
యశవంతపుర(కర్ణాటక): సీఎం యడియూరప్ప ఇద్దరు కొడుకులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఆరు పెద్ద పెద్ద బ్యాగులను తీసుకెళ్లారు, ఆ బ్యాగుల్లో ఏముందో నాకు తెలియదు అని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.
ప్రధానిని కలవడానికి వెళ్లిన యడియూరప్ప ఆరుబ్యాగులను ఎందుకు తీసుకెళ్లారు?. త్వరలో అన్ని విషయాలూ బయటపడతాయి అని చెప్పారు. ప్రధానిని కలిసిన యడియూరప్పకు ఎంత గౌరవ మర్యాదలు లభించాయో చూడాలన్నారు. అక్రమ గనులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు నా మద్దతు ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment