
మాజీ సీఎంపై మనీలాండరింగ్ కేసు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించినట్టు ఐటీ శాఖ ధ్రువీకరించింది.
కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుటుంబసభ్యులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో దేశంలో, విదేశాల్లో కుమారస్వామి కుటుంబం వివిధ పెట్టుబడుల గురించి ఐటీశాఖ ఆరాతీసి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే ఓ కేసులో లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట విచారణకు కుమారస్వామి హాజరైన సంగతి తెలిసిందే.