బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.
‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది.
ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo
— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024
ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment