లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక రెండో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారనేది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 'యడియూరప్ప' వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను మార్చి 6న (బుధవారం) ఖరారు చేసే అవకాశం ఉందని, బీఎస్ యడియూరప్ప ఈ రోజు (మార్చి 4) పేర్కొన్నారు. తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇందులో కర్ణాటక అభ్యర్థులను చేర్చలేదు.
రెండో జాబితాలో కర్ణాటక అభ్యర్థులను వెల్లడిస్తారని, ఢిల్లీలో జరిగే సమావేశానికి తాను (యడియూరప్ప) ఢిల్లీలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. జాబితాపై జాతీయ నేతలు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. గతంలో కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అన్ని సీట్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment