Deve Gowda
-
చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు(Chandrababu) ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమికి చైర్మన్ లేదా వైస్ చైర్మన్ అవ్వాలనుకున్నారని మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తిరస్కరించారని.. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరించలేదని దేవెగౌడ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో దేవెగౌడ మాట్లాడుతూ, ‘2014, 2019 ఎన్నికల్లో మోదీ 300కు పైగా సీట్లు సాధించారు. 2024 ఎన్నికల్లో ఆయనకు 240 సీట్లొచ్చాయి. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు దాదాపు 305 సీట్లు ఉన్నాయి. ఇది సభా వేదికపై రుజువైంది. విశ్వాస ఓటు కోరే ప్రశ్నే లేదు. ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్‌ను ప్రధాని నియమించలేదు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కూటమికి పవర్ సెంటర్‌గా చైర్పర్సన్ కూడా ఉన్నారు. కూటమి చైర్మన్ పవర్ సెంటర్‌గా ఉంటారు. కానీ.. ప్రధాని మోదీ కూటమిని నడిపించడానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదు’ అని అన్నారు.‘ఇప్పుడు 2024లో మోదీ 240 సీట్లు సాధించినప్పుడు చంద్రబాబు వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. చంద్రబాబు అన్ని ఎన్డీఏ పార్టీలు ఏర్పాటు చేసిన కూటమికి వైస్‌చైర్మన్ లేదా చైర్మన్ కావాలని కోరుకున్నారు. కానీ.. మోదీ తిరస్కరించారు. పరిపాలన ఎలా నిర్వహించాలో మోదీకి తెలుసు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోదీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడపగల మహోన్నత నాయకుడు. నేను నిజం చెబితే మీరు అంగీకరించాలి. నేను ఏదైనా అవాస్తవం చెబితే మీరు నాపై దాడి చేయవచ్చు’ అని వ్యాఖ్యానించారు.ఖండించిన నడ్డాకాగా.. దేవెగౌడ ప్రసంగం అనంతరం రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా చంద్రబాబుపై దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్డీఏలో చంద్రబాబును చైర్మన్ చేయాలన్న ఎలాంటి చర్చ జరగలేదని.. అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని నడ్డా స్పష్టం చేశారు. -
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. -
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్ 26 నాటి లోక్‌సభ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్‌డ్రైవ్ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్ సింగ్, ఖజన్ సింగ్ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ హైకోర్ట్ ‘గ్యాగ్’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు. ప్రజ్వల్ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్‌డ్రైవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్)తో పొత్తునూ, హసన్‌లో ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’
సాక్షి, బెంగుళూరు: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యం అని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. చదవండి: తెలంగాణ ఆ కుటుంబ దోపిడీకి గురవుతోంది: ప్రధాని మోదీ కాగా, ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం. -
సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని ఫోన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
సాక్షి, బెంగళూరు : బీజేపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలు ఏకమవుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ముఖ్యమంత్రులు హెచ్చరికలు పంపుతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముప్పెట దాడి చేస్తున్నారు. బీజేపీ పాలన, విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్.. సెప్టెంబరు 2019లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి రుజువు కోరిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత మాజీ ప్రధాని, హెచ్డీ దేవెగౌడ.. సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కేసీఆర్ మీకు అభినందనలు.. మీరు పెద్ద యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో మేమంతా మీకు తోడుగా ఉన్నాం. మనమంతా మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని సీఎంకు దేవెగౌడ చెప్పినట్టు తెలంగాణ సీఎం కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే, కేంద్రంపై కేసీఆర్ ఆరోపణలు చేసిన మరుసటి రోజే మాజీ ప్రధాని ఆయనకు ఫోన్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అంతకు ముందు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పడు ప్రచారం చేస్తోందన్నారు. అందుకే తాను, ప్రజలు రుజువులు అడుగున్నారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఆర్మీ జవాన్ చనిపోతే ఆ క్రెడిట్ భారత ఆర్మీకి వెళ్లాలి కానీ.. బీజేపీకి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలోనే కర్నాటకలో హిజాబ్ వివాదంపై సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హిజాబ్ వివాదాన్ని రేకెత్తించి కర్నాటకలోని మహిళలు, బాలికలను వేధిస్తూ..‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ను ‘కాశ్మీర్ వ్యాలీ’గా మార్చారని విమర్శించారు. ఇదిలా ఉండగా బీజేపీపై పోరుకు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేసీఆర్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. -
అద్భుతాలు లేవు; అంతా అనుకున్నట్టే..
సాక్షి, బెంగళూరు : అంతా ఊహించినట్టే జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు జరగలేదు. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిశాయి. ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ఆధారంగా బీజేపీ రెండు స్థానాలు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత రాజ్యసభ నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే బరిలో ఉండడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేసింది. కర్ణాటక విధానసభ ముఖ్య కార్యదర్శి విశాలాక్షి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఆదేశాలు జారీచేశారు. జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన హెచ్డీ దేవెగౌడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన జీవితంలో రెండోసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మల్లికార్జున ఖర్గే తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో అడుగుపెట్టనున్నారు. కాగా దేవెగౌడ, ఖర్గేలు గత లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన సంగతి తెలిసింది. చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం రాజ్యసభకు ఎంపికవ్వడం విశేషం. ఇక బీజేపీ నుంచి ఈరణ్ణ కడాడి, అశోక్ గస్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెళగావి జిల్లాకు చెందిన 54 ఏళ్ల ఈరణ్ణ, రాయచూరు జిల్లాకు చెందిన 55 ఏళ్ల అశోక్ గస్తీలు రాజ్యసభకు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. కాగా, వీరిరువురి పేర్లను రాజ్యసభకు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మరో వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ప్రొపొజల్ సంతకం లేని కారణంతో అతని నామినేషన్‌ను తిరస్కరించారు. చదవండి: అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్ -
కన్నీళ్లపై పేటెంట్ మాదే!
బెంగళూరు: ‘మా కుటుంబానికి కన్నీళ్లు పేటెంట్గా మారాయి’ అని మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. దేవెగౌడ కుటుంబసభ్యులను ఉద్దేశించి సదానందగౌడ ‘ఎన్నికలలో కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి కుమారస్వామి స్పందిస్తూ, ‘అవును, మా కుటుంబానికి కన్నీళ్లపై పేటెంట్ ఉంది. మాది భావోద్వేగాల జీవితం. మా హృదయాలలో నొప్పిని కన్నీళ్లు వ్యక్తీకరిస్తాయి’ అని హున్సూర్‌లో మాట్లాడుతూ చెప్పారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో, కుమారస్వామి బుధవారం కిక్కేరిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు
సాక్షి, బెంగళూరు: తాను పదవి..డబ్బులు కోసం రాజీనామా చేయలేదని నియోజక వర్గం అభివద్ధి కోసం రాజీనామా చేసిన్నట్లు కేఆర్ పేట జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు. ఆయన శనివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ‘మాజీ ప్రధాని దేవేగౌడ ఇంట్లో ఒక సిండికేట్ ఉంది. ఈ సిండికేట్‌ను ఆయన పెంచి పెద్ద చేశారు. ఒక ఎమ్మెల్యేగా అయన ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదు. చెప్పుడు మాటలను విని నన్ను వేధించారు’ అని ఆరోపించారు. ఉప ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి మండ్య: రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మూడు పార్టీల్లో ఉపఎన్నికల హడావిడి మొదలైందని, అయితే జేడీఎస్‌లో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని మాజీ మంత్రి చెలువనారాయణస్వామి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ అధినేతలు దేవేగౌడ,కుమారస్వామి కేఆర్ పేటె నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారని మిగిలిన పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఉపఎన్నికల ప్రచారాలు మొదలైన ట్లు కనిపిస్తోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సు ప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని, కోర్టు తీర్పు ఎ లా వచ్చినా ఉపఎన్నికలు జరిగేలాగానే కనిపిస్తున్నాయన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ మైత్రి కొనసాగితే తమకేమి అభ్యంతరాలు లేవన్నారు. -
‘రోడ్డు మీద కూడా పడుకోగలను’
బెంగళూరు : 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలేం అక్కర్లేదు.. అవసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి. శుక్రవారం నుంచి గ్రామాల్లో పర్యటన నిమిత్తం ‘గ్రామ వాస్తవ్య 2.0’ కార్యక్రమాన్ని యాద్గిర్ నుంచి ప్రారంభించారు కుమారస్వామి. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేయబోయే ఓ లాడ్జీలోని బాత్రూమ్ని రిన్నోవేట్ చేశారు అధికారులు. దాంతో విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం గ్రామ పర్యటన చాలా విలాసవంతంగా సాగుతుందని.. ఆయన కోసం 5 స్టార్ హోటల్ రేంజ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించాయి. ఈ విమర్శలపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఓ చిన్న బాత్రూంను నిర్మిస్తే ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నాయి. రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోతాను. ఫ్రెష్ అవడానికి చిన్న బాత్రూం ఏర్పాటు చేశారు. అది కూడా తప్పేనా. దానికే 5 స్టార్ హోటల్ రేంజ్ ఏర్పాట్లు అంటూ విమర్శించడం సరికాదు. పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. అది కూడా సాధరణ పౌరుడిలానే బస్సులో వచ్చాను. నేను ప్రయాణం చేసింది ఓల్వో బస్సు కాదు సాధరణ బస్సులో. గుడిసేలో కాదు అసరమైతే రోడ్డు మీద కూడా నిద్రపోగలను’ అన్నారు. అంతేకాక ‘మా నాన్న ప్రధానిగా ఉన్నప్పుడు రష్యాలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలేస్‌లో బస చేశాను. ఇప్పుడు అవసరమైతే రోడు మీద కూడా పడుకోగలను. జీవితంలో అన్ని రకాల ఎత్తు పల్లాలు చూశాను. ఇప్పుడు బీజేపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ కుమారస్వామి ఘాటుగా స్పందించారు. అనంతరం పల్లే యాత్రలో భాగంగా ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకోగల్గుతున్నానని.. వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కుమారస్వామి. -
కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు : సీఎం కుమారస్వామి
బెంగళూరు : కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ బాంబు పేల్చిన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను మాట్లాడింది అసెంబ్లీ ఎన్నికల గురించి కాదని, స్థానిక ఎన్నికల గురించి మాత్రమేనని స్పష్టతనిచ్చారు. తాను ఉన్నది కేవలం జేడీఎస్‌ను బలోపేతం చేసేందుకేనని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని, నాలుగేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాగా తన తనయుడు కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పెత్తనం చెలాయిస్తుందని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు కలిసి ఉంటామని చెప్పి..ప్రస్తుతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో దేవెగౌడ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ఘోర పరాభవం చెందడం, బీజేపీ ఆపరేషన్ కమలానికి తెరతీసిందంటూ వార్తలు వెలువడటంతో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ వర్గాల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఓటమిపై ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవెగౌడ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తన తండ్రి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడితే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి : నా కొడుకు సీఎం కావాలని కోరుకోలేదు : దేవేగౌడ -
‘మధ్యంతర ఎన్నికలు రావొచ్చు’
బెంగళూరు : త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తొలుత కాంగ్రెస్ తమకు ఐదేళ్ల పాటు పూర్తి మద్దతిస్తానని చెప్పిందన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల పద్దతి చూస్తూంటే.. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పేరుకే కుమారస్వామి సీఎం అని.. పెత్తనం మొత్తం కాంగ్రెస్ చేతిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలన్నింటిని జేడీఎస్ ఒప్పుకుందని తెలిపారు. వీటన్నింటిని కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. Former PM & JDS leader HD Deve Gowda in Bengaluru: There is no doubt that there will be mid-term polls. They said they will support us for 5 years but look at their behaviour now. Our people are smart. #Karnataka pic.twitter.com/OjGsy2lKYW — ANI (@ANI) June 21, 2019 సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ. అందుకే కూటమిలో భాగంగా కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని తాను కోరుకోలేదన్నారు. తన కుమారుడి బదులు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయమని రాహుల్ గాంధీని కోరానని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. అంతేకాక కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కూటమి ఏర్పాటుకు ఒప్పుకున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఆ పార్టీ ఓటమి పాలయ్యిందన్నారు దేవేగౌడ. -
మాజీ ప్రధాని ఓటమికి కాంగ్రెస్ కుట్ర..!
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్ నేతలు బీజేపీ సహరించారంటూ వస్తున్న వార్తలు కన్నడనాట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని తూమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే దెవెగౌడ ఓటమికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఎన్ రాజన్ కుట్ర పన్నారని.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది. దేవెగౌడను ఓడించడానికి బసవరాజుకు అధిక మొత్తంలో డబ్బు పంపారని, పార్టీ అంతర్గత విషయాలను బీజేపీ నేతలకు చేరవేశారని తూమకూర్ జిల్లా అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ సంచలన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు కేసీ వేణుగోపాల్‌కు ఆయన లేఖ రాశారు. రాజన్ కారణంగానే దేవెగౌడ ఓటమి చెందారని, వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్ నేతలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ మంచి ప్రభావం చూపినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో సునాయసంగా విజయం సాధించింది. జేడీఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. -
‘దేవెగౌడ, నిఖిల్ మధ్య వాగ్వాదం..’ దుమారం
బెంగళూరు : ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడపై కథనాన్ని రాసినందుకు కర్ణాటక సీనియర్ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతో సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఈ తాజా వివాదం మరింత దుమారం రేపుతోంది. జేడీఎస్ ఫిర్యాదు మేరకు కన్నడ దినపత్రిక అయిన విశ్వవాణి ప్రధాన సంపాదకుడు విశ్వేశ్వర్ భట్‌పై ఆదివారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై పరువునష్టం, ఫోర్జరీ, చీటింగ్ అభియోగాలు మోపారు. మండ్యాలో ఓటమి నేపథ్యంలో దేవెగౌడ, నిఖిల్ కుమారస్వామి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ భట్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించారు. గత శుక్రవారం మైసూరులోని ఓ హోటల్లో ఉన్న సమయంలో ఈ వాగ్వాదం జరిగిందని ఆ కథనం పేర్కొంది. మాండ్యాలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్ చేతిలో నిఖిల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాండ్యా జేడీఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటు. ఈ ఓటమితో నిఖిల్ కుంగిపోయారని, తన పెద్దనాన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందడం.. తాను ఓడిపోవడం నిఖిల్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, అంతేకాకుండా మాండ్యాలో తనకు కుటుంబం అంతగా సహకరించలేదని, దీంతో రాజకీయ కెరీర్ ఆరంభంలోనే ఓటమిపాలయ్యానని ఆయన తీవ్ర ఆవేదన చెందారని, ఒక మహిళ చేతిలో ఓడిపోవడం కూడా నిఖిల్‌ను మరింత అసహనానికి గురిచేసిందని ఆ కథనంలో భట్ పేర్కొన్నారు. అయితే, తన కొడుకు ప్రతిష్టను దెబ్బతీసి.. డబ్బు వసూలు చేసేందుకే ఈ కథనాన్ని భట్ రాశారని జేడీఎస్ ఆరోపిస్తోంది. ఈ కథనాన్ని ట్వీట్ చేసిన కుమారస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుమారస్వామి తనకు ఫోన్‌చేశారని, నిఖిల్ కూడా రెండుసార్లు ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడారని భట్ సోమవారం విలేకరులకు తెలిపారు. విశ్వవాణి పత్రిక సోమవారం నిఖిల్ వెర్షన్లో ఈ వ్యవహారంపై ఓ కథనాన్ని ప్రచురించింది. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను హరిస్తోందని, అందుకు భట్‌పై కేసు నిదర్శనమని బీజేపీ మండిపడుతోంది. -
మట్టికరిచిన మాజీ సీఎంలు
తాజా లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఊహించని రాజకీయ సునామీ సృష్టించారు. దశాబ్దాల అనుభవమున్న హేమాహేమీలైన నేతలు, మాజీ ముఖ్యమంత్రులతోపాటు, ఒక మాజీ ప్రధాని సైతం ఈ సునామీలో కొట్టుకుపోయారు. ఈ రాజకీయ విలయం ధాటికి 12 మంది మాజీ ముఖ్యమంత్రులు మట్టికరిచారు. వీరిలో ఎనిమిది మంది కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులే కావడం గమనార్హం..! ఒక ప్రధాని అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుని వరుసగా రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సంభవించింది. ఒకటి ఇందిరాగాంధీ హయాంలోదైతే.. రెండోది తాజాగా నరేంద్ర మోదీ హయాం! అదే సమయంలో ఒక ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రులు ఓడిపోవడం కూడా ఇదే ప్రథమం. దేశ రాజధాని ఢిల్లీని ఒకప్పుడు ఏలిన షీలాదీక్షిత్ ఢిల్లీ(ఈశాన్య) లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 3.16 లక్షల ఓట్ల తేడాతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మాజీ ప్రధాని, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అయిన హెచ్.డి.దేవెగౌడ తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒక్కళిగలు, లింగాయత్‌ల మధ్య సమరంగా పరిగణించిన తుముకూరు ఎన్నికల్లో 87 ఏళ్ల దేవెగౌడ పోటీ చేయడంపై తొలి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా మాండ్య, హాసన్‌ల నుంచి పోటీ చేసే గౌడ కుటుంబం ఈసారి తుముకూరుకు రావడం స్థానికులకు పెద్దగా రుచించలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ నేత ముద్దె హనుమేగౌడ నుంచి సహకారం అంతంతమాత్రమే అయింది. దీంతో దేవెగౌడ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దిగ్విజయ్ పరాజయం... మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ వివాదాస్పద బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. రాజ్గర్ నుంచి బరిలోకి దిగాలని ప్రజ్ఞా సింగ్ ఆలోచించినా.. చివరకు పార్టీ నిర్ణయం ప్రకారం భోపాల్ బరిలోకి దిగి ఏకంగా 8.6 లక్షల ఓట్లు సాధించగా.. దిగ్విజయ్‌కు మాత్రం ఐదు లక్షల ఓట్లే పడ్డాయి. మహారాష్ట్రలో ఇద్దరికి ఓటమి... మహారాష్ట్ర ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో చతికిలపడ్డారు. నాందేడ్‌లో అశోక్ చవాన్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్ రావు చికాలికర్ చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే షోలాపూర్ స్థానంలో లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి బరిలోకి దిగడంతో సంప్రదాయ ఓటర్లు చీలిపోయి అది కాస్తా బీజేపీ అభ్యర్థి సిద్దేశ్వర్ శివాచార్యకు ఉపకరించిందని అంచనా. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు 5.24 లక్షల ఓట్లు దక్కాయి. ఉత్తరాఖండ్, మేఘాలయాల మాజీ ముఖ్యమంత్రులు హరీశ్ రావత్, ముకుల్ సంగ్మాలతోపాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ చిక్కబళాపురం నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. భూపీందర్ హుడా (హరియాణా), మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), బాబూలాల్ మరాండి (జార్ఖండ్), శిబూ సోరెన్ (జార్ఖండ్)లు కూడా ఓటమిపాలైన మాజీ సీఎంల జాబితాలో ఉన్నారు. -
కర్ణాటక ఫలితాల్లో అన్నీ షాక్లే!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో షాకులపై షాక్‌లు కనిపిస్తున్నాయి. మొత్తం 28 సీట్లలో 25 సీట్లను బీజేపీ గెలుచుకోవడం ఓ షాకైతే, జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తుముకూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం మరో షాక్! బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం మరో షాక్. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న హస్సన్ నియోజక వర్గం నుంచి గెలుపొందడం షాక్ కాకపోయిన విశేషమే. దేవెగౌడ గతంలో ప్రాతినిధ్యం వహించిన తన హస్సన్ సీటును మనవడికి అప్పగించి తాను తుముకూరు నుంచి పోటీ చేయడం వల్లనే తన ఓటమి, మనవడి విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాత ఓడిపోయాడన్న వార్త తెలిసి బాధ పడుతున్న ప్రజ్వల్ రేవన్న తన సీటుకు రాజీనామా చేసి ఆ సీటును తిరిగి తాతకు అప్పగించాలని చూస్తున్నారని వార్తలు వెలువడడమూ షాకే! దేవెగౌడ మరో మనవడు నిఖిల్ కుమార స్వామి, బీజేపీ మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోవడం మరో షాక్. కాంగ్రెస్ దిగ్గజాలైన వీరప్ప మొయిలీ చిక్కబల్లాపూర్ నుంచి, మల్లిఖార్జున ఖర్గే, గుల్బర్గా నుంచి ఓడి పోవడం షాకే. గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఆది నుంచి ఆటుపోట్లతోనే నడుస్తోందని, దీన్ని చూసిన ప్రజలు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే బీజేపీని గెలిపించారని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్-జెడీఎస్ మధ్య సీట్ల పంపకాల్లో కూడా చాలా తేడాలు వచ్చాయి. ఆ తేడాలు కూడా ఈ పార్టీల ఓటమికి కారణం అయ్యాయి. సమీప భవిష్యత్తులోనే కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ తగిలే అవకాశం ఉందని, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందని, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం అతి పెద్ద షాకవుతుందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. -
తాతకు ప్రేమతో; ఈరోజే రాజీనామా చేస్తా!
బెంగళూరు : తన కోసం సీటు త్యాగం చేసిన కారణంగా తాతయ్య ఓడిపోయారంటూ మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను గెలిపించినందుకు పార్టీ శ్రేణులకు కృతఙ్ఞతలు చెప్పిన ఆయన.. దేవెగౌడ కోసం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కమలం హవాను తట్టుకుని.. దాదాపు లక్షన్నర ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. అయితే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న దేవెగౌడ ఈ స్థానాన్ని మనవడి కోసం త్యాగం చేసి.. తుముకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజ్ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో తన తాతయ్య ఓటమిపై కలత చెందిన ప్రజ్వల్ రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ..‘ పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకుల ఆశీస్సులతో గెలిచిన నేను.. రాజీనామా చేయాలని భావిస్తున్నాను. ఈ విషయంలో నాపై ఎవరి ఒత్తిడి లేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు తాతయ్యతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తా. నా స్థానంలో ఆయన హసన్ నుంచి పోటీ చేస్తారు. నన్ను గెలిపించిన ప్రజలను అగౌరవ పరచాలని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వారి తీర్పును నేను శిరసా వహిస్తున్నా. హసన్ ప్రజలకు రుణపడి ఉన్నాను. అయితే అందరూ ఒక విషయం గమనించాలి. నాది చిన్న వయస్సు(28). ఇప్పుడు కాకపోతే మరోసారైనా గెలిచి తీరతాను. కాని గౌడ గారు(87) నా కోసం సీటు త్యాగం చేశారు. అందుకు బదులుగా ప్రజలు నన్ను గెలిపించారు. సంతోషమే.. కానీ నా వల్లే తాతయ్య ఓడిపోయారన్న బాధ నన్ను వెంటాడుతోంది. అందుకే ఆయనను గెలిపించాలని హసన్ ప్రజలను కోరుతున్నా’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. కాగా జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ హసన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ పార్టీ టికెట్ ఆశించగా.. అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో హసన్‌లో జేడీఎస్ మరోసారి విజయం సాధించింది. ఇక కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా సీఎం కుమారస్వామికి ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి... బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఘోర పరాభవం పాలయ్యారు. -
వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్ పేర్కొన్నారు. 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా అంతకు ముందు దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ‘పుట్టిన రోజు సందర్భంగా 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదు. మేం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం.’ అని అన్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు. -
రిసార్టులో సీఎం, మాజీ పీఎం
సాక్షి బెంగళూరు : కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రకృతి చికిత్స కోసం ఉడుపి జిల్లాకు ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడి కాపువిన మూళూరులో ఉండే ఓ రిసార్టులో వారు ప్రకృతి వైద్యం చేయించుకుంటారు. ఈ క్రమంలో కుమారస్వామి అక్కడే ఐదు రోజులు ఉండే అవకాశం ఉంది. దేవెగౌడ తిరిగిరాకపై సమాచారం లేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత కుమారస్వామి ఆయుర్వేద వైద్యం కోసం ఓ రిసార్టులో చేరారు. అయితే కొలంబోలో బాంబుపేలుళ్లలో కొందరు జేడీఎస్ నేతలు దుర్మరణం చెందడంతో, ఆయన అర్ధాంతరంగా తిరిగి వచ్చారు. ఫలితంగా దేవెగౌడతో కలిసి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భీకర కరువు రాజ్యం ఏలుతుంటే సీఎం కుమారస్వామి విశ్రాంతి తీసుకోవడం ఏమిటని బీజేపీ నాయకుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పాలన జరగలేదని ఆరోపించారు. ఇలాంటి సమయంలో పాలన పక్కన పెట్టి రిసార్టులో విశ్రాంతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
అటు ఆల్మట్టి పెంపు.. ఇటు దేవెగౌడతో బాబు దోస్తీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే నిర్ణయం తీసుకున్న జేడీఎస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంతో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దోస్తీ చేస్తుండటంపై సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడను టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రప్పిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1996లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచి రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టిన సందర్భంలో దేవెగౌడ ప్రధానిగా ఉండటం.. ఆ సర్కార్‌లో టీడీపీ భాగస్వామి కావడాన్ని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఆ నిర్ణయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు వ్యతిరేకించి ఉంటే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లకు పెరిగేది కాదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి దేవెగౌడకు మద్దతుగా నిలిచిన రీతిలోనే.. నేడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన్ని ప్రచారానికి పిలిపించుకుంటున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టిన బాబు కృష్ణా నదిపై యూకేపీ (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)లో భాగంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచడానికి కర్ణాటక సర్కార్ 1996లో శ్రీకారం చుట్టింది. అప్పట్లో కేంద్రంలో హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం టీడీపీ భాగస్వామి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)పై అప్పట్లో దేవెగౌడ ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీని వల్ల ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు పెరుగుతుందని, ఎగువ నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి కృష్ణా వరద ప్రవాహం ఆలస్యంగా వస్తుందని.. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో తాగునీటికి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఆల్మట్టి ఎత్తు పెంపును వ్యతిరేకించాలని అప్పట్లో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులు సీఎం చంద్రబాబుకు సూచించారు. కానీ వాటిని తుంగలో తొక్కారు. ఇదే అదునుగా కర్ణాటక సర్కార్ ఆగమేఘాలపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు పెంచేసింది. 1997 వరకు జూలై మొదటి వారానికే శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే కృష్ణా వరద ప్రవాహం.. తర్వాత ఆగస్టు నెలాఖరుకు గానీ రావడం లేదు. దీని వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతంలోని రైతులు సకాలంలో నీళ్లందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అలసత్వాన్ని అస్త్రంగా చేసుకున్న కర్ణాటక సర్కార్ 1996 నుంచి 1999 వరకు.. చిత్రావతిపై పరగోడు, పెన్నాపై నాగలమడక వద్ద జలాశయం నిర్మించి ఆ రెండు నదుల ప్రవాహాన్ని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసింది. అన్యాయంపై నోరు పెగల్చని చంద్రబాబు తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.26 మీటర్ల ఎత్తుకు పెంచాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించి పనులను ఆగమేఘాలపై ప్రారంభించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేసే వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచకూడదు. ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే కర్ణాటక నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దేవెగౌడతో దోస్తీ చేస్తున్న చంద్రబాబు, ఆ స్నేహబంధం చెడిపోకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.26 అడుగులకు పెంచితే.. నీటి నిల్వ 200 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు శ్రీశైలానికి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం మరింత ఆలస్యం అవుతుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సందర్భాల్లో దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు రాష్ట్రంలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఎడారిగా మారక తప్పదు. కానీ.. ఇవేవీ చంద్రబాబుకు పట్టడం లేదని సాగునీటి రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. -
ఊపిరి పీల్చుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ
-
దేవెగౌడకు లైన్ క్లియర్
సాక్షి బెంగళూరు : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలివిడతలో జరిగే 14 నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా తుమకూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన సిట్టింగ్ ఎంపీ ఎస్పీ ముద్దహనుమేగౌడ ఎట్టకేలకు పోటీ నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్- జేడీఎస్ జత కట్టాయి. ఇందులో భాగంగా తుమకూరు స్థానాన్ని జేడీఎస్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీ అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ పెద్దలు డిప్యూటీ సీఎం పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు శుక్రవారం ఉదయం బెంగళూరులోని సంజయ్‌నగర్‌లో ఉన్న ముద్దహనుమేగౌడ నివాసానికి వెళ్లి చర్చించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి హెచ్డీ దేవెగౌడకు మద్దతుగా నిలవాలని కోరారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సూచించారు. దీంతో మైత్రి ధర్మం మేరకు దేవెగౌడ తరఫున ప్రచారం కూడా చేస్తానని ముద్దహనుమేగౌడ తెలిపారు. దేవెగౌడకు మార్గం సుగమం.. తన సొంత నియోజకవర్గం హాసన్‌ను మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు వదిలిపెట్టి మాజీ ప్రధాని దేవెగౌడ తుమకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే తుమకూరు కాంగ్రెస్ ఎంపీ ముద్దహనుమేగౌడ తనకు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ పత్రాలు సమర్పించడంతో అందరి దృష్టి తుమకూరుపై మళ్లింది. దేవెగౌడ హాసన్ వదిలి తుమకూరు రావడంతోనే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే గత గురువారం రాత్రి ముద్దహనుమేగౌడతో ఏఐసీసీ రాహుల్‌గాంధీ, మాజీ సీఎం సిద్ధరామయ్య ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారని తెలుస్తోంది. ఈక్రమం లో ముద్దహనుమేగౌడ మనసు మా ర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా తుమకూరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎన్ రాజణ్ణ కూడా పార్టీ పెద్దల సూచ న మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈమేరకు ఇద్దరు నాయకులు శుక్రవారం తుమకూరు వెళ్లి నామినేషన్ పత్రాలు వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు మార్గం సుగమమైంది. (చదవండి : (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!) -
దేవెగౌడ కీలక ప్రకటన : భావోద్వేగం
-
దేవెగౌడ కీలక ప్రకటన : భావోద్వేగం
సాక్షి,బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలోమాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ కీలక ప్రకటన చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోల తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే తన స్థానంలో హసన్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా తన మనవడు ప్రజ్వాల్ రెవన్నాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేవెగౌడ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తమ అభిమాన నాయకున్ని అలా చూసిన జేడిఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కంటనీరు పెట్టుకున్నారు. హెలెన్సర్పూర్ తాలుకా ముదలహిప్పి గ్రామంలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా తన మనవడిని ఆశీర్వదించాలని హసన్ నుంచి ఎంపీగా ఉన్న దేవెగౌడ కోరారు. ఇప్పటికి తాను చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఇపుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే మాత్రం కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ సమయంలో పక్కనే వున్న మనువడు ప్రజ్వల్ ఆయన కన్నీటిని తుడిచి ఓదార్చాడం గమనార్హం. మరో మనవడు నిఖిల్ (సీఎం కుమారస్వామి కుమారుడు)ని సైతం దేవెగౌడ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిఖిల్‌కు టికెట్ కేటాయిస్తారని సమాచారం. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జేడీఎస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హసన్‌లో ప్రజ్వల్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఏ.మంజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం. కాగా దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకులు, కురువృద్ధులు ఎన్నికల బరినుంచి తప్పుకుంటుండగా, వారి వారసులు రంగంలోకి దిగడం కీలక పరిణామం. ముఖ్యంగా నిన్నగాక మొన్న తన కుటుంబంనుంచి మనువడు (మూడవతరం) పోటీచేస్తారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించారు. తాజాగా దేవేగౌడ్ మనువడు, కర్నాటక మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
బాత్రూమ్లో జారిపడిన హెచ్డీ దేవెగౌడ
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బాత్రూమ్లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు. -
నేడే విపక్ష మహా ప్రదర్శన
కోల్‌కతా: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏయేతర పక్షాలను సంఘటితపరచడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ‘ఐక్య విపక్ష ర్యాలీ’ పేరిట శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీల అధినేతలే స్వయంగా ఈ ర్యాలీకి హాజరవుతోంటే, మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(ఎస్పీ), స్టాలిన్(డీఎంకే), కుమార స్వామి, దేవెగౌడ(జేడీఎస్), కేజ్రీవాల్(ఆప్) ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), శరద్‌పవార్(ఎన్సీపీ), చంద్రబాబు(టీడీపీ), తేజస్వి యాదవ్(ఆర్జేడీ), మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, దళితనేత జిగ్నేశ్ మేవానిసహా 20 పార్టీల నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గైర్హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకులు ఖర్గే, బీఎస్పీ తరఫున సతీశ్ మిశ్రా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న టీఆర్ఎస్, బిజూ జనతా దళ్(బీజేడీ) నుంచి ఎవరూ హాజరుకావడం లేదు. వామపక్ష పార్టీలు ర్యాలీలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాయి. కాగా, కోల్‌కతా ర్యాలీని బీజేపీ ఎగతాళి చేసింది. విపక్ష కూటమి తొలుత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని, ఆ తరువాతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం గురించి ఆలోచించాలని హితవు పలికింది. లక్షలాదిగా వస్తున్న టీఎంసీ కార్యకర్తలు కోల్‌కతా విపక్ష ర్యాలీకి తృణమూల్ కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. బహిరంగ సభలకు సంబంధించి పాత రికార్డులను బద్దలుకొట్టేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. శుక్రవారం నాటికే రాష్ట్రం నలుమూలల నుంచి రైలు, రోడ్డు, జల మార్గాల ద్వారా సుమారు 5 లక్షల మంది కోల్‌కతాకు చేరుకున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను పార్టీ నాయకులే ఏర్పాటుచేస్తున్నారు. ర్యాలీకి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో మొత్తం ఐదు పెద్ద వేదికలను సిద్ధం చేశారు. 3000 మంది వలంటీర్లను నియమించారు. సభా ప్రాంగణంలో రెండ్రోజుల ముందే ఎల్ఈడీ లైట్లు, బారికేడ్లు, తోరణాలు పెద్ద సంఖ్యలో అమర్చారు. మమతా బెనర్జీ బలం చాటేందుకేనా? లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీ రాజకీయాల్లో మమతా బెనర్జీని తిరుగులేని నాయకురాలిగా చూపేందుకు ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ యోచిస్తోంది. ‘దేశంలోని ప్రముఖ విపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరనేది కాదనలేని సత్యం. బీజేపీ వ్యతిరేక పోరులో ఇతర పార్టీలను ఆమె కలుపుకుపోగలరు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే’ అని తృణమూల్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఆమె నేతృత్వంలోనే ఏర్పడాలని ర్యాలీ ప్రచార సమయంలో ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కోల్‌కతాలో విపక్షాల భారీ ర్యాలీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘విపక్షాల ఐక్యతా ప్రదర్శన ర్యాలీ విషయంలో మమతా దీదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా మనం ఐక్యభారతానికి సంబంధించి గట్టి సందేశం ఇస్తామని ఆశిస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. -
టీటీడీలో ప్రొటోకాల్ వివాదం
సాక్షి, చిత్తూరు: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి అవమానం జరిగిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడగా.. ఆయనకు తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో ఓవీ రమణ తనను అవమానించారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఓవీ రమణ.. మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. అయితే, దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి జరిగిన అవమానంపై ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లేఖ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారంలోపు టీటీడీ స్పందించకుంటే జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఓవీ రమణ ఆరోపించారు. -
మాజీ ప్రధాని అంటే లెక్కలేదా?
సాక్షి, తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్తిగా లెక్కలేనితనంతో వ్యవహరించిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. దేవెగౌడ విషయంలో టీటీడీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి తిరుమలకు వచ్చిన సందర్భంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ చనువు కారణంగా అతిపెత్తనం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి, కర్ణాటక సీఎంకు జరగాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు జరగలేదన్నారు. పారిశ్రామికవేత్తలు, తమకు కావాల్సిన వారైతే తిరుమల జేఈవో స్వాగతం పలుకుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై జేఈవోతో మాట్లాడాలని మాజీ ప్రధాని ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి అతిథులుగా వచ్చినవారిని అవమానించడం తగదన్నారు. స్థానిక పోలీసు ఎస్కార్ట్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తప్పుపట్టారు. 86 ఏళ్ల మాజీ ప్రధానిని శ్రీవారి హుండీ దగ్గరే వదలి వెళ్లడం భద్రత లోపానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధానిగా దేవెగౌడ తిరుమలకు వచ్చిన ప్రతిసారి అధికారులు స్వాగతం పలకకుండా నిర్లక్ష్యం చేయడం పద్ధతి కాదన్నారు. -
ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు
సాక్షి బెంగళూరు/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకమై కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి దేశ వ్యాప్తంగా వివిధ పార్టీ నేతలను కలుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అయ్యారు. చర్చల అనంతరం వారితో కలసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను విధ్వంసం కాకుండా కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకంకావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1996లో కాంగ్రెస్ బయటనుంచి మద్దతివ్వగా థర్డ్ ఫ్రంట్ అభ్యర్థిగా దేవెగౌడ ప్రధాని పగ్గాలు చేపట్టారని, అలాంటి ప్రయోగం తర్వాత చేయలేదన్నారు. ప్రధాని అభ్యర్థిని అంతా కలసి నిర్ణయిస్తామన్నారు. అయితే 1996 మోడల్లా ప్రధాని ఉంటారా? అన్న ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అంతాకలసి ఒక అభిప్రాయానికి వస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రధాన, పెద్ద పార్టీ అన్నారు. సీబీఐ, ఐటీ శాఖలతో దాడులు చేయిస్తూ ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, విపక్షాలను నియంత్రించాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి దాడులు పలు రాష్ట్రాల్లో జరిగాయన్నారు. ఈ విధంగా దాడులు జరుగుతున్నా ప్రధాని మోదీ నోరు తెరవడంలేదని, ఎటువంటి ప్రకటన చేయడంలేదని విమర్శించారు. నోట్ల రద్దు ఓ విఫలప్రయోగమన్నారు. రోజురోజుకూ పెట్రో ధరలు పెరిగిపోతున్నాయని, రూపాయి బలహీనపడుతోందని చెప్పారు. తాను ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం, అఖిలేశ్ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా తదితరులతో భేటీ అయి బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని కోరినట్లు చెప్పారు. విపక్షాలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యం.. దేవెగౌడ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ కలసిరావాలన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓడినట్లే దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టి అంతా విపక్షాలను ఏకతాటిపైకి తేవడమేనన్నారు. 1996లో కూడా చంద్రబాబుతో కలిసి పని చేశామని, అలాగే 2019లో కూడా కలుస్తామన్నారు. 1996 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. డిసెంబర్‌లోగానీ, జనవరిలోగానీ భారీ స్థాయిలో రైతుల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తామని తెలిపారు. నేడు చెన్నైకి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చెన్నైకి రానున్నారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ఇక్కడ భేటీ కానున్నారు. -
కేంద్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం: దేవెగౌడ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. ముందు నుంచీ ఆ పార్టీ దళితుల హక్కులు కాలరాసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపు నిరోధక చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచేందుకు బీజేపీ మొదటినుంచీ ప్రయత్నాలు సాగించిందన్నారు. అందులో భాగంగానే చట్టంలోని నిబంధనలను సుప్రీంకోర్టు సడలిస్తూ తీర్పు ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే దేశవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ వెనక్కు తగ్గిందన్నారు. వర్గీకరణకు నా మద్దతు.. సామాజిక న్యాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని దేవేగౌడ స్పష్టం చేశారు. బుధవారం రాంలీలా మైదానంలో తలపెట్టిన సింహగర్జన దీక్షను పార్లమెంట్ స్ట్రీట్‌కు మార్చినట్టు సమితి చైర్మన్ మందకృష్ణ, కన్వీనర్ దయాకర్ తెలిపారు. -
తిరుపతి టికెట్.. రంగంలోకి కుమారస్వామి
తిరుపతి తుడా: కర్ణాటక జేడీఎస్‌తో సత్సంబంధాల నేపథ్యం తిరుపతి టీడీపీలో చిచ్చు రేపింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్ రమణకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీలోని ఆశావహుల్లో గుబులు మొదలైంది. పార్టీ అధిష్టానంపై వీరంతా గుర్రుగా ఉన్నారు. జేడీఎస్ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి టీడీపీలో ఇప్పటికే నాలుగు గ్రూపులున్నాయి. వీరంతా ఎవరికి వారే టికెట్టు తమకంటే తమకు అని ప్రచారం చేసుకుంటున్నారు. పరస్పరం బురదజల్లుకుంటూ ఫిర్యాదులు చేసుకుంటుండడంతో అధిష్టానం తల పట్టుకుంటోంది. జేడీఎస్ తరఫున ఓవీ రమణను టీడీపీలో చేర్చుకుంటే తామంతా మూకుమ్మడిగా పార్టీకి దూరంగా ఉంటామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. రమణపై టీడీపీలోని రెండు వర్గాలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తిరుపతికి ఆయన చేసిందేమీ ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గంతో పాటు ఇటీవల గల్లా అరుణకుమారి అండతో తిరుపతి అసెంబ్లీ టికెట్టు తనదేనని ప్రచారం చేసుకుంటున్న ఓ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీలో చేరితే తమ సంగతేంటని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వ్యతిరేకిస్తున్న ఆశావహులు.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణ ద్వారా రాజకీయం నడుపుతున్నారు. పార్టీ అధిష్టానంతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా తుడా చైర్మన్ ఎమ్మెల్యే సీటుకు తన పేరును ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండతో తిరుపతిలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఓ నేత సామాజిక ప్రతిపాదికన తనకే సీటు దక్కుతుందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా వీరు నాలుగు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా, ఫిర్యాదులతో బిజీగా ఉన్నారు. ఓవీ రమణ విషయంలో చంద్రబాబునాయుడు తీరుతో ఇప్పటికే ఆ పార్టీకి కొన్ని బలమైన సామాజిక వర్గాలు దూరమవ్వడంతో టికెట్టును ఆశించిన ఇద్దరు వెనుకడుగేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో టీడీపీ గెలవడం అంత సులభం కాదని కొందరు ఆశావహులు ఇప్పటికే గుర్తించారు. విపక్షం వైఎస్సార్సీపీ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతూ పలు సామాజిక వర్గాలకు మరింత సన్ని హితం కావడం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది. దీంతో మేయర్ గానీ, నామినేటెడ్ పదవి ఇస్తే చాలని ఇద్దరు ఆశావహులు పార్టీలోని సీనియర్ల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన నేప«థ్యంలో టీడీపీలో చేర్చుతున్నట్టు కుమారస్వామి చేత ప్రకటించుకునేలా రమణ పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. -
ప్రాంతీయ పార్టీలే కీలకం
సాక్షి, హైదరాబాద్ : ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాజీ ప్రధాని, జేడీయూ అధినేత హెచ్డీ దేవెగౌడ జాతీయ రాజకీయాలపై సమాలోచనలు జరిపారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి మనుమడి వివాహానికి దేవెగౌడ హాజరయ్యారు. అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమాఖ్య కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సమాఖ్య కూటమి ఏర్పాటుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఎక్కడా ఎదుగుదల కనిపించడం లేదని, బీజేపీకి సైతం సానుకూల పరిస్థితులేమీ లేవని ఇరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య కూటమి ఏర్పాటు చర్యల్లో భాగంగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలను కలవాలని ఇరువురు నిర్ణయించారు. తెలంగాణలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు బాగున్నాయని దేవెగౌడ ప్రశంసించినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో మంత్రి కె.తారకరామారావు, మేయర్ బొంతు రామ్మోహన్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. దేవెగౌడను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరంబేగంపేట విమానాశ్రయం నుంచి దేవెగౌడ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. -
హెచ్డీ దేవేగౌడతో కేసీఆర్ కీలక భేటీ
-
మాజీ ప్రధానితో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు విచ్చేసిన దేవేగౌడ ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త కూటమి ఏర్పాటులో సహకారం అందించాల్సిందిగా మాజీ ప్రధాని దేవేగౌడను కేసీఆర్ కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా దేవేగౌడకు సీఎం కేసీఆర్ కాకతీయ కళాతోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ సంతోష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే తన ఎజెండాగా ఇటీవల బెంగళూరుకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, కర్ణాటక ప్రస్తుత సీఎం హెచ్డీ కుమారస్వామితో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలతో వేదికను పంచుకోవడం ఇష్టం లేని కారణంగా సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఒకరోజు ముందుగానే వెళ్లి ఆయనకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై అంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. -
నేడు హైదరాబాద్ రానున్న దేవెగౌడ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భనవ్‌కు వెళ్లి దేవెగౌడ సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. -
ప్లీజ్ నా దగ్గరకు రావొద్దు.. సీఎం వద్దకు వెళ్లండి
బొమ్మనహళ్లి : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రిగా ఉన్న జి.టి. దేవెగౌడ ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులు ఎవరు తన వద్దకు రావొద్దని ఏమైనా పనులు, ఫైళ్లు ఉంటే ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్లాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖకు చెందిన ఐఏఎస్ అధికారులు వచ్చి ఫైళ్లను మంత్రి జీటీ దేవేగౌడకు చూపించడానికి యత్నించగా ఆయన వారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్లీజ్ దయచేసి నా వద్దకు రావద్దండి, ఫైళ్లు ఏవైనా ఉంటే మీరు నేరుగా సీఎంకు చూపించండి.. ఆయన చూస్తారు అంటూ విన్నవిస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. తాను పెద్దగా చదువుకోలేదని, ఈ శాఖను నిర్వహించలేనని జీటీ దేవెగౌడ అసంతృప్తిగా ఉన్నారు. -
దేవెగౌడను సవాల్ చేసే దమ్ముందా...!?
సాక్షి, బెంగళూరు : కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన సవాల్‌ను స్వీరించిన ప్రధాని మోదీ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు మరికొంత మందిని చాలెంజ్ చేశారు. అయితే మోదీ సవాల్‌కు కుమారస్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని, తన రాష్ట్రం ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని బదులిచ్చాడు. అయితే ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామిని కాకుండా ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను మోదీ సవాలు చేయాల్సిందంటూ జేడీఎస్ మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవెగౌడ చేస్తున్న కసరత్తులు అలాంటివి మరి. మోదీ ఫిట్నెస్ వీడియోపై మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ చేస్తున్న కసరత్తులు చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. 86 ఏళ్ల వయస్సులోనూ కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవెగౌడ అందరికీ ఆదర్శమంటూ కితాబు ఇస్తున్నారు. బెంగళూరులోని తన నివాసంలో జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న దేవెగౌడ ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్‌ని కూడా నియమించుకున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘తక్కువగా మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, తక్కువగా నిద్రపోవడం, వేకువజామునే నిద్రలేచి వ్యాయామం చేయడం.. అన్నింటికీ మించి దురాశ లేకుండా ఉండడమే తన ఆరోగ్య రహస్యమని దేవెగౌడ చెప్పారు. మరి ప్రధాని మోదీ ఫిట్నెస్ వీడియోపై అభిప్రాయమేమిటని అడగ్గా చిరునవ్వు చిందించారు. దేవెగౌడ ఫిట్నెస్ ట్రైనర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఉదయాన్నే నిద్రలేవగానే దేవెగౌడ గంటపాటు ట్రెడ్మీల్పై నడుస్తారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్‌తో మరెన్నో కఠినమైన ఎక్సర్సైజులు’ చేస్తారని తెలిపారు. -
అది కాంగ్రెస్ నిర్ణయం : దేవెగౌడ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అస్పష్ట తీర్పు వెలువడగానే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ప్రతిపాదించానని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చెప్పారు. కుమారస్వామిని సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీయే ఒత్తిడి చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లతో.. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి..తాము మద్దతిస్తామని స్పష్టం చేశానన్నారు. అయితే కుమారస్వామిని కర్ణాటక సీఎం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంగా వారు చెప్పారన్నారు. రైతులకు ఊరట కల్పించే అంశం సహా సంకీర్ణ సర్కార్‌ను నడపడంకష్టమేనని దేవెగౌడ చెప్పుకొచ్చారు. కేవలం 37 మంది ఎంఎల్ఏలతో తాము మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుంటే సర్కార్ సాఫీగా నడవడం సాధ్యం కాదన్నారు. కుమారస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఉంటారని, 6.5 కోట్ల కన్నడిగుల ఆకాంక్షలతో కాదని అన్నారు. పరిస్థితులకు లోబడిన వ్యక్తిగా కుమారస్వామిని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వస్తే రూ 53,000 కోట్ల రైతు రుణాలను 24 గంటల్లో మాఫీ చేస్తానని కుమారస్వామి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంకీర్ణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ హామీ అమలుకు ఆయన మరికొంత సమయం కోరుతున్నారు. -
ఒక దేవెగౌడ రెండు సందర్భాలు
విధి విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయమనడంపై కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ గొంతు చించుకుని అరుస్తున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్టున్నారు. అలాగే మెజారిటీ లేకున్నా, సక్రమ పద్ధతుల్లో మెజారిటీ లభించే ఆస్కారమే లేకుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ నేత యడ్యూరప్ప సమాయాత్తమౌతున్నారు. ఇలాగే గతంలో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజ్‌పేయిని యడ్యూరప్ప మరచిపోయినట్టున్నారు. విచిత్రం ఏమిటంటే రెండు సందర్భాల్లోనూ దేవెగౌడ పాత్ర ఉండడం. గవర్నర్ సిఫార్సుతో గుజరాత్ సీఎం మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు మరోసారి తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా-పారిఖ్ వర్గం సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బీజేపీ సర్కారు మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు సభను నడిపించిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా-పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలలకు దారితీసింది. అసెంబ్లీలో కనీవినీ ఎరగని స్థాయిలో రభస కారణంగా బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ కృష్ణపాల్సింగ్ను కలిసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు రాజ్యాంగబద్ధంగా, సజావుగా సాగే పరిస్థితి లేదనీ, ఓటింగ్ నిర్వహణ అసాధ్యమని చెబుతూ మెహతా ప్రభుత్వం రద్దుకు గవర్నర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడిన అప్పటి దేవెగౌడ ప్రభుత్వం గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు. ఇప్పుడు అదే దేవెవగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. చివరికి అసెంబ్లీలో అతి పెద్ద పక్షమైన బీజేపీకే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వజూభాయ్ ఇచ్చారు. మెజారిటీ నిరూపించుకోలేక వాజ్‌పేయి రాజీనామా! కర్ణాటక అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ బీజేపీ(104 సీట్లు) నేత బీఎస్ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించినట్టే 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల నాటి పాలకపక్షమైన కాంగ్రెస్ 140 స్థానాలకు పరిమితం కాగా, ఒకప్పటి (1989-90) పాలకపక్షం జనతాదళ్ 46 సీట్లు సాధించింది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీరాని పక్షంలో అతి పెద్దపక్షాన్నే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలన్న పూర్వ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ నెలకొల్పిన సంప్రదాయాన్ని శర్మ అనుసరిస్తూ మెజారిటీ సభ్యుల మద్దతు లేకున్నా వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఆయనతో ప్రధానిగా ప్రమాణం చేయించారు. మెజారిటీ నిరూపణకు వాజ్‌పేయి సర్కారు లోక్‌సభలో విశ్వాసతీర్మానం ప్రవేశపెట్టగా దానిపై చర్చ కూడా మొదలైంది. అయితే, కనీస మెజారిటీకి అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా మెజారిటీ నిరూపణకు గడువు సమీపించడంతో విశ్వాస తీర్మానంపై చర్చకు జవాబుగా ప్రధాని హోదాలో వాజ్‌పేయి ఆవేశపూరితంగా ప్రసంగించాక పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించలేదు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే తన ‘లౌకిక’ లక్ష్యంతో జనతాదళ్ నాయకత్వాన యునైటెడ్ ఫ్రంట్(యూఎఫ్) ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంగీకరించింది. జాతీయపక్షం ముఖ్యమంత్రి దేవెగౌడను వరించిన ప్రధాని పదవి! జనతాదళ్‌కు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ దేవెగౌడను ఎట్టకేలకు ఒప్పించడంతో ఆయన జనతాదళ్, యూఎఫ్ నేతగా ఎన్నికయ్యారు. జనతాదళ్ సాధించిన 46 సీట్లలో 16 కర్ణాటకలో గెలిచినవే. ఏడాదిన్నరగా ఉన్న సీఎం పదవికి రాజీనామా చేసి, తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని రాష్ట్రపతి శర్మకు తెలిపారు. బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎంతో కూడిన వామపక్షాల మద్దతు ఉన్న కారణంగా దేవెగౌడతో మైనారిటీ ప్రభుత్వ ప్రధానిగా శర్మ ప్రమాణం చేయించారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కన్నడ పోల్: ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు
-
అధికారంలోకి వచ్చేది జేడీఎస్ పార్టీనే
మైసూరు : కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జేడీఎస్ పార్టీయేనన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు ప్రైవేటు సంస్థలకు డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఎన్నికల సమీక్షలను చేయించి వాటిని విడుదల చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీల తరహాలో రోడ్‌షోలు, ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు పంచడానికి కూడా తమవద్ద డబ్బులు లేవన్నారు. సీఎం సిద్దరామయ్య,ఎంపీ శ్రీరాములు వంటి హేమాహేమీలు బరిలో దిగనున్న బాదామి నియోజకవర్గంలో తమ పార్టీ తరపున ఓ సామాన్య కార్యకర్తను బరిలో దింపామన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో ఓటర్లకు పంచడానికి తమ వద్ద డబ్బులు లేవన్నారు.హై–క, ముంబయి–కర్ణాటక ప్రాంతాల్లో జేడీఎస్‌కు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లో ఉన్నాం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పది నుంచి 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, వారిని జేడీఎస్‌లో ఆహ్వానించడానికి ఇప్పటికే ఆయా అభ్యర్థులతో మంతనాలు కూడా జరిపామన్నారు. సోమవారం తాము విడుదల చేసిన మేనిఫెస్టో పేదలు, మహిళలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అభ్యర్థుల తరపున ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదని అందుకే సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున బరిలో దిగనున్న జీటీ.దేవేగౌడ తరపున కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లేదన్నారు. వరుణ,కే.ఆర్ నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. -
బీజేపీ గెలిస్తే.. సూసైడ్ చేసుకుంటా అన్నాడు!
సాక్షి, బెంగళూరు: జనతాదళ్ సెక్యూలర్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌ను రక్షిస్తుందని, బీజేపీపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని జేడీఎస్ నేతలను మోదీ విమర్శించారు. తమకూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. గతంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తాను కర్ణాటకకు వచ్చినప్పుడు.. ‘మోదీ గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేవెగౌడ, ఆయన పార్టీ జేడీఎస్ నేతల చర్యలు ఎప్పుడూ కాంగ్రెస్‌ను రక్షించేవిగా, బీజేపీని అడ్డుకునేవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దేవెగౌడపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, ఆయన 100 ఏళ్లు ప్రజలకు సేవ చేసుకుంటూ జీవించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ను విజయం వరించదని ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయని ఆరోపించారు. తెరవెనుక ఏం జరుగుతుందో కర్ణాటక ప్రజలకు తెలుసునని, ఈ ఎన్నికల్లో బీజేపీనే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారం రోజుల్లోనే మోదీ యూటర్న్.. ఇటీవల ఉడిపిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ ప్రధాని దేవెగౌడపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ వారం రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. కన్నడ వ్యక్తి ప్రధాని కావడం గర్వకారణమని, దేవెగౌడ ఆ ఘనత సాధించారని ఇటీవల కొనియాడారు. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. జేడీఎస్ లాంటి పార్టీకి మద్దతు తెలిపి మీ ఓటును వృథా చేసుకోవద్దంటూ కర్ణాటక ప్రజలకు తాజాగా మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మార్పు కోరుకుంటే బీజేపీకి ఓటువేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. -
‘కన్నడిగులను సిద్దరామయ్య అవమానించారు’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సీఎం సిద్దరామయ్యకు అర్థం కాలేదంటూ జనతాదళ్ (సెక్యూలర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మండిపడ్డారు. ఓ దక్షిణాది వ్యక్తి సీఎం అయ్యారని ప్రధాని ప్రశంసించారని, అంత మాత్రాన బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కన్నడ వ్యక్తి ప్రధాని కావడం దక్షిణాది వారికి ఎంతో గౌరవమంటూ దేవెగౌడను ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. వంశపారం పర్యంగా అధికారం కట్టబెట్టే యత్నం చేస్తూ తాను (దేవెగౌడ) రాజకీయాలను నాశనం చేస్తున్నారంటూ సిద్దరామయ్య విమర్శలు చేసి జాతీయ స్థాయిలో కన్నడిగుల పరువు, మర్యాదలు మంటకలిపారంటూ ధ్వజమెత్తారు. సిద్దరామయ్య కూమారుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన అంత తీవ్ర వ్యాఖ్యలు ఎలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ మాజీ ప్రధాని దేవెగౌడపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తోందని, దేవెగౌడను తాను గౌరవిస్తానని మంగళవారం ఓ ర్యాలీలో మోదీ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలకు జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడనే కారణమని భావిస్తోన్న సీఎం సిద్దరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయగా దుమారాం రేగుతోంది. -
కర్ణాటక ఎన్నికలు : దేవెగౌడకే పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వివిధ పోల్ సర్వేలు మాత్రం ఇప్పటికీ కర్ణాటకలో హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెబుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 95 సీట్లు, బీజేపీకి 85 నుంచి 90 సీట్లు వస్తాయని ఆ సర్వేలు సూచిస్తున్నాయి. 224 సీట్లు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌కు 35 నుంచి 40 సీట్లు వస్తాయని పోల్ సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దేవెగౌడ మద్దతు తప్పనిసరి. ఈ రెండు పార్టీలతోని విడివిడిగా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర జేడీఎస్‌కు ఉంది. కనుక ఏ పార్టీకైనా అది మద్దతు ఇవ్వొచ్చు. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిగా ముద్రపడిన దేవెగౌడ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సముఖంగా ఉన్నారని, ఆయన కుమారుడు కుమారస్వామి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 2004లో దేవెగౌడ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రాష్ట్రంలో ధరమ్ సింగ్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించారు. రెండేళ్ల అనంతరం అంటే, 2006లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకొని బీజేపీ మద్దతుతో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటకలో బలమైన వర్గమైన ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడకు ప్రజల్లో ఇప్పటికీ మంచి ఆదరణే ఉంది. రాష్ట్రంలో ఒక్కలిగలు 12 శాతం మంది ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఈసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 శాతం ఉన్న దళితులు బీజేపీని వ్యతిరేకిస్తున్నందున ఈ సారి తమ కూటమికే ఓటు వేస్తారని పోల్ అంచనాలకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన భావిస్తున్నారు. 1994లో వచ్చినట్లుగా 113 సీట్లు తమ పార్టీకి వచ్చినా రావచ్చని దేవెగౌడ అనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లింల ఓట్లు దేవెగౌడకు పడకుండా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రంగప్రవేశం చేశారు. ఆయనే ఇక్కడే తిష్టవేసి ముస్లిం ఓట్లను సమీకరిస్తున్నారు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో లాభపడుతుంది. ఇక దేవెగౌడతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీఎస్పీ చీఫ్ మాయావతి పత్తా లేరు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిగానీ, డిప్యూటి ముఖ్యమంత్రి పదవిగానీ దక్కదు. అదే బీజేపీకి మద్దతిస్తే కుమారస్వామీకి డిప్యూటీ సీఎం ఖాయం. పోల్ అంచనాలకు మించి సీట్లు వస్తే సీఎం పదవి కూడా దక్కే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బీజేపీ ప్రధాన వ్యూహం. అప్పుడు బీజేపీ దేవెగౌడకు బదులుగా కుమారస్వామి వైపే మొగ్గు చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవెగౌడకు అన్ని విధాలుగా ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షే! -
కేసీఆర్ పథకాలు అద్భుతం: దేవెగౌడ
-
మధ్యాహ్నం దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ
-
దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్
సాక్షి, బెంగళూరు : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో భేటీ అయ్యారు. దేవెగౌడ నివాసం అమోఘలో జరిగిన ఈ సమావేశంలో సినీనటుడు ప్రకాశ్ రాజ్, ఎంపీ వినోద్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కేసీఆర్ ఈ సందర్భంగా దేవెగౌడతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో దేశ రాజకీయాలు చర్చించడం సంతోషంగా ఉందన్నారు. కుమారస్వామితో కలిసి దేశ రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇక జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న కేసీఆర్.. ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. దేవగౌడతో భేటీ అనంతరం ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. -
నేడు బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజ కీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై అంశాలపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరు బయలుదేరనున్నారు. ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలు వెళ్లనున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వేచి చూడాలనుకున్నా.. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కోల్‌కతాకు వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. తాజాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. ఫ్రంట్ కార్యాచరణపై కొంత వేచి చూడాలని తొలుత కేసీఆర్ భావించారు. కానీ ఈ వ్యూహాన్ని మార్చుకున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించడం ద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బలాన్ని చేకూర్చవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్(ఎస్) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్)కు మద్దతును ప్రకటించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బెంగళూరు పర్యటన పెట్టుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక పర్యటన అనంతరం కేసీఆర్ ఒడిశా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ది దూరదృష్టి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ఆయనకు స్పష్టత ఉంది’’అని యోగగురు బాబా రాందేవ్ ప్రశంసించారు. ఆర్థికరంగంపై కూడా కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని ప్రశంసిస్తూ గురువారం ట్వీట్ చేశారు. అంతకు ముందు గురువారం ప్రగతిభవన్‌లో సీఎంతో బాబారాందేవ్ భేటీ అయ్యా రు. ఆయనకు ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. -
మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్న కేసీఆర్
-
రేపు బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై దేవెగౌడతో చర్చించిన అనంతరం రేపు సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి
మైసూరు: కన్నడ భాష, నేల, నీటి విషయాల్లో పార్టీలకు అతీతంగా పోరడడానికి తాము ఎల్లపుడూ సిద్ధంగానే ఉన్నామని నదీ జలాల పంపిణీ వివాదంలో తమపై విమర్శలు చేసేటపుడు సీఎం సిద్దరామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. నీటి వివాదాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తుండిపోయామంటూ సీఎం సిద్దరామయ్య తమపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. కావేని నదీ జలాల పంపిణీ విషయంలో సీఎం సిద్దరామయ్య కోరిన ప్రతీసారీ రాష్ట్రం తరపున ఉద్యమాల్లో పాల్గొన్నామన్నారు. తాజాగా జరుగుతున్న మహదాయి నదీ జలాల పంపిణీ వివాదంపై కూడా పార్టీలకు అతీతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కోరితే మహదాయిపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నారు. తమపై విమర్శలు చేసే సమయంలో సీఎం సిద్దరామయ్య స్థితప్రగ్ఞతో వ్యవహరించాలని ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు విమర్శలు, ఆరోపణలు మానేసి నదీ జలాల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.తమపై విమర్శలు చేసే ముందు తాము కృష్ణ నది జలాలపై కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా పథకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇక గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో హాసన్ రైల్వేస్టేషన్ గురించి చర్చించడానికి మాత్రమే సమావేశమయ్యామని సమావేశంలో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగపట్టణం, మళవళ్లి, శ్రీరంగంలలో ఉన్న ఆదిరంగ, మధ్య రంగ, అంత్యరంగ దేవాలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
‘రోడ్డు పేరు మార్పు’ పై మాజీ ప్రధాని లేఖ
మంగళూరు: కర్ణాటకలో ‘రోడ్డు పేరు మార్పు’ వివాదంపై మాజీ ప్రధాని దేవేగౌడ.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మంగళూరు పట్టణంలోని ఓ రోడ్డుకు విజయా బ్యాంక్ మాజీ చైర్మన్, దివంగత సుందర్ రామ్శెట్టి పేరును ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. మంగళూరులోని అంబేద్కర్ సర్కిల్ నుంచి క్యాథలిక్ క్లబ్ వరకు ఉన్న లైట్ హౌజ్ హిల్ రోడ్డు ను ‘సుందర్ రామ్ శెట్టి మార్గ్’ గా మార్చవద్దంటూ ఆ వర్గాలు నిరసనలు చేపట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం పేరు మార్పు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాశారు. ‘అన్ని వర్గాల పురోగతి కోసం పాటుపడిన ఆయన(సుందర్ శెట్టి) విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పేరు వెనక్కి తీసుకోలన్న మీ(ప్రభుత్వ) నిర్ణయం ఆయన్ని అవమానించినట్లే అవుతుంది’ అని దేవగౌడ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి దీనిపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొన్నామధ్యే యూపీలో మొగల్‌సరై రైల్వేస్టేషన్ పేరును దీన్ దయాల్ ఉఫాధ్యాయ్ పేరిట మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ యత్నించటం, దానిపై అసెంబ్లీలో దుమారం రేగటం తెలిసిందే. ఆ వివాదం ఇంకా సర్దుమణగకముందే తాజాగా కర్ణాటకలోనూ పేరు వివాదం రాజుకోవడం గమనార్హం. -
‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’
బెంగళూరు: తనతోపాటు గతంలో దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన ప్రతి ఒక్కరూ పరిపాలన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తించారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. అయితే, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే విపరీతమైన ప్రచారం దక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపొడవైన వంతెనకు తాము ప్రధానిగా ఉన్న హయాంలోనే అనుమతులు లభించాయని చెప్పారు. గత ప్రధానుల ప్రణాళికలు ఇప్పుడు సాకారమవుతుండడంతో మోదీకి ప్రజల్లో విపరీతమైన ప్రచారం, ఆదరణ దక్కుతున్నాయని అన్నారు. -
ఆదరణ చూసి ఓర్వలేకే: కుమారస్వామి
బెంగళూరు : జేడీయూకు లభిస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. అందుకే తమ కుటుంబంపై మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన బుధవారమిక్కడ ఆరోపించారు. కాగా కుమారస్వామి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించినట్టు ఐటీ శాఖ ధ్రువీకరించింది. కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుటుంబసభ్యులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో దేశంలో,విదేశాల్లో కుమారస్వామి కుటుంబం వివిధ పెట్టుబడుల గురించి ఐటీశాఖ ఆరాతీసి ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే ఓ కేసులో లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట గతవారం కుమారస్వామి విచారణకు హాజరయ్యారు. -
మాజీ సీఎంపై మనీలాండరింగ్ కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించినట్టు ఐటీ శాఖ ధ్రువీకరించింది. కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుటుంబసభ్యులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో దేశంలో, విదేశాల్లో కుమారస్వామి కుటుంబం వివిధ పెట్టుబడుల గురించి ఐటీశాఖ ఆరాతీసి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే ఓ కేసులో లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట విచారణకు కుమారస్వామి హాజరైన సంగతి తెలిసిందే. -
ప్రధానికి మాజీ ప్రధాని విన్నపం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటకలో జరగబోయే మహామస్తాభిషేక ఉత్సవాలకు రూ. 500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. 12 సంవత్సరాలకోసారి జరిగే ఈ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలు జరిగే హసన్ లో తీవ్ర నీటి సమస్య ఉందని, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని మోదికి వివరించినట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా జనాలు వస్తారని దేవగౌడ తెలిపారు. వచ్చే ఎడాది జరిగే ఈ ఉత్సవాల్లో 57 అడుగుల గోమాతేశ్వర బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విన్నపాన్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తిరస్కరించారు. అయితే త్వరలో మరోసారి ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరుతామని దేవగౌడ తెలిపారు. -
బహిష్కృత ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ శివమొగ్గ : బహిష్కృత ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇది ముగిసిపోరుున అధ్యయనమని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. శుక్రవారం శివమొగ్గ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీ నుంచి బహిష్కరింపబడిన ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీని ఎలాగైన నామరూపం లేకుండా చేయాలని కుట్ర చేశారని, వారికి తగిన శాస్తి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో జేడీఎస్ పార్టీ మరికొంత పుంజుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలీయమైన శక్తి ఎదుగుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీబీఐ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. దీంతో అవినీతిలో కూరుకుపోరుున నాయకులు క్లీన్‌చిట్‌తో బయటకు వస్తున్నారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ పార్టీల అవసరం చాలా ఉందన్నారు. జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యమని అన్నారు. కావేరి, మహదారుు సమస్యలే దీనికి ఉదాహరణ అని దేవెగౌడ అన్నారు. -
గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని దీక్ష
బెంగళూరు: కావేరి జలాల వివాదం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతోంది. ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ శనివారం ఆందోళనకు దిగారు. కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీక్షవేదిక వద్ద దేవెగౌడను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ’కావేరి జలాల విషయంలో ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ భేటీ నిర్వహిస్తారని నాకు తెలియవచ్చింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మేమేమీ నేరగాళ్లం కాదు. రెండురాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో ఉన్న నీటిని పరిశీలించేందుకు నిపుణులను ఏర్పాటు చేయాలి’అని దేవెగౌడ పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో ప్రధాని మోదీ కర్ణాటకకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరోతేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటకలో మళ్లీ ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా దేవేగౌడ దీక్ష
-
ప్రాంతీయపార్టీల హవా పెరుగుతోంది: దేవేగౌడ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతోందని, దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏర్పడే మార్పులకు ఇది కీలకం అవుతుందని భావిస్తున్నానని మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు, కర్నాటక రాష్ర్టం హాసన్ లోక్‌సభ సభ్యుడు హెచ్డీ దేవెగౌడ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరిపై సతీసమేతంగా ఆయన సోమవారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రజల్లో ఎన్నడూ లేనివిధంగా అసహనం పెరుగుతోందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను దళితులపై జరిగిన దాడులపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ఆవు చర్మాలు ఒలిచినా కూడా దాడులు చేస్తూండడంపై విచారం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల్లో దళితులపై దాడులు ప్రధానాంశం అవుతుందని ఆయనన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యత లు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలతో కశ్మీర్ సమస్య మరింత జటిలమైందని దేవెగౌడ అన్నారు. దీనిని బీజేపీ ఏవిధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ వైఖరిపై దాని మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన కూడా గుర్రుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో థర్డఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీకి దాదాపు మూడేళ్ల పదవీ కాలం ఉందని గుర్తు చేశారు. అది పూర్తయ్యాక కానీ థర్డఫ్రంట్పై స్పష్టత రాదని అన్నారు. కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని దేవెగౌడ తెలిపారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేసి గెలుస్తుందని, తన కుమారుడు కుమారస్వామి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. గతంలో 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసినపుడు అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఆ తరువాత ఏ ముఖ్యమంత్రీ కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదని తెలిపారు. అందువల్లనే ప్రజలు కుమారస్వామి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. -
హోదా కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలి
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సూచన విజయవాడ (లబ్బీపేట): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయ పార్టీలకతీతంగా సమైక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రశిఖ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షోరూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసిందని, ఆ సమయంలో కొన్ని అంశాలను పేర్కొనడంతోపాటు హామీలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విభజన అంశాలను, హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు ఇస్తున్న ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌కు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా పార్లమెంటులో చేసిన చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై మాజీ ప్రధాని
విజయవాడ: మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా దేవెగౌడకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. -
మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు..
బెంగళూరు : జేడీఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. తమపై ఆరోపణలు మానకపోతే దేవెగౌడ గురించిన నిజాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినందుకు శాసనసభ్యులు జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, గోపాలయ్య, ఇక్బాల్ అన్సారి, రమేష్ బండి సిద్దేగౌడ, భీమానాయక్, అఖండశ్రీనివాస మూర్తిలను జేడీఎస్ పార్టీ సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చలువరాయస్వామి నేతృత్వంలో వీరంతా నగరంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశమమై తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం చలువరాయస్వామి తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడానికి, తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యడానికి జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఏక పక్ష నిర్ణయాలే కారణమన్నారు. ఇప్పటి వకూ తమకు సస్పెన్షన్ నోటీసు అందలేదని అందువల్ల తాము ఈ క్షణం వరకూ జేడీఎస్ ఎమ్మెల్యేలమేనన్నారు. ‘మేము విప్ ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసినట్లు దేవెగౌడ చెబుతున్నారు. అయితే 2006లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించారు. ఆయనకు మేము సహకారం కూడా అందించాం. అప్పుడు ఎందుకు ఆయన్ను, మమ్ములను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కుమారస్వామికి ఒక న్యాయం మాకో న్యాయమా ?’ అని ప్రశ్నించారు. తమపై ఫేస్బుక్, వాట్సాప్‌లలో అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. తాము చనిపోయినట్లు పేర్కొని పెద్దకర్మ చేస్తున్నట్లు పోస్టర్లు వేయడం, కరపత్రాలు పంచడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వీటినన్నింటిని చూస్తూ ఊరుకున్నామంటే దేవెగౌడపై ఉన్న గౌరవమే కారణమన్నారు. ఆయన వల్లే తాము రాజకీయంగా ఎదిగామని, వారి ఇంట్లో భోజనం చేశామన్న విశ్వాసం తమకు ఇప్పటికీ ఉందన్నారు. అందువల్లే తాము దేవెగౌడ గురించి కాని, ఆ కుంటుంబ సభ్యుల గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. అలాకాక తాము నోరు విప్పితే నిజాలు బయటికి వస్తాయని వాటిని ఆ కుటుంబం తట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి జేడీఎస్ అధినాయకత్వం ప్రతి విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. జేడీఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఫరూక్‌ను ఎంపిక చేసే సమయంలో తమతో కాని మరి ఏ ఇతర ఎమ్మెల్యేలతో కాని అధినాయకత్వం మాట మాత్రమైనా చర్చించలేదన్నారు. అందువల్లే తాము కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిందని రెబెల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ‘ఇప్పటి వరకూ పార్టీ నుంచి రాజ్యసభకు పంపించిన రామస్వామి, రాజీవ్ చంద్రశేఖర్, కుపేంద్రరెడ్డి జేడీఎస్ పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్సీలైన శరవణ, కే.వి నారాయనస్వామి పార్టీ కోసం కష్టపడిన వారా? వారికి ఎందుకు టికెట్లు ఇచ్చి గెలిపించినట్లు?’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘గాడిదల వ్యాపారం’ జరుగుతోందా!
‘ఓటుకు నోటు’ పై హెచ్.డి.దేవేగౌడ గరం ఎన్నికలను రద్దు చేయాలి బెంగళూరు: రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో చోటు చేసుకున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హెచ్.డి.దేవేగౌడ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తామేమీ అభ్యర్థులకు తాయిలాలు ప్రకటించడం లేదని, ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదనీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బెంగళూరులోని పద్మనాభనగరలో ఉన్న తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇది అభ్యర్థుల కొనుగోలు కాకపోతే మరేంటి, గాడిదల వ్యాపారం జరుగుతోందా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రాజ్యసభకు గెలిపించుకోగలగుతుంది. ఆ తర్వాత వారి వద్ద మిగిలిన 33 ఓట్లకు ఇతర స్వతంత్రులను కలుపుకొని మూడో స్థానాన్ని పొందాలని చూస్తున్నారు. ఆ స్వతంత్రుల ఓట్లు వీరు ఎలా సాధిస్తారు, ఇది ప్రలోభాలకు గురిచేయడం కాక మరేమిటి’ అని దేవేగౌడ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని దేవేగౌడ డిమాండ్ చేశారు.జూలై 12న పార్టీ కోసం నిజంగా శ్రమించే కార్యకర్తలు, నాయకులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన చేయూత కారణంగా నాయకులైన వారు, పార్టీ చేసిన మేలును మరిచిపోయి తమకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని దేవేగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. -
మా ఎమ్మెల్యేలు డబ్బు అడిగితే ఏంటి..?
బెంగళూరు: బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పోరిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మద్దతుగా మాట్లాడిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగుచూడటంపై దేవేగౌడ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు డబ్బులు అడిగితే ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బు అవసరమని దేవేగౌడ అన్నారు. భారత రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. తమ పార్టీపై రాజకీయ కుట్రలో భాగంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు. కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరగుతున్న వీడియో విడుదలవటం సంచలనం సృష్టిస్తోంది. స్వతంత్ర అభ్యర్థికి ఓటేసేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించగా, మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కుబా స్టింగ్‌లో పాల్గొన్నాడని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. -
ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి
మాజీ ప్రధాని దేవెగౌడ అంబరీష్, సుమలతకు ఎన్టీఆర్ పురస్కారం అందజేత బనశంకరి (బెంగళూరు): తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మహోన్నత వ్యక్తి అని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కొనియాడారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో కర్ణాటక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కన్నడ రెబల్ స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్, సుమలత దంపతులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్ర రంగంలోనే కాక రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి తెలుగు జాతి ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అప్పట్లోనే ఇవ్వాల్సి ఉండేదన్నారు. అంబరీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. బెంగళూరు నగరంలో తెలుగు అకాడమీ భవన నిర్మాణానికిప్రభుత్వం స్థలం కేటాయించాలని కర్ణాటక తెలుగు అకాడమీ సభ్యులు కోరగా.. ప్రభుత్వంతో చర్చిస్తానని మంత్రి అంబరీష్ హామీ ఇచ్చారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్వీ హరీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, సుమలత, రాధాకృష్ణ రాజు, మాజీ మంత్రి ఎం.రఘుపతి, ఎమ్మెల్యే గోపాలయ్య, బీబీఎంపీ విపక్ష నేత పద్మనాభరెడ్డి, గారెపాటి రామకృష్ణ, బలుసు శ్రీనివాసరావు, ఆర్.ఉమాపతి నాయుడు, శ్రీనివాసయ్య, మంజులనాయుడు, గణేష్శంకర్, హెచ్ఎన్ మంజునాథ్ పాల్గొన్నారు. -
ప్రాంతీయ పార్టీలదే హవా: దేవెగౌడ
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. శనివారం విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కార్యక్రమం అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. భవిష్యత్‌లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఆ కూటమికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో దేశ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. -
శ్రీవారి సేవలో దేవెగౌడ
తిరుమల: మాజీ ప్రధాని దేవెగౌడ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వాగతం పలికారు. దేవెగౌడ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో దేవెగౌడను వేద పండితులు ఆశీర్వదించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
నాది ఆశావాద దృక్పథం: దేవెగౌడ
బెంగళూరు:జేడీఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుందని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని కేఈబీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్.డి.దేవేగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘జేడీఎస్ పార్టీని చాలా మంది విడిచి వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఆశావహ దృక్పథంతో ఉన్నాను. పార్టీని వీడాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుంది’ అని దేవేగౌడ పేర్కొన్నారు. రానున్న శనివారం మైసూరులో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు దేవేగౌడ ప్రకటించారు. -
కర్నాటక మట్టిలో పుట్టాడు.. దేశం వదిలిపోడు..!
మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాక, దేశం వదిలి పారిపోయారన్న ప్రచారంతో ఇటీవల ప్రధానంగా వార్తల్లో నిలిచిన లిక్కర్ కింగ్ విజయమాల్యాపై మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాంకులకు 9000 కోట్ల రూపాయలు ఎగవేసి, గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారంటూ మాల్యాపై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన వెనకేసుకొచ్చారు. ''అతడు కర్నాటక మట్టిలో పుట్టాడు. దేశం వదిలి పారిపోడు'' అంటూ మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ట్విట్ చేశారు. ఓ టాప్ బిజినెస్ మెన్ ను పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సిందిగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సమన్లు పంపింది. అయితే తాను దేశం వదిలి పరారైనట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాల్యా ట్విట్టర్ లో ఖండించిన విషయం తెలిసిందే. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని, విదేశాలకు వెళ్ళి రావడం తనకు మామూలేనని, పరారైనట్లుగా మీడియా ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాల్యాను సపోర్ట్ చేస్తూ మాజీ ప్రధాని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నట్లు చెప్తున్నా కచ్చితమైన సమాచారం మాత్రం దొరకలేదు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఆయన ఈనెల 18న భారత్ కు తిరిగి వస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే అనుకున్నట్లుగా మాల్యా భారత్ తిరిగి వస్తే ...ఆయన పరారైనట్లు జరిగిన ప్రచారం ఉత్తదేనని తేలిపోవడంతోపాటు.. దేవెగౌడ వ్యాఖ్యలకూ ఊతం చేకూరే అవకాశం ఉంది. -
రంగంలోకి ‘దళపతి’
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె మేయర్ ఎంపికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై చర్చించేందుకు జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ అధ్యక్షతన ఆ పార్టీకు చెందిన ముఖ్యనాయకులు వచ్చేనెల 5న సమావేశం కానున్నారు. మేయర్ ఎంపికకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వచ్చేనెల7న వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో దేవెగౌడతో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, బెంగళూరుకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు నాయకులు వచ్చేనెల 5న భేటీ అవుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగే ఈ సమావేశం తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వనున్నారో దేవెగౌడ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు జేడీఎస్ నాయకులు చెబుతున్నారు. -
కలాంకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ నివాళి
-
రైతులపై కేంద్రం నిర్లక్ష్యం: దేవెగౌడ
ఢిల్లీలో నిరాహార దీక్ష న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహరాలు, నపుంసకత్వం కూడా కారణమన్న కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని లెఫ్ట్, జనతా పరివార్ పార్టీలు డిమాండ్ చేశాయి. కేంద్రం రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ సోమవారమిక్కడి జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఆయనకు జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు సంఘీభావం తెలిపారు. మోదీ ప్రభుత్వం కొలువుదీరాక 6వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కర్ణాటకలో రోజూ 10 మం దికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దేవెగౌడ తెలిపారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం చర్చ చేపట్టే వరకు పార్లమెంటులో అడుగుపెట్టబోనన్నారు. రాధామోహన్ ప్రకటన అత్యంత హేయమైనదని, ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. -
దేవేగౌడ ఆమరణ దీక్ష
‘జంతర్-మంతర్’లో ప్రారంభమైన దీక్ష. బెంగళూరు: కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో చర్చించేందుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సోమవారం ఉదయం నుంచి దేవేగౌడ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ, కర్ణాటకలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కర్ణాటకలో మాత్రమే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పరిష్కారం లభించడం లేదని మండిపడ్డారు. ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులపై వడ్డీని మాఫీ చేయాలని కోరారు. కర్ణాటకలో చెరకు, దానిమ్మ, ద్రాక్ష, పట్టు రైతులు సరైన మద్దతు ధర లభించక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు అందజేయాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే ఈ విషయాలన్నింటిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకుగాను సమయం కేటాయించాలని కోరారు. ఈ విషయంపై స్పీకర్ స్పందించే వరకు తన దీక్షను విరమించబోనని పేర్కొన్నారు. ఇక దేవేగౌడ చేపట్టిన ఆమరణ దీక్షకు జేడీయూ నేత శరద్ యాదవ్‌తోపాటు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు మద్దతు తెలిపారు. దీక్షా స్థలి వద్దకు చేరుకున్న నేతలు దేవేగౌడకు తమ మద్దతు తెలియజేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామితోపాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
నరేంద్ర మోదీ కాదు దేవేగౌడ..
పాట్నా: భారత తొలి ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ కాదని హెచ్ డీ దేవేగౌడ అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. దేశానికి తొలి బీసీ ప్రధాని మోదీ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నితీష్ ఖండించారు. 'అమిత్ షా చెప్పినట్టుగా దేశానికి తొలి బీసీ ప్రధాని మోదీ కాదు దేవే గౌడ' అని నితీష్ అన్నారు. ఏ విషయంపైనైనా తగిన అవగాహన లేకపోవడం, పూర్తిగా తెలియకపోవడం ప్రమాదకరమని అమిత్ షాకు చురకలించారు. బీజేపీ నేతలు అధికారం కోసం ఏమైనా చేస్తారని, అమిత్ షా వ్యాఖ్యలు కొత్తేమీకాదని నితీష్ విమర్శించారు. -
నాకు ఓపిక లేదు
జేడీఎస్ బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హెచ్.డి.దేవెగౌడ బెంగళూరు : జేడీఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను సమాధాన పరిచేందుకు కుమారస్వామి చాలా సహనంతో వ్యవహరిస్తున్నారని, అయితే అంత సహనం తనకు లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన పార్టీ బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీలోని కొంతమంది నేతల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టి, తిరిగి వారు పార్టీతో కలిసి సాగేలా కుమారస్వామి అనేక ప్రయత్నాలు చేశారని, ఇప్పుడిక వాటన్నింటిని వదిలేయాలని ఆయన సూచించారు. ఇక పార్టీని సంఘటితం చేసి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే సామర్ధ్యం తనకుందని దేవేగౌడ తెలిపారు. త్వరలోనే తానేంటో చూపిస్తానంటూ ఇతర పార్టీలకు సవాల్ చేశారు. ఇక ఒకానొక సందర్భంలో పూర్తిగా ఉద్వేగానికి లోనైన దేవెగౌడ తాను చనిపోయిన తర్వాత కూడా పార్టీ పటిష్టంగానే ఉండాలని, తన మరణానంతరం కూడా వై.వి.ఎస్.దత్త జేడీఎస్ పార్టీలోనే కొనసాగాలని అన్నారు. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జేడీఎస్నేతలు రేస్‌కోర్సు రోడ్డులోని జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడంపై నిప్పులు చెరిగారు. ఇక ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జేడీఎస్ పార్టీ నేతలు జమీర్ అహ్మద్, చలువరాయస్వామిలు గైర్హాజరయ్యారు. -
జలకాలాడేందుకు వచ్చాను..
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రత్యక్షం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కొంతసేపు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ‘డిగ్గీ’ ప్రభుత్వ అతిథి గృహం కుమారకృపాలో విడిది చేశారు. ఆయనను కలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా మంది శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో దేవెగౌడ కూడా తన అనుచరులను కొంతమందిని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన అధినాయకులను ఒకే చోట చూడటంతో అటు కాంగ్రెస్ ఇటు జేడీఎస్ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కుమారకృపలో తన గదిలోకి వెళ్లి బయటకు వచ్చిన దేవెగౌడను మీడియా చుట్టుముట్టి ఈ విషయమై వివరణ అడుగగా ‘ప్యాలెస్ మైదానంలో ఈ రోజు (శనివారం) పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమం ఉంది. ఇందులో పార్టీ పదాధికారులు, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు అందరు నాయకులు పాల్గొననున్నారు. నేను కూడా అక్కడికే వెలుతున్నా. ప్రయాణ బడలిక వల్ల స్నానం చేద్దామని కుమారకృపకు వచ్చా. దీనికే ఇంత అర్థం తీయాలా?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కాంగ్రెస్, జేడీఎస్ బాహాబాహి
కార్యాలయాన్ని తక్షణమే అప్పగించాలని కాంగ్రెస్ నేతల పట్టు పోలీసుల జోక్యంతో శాంతించినఇరు పార్టీల కార్యకర్తలు బెంగళూరు : నిన్న మొన్నటి దాకా జేడీఎస్ ప్రధాన కార్యాలయం విషయమై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య రగిలిన చిచ్చు, ఇప్పుడిక షెడ్ నిర్మాణంతో మళ్లీ రాజుకుంది. నగరంలోని రేస్‌కోర్సు రోడ్డులో ఉన్న జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సిందిగా కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో కార్యాలయం వెనక భాగంలో ఉన్న 16,100 అడుగుల స్థలంలో తాత్కాలికంగా ఓ షెడ్‌ను నిర్మించి, జేడీఎస్ కార్యకలాపాలను ఆ షెడ్లోకి మార్చిన అనంతరం ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ నిర్ణయించారు. ఇందులో భాగంగానే షెడ్ నిర్మాణ పనులు సైతం సాగుతున్నాయి. కాగా, ఇప్పుడు ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందంటూ ఆ పార్టీ నేతలు జేడీఎస్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. జేడీఎస్ నేతలు షెడ్ నిర్మాణం తలపెట్టిన స్థలం సైతం ప్రధాన కార్యాలయం పరిధిలోనే ఉందని, అందువల్ల ఆ స్థలం కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని పేర్కొంటూ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేస్‌కోర్సు రోడ్డులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించారు. అదే సందర్భంలో కార్యాలయ అప్పగింత విషయమై తమ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయాన్ని వెల్లడించే వరకు సహనం వహించాలంటూ జేడీఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం నడిచింది. ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పోట్లాటకు దిగడంతో కార్యాలయ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కల్పించుకొని ఇరు పార్టీల కార్యకర్తలకు సర్దిచెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసు అధికారులు అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్.హనుమంతప్ప, ఆర్.వి.వెంకటేష్, పి.ఆర్.రమేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ తరహా ప్రవర్తన సరికాదు.... కాంగ్రెస్ పార్టీ నేతలు, జేడీఎస్ కార్యాలయాన్ని సొంతం చేసుకునేందుకు ఈ విధంగా దౌర్జన్యానికి దిగడం ఏ మాత్రం సరికాదని జేడీఎస్ పార్టీ అధికార ప్రతినిధి వై.ఎస్.వి.దత్త పేర్కొన్నారు. జేడీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు ప్రాంతాల నేతలను సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...జేడీఎస్ పార్టీ నేతలు న్యాయవ్యవస్థకు ఎంతో విలువనిస్తారని, కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఈ విధంగా కార్యాలయంలోకి చొరబడి స్వాధీనం చేసుకోవాలనుకోవడం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు.