టార్గెట్‌ యడ్యూరప్ప..? మహిళా కమిషన్‌ కీలక ఆదేశాలు | Probe Into Death Of Woman Who Accused Yediyurappa Of Assault | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ యడ్యూరప్ప..? కర్నాటక మహిళా కమిషన్‌ కీలక ఆదేశాలు

Published Mon, Sep 2 2024 12:46 PM | Last Updated on Mon, Sep 2 2024 1:16 PM

Probe Into Death Of Woman Who Accused Yediyurappa Of Assault

బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధించాడని  ఆరోపణలు చేసిన మహిళ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది.  సదరు మహిళ మృతి చెందడం, ఆమె మృతదేహాన్ని హడావిడిగా పూడ్చిపెట్టిన తీరు అనుమానాస్పదంగా ఉందని కర్నాటక మహిళా కమిషన్‌ పేర్కొంది. ఈ  కేసులో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బెంగళూరు పోలీసులను కమిషన్‌ ఆదేశించింది.

ఈ మేరకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి చౌదరి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మహిళ మృతి కేసును వేగంగా దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. తన 17 ఏళ్ల కూతురితో కలిసి బెంగళూరులోని యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతురిని లైంగికంగా వేధించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ కేసు పెట్టింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మే నెలలో ఆ మహిళ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనే ఆ మహిళ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement