లక్నోః ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చినా మహిళలపై వేధింపులు, నేరాల పర్వం కొనసాగుతూనే ఉంది. అందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తాజా నివేదికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదు నెలల్లోనే మహిళలపై వేధింపులు, అత్యాచారాలల కేసులు వేలల్లో నమోదవ్వడం అందుకు తార్కాణంగా నిలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఆగస్టు 18 వరకూ 1,012 రేప్ కేసులు నమోదైనట్లు తాజా నివేదికల్లో వెల్లడించింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్ననేరాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, మహిళలపై వేధింపుల్లో ఆ రాష్ట్రం ముందున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత ఐదు నెలల్లో వేలకొద్దీ అత్యాచార కేసులేకాక, సుమారు 4,520 వేధింపుల కేసులు, 1,386 దొంగతనాలు, 86 దోపిడీ కేసులు కూడా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వ్రాత పత్రంలో పేర్కొంది.
అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే సతీష్ మహానా అడిగిప ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక నేర విభాగాలను ఏర్పాటు చేశామని, నేరాలపై వెబ్ ఆధారంగా హాట్ స్పాట్ లను గుర్తించి పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు ఎమ్మెల్యేకు రాసిన సమాధానంలో సర్కారు వివరించింది.
ఐదు నెలల్లో 1012 రేప్ కేసులు...
Published Wed, Aug 24 2016 12:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement