Kumaraswamy
-
ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి షాక్
-
కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ
-
వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది.’ అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకూ కర్మాగారం అభివృద్ధిలో నడిచింది. 2016–17లో 7.3 మిలియన్ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటి నుంచి నష్టాలు ప్రారంభయ్యాయి. 2018–19, 2020–21లో రూ.930 కోట్లు లాభాలు వచ్చాయి. 2021 కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అంతేకాదు.. ఉద్యమాలు, ఆందోళనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి.. అప్పటి ప్రభుత్వంవల్లే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.Thankyou YSRCP MP's For Saving VIZAG STEEL PLANT✊ pic.twitter.com/UECSvaE8Wj— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 17, 2025ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయినేను కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సమీక్షలు చేసి విశాఖ ఉక్కుకు సాయంచేయాలనే విషయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లా. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా, వాటిని పక్కనపెట్టి చివరి అవకాశంగా రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. దీంతో రెండేళ్లలోనే స్టీల్‌ప్లాంట్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడాన్ని నేను సవాలుగా తీసుకున్నా.ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి రూ.10 వేల కోట్లుకు పైగా పెట్టుబడిని మద్దతుగా ఇచ్చేందుకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థంచేసుకుని ఈ చర్య చేపట్టాం’ అని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘ఎక్స్’లో తెలిపారు. విలీనం, ఉద్యోగుల వీఆర్ఎస్పై దాటవేత..ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్ని వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు.. సెయిల్ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా ప్రస్తావించగా.. కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్ఎస్పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి, పరిష్కరించేందుకు ముందుకెళ్తామన్నారు.అలాగే, ప్యాకేజీ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో రూ.26,114.82 కోట్లు అప్పుల్లో ఉన్నట్లు ఉంది. ఇదే అంశంపై కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘రూ.26,114.82 కోట్లు కాదు రూ.35 వేల కోట్లు రుణభారం ఉంది. దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం’ అన్నారు. ప్యాకేజీకి.. ఉన్న రుణభారానికి సంబంధంలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ జగన్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఆనాడు లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా ఏపీ శాసనసభ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సంస్థను కాపాడేందుకు @ysjagan ప్రభుత్వం ఆది నుంచి పోరాడుతూనే… pic.twitter.com/vdsM9VCkIS— YSR Congress Party (@YSRCParty) January 18, 2025 -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్
-
Vizag Steel Plant: మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు.
-
మనిషిగా నిఖిల్ ఓడిపోలేదు
బనశంకరి: నా కుమారుడు ఎన్నికల్లో మూడోసారి ఓడిపోయాడు. అతను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, మానవత్వం, సహృదయమున్న మనిషిగా ఓడిపోలేదని నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్ పరాజయం తరువాత ఆమె ఎక్స్‌లో సోమవారం పోస్ట్ చేశారు. నా కొడుకు ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి, కానీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో నా భర్త, మామగార్లకు ఇటువంటివి కొత్త కాదు. ఓటమితో కుంగిపోలేదు. నా కుమారునికీ ఇదే వర్తిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. నిఖిల్ మనిషిగా ఓటమి చెందలేదన్నారు. చెన్నపట్టణ ప్రజల, ప్రేమ, విశ్వాసం నిఖిల్ వెంటే ఉన్నాయని, ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. -
కుమారస్వామిపై కేసు
బెంగళూరు: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటకలో కేసు నమోదైంది. 2006–08 కాలంలో కర్ణాటక సీఎంగా ఉన్న కాలంలో కుమారస్వామి ఒక గనుల తవ్వకం సంస్థకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని గతంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న ఇన్స్పెక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్ తాజాగా ఫిర్యాదుచేయడంతో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కుమారస్వామిపై కేసు నమోదైంది.కుమారస్వామి ప్రభుత్వ అధికారిగా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని, తనను బెదిరించారని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించి నాడు బళ్లారి జిల్లాలో శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ సంస్థకు 550 ఎకరాల్లో గనుల తవ్వకం అనుమతులు ఇచ్చారని కుమారస్వామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కుట్రపూరిత కేసు: కుమారస్వామితాజా కేసుపై కుమారస్వామి స్పందించారు. ‘‘ ఇది పూర్తిగా కుట్రపూరితంగా నమోదుచేసిన కేసు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఐజీపై నేను పత్రికాసమావేశంలో ఆరోపణలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నిజమని నిరూపించగలరా? కావాలంటే ప్రెస్‌మీట్ వీడియోను మరోసారి చూడండి. ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొంటా’’ అని మంత్రి అన్నారు. -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్.. CMD మైండ్ గేమ్..
-
స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం
ఉక్కునగరం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర భారీ, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసశర్మ తదితరులతో కలిసి గురువారం ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాలను సందర్శించారు. మొదట ఈడీ(బిలి్డంగ్)లోని మోడల్ రూమ్‌ను సందర్శించారు. అక్కడ సీఎండీ అతుల్ భట్ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియ, ముడి పదార్థాల సరఫరా, ఉత్పత్తుల రవాణా తదితర అంశాలను వివరించారు. అక్కడే ఉన్న అవార్డు గ్యాలరీకి వెళ్లి స్టీల్‌ప్లాంట్ సాధించిన అవార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కోక్ ఓవెన్స్, బ్లాస్ట్‌ఫర్నేస్–3, ఎస్ఎంఎస్–2, వైర్ రాడ్ మిల్–2 విభాగాలను సందర్శించారు. అనంతరం ఉక్కు పరిపాలన భవనంలో సీఎండీ, డైరెక్టర్లు, సీనియర్ అధికారులతో స్టీల్‌ప్లాంట్ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్‌కు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి సంజయ్ రాయ్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. ఆందోళన వద్దుఆయన సందర్శన పుసక్తంలో ఇలా రాశారు ‘ఈ స్టీల్‌ప్లాంట్ సందర్శించాక దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్లాంట్ సహాయపడుతుందని నాకు అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజువారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్‌పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్‌ను రక్షించడం నా బాధ్యత. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రధాని ఆశీస్సులు, సాయంతో ప్లాంట్ నూరు శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది’ అని రాశారు. ప్రధానితో చర్చించాకే నిర్ణయం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పా రు. ఇందుకు తమకు రెండు నెలలు వ్యవధి అవసరమన్నారు. అయితే ప్రైవేటీకరణ రద్దుపై కుమారస్వామి పూర్తి భరోసా ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సినిమాలకు గుడ్‌బై : నిఖిల్
యశవంతపుర: రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా సినిమా రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి తెలిపారు. మండ్యలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... సినిమాలకు గుడ్‌బై చెప్పాను. 2019లో మండ్యలో తనను ఓడించారు. అనేక తప్పులు వల్ల వెనకడుగు వేశా. ఇప్పుడు మండ్య ప్రజలు స్థానం ఇచ్చినట్లు చెప్పారు. తన తండ్రి కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో మండ్యలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. త్వరలో చెన్నపట్టణలో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్‌ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్‌తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్‌డ్రైవ్‌లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
ఈసారి నాన్న.. సత్తా చాటేనా?
రాష్ట్రంలో హై ఓల్టేజ్ ఎంపీ సీట్లలో ఒకటిగా మండ్య ఎప్పుడూ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇక్కడ పోటీ రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. సాదా సీదా నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ జరిగే ఎన్నికలు.. రాజకీయాలను వేడెక్కిస్తాయన్నది నిజం. పోటీదారులు, కులం, పార్టీ తదితర అంశాలు ఎన్నికలను కుతూహలంగా మారుస్తాయి. ఈసారి జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి పెద్దగా రాజకీయ చరిత్ర లేని స్టార్ చంద్రు తలపడుతున్నారు. కర్ణాటక: మండ్య ఎంపీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి వెంకట రమణ గౌడ అలియాస్ స్టార్ చంద్రు నామినేషన్లు ముగించి ప్రచారంలో ముందున్నారు. ఎవరు విజయం సాధిస్తారు అనేది ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ చేతిలో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి దారుణంగా ఓడిపోయారు. దీంతో కొడుకు స్థానంలో తండ్రి రంగం మీదకు వచ్చారు. ఈసారి బీజేపీ బలం ఉండడంతో కుమారస్వామి ఉత్సాహంగా ఉన్నారు. మండ్యలో గెలిచి జేడీఎస్ జెండాను ఎగరేయాలి అన్నది ఏకై క అజెండాగా పెట్టుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్. చెలువరాయస్వామి, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇద్దరూ స్థానికేతరులే కుమారస్వామి, స్టార్ చంద్రు ఇద్దరూ మండ్యలో స్థానికులు కాదు, బెంగళురు నగరానికి చెందిన వారు కావడం విశేషం. స్టార్ చంద్రు బెంగళూరులో వ్యాపారవేత్త. కాంగ్రెస్ నాయకులు ఆయనను ఏరికోరి దళపతి కుటుంబానికి వ్యతిరేకంగా నిలబెట్టారు. స్టార్ చంద్రు గెలుపుని మంత్రి చెలువరాయస్వామి భుజాలకెత్తుకున్నారు. జేడీఎస్‌లో అసమ్మతితో ఉన్న వారిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా.. ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్ ఇటీవలే బీజేపీలో చేరి కుమారకు మద్దతు పలికారు. కానీ అధికార కాంగ్రెస్ అంత తేలికగా తీసుకోవడం లేదు. ఈ నెల 17న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో మండ్యలో ప్రచార సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు, తాను గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు వస్తాయని ప్రజలకు చెబుతున్నారు. కుమారస్వామి నరేంద్రమోదీ పథకాలు, జిల్లా అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. జిల్లాలో మైనారిటీలు, దళితులు, కురుబ, ఒక్కళిగ సముదాయం ఓటర్లు అధికం. కాంగ్రెస్ మూడు వర్గాలను నమ్ముకుంటే, జేడీఎస్ ఒక వర్గాన్ని నమ్ముకుంది. కుమారకు పాత బలం గతంలో మండ్య జిల్లాలో ఎక్కువగా జేడీఎస్ ఎమ్మెల్యేలే ఉండేవారు. ఆ నాయకులు కుమారస్వామి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర సీనియర్లు చంద్రుకు మద్దతుగా ఉన్నారు. పోలింగ్‌కు ఇంకో 9 రోజులు ఉంది. జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తేలాల్సి ఉంది. -
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
చేతబడి నెపంతో తల్లీకొడుకుల హత్య
గూడూరు: మంత్రాలతో చేతబడులు చేస్తున్నారనే నెపంతో పట్టపగలే తల్లీకొడుకులను స్వయానా వారి బంధువే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ టన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా.. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (55), కొమురయ్య దంపతులకు కుమారుడు సమ్మయ్య (32) ఉన్నాడు. సమ్మయ్య దివ్యాంగుడు. వరంగల్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన వారికి బంధువైన శివరాత్రి కుమారస్వామి తన కుటుంబానికి హాని కలిగించేలా సమ్మయ్య, సమ్మక్క మంత్రాలు, పూజలు చేస్తున్నారని, వారి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ ఇరువురినీ పిలి పించి మాట్లాడారు. మంగళవారం పెద్దల సమక్షంలో మరోసారి మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారు. అనుకున్న ప్రకారం.. మంగళవారం సమ్మక్క కు టుంబసభ్యులు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదుదా రుడు కుమారస్వామి రాకపోవడంతో పోలీసులు అతనికి ఫోన్ చేయగా తనకు వేరే పని ఉందని, మ రోరోజు మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో పోలీసులు సమ్మక్క కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పారు. పోలీసులు పిలిచినా రాకుండా.. మాటు వేసి పోలీస్‌స్టేషన్ నుంచి సమ్మక్క కుటుంబసభ్యులు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కాపుకాసిన కుమారస్వామి మరోవైపు నుంచి ఆటోలో వచ్చి అ డ్డుగా పెట్టాడు. తన ఆటోలోని ఇనుపరాడ్డును తీ సుకొని అందరూ చూస్తుండగానే ముందుగా సమ్మ క్క తలపై బలంగా కొట్టాడు. ఆమె తల పగిలి కిందపడగా, భర్త కొమురయ్య ఆడ్డుకోబోగా అతన్ని కూడా రాడ్‌తో కొట్టడంతో అతని చేయి విరిగి పడి పోయాడు. వికలాంగుడైన సమ్మయ్య ఆడ్డురాగా అతని తలపై రాడ్‌తో బాదాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే తల్లీకొడుకులు రక్తపు మడుగు లో చనిపోయారు. స్థానికులు, సమీప వ్యాపారస్తు లు ఘటనాస్థలంలోనే కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యు లు, బంధువులు అడ్డుకున్నారు. హత్యలకు కార ణం పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆందోళనకారులు శాంతించారు. మృతుడు సమ్మయ్య భార్య రజిత ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడి భార్యకు అరోగ్యం బాగాలేకపోవడానికి సమ్మక్క కుటుంబం చేస్తున్న పూజలే కారణమని కొంతకాలంగా ఆ కుటుంబంపై వైరం పెంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
కాంగ్రెస్‌కు అస్త్రంగా.. కుమారస్వామి విద్యుత్ చౌర్యం కేసు
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై బెంగళూరులో విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పవర్ సప్లై కంపెనీ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్కయింది. భారత విద్యుత్ చట్టం(ఐఈఏ) సెక్షన్ 135 కింద కుమారస్వామిపై కేసు పెట్టారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల దాకా శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. దీపావళి సందర్భంగా బెంగళూరులో జేపీ నగర్‌లోని తన ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకునేందుకు కుమారస్వామి విద్యుత్ చోరీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి అది తన తప్పు కాదని చెప్పారు. ఒక ప్రైవేట్ డెకరేటర్ అవగాహన లేక తన ఇంటి బయట ఉన్న పోల్ నుంచి డెకరేషన్ కోసం ప్రత్యేక కనెక్షన్ తీసుకున్నాడని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆ కనెక్షన్‌ను తొలగించానని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఘటన కాంగ్రెస్‌కు మంచి అవకాశంగా దొరికింది. ఇటీవలే కుమారస్వామి ఒక పప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కరెంటే ఉండడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీలేవీ అమలు కావని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని ప్రజలు, రైతులను కోరారు. కుమారస్వామి చెప్పినట్లు కర్ణాటకలో కరెంటే లేకపోతే ఎలా దొంగిలిస్తారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి...సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది? -
సిద్ధాంతాలు గాలికొదిలేసి పొత్తులా?
కర్ణాటక: సిద్ధాంతాలను గాలికొదిలేసి రాజకీయ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే వారిని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల గతేమిటని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ పరోక్షంగా జేడీఎస్ నేత కుమారస్వామిపై ధ్వజమెత్తారు. సోమవారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నపట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సీ.అశ్వత్థతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమస్యను పరిష్కరించకపోతే పార్టీని విసర్జించి రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదే పదే చెబుతున్నారని, అధినాయకులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తే పార్టీ నమ్ముకొన్న నాయకులు, కార్యకర్తల గతేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో విధానపరిషత్ సభ్యుడైన సీ.ఎం.ఇబ్రహీం రాజీనామా చేసి జేడీఎస్‌లో చేరిన సమయంలో ఆయనకు ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. జేడీఎస్, బీజేపీ పొత్తు విషయం ఇబ్రహీంకు సమాచారం లేదని దుయ్యబట్టారు. జేడీఎస్‌లో ఉన్నవారు వరుసగా కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, తాము ఎవరినీ పిలువాల్సిన అవసరం లేదన్నారు. బీదర్ నుంచి చామరానగర వరకు అన్ని జిల్లాల్లో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలపై నిలిచిందేగాని వ్యక్తిపై కాదన్నారు. తాను లేకపోయినా పార్టీ మిమ్మల్ని కాపాడుతుందని తెలిపారు. -
పెన్‌డ్రైవ్ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి
మైసూరు: రాష్ట్రంలో అధికారుల బదిలీల దందా మొత్తం ముఖ్యమంత్రి సిద్దరామయ్య కనుసన్నల్లో జరుగుతోందని, తన పెన్ డ్రైవ్‌లో ఉన్న రహస్యం బయటకు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అన్నారు. గురువారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో బదిలీలు తప్పనిసరి, కానీ ఏ కొలమానం ప్రకారం బదిలీలు చేయాలో ఆ ప్రకారంగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు డబ్బుల కోసం బదిలీలు చేస్తున్నారు, ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాలతో నడుస్తోందని దుయ్యబట్టారు. కుమారపై సీఎం భగ్గు శివాజీనగర: జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి నిరాశతో తమ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధ ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తరువాత మీడియాతో మాట్లాడారు. బదిలీల దందా సాగుతోందని ఆరోపించడం సబబు కాదన్నారు. వారి కాలంలోను బదిలీలు జరిగాయి. ఆయన లంచం పుచ్చుకొన్నాడా? అని ప్రశ్నించారు. సాధారణ బదిలీలు జరుగుతున్నాయన్నారు. హిట్ అండ్ రన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బదిలీలకు– తన కుమారుడు యతీంద్ర పేరును అంటగట్టడం తగదన్నారు. -
పెన్‌డ్రైవ్‌లో బదిలీల దందా: కుమార
కర్ణాటక: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బదిలీ దందాలపై తన వద్ద సాక్ష్యం ఉందని జేడీఎస్ మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఒక పెన్ డ్రైవ్‌ను చూపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బదిలీ దందాకు ఆధారాలు విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో పెన్ డ్రైవ్‌ను చూపినట్లు చెప్పారు. బదిలీల దందాకు సంబంధించిన ఆడియో ఉందని, ప్రధాన సాక్ష్యమని చెప్పారు. సమయం చూసి ఈ పెన్ డ్రైవ్‌ను విడుదల చేస్తానన్నారు. తన ఆరోపణలకు ఎమ్మెల్యే దినేశ్ గుండురావు కంగారు పడాల్సిన పని లేదన్నారు. నా ఆస్తుల గురించి కూడా ప్రభుత్వం విచారణ చేయించవచ్చు, రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక నా సంపద ఎంత అనేది తనిఖీ చేయండి అని సవాల్ చేశారు. నగరాభివృద్ధి అనేది జరగడం లేదన్నారు. తన గురించి బీజేపీ నేత యడియూరప్ప మంచిగానే మాట్లాడారన్నారు. -
అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్! -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం
పరకాల: ఓ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు. కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. -
నిఖిల్.. ఓటు అడగవద్దు
కర్ణాటక: దయచేసి మా ఏరియాకు వచ్చి ఓట్లు అడక్కండి. మీ నాన్నను, మీ అమ్మను ఎమ్మెల్యేలుగా గెలిపించాం.ఇప్పటికీ మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. మీకు ఓట్లు వెయ్యం, మీకే కాదు ఎవ్వరికీ వెయ్యం అంటూ ఓ మహిళ నిఖిల్ కుమారస్వామికి ఘాటుగా చెప్పింది. రామనగర జేడీఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిఖిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనగరలోని ఒక మురికివాడకు వెళ్లగా అక్కడి మహిళలు నిఖిల్‌ను నిలదీశారు. గతంలో కుమారస్వామి, అనితలను రామనగర ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. వారు పలుసార్లు వచ్చి అభివృద్ధి పనులకు భూమిపూజలు చేసివెళ్లారు కానీ పనులు మాత్రం జరగలేదు. ఆ కోపంతో నిఖిల్‌పై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న నిఖిల్ చివరికి వారికి నచ్చచెప్పి ఓటేయాలని అడిగారు. -
కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో కాంగ్రెస్‌ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాంగ్రెస్‌ను అస్థిరపరిచే కుట్రను మొదలుపెట్టారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసిచ్చినట్టు చెప్పుకొచ్చారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికల వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చుపెడ్డుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంపై దేశంలో ఉన్న అన్ని రాజకీయల పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు రేవంత్. -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
కుమారస్వామి తనయుడికి జేడీయూ అసెంబ్లీ టికెట్
రామనగర: కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు, జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్‌ను దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రామనగర స్థానం నుంచి నిలబెట్టనున్నట్లు జేడీయూ అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అభ్యరి్థని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీయూ నిలిచింది. కుమారస్వామి భార్య అనిత ప్రస్తుతం రామనగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ చదవండి: మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ -
అట్టహాసంగా ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకు స్థాపన కార్యక్రమంలో, తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఉన్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎంకు స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత త్రైలోక్య మోహన గౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎంను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముహ్తూర సమయంలో బీఆర్ఎస్ ఏర్పాటు అధికారిక పత్రాలపై పార్టీ అధినేతగా కేసీఆర్ సంతకాలు చేశారు. నిర్ణయించిన ముహూ ర్తం మేరకు 1.25 గంటలకు భారతదేశ చిత్రపటంతో కూడిన గులాబీ జెండాను హర్షధ్వానాల మధ్య ఆహ్వానితులతో కలిసి ఆవిష్కరించారు. తరలివచ్చిన ప్రముఖులు, నేతలు: కుమారస్వామి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతుసంఘాల నేతలు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్నామ్ సింగ్ (హరియాణా), అక్షయ్ కుమార్ (ఒడిశా), హిమాంశు తదితరులు హాజరయ్యారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ల్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ ర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాల్లో కార్యకర్తలు బాణసంచా పేలుళ్లు, డీజే, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. గుణాత్మక మార్పు వస్తుందనే విశ్వాసం ఉంది: కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహ్వానితులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో ప్రారంభించగా, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుదుటన తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. కేసీఆర్ సోదరీమణులతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. ‘తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ బీఆర్ఎస్ వృక్షం శాఖోపశాఖలుగా నేడు భారతాన విస్తరిస్తుంది. భారతదేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే చల్లని నీడను పంచనుంది మన భారత్ రాష్ట్ర సమితి’ – హరీశ్‌రావు, ఆర్థిక శాఖమంత్రి ‘బీఆర్ఎస్ ఆవిర్భావం మహోజ్వల ఘట్టం. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో నవశకం ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి’ – నామా నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత ‘భారత రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. టీఆర్ఎస్తో సంఘటిత, సమైక్య, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చారు. భారతీయుల కలలు నిజం చేసేందుకు సీఎం కట్టుబడి ఉన్నారు. తెలంగాణ భూమికగా భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్ ప్రస్థానం బీఆర్ఎస్’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు ఫలించాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు గెలవాలి. ఆ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. – ముఖ్యమంత్రి కేసీఆర్ -
కేసీఆర్‌తో కుమారస్వామి భేటీ.. లాజిక్ ప్రశ్న సంధించిన రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులను కలిశారు. కాగా, ఆదివారం కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సైతం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, కేసీఆర్-కుమారస్వామి భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో పొలిటికల్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో తన పార్టీని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉన్న వారితో కాకుండా.. కాంగ్రెస్ కూటమితో సంబంధం ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలవడంలో ఉన్న లాజిక్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని మత విద్వేషాలు రెచ్చగొడతారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. బీజేపీకి అనుకూలంగా మారిపోయి యూపీఏ భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్‌కు దూరం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బేరసారాలు ఆడుతోందని ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయొద్దని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించారని మండిపడ్డారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సిద్ధరామయ్య కూడా ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: సిగ్నల్ జంప్! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య ఓ లేఖ రాశారని వస్తున్న వార్తలపై కూడా కుమారస్వామి స్పందించారు. ‘సిద్ధరామయ్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ ఎమ్మెల్యేలకు తాను లేఖ రాయలేదని చెప్పారు. కానీ ఇప్పటికే ఆ లేఖను సిద్ధరామయ్య ట్విటర్లోనూ పోస్ట్ చేరు. నిన్న లేఖ రాశానని చెప్పిన సిద్ధరామయ్య నేడు రాయలేదని అంటున్నారు. తన మాటలను ఆయనే కొట్టిపారేస్తున్నారు. ఈ తీరు ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది’ అని మండిపడ్డారు. #WATCH | I have voted for Congress because I love it: K Srinivasa Gowda, Karnataka JD(S) leader on Rajya Sabha elections pic.twitter.com/oMSkdlYSuQ — ANI (@ANI) June 10, 2022 -
త్వరలో దేశంలో భారీ మార్పు
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: త్వరలో జాతీయస్థాయిలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. రాబోయే మార్పును ఎవరూ ఆపలేరని, రానున్న రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చిన కేసీఆర్.. మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతోపాటు కర్ణాటక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేసీఆర్.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటున్నామని, కానీ దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించారు. ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయి. అయినా పరిస్థితి మారలేదు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. భారత్ కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు 16 ట్రిలియన్ డాలర్లతో దూసుకుపోతోంటే.. మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల స్వప్నాల్లో మునిగిఉన్నాం’అని కేసీఆర్ అన్నారు. గొప్ప మానవ, నైసర్గిక వనరులున్న మన దేశంలో నిజంగా మనసుపెట్టి అభివృద్ధి చేస్తే అమెరికా కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, వనరులను వినియోగించుకోవడంలో వెనకబడ్డామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉజ్వల భారత్ కోసం శ్రమించాలి దేశంలో ప్రస్తుతం స్వతంత్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, అయినా భారత్ కరెంట్, మంచినీళ్లు, సాగు నీటి కోసం ఇంకా అల్లాడుతూనే ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్.. ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ప్రధానం కాదని, ఒక ఉజ్వల హిందుస్తాన్ కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో ఎస్సీలు, ఆదివాసీలు ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారి పోతోందన్నారు. దేవెగౌడ, కుమారస్వామిలతో జాతీయ, కర్ణాటక రాజకీయాలు చర్చించినట్లు చెప్పారు. గతంలో బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పానని, ఆ తర్వాత అది నిజమైందని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశంలో మార్పు రాబోతుందని, రానున్న రెండు, మూడు నెలల్లో ఒక సంచలన వార్త బహిర్గతం చేస్తానని చెప్పారు. ఉదయం 9 గంటలకు పయనం గురువారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంటనే ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు. స్వల్ప విశ్రాంతి అనంతరం దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం దేవెగౌడ కుటుంబసభ్యులతో భోజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుగుపయనమైన కేసీఆర్ 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొత్త ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేకమంది నేతలతో భేటీ అవుతున్నారని, అందుకోసమే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరమని, పేదల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్లు మరో మూడు నెలలు వేచిచూడాలని, మీరే మార్పులు చూస్తారని అన్నారు. విజయదశమి నాటికి దేశంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. దేశ భవిష్యత్ దృష్ట్యా చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రణాళికలపై మూడు గంటలపాటు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని, తృతీయ శక్తి ఆవశ్యకత ఉందన్నారు. గతంలో తృతీయ శక్తిపై తీసుకున్న నిర్ణయం వేరని, ఇప్పుడు వేరని స్పష్టంచేశారు. దేశ చరిత్రకు ఇది పునాది అని పేర్కొన్నారు. -
‘ఆరు బ్యాగులతో ఢిల్లీకి కర్ణాటక సీఎం’
యశవంతపుర(కర్ణాటక): సీఎం యడియూరప్ప ఇద్దరు కొడుకులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఆరు పెద్ద పెద్ద బ్యాగులను తీసుకెళ్లారు, ఆ బ్యాగుల్లో ఏముందో నాకు తెలియదు అని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ప్రధానిని కలవడానికి వెళ్లిన యడియూరప్ప ఆరుబ్యాగులను ఎందుకు తీసుకెళ్లారు?. త్వరలో అన్ని విషయాలూ బయటపడతాయి అని చెప్పారు. ప్రధానిని కలిసిన యడియూరప్పకు ఎంత గౌరవ మర్యాదలు లభించాయో చూడాలన్నారు. అక్రమ గనులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు నా మద్దతు ఉంటుందని అన్నారు. -
వెండితెరపై మారేపల్లి కుర్రోడు
పుట్టింది పల్లెలో అయినా చలనచిత్రసీమలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యువకుడి కథ ఇది. పేదరికమే నేపథ్యం కానీ కష్టపడి చదువుకుని ఉద్యోగం చేస్తూనే తన కిష్టమైన చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు కుమార స్వామి. కథనాయకుడుగా ఎదిగిన దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన ఈ యువకుడు ‘హెచ్ 23’ సినిమాలో హీరో అవకాశం దక్కించుకున్నాడు. శుక్రవారం థియేటర్లలో విడుదుల కానున్న ఆ సినిమా హీరో ప్రస్థానం ఇలా సాగింది. సాక్షి, దేవరాపల్లి (విశాఖపట్నం): దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఎన్నేటి వెంకట కుమార స్వామి తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు. మారేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్నేటి అప్పారావు, రమణమ్మ దంపతుల కుమారుడు స్వామి. అతనికి అక్కా చెల్లి ఉన్నారు. తల్లిదండ్రులు రోజు వారీ కూలీ పనులకు వెళ్తూ కుటుంబ పోషణ చేసేవారు. కష్టపడి ఉన్నత చదువులు చదివిన కుమార స్వామి మదురై లో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయాలతో అనుకోకుండా చిత్ర పరిశ్రమవైపు అడుగులు పడ్డాయి. ప్రస్తుతం వైవీకేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఇమంది శ్రీను దర్శకుడిగా రూపొందించిన హెచ్ 23 సినిమాలో కుమారస్వామి హీరోగా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 థియేటర్లలో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం యూత్ ఫుల్ హర్రర్, కామెడీ అని, అందరినీ అలరిస్తుందని కుమార్‌స్వామి తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల్ రన్ సందీప్ కిషన్ ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో కోటి రూపాయల బడ్జెట్‌తో కేవలం 27 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాకు నిర్మాతలుగా కె.నవీన, వైవీ సంధ్య వ్యవహరించారు. సినీ రంగ ప్రస్థానం ఇలా.. ఎన్నేటి వెంకట కుమార్ స్వామి టెన్త్, ఇంటర్ దేవరాపల్లి ప్రభుత్వ హైస్కూల్, కళాశాలలోను, డిగ్రీ చోడవరం ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం ఏయూ క్యాంపస్ స్టూడెంట్‌గా పీజీలో ఎంకామ్ పూర్తి చేశాడు. అకౌంట్స్ పూర్తయిన తర్వాత మదురైలో కనస్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తుండగా అనుకోకుండా వచ్చిన ఆఫర్‌తో హైదరాబాద్‌లోని రవికిరణ్ వద్ద అకౌంటెంట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరాడు. రవికిరణ్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా తాను అకౌంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించడంతో చిత్ర పరిశ్రమలో అతనికి మరింత పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌తో కొత్త హీరోలు కూడా సినిమా తీయవచ్చునని దృఢ సంకల్పంతో పెద్ద సినిమాలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని కుమార్ స్వామి తెలిపాడు. విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్ క్రియేషన్ సంస్థను ఏర్పాటు చేశానని ఈ క్రియేషన్ కింద వైజాగ్‌పై పాటను చిత్రీకరించామని చెప్పాడు. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలతో పాట రూపంలో వినిపించామని తాము పడిన శ్రమకు మంచి స్పందన లభించిందని యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అయిందని తెలిపాడు. తాము రూపొందించి చిత్రలహరి వెబ్ సిరీస్ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించిందన్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణం తల్లిదండ్రులతో పాటు మా కుటుంబ సభ్యులైన అక్క, చెల్లె, బావల సహాయ సహకారం, ప్రోత్సాహంతోనే తన సినీ ప్రస్థానం కొనసాగుతోంది. చిత్ర పరిశ్రమలు పలువురు ప్రముఖుల సలహాలు, సూచనలు కూడా అందించారు. విశాఖపట్నం వేదికగా ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయడం ఆనందంగా ఉంది. తక్కువ బడ్జెట్‌తో కూడా సినిమా తీయాలన్న సంకల్పం నెరవేరింది. ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారని ఆశిస్తున్నా. –ఎన్నేటి వెంకట కుమార్ స్వామి, హెచ్23 మూవీ సినీ హీరో -
ఊహ తెలిసినప్పటి నుంచే సినిమా పిచ్చి
సాక్షి, మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఆ కుర్రాడికి ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పల్లెను వదిలి.. పట్టణం బాటపట్టాడు. ఎం.కాంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఆ పట్టాను సినీ ఇండస్ట్రీలో ప్రవేశానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ముందుగా సినిమా నిర్మాణ సంస్థలో అకౌంటెంట్‌గా చేరాడు. ఒక వైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమా రంగంపై అవగాహన పెంచుకున్నాడు. అలా సినీ ప్రముఖులతో పరిచయాలు మొదలయ్యాయి. సీన్ కట్ చేస్తే.. విశాఖ వేదికగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో తనే హీరోగా నటించి భవిష్యత్‌కు పునాది వేసుకున్నాడు. అతనే దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి ఎన్నేటి.. అతను నటించిన హెచ్ 23 చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అతనితో ‘సాక్షి’చిట్‌చాట్. తల్లిదండ్రుల ప్రోత్సాహమే నటుడిని చేసింది నటనపై నాకున్న ఆసక్తిని చూసి నాన్న ఎన్నేటి అప్పారావు, అమ్మ రమణమ్మలు ప్రోత్సహించారు. అలా పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి చేరుకున్నాను. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఒకవైపు పీజీ చదువుకుంటూనే లఘు చిత్రాలు తీశాను. వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి.. ఆ చిత్రాలకు వచ్చిన స్పందనను బేరీజు వేసుకున్నాను. సప్తగిరి బ్యానర్స్‌లో అకౌంటెండ్‌గా.. సినిమాల నిర్మాణం, దాని వెనుక ఉన్న శ్రమ తదితర అంశాలు తెలుసుకునేందుకు సప్తగిరి బ్యానర్స్‌లో అకౌంటెండ్‌గా చేరాను. సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని అంశాలు తెలుసుకున్నాను. ‘వైజాగ్’ పాట వైరల్ అయింది విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్ క్రియేషన్ సంస్థను ఏర్పాటు చేశా. ఈ క్రియేషన్ కింద ‘వైజాగ్’పాటను చిత్రీకరించాం. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను పాట రూపంలో వినిపించాం. మా శ్రమకు మంచి స్పందన లభించింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అయింది. అనంతరం చిత్రలహరి వెబ్ సిరీస్ చేశా. ఈ సిరీస్ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించింది. హెచ్ 23తో తెరంగ్రేటం షార్ట్ ఫిల్మ్‌లకు వచ్చిన స్పందనతో హెచ్ 23 సినిమాను విశాఖ వేదికగా పూర్తి చేశాను. బి.టెక్ బాబులు ఫేం ఇమంది శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. హర్రర్, కామెడీతో.. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా హర్రర్‌తోపాటు కామెడీ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. నేను హీరోగా, మౌనరాగం ఫేం కవిత, శ్రీజ హీరోయిన్లుగా నటించాం. పలు లఘు చిత్రాల్లో ప్రతిభ చూపిన వారిని మిగిలిన పాత్రలకు ఎంపిక చేశాం. ఇదే బ్యానర్‌పై మరో రెండు చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. సస్పెక్ట్ , జగన్నాటకం చిత్రాలకు సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తి చేశాం. హెచ్–23 చిత్రాన్ని ఆదరించండి. చిన్న చిత్రానికి గొప్ప విజయం అందించి నన్ను ఆశీర్వదించండి అంటూ ముగించారు. (చదవండి: ఎన్టీఆర్ కొత్త సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!) -
విద్యార్థుల దశ ఇకనైనా మారేనా?
దేశంలో 1986 నుండి అమలులో ఉన్న 10+2 విద్యావిధానం స్థానంలో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నూతన విద్యా విధానంపై 2015 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ సంఘాల నుండి రెండు లక్షలకు పైగా సూచనలు సలహాలను స్వీకరించి కస్తూరిరంగన్ నివేదిక ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. (1) పాఠశాల విద్య (2) ఉన్నత విద్య. పాఠశాల విద్యను నాలుగు రకాలుగా విభజించారు. ఇందులో 3 నుండి 18 సంవత్సరాలు గల విద్యార్థులను చేర్చారు. (1) పునాది స్థాయి 1, 2వ తరగతులు (2) తయారు స్థాయి 3, 4, 5వ తరగతులు (3) మాధ్యమిక స్థాయి 6, 7, 8వ తరగతులు (4) సెకండరీ స్థాయి 9, 10, 11, 12వ తరగతులు, ఈ నూతన విధానంలో అదనంగా 3 నుండి 6 సంవత్సరాల విద్యార్థులను చేర్చారు. దీంతో 2 కోట్లమంది పిల్లలకు విద్యాభ్యసనకు అవకాశం కలుగుతుందని కేంద్రం అంచనా వేసింది. ఉన్నత విద్యలో గ్రాడ్యుయేషన్ కోర్సులను 3 లేదా 4 సంవత్సరాల మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ని ప్రవేశపెట్టనున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను 1 లేదా రెండేళ్లుగా నిర్ధారించారు. మొత్తంగా దేశ అక్షరాస్యత 100% చేరుకునే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు, ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యారంగంపై ఖర్చును జాతీయ జీడీపీలో 6% చేరుకోవాలని నిర్ణయించారు. నూతన విద్యా విధానంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఇతర ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ఆర్థికపరమైన రాయితీలు కొనసాగుతాయని తెలిపారు. కాలానుగుణంగా, అవసరాల రీత్యా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సమానంగా పోటీ పడాలంటే విద్యా విధానాలలో మార్పు చేసుకోకతప్పదు. కేవలం విద్యా విధానాల మార్పు వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ డబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎంతమేరకు లబ్ధి చేకూరుతుందో ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యార్థుల చేరిక దినదినం పెరుగుతోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాలు తమ పిల్లలను 90% పైగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆంగ్ల మాధ్యమంలో మౌలిక వసతులు కలిగిన విద్యా సంస్థలలో చదివించడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులైన పక్కా భవనాలు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, టాయిలెట్స్, తగు బోధన బోధనేతర సిబ్బంది, కంప్యూటర్ విద్యా విధానం, రవాణా లాంటి సౌకర్యాలను కల్పించకుండా విద్యా విధానాల మార్పుతో పెద్దగా ఆశించిన ఫలితాలు రావు. కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెడుతూ 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్ర కులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లను కల్పించింది దేశంలో ఎక్కడా కూడా పటిష్టంగా ఈ రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో మాతృ భాషను కొనసాగిస్తూనే ఆంగ్ల మాధ్యమంలో విద్యాసంస్థల సంఖ్యను నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పెంచి రాజ్యాంగం కల్పిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలుపరచి ఆర్థిక సహకారాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానాల పేరిట ప్రైవేటు సంస్థలకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తే లక్ష్యం నెరవేరకపోగా దేశంలో విద్యా రంగం అధోగతి పాలయ్యే అవకాశాలే ఎక్కువ. కె. కుమారస్వామి వ్యాసకర్త ప్రముఖ సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94909 59625 -
ఎంత సిగ్గుచేటు: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు: పాదరాయణపురలో హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఉపేకక్షించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బెంగళూరు పరిధిలోని పాదరాయణపురలో ముగ్గురు వ్యక్తులు కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, పోలీసులపై కొంత మంది దాడికి దిగారు. బారికేడ్లను, వైద్య పరికరాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఆశా వర్కర్లు, పోలీసులు, డాక్టర్లపై దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ దాడి సిగ్గుచేటు. దాడులు చేసింది ఏ మతానికి చెందినవారైనా చట్టప్రకారం శిక్షించాల్సిందే. లాక్డౌన్ మార్గదర్శకాలకు ప్రతిఒక్కరూ పాటించాల’ని అన్నారు. కాగా, పాదరాయణపురలో దాడికి పాల్పడిన 58 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ, రాష్ట్ర హోంమంత్రితో సహా పలువురు అధికారులు సంఘటనా స్థలంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. మరోవైపు తన కొడుకు పెళ్లిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కుమారస్వామిపై చర్యలు తీసుకోవాలన్న వాదనలు ఇంకా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కన్నడవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం -
నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
-
మే 3కల్లా కరోనా కేసులు తగ్గే అవకాశం..
-
కరోనా: నిఖిల్ పెళ్లిపై సీరియస్
-
నిఖిల్ పెళ్లి ఈ నెల 17నే
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన తన కుమారుడు, నటుడు నిఖిల్ వివాహం అదే సమయానికి జరుగుతుందని, కానీ మొదట చెప్పినట్లు అంగరంగ వైభవంగా కాదని మాజీ సీఎం. హెచ్.డి.కుమారస్వామి అన్నారు. మంగళవారం తమ కుమారుడు నిఖిల్ వివాహం విషయమై ఆయన మాట్లాడుతూ అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన ఈ వివాహం జరుగుతుంది. వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరవుతారు. బెంగళూరులో మా ఇంటిలోనే పెళ్లి జరుగుతుంది అని తెలిపారు. -
రెండు నెలల్లో సర్కార్ పతనం తథ్యం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సర్కార్ రెండు నెలల్లో పతనం కాకతప్పదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన నగరంలో దాసరహళ్లిలో నిధుల కోతను వ్యతిరేకిస్తూ జేడీఎస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తను అభివృద్ధి కోసం మాత్రమే తల వంచుతానన్నారు. ఇదీ ఇప్పటికి నిర్వహిస్తున్న ధర్నా మాత్రమేనని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే వచ్చే రోజుల్లో విధానసౌధను కూడా ముట్టడిస్తామన్నారు. శికారిపురకు సీఎం బీఎస్ యడియూరప్ప రూ. 800 కోట్లను విడుదల చేశారు. అయితే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులను విడుదల చేసినట్లు కుమార గుర్తు చేశారు. ఇది ఒక విధంగా సిగ్గులేని ప్రభుత్వామని ఎదురుదాడి చేశారు. వరదలతో రెండన్నర లక్షల మంది నిరాశ్రయులైతే వారికి సాయం అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు వెళ్లి ప్రసంగిస్తారు. వరద బాధితుల సమస్యలను మా త్రం పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఎవరితో విచారణ చేసినా భయపడేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడ హెచ్ కే కుమారస్వామి, ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘అరెస్ట్ వెనుక ఎవరున్నారో తెలుసు’
సాక్షి, బెంగళూరు : మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు 17 మంది ఎమ్మెల్యేలకు రూ. 15 నుంచి 20 కోట్ల వరకు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నగదు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. 2008లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీఎస్ యడియూరప్ప నేరుగా జేడీఎస్ పార్టీకి చెందిన శరణపాటిల్‌కు రూ. 10 కోట్లను అఫర్ చేసినట్లు కుమారస్వామి ఆరోపించారు. కుమారస్వామికి కోర్టు నోటీసులు మాజీ సీఎం కుమార స్వామికి మరో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. బెంగళూరు నగరం సమీపంలో ఉన్న వడేరహళ్లిలో ఉన్న భూముల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు నమోదు కావడంతో విచారణకు హాజరు కావాలని కుమారస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 2006లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు బనశంకరి 5వ స్టెజీ వడేరహళ్లిలో ఉన్న 2.4 ఎకరాల భూమిని డీ నోటిఫికేషన్ చేయడంతో 2012లో ఆయనపై కేసు నమోదు చేశారు. చామరాజనగర జిల్లా సంతమారనహళ్లికి చెందిన మహాదేవ స్వామి డీ నోటిఫికేషన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు కుమారస్వామికి నోటీసులు జారీ చేసింది. -
యడ్డికి షాక్!
సాక్షి, చెన్నై: కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేక్ పడింది. కుమార స్వామి సర్కారు వదలిపెట్టిన పనిని తాను ముగించేందుకు దూకుడు పెంచగా, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ షాక్ ఇచ్చింది. మేఘదాతుకు అనుమతులు నో అంటూ ఆ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు అంగీకరించి, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పుడే డ్యాం సాధ్యమని తేల్చింది. సీఎం పళనిస్వామి చేస్తూ వచ్చిన ప్రయత్నాలకు తాజాగా ఫలితం తగ్గడం అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందాన్ని నింపింది. కర్ణాటక– తమిళనాడు మధ్య కావేరి నదీ జలాల పంపిణీ వివాదం కొత్తేమీ కాదు. తమిళనాడుకు ప్రతి ఏటా కర్ణాటక సర్కారు 177.25 టీఎంసీల నీళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఆ మేరకు జూన్‌లో 9.19 టీఎంసీలు, జూలైలో 31.24 టీఎంసీలు, ఆగస్టులో 45. 95 టీఎంసీలు, సెప్టెంబరులో, డిసెంబరులో 7.35 టీఎంసీలు, జనవరిలో 2.76 టీఎంసీలు, ఫిబ్రవరి నుంచి మే వరకు 2.5 టీఎంసీలు చొప్పున దశల వారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే, ప్రతిఏటా ఈ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. ఇక, గతంలో తమిళనాడుకు అనుకూలంగా కావేరి ట్రిబ్యునల్ ఇచ్చినతీర్పును తుంగలో తొక్కిన కేంద్రం పాలకులు ఎట్టకేలకు ప్రత్యామ్నాయంగా కావేరి యాజమాన్య సంస్థ, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీని మమా అనిపించే రీతిలో ఏర్పాటు చేశారు. అయినా, తమిళనాడుకు ఒరిగింది శూన్యమే. ఈ కమిటీ ముందు సైతం నీటి కోసం సమరం సాగించాల్సిన పరిస్థితి తమిళనాడుకు తప్పడం లేదు. గత ఏడాది ఈ సంస్థ ఏర్పాటు చేసినా, నైరుతి రుతుపవనాల రూపంలో భారీగానే కావేరిలోకి నీళ్లు వచ్చాయి. మెట్టూరు జలాశయం రెండు సార్లు నిండి, ఉబరి నీరు సైతం వృథాగా సముద్రంలోకి వెళ్లింది. అదే సమయంలో వృథా అవుతున్న నీటిని పరిరక్షించుకుంటామన్న నినాదంతో కావేరి తీరంలో కొత్తగా జలాశయంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు. నో..నో..నో.... కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న దృష్ట్యా, మేఘదాతులలో డ్యాం నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుందని భావించిన ప్రస్తుతం సీఎం యడియూరప్ప వేసిన లెక్కలు తప్పుయ్యాయి. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసిన యడియూరప్ప డ్యాం నిర్మాణ అనుమతుల విషయంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో యడ్డి ప్రయత్నాలకు, దూకుడుకు బ్రేక్ వేస్తూ అటవీ, పర్యావరణశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఇది యడ్డి సర్కారుకు షాక్కే. అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఆ శాఖకు వెళ్లిన అన్ని రకాల పరిశీలనలు తిరస్కరణకు గురయ్యాయి. మేఘదాతులో జలాశయం నిర్మాణం విషయంగా తమిళనాడుతో చర్చించాల్సిన అవసరం ఉందని, తమిళనాడు అనుమతి తప్పనిసరిగా అందులో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి ఉందని, తమిళనాడు అంగీకారం తదుపరి వచ్చే ఏకాభిప్రాయం మేరకు మేఘదాతులో నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ శాఖ తేల్చింది. అలాగే, ఇప్పటికే పలుమార్లు తమిళనాడు ప్రభుత్వం ఆ డ్యాంకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఆశ్రయించి ఉన్నదని గుర్తు చేశారు. 4,096 హెక్టార్ల స్థలంలో డ్యాం నిర్మాణం అన్నది అసాధ్యం అని, ఈ దృష్ట్యా, కర్ణాటక విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం పళనిస్వామి గత కొన్ని నెలలుగా మేఘదాతుకు వ్యతిరేకంగా తీవ్ర చర్యలు చేపట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు, ఇక్కడకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మేఘాదాతులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు సమర్పించారు. అధికారవర్గాలు సైతం కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ముందు బలమైన వాదనల్ని వినిపించిన దృష్ట్యా, తాజాగా అందుకు తగ్గ ఫలితం దక్కినట్టు అయింది. కర్ణాటక ఆ డ్యాం నిర్మాణం కోసం మళ్లీ మళ్లీ కేంద్రం వద్ద ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని, తాజా ప్రకటన, పరిస్థితుల్ని పరిగణించి, మళ్లీ మేఘదాతు నినాదాన్ని కర్ణాటక చేతిలోకి తీసుకోకుండా పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంకే నేత రాందాసు ఓ ప్రకటన సూచించారు. మేఘదాతుతో అడ్డంకి .. కావేరి తీరంలోని మేఘదాతు 64 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు తగ్గట్టుగా జలాశయ నిర్మాణంపై కర్ణాటక పాలకులు దృష్టి పెట్టారు. మేఘదాతులో జలాశయ నిర్మాణం జరిగి తీరుతుందని తొలుత సిద్ధరామయ్య, ఆ తదుపరి కుమారస్వామి సర్కారులు బల్లగుద్ది మరీ చెప్పాయి. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు వేగవంతం చేశాయి. మేఘదాతుల జలాశయం నిర్మించి, ఆ నీటిని బెంగళూరు అవసరాలకు ఉపయోగించబోతున్నట్టుగా ప్రకటించి, అందుకు తగ్గ పనులు వేగాన్ని పెంచారు. దీంతో తమిళనాట మేఘదాతులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, సమరాలు తప్పలేదు. అలాగే, ఈ డ్యాం నిర్మాణం కోసం కేంద్రం అనుమతి కోరే రీతిలో పలుమార్లు కర్ణాటక పాలకులు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత పాలకులు వదలిపెట్టిన పనుల్ని తన నేతృత్వంలో ముగించేందుకు తగ్గట్టుగా కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్ధమయ్యారు. -
కేంద్రం ఇలాంటి నిర్ణయాలతో విభేదాలు సృష్టిస్తోంది
-
జాతకం తారుమారు అయ్యిందా?
సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్‌కు కేబినెట్లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది. చదవండి: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం పదవుల సంగతేమిటి? అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్ డిమాండ్ చేయవచ్చు. ఆది నుంచీ ఆవేశాలు అనర్హతకు గురయిన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎ.శివరామ్ హెబ్బార్ ( యల్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్.రోషన్ బేగ్ (శివాజీనగర); ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్ పేట); కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్ (చిక్కబళ్లాపుర); హెచ్. విశ్వనాథ్(హుణసూరు); బీసీ పాటిల్ (హీరేకరూర్); ఆనంద్ సింగ్ (హొసపేట); ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర). -
మూక హత్యలపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూక హత్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలో ఎలాంటి సారూప్య అంశాలు లేవని బుధవారం రాజ్యసభలో ప్రభుత్వం పేర్కొంది. మూకదాడులపై బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, ప్రధాని ఇప్పటికే ఈ దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని వీటిలో సారూప్యత ఏమీ లేదని చెప్పారు. మూక దాడులు త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా వెలుగుచూశాయని, గతంలోనూ ఇలాంటి ఉదంతాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు గత ఐదేళ్లుగా మైనారిటీలు, దళితులపై మూక హత్యలు, మూకదాడులు పరిపాటిగా మారాయని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్‌కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి. చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..? సభ 10 నిమిషాలు వాయిదా అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్‌కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు. జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. -
బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?
బెంగళూర్ : కన్నడ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై మంగళవారం సాయంత్రం ఓటింగ్ జరుగుతుందని భావిస్తుండగా అంతకు ముందే జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సారథి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేర్చేందుకు గత రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బలపరీక్షకు ముందే అస్త్రసన్యాసం చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా ఇప్పటికే బలనిరూపణపై రెండు సార్లు డెడ్లైన్లు విధించినా స్పీకర్ వాటిని పట్టించుకోకపోవడంమరోవైపు సోమవారం విశ్వాస తీర్మానంపై ఓటింగ్ తప్పదని స్పీకర్ సంకేతాలు పంపడంతో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకే కుమారస్వామి మొగ్గుచూపుతున్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కుమార సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీ కుట్రపన్నిందని మంత్రి కృష్ణ బైరెడ ఆరోపించారు. ఆపరేషన్ కమలంను అమలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ రాష్ట్ర చీఫ్ యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్‌లో కలహాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. మైనారిటీలో పడిన సంకీర్ణ సర్కార్ బలనిరూపుణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయ హైడ్రామాకు తెరపడలేదు. కుమారస్వామి సర్కార్ బలపరీక్షపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న క్రమంలో సభ సోమవారానికి వాయిదా పడింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ పట్టుబట్టగా గందరగోళం మధ్యే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. బలపరీక్షను చేపట్టాలన్న గవర్నర్ సూచనను తోసిపుచ్చడం పట్ల బీజేపీ నేత యడ్యూరప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వాస పరీక్షను వెంటనే నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్‌ను తోసిపుచ్చిన స్పీకర్ రమేష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడాలని చెప్పారు. మరోవైపు కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠ రేపుతుండగా బలపరీక్షపై అంతకుముందు గవర్నర్ ఇచ్చిన మరో డెడ్‌లైన్‌పై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. బలపరీక్షను తక్షణమే ఎదుర్కోవాలని తనకు గవర్నర్ రాసిన లేఖను లవ్ లెటర్‌గా ఆయన అభివర్ణించారు. విశ్వాస పరీక్షపై చర్చ ఎలా సాగాలనేదానిపై గవర్నర్ నిర్ధేశించలేరని స్పష్టం చేశారు. గవర్నర్ ఆదేశాలు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్వర్వులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో బలపరీక్షపై నిర్ణయాన్ని తాను స్పీకర్‌కే వదిలివేస్తున్నానని, సభ నడిపే తీరును ఢిల్లీ శాసించలేదని, గవర్నర్ పంపిన లేఖ నుంచి తనను కాపాడాలని కోరుతున్నానని స్పీకర్‌ను ఉద్దేశించి కుమారస్వామి అన్నారు. గవర్నర్‌కు తాను గౌరవం ఇస్తానని, అయితే ఆయన నుంచి తనకు వచ్చిన రెండో లవ్ లెటర్ తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయం గవర్నర్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని కుమారస్వామి ప్రశ్నించారు. కాగా బలపరీక్షపై శుక్రవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఓటింగ్ చేపట్టాలని గవర్నర్ వజూభాయ్ వాలా స్పీకర్‌కు మరో డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్షలో చేతబడిపై చర్చ అసెంబ్లీలో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ విధించిన రెండో డెడ్‌లైన్ కూడా ముగిసింది. విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతే ఓటింగ్ చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు సభలోకి రేవణ్ణ నిమ్మకాయలతో వచ్చారని బీజేపీ ఆరోపించింది. చేతబడులతో ప్రభుత్వాలు నిలబడతాయా అని కుమారస్వామి బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. విశ్వాస పరీక్షలో చేతబడిపై చర్చ ఆసక్తికరంగా సాగింది. -
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్ష వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈరోజే నిర్వహించాలంటూ బీజేపీ నేతలు పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను 30 నిమిషాలు వాయిదా వేశారు. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ పార్టీ సభలో సంచలన ఆరోపణలు చేసింది. కిడ్నాప్‌కు సంబంధించి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారని మంత్రి డీకే శివకుమార్ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్‌కు కోరారు. కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్ రమేష్ కుమార్ సీరియస్‌గా స్పందించారు. కిడ్నాప్ అయిన విషయం వాస్తవమేనా కాదా? ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు లాంటి వివరాలతో శుక్రవారం తనకు నివేదిక ఇవ్వాలని హోంమంత్రిని ఆదేశించారు. మరోవైపు విప్ విషయంలో క్లారిటీ లేనందున విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు గందరగోళంగా ఉందని, విప్ జారీచేయడంపై క్లారిటీ ఇచ్చాకనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. విప్‌పై స్పష్టత వచ్చేవరకు విశ్వాస పరీక్ష వాయిదా వేయాలని కోరారు. కాగా ఈరోజే విశ్వాస పరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతోంది. ఓటింగ్ నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్, జేడీఎస్ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత యడ్యూరప్ప ఆరోపించారు. ఈ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు కర్ణాటక అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అవిశ్వాస పరీక్ష ఎటూ తేలడం లేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిపించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరారు. బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. బలపరీక్షను ఈ రోజే నిర్వహించాలని స్పీకర్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఓ సందేశాన్ని పంపారు. గవర్నర్ పంపిన సందేశాన్ని స్పీకర్ రమేష్ కుమార్ సభలో చదివి వినిపించారు. -
సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!
సాక్షి, బెంగళూరు: రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయాధికారమని స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితిలో రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను ఆదేశించలేమని తెలిపింది. తద్వారా రాజ్యాంగబద్దమైన శాసన సభాపతి పదవిని సుప్రీంకోర్టు గుర్తించినట్టు అయింది. స్పీకర్ కోర్టులోకి బంతి రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై సుప్రీంకోర్టు తీర్పుతో బంతి స్పీకర్ కోర్టులోకి వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో రాజీనామాలపై కర్ణాటక శాసనసభాపతి రమేశ్‌కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మొత్తంగా 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు.. సంకీర్ణ సర్కారుకు మనుగడకు పెనుగండంగా మారాయి. ఈ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా? లేక వారిపై అనర్హత వేటును వేస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ మొదట రాజీనామాల అంశాన్ని చేపడతారా? లేక అనర్హత వేటుకు మొగ్గు చూపుతారా? అన్నది వేచిచూడాలి. లేక, రాజీనామాలపై ఆయన నాన్చివేత ధోరణి అవలబించినా? అవలంబించవచ్చు. అయితే, గురువారం జరగబోయే బలపరీక్ష అన్ని రకాలుగా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. ఒకవేళ స్పీకర్ ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే.. అది బీజేపీకి లాభించే అంశం. అలా కాకుండా రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా.. అది కుమారస్వామి ప్రభుత్వానికి ఏ మేరకు మేలు చేయకపోవచ్చు. ఎందుకంటే, రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అలా కాకుండా రెబెల్ ఎమ్మెల్యేలు రేపటి బలపరీక్షకు దూరంగా ఉన్నా.. అది కూడా బీజేపీకే మేలు చేస్తుంది. అసెంబ్లీకి హాజరు కావడం రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని, సభకు హాజరుకావాలని వారిని ఎవరూ బలవంతపెట్టలేరని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా.. సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాకట అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా 16 మంది రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదిస్తే సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 105కు చేరుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కలపుకొని 107 మంది సభ్యుల బలముంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80కాగా, 13మంది రాజీనామా చేశారు. జేడీఎస్ సభ్యుల సంఖ్య 37 కాగా, ముగ్గురు రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 101 మాత్రమే. ఈ నేపథ్యంలో ఒకవైపు సుప్రీంతీర్పు స్వాగతిస్తున్నామని కర్ణాటక స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించగా.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నామని బీజేపీ నేత యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం
బెంగళూర్ : మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు ఈనెల 18న క్లైమాక్స్‌కు చేరనున్నాయి. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సారథి, ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారని మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నిర్ధారించారు. 18న ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుందని చెప్పారు. విశ్వాస పరీక్ష తేదీపై సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో పాటు, బీజేపీ అంగీకరించాయి. కాగా, తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌కు సూచనలు ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై మంగళవారం కోర్టు వెలువరించే ఉత్తర్వులు విశ్వాస పరీక్షపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తమ రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం వహిస్తున్నారని మరో ఆరుగురు రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కారణంతో పదిమంది కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 16మంది రెబెల్ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్టయింది. గతంలో పదిమంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లోనే తాజా ఆరుగురు ఎమ్మెల్యేల విజ్ఞప్తినీ కలిపి విచారించాలని వారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మొత్తం 16మంది రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపి.. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. -
కర్ణాటకం : కాంగ్రెస్-జేడీఎస్ నేతల కీలక భేటీ
బెంగళూర్ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన క్రమంలో రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేర్చాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అసంతృప్త ఎమ్మెల్యేలు బెట్టువీడకపోవడంతో వారిని దారిలోకి తెచ్చేందుకు సంకీర్ణ నేతలు మంతనాలు జరుపుతున్నారు. సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆదివారం సాయంత్రం సీనియర్ కాంగ్రెస్ నేతలు, సీఎం కుమారస్వామి సహా కాంగ్రెస్-జేడీఎస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. కుమరప్ప గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో సీఎం కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హాజరయ్యారు. రెబెల్ ఎమ్మెల్యేల బుజ్జగింపు చర్యలతో పాటు అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అవసరమైన వ్యూహాలపై నేతలు చర్చించారు. మరోవైపు రాజీనామాలపై మరోమాట లేదని రెబెల్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పడం, బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతుండటంతో కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. -
సమయం లేదు కుమార..
బెంగళూర్ : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని లేకుంటే తక్షణమే తప్పుకోవాలని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేదని అన్నారు. సంకీర్ణ సర్కార్‌కు చెందిన 15 మందికి పైగా జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి కుమారస్వామి సమయం వృధా చేయకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారని యడ్యూరప్ప గుర్తుచేశారు. కుమారస్వామి రేపు (సోమవారం) విశ్వాస పరీక్షను ఎదుర్కోవడమో, రాజీనామా చేయడమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ గూటికి చేర్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
సుప్రీంను ఆశ్రయించిన ఐదుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక స్పీకర్‌కి వ్యతిరేకంగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆనంద్ సింగ్, రోషన్ బేగ్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తమ రాజీనామాలు ఆమోదంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే 10 మంది రెబల్ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అప్పటివరకూ రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లో తమను ఇంప్లీడ్ చేసి విచారణ జరపాలని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ధర్మాసనాన్ని కోరారు. తమ రాజీనామాలు స్పీకర్ ఆమోదించేలా చూడాలని అభ్యర్థించారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. -
బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి
బెంగళూర్ : కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్‌ను కోరారు. శాసనసభలో తాను బలం నిరూపించుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక బిల్లును ఆమోదించేందుకు శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారిని మినహాయిస్తే మొత్తం 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో సంకీర్ణ ఎమ్మెల్యేల సంఖ్య రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే 100కు పడిపోవడం, బీజేపీ సభ్యుల సంఖ్య 107 కావడంతో బలపరీక్షను కోరడం వెనుక కుమారస్వామి వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్
బెంగళూర్ : కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. కర్ణాటకలో పాలక జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందున అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప కోరారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం సాయంత్రం యడ్యూరప్ప గవర్నర్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ కుమారస్వామి సర్కార్‌కు తగినంత సంఖ్యా బలం లేనందున తక్షణమే సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కుమారస్వామికి లేదని అన్నారు. మరోవైపు ముంబై హోటల్లో అసమ్మతి ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నించిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ముంబైలో మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డగించడం చూస్తుంటే బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన తీరు వెల్లడవుతోందని ఆరోపించారు. -
కర్ణాటకం : గవర్నర్‌ను కలవనున్న యడ్యూరప్ప
బెంగళూర్ : కర్ణాటక రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెబెల్స్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ చిట్టచివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప మరికాసేపట్లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ మైనారిటీలో పడిందని, తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీ శిబిరానికి చేర్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబైలో ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్‌కు చేరుకున్నారు. కాగా తమను ప్రలోభపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని ఎవరూ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖపై ఎమ్మెల్యేలు శివరామ్ హెబ్బర్, ప్రతాప్ గౌడ పాటిల్, బీసీ పాటిల్, సోమశేఖర్, రమేష్ జర్కిహొలి, బసవ్‌రాజ్, గోపాలయ్య, విశ్వనాధ్, నారాయణ్ గౌడ, మహేష్ కుముతలి ఉన్నారు. -
కన్నడ సంక్షోభం: నేడు స్పీకర్ నిర్ణయం.. ఉత్కంఠ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని స్పీకర్ రమేశ్‌కుమార్ మంగళవారం పరిశీలించనున్నారు. ఆయన నేడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. స్పీకర్ ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఇక, స్పీకర్ రాజీనామాలు ఆమోదించకుండా.. దాటవేత ధోరణి అవలంబిస్తే.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొంత సమయం దొరికినట్టు అవుతోంది. అలా కాకుండా రాజీనామాలు ఆమోదించినా.. లేదా అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించినా సంకీర్ణకూటమికి గడ్డుకాలమే. అయితే, వ్యక్తిగతంగా తనను కలువాల్సిందిగా స్పీకర్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఆదేశించి అవకాశముందని వినిపిస్తోంది. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించి తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ముంబై వెళ్లారు. ముంబైలో మకాం వేసిన రెబెల్ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక, రెబెల్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మరోవైపు ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. దీంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిందని, వెంటనే కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది. (చదవండి: మంత్రులంతా రాజీనామా) -
కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
-
నేను తింటున్నా.. నీవు తిను!
కర్ణాటక, బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో సామాన్య ప్రజల వద్ద వందల కోట్ల రూపాయలతో ఉడాయించిన ప్రముఖ జువెలరీ అధినేత, ఐఎంఏ సంస్థ యజమాని మన్సూర్‌తో సీఎం కుమారస్వామి కలిసి భోజనం చేస్తున్న ఫొటోను బీజేపీ తన ట్విటర్లో పోస్టు చేసింది. ‘నేను తింటున్నాను... నీవు తిను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మన్సూర్ లాంటి మోసగాడు ఇక్కడ ప్రజలను మోసగించి పరారయ్యాడు అంటూ బీజేపీ తన ట్విటర్లో ట్వీట్ చేసింది. దీనికి సమాధానంగా సీఎం కుమారస్వామి ఇలా పాత ఫొటోను పెట్టుకుని ప్రజలను తప్పుదా రి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలా చేయడం బాధ కలిగించదని ట్విటర్లో పేర్కొన్నారు.బీజేపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. -
12న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ
సాక్షి, బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ ద్వారానే సంకీర్ణ సర్కారులోని అసమ్మతి వేడిని చల్లబరిచేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పెద్దలు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం కుమారస్వామి తీర్మానించారు. విస్తరణపై శనివారం గవర్నర్ వజుభాయివాలాను సీఎం కలిసి వివరాలు అందజేశారు. 12న ఉదయం 11.30 గంటలకు విస్తరణ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో పదవుల కోసం సంకీర్ణ పక్షంలో చాలామంది ఆశావహ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లు షురూ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని తమకు తెలిసిన పరిచయాలతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శంకర్, నాగేశ్‌లకు పదవులు కేబినెట్లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్, రెండు జేడీఎస్ కోటాలోనివి. రెండు మంత్రి పదవులు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు దాదాపుగా ఖరారయ్యాయి. రాణిబెన్నూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్, ముళబాగిలు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. మిగిలిన స్థానాన్ని అలాగే ఉంచుతారని సమాచారం. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికో ఒకరికి ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి మరింత చెలరేగే ప్రమాదం ఉందని సంకీర్ణ సారథులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మంత్రివర్గాన్ని ఏకంగా ప్రక్షాళన చేయాలని కొందరు సంకీర్ణనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒక్కటీ కాంగ్రెస్‌లో ఎవరికి? ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి ఎక్కువయితే ఆ పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అప్పుడు ఎవరికి చోటు కల్పించాలనే విషయమై ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌తో సీఎం చర్చించి ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్‌లో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆకాంక్షిస్తున్నారు. బీసీ పాటిల్, రామలింగారెడ్డి, రోషన్ బేగ్, రమేశ్ జార్కిహొళితో సహా సుమారు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఎంతోకాలంగా కన్నేసి ఉన్నారు. వీరిలో ఎవరికి అనేది సస్పెన్స్‌గా ఉంది. లోక్‌సభ ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు రెండు సార్లు ముహూర్తాలు పెట్టి తర్వాత విరమించుకున్నారు. బుధవారం మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో జరగనుంది. -
ఎన్డీయేలో చేరండి: జేడీఎస్‌కు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఏ క్షణానా ఏ ఎమ్మెల్యే గోడుదూకుతారోనని ఇటు జేడీఎస్ అటు కాంగ్రెస్ నేతల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. జేడీఎస్‌ను ఎన్డీయే కూటమిలో చేరవల్సిందిగా ఆహ్వానించారు. ‘‘ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్‌కి కటీఫ్ చెప్పి మాతో కలిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తాం. కుమారస్వామి ప్రభుత్వం దినదిన గండంగా గడుస్తోంది. మాతో కలిస్తే జేడీఎస్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ నేతలే కుట్రపన్నుతున్నారు. ప్రజలకు మంచి చేయాలని కుమారస్వామికి ఉన్నా.. దానికి కాంగ్రెస్ అడ్డుపడుతోంది. ఆయన సీఎం అయినప్పటి నుంచి బహిరంగ సభల్లోనే అనేక సార్లు కన్నీరుపెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. తూమకూరు మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి కూడా స్థానిక హస్తం నేతలే అని రాందాస్ అథవాలే ఆరోపించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 చోట్ల, జేడీఎస్ మిగిలిన 8 స్థానాల్లో పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య సహకారం, ఓట్ల బదిలీ అనుకున్నంతగా జరగలేదు. మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు, కుమారస్వామి నేతృత్వంలోని ఒకరిని మరొకరు విశ్వాసంలోకి తీసుకోలేదు. దీంతో చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అన్నది సాఫీగా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఇటు కుమారస్వామి, అటు సిద్దరామయ్య పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాందాస్ అథవాలే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కనుంది. దీనిపై జేడీఎస్ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు. -
వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందని, కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చింతా మోహన్ పేర్కొన్నారు. 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా అంతకు ముందు దేవెగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ‘పుట్టిన రోజు సందర్భంగా 35 ఏళ్లుగా శ్రీవారిని దర్శించుకుంటున్నా. ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదు. మేం మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం.’ అని అన్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్య తీరాలని దేవుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు. -
సిద్ధూ వర్సెస్ కుమారస్వామి
సాక్షి బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ సంభాషణ తర్వాత పరిస్థితులన్నీ సర్దుకున్నాయని అందరూ భావించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు గడవకముందే మళ్లీ వివాదాలు తెరలేచాయి. అయితే ఈ సారి ఎవరైతే అనవసర వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణతో ఉండాలని ఫోన్లో సంభాషించుకున్నారో ఆ అధినేతలే ఈ సారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఖర్గే అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం.. సీఎం పదవిపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, జేడీఎస్ నేతల మాటల తూటాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను మళ్లీ సీఎం చేయాలని బహిరంగంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో వారితో పాటు సిద్ధరామయ్యకు చెక్ చెప్పేందుకు బుధవారం ఎంపీ మల్లికార్జున ఖర్గే అస్త్రాన్ని సీఎం కుమారస్వామి ప్రయోగించారు. ఈ అస్త్రానికి తిరుగు అస్త్రాన్ని గురువారం ట్వీటర్‌తో ద్వారా సిద్ధరామయ్య ప్రయోగించారు. గురువారం తాజా, మాజీ సీఎంల మధ్య ట్వీటర్ వార్ జరిగింది. రేవణ్ణ కూడా సీఎం అవ్వచ్చు.. జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి మల్లికార్జున ఖర్గేకు సీఎం కావాలని బుధవారం కుమారస్వామి వ్యాఖ్యానించారు. దీనికి ట్వీటర్ ద్వారా సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ‘మల్లిఖార్జున ఖర్గే సీఎం స్థానానికే కాదు. అంతకుమించి ఉన్నత స్థానానికి ఆయనకు అర్హత ఉంది. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీల్లో సీఎం స్థానానికి అర్హత కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అందులో హెచ్డీ రేవణ్ణ కూడా ఒకరు. అందరికి సమయం రావాలి’ అని ట్వీటర్ ద్వారా వ్యంగ్యంగా కుమారస్వామిని లక్ష్యంగా చేసుకుని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. రేవణ్ణ పేరును ప్రస్తావించడం ద్వారా జేడీఎస్‌లో ముసలం పుట్టించే ప్రయత్నాలు చేశారు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. దీనికి అంతేస్థాయిలో సీఎం కుమారస్వామి కూడా వెంటనే స్పందించి ఎదురుదాడి చేశారు. ‘‘ కొన్ని దశాబ్దాల కర్ణాటక రాజకీయ వాస్తవికతను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడు, విజ్ఞానవంతుడు అయిన మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కావాలని నేను మాట్లాడాను. నా వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులిమి అపార్థం చేసుకుని, తప్పుగా విశ్లేషణలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తిని నేను కాదు. పార్టీ, ప్రాంతాలకు అతీతుడై మహోన్నత వ్యక్తి ఖర్గే అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు’’ అని ట్వీటర్లో సిద్ధరామయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి అధినేతల మధ్య ట్వీటర్ వార్ వల్ల సంకీర్ణప్రభుత్వంలో మరోసారి రాజకీయ సునామీకి కారణమయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి
కొలంబో : శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జేడీఎస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. వీరంతా ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లారు. కొలొంబోలోని ‘ద షాంగ్రిలా హోటల్’లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన వారిలో శివన్న, పుట్టరాజు, మునియప్ప, లక్ష్మీనారాయణ, మారేగౌడ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చదవండి : దివ్య సందేశంపై రాక్షస కృత్యం! కాగా జేడీఎస్ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన నేతల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు. External affairs Min. @SushmaSwaraj has confirmed the death of two Kannadigas,KG Hanumantharayappa and M Rangappa, in the bomb blasts in #Colombo. I am deeply shocked at the loss of our JDS party workers, whom I know personally. We stand with their families in this hour of grief — H D Kumaraswamy (@hd_kumaraswamy) 22 April 2019 -
తెలుగు మహిళపై చంద్రబాబు యుద్ధం
సాక్షి బెంగళూరు/ యశవంతపుర (బెంగళూరు): అలనాటి నటి, ఇటీవల భర్తను కోల్పోయిన తెలుగింటి ఆడబిడ్డ సుమలతను ఎన్నికల్లో ఓడించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తన భర్త అంబరీష్ ఆశయ సాధన కోసం మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమెకు మద్దతుగా నిలబడడానికి బదులు ఓడించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. మండ్యలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ తరఫున చంద్రబాబు ప్రచారానికి దిగనున్నారు. దీనిపై కన్నడనాట ఉన్న తెలుగువారి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేనా 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయం అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం చంద్రబాబు నిఖిల్ తరఫున మండ్య సమీపంలోని పాండవపురంలో ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభావం ఉండదు: సుమలత ఏపీ సీఎం చంద్రబాబు మండ్యకు వచ్చి జేడీఎస్ తరఫున ప్రచారం చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత స్పష్టం చేశారు. సోమవారం ఆమె మండ్య పరిధిలోని మంచనహళ్లిలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మండ్యలో తెలుగువారు లేనందున చంద్రబాబు జేడీఎస్ తరఫున ప్రచారం చేసినా ఆయన ప్రభావం ఏమీ ఉండదన్నారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన దేవెగౌడ కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఓటర్లను కోరారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ, సీఎం కుమారస్వామిలకు మద్దతుగా సోమవారం సాయంత్రం ఆయన మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని పాండవపురలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. దక్షిణ భారత్‌కు దేవెగౌడ పెద్దదిక్కు అని, దేశం కోసం ఆయన ప్రధాని పీఠం చేపట్టి.. ఆ పదవికే వన్నె తెచ్చారని పొగడ్తలు గుప్పించారు. తొలుత కన్నడలో కొన్ని పదాలు మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. మండ్యలో దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పతనమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, బీజేపీని గెలిపిస్తే దేశం నాశనం అవుతుందని, ప్రధాని మోదీ, అమిత్‌షా అవినీతిపరులని ధ్వజమెత్తారు. మోదీనే మరోసారి ప్రధాని కావాలంటూ శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంతో కలసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, ఈ ఎన్నికల్లో మోదీ ఓడిపోయి గుజరాత్‌కు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం
బెంగళూరు : కర్ణాటకలో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు పలువురు జేడీఎస్ నాయకులు, వారి అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ దాడులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ నిర్వహిస్తున్న పీడబ్ల్యూడీ శాఖలో అవినీతి జరిగిందనే ఆరోపణ నేపథ్యంలో మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో రేవణ్ణ అనుచరుల ఇళ్లతో పాటుగా ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్, మంత్రి పుత్తరాజు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి... ‘ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మమ్మల్ని బెదిరించడానికి ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఐటీ దాడుల ద్వారా ఆయన నిజమైన సర్జికల్ స్ట్రైక్స్‌కు తెరతీశారు. ఆయనకు.. రాజ్యాంగం ప్రసాదించిన పదవిని అనుభవిస్తున్న ఐటీ ఆఫీసర్ బాలకృష్ణ సహకరిస్తున్నారు* అని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు కొంతమంది కేంద్ర ప్రభుత్వ సంస్థలను వాడుకునే అవకాశం ఉందని కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ రాజకీయంగా ఎదుర్కోలేకే ఒక్కోసారి ప్రత్యర్థులు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. ఐటీ శాఖ సోదాలు నిర్వహించే సమయంలో రక్షణ కోసం రాష్ట్ర పోలీసులను తమ వెంట తీసుకువస్తారు. కానీ గురువారం జరిగే దాడుల్లో సీఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగుతాయని నాకు సమాచారం అందింది. ఇది నిజంగా కుట్రపూరితమైనది’ కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అయితే ఆయన అన్నట్టుగానే గురువారం ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం. Hon'ble PM @NarendraModi is misusing the IncomeTax Dept to threaten the political leaders of Karnataka from JDS and Congress during election time They have planned to conduct IT raids on our important leaders.This is nothing but revenge politics.We will not be cowed down by this — H D Kumaraswamy (@hd_kumaraswamy) March 27, 2019 PM @narendramodi's real surgical strike is out in the open through IT dept raids. The constitutional post offer for IT officer Balakrishna helped the PM in his revenge game. Highly deplorable to use govt machinery, corrupt officials to harrass opponents during election time. — H D Kumaraswamy (@hd_kumaraswamy) March 28, 2019 -
సుమలతను ఓడించేందుకు ఇన్నికుట్రలా?!
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో దూకుడు పెంచుతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే కసితో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలోని మండ్య పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడి నుంచే సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ తొలిసారి పోటీ చేస్తుండగా.. దివంగత నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ భార్య సుమలత కూడా ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పొత్తులో భాగంగా సుమలతకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ బీజేపీ ముందుకొచ్చింది. దీంతో సుమలత- నిఖిల్ల మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ నాయకుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా నిఖిల్ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కుమారుడి కోసం రంగంలోకి దిగిన సీఎం కుమారస్వామి సుమలతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. భర్త చనిపోయిన బాధ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని.. ఏదో నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో విమర్శలకు సమాధానం చెబుతూనే సుమలత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను ఓడించేందుకు అధికార పార్టీ మరో ఎత్తుగడకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. సుమలత పేరుతో మరో ముగ్గురు మహిళలు.. అది కూడా కుమారస్వామి సామాజిక వర్గానికి చెందిన వారు మండ్య స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తద్వారా సుమలతకు పడే ఓట్లను చీల్చాలనేదే వీరి ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది.(చదవండి : సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు) ఇలా చేస్తారని ముందే తెలుసు.. సుమలత అంబరీష్ దాఖలు చేసిన అఫిడవిట్లో భాగంగా తాను ఎస్ఎస్ఎల్సీ పాసయ్యానని పేర్కొన్నారు. కాగా ఎం. సుమలత(భర్త పేరు- మంజె గౌడ) విద్యార్హత ఎనిమిదో తరగతిగా పేర్కొనగా, సుమలత(భర్త పేరు- సిద్దె గౌడ) ఏడో తరగతి వరకు చదివినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటుగా మరో సుమలత(భర్త పేరు- కె.దర్శన్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక సుమలతా అంబరీష్ తరఫున దర్శన్ అనే నటుడు ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ విషయం గురించి సుమలతా అంబరీష్ మాట్లాడుతూ..‘ వాళ్లు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడతారని ముందే తెలుసు. నన్ను ఓడించడానికి వారు వేసిన ఎత్తుగడ. నేను కూడా వారిలా చేయవచ్చు కానీ అది నాకు నచ్చదు. నేరుగా, న్యాయంగా ‘యుద్ధం’ చేసి గెలవాలనుకుంటున్నా. వాళ్లలా దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు అని వ్యాఖ్యానించారు. (చదవండి : నా భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే నిఖిల్‌కు ఓటు వేయాలా?!) కాగా 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన అంబరీష్ సొంత నియోజకవర్గం మండ్య నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. అంబరీష్ మరణం తర్వాత సుమలత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు ఒత్తిడి చేయగా ఆమె ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో కొడుకు గెలుపు కోసం కుమారస్వామి సహా ఆయన అనుచరవర్గం రంగంలోకి దిగడంతో.. ‘ఒక మహిళను ఓడించేందుకు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి, మంత్రులు ఆమెపై చవకబారు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే ఇప్పటికే సుమలత సగం విజయం సాధించినట్లుగా అన్పిస్తుంది’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉంది’
బెంగళూరు : తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చ రావడంతో రమేశ్ కుమార్ మాట్లాడుతూ... తనను తాను అత్యాచార బాధితురాలితో పోల్చుకున్నారు. ‘ ప్రస్తుతం నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలాగా ఉంది. ఒకే ప్రశ్న గురించి వాళ్లను ఎలా అయితే అనేక మార్లు ప్రశ్నిస్తారో నా పేరు ప్రస్తావించడం కూడా అలాగే అన్పించింది’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆడియో క్లిప్పింగుల అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ రాజకీయ కక్షతోనే కుమారస్వామి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్.. ‘బాగా చర్చించి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉంది’ అని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్ వారికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది. యడ్యూరప్ప ఏమన్నారు? మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్ కోరింది. -
‘మా ఎమ్మెల్యేకు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చింది’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు. గత రాత్రి తమ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి భారీ మొత్తంలో డబ్బును ఆఫర్ చేశారని తెలిపారు. ఎంత డబ్బు ఇస్తామన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారని చెప్పారు. అయితే, బీజేపీ ఆఫర్‌ను తమ ఎమ్మెల్యే తిప్పికొట్టారని తెలిపారు. తనకు డబ్బు అవసరం లేదని, ఎలాంటి కానుకలు వద్దని.. ఇలాంటి చర్యలతో ప్రలోభపెట్టొద్దని బీజేపీ నేతలను తమ ఎమ్మెల్యే హెచ్చరించారని కుమారస్వామి తెలిపారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని.. డబ్బు ఎరచూపి తమ ఎమ్మెల్యేలను లొంగదీసుకోలేరని తేల్చి చెప్పారు. కాగా సీఎం కుమారస్వామి ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తాము ఎలాంటి ప్రలోభాలకు గురిచేయలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే కుమారస్వామి బయటపెట్టాలని సవాల్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఇలాంటి ఆధారాలు లేని మాటలు సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ‘మేము ఆపరేషన్ కమలను నిలిపివేశాం. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్గత విభేదాల వల్ల కొంతమంది బయటకు వస్తున్నారు. విభేధాలు రాకుండా చూసుకోవడం ఆయన(కుమారస్వామి) విధి. ఇలాంటి ఆధారాలు లేని మాటలు మాట్లాడడం ఆయన ఆపాలి. మాకు 104 మంది ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆరోపణలు వదలి పాలనపై దృష్టిపెట్టాలి’ అని విమర్శించారు. -
శివ కుమార స్వామిజీ శివైక్యం
-
శివ కుమార స్వామిజీ శివైక్యం
బెంగళూరు : తుమ్కురు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ(111) శివక్యైం చెందారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. అయినా స్వామిజీ ఆరోగ్యం కుదటపడలేదు. గత 15రోజులుగా ఆయన వైద్యుల సమక్షంలోని చికిత్స పొందారు. ఇక స్వామిజీ ఆరోగ్య పరిస్థితిపై గత మూడు రోజులుగా గోప్యత పాటించిన అధికారులు.. సోమవారం 11.44 నిమిషాలకు తుదిశాస్వ విడిచారని ప్రకటించారు. ఇక స్వామిజీ మృతిపై కర్ణాటక సీఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. స్వామిజీ మరణవార్తతో అధికారులు మఠం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది సంఖ్యలోని ఆయన భక్తులు స్వామిజీ కడచూపు కోరకు అక్కడికి చేరకుంటున్నారు. మంగళవారం సాయంత్రం శివకుమార స్వామిజీ అంతి సంస్కారాలు జరగనున్నాయి. స్వామిజీ మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం రేపు సెలవుదినంగా ప్రకటించింది. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్ అవార్డును అందజేసింది. ఇక ఉదయం స్వామిజీ ఆరోగ్యం విషమించిందని అధికారులు ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మరి మఠానికి వచ్చారు. ప్రధాని దిగ్భాంత్రి శివకుమార స్వామిజీ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసమే శివకుమార స్వామిజీ జీవించారని, పేదరికం, సమానత్వం, ఆకలిపై పోరాటం చేశారని ట్వీట్ చేశారు. అణగారిన వర్గాలకు మంచి విద్యా, వైద్యం అందించడంలో స్వామిజీ కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. తాను తుమ్కురు సిద్ధగంగా మఠాన్ని దర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు
-
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్లు గుడ్‌బై
-
కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు ఇండిపెండెంట్లు షాక్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతు ఉపసంహరించకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్ నగేష్, ఆర్ శంకర్లు జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ మార్పును తాను కోరుకుంటున్న క్రమంలో కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నానని, మకర సంక్రాంతి రోజున ప్రభుత్వ మార్పును అభిలషిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ సుపరిపాలన, నిలకడైన ప్రభుత్వాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందని మరో ఎమ్మెల్యే ఆర్ నగేష్ ఆరోపించారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి అవగాహన, సమన్వయం లేదని అన్నారు. సుస్ధిర ప్రభుత్వం ఏర్పడే దిశగా తాను బీజేపీతో జట్టుకట్టాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాగా, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇరువురు మద్దతు ఉపసంహరించినా తమ సర్కార్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను డబ్బు, అధికారం పేరుతో ప్రలోభాలకు గురిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను గురుగావ్ రిసార్ట్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో వేగంగా పావులు కదుపుతోంది. కుమారస్వామి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నాహాలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
యడ్యూరప్ప అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు
-
బరిలో మనవళ్లు.. హసన్‌ను వదులుకుంది అందుకేనా?!
బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి వేణుగోపాల్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హసన్ లోక్‌సభ స్థానం నుంచి దేవెగౌడ మనుమడు, కర్ణాటక మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ఎన్నికల బరిలో దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిఖిల్ కుమారస్వామికి కూడా ఛాన్స్! నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన జేడీఎస్ నేత, ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్ కూతురి పెళ్లికి ఎంపీ దేవెగౌడ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనుమలు నిఖిల్ (కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో), ప్రజ్వల్ (మంత్రి రేవణ్ణ కుమారుడు) తమ తాతయ్యతో ముచ్చటించిన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్, ప్రజ్వల్‌లు త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఖరారైందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోటీ చేసే విషయమై వీరిరువురు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హసన్‌ను వదులుకుంది అందుకేనా? జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని ఆశిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ పార్టీ టికెట్ ఆశించారని.. అయితే అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించేందుకు దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హసన్ నుంచి తాను పోటీచేయబోనని, తన స్థానంలో ప్రజ్వల్ పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం తాను పోటీచేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. దీంతో నిఖిల్ కూడా తనకు టికెట్ ఇచ్చే విషయమై దేవెగౌడపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తండ్రి కుమారస్వామి నుంచి మాట తీసుకున్న నిఖిల్ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ‘ ఒకవేళ ప్రజ్వల్ పోటీ చేయడం ఖాయమైతే, నిఖిల్ కూడా తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి దేవెగౌడ నో చెప్పలేరు అని అభిప్రాయపడ్డారు. కాగా జేడీఎస్ నుంచి ఇప్పటికే దేవెగౌడ ఎంపీగా, కుమారస్వామి సీఎంగా, ఆయన భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యేగా, రేవణ్ణ మంత్రి(పీడబ్ల్యూడీ)గా, ఆయన భార్య భవానీ హసన్ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వివిధ పదవుల్లో ఉన్నారు. దీంతో ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు వారసులు కూడా అరంగేట్రం చేయనుండటంపై వారు ఎలా స్పందిస్తారోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
గుమస్తా కంటే ఎక్కువ పని చేస్తున్నాను : సీఎం
బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో పొరపొచ్చలు మరోసారి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ కూడా నిలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సేల సమావేశానికి హాజరైన కుమార స్వామి మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ కలగజేసుకుంటుందని.. ఫలితంగా తాను సీఎం అయి ఉండి కూడా గుమస్తా కంటే ఎక్కువ చాకిరీ చేస్తున్నాని వాపోయాడు. కాంగ్రెస్ నాయకులు తనను ఓ సబార్డినేట్‌గా చూస్తున్నారని.. తన మీద చాలా ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన ప్రతి కాగితం మీద సంతకం చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు తనను ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అసలు తన ప్రమేయం లేకుండానే కొన్ని విషయాలకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదయితే కుమారస్వామి ఇలా బాధపడటం ఇదే ప్రథమం కాదు. గతంలో సీఎం స్థానంలో తను సంతోషంగా లేనని.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నానని కుమారస్వామి కన్నీటిపర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
మరి యాక్సిడెంటల్ సీఎం ఎవరో?!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమా ట్రైలర్‌పై దుమారం రేగుతోంది. గురువారం విడుదలైన ఈ ట్రైలర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మన్మోహన్ సింగ్‌ను ముందుపెట్టి కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు దేశాన్ని దోచుకున్న తీరుకు ఇది నిదర్శనం అని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యనించగా, నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ చేసిన ట్వీట్... జేడీఎస్- బీజేపీ అభిమానుల మధ్య చిచ్చు రాజేస్తోంది. మరి యాక్సిడెంటల్ సీఎం ఎవరు? ‘ ఒకవేళ యాక్సిడెంటల్ సీఎం అనే సినిమా తెరకెక్కితే.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారు.. హెచ్డీ కుమారస్వామేనా’ అని ట్వీట్ చేసిన కర్ణాటక బీజేపీ.. సీఎం కుమారస్వామిని ట్యాగ్ చేసింది. ఈ క్రమంలో... ‘కుమారస్వామి, ఆయన తండ్రి మంచి నటులు... వాళ్లకు ఉన్నదంతా ఇటాలియన్ మాఫియా చేతిలో పెట్టారు’ అని ఒకరు కామెంట్ చేయగా... ‘ఒకవేళ చెక్సీఎం అనే సినిమా తీస్తే.. యడ్యూరప్ప ఆ పాత్ర పోషిస్తారా’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. If there was a movie titled #AccidentalCM who will play the role of @hd_kumaraswamy ? — BJP Karnataka (@BJP4Karnataka) December 29, 2018 కాగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకుంది. ఈ క్రమంలో 37 స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌తో కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
‘తిండి కోసం ఎగబడే వీధి కుక్కల్లా చేస్తున్నారు’
సాక్షి, బెంగళూరు : సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోస్తామని వ్యాఖ్యలు చేసే నాయకులు.. తిండి కోసం ఎగబడే వీధి కుక్కల లాంటి వారని కర్ణాటక మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే డీసీ థామన్న బీజేపీ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని 24 గంటల్లో పడగొడతామంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ కట్టి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన థామన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ.... గతంలో ఒకానొక సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జే హెచ్ పటేల్ అసెంబ్లీలో చెప్పిన ఏనుగు- కుక్క కథ చెప్పుకొచ్చారు. ‘ ఏనుగు దారి వెంట నడుచుకుంటే వెళ్తుంటే వీధి కుక్కలు వెంటపడతాయి. ఆ ఏనుగు నోటి నుంచి ఏదైనా ఆహార పదార్థం కింద పడుతుందా అని వేచి చూస్తాయి. అయితే అలాంటిదేమీ జరగదు. ఆహారం కింద పడనే పడదు. అలాగే కుక్కలు తినేందుకు అసలేమీ దొరకదు. ఈ కథ ఇప్పటి బీజేపీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. వాళ్లు ఊహించినట్టుగా మా ప్రభుత్వం ఎన్నటికీ పడిపోదు’ అని థామన్న వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామని, కానీ ఎప్పటికీ నిజం కావని పేర్కొన్నారు. కాగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, ఏ క్షణమైనా జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఉమేశ్ కట్టి వ్యాఖ్యానించగా... ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని, ప్రతిపక్షంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. -
‘24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలుస్తాం’
సాక్షి, బెంగళూరు : మరో ఇరవై నాలుగు గంటల్లో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమేశ్ కట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో బుధవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మాతో(బీజేపీకి) టచ్‌లో ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారు. కాబట్టి మరో ఇరవై నాలుగు గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాగే వారం రోజుల్లోగా బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వ ఏర్పాటు గురించి భిన్నంగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇకపై కూడా అలాగే కొనసాగుతాము’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమాస్వామి ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజ్‌భవన్ ముందు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ... దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఉమేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అవినీతి జరిగినా మరేం పర్లేదు.. కానీ!!
సాక్షి, బెంగళూరు : తమ పార్టీ కార్యకర్త(జనతాదళ్(ఎస్)) హత్యకు గురికావడంపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి... హంతకులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుమారస్వామిపై తీవ్ర స్థాయిల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన ఆయన.. ‘ ఏదో బాధలో అలా అన్నానే తప్ప, ఓ ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదు. ప్రకాశ్ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా కుమారస్వామి వివరణపై ప్రతిపక్ష బీజేపీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. ‘రైతులు చచ్చిపోతే... భావోద్వేగాలు ఉండవు. ప్రభుత్వ అధికారులు హత్యకు గురైతే... అది పెద్ద విషయమే కాదు. అవినీతి జరిగినా మరేం పర్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినా... నా దగ్గర అటువంటి వివరాలేమీ లేవు. దళితులను బానిసలుగా పరిగణిస్తున్నా... ఏంకాదులే. కానీ జేడీఎస్ కార్యకర్త హత్యగావించబడితే మాత్రం నిందితులను వెంటనే కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఆదేశాలు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. కుమారస్వామికి జేడీఎస్‌తో తప్ప మిగిలిన వారు ఎలా ఉన్నా పట్టదు’ అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అసలేం జరిగింది... జేడీఎస్ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు హొణ్నలగెరె ప్రకాశ్ సోమవారం సాయంత్రం కారులో ప్రయాణిస్తుండగా.. బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రకాశ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన ఆస్పత్రికిలో మృతి చెందారు. Farmers died - No emotions Govt officials killed - Doesn’t matter Massive Corruption - That’s ok No development programs - I don’t print note Dalits pushed to Slavery - hmmm JDS Karyakartha murdered - Orders cops to immediately shoot For Kumaraswamy all that matters is JDS — BJP Karnataka (@BJP4Karnataka) December 25, 2018 -
కర్నాటక సీఎం కుమారస్వామి వివాదస్పద వ్యాఖ్యలు
-
టీటీడీలో ప్రొటోకాల్ వివాదం
సాక్షి, చిత్తూరు: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి అవమానం జరిగిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడగా.. ఆయనకు తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో ఓవీ రమణ తనను అవమానించారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఓవీ రమణ.. మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. అయితే, దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి జరిగిన అవమానంపై ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లేఖ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారంలోపు టీటీడీ స్పందించకుంటే జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఓవీ రమణ ఆరోపించారు. -
కేబినెట్లోకి కొత్తగా ఎనిమిది మంది!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి శనివారం తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. జేడీఎస్- కాంగ్రెస్ కూటమి పదవుల సర్దుబాటులో భాగంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరి చేత గవర్నర్ వజూభాయి వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా మరో 19 మంది ఎమ్మెల్యేలకు వివిధ కార్పోరేషన్లకు చైర్పర్సన్లుగా అవకాశం కల్పించిన సీఎం, మరో తొమ్మిది మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. కాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇద్దరు మంత్రుల(మున్సిపల్, అటవీ మంత్రిత్వ శాఖ మంత్రులు)ను పదవుల నుంచి తొలగించారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన కర్ణాటక మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి రాజ్‌భవన్ వద్ద నిరసనకు దిగారు. కొత్త మంత్రులు వీరే.. 1. సతీశ్ జర్కిహోలి 2. రహీమ్ ఖాన్ 3. శివల్లి 4. ఎంటీబీ నాగరాజ్ 5. తుకారాం 6. ఎంబీ పాటిల్ 7. పరమేశ్వర్ నాయక్ 8. ఆర్బీ తిమ్మాపుర్ Karnataka Governor Vajubhai Vala administers oath to new State cabinet ministers at Raj Bhavan in Bengaluru. #Karnataka pic.twitter.com/zlFhh9cE36 — ANI (@ANI) December 22, 2018 -
మాజీ ప్రధాని అంటే లెక్కలేదా?
సాక్షి, తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పూర్తిగా లెక్కలేనితనంతో వ్యవహరించిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. దేవెగౌడ విషయంలో టీటీడీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి తిరుమలకు వచ్చిన సందర్భంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ చనువు కారణంగా అతిపెత్తనం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి, కర్ణాటక సీఎంకు జరగాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు జరగలేదన్నారు. పారిశ్రామికవేత్తలు, తమకు కావాల్సిన వారైతే తిరుమల జేఈవో స్వాగతం పలుకుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై జేఈవోతో మాట్లాడాలని మాజీ ప్రధాని ప్రయత్నిస్తే ఆయన తిరస్కరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి అతిథులుగా వచ్చినవారిని అవమానించడం తగదన్నారు. స్థానిక పోలీసు ఎస్కార్ట్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తప్పుపట్టారు. 86 ఏళ్ల మాజీ ప్రధానిని శ్రీవారి హుండీ దగ్గరే వదలి వెళ్లడం భద్రత లోపానికి నిదర్శనమన్నారు. మాజీ ప్రధానిగా దేవెగౌడ తిరుమలకు వచ్చిన ప్రతిసారి అధికారులు స్వాగతం పలకకుండా నిర్లక్ష్యం చేయడం పద్ధతి కాదన్నారు. -
సీఎంగారూ.. ఆత్మహత్య చేసుకుంటున్నా
సాక్షి బెంగళూరు: మండ్య జిల్లాలో రైతు జయకుమార్ (44) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామికి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో రైతుసంఘాల నాయకులు భారీ ఆందోళనకు దిగడం, పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దుద్దా హొబ్లి కన్నహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. కన్నహట్టి గ్రామానికి చెందిన జయకుమార్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. సూసైడ్ నోటులో రైతుల కష్టాలు, రోజురోజుకు పెరుగుతున్న అప్పులు, పండని పంటలు, గిట్టుబాటు కాని ధరలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. కుటుంబంపై అభిమానం, వ్యవసాయంలో అనుభవం ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు 35 ఏళ్లు, కుమార్తెకు 15, కుమారుడికి 9 ఏళ్ల వయసు ఉన్నట్లు లేఖలో రాశాడు. తనకు వంశపారం పర్యంగా తండ్రి నుంచి 27 గుంటల పొలం ఉందన్నాడు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందినట్లు వివరించాడు. తన తండ్రి వైద్యం కోసం రూ.2 లక్షలు అప్పు జేసినట్లు పేర్కొన్నాడు. అయితే తనకు కూడా క్యాన్సర్ ఉందని వైద్యులు ఇటీవల తెలిపారు. చికిత్సకు రూ.3 లక్షలు అవసరమని చెప్పారు. పంటలు లేవని ఆవేదన గత నాలుగేళ్లుగా పంటలు సరిగా పండలేదు. ఈ సారి రూ.80 వేల పెట్టుబడితో పంట వేశాను. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. క్యాన్సర్ వైద్యానికి, వ్యవసాయానికి కలిపి రూ. 5 లక్షల వరకు అప్పుడు చేశాడని స్థానికులు తెలిపారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో రైతు నేతలు తరలివచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని వారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా శనివారమే సీఎం కుమారస్వామి జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఈ ఘోరం జరగడం గమనార్హం. -
ఇబ్బందుల్లో సీఎం కుమార
బొమ్మనహళ్లి (బెంగళూరు): సీఎం కుమారస్వామికి వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో చెరుకు రైతుల ఆందోళన, వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పలేలా లేవు. మద్దతు ధర ప్రకటించాలని, చెరుకు ఫ్యాక్టరీల నుంచి బకాయిలు చెల్లించాలని ఆందోళనలోపాల్గొన్న మహిళను ఉద్దేశించి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదుకు ఆదేశించారు. బెళగావిలో రైతుల నిరసనలో మహిళా రైతు జయశ్రీ ఆరోపణలు చేయడంపై కుమారస్వామి స్పందిస్తూ.. ‘ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నావమ్మా...’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి జయశ్రీ విలపించింది. సీఎం తనను కించపరిచారని, న్యాయం చేయాలని మీడియాముఖంగా కోరింది. దాంతో కార్మిక సంక్షేమ శాఖ సుమోటోగా పరిగణించి డీజీపి నీలమణి రాజు , మానవ హక్కుల కమిషన్‌కు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడిన అభియోగాలపై సీఎం కుమారస్వామి పై 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పేర్కొంది. -
ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు
సాక్షి బెంగళూరు/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకమై కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి దేశ వ్యాప్తంగా వివిధ పార్టీ నేతలను కలుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అయ్యారు. చర్చల అనంతరం వారితో కలసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను విధ్వంసం కాకుండా కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకంకావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1996లో కాంగ్రెస్ బయటనుంచి మద్దతివ్వగా థర్డ్ ఫ్రంట్ అభ్యర్థిగా దేవెగౌడ ప్రధాని పగ్గాలు చేపట్టారని, అలాంటి ప్రయోగం తర్వాత చేయలేదన్నారు. ప్రధాని అభ్యర్థిని అంతా కలసి నిర్ణయిస్తామన్నారు. అయితే 1996 మోడల్లా ప్రధాని ఉంటారా? అన్న ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అంతాకలసి ఒక అభిప్రాయానికి వస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రధాన, పెద్ద పార్టీ అన్నారు. సీబీఐ, ఐటీ శాఖలతో దాడులు చేయిస్తూ ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, విపక్షాలను నియంత్రించాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి దాడులు పలు రాష్ట్రాల్లో జరిగాయన్నారు. ఈ విధంగా దాడులు జరుగుతున్నా ప్రధాని మోదీ నోరు తెరవడంలేదని, ఎటువంటి ప్రకటన చేయడంలేదని విమర్శించారు. నోట్ల రద్దు ఓ విఫలప్రయోగమన్నారు. రోజురోజుకూ పెట్రో ధరలు పెరిగిపోతున్నాయని, రూపాయి బలహీనపడుతోందని చెప్పారు. తాను ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం, అఖిలేశ్ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా తదితరులతో భేటీ అయి బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని కోరినట్లు చెప్పారు. విపక్షాలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యం.. దేవెగౌడ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ కలసిరావాలన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓడినట్లే దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టి అంతా విపక్షాలను ఏకతాటిపైకి తేవడమేనన్నారు. 1996లో కూడా చంద్రబాబుతో కలిసి పని చేశామని, అలాగే 2019లో కూడా కలుస్తామన్నారు. 1996 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. డిసెంబర్‌లోగానీ, జనవరిలోగానీ భారీ స్థాయిలో రైతుల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తామని తెలిపారు. నేడు చెన్నైకి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చెన్నైకి రానున్నారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ఇక్కడ భేటీ కానున్నారు. -
కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన అభ్యర్థి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని, ప్రచారం కూడా నిర్వహించకుండా తననో బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో తాను జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అనితా కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అనితా కుమారస్వామి గెలుపు నల్లేరు మీద నడకే కానుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించాలనుకోవడం బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కోసారి వారి వ్యూహాలు ఇలాగే బెడిసి కొడతాయని ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన హెచ్డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రామ్నగరతో పాటు జంఖాడీ అసెంబ్లీ స్థానం, బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికల్లో సీఎం భార్య, కుమారుడు..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఖాళీ అయిన మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో నుంచి కుమార స్వామి పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించడంతో రామ్‌నగర స్థానానికి రాజీనామా చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఉప ఎన్నికలు జరగాల్సిన బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. కుమార స్వామి భార్య పోటీ.. కుమారస్వామి రాజీనామా చేసిన రామ్‌నగర స్థానం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తారనే ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైన మరునాడే ఆమె రామ్‌నగర నియోజకవర్గంలో పర్యటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇదివరికే ప్రకటించారు. ఈ వార్తలను జేడీఎస్ ఖండిచకపోగా.. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని సమాచారం. నిఖిల్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆయన జాగ్వార్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఆ స్థానంలో జేడీఎస్ విజయం నల్లేరుమీద నడకే. ఇక బీజేపీ సీనియర్ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాములు ఇటీవల ఎంపీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలేంటీ.. మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ మూడున ఎన్నికల నిర్వహించి నవంబర్ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆ బంగ్లా అంటే ఎందుకంత భయం!?
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వం కేటాయించిన భవనంలోకి వెళ్లడానికి కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప వెనకడుగు వేస్తున్నారట. బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలోని 3వ నెంబరు భవనాన్ని కుమారస్వామి ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే అందులోకి వెళ్లడానికి ఆయన ఇష్టపడటం లేదట. ఆ బంగ్లాకు వెళ్తే సీఎం పదవిలో ఉండలేమనే భావన, వాస్తుదోషం భయంతోనే యడ్యూరప్ప ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేసు కోర్సు రోడ్డులో ఉన్న రేస్ కోర్సు కాటేజీలోని భవనాన్ని తనకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. వాస్తుదోష భయం..! సీఎం కుమారస్వామి కూడా గతంలో ఇదే భవనంలో ఉండగా పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ భవనాన్ని వదిలి జేపీ నగర్లోకి తన నివాసాన్ని మార్చారు. కుమారస్వామి ఖాళీ చేసిన తర్వాత మాజీ స్పీకర్ డీహెచ్ శంకర్మూర్తికి ఈ భవనాన్ని కేటాయించారు. అయితే ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆ బంగ్లాకు రావడానికి యడ్యూరప్ప నిరాకరించడంతో ప్రస్తుతం మంత్రి మహేశ్‌కు కేటాయించారు. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం
బెంగళూరు : పెట్రోల్, డీజిల్ ధరలపై కర్నాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ధరలను నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలను క్రాష్ చేస్తోంది. ‘ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు, పన్నులు తగ్గి, ధరలు తగ్గితే బాగుండని భావించారు. కుల్బర్గి నుంచి ప్రకటిస్తున్నా.. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కనీసం రెండు రూపాయల పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. మా సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కర్నాటక ప్రజలకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు, రెండున్నర రూపాయలు తగ్గించాయి. కాగా.. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.06గా, కోల్‌కతాలో రూ.83.91గా, ముంబైలో రూ.89.44గా, చెన్నైలో రూ.85.31గా, బెంగళూరులో రూ.84.74గా ఉంది. డీజిల్ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78గా, కోల్‌కతాలో రూ.75.63గా, ముంబైలో రూ.78.33గా, చెన్నైలో రూ.78గా, బెంగళూరులో రూ.76.16గా రికార్డైంది. -
కుమారస్వామితో బాబు భేటీ
సాక్షి, అమరావతి/విజయవాడ/విమానాశ్రయం(గన్నవరం): కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన కుమారస్వామి ఒక హోటల్లో బస చేశారు. ఈ సమయంలో చంద్రబాబు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కుమారస్వామితో చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేస్తేనే కేంద్రాన్ని ఎదుర్కోగలమని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై కూలంకుషంగా తర్వాత చర్చిద్దామని చెప్పారు. కాంగ్రెస్ తనను సీఎం పీఠంపై కూర్చోబెట్టినా అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తోందని కుమారస్వామి చెప్పినట్లు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ వైఖరితోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన ఫ్రంట్‌పై రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో చర్చిద్దామని చంద్రబాబుకు ఆయనకు చెప్పినట్లు సమాచారం. దుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనిత శుక్రవారం దర్శించుకున్నారు. కుమారస్వామి దంపతులకు ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆయనకు శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చానని తెలిపారు. అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. చంద్రబాబుతో సమావేశమైన అంశాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చారు. అంతకుముందు కుమారస్వామికి గన్నవరం విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. -
నా కుటుంబాన్ని ఆదుకోండి : నటి
మడికెరిలో చిక్కుకున్న తన కుటుంబాన్ని తక్షణం రక్షించాలని కన్నడనటి దిశా వూవయ్య శనివారం సీఎం కుమారస్వామికి విజప్తి చేశారు. 8 మంది కుటుంసభ్యులు బయటకు రావడానికి వీలుకాక ఇంటిలో ఉన్నారని, వారిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు ఆమె సీఎంతో విన్నవించారు. తక్షణం ఆమెకు వైద్య సహాయం కూడా చేయాలన్నారు. అదే ప్రాంతంలో 40 మంది వరదలో చిక్కుకున్నట్లు తెలిపారు. సీఎం సహాయక చర్యలకు ఆదేశించారు. రోజుల తరబడి సూర్యుని ముఖం చూడలేదు. నిరంతరం వర్షమే. ఇల్లు, వీధి అనే తేడాలేకుండా ఎక్కడ చూసినా నీళ్లేనీళ్లు. అయినా తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు, ఉండడానికి చోటు లేదు. ఇదీ వరదబాధిత కొడగులో జనం దీనావస్థ సాక్షి, బెంగళూరు: కరావళి, మలెనాడు ప్రాంతాలు వరద గుప్పిట్లో విలవిలాడుతున్నాయి. సుమారు 12 రోజులుగా కుంభవృష్టి కొడగు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, చిక్కమగళూరు, చామరాజనగర, శివమొగ్గ తదితర జిల్లాలను వణికిస్తోంది. కొడగు అత్యధికంగా నష్టపోయింది. జిల్లాలో ఇప్పటికి ఆరుగురు మరణించగా, సుమారు 100 మంది ఆచూకీ తెలియడం లేదు. వర్షాల ప్రభావంతో కొడగు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. సైన్యం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల ద్వారా వర్షబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిల్లో పడ్డారు. కొడగు, చామరాజనగర, మంగళూరు, మండ్య, హాసన్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. చిక్కుకుపోయిన బాధితులు ♦ కొడగు జిల్లాలో హెమ్మెతాళు, మేఘతాళు, కాలూరు గ్రామాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో సుమా రు 500 మంది చిక్కుకుపోయారు. ♦ మంగళూరు – మడికెరి రహదారిలో కొండ విరిగిపడడంతో 200 మంది పైగా చిక్కుకున్నారు. దీనికి తోడు అన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలకు పలు చోట్ల ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. వరదల్లో ఇరుక్కున్నవారిని రక్షించడానికి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ద్వారా చర్యలు చేపట్టారు. ♦ రామ, లక్ష్మణ తీర్థనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ♦ 150 మంది కేఆఎస్ ఆర్టీసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు ఐరావత బస్సులను బాధితుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించారు. కేరళ పాలఘాట్ నుంచి మంగళూరు వరకు ప్రయాణికులు ఆ బస్సుల గుండా ఉచితంగా చేరుకోవచ్చు. కావేరి తీరంలో అలజడి కే ఆర్ఎస్ జలాశయంలోకి లక్ష క్యూసెక్కుల నీరు చేరింది. ఫలితంగా మండ్య, చామరాజనగర ప్రాంతాలతో పాటు కావేరి నదీ తీర ప్రాంతంలో జనాలు భయంభయంగా జీవనం సాగిస్తున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని గుబులు నెలకొంది. ఐదురోజుల నుంచీ నదీ తీరంలోని దేవస్థానాలు, నివాసాలు జలావృతమయ్యాయి. నదీ తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రుల పర్యటన కొడగు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఆరు వందల మంది రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వరద పీడిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ, రాష్ట్రమంత్రులు ఆర్వీ దేశపాండే, జీటీ దేవెగౌడ, సా.రా.మహేశ్, ఎన్.మహేశ్ తదితరులు సందర్శించి సాయం అందజేస్తామని ప్రకటించారు. -
దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!
-
దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి!
బెంగళూరు: విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటికే ప్రజా ధనాన్ని మంచి నీళ్లలా దుర్వినియోగం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్వదేశంలో తన లగ్జరీ కోసం చేస్తున్న ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబుకు అయిన హోటల్ బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 8.7 లక్షలట. అయితే ఆ మొత్తాన్ని సిగ్గు-ఎగ్గు లేకుండా ప్రభుత్వమే చెల్లించడం ఇక్కడ గమనార్హం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలు తమ హోటల్ ఖర్చును లక్ష, రెండు లక్షల మధ్యలో ముగించేస్తే, మన ‘డాబు’గారు.. ఏమాత్రం సిగ్గు పడకుండా రూ. 8లక్షలకు పైగా ఖర్చు చేశారట. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన నేతలకు అయిన ఖర్చుపై బెంగళూర్ మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించడంతో బాబు గారి దుబారా బయటపడింది. ఎంతైనా ఖర్చుకు అలవాటు పడ్డ ప్రాణం కదా.. ఆ మాత్రం దుబారా లేకపోతే ఎలా? అని చర్చించుకోవడం ప్రజల వంతైంది. -
రాష్ట్ర విభజనకు మద్దతివ్వం ..
సాక్షి బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తాం అని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి చెప్పారు. ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక పోరాట సమితి పిలుపుని చ్చిన ఉత్తర కర్ణాటక బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బడ్జెట్లో ఉత్తరకు అన్యాయం కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్‌కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ ప్రకటించారనే కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని చెప్పారు. కాగా, ఆగస్టు 9 నుంచి మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నేతలందరూ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలిపారు. తొలి బృందంలో తాను, గోవింద కారజోళ, శోభ కరంద్లాజే, రెండో బృందంలో ఆర్.అశోక్, అరవింద్ లింబావళి, జగదీశ్ శెట్టర్, మూడో బృందంలో కేఎస్ ఈశ్వరప్ప, సీటీ రవి, లక్ష్మణ సవదిలు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాధనలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తాం తమ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చించాం, అభ్యర్థుల ఎంపిక చర్చకు రాలేదని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలకు 22– 23 స్థానాలు కచ్చితంగా గెలుచుకోగలుగుతామని జోస్యం చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని చెప్పారు. మీడియా ప్రతినిధులను విధానసౌధలోకి రానివ్వనని సీఎం అనడం సమంజసం కాదని అన్నారు. మీడియాను నిర్బంధించడం మంచి పరిణామం కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. -
కుమారస్వామి వివాదాస్పద నిర్ణయం
-
విషం కాంగ్రెస్ కాదు..సిద్దూతో గొడవ లేదు!
న్యూఢిల్లీ: గరళకంఠుడిలా సంకీర్ణ ప్రభుత్వ హాలాహలం మింగుతున్నానంటూ ఇటీవల కన్నీళ్లతో ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బుధవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండియాటుడే వార్తాచానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. తన గత వ్యాఖ్యల్లో విషం అన్నది కాంగ్రెస్‌నో, లేక సంకీర్ణ ప్రభుత్వాన్నో ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక ఒక సామాజిక వర్గం వారు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. గతంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచిన కొన్ని టీవీ చానెళ్ల విలేకరులు.. సీఎం అయ్యాక మాత్రం తానెన్ని మంచి పనులు చేయాలని చూస్తున్నా వాటిలో తప్పులనే వెదుకుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గం వారే ఇదంతా చేయిస్తున్నారని తెలిసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మిమ్మల్ని బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తున్నందుకే ఆ రోజు అలా మాట్లాడారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదనీ, సిద్దరామయ్య తనకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సిద్దరామయ్యే కాకుండా స్థానిక నేతలు సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుగానే ఉందనీ, నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు. కుమారస్వామివన్నీ డ్రామాలేనని బీజేపీ అంటుండటాన్ని ప్రస్తావించగా, వారి నుంచి మంచిమాటలు వస్తాయని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు. లోపల ఎంతో బాధ ఉంటేగానీ మనుషులకు కన్నీళ్లు రావనీ, అది అర్థం చేసుకోకుండా తనను విమర్శించేవారికి భావోద్వేగాలు, మానవీయత అంటే ఏంటో తెలిసుండకపోవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. సహజంగానే తనలో భావోద్వేగాలు అధికమన్నారు. అధికారుల బదిలీల్లో కాంగ్రెస్ ఒత్తిడేమీ లేదనీ, ఒకవేళ ఉన్నా అలాంటివన్నీ తనకు చిన్నచిన్న విషయాలే తప్ప కన్నీళ్లు పెట్టుకునేంత పెద్దవి కావని చెప్పారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడపడమే జేడీఎస్, కాంగ్రెస్‌ల ఉమ్మడి లక్ష్యమనీ, 2019 సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద సమస్యే కాదని కుమారస్వామి తేల్చి చెప్పారు. -
కుమారస్వామి ఏంటీ పని?
బెంగళూరు : కర్ణాటక ఎంపీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రజాధనంతో కాస్ట్ లీ గిఫ్ట్స్ కొనిచ్చారంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. విలువైన ఐఫోన్ ఎక్స్, లెదర్ బ్యాగ్‌లను రాష్ట్ర ఎంపీలకు కుమారస్వామి ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కావేరి సమస్యపై చర్చించేందుకు ఎంపీలందరినీ ఆహ్వానించడాన్ని చంద్రశేఖర్ సమర్థించారు. అయితే, రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎంపీలకు కాస్ట్ లీ గిఫ్ట్‌లు అవసరమా? అని నిలదీశారు. కుమారస్వామి పంపిన గిఫ్ట్స్ ఇవేనంటూ ఓ ఫొటోను సైతం ట్వీట్‌కు జత చేశారు. అందులో ఐఫోన్ ఎక్స్‌తో పాటు ‘మూచీస్’ బ్యాగ్ ఉన్నాయి. -
సెటైర్.. ఉత్తమ నటుడు ఎవరంటే..
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తానేం సంతోషంగా లేననే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. పైగా తనకు తాను గరళ కంఠుడిలా అభివర్ణించుకుంటూ శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో వేదికపైనే ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. అయితే ఇదే అదనుగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సెటైర్ల వేయటం మొదలుపెట్టింది. ప్రజలను ఆయన పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండిపడుతోంది. ‘మన దేశం ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను అందిస్తోంది. నటులు కూడా వారి నటనతో ఆడియన్స్‌ను మైమరిచిపోయేలా చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. ఇదిగో అక్కడ మరో దిగ్గజ నటుడు కుమారస్వామి కూడా ఉన్నారు. తన నటనా పటిమతో ఏకధాటిగా ప్రజలను మూర్ఖులను చేస్తూ వస్తున్నారు... అండ్ ది బెస్ట్ యాక్టింగ్ అవార్డు గోస్ టూ... అంటూ వ్యంగ్యంగా ఓ పోస్టును బీజేపీ ట్విటర్లో పోస్టు చేసింది. పైగా దానికి కుమారస్వామి కంటతడి పెట్టిన వీడియోను జత చేసింది. ఆయన సంతృప్తిగానే ఉన్నారు... ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి సంతృప్తిగానే ఉన్నారని జేడీఎస్ పార్టీ కార్యదర్శి దానిష్ అలీ పేర్కొన్నారు. సీఎం కుమారస్వామి కేవలం భావోద్వేగంతోనే అలా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ అలీ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. జేడీఎస్ కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. సీఎం పదవి ఇచ్చి తాము అమృతమే ఇచ్చామనీ, విషం ఇవ్వలేదని కాంగ్రెస్ చెబుతోంది. సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తే మంచిదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే.. సీఎం కుమారస్వామికి సూచిస్తున్నారు. & the best acting award goes to.. Our country has produced talented actors. Actors who have mesmerised the audience with their brilliant performance, here we have another legendary actor Mr Kumaraswamy, an actor who has constantly fooled common man with his amazing acting skills pic.twitter.com/SNfi9LsAS6 — BJP Karnataka (@BJP4Karnataka) 15 July 2018 -
కదిలించిన పిల్లాడి వీడియో
సోషల్ మీడియా.. ఎలాంటి పోరాటానికైనా ఇప్పుడు అదో ఆయుధంగా మారిపోయింది. పోస్టులు, ఫోటోలు, వీడియోలు... ఇలా ఏదైనా సరే చిన్నగా మొదలై పెను ఉద్యమ రూపుదాలుస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ బాలుడి వీడియో.. సోషల్ మీడియాను ఉపేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామినే ఉక్కిరి బిక్కిరి చేసేసింది. బెంగళూరు: భారీ వర్షాలతో కొడగు జిల్లా అంతా అతలాకుతలంగా మారిపోయింది. దీంతో ఎనిమిదో తరగతి చదువుతున్న కలేరా ఫతే అనే పిల్లాడు.. బడ్జెట్లో తమ(కొడగు) ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ ఓ వీడియో చేశాడు. ‘కావేరీ జన్మస్థలం కొడగు. భారీ వర్షాలు పడితే కావేరీ జలాలతో మాండ్యా, మైసూర్, చివరకు మద్రాస్ సహా అన్నీ ప్రాంతాలు లాభపడతాయి. అలాంటిది కొడగునే మీరు(కుమాస్వామిని ఉద్దేశించి..) అనాథలా వదిలేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇక్కడ పంటలు నీట మునిగాయి. ఏనుగులు అడవులు దాటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. రోడ్లు చిధ్రం అయిపోయాయి. కానీ, మీరు చేసింది మాములు మోసం కాదు. బడ్జెట్లో ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదు. ఇది మమల్ని దారుణంగా నిరాశపరిచింది’ అంటూ వీడియోను రూపొందించాడు. యెడ్డీని వదల్లేదు... ఇదే వీడియోలో కలేరా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను కూడా ఏకీపడేశాడు. ‘యడ్యూరప్పగారు.. మీరు విధాన సభ లోపల, బయట ప్రభుత్వంపై అరవటం కాదు. సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లండి. ప్రధాని మోదీని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయండి’ అంటూ పేర్కొన్నాడు. వర్షంలో ఓ గొడుగుతో నది ఒడ్డున్న ఉండి చేసిన కలేరా చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్పందించిన కుమారస్వామి.. ఇదిలా ఉంటే వైరల్ అయిన ఈ వీడియో గురించి మీడియా సీఎం కుమారస్వామి వద్ద ప్రస్తావించింది. ‘ఇది 70 ఏళ్ల సమస్య. రెండు నెలల క్రితమే మొదలైందా? నేను సీఎం బాధ్యతలు స్వీకరించగానే గుర్తొచ్చిందా? విమర్శలను మా ప్రభుత్వం పట్టించుకోదు. కానీ, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇలాంటివి చూపించి ఎంత కాలం నన్ను నిరుత్సాహపరుస్తారు?. నన్ను మొదలుపెట్టనివ్వండి. నేనేం అసెంబ్లీలో ఖాళీగా కూర్చోట్లేదు. ప్రజల మధ్యే సమయం గడిపేందుకు యత్నిస్తా. త్వరలోనే కొడగును సందర్శిస్తా. స్థానిక ఎమ్మెల్యేతో ఇప్పటికే ఈ విషయంపై చర్చించా. కావాలంటే రెండురోజులు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షిస్తా’ అని కుమారస్వామి పేర్కొన్నారు. -
ఏకంగా ముఖ్యమంత్రినే ఉక్కిరి బిక్కిరి చేసాడు
-
హ్యాపీగా లేను.. వేదికపైనే ఏడ్చేసిన సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయినందుకు కార్యకర్తలంతా ఆనందంగా ఉన్నారని, కానీ, సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో తాను మాత్రం చాలా బాధతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి, బెంగళూరు: జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను’’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అదేమీ అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు. ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. వేదికపైకి వెళ్లేముందు కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి ఆయన నిరాకరించారు. సోషల్ మీడియా పోస్టులతో మనస్థాపం... ఇదిలా ఉంటే బడ్జెట్లో కోస్తా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. కుమారస్వామి నాట్ మై సీఎం పేరిట ఓ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంగళూరు తదితర కోస్తా ప్రాంతాలకు తీరని అన్యాయం చేసారని, ముఖ్యంగా రుణమాఫీ విషయంలో మత్య్సకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ‘సోషల్ మీడియాలో పోస్టులు నన్ను బాధిస్తున్నాయి. రుణమాఫీ గురించి అధికారులతో ఎంతగా వాదులాడానో మీకేం తెలుసు. అన్నభాగ్య స్కీమ్ కింద 5 కిలోల బియ్యం బదులు, ఏడు కిలోల బియ్యం అడుగుతున్నారు. అదనంగా రూ. 2500 కోట్లు ఖర్చవుతుంది. అదంతా ఎవరు భరిస్తారు. పోనీ టాక్స్‌ల రూపంలో వసూలు చేద్దామా? అంటే తిరిగి ప్రభుత్వానే విమర్శిస్తారు. మీరైతే రుణమాఫీ విషయంలో సీఎంకే స్పష్టత లేదంటూ కథనాలు ప్రచురిస్తున్నారు’ అంటూ మీడియాను ఉద్దేశించి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. -
తిరుపతి టికెట్.. రంగంలోకి కుమారస్వామి
తిరుపతి తుడా: కర్ణాటక జేడీఎస్‌తో సత్సంబంధాల నేపథ్యం తిరుపతి టీడీపీలో చిచ్చు రేపింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్ రమణకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీలోని ఆశావహుల్లో గుబులు మొదలైంది. పార్టీ అధిష్టానంపై వీరంతా గుర్రుగా ఉన్నారు. జేడీఎస్ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి టీడీపీలో ఇప్పటికే నాలుగు గ్రూపులున్నాయి. వీరంతా ఎవరికి వారే టికెట్టు తమకంటే తమకు అని ప్రచారం చేసుకుంటున్నారు. పరస్పరం బురదజల్లుకుంటూ ఫిర్యాదులు చేసుకుంటుండడంతో అధిష్టానం తల పట్టుకుంటోంది. జేడీఎస్ తరఫున ఓవీ రమణను టీడీపీలో చేర్చుకుంటే తామంతా మూకుమ్మడిగా పార్టీకి దూరంగా ఉంటామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. రమణపై టీడీపీలోని రెండు వర్గాలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తిరుపతికి ఆయన చేసిందేమీ ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గంతో పాటు ఇటీవల గల్లా అరుణకుమారి అండతో తిరుపతి అసెంబ్లీ టికెట్టు తనదేనని ప్రచారం చేసుకుంటున్న ఓ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీలో చేరితే తమ సంగతేంటని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వ్యతిరేకిస్తున్న ఆశావహులు.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణ ద్వారా రాజకీయం నడుపుతున్నారు. పార్టీ అధిష్టానంతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా తుడా చైర్మన్ ఎమ్మెల్యే సీటుకు తన పేరును ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండతో తిరుపతిలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఓ నేత సామాజిక ప్రతిపాదికన తనకే సీటు దక్కుతుందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా వీరు నాలుగు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా, ఫిర్యాదులతో బిజీగా ఉన్నారు. ఓవీ రమణ విషయంలో చంద్రబాబునాయుడు తీరుతో ఇప్పటికే ఆ పార్టీకి కొన్ని బలమైన సామాజిక వర్గాలు దూరమవ్వడంతో టికెట్టును ఆశించిన ఇద్దరు వెనుకడుగేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో టీడీపీ గెలవడం అంత సులభం కాదని కొందరు ఆశావహులు ఇప్పటికే గుర్తించారు. విపక్షం వైఎస్సార్సీపీ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతూ పలు సామాజిక వర్గాలకు మరింత సన్ని హితం కావడం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది. దీంతో మేయర్ గానీ, నామినేటెడ్ పదవి ఇస్తే చాలని ఇద్దరు ఆశావహులు పార్టీలోని సీనియర్ల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన నేప«థ్యంలో టీడీపీలో చేర్చుతున్నట్టు కుమారస్వామి చేత ప్రకటించుకునేలా రమణ పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. -
‘నన్ను సీఎంని చేయండి’
సాక్షి బెంగళూరు: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏ నియోజకవర్గానికీ ఎమ్మెల్యే కాదు.. ఈయనకు ఏ ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేదు. కానీ తనను ముఖ్యమంత్రిని చేయండంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రంలోని తీర్థహళ్లికి చెందిన ఆర్.హరిశ్చంద్రగౌడ కాంగ్రెస్ కార్యకర్త. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయస్థానం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తన వాదనను వినిపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి స్విస్ బ్యాంకులో రూ.వేల కోట్లున్నాయని, తనను ముఖ్యమంత్రిని చేస్తే ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకొచ్చి రాష్ట్రంలోని రైతులందరి రుణాలను మాఫీ చేస్తానని చెప్పాడు. తనను ముఖ్యమంత్రి చేయాలని గవర్నర్ వాజుభాయి వాలాకు విన్నవించానని, తన విజ్ఞప్తిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు సూచించాలని కోరాడు. ఆయన వాదన విన్న న్యాయమూర్తి. ఈ కేసు విచారణను వాయిదా వేశారు. -
ఐ యామ్ హ్యాపీ : సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారులో విభేదాలను రూపుమాపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కన్పిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామిని విమర్శిస్తూ తాను చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్దరామయ్య యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్- జేడీఎస్ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదని, తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేపీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం సిద్దు మీడియాతో మాట్లాడారు. ‘నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు. సీఎం కుమారస్వామి, సంకీర్ణ ప్రభుత్వం గురించి నేను ఏ సందర్భంలో అలా మాట్లాడానో మీకు అర్థంకావడం లేదు. నా వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం కూడా మీకు తెలియదు. అయినా ఒక వ్యక్తిగా నా అభిప్రాయాలను చెబుతున్నపుడు వీడియోలు తీయడం నైతికత అనిపించుకోదంటూ’ సిద్దు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ బీజేపీ నుంచి కన్నడ ప్రజలను రక్షించేందుకు కాంగ్రెస్- జేడీఎస్‌లు ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని.. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామి, సంకీర్ణ ప్రభుత్వం గురించి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో కూటమిలో చీలికలు వచ్చాయంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదంతా మీడియా కల్పన అని, తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా తాను సిద్థంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు సిద్దరామయ్య కూడా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్- జేడీఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కుమారస్వామి సర్కార్‌కు ఢోకా లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : పాలక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో జులై 5న తన కుమారుడు, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెడతారని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, జులై 5న అసెంబ్లీలో కుమారస్వామి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని, జులై 12న బడ్జెట్ సభ ఆమోదం పొందుతుందని అన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, మీడియాలో మాత్రమే ఆందోళన కనిపిస్తోందని..ఇప్పుడిక సంతృప్తిగా వెనుదిరగవచ్చని దేవెగౌడ విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. బడ్జెట్ సమర్పించడంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ఇక దీనిపై చర్చ అనవసరమని, జులై 5న బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారు. రక్షణ శాఖ స్థాయాసంఘ సమావేశాల్లో పాల్గొనేందుకు కమిటీ లో సభ్యుడిగా ఉన్న దేవెగౌడ ఢిల్లీలో ఉన్నారు. కాగా కుమారస్వామి సర్కార్ భవితవ్యంపై జేడీఎస్-కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ సిద్ధరామయ్య సందేహం వ్యక్తం చేసిన వీడియో వెలుగుచూడటం ఇరు పార్టీల్లో కలకలం రేపింది. బడ్జెట్ సహా పలు అంశాలపై కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తెరలేపాయి. మరోవైపు సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర పేర్కొన్నారు. -
కర్ణాటకలో మళ్లీ రాజకీయ కల్లోలం
బెంగళూరు : రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈ విషయం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా తెలుసు. ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాలేకపోయిన ఆయనకు బద్దశత్రువులతో కలసి పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి కంటే యడ్యూరప్ప అయితేనే సిద్ధరామయ్య ఇష్టపడేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జేడీఎస్‌తో కూటమిని కొనసాగించాలని ఆయన్ను ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాస్తవాలను తెలుసుకుని మసులుకోవాలని సిద్ధరామయ్యకు హితబోధ చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవెగౌడ కుటుంబం పాలన చేయడం సిద్ధరామయ్యకు సహించడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ వెనుక పాలనలో నడవడం మరీ రుచించడం లేదు. కేబినేట్ విస్తరణ పూర్తై మూడు వారాలు గడిచాయో.. లేదో..! అప్పుడు సోదర జేడీఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కుమారస్వామిపై రోజుకో వ్యంగ్యాస్త్రాన్ని వదులుతున్నారాయన. సిద్ధా వైఖరి పట్ట మిత్రపక్షం జేడీఎస్‌లోనే కాక, సొంతపార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ను భుజాలపై ఎత్తుకుని నడిపించిన మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు అదే పార్టీకి తలనొప్పిగా మారడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ ప్రభుత్వం ఇంకెంతకాలం నిలబడుతుందంటూ సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కూడా సిద్ధూ అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుమారస్వామితో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీకి ఎలాంటి సమస్యా లేదని సిద్ధరామయ్య గుర్తించాలని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పేర్కొన్నారు. తాజాగా బయటికి వస్తున్న వీడియోలన్నీ సిద్ధరామయ్య చికిత్స పొందుతున్న దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తాంగడి ప్రకృతి వైద్య కేంద్రం నుంచే వస్తున్నాయని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లోని ఓ వర్గం భావిస్తోంది. గందరగోళ వాతావరణం సృష్టించేందుకే మాజీ సీఎం వీటిని విడుదల చేస్తున్నారని సదరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. -
కావేరీ ఇష్యూ: కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
మధురై, తమిళనాడు : కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మధురైలోని శ్రీ మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయతో ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ వ్యాఖ్యానించారు. కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని కుమారస్వామి తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కర్ణాటక డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో పెరిగిందని పేర్కొన్నారు. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వరుణుడు కరుణిస్తే.. కావేరీ జలాల యాజమాన్య సంస్థ, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాగా కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ‘మక్కల్ నీది మయ్యం పార్టీ’ వ్యవస్థాపకుడు కమల్ హసన్ తెలిపారు. ఈ మేరకు.. ‘ కాబినీ నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉంది. కావేరీ జలాల యాజమాన్య సంస్థ తన పనిని మొదలు పెట్టింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి అంటూ కమల్ ట్వీట్ చేశారు. -
దేవెగౌడను సవాల్ చేసే దమ్ముందా...!?
సాక్షి, బెంగళూరు : కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన సవాల్‌ను స్వీరించిన ప్రధాని మోదీ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు మరికొంత మందిని చాలెంజ్ చేశారు. అయితే మోదీ సవాల్‌కు కుమారస్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని, తన రాష్ట్రం ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని బదులిచ్చాడు. అయితే ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామిని కాకుండా ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను మోదీ సవాలు చేయాల్సిందంటూ జేడీఎస్ మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవెగౌడ చేస్తున్న కసరత్తులు అలాంటివి మరి. మోదీ ఫిట్నెస్ వీడియోపై మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ చేస్తున్న కసరత్తులు చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. 86 ఏళ్ల వయస్సులోనూ కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవెగౌడ అందరికీ ఆదర్శమంటూ కితాబు ఇస్తున్నారు. బెంగళూరులోని తన నివాసంలో జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న దేవెగౌడ ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్‌ని కూడా నియమించుకున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘తక్కువగా మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, తక్కువగా నిద్రపోవడం, వేకువజామునే నిద్రలేచి వ్యాయామం చేయడం.. అన్నింటికీ మించి దురాశ లేకుండా ఉండడమే తన ఆరోగ్య రహస్యమని దేవెగౌడ చెప్పారు. మరి ప్రధాని మోదీ ఫిట్నెస్ వీడియోపై అభిప్రాయమేమిటని అడగ్గా చిరునవ్వు చిందించారు. దేవెగౌడ ఫిట్నెస్ ట్రైనర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఉదయాన్నే నిద్రలేవగానే దేవెగౌడ గంటపాటు ట్రెడ్మీల్పై నడుస్తారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్‌తో మరెన్నో కఠినమైన ఎక్సర్సైజులు’ చేస్తారని తెలిపారు. -
‘నేను సీఎం కావడం నాన్నకు ఇష్టం లేదు’
బెంగళూరు: తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతలకు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు. ‘ నాకు ఆరోగ్యం పరంగా సమస్యలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇదే విషయాన్ని మా తండ్రి కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎం పదవిని మీ వద్దే ఉంచుకోండని కాంగ్రెస్ నేతలను కోరారు. కానీ వారు మాత్రం నన్ను సీఎంను చేశారు’ అని కుమారస్వామి చెప్పుకొచ్చారు. ‘ఒక్కొసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలనా అని భయమేస్తోంది. ఎందుకంటే విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా అనే అనుమానం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా తనకు డబ్బు అవసరంలేదని, ఇతరవాటిపై ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కుమారస్వామి పేర్కొన్నారు -
ఆ ఎమ్మెల్యేల చూపు మా వైపు
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని చాలా మంది అసంతృప్త నేతలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. శనివారం బెంగళూరు మల్లేశ్వరంలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని, అయితే ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రాధాన్యాన్ని బట్టి ఎవరెవరినీ పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై తమ పార్టీ జిల్లాల నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలని మేము భావించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం వరకు తన మనుగడను నిలపుకోగలదో నాకు తెలుసు. అప్పటివరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషిస్తాం. ఎన్నికల్లో కేవలం కొద్ది సీట్లతో అధికారం కోల్పోయాం. ఈసారి చక్కగా పనిచేసి అధికారంలోకి వస్తాం. మేం అనుకుంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రాగలం. కానీ ప్రస్తుతం మా దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉంది. మరోసారి మా నాయకుడు నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తాం’ అని యడ్డి తెలిపారు. కుమారకు పట్టం.. దారుణం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 37 స్థానాలు గెలిచిన ఒక పార్టీ నేత ముఖ్యమంత్రి కావడం విడ్డూరమని యడ్యూరప్ప విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణం జరగడం ఒక్క కర్ణాటకకే చెల్లిందన్నారు. గతంలో 20–20 నెలల చొప్పున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీకి జేడీఎస్ చేసిన అన్యాయం కాంగ్రెస్ మరచిపోరాదని సూచించారు. మున్ముందు ఈ విషయంలో కాంగ్రెస్ పశ్చాత్తాపపడక తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన సీఎం కుమారస్వామి ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గత 15 రోజులుగా మంత్రి విస్తరణతో బిజీగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొద్ది సీట్లతో వెనుకంజలో పడ్డామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రతాప్ సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయేంద్ర, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి తదితరులు పాల్గొన్నారు. -
2019లో గద్దెనెక్కాలంటే దోస్తీ కట్టాల్సిందే!
దేశంలో సుదీర్ఘకాలం అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? కేంద్రంలోనూ.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయి బక్కచిక్కిన హస్తం పార్టీకి మళ్లీ పూర్వవైభవం సాధ్యమేనా? రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా ఎదిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించాలంటే ఆయా ప్రాంతీయ పార్టీల పంచన చేరాల్సిందేనా? ఇటీవల జరిగిన అనేక ఉపఎన్నికల్లో కమలం పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. బీజేపీపై మిత్రుల అసంతృప్తి ఒకవైపు.. బీజేపీయేతర పార్టీలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడుతుండటం మరోవైపు.. ఈ పరిస్థితుల్లో బీజేపీ భవిష్యత్తు ఏమిటి? మొత్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొచ్చేవేళ.. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ‘సమర్థ్ సంపర్క్’పేరుతో మేధావి వర్గాన్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెడితే.. నిన్న మొన్నటి వరకూ ఉప్పునిప్పులా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యే పని మొదలుపెట్టాయి. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు 14 పార్టీలకు చెందిన సీఎంలు, నేతలు చేయి చేయి కలపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఫలితాలు ఎలా ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ! రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే అధికారం మారుతోంది. ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా వాటికి దక్కే అసెంబ్లీ సీట్లు నామమాత్రమే. బీఎస్పీకి గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు బలముండేది. కానీ ఇటీవల పరిస్థితి మారింది. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 101 లోక్‌సభ స్థానాలుంటే అందులో రెండే స్థానాలున్న గోవాలోనే ప్రాంతీయపక్షాలకు కొంతబలం ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇటీవలే పూర్తయిన రెండు సర్వేలు స్పష్టం చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీకి ఒకప్పుడు ఒక మోస్తరు బలం ఉండేదిగానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నా బీజేపీకి పెద్దగా నష్టం లేదని 2014 ఎన్నికల్లో ఆ పార్టీలకు పోలైన ఓట్లు సూచిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాల నష్టం జరగవచ్చని అంచనా. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీ నాలుగు సీట్లు కోల్పోయే అవకాశముంది. దక్షిణాదిన కర్ణాటకలోనే పొత్తుకు అవకాశం! కేరళలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏ ఎన్నికల్లోనూ వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడానికి ఆస్కారం లేదు. సంఘ్ పరివార్ పెద్ద ఆరెస్సెస్ దన్నుతో బీజేపీ విస్తరిస్తున్నా ఒంటరిపోరులో ఒక్క లోక్‌సభ సీటు కూడా దానికి దక్కే అవకాశాలులేవు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం లబ్ధి పొందింది. ఆ పార్టీ ఇటీవల కాషాయపక్షంతో తెగదెంపులు చేసుకుని కేంద్రంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తెలంగాణలో పాలకపక్షం టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ వ్యతిరేకమే. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్కే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపుగా అస్థిత్వం కోల్పోయింది. తమిళనాడులో సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ పార్టీలు, పాలక ఏఐఏడీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో తెలియనిస్థితి. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం నామమాత్రమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగవచ్చు. పుదుచ్చేరితో కలిపి 130 లోక్‌సభ సీట్లున్న దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు వీలుంది. ఒడిశా, బెంగాల్లో నామమాత్ర ప్రభావం ప్రాంతీయ పక్షమైన బిజూ జనతాదళ్(బీజేడీ) 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఆరంభంలో బీజేపీతో చేతులు కలిపిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 2009లో దానితో తెగదెంపులు చేసుకున్నారు. తర్వాత బీజేపీ బలహీనపడి 2014లో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతాయే తెరవలేదు. అయితే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేడీ తర్వాత స్థానం బీజేపీ సంపాదించింది. కానీ, టీఆర్ఎస్ మాదిరిగానే బీజేడీ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలి సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు తృణమూల్‌తో జతకట్టడానికి అనుకూలంగా లేవు. మొత్తం 63 సీట్లున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడినా కాంగ్రెస్‌కు లభించే ప్రయోజనం అంతంత మాత్రమే. ఈశాన్యంలో అస్సాం, త్రిపురలోనే చాన్స్! 24 లోక్‌సభ సీట్లున్న ఈశాన్యంలో అస్సాం(14), త్రిపుర(2)లోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు అవకాశాలున్నాయి. అస్సాంలో 2014లో మోదీ ప్రభంజనంతో ఏడు లోక్‌సభ సీట్లు సంపాదించిన బీజేపీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏజీపీ, బీపీఎఫ్‌తో కలసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ రెండు ఎన్నికల్లోనూ బాగా దెబ్బతింది. ముస్లింల పార్టీగా అవతరించిన ఏఐయూడీఎఫ్ విడిగా పోటీ చేయడంతో బీజేపీ బాగా లబ్ధి పొందింది. ఈసారి బీజేపీ కూటమిని ఓడించాలంటే ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకతప్పదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 36.5, కాంగ్రెస్‌కు 29.6, ఏఐయూడీఎఫ్‌కు 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ జతకడితే అత్యధిక సీట్లు సాధించే వీలుంది. వామపక్షాల కంచుకోట త్రిపురలో ఓ ఆదివాసీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 51.6, వామపక్ష కూటమికి 46.7, కాంగ్రెస్‌కు 1.8 శాతం ఓట్లు లభించాయి. ఇదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలకు ఓట్లు దక్కే పక్షంలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. యూపీలో కొంత ప్రయోజనం.. బిహార్‌లో అనుమానం మొత్తం 120 లోక్‌సభ సీట్లున్న ప్రధాన హిందీ రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో ఒక్క యూపీలోనే బీజేపీయేతర పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, మరో చిన్న ప్రాంతీయపక్షం ఆర్ఎల్డీ కలసి బక్కచిక్కిపోయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయం గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉపఎన్నికలు నిరూపించాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 41.3, ఎస్పీ 28, బీఎస్పీ 22, కాంగ్రెస్ 6 శాతం ఓట్లు సాధించాయి. అంటే బీజేపీయేతర పార్టీల ఓట్లు 56 శాతం దాటిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలిపితే మూడొంతుల సీట్లు కైవసం చేసుకోవచ్చు. బిహార్‌లో మూడేళ్ల తర్వాత బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో తన సంకీర్ణ మిత్రపక్షాలైన బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎలెస్పీతో కలసి పోటీచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. 14 సీట్లున్న పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లో పాలక కూటమి బీజేపీ–ఏజేఎస్యూపై కాంగ్రెస్, జేఎంఎం ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, కశ్మీర్లో.. బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న హరియాణాలో ప్రధాన ప్రతిపక్షం ఐఎన్ఎల్డీ, కాంగ్రెస్, ఆరెల్డీ కలసి పోటీ చేస్తే బీజేపీకన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఢిల్లీలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పాలకపక్షమైన ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ తదితర కమలం వ్యతిరేక పార్టీలు చేతులు కలిపితే అత్యధిక సీట్లు గెలిచే వీలుందని అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 46.4, ఆప్ 32.9, కాంగ్రెస్ 15.1 శాతం ఓట్లు సంపాదించాయి. ఆప్, కాంగ్రెస్ ఓట్లు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని ఓట్ల వివరాలు సూచిస్తున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(38.5), ఆప్(23.7)కు పడిన ఓట్లు దాదాపు 60 శాతం. ఈ రెండు పార్టీలూ బీఎస్పీతో కలసి పోటీ చేస్తే అకాలీదళ్–బీజేపీ కూటమిని ఒకట్రెండు సీట్లకే పరిమితం చేయవచ్చు. పీడీపీ–బీజేపీ సంకీర్ణ సర్కారు పాలన సాగుతున్న జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి మాదిరిగానే రెండు జాతీయ పక్షాలతో రెండు ప్రాంతీయ పార్టీల పొత్తు కొనసాగితే ఫలితాల్లో చెప్పుకోదగ్గ మార్పులుండకపోవచ్చు. కలసి పోటీచేస్తే గెలుపు ఖాయం కాదు.. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేస్తే గెలుపు సాధ్యం కాదని పాత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో వివిధ పార్టీలు సాధించిన ఓట్లను కూడికలు, తీసివేతలతో కొత్త లేక్కలేసి రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనావేయడం సరికాదని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి ఉమ్మడి కార్యాచరణ లేకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులతో పనిలేకుండా వివిధ పార్టీలు పెట్టుకునే పొత్తులు పనిచేయవని కూడా కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలకపక్షంగా కొనసాగిన కాలం నాటి ఎన్నికలు నిరూపించాయి. మిత్రపక్షాలను సంప్రదించాలంటున్న జేడీయూ, లోక్‌జనశక్తి బిహార్ సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూ జోకీహాట్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోవడంతో బీజేపీపై ఆ పార్టీ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇంధన ధరలు పెరగడం, కీలక విషయాల్లో బీజేపీ నేతలు ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదించకపోవడాన్ని నితీశ్, జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి తప్పుబట్టారు. బిహార్‌కు చెందిన మరో ఎన్డీఏ భాగస్వామి లోక్‌జనశక్తి కూడా మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవాలని, ఆధిపత్య ధోరణి విడనాడాలని చెబుతోంది. ఇదే రాష్ట్రానికి పరిమితమైన మరో చిన్న భాగస్వామి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కాష్వాహా కూడా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి బీజేపీ నాయకత్వం మిత్రులతో చర్చించి విధానాలు రూపొందించాలని, పెద్దన్నలా వ్యవహరించడం మానుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రపక్షం తెలుగుదేశం ఇటీవల ఎన్డీఏ నుంచి బయటపడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమనేలా వ్యవహరిస్తోంది. మొదట్నించీ కాంగ్రెస్, బీజేపీలను సమానంగా వ్యతిరేకించిన ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి వెనకాడననే రీతిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను ఓడించడం అలవాటుగా మారింది. లోక్‌సభలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ను మరింత బలహీనం చేయడానికి మోదీ–షా ద్వయం ప్రతి ఎన్నికల్లోనూ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలులేని దేశంగా మార్చడానికి ఈ అగ్రనేతలిద్దరూ ప్రయత్నిస్తున్నారని గ్రహించిన కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఏకం కావడం కిందటేడాదే మొదలైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పనిచేయలేదు. ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ మద్దతు పలకడం, బీజేపీని ఓడించడంతో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రాచుర్యం లభించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర ప్రతిపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. మళ్లీ యూపీ ఉపఎన్నికల్లో(కైరానా, నూర్పూర్) ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలిపి విజయం సాధించడంతో బీజేపీకి కొత్త సవాల్ ఎదురైంది. ప్రతిపక్షాల మధ్య అనైక్యతను నాలుగేళ్లగా ఉపయోగించుకున్న కాషాయ పక్ష నేతలు తమ దూకుడుతో ప్రతిపక్షాల మధ్య కొత్త ఐక్యతకు పరోక్షంగా కారకులయ్యారు. ఫలితంగా ఒకవైపు ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, మరోవైపు ప్రతిపక్షాల మధ్య రోజురోజుకు వెల్లివిరుస్తున్న ఐకమత్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు బీజేపీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన ప్రతిపక్షాలు ఏకమవ్వడానికి ఇంకా ఏడాది సమయం ఉండడం కూడా కమలం నేతలను అలజడికి గురిచేస్తోంది. పడిపోతున్న బీజేపీ ఓట్ల శాతం కిందటి లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఏడు లోక్‌సభ సీట్లు కోల్పోవడమేగాక దాని ఓట్ల శాతం కూడా ఆందోళన కలిగించే రీతిలో పడిపోయింది. అంతకుముందు బీజేపీ గెలుచుకున్న నాలుగు పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండు సీట్లను ఎస్పీ, ఒక సీటును ఆర్ఎల్డీ కైవసం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో 2014లో బీజేపీకి లభించిన 51.4 శాతం ఓట్లు మరుసటి ఏడాది ఉపఎన్నికలో పది శాతం తగ్గి 40.8 శాతానికి పడిపోయాయి. పంజాబ్‌లో కిందటేడాది జరిగిన గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కూడా బీజేపీ ఓడిపోవడమేగాక పది శాతం తక్కువ ఓట్లు సంపాదించింది. రాజస్తాన్‌లోని ఆల్వార్, అజ్మేర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమితోపాటు ఓట్ల శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లు వరుసగా 5.2, 13.6 శాతం చొప్పున తగ్గిపోయాయి. ఈ రెండు సీట్లు ౖకైవసం చేసుకున్న ఎస్పీ రెండుచోట్లా తన ఓట్ల శాతాన్ని పాతికకు పైగానే పెంచుకోగలగడం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కోల్పోయింది. కశ్మీర్లో సంకీర్ణ భాగస్వామి పీడీపీ ఒక సీటు పోగొట్టుకుంది. గళమెత్తుతున్న భాగస్వాములు! ఇటీవల నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల కారణంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీఏలో బీజేపీపై మిత్రపక్షాల నుంచే బాహాటంగా విమర్శలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు ఏడాదిలోపే ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు ఇంటాబయటా మున్నెన్నడూ లేని ఇబ్బందికర పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. రెండుమూడేళ్లుగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రగతి బాటలో లేదనే భావనతోపాటు ఇటీవల పెట్రో ధరలు అడ్డగోలుగా పెరగడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతోపాటు ఎన్డీఏ మిత్రులు జతకలవడం బీజేపీని రాజకీయ సంక్షోభం దిశగా నడిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే తర్వాతి ఉపఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడం కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది. రెండేళ్ల క్రితమే బీజేపీకి మానసికంగా దూరమైన ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన భవిష్యత్తు ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఈసీ తోడ్పాటుతో, రిగింగ్ చేసి బీజేపీ గెలిచిందనే వరకూ ఈ పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే వెళ్లారు. అయితే, అమిత్‌షా మిత్రపక్షాలను బుజ్జగించే పని వెంటనే ప్రారంభించారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో భేటీ అయ్యారు. మరో వైపు అకాలీదళ్ డిమాండ్లను తీర్చడం ప్రారంభించారు. బిహార్‌లోనూ సంకీర్ణ మిత్రపక్షాలతో విభేదాలు తొలగించుకోవడానికి బీజేపీ నాయకత్వం పట్నాలో సమావేశం జరిపింది. - కథనాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తిరుగుబాటు నిజమే : కుమారస్వామి
సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమేనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. అయితే, సరైన నిర్ణయంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పెట్టుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగారు. అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు, ఈశ్వర్ ఖండ్రే, షమనూర్ శివశంకరప్ప, సతీష్ జాక్రిహోలిలు కేబినేట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఎమ్మెల్యేల తిరుగుబాటు : ప్రభుత్వం కష్టమే?
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్లలో చీలిక వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర రంగంలోకి దిగారు. అయితే, ఆయన వారితో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో గంటకు గంటకు తిరుగుబాటు గ్రూపులో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలైన ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు, ఈశ్వర్ ఖండ్రే, షమనూర్ శివశంకరప్ప, సతీష్ జాక్రిహోలిలు మంత్రి పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యచరణపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు మాత్రం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలదని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు దన్నుగా నిలవాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కేబినెట్లోని సీనియర్లను తీసుకోకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారని తెలిసింది. లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రేలను సైతం కేబినేట్లోకి తీసుకోకపోవడం చర్చనీయాశంగా మారింది. వీర శైవ లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివ శంకరప్ప(89)ను కూడా కేబినేట్లోకి తీసుకోకుండా పక్కనబెట్టారు. కాగా, చర్చలు జరిపేందుకు యత్నించిన కేపీసీసీ చీఫ్ పరమేశ్వరపై అసంతృప్త ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డట్లు తెలిసింది. అయితే, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని పరమేశ్వర పేర్కొన్నారు. కేబినెట్లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయని, వాటిలోకి కొందరిని తీసుకుంటారని చెప్పారు. -
కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందించిన తన కేబినెట్లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. జేడీఎస్ నుంచి 8 మందికి, కాంగ్రెస్ నుంచి 15 మందికి, బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ)లకు ఒక్కోటి చొప్పున పదవులు కల్పించారు. జేడీఎస్‌తో బీఎస్పీ ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకోగా, సంకీర్ణ సర్కారుకు కేపీజేపీ మద్దతు పలికింది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎంబీ పాటిల్, దినేశ్ గుండూ రావు, రామలింగ రెడ్డి, ఆర్.రోషన్ బైగ్, హెచ్‌కే పాటిల్, శ్యాంనూర్ శివశంకరప్ప, తన్వీర్ సేఠ్, సతీశ్ జార్ఖిహోలిలకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం వర్గానికి పెద్దపీట.. కుమారస్వామి సామాజికవర్గం ఒక్కలిగలకు మంత్రివర్గంలో పెద్దపీట దక్కింది. మొత్తం 9 మంది ఒక్కలిగలు, నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు దళితులు, ముగ్గురు మైనార్టీలు, ఇద్దరు– కురుబలు, ఈడిగ, ఉప్పర, గిరిజన తెగ, బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కొక్కరికి స్థానం లభించింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యను ఓడించిన జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ, కుమారస్వామి సోదరుడు రేవణ్ణలకు కేబినెట్లో చోటు దక్కింది. కాంగ్రెస్ నుంచి ప్రమాణం చేసిన వారిలో డీకే శివకుమార్, కేజే జార్జ్, ఆర్వీ దేశ్‌పాండే, ప్రియాంక్ ఖర్గే, ఆర్బీ పాటిల్ తదితరులున్నారు. బీఎస్పీ, కేపీజేపీలకు ఉన్న ఏౖకైక ఎమ్మెల్యేలు వరసగా ఆర్ఏ మహేశ్, ఆర్. శంకర్లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈ కేబినెట్లో అలనాటి నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ఏకైక మహిళా మంత్రి కాగా, 83 ఏళ్ల మనాగుళి(జేడీఎస్) అత్యంత పెద్ద వయస్కులు. కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అసంతృప్తుల నిరసనలు.. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్‌కే పాటిల్ బెంగళూరులోని చాళుక్య సర్కిల్లో 200 మంది మద్దతుదారులతో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్‡ అభిమానులు కూడా మైసూరులో నిరసనకు దిగారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు చేసేటప్పుడు ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని అన్నారు. సంయమనంతో ఉండాలని, అందరికీ న్యాయం చేస్తాననని హామీ ఇచ్చారు. -
కాలా సినిమా.. మరోసారి రజనీ విజ్ఞప్తి
చెన్నై : రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు, హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కన్నడ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. కావేరి జలాల విషయంలో కర్ణాటక మనోభావాలకు భిన్నంగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారని, ఆయన సినిమాను రాష్ట్రంలో ఆడనిచ్చేది లేదని కన్నడ సంఘాలు తెగేసి చెప్తున్నాయి. ఇక, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ‘కాలా’ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఉద్రిక్తతలు, ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని కాలా సినిమా విడుదలను నిలిపేయాలని ఆయన పంపిణీదారులను, నిర్మాతను సూచించారు. అయితే, రజనీకాంత్ మాత్రం ‘కాలా’ సినిమా కర్ణాటకలో విడుదల అవుతుందని ధీమాగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఉన్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో తన సినిమా తప్పకుండా విడుదల అవుతుందని ఆయన అన్నారు. సినిమా విడుదలకు సహకరించాలని ఆయన కర్ణాటకలోని అన్నివర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సినిమా విడుదలకు సహకరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామికి కూడా రజనీ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు కర్ణాటకలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. -
మంత్రివర్గం : కాంగ్రెస్ 14, జేడీఎస్ 7
బెంగుళూరు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయనుంది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 7 మంత్రి పదవులు దక్కనున్నాయి. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేష్‌ను, కేజీపే పార్టీ అభ్యర్థిని కూడా కేబినెట్లోకి తీసుకోనున్నారు. బీఎస్పీ కూడా కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అగ్రనాయకులు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి ఆయన ఆమోదంతో మంత్రి పదవులు ఖరారు చేశారు. రాహుల్ ఆమోదం పొందిన జాబితా అందిన తర్వాతనే సీఎం కుమారస్వామి మంత్రివర్గ ఏర్పాటుకు పూనుకున్నట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కు కీలక మంత్రి పదవీ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఆమోదం తెలిపిన అభ్యర్థుల జాబితాలో డీకే పేరుతో పాటు కేజే జార్జ్, ప్రియంకా ఖార్గే పేర్లు కూడా ఉన్నట్టు ఏఎన్ఐ తెలిపింది. కాగా రానున్న 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇచ్చినట్టు సమాచారం. తర్వాతి కాలంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా కీలక మంత్రి పదవులను రెండు పార్టీలు సమానంగా పంచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రజనీ కాలాకు కన్నడనాట చిక్కులు
-
‘కాలా’ను విడుదల చేయొద్దు
బెంగళూరు: ‘కాలా’ సినిమాను రాష్ట్రంలో రిలీజ్ చేయవద్దని కర్ణాటక సీఎం కుమారస్వామి సినిమా పంపిణీ దారులను కోరారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల చేయటం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా. ఒక పౌరునిగా, కన్నడిగునిగా చెబుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ‘కాలా’తో అనవసరపు వివాదాలు తలెత్తుతాయి. స్వతహాగా నేనూ సినిమా పంపిణీదారుడిని, నిర్మాతనే’అని వ్యాఖ్యానించారు. కావేరి వివాదానికి పరిష్కారం దొరికిన తర్వాత ఆ సినిమాను ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చునన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘కాలా’ విడుదల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. కావేరి అంశంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘కాలా’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కావాల్సి ఉండగా ఆ చిత్ర పంపిణీ, ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక ఫిలిం చాం బర్ ఆఫ్ కామర్స్(కేఎంసీసీ) కూడా ఇంతకుముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రజనీ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు, కాలా నిర్మాత కె.ధనుష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ జి.నరేందర్.. ‘కాలా’ విడుదల సందర్భంగా అవసరమైన బందోబస్తు చేయాలని ఆదేశించారు. అయితే, ఆ సినిమాను తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ థియేటర్ల యజమానులను కోరబోమన్నారు. -
రేవణ్ణతో అగచాట్లు..!!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొత్త చిక్కుల్లో పడ్డారు. కేబినెట్ కేటాయింపుల్లో మిత్రపక్షం కాంగ్రెస్‌తో కన్నా సొంత అన్నయ్య రేవణ్ణ నుంచి ఆయనకు తలనొప్పి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ), విద్యుత్ శాఖలను తనకే కేటాయించాలని రేవణ్ణ పట్టుబట్టినట్లు సమాచారం. రేవణ్ణ అంటే మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రాణం. అందుకే ఆయన కోరిక మేరకు రాహుల్‌తో దేవెగౌడ చర్చలు జరిపి ఒప్పించారు కూడా. 2004-2006ల మధ్య కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి ప్రభుత్వంలో, 2006-2007ల మధ్య జేడీఎస్-బీజేపీ ప్రభుత్వంలో రేవణ్ణ ఈ పోర్ట్‌ఫోలియోలను చేపట్టారు. కాగా, రేవణ్ణకు రెండు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవణ్ణపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని అన్నారు. పార్టీ తనకు ‘వాచ్‌మన్’ ఉద్యోగం ఇచ్చిందని తాను దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని మీడియాతో బహిరంగంగా శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో సిద్ధారామయ్య కేబినెట్లో శివకుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. కాగా, రెండు పోర్ట్‌ఫోలియోలతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ జిల్లా నుంచి మరే ఎమ్మెల్యేను మంత్రిగా చేయొద్దని రేవణ్ణ కుమారస్వామి, దేవెగౌడలను కోరినట్లు రిపోర్టులు వస్తున్నాయి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు కుమారస్వామి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అతను కోపంతో ఊగిపోతున్నట్లు స్థానిక జేడీఎస్ నేతలు చెబుతున్నారు. ఈ మధ్య రేవణ్ణ ఇంటికి వెళ్లిన కుమారస్వామిని ప్రజ్వల్, రేవణ్ణ భార్య పలకరించలేదని కూడా సమాచారం. కాగా, ఎన్నికల వల్ల దేవెగౌడ కుటుంబంలో మనస్పర్దలు వచ్చినట్లు గౌడ సన్నిహితుడు ఒకరు తెలిపారు. కుటుంబం మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చేందుకు దేవెగౌడ తీవ్రంగా యత్నిస్తున్నట్లు వెల్లడించారు. కావాలనే ప్రజ్వల్‌ను కుమారస్వామి రాజకీయాలకు దూరంగా పెడుతున్నట్లు రేవణ్ణ భావిస్తున్నారని చెప్పారు. తన తనయుడు నిఖిల్ కుమార్‌ను ప్రమోట్ చేసుకునేందుకే కుమారస్వామి ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు దేవెగౌడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ను తన స్థానంలో నిలబెడతానని చెప్పినట్లు తెలిసింది. కాగా, బుధవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి కర్ణాటకలో కేబినేట్‌ను విస్తరించనుంది. -
కేబినెట్లో ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆ రెండు పార్టీలకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 శాఖలు చొప్పున కేటాయించేలా ఒప్పందానికి వచ్చారు. ఈనెల 6వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని సీఎం కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్– జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం భారీగా పోటీ పడుతున్నారు. తమకే మంత్రిమండలిలో బెర్తు ఖరారు కావాలంటూ పార్టీ పెద్దల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దేవెగౌడ ఇంటికి క్యూ జేడీఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరు మంత్రి పదవుల కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బెంగళూరు నగరంలోని పద్మనాభనగర్లోని దేవేగౌడ నివాసానికి క్యూ కడుతున్నారు. ఆయన ఓకే చేస్తే తమకు బెర్తు ఖరారు అవుతుందని విశ్వాసంతో భారీ లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ నుంచి 37 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ వద్దనే పంచాయితీ.. అదేవిధంగా కాంగ్రెస్ జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈమేరకు కొత్త జాబితా తీసుకుని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ తరలివెళ్లారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. విదేశాల్లో ఉన్న రాహుల్‌గాంధీ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో సమావేశమై మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఉండాలి? ఏ శాఖ కేటాయించాలనే దానిపై తుది నిర్ణయానికి వస్తారు. కాంగ్రెస్‌లో మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ముగ్గురికి చోటు దక్కినట్లే(నా)? కర్ణాటకలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులు, ఒక బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. కాగా వారిలో స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. అలాగే బీఎస్పీ ఎన్నికలకు ముందే జేడీఎస్‌తో జత కట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్, స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేష్, ఆర్.శంకర్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురికీ ఏ శాఖలు ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. జేడీఎస్‌లో ఎవరెవరంటే.. జేడీఎస్ సీనియర్ నాయకులు హెచ్డీ రేవణ్ణ, బసవరాజు హొరట్టి, హెచ్.విశ్వనాథ్, బీఎం ఫరూఖ్, సీఎస్ పుట్టరాజు, జీటీ దేవేగౌడ తదితరులకు మంత్రివర్గంలో చోటు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరో వైపు బండప్ప కాశంపూర్, ఏటీ రామస్వామి, హెచ్‌కే కుమారస్వామి, శ్రీనివాసగౌడ, గోపాలయ్య, కంపెనగౌడ నాడెగౌడ, బి.సత్యనారాయణ్, ఎస్ఆర్ శ్రీనివాస్, కేఎం శివలింగేగౌడ, ఎంసీ మనగుళి తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో మాజీలతో పాటు మరికొందరు.. కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవుల కోసం చాలామంది పోటీలో ఉన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన డీకే శివకుమార్, శామనూరు శివశంకరప్ప, ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, కేజే జార్జి, రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, రోషన్‌బేగ్, తన్వీర్ సేఠ్, ప్రియాంక ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే తదితరులు ఈసారి కూడా కేబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాధ్యక్షులు ఎస్ఆర్ పాటిల్, దినేష్ గుండూరావు, సీనియర్ ఎమ్మెల్యేలు సతీష్ జారకిహోళి, శివానంద పాటిల్, అమరేగౌడ బయ్యాపుర, లక్ష్మీ హెబ్బాళ్కర్, అజయ్‌సింగ్, యశవంతరాయపాటిల్, ఉమేశ్‌యాదవ్, పుట్టరంగశెట్టి, డాక్టర్ సుధాకర్, సీఎస్ శివెళ్లి, అభయ్ప్రసాద్, బసవరాజు పాటిల్ తదితరులు మంత్రి పదవిని ఆశించే వారిలో ఉన్నట్లు సమాచారం. హస్తినకు కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీతో సమావేశం కావడానికి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం ఢిల్లీ తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ జాబితా ఖరారు చేస్తారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై ఢిల్లీలోనే ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమ లేదా మంగళవారం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మంత్రుల జాబితా పూర్తి కానుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. మంత్రి పదవి అడగలేదు.. తనకు మంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మంత్రి పదవుల కేటాయింపులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌దే తుది నిర్ణయమని అన్నారు. తనకు ఏ శాఖ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనసులో మాట చెప్పారు. -
కాంగ్రెస్-జేడీఎస్ 2019లోనూ..
సాక్షి, బెంగళూరు : 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్లు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య కేబినేట్ విస్తరణ పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేబినేట్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇరువర్గాలు ఓ ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. దీనికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలా ఒకసారి ఈ కమిటీ భేటీ అవుతుంది. మొత్తం 34 శాఖల్లో కాంగ్రెస్‌కు 22(హోం, ఇరిగేషన్, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ తదితరాలు), జేడీఎస్‌కు 12(ఎక్సైజ్, పీడబ్ల్యూడీ, విద్య, పర్యాటకం, రవాణా తదితరాలు) దక్కాయి. -
పదవుల పంట
నాకెప్పుడూ ఓడిపోయే పార్టీలో ఉండాలని కోరిక. అందువల్ల చాలా లాభాలున్నాయి. కాంగ్రెస్‌వారు హైదరాబాద్‌కి – చక్కటి ఎయిర్ కండీషన్ బస్సుల్లో తీసుకెళ్తారు. కుమారస్వామిగారు శ్రావణ బెళగొళ, నంది హిల్స్ బందిపూర్ వంటి స్థలాలకు తీసుకెళ్తారు. కొంచెం వయస్సు మళ్లినవారికి స్లీపర్ బెర్త్‌లు కూడా ఇస్తారు. ఇష్టమైన విందులూ, ఫలహారాలూ, మధ్య మధ్య సరదాగా పిక్నిక్లూ ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన కర్ణాటక వంటలు– బిసిబెళబాత్, మద్దూర్ వడ, పులియోగరె, పడ్డు, దేవనగిరె బెన్నె దోశె, రాగి బాల్స్, నీర్ దోశె, అక్కి రోటి వంటివి తినిపిస్తారు. మళ్లీ పువ్వులాగా శాసనసభకి తీసుకువస్తారు. నాకు– ముఖ్యంగా దేవెగౌడ, కుమారస్వామి పార్టీలలో చేరాలంటే చాలా ఇష్టం. ప్రచారం గొడవలు ఎక్కువ ఉండవు. ‘కావేరీ నుంచి నీళ్లు తెస్తాను, తిరుపతి లడ్డూలు పంచుతాను, టిప్పుసుల్తాన్ కత్తిని ఫూల్‌బాగ్ మధ్యలో నిలబెడతాను’ వంటి హామీలు ఇవ్వనక్కరలేదు. పెద్ద పెద్ద ఎన్నికల సభలుండవు. కానీ అందరికీ ఆ పార్టీ గెలుస్తుందని, తప్పక పదవిలోకి వస్తుందని ఒక గౌరవం ఉంటుంది. ఎలా? అది చరిత్ర చెప్పిన పాఠం. 1996లో జనతాదళ్‌కి కేవలం 46 సీట్లు వచ్చాయి. కానీ దేవగౌడ ఈ దేశపు ప్రధాని అయి– హాయిగా పార్లమెంటులో అప్పుడప్పుడూ నిద్రకు విశ్రమించేవారు. 2006లో 58 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా బీజేపీతో పొత్తు పెట్టుకుని రొటేషన్మీద కుమారస్వామిగారు 20 నెలలు ముఖ్యమంత్రి అయి, తర్వాత బీజేపీని ‘మీ దిక్కున్నవాడితో చెప్పుకోండి’ అన్నారు. అలా అనగలిగే మగాడు కుమారస్వామి ఒక్కరే. ఇప్పుడు కేవలం– 38 సీట్లతో– 18 శాతం ఓటర్ల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. వారు హడావుడి చెయ్యరు. రాజకీయాల్లోకి పోరు. అవినీతి, లంచాలు వంటి బూతు మాటలు మాట్లాడరు. అయితే అలనాడు రెండు పిల్లుల తగాదా ఒక కోతి తీర్చినట్టు వారు ముఖ్యమంత్రి అవుతారు. నన్ను ‘తినుబండారాలశా ఖ’కు మంత్రిని చేశారనుకోండి. రాష్ట్రమంతా రాగి బాల్స్, నీర్ దోశె, అక్కి రోటి ఉచితంగా పంచుతానని ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే కుమారస్వామిలాగా ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ మీద కసితో కాంగ్రెస్ ‘బేషరతు’గా జనతాదళ్‌కి మద్దతు ఇచ్చింది. అంటే ఎవరినీ మంత్రిమండలిలోకి తీసుకోవాలన్న షరతు లేదు. చక్కగా ఐదేళ్ల పాలనకు ఇది రాచబాట. ఈ కేసుని విచారించిన న్యాయమూర్తుల్లో కనీసం ఒక్కరికయినా ‘హాస్య ధోరణి’ ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. జస్టిస్ సిక్రీగారు సరదాగా అన్నారు: ‘నన్ను, ఎమ్మెల్యేలున్న హోటల్ ప్రొప్రయిటర్ అడిగాడు: అయ్యా– నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నన్ను సీఎంని చేస్తారా? అని’ అంటూ. ముందు ముందు– పాలిస్తున్న బీజేపీని ఓడించటానికి సంకీర్ణ ప్రభుత్వాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. రేపు రాబోయే 2019 ఎన్నికలలో అసలు ఆఫీసుకూడా లేని, కేవలం చొక్కా, ప్యాంటుగల కొత్త పార్టీలు చాలా మొలకెత్తవచ్చు. వాటిలో చేరాలని నా తలంపు. ‘నన్ను ఎవరు ఉజ్జయినికి తీసుకెళ్తారు? రాజస్తాన్ ‘చిమ్ చిమ్ పరోటా’, బజ్రే కే రోటీ, లాషూంకి చెట్నీని ఎవరు తినిపిస్తారు? హరిద్వార్‌లో పవిత్ర గంగా స్నానం చేయించి వేడి వేడి హల్వా, జిలేబీ తినిపిస్తారు? – వంటి కోర్కెలు కోరవచ్చు. అయితే ఇక మీదట కొన్ని సమస్యలు జనతాదళ్‌కి రావచ్చు. తమని సమర్థించిన పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిమీద ప్రేమతో వారు జనతాదళ్‌లో చేరలేదు. పక్కవాడిని చెప్పు తీసి కొట్టాలంటే తన కొత్త చెప్పు ఎందుకని పొరుగువాడి ‘చెప్పు’ అయితే లాయకీ– అని వారు నమ్మారు. మరి ఇప్పుడు– లోగడ సంప్రదాయం ప్రకారం కుమారస్వామి ఏ రెండేళ్లో పాలన చేసి కాంగ్రెస్‌కి అప్పగిస్తారా? గొప్ప గొప్ప పదవులన్నీ కాంగ్రెస్‌కి ఇస్తారా? ఇందులో మళ్లీ ఆర్థిక మంత్రి ఎవరు? గనుల మంత్రి (మరచిపోవద్దు– గాలి జనార్దన రెడ్డి ఉన్న రాష్ట్రమది. మంత్రి ఎవరున్నా వారిని ‘మచ్చిక’ చేసుకోవడం రెడ్డిగారికి వెన్నతో పెట్టిన విద్య). అందువల్ల కర్ణాటకలో గనుల శాఖకు చెప్పలేని ప్రాధాన్యం ఉంది. ఇవన్నీ ఎన్నికయ్యాక వచ్చే సమస్యలు. అలాగే బేషరతుగా తమని సమర్థించిన కాంగ్రెస్‌కి (78) ఎన్ని మంత్రి పదవులివ్వాలి? మరి మాలాంటి వాళ్లకి కేవలం మద్దూర్ వడ, అవిరిక్కే పాల్యాతో కుమారస్వామి సరిపెట్టేస్తారా?– అన్న విషయం గమనించాల్సి ఉంది. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు -
రాహుల్ ఆశీస్సులతోనే సీఎం అయ్యా..
సాక్షి, బెంగళూర్ : తాను కర్ణాటక ప్రజలకు కాకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉంటానని వ్యాఖ్యానించి రాజకీయ దుమారం రేపిన సీఎం కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చానని, ప్రజల ఆశీస్సులతో కాదని అన్నారు. రైతు రుణాల మాఫీపై జేడీఎస్ ఇచ్చిన హామీకి సంబంధించి బుధవారం కుమారస్వామి రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఆయన తేల్చిచెప్పారు. తాను ప్రజల ఆశీస్సులతో కాకుండా రాహుల్ ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చానని..తాను కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని, వారి ఆమోదం లభించాకే తాను ఓ నిర్ణయం తీసుకుంటా’నని కుమారస్వామి పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున రైతు రుణాల మాఫీపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని, దీనికి తనకు కొంత సమయం కావాలని కుమారస్వామి పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ప్రజల మద్దతు తమకు లభించకపోవడంతోనే కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మూడవ స్ధానంలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ బేషరతు మద్దతుతో కర్ణాటకలో కుమారస్వామి సీఎంగా జేడీ(ఎస్)- కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ కొలువుతీరింది. -
అది కాంగ్రెస్ నిర్ణయం : దేవెగౌడ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అస్పష్ట తీర్పు వెలువడగానే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని ప్రతిపాదించానని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చెప్పారు. కుమారస్వామిని సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీయే ఒత్తిడి చేసిందన్నారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లతో.. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి..తాము మద్దతిస్తామని స్పష్టం చేశానన్నారు. అయితే కుమారస్వామిని కర్ణాటక సీఎం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంగా వారు చెప్పారన్నారు. రైతులకు ఊరట కల్పించే అంశం సహా సంకీర్ణ సర్కార్‌ను నడపడంకష్టమేనని దేవెగౌడ చెప్పుకొచ్చారు. కేవలం 37 మంది ఎంఎల్ఏలతో తాము మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుంటే సర్కార్ సాఫీగా నడవడం సాధ్యం కాదన్నారు. కుమారస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఉంటారని, 6.5 కోట్ల కన్నడిగుల ఆకాంక్షలతో కాదని అన్నారు. పరిస్థితులకు లోబడిన వ్యక్తిగా కుమారస్వామిని ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వస్తే రూ 53,000 కోట్ల రైతు రుణాలను 24 గంటల్లో మాఫీ చేస్తానని కుమారస్వామి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంకీర్ణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ హామీ అమలుకు ఆయన మరికొంత సమయం కోరుతున్నారు. -
బలపరీక్షలో కుమారస్వామి విజయం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బల పరీక్షలో విజయం సాధించారు. విధానసౌధలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో 117 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకుంది. తమ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బలపరీక్షకు ముందే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా కుమారస్వామి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ 111ను దాటేసింది. అంతా అనుకున్నట్టు జరగడంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. కుమారస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోవడంతో గత కొన్నిరోజులుగా కర్ణాటకలో కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెర పడింది. సభలో అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కన్నడ ప్రజలు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిశాయని కుమారస్వామి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కొత్తేమీ కాదని, 2004లో ఇలానే జరిగిందని గుర్తు చేశారు. -
ప్రతిపక్ష ఐక్యతలో ప్రశ్నలెన్నో!
మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతిమంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డి కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వేళ ప్రతిపక్షాలు చూపించిన ఐకమత్య సంరంభం నాకు నోట మాట రాకుండా చేసింది. గడచిన నాలుగేళ్ల నుంచి నేను ఒకే విషయం చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఇప్పటిదాకా భారత గణతంత్ర మౌలిక విలువల మీద దొంగచాటు దాడికి పాల్పడుతూనే ఉంది. అయినప్పటికి మోదీ వ్యతిరేకులు ఒకే తాటి మీదకు వచ్చి ప్రతిఘటించే ముహూర్తం కానరాకపోవడమే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే మోదీని అధికారం నుంచి దించడం అనే ఏకసూత్ర ప్రణాళిక మాత్రం న్యాయబద్ధమైనది కాలేదు. అంతేకాదు, అలాంటి ఆలోచన ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఎక్కువే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర పరిణామాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని దారులు చూపించాయి. ఆ ఎన్నికల ఫలితాలు ఒక వాస్తవాన్ని కూడా నిర్ధారించాయి. ఈ వాస్తవం గడిచిన ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఏ రాజకీయ విశ్లేషకుడైనా ఊహించేదే కూడా. మోదీ, షా ద్వయం బలీయమైనది, అదే సమయంలో అని తర సాధ్యమైనది. కాంగ్రెస్ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలను కూడా ఫలి తాలు తారుమారు చేశాయి. సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్రతిహత రాజకీయ విన్యాసాల ముందు సొంత శక్తి మీద నిలువలేదన్న వాస్తవాన్ని కూడా ఆ ఫలితాలు వెల్లడించాయి. అలాగే ఆ ఫలితాలు ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కూడా సూచిస్తున్నట్టయితే, ఎన్నికల అనంతరం జరిగిన మాయోపాయాలు, యడ్యూరప్పను పదవీచ్యుతుడిని చేయడానికి జేడీ(ఎస్), కాంగ్రెస్ పోషించిన చురుకైన పాత్ర వంటివి చూస్తే అందుకు, అంటే ఐక్యతకు అవకాశం, ఆచరణ మెండుగానే ఉన్నట్టు నిర్ధారణయింది కూడా. ఆ విధంగా చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికలు 1971,1977, 1989 నాటి ఎన్నికల నమూనాలో జరిగే అవకాశం ఉంది. అప్పుడు అన్ని ప్రతిపక్షాలు కలసి బలీయమైన అధికార పక్షాన్ని ఓడించడానికి ఏకమైనట్టు కనిపిస్తుంది. తేడా ఒక్కటే. పూర్వం అవన్నీ కాంగ్రెస్ వ్యతిరేక కూటములు. ఇప్పుడు మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి. ఈ పరిణామం ఆశ్చర్యపడవలసినదేమీ కాదు. మోదీ బుడగ తనకు తాను ఎప్పుడు బద్దలవుతుందా అని గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షం ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ క్షణం రాలేదు. మోడీత్వకు వ్యతిరేకంగా విపక్షం చేయవలసినవన్నీ చేసింది. అవి కూడా ఫలితాలను ఇవ్వలేదు సరికదా, వికటిం చాయి. క్షేత్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడగలిగే ఒక ప్రతిపక్ష కూటమిని అందించడంలో మోదీ వ్యతిరేకులు విఫలమయ్యారు. ఇక చేసేదిలేక విపక్షాలు విస్తృత మోదీ వ్యతిరేక కూటమి నిర్మాణమే తుది లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఆఖరిపోరాటం ఆరంభించారు. కానీ కర్ణాటకలో సంభవించిన పరి ణామాలు ఈ కూటమి ఏర్పాటుకు కొత్త షరతులను ముందుకు తెచ్చాయి. చిత్రం ఏమిటంటే ఆ షరతులను నిర్దేశించేది కాంగ్రెస్ కాదు, ప్రాంతీయ పార్టీలు. బీజేపీయేతర పార్టీల ఓట్లలో చీలిక రాకుండా జాగ్రత్త పడడం వల్ల ఆ లబ్ధి చేకూరుతున్నది. ఇది గోరఖ్‌పూర్, ఫూల్పూరు ఎన్నికలలో రుజువైంది. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ బలం కలిగి ఉన్నాయో అక్కడ ఇది వర్తిస్తుంది. ఓట్లు చీలకపోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు, విపక్షాలు జాతీయ స్థాయిలో హవాను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలకు ఉన్న ఈ సానుకూలతలను చాలా సందర్భాలలో అతిశయోక్తిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఐక్యత అనే ఆలోచన అవసరం రాదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో ఇది నిజం. అక్కడ కాంగ్రెస్–బీజేపీల మధ్య ద్విముఖ పోటీయే ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో కలసే మరో ప్రతి పక్షం ఏదీ లేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరొక రకమైన పరిస్థితి. ఆ రాష్ట్రాలలో ఎక్కడా కూడా తొలి రెండు స్థానాలలో ఉన్న అగ్రగామి పక్షంగా బీజేపీ లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలన్న నినాదానికి అర్థమే లేదు. బెంగాల్లో బీజేపీని నిలువరించడానికి మమతా బెనర్జీకి మరొక రాజకీయ పార్టీ సాయమేదీ అవసరం ఉండదు. ప్రతిపక్షాల ఓట్లు చీలకపోవడం గురించి కూడా అతిశయోక్తులు వినిపిస్తూ ఉంటాయి. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల మాదిరిగానే బీజేపీయేతర పార్టీల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదు. మొన్నటి కర్ణాటక ఎన్నికలలో కొన్ని ప్రాంతాలలో జేడీ(ఎస్), కాంగ్రెస్‌ల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్నచోట ప్రతిపక్షానికి కొత్తగా లభించే లబ్ధి ఏదీ ఉండదు. కొన్ని చోట్ల బీజేపీయేతర పార్టీల ఓట్లే అయినప్పటికీ అవి బదలాయించడానికి అవకాశం ఉన్నవి కావు. ఉత్తరప్రదేశ్, బెంగాల్లో కాంగ్రెస్ పరి స్థితి ఇదే. కాబట్టి కాగితాల మీద కనిపిస్తున్న బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం వాస్తవికంగా ఆకృతి దాల్చడం లేదు. ఇంకొక అంశం– ప్రతిపక్షాల ఐక్యత వల్ల వచ్చే ప్రయోజనాలు అన్ని సందర్భాలలోను నిలకడగా ఉండవు. టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, జేకేఎన్సీ, బీజేడీ, ఐఎన్‌ఎల్‌డీల విషయంలోను, ఇంకా చెప్పాలంటే బీఎస్పీ విషయంలో కూడా ఇదే వాస్తవం. ఈ పార్టీలు మొదట బీజేపీ వ్యతిరేక కూట మిలో భాగస్వాములు కావచ్చు. కానీ వాటి గత చరి త్రను చూస్తే ఎన్నికల అనంతర అవగాహనలలో భాగంగా వారు బీజేపీవైపు మొగ్గు చూపబోరని ఎవరూ చెప్పలేరు. బీజేపీ వ్యతిరేక విస్తృత కూటమి గురించి మాట్లాడుతున్న సందర్భంలో రెండు వాస్తవాలను గుర్తించడంలో వైఫల్యం కనిపిస్తుంది. అవి– దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నవారు నిజానికి భవిష్యత్తులో బీజేపీ పునాది విస్తరించడానికి ఉపయోగపడేవారే అవుతారు. ప్రధాన ప్రతిపక్షాల ఐక్యత (బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ; ఒడిశాలో ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్, తెలంగాణ, ఆంధ్రా) ఒక శూన్యాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఉంది. ఈ పార్టీలలో ఏదైనా తమను అనాథగా వదిలేసిందని ఓటర్లు భావించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇలా విపక్షాలు వదిలిన శూన్యాన్ని భవిష్యత్తులో బీజేపీయే సొంతం చేసుకుంటుంది. అలాగే మోదీ వ్యతిరేకత అనే నినాదంతో మిగిలిన అందరూ ఏకమైతే అంతి మంగా అది మోదీ పట్ల సానుభూతిగా మారుతుంది. మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కుమారుడు, అఖి లేశ్, మాయావతి, శరద్‌పవార్, చంద్రబాబునాయుడు, దేవెగౌడ, చంద్రశేఖరరావు, కరుణానిధి, నవీన్ పట్నాయక్ రాహుల్‌గాంధీతో చేతులు కలపడం వాంఛించదగినది కాదు. దీనివల్ల సాధారణ ఓటరు కొత్త తరహా భారతదేశం గురించి ఆలోచించడానికి ప్రేరణ కలుగుతుంది. నిజానికి దేశంలో చాలామంది ఓటర్లు మోదీ వైపు మొగ్గడానికి కారణం ఈ నాయకులేనన్న వాస్తవాన్ని మనం మరచిపోరాదు. ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాల పట్ల నేను అసంతృప్తిగా ఉండడానికి వెనుక కారణం కొన్ని లాభనష్టాలు మాత్రమే కాదు. నాకున్న సమస్య ఏమిటంటే– నేడు ఉన్న ఈ పాలనను ఎందుకు తిరస్కరించాలి అన్న విషయాన్ని వారు మరచిపోయారు. అంతేకాదు, జనం కూడా మరచిపోయేటట్టు చేస్తున్నారు. కూటమిగా ఏర్పడుతున్న ఈ బీజేపీయేతర పార్టీలలో ఏ ఒక్కటీ కూడా గణతంత్ర భారత పునాదులకు ఎదురవుతున్న సవాళ్లను ప్రతిఘటించడానికి సంసిద్ధంగా లేదు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడే కూటమికి ఈ నాలుగు లక్షణాలు ఉండాలి. ఒకటి– సానుకూల జాతీయవాద సంప్రదాయాన్ని పునరుద్ధరించే దృష్టి ఉండాలి. దేశంలో ఉన్న భిన్న సంస్కృతులూ సంప్రదాయాల మధ్య అంతస్సూత్రంగా వ్యవహరించాలి. ఈ తరం యువతకూ భవిష్యత్తుకూ మధ్య వారధిలా పనిచేయాలి. రెండు– స్వతంత్ర భారతంలో ఎన్నికల యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించిన వ్యవస్థతో పోరాడే జాతీయ స్థాయి రాజకీయ సంస్థ అవసరం. మూడు– కొత్త రాజకీయాలను దర్శించే వ్యూహాత్మక ప్రణాళిక ఉండాలి. నాలుగు–దేశంలో కొత్త ఆశలు నింపగలరని నమ్మకం కలిగించే వ్యక్తులు అందులో ఉండాలి. దురదృష్టం ఏమిటంటే మోదీకి వ్యతిరేకమంటూ ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిలో ఏ ఒక్క పార్టీకి ఇలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రతిపక్ష కూటమి ఐక్యత వల్ల కొంత లబ్ధి జరగవచ్చు. అంతేకాని అవి మోదీ పాలనకు ప్రత్యామ్నాయం మాత్రం కాలేవు. ఇంకా చెప్పాలంటే మోదీ పాలనకు స్వస్తి పలికినప్పటికీ ఈ కూటమి స్వల్పకాలిక ప్రయోజనం కూడా సాధించలేకపోవచ్చునేమో కూడా. పోనీ స్వల్ప కాలిక ప్రయోజనమే సాధించినప్పటికీ అది మన గణతంత్ర రాజ్య ప్రయోజనాలను ఫణంగా పెట్టి సాధించినదే. యోగేంద్ర యాదవ్ , వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు, మొబైల్ : 98688 88986 -
ఈ సర్కారు ఆరునెలలే
తనను గద్దె దించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్– జేడీఎస్ కూటమిపై యడ్యూరప్ప శాపనార్థాలు సంధించారు. పూర్తి మెజారిటీ వస్తేనే రైతు రుణమాఫీ అని కుమారస్వామి చెప్పడం సరికాదని, తక్షణం రైతు రుణాలను మాఫీ చేయకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శివాజీనగర: ఎన్నికలకు ముందు జేడీఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతుల రుణమాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలతో కలసి పోరాటం చేపడతామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప హెచ్చరించారు. బుధవారం నగరంలో ఆనందరావు సర్కిల్లోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నూతన సర్కారుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహించారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రజా వ్యతిరేకమైనదని ఆరోపించారు. యడ్యూరప్ప మాట్లాడుతూ కొత్త కూటమి ప్రభుత్వం 6 నెలలకు మించి అధికారంలో ఉండకపోవచ్చని జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగిన కూడా తమ పార్టీ అధిక మెజారిటీతో అధికారం చేపడుతుందని ప్రకటించారు. మంత్రి మండలి విస్తరణ చేపడితే ఏమవుతుందోనని ఈ రెండు పార్టీల నాయకులకు భయం పట్టుకుందని యడ్డి విమర్శించారు. అందువల్లే ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మంత్రిమండలి విస్తరణే జరిగితే ఎలాంటి విభేదాలు తలెత్తుతాయనేది వేచి చూడాలని అన్నారు. రెండు పార్టీల్లో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైనా కూడా అవకాశవాద రాజకీయం చేస్తున్న కాంగ్రెస్–జేడీఎస్‌ల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. తక్షణమే రుణమాఫీ చేయాలి తక్షణమే రుణమాఫీ చేయాలని నూతన ముఖ్యమంత్రిహెచ్.డీ.కుమార్‌స్వామిని యడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉంటే రైతుల రుణమాఫీ చేసేవాడినని ఆయన చెప్పటం సరైన విధానం కాదని ఆక్షేపించారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం తమ కర్తవ్యమని, దీనిని నిర్లక్ష్యం చేస్తే అన్నదాత వీధిన పడతాడని హెచ్చరించారు. పాము–ముంగిసలా ఆరోప–ప్రత్యాపరోణలతో దెబ్బలాడిన రెండు పార్టీలు ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏనుగుతో ప్రేమ, కాంగ్రెస్‌తో పెళ్లి సీనియర్ నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ జేడీఎస్‌తో కలసినవారు ఎవరూ అభివృద్ధి చెందలేదని, గతంలో మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్, సిద్ధరామయ్యలకు ఏం జరిగిందన్నది తెలియనిది కాదని ధ్వజమెత్తారు. జేడీఎస్‌కు ఏనుగుతో ప్రేమ పుట్టింది, ఓవైసీతో డేటింగ్ అయింది, కాంగ్రెస్‌తో పెళ్లయింది.. అని హేళన చేశారు. ఈ ధర్నాలో లోక్‌సభ సభ్యులు శోభాకరంద్లాజె, పీ.సీ.మోహన్, ఎమ్మెల్యేలు ఎస్.ఆర్.విశ్వనాథ్, అశ్వథ్ నారాయణ, మాజీ మంత్రి కట్టా తదితరులు పాల్గొన్నారు. -
కుమారస్వామికి కలిసివచ్చిన ఇల్లు..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నగరంలోని జేపీ నగరలోని తన నివాసం నుంచే పరిపాలన సాగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంలకు ప్రభుత్వం కేటాయించే బంగ్లాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రులు నివాసం ఉండటానికి బెంగళూరులో అనుగ్రహ, కావేరీ బంగ్లాలు ఉన్నాయి. జయనగర్ నివాసం సెంటిమెంట్‌గా కలిసి రావడంతో కుమారస్వామి అక్కడకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అయితే సీఎం అధికారిక నివాసం కృష్ణ బంగ్లాను ప్రజలను కలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కలిసి వచ్చిన ఇల్లు... గతంలో 2007లో సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి జేపీ నగర్‌లోని ఇంటి నుంచి వేరే నివాసానికి మకాం మార్చారు. అయితే జోతిష్యుల సలహా మేరకు 2018 ఎన్నికల ప్రచారానికి ముందే జేపీ నగర్‌లోని ఇంటికి మరమ్మతులు చేయించి అక్కడికి మారిపోయారు. ఈ ఇంట్లో ఉండగా, ఆయన సినీరగంలో పంపిణిదారుడిగా, నిర్మాతగా రాణించారు. తరువాత సీఎం కూడా అయ్యారు. -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వాళ్లు దూరం... ఎందుకు ?
ముంబై/భువనేశ్వర్ : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేవెగౌడ పంపిన ఆహ్వానాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ సున్నితంగా తిరస్కరించారని ఆ పార్టీ ఎంపీ తెలిపారు. పాల్ఘార్ లోక్‌సభ స్థానానికి 28న జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ బిజీగా ఉన్నందునే బెంగళూరు వెళ్లలేకపోయారన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కార్యక్రమానికి హాజరు కాలేదని బీజేడీ పార్టీ తెలిపింది. రాష్ట్రానికే పరిమితమయిన బీజేడీకి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించింది. అయినా, గత 18 ఏళ్లలో జరిగిన ఏ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ సీఎం నవీన్ హాజరు కాలేదని పార్టీ పేర్కొంది. -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ఆహ్వానం మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి బుధవారం ఉదయం బెంగళూరుకు వెళ్లారు. వీరంతా రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. -
కుమారస్వామికి కేటీఆర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామికి ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కుమారస్వామికి, అతని కార్యకర్తలకు, కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు. Congratulations to Sri @hd_kumaraswamy Ji on swearing in as the chief minister. Good luck to his team & people of Karnataka — KTR (@KTRTRS) May 23, 2018 -
తల్లి కాంగ్రెస్-పిల్ల టీడీపీ; బండారం బట్టబయలు
సాక్షి, బెంగళూరు: ఒకటి రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీ.. ఇంకోటి అధికారంలో ఉంటూ అన్యాయాలు తప్ప మరొకటి చేయని పార్టీ.. రెండిటి డీఎన్ఏ ఒక్కటే! అవి తల్లి కాంగ్రెస్.. పిల్ల టీడీపీలు. గతంలో చీకటి వ్యవహారంలా కొనసాగిన వారి అనుబంధం ఇవాళ బహిరంగ వేదికపై బట్టబయలైంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. బుధవారం బెంగళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాహుల్-బాబులు పబ్లిక్‌గా చేయీచేయీ కలిపారు. కార్యక్రమానికి వచ్చిన నేతలంతా వరుసగా నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నక్రమంలోనే వీరిద్దరూ పరస్పరం అభివాదాలు, కరచాలనం చేశారు. బాబు.. రాహుల్ భుజంతట్టారుకూడా. అభివాదం చేసేటప్పుడు రెండువేళ్లు(విక్టరీ సింబల్) చూపించే చంద్రబాబు ఇవాళ అనూహ్యంగా హస్తాన్ని చూపించడం గమనార్హం. ఏదో ఒక పార్టీ అండ లేకుండా ఏనాడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోని ఘనుడు చంద్రబాబు నాయుడన్న సంగతి తెలిసిందే. గతంలో వామపక్షాలు, టీఆర్ఎస్లతో జతకట్టిన టీడీపీ.. గడిచిన నాలుగేళ్లూ బీజేపీతో సంసారం చేయడం, ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేక.. ఆ నెపాన్ని తోసేయడానికి వీలుగా బీజేపీకి చంద్రబాబు విడాకులు ఇవ్వడం రాష్ట్రప్రజలు గమనించిందే. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదనుకున్న బాబు.. చివరికి తన తల్లి కాంగ్రెస్ ఒడికిచేరడం ప్రస్తుత దృశ్యం. తన 40 ఏళ్ల చరిత్రలో నిత్యం రాజకీయ వ్యభిచారం చేస్తూ పక్కవారిపై బురదచల్లడమే అలవాటుగా పెట్టుకున్నారు చంద్రబాబు. -
కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు
బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్ షాకి ఎలా వినపడి ఉంటుంది? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్ పవార్ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్ఎల్డీ నేత అజిత్‌సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు.. భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్, తెలియని కారణంతో నవీన్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. -
బద్ధశత్రువులు కరచాలనం చేశారు
-
కుమారస్వామి ప్రమాణానికి ఆయనెందుకు రాలేదు?
బెంగళూరు/భువనేశ్వర్: నరేంద్ర మోదీ ప్రాభవానికి, ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు నేడు ఓకే వేదికపై చేరాయి. జనతాదళ్(సెక్యూలర్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. ముగ్గురు తప్ప! వారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్. కేసీఆర్, స్టాలిన్లు కుమార ప్రమాణానికి రాలేకపోవడానికి గల కారణాలను ఇదివరకే ప్రకటించారు. బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం యత్నిస్తోన్న కేసీఆర్.. రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్ కుమారస్వామికి వర్తమానం పంపారు. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నవీన్ ఎందుకు రాలేదు?: 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై నవీన్ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. మైనింగ్ కుంభకోణం, శారద స్కామ్ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్ బీజేపీపై గట్టిగా గళం విప్పడంలేదని ఒడిశా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్ పట్నాయక్.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. -
కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న కుమారస్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా కలసి అభినం దనలు తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే మంగళవారం బెంగళూరు వెళ్లి ఆయన్ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆయన ఆహ్వానించడం తెలిసిందే. మంగళవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగ ళూరు వెళ్లారు. సీఎంతోపాటు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు సి.లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, బి.వినోద్ కుమార్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు సీఎం వెంట వెళ్లారు. బెంగళూరుకు వెళ్లగానే కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి చేరు కున్నారు. అక్కడే కుమారస్వామిని కలసి అభినందించారు. దేవెగౌడ, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేశారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. మంత్రులు, ఎంపీలను వారికి పరిచయం చేశారు. అనంతరం గంటకుపైగా ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు సీఎం బృందం తిరుగు పయనమైంది. అందుకే ముందుగా.. బెంగళూరులో బుధవారం జరిగే కుమార స్వా మి ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాం గ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకనే సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగా వెళ్లి వచ్చి నట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ఎత్తుగడ అనుసరించినట్టుగా భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్‌తో కలసి వేదికను పంచుకోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న అంచనా తోనే ఈ మార్గాన్ని అనుసరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి -
కాంగ్రెస్‌కు 22.. జేడీఎస్‌కు 12
బెంగళూరు: మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య అంగీకారం కుదిరింది. కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వరను వరించింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్ జేడీఎస్‌కు దక్కనున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలపరీక్ష ముగించుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్ ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. నేను, పరమేశ్వర బుధవారం ప్రమాణస్వీకారం చేస్తాం. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం కూటమిలోని మంత్రుల పేర్లను వెల్లడిస్తాం. అంతా సజావుగానే ఉంది. ఎలాంటి విభేదాలు లేవు’ అని పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పుపై మంగళవారం సాయంత్రం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తమకే ఎక్కువ పదవులు దక్కాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఆ పార్టీకి 22 మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీఎస్ అంగీకరించింది. జేడీఎస్‌కు సీఎంతో కలిసి 12 మంత్రి పదవులే దక్కనున్నాయి. బలనిరూపణ అనంతరం శాఖల కేటాయింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ పేరు దాదాపు ఖరారైంది. ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బెంగళూరులోని అసెంబ్లీ భవనం విధానసౌధ ముందు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రచారం జరిగినా.. జేడీఎస్ అంగీకరించకపోవడంతో చివరకు ఒకరికే అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి సిల్కు చొక్కా, పట్టు పంచెతో హాజరవుతారు. తొలుత విధానసభ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో వీఐపీలు కూర్చోడానికి వీలుగా మూడు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడం, బల నిరూపణకు ముందే 19వ తేదీన రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో 37 సీట్లున్న జేడీఎస్, 78 సీట్లున్న కాంగ్రెస్ కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఒకే వేదికపై విపక్ష నేతలు, సీఎంలు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు, రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, విజయన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎంఎన్ఎం నేత కమల్ హాసన్ తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు పవన్ కల్యాణ్, అంబరీష్ కూడా హాజరవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మొదట ప్రకటించినా.. తూత్తుకూడిలో అల్లర్ల నేపథ్యంలో తాను రావడం లేదని ట్వీట్ చేశారు. యూపీలో గోరక్‌పూర్, పూల్పూరు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన సమాజ్‌వాదీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్, మాయావతిలు ఒకే వేదికపై కనిపించనున్నారు. శివకుమార్‌ని నేను వ్యతిరేకించలేదు: దేవెగౌడ డీకే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంగా తాను వ్యతిరేకించానంటూ వచ్చిన వార్తల్ని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. వాళ్ల పార్టీ నుంచి ఎవరు డిప్యూటీ సీఎం లేదా మంత్రి అవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీనే నిర్ణయించుకుంటుందని చెప్పారు. మరోవైపు, శివకుమార్ స్పందిస్తూ.. పదవి విషయంలో హైకమాండ్ ఆదేశాల్ని పాటిస్తానని స్పష్టంచేశారు. సంకీర్ణం సవాలే: కుమార స్వామి ఐదేళ్లపాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తనకు పెద్ద సవాలని కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం శృంగేరీ పీఠాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇదో పెద్ద సవాలు. ముఖ్యమంత్రిగా నా బాధ్యతల్ని సులువుగా నిర్వర్తించగలనని నేను భావించడం లేదు. ఈ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? లేదా? అని కర్ణాటక ప్రజలకు కూడా అనుమానం ఉంది. అయితే దేవుని దయ వల్ల అంతా సక్రమంగా జరుగుతుందని నాకు నమ్మకముంది’ అని చెప్పారు. ధర్మస్థలలోని మంజునాథ స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. కింగ్‌మేకర్ కాదు.. కింగే! సాక్షి, బెంగళూరు: కుమారన్న అలియాస్ హెచ్‌డీకే అలియాస్ కుమారస్వామి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, మొన్నటి దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా కింగ్‌మేకర్ అంటూ అందరి దృష్టిలో పడిన జేడీఎస్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీ వెతుక్కుంటూ వచ్చింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు మూడో సంతానంగా 1959 డిసెంబర్ 16న హాసన్ జిల్లా హరదనహళ్లిలో కుమారస్వామి జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హాసన్ జిల్లాలోనే సాగింది. అనంతరం బెంగళూరులోని నేషనల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 1986 మార్చి 13న అనితతో వివాహమైంది. ఏడాదిలో కొడుకు నిఖిల్‌గౌడ జన్మించారు. అనంతరం 2006లో సినీ నటి రాధికతో కుమారస్వామికి రెండో వివాహమైంది. వారికి షమిక అనే కుమార్తె ఉంది. కుమారకు రేవణ్ణ, బాలకృష్ణగౌడ అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. అయితే, చిన్నవాడైన కుమారపై దేవెగౌడకు గురి ఎక్కువ. కారణం.. కుమారస్వామి పట్టుదల, రాజకీయ వ్యూహాలు. కుమారస్వామి ‘చెన్నాంబిక’ బ్యానర్‌పై పలు కన్నడ హిట్ సినిమాలు నిర్మించారు. రామనగర జిల్లా కనకపుర స్థానం నుంచి 1996లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కుమారస్వామి కనకపుర నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నుంచి, 2004లో రామనగర నుంచి గెలుపొంచారు. 2006లో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
కుమారస్వామితో కేసీఆర్ భేటీ
సాక్షి, బెంగళూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం బెంగళూరులో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత కుమారస్వామితో భేటీ అయ్యారు. రేపు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. బెంగళూరులో కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్‌కు దేవేగౌడ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేపథ్యంలో కేసీఆర్ ముందుగానే ఆయనను కలిసి అభినందించారు. రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా బెంగళూరు నుంచి కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. -
సాయంత్రం బెంగళూరుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత కుమారస్వామితో భేటీ కానున్నారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేపథ్యంలో కేసీఆర్ ముందుగానే ఆయనను కలిసి అభినందించనున్నారు. బుధవారం పలు అత్యవసర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే బెంగళూరుకు వెళ్లడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామిని అభినందించిన వెంటనే కేసీఆర్ మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. -
ఇళ్ల ముఖం చూడని జేడీఎస్ ఎమ్మెల్యేలు..
బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. మొబైల్స్, ఇంటర్నెట్పై నిఘా. ఇంద్ర నగరిని తలపించే రిసార్టులో జీవితం. ముఖ్యమంత్రి పదవిని అందుకోబోతున్న జేడీఎల్పీ నేత కుమారస్వామి తన ఎమ్మెల్యేలను నగర సమీపంలోని ప్రిస్టేజ్ రిసార్టుకు తరలించారు. బలపరీక్ష వరకు వారిని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. దొడ్డబళ్లాపురం: ఆపరేషన్ కమల కంగారుతో జేడీఎస్ తన ఎమ్మెల్యేలను పిల్లల కోడిలా కాపాడుకుంటోంది. పలు రిసార్టులకు మకాం మారుస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని నిద్రపోనివ్వమని బహిరంగంగా సవాళ్లు విసురుతుండడంతో బీజేపీ ఏ వైపు నుండి ఆకర్షిస్తుందోనని భయపడ్డ జేడీఎస్ హైకమాండ్ ఆదివారం రాత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను దేవనహళ్లి– నందికొండ మార్గంలోని ప్రిస్టేజ్ గోల్ఫ్ షైర్ రిసార్టుకు తరలించింది. రిసార్టు లోపల, బయట పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు ఎడబాటు లేకుండా కుటుంబ సభ్యులను కూడా రిసార్టులో ఉండడానికి అవకాశం కల్పించడం విశేషం. రిసార్టులో పనిచేసే సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు వదులుతున్నారు. అతిథులుగా వచ్చిన విదేశీయులు, ఇతర అతిథులు ఈ తనిఖీలతో ఇబ్బందులు పడ్డారు. కొందరిని లోపలకు వదలగా మరికొందరిని వెనక్కు పంపించారు. రిసార్టులోకివెళ్లే ఫోన్లపై నిఘా పెట్టారు. రిసార్టులో 32 మంది పార్టీ నాయకుల సమాచారం ప్రకారం 32 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు రిసార్టులో బసచేయగా, లోకల్ జేడీఎస్ ఎమ్మెల్యే (దేవనహళ్లి) నిసర్గ నారాయణస్వామి పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా సోమవారం రిసార్టు నుండి ముగ్గురు,నలుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరూ బయటకు రాలేదు. మొదట చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవేగౌడ పని మీద బెంగళూరుకు వెళ్లారు. తరువాత సింధనూరు ఎమ్మెల్యే నాడగౌడ బయటకు వెళ్లారు. శిర తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 7 మంది మరణించడంతో ఆ ఎమ్మెల్యే సత్యనారాయణ హైకమాండ్ అనుమతితో కారు తెప్పించుకుని అక్కడికి వెళ్లారు. తరువాత మాజీ మంత్రి ప్రస్తుత జేడీఎస్ ఎమ్మెల్యే బండెప్ప కాశంపూర్ కాసేపు బయటకు వచ్చి మీడియాతో ముచ్చటించారు. లోపల ఎమ్మెల్యేలు ఎలాంటి ఇబ్బందులూ పడడం లేదన్నారు. అయితే అధికంగా ప్రయాణించడం వల్ల అలసిపోయామని, ఇక ఇదే రిసార్టులో 5 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటామన్నారు. మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారా?అని ప్రశ్నించగా కుమారస్వామి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు మంత్రి పదవి ఇమ్మని అయితే అడగలేదని, కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమందరి లక్ష్యమని చెప్పారు. అంతా రిలాక్స్ మూడ్ మధ్యాహ్నం సమయానికి కొళ్లేగాల నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మహేశ్ కూడా పని నిమిత్తం బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలందరూ రిలాక్స్ మూడ్‌లో ఉన్నామన్నారు. తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని చెప్పారు. బుధవారం కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి బీఎస్పీ అధినాయకురాలు మాయావతి వస్తారని తెలిపారు. కుమారస్వామి ఎమ్మెల్యేలను కలవడానికి ఉదయమే రిసార్టుకు వస్తారని చెప్పినప్పటికీ, హాసన్‌లో పలు దేవాలయాల దర్శనం,ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉండడంతో ఆయన రాలేకపోయారు. మంత్రి పదవులపై కాంగ్రెస్ చర్చ సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణంలో పదవుల పందేరంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఓ హోటల్లో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపారు. పలువురు జేడీఎస్ నాయకులు కూడా హాజరయ్యారు. మంత్రివర్గంలో సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. రెండు పార్టీలకూ ఆమోదయోగ్యులనే కేబినెట్లో తీసుకుంటారు. గత సిద్ధు ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఈసారి చాన్స్ ఇవ్వాలా, వద్దా అనేది కీలక ప్రశ్నగా మారింది. సీనియర్ నాయకులు మంత్రి పదవుల కోసం త్యాగం చేయాల్సిందేనని మాజీ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. తనకు పదవి కావాలని అడగలేదని, పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. -
‘డిప్యూటీ’పై సిగపట్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. -
ఐదేళ్లు నడుపుతా.. మద్దతివ్వండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్, జేడీఎస్ కలసి సుహృద్భావపూర్వకంగానే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు జేడీఎస్ నేత కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్వామి.. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. తుగ్లక్ లేన్‌లోని రాహుల్ నివాసంలో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, మంత్రిత్వ శాఖల పంపకం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. కర్ణాటకలో సుస్థిరమైన పాలన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కీలకాంశాల్లో రాహుల్ మద్దతు, సలహాలు, సూచనలు కావాలని కుమారస్వామి కోరగా.. రాహుల్ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పారని సమాచారం. భేటీ అనంతరం కుమార స్వామి మాట్లాడుతూ.. ‘మేం ఇకపై కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. అందుకే వారి (సోనియా, రాహుల్) సూచనలు తీసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మంత్రివర్గ శాఖల పంపకంలో ఎలాంటి బేరసారాల్లేవు. మేం సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చించుకుని నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ రావాలని ఆయన ఆహ్వానించారు. బెంగళూరులోనే నిర్ణయం డిప్యూటీ సీఎం ఎంపికపై స్పందిస్తూ.. ‘దీనికి సంబంధించిన విధివిధానాలను రాహుల్ చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్‌కు దీనిపై చర్చించేందుకు పూర్తి అనుమతులిచ్చారు. కర్ణాటక సీనియర్ నేతలతో మంగళవారం బెంగళూరులో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని కుమారస్వామి వెల్లడించారు. జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కర్ణాటకకు సుస్థిరమైన పాలన అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా నడిచేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీలో ఇరుపార్టీల్లోని చెరో ముగ్గురు సీనియర్ నేతలుండాలని నిర్ణయించారు. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నందున స్పీకర్ పోస్టును తమకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించగా.. కుమారస్వామి అంగీకరించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ తరపున ఎవరు ఉపముఖ్యమంత్రిగా ఉండాలనే అంశంపై మంగళవారం జేడీఎస్‌తో చర్చల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుండగా.. కుమారస్వామి తిరస్కరించినట్లు తెలుస్తోంది. పరస్పర ప్రయోజనాలపై చర్చ ఈ భేటీ జరిగిన కాసేపటికే.. స్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘కుమారస్వామిని కలవటం ఆనందంగా ఉంది. కర్ణాటకలో ఇరువురి పరస్పర ప్రయోజనాల అంశాలను, రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నాం. బెంగళూరులో ఆయన ప్రమాణస్వీకారానికి నేను వెళ్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్‌లను కలవకముందే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని స్వామి కలిశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించాలన్న అంశంపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది. రేపు సాయంత్రం 4.30కు కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విధానసౌధలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటుగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ సహా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానుండగా.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్. బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కూడా ప్రమాణస్వీకారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. 12 ఏళ్లలో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది రెండోసారి. కాగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేబినెట్లో స్థానం దక్కని పక్షంలో తిరుగుబాటు రావొచ్చన్న ఆందోళనతో.. కుమారస్వామితోపాటు కొందరితోనే మంత్రులుగా ప్రమాణం చేయించాలని సోనియా, రాహుల్ సూచించినట్లు సమాచారం. విశ్వాస పరీక్ష తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో రాహుల్, సోనియాలతో కుమారస్వామి. చిత్రంలో డానిష్ అలీ, కేసీ వేణుగోపాల్ -
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో బుధవారం జరగనున్న ప్రమాణస్వీకారానికి వెళ్లడంపై తొలుత కొంత సందిగ్ధం నెలకొన్నా.. వెళ్లడమే మంచిదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం అవసరమని గత కొంతకాలంగా కేసీఆర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే కర్ణాటక వెళ్లిన ఆయన.. జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల కూటమితోనే దేశంలో గుణాత్మకమార్పు సాధ్యమని, జేడీఎస్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ కీలకంగా ఉంటుందని, ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి బెంగళూరు వస్తానని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఉన్న కుమారస్వామి ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండటం మంచిది కాదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న ఈ సమయంలో.. కాంగ్రెస్ మద్దతుతో సీఎం అవుతున్న కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లడం అవసరమా అని కేసీఆర్ తొలుత ఆలోచించారు. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని సంకోచించారు. అయితే కాంగ్రెస్, బీజేపీలో ఎవరు మద్దతిచ్చి నా ఫ్రంట్ మద్దతుదారు అయిన జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతున్నదని పార్టీ నేతలు వాదిస్తున్నారు. ముందుగా ప్రమాణస్వీకారానికి పార్టీ ప్రతినిధిగా మంత్రి కేటీఆర్‌ను పంపించాలని అనుకున్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలరీత్యా తాను వెళ్లడమే మంచిదనే యోచనకు కేసీఆర్ వచ్చినట్టుగా పార్టీ ముఖ్యులు వెల్లడిస్తున్నారు. బుధవారం ఉదయమే ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి.. అక్కడ్నుంచి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని చెబుతున్నారు. -
రాహుల్ గాంధీతో భేటీ అయిన కుమారస్వామి
-
రాహుల్, సోనియాలతో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఈనెల 23న జరిగే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కుమారస్వామి వారిని ఆహ్వానించారు. కర్ణాటక సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతున్న క్రమంలో కుమారస్వామి కూటమి భాగస్వామ్య పార్టీ నేతలతో పలు అంశాలు ప్రస్తావించారు. కేబినెట్ కూర్పు, శాఖల కేటాయింపుపైనా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తొలుత బీఎస్పీ అధినేత్రి మాయావతి నివాసానికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఫోన్ చేసి బెంగళూర్‌లో జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు హాజరవుతారని కుమారస్వామి చెప్పారు.