనీకి చెందిన కోడింగ్ వస్తువులని, వాటి ధర దాదాపు రూ.100గా ట్యాగ్ పెట్టినట్లు తెలిపారు. ఈ-బే లో ఓ వస్తువు కోసం తనతోటి ఉద్యోగి వెతుకుతుండగా జర్మనీకి చెందిన లోరెంజ్ టెలీ ప్రింటర్ ను గుర్తించారని మ్యూజియం వాలంటీర్ జాన్ వెట్టర్ పేర్కొన్నాడు. నాజీ పార్టీ వారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని వాడినట్లు అభిప్రాయపడ్డాడు. లోరెంజ్ ఎస్.జెడ్ 42 మెషిన్ హిట్లర్ వాడినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు 200కు పైగా ఉండేవని, ప్రస్తుతం నాలుగు మాత్రమే లభ్యమయ్యాయని చెప్పారు. అయితే ఈ టెలీప్రింటర్ల సహాయంతో జనరల్ అధికారులతో హిట్లర్ సంభాషించేవాడని, వీటి ఉనికి 1970 దశకంలో మొదటగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియాతో కథనాలు వచ్చాయి. అయితే సీక్రెట్ కోడింగ్ ద్వారా వారు రహస్యాలపై చర్చించేవారు. నాజీ పార్టీకి చెందిన ప్రముఖులకు మాత్రమే వీటి వాడకం తెలుసునని యూకే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.