
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. ముందు నుంచీ ఆ పార్టీ దళితుల హక్కులు కాలరాసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపు నిరోధక చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచేందుకు బీజేపీ మొదటినుంచీ ప్రయత్నాలు సాగించిందన్నారు. అందులో భాగంగానే చట్టంలోని నిబంధనలను సుప్రీంకోర్టు సడలిస్తూ తీర్పు ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే దేశవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ వెనక్కు తగ్గిందన్నారు.
వర్గీకరణకు నా మద్దతు..
సామాజిక న్యాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని దేవేగౌడ స్పష్టం చేశారు. బుధవారం రాంలీలా మైదానంలో తలపెట్టిన సింహగర్జన దీక్షను పార్లమెంట్ స్ట్రీట్‌కు మార్చినట్టు సమితి చైర్మన్ మందకృష్ణ, కన్వీనర్ దయాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment