
‘మేం బానే పనిచేశాం.. అయినా మోదీకే..’
తనతోపాటు గతంలో దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన ప్రతి ఒక్కరూ పరిపాలన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తించారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు.
బెంగళూరు: తనతోపాటు గతంలో దేశ ప్రధాన మంత్రులుగా పని చేసిన ప్రతి ఒక్కరూ పరిపాలన బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తించారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. అయితే, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే విపరీతమైన ప్రచారం దక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపొడవైన వంతెనకు తాము ప్రధానిగా ఉన్న హయాంలోనే అనుమతులు లభించాయని చెప్పారు. గత ప్రధానుల ప్రణాళికలు ఇప్పుడు సాకారమవుతుండడంతో మోదీకి ప్రజల్లో విపరీతమైన ప్రచారం, ఆదరణ దక్కుతున్నాయని అన్నారు.