BS Yediyurappa
-
టార్గెట్ యడ్యూరప్ప..? మహిళా కమిషన్ కీలక ఆదేశాలు
బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన మహిళ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు మహిళ మృతి చెందడం, ఆమె మృతదేహాన్ని హడావిడిగా పూడ్చిపెట్టిన తీరు అనుమానాస్పదంగా ఉందని కర్నాటక మహిళా కమిషన్ పేర్కొంది. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని బెంగళూరు పోలీసులను కమిషన్ ఆదేశించింది.ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మహిళ మృతి కేసును వేగంగా దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. తన 17 ఏళ్ల కూతురితో కలిసి బెంగళూరులోని యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతురిని లైంగికంగా వేధించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ కేసు పెట్టింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే మే నెలలో ఆ మహిళ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనే ఆ మహిళ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. -
లైంగిక వేధింపుల కేసు : యడ్యూరప్పకు ఎదురు దెబ్బ!
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్‌ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసుఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్‌లో పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసుకేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.ఆయన మాజీ సీఎం తొందరపడొద్దుజూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.ఎక్కడ విచారించాలోఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బీజేపీలో కేఆర్పీపీ విలీనం.. గాలి జనార్ధన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీ విలీనం చేశారుఉ. ఈ క్రమంలో జనార్థన్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని సోమవారం బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో కలిపారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. కేఆర్పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. #WATCH | Bengaluru: Kalyana Rajya Pragathi Paksha leader G Janardhana Reddy merges his party with BJP and his wife and politician Aruna Lakshmi also joins the party, in the presence of party leader BS Yediyurappa and state BJP President BY Vijayendra. pic.twitter.com/9ZYQmLMeLJ — ANI (@ANI) March 25, 2024 అనంతరం, మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో చేరారు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జనార్దన్ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక, గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ కొత్త వ్యూహం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో కంగుతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు సరికాదనే భావనకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీతో బీజేపీ సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని కల్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ)ను కమలదళం విలీనం చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓట్లను ఏకీకృతం చేయొచ్చని బీజేపీ భావిస్తోంది -
మాజీ సీఎంపై కేసు.. ఆశ్చర్యం కలిగించిందన్న ప్రముఖ సింగర్!
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అరెస్ట్‌పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor. I am stunned. pic.twitter.com/vjY4ynwurR — Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024 -
Bengaluru: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. మాజీ సీఎం రియాక్షన్ ఇదే..
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైంది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇంటికి వస్తే సాయం చేశాను.. పోలీసులు కేసు పెట్టారు.. తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇదీ చదవండి.. అవినీతి నిర్మూళనే మా సిద్ధాంతం.. మోదీ -
బీజేపీ రెండో జాబితా ప్రకటించేది అప్పుడే.. బీఎస్ యడియూరప్ప
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక రెండో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారనేది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 'యడియూరప్ప' వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను మార్చి 6న (బుధవారం) ఖరారు చేసే అవకాశం ఉందని, బీఎస్ యడియూరప్ప ఈ రోజు (మార్చి 4) పేర్కొన్నారు. తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇందులో కర్ణాటక అభ్యర్థులను చేర్చలేదు. రెండో జాబితాలో కర్ణాటక అభ్యర్థులను వెల్లడిస్తారని, ఢిల్లీలో జరిగే సమావేశానికి తాను (యడియూరప్ప) ఢిల్లీలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. జాబితాపై జాతీయ నేతలు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. గతంలో కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అన్ని సీట్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు
సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా విజయేంద్ర యడియూరప్పను నియమించింది అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడే ఈ విజయేంద్ర. నళిన్ కటీల్‌ను తప్పించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రకు కర్ణాటక పగ్గాలు అప్పజెప్పింది కమల అధిష్టానం. విజయేంద్ర ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. షికారిపుర నుంచి 11 వేల మెజార్టీతో నెగ్గారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి యడియూరప్ప పోటీ చేసి గెలుపొందారు. న్యాయ విద్యను అభ్యసించిన విజయేంద్ర.. పార్టీ యువ విభాగం భారతీయ జనతా యువ మోర్చా కర్ణాటక యూనిట్‌కు జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై 2020 నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. యడియూరప్ప పెద్ద కొడుకు రాఘవేంద్ర కూడా రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. షిమోగా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారాయన. -
కర్ణాటక అసెంబ్లీలో రగడ
బెంగళూరు: బీజేపీ ఆందోళనలతో మంగళవారం కర్ణాటక విధానసభ వర్షాకాల సమావేశాలు హీటెక్కాయి. ఐదు ఎన్నికల హామీల అమలును అధికార కాంగ్రెస్ పూర్తిగా పక్కనపెట్టేసిందని విమర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్వెల్లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో గందరగోళం ఏర్పడి సభ కార్యకలాపాలకు అవాంతరం ఏర్పడింది. బీజేపీ సీనియర్, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విధాన సౌధలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో చేస్తామని చెప్పి.. ఏం చేయకుండా ఉండిపోయిందని మండిపడ్డారాయన. నెల దాటినా ఎన్నికల హామీల అమలులో జాప్యం దేనికని సూటిగా ప్రశ్నించారు. తామేమీ కొత్తగా ఏదైనా చేయాలని అడగడం లేదని.. కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారాయన. వారం వేచిచూస్తామని.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ తరుణంలో సీఎం సిద్ధరామయ్య జోక్యంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘మోసం.. మోసం.. కాంగ్రెస్ మోసం’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ మాత్రం వాళ్ల నిరసనను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీజేపీ నిరసనలపై కర్ణాటక మంత్రి పరమేశ్వర స్పందించారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మూడు అమలు చేస్తున్న విషయం గుర్తించాలని బీజేపీకి ఆయన హితవు పలికారు. ఐదు హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నామని, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే క్రమంలో ఆలస్యం కావడం సహజమని వ్యాఖ్యానించారాయన. #WATCH | Bengaluru | Heated scenes at the Karnataka Assembly as BJP MLAs storm the well of the House on the issues of the implementation of the five guarantees of the Congress Government in the State. (Source: Vidhana Soudha) pic.twitter.com/CrYgd5i33j — ANI (@ANI) July 4, 2023 ఇదీ చదవండి: ఆ డిప్యూటీ సీఎం అవినీతిపరుడు.. తొలగించండి -
బీజేపీ ఓటమిపై ఎడ్యూరప్ప ఫస్ట్ రియాక్షన్
-
కర్ణాటకలో ఖతర్నాక్ ఫైట్.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్డీ కుమారస్వామి జేడీఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామన్న నమ్మకం నాకుంది. అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష -
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్‌ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్‌గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
కర్నాటక: అభ్యర్థుల ఎంపికలో కొత్త ప్రయోగం.. సీటీ రవి స్పందన ఇదే..
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో కర్నాటకలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. కాగా, 224 అసెంబ్లీ స్థానాలకు గాను 189 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన చేశారు. తాను చిక్‌మంగుళూరు నుంచి బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ బలంగా ఉందన్నారు. ఏప్రిల్ 20వ తేదీన రెండో లిస్టులో మిగత అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిపారు. బీజేపీ ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంటుదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే 52 మంది కొత్త అభ్యర్థులకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక, బీజేపీ అభ్యర్థులపై అరుణ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించాము. వారిలో 8 మంది మహిళలు, 9 మంది డాక్టర్లు, ఐదుగురు లాయర్లు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. కాగా, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజేంద్రన్కు కూడా టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు.. చామరాజ్‌పేట్ నుంచి పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర మంత్రులైన శశికళ జోలాయి, ఆర్ అశోక్, ప్రభో చౌహాన్, శంకర్ మునియాకప్ప, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, వీసీ పాటిల్, వరిటీ వాసురాజ్, ముర్గేష్ నిరాణి, సీసీ పాటిల్, సునీల్ కుమార్, శివరామ్ హెబ్బార్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వసర్ హెగ్డేకు కూడా టికెట్ దక్కింది. ఇక, మొదటి లిస్ట్ అభ్యర్థుల్లో లింగాయత్-51, వొక్కలింగ-41, కుర్బా-7, ఎస్సీ-30, ఎస్టీ-16, ఓబీసీ సామాజికవర్గం నుంచి 32 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ నిరాకరించడంతో బెలగావి నార్త్‌లోని సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బెనకే మద్దతుదారులు మంగళవారం సాయంత్రం నిరసనలకు దిగారు. అలాగే, ఎమ్మెల్యే మహదేవప్ప యాదవ్‌కు టిక్కెట్ నిరాకరించడంపై బెళగావిలోని రామ్‌దుర్గ్ నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన చిక్క రేవణ్ణకు టికెట్ దక్కింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతున్నట్టు సమాచారం. -
యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. శివమొగ్గ జిల్లా షికారిపురలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటివరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్.. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలు తీసుకొచ్చింది. ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. చదవండి: సావర్కర్ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలుసా!కేంద్రమంత్రి ఫైర్ -
బీజేపీ ఎమ్మెల్యేలకు శుభవార్త.. యడియూరప్ప కీలక ప్రకటన!
బెంగళూరు: రాబోయే ఎన్నికల కోసం కర్నాటకలో అధికార బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి అధికారం కోసం బీజేపీ మరో ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మళ్లీ టికెట్లు దక్కుతాయని యడియూరప్ప సూచనప్రాయంగా చెప్పారు. ఎవరో నలుగురైదుగురు తప్ప, అందరికీ మరోసారి పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గుజరాత్ అసెంబ్లీకి గత ఏడాది ఎన్నికల్లో అధికార బీజేపీ సుమారు 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. ఇక్కడా అదే విధానం పునరావృతం అవుతుందేమోనని సొంతపార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు సీఎం బొమ్మై సారథ్యంలోనే జరుగుతాయన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే శాసనసభా పక్ష సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేననే సంకేతాలిచ్చారు. -
మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో
బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. బీఎస్ యడియూరప్ప సోమవారం హెలికాప్టర్లో కలుబుర్గికి బయలుదేరారు. ఈ క్రమంలో జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో, పైలట్‌కు హెలికాప్టర్ ల్యాండింగ్ ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొద్దిసేపు ల్యాండింగ్‌ను నిలిపి వేసి ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హెలిప్యాడ్ అంతా క్లియర్ చేయడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr — ANI (@ANI) March 6, 2023 -
గెలవలేమని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు!
గెలవలేమని గట్టిగా నమ్ముతున్నట్లున్నారు! -
యడియూరప్పకు షాక్.. కేసు నమోదు
బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. 2019లో పనిచేసిన బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్(బీడీఏ)పైనా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదైంది. బీడీఏ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు వీరంతా లంచాలు తీసుకున్నారంటూ సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం చేసిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింది కోర్టు అబ్రహాం వేసిన పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. హైకోర్టు మాత్రం స్వీకరించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు యడ్డీ, ఆయన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని యడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఆప్‌లో చేరిక కన్నడ సినీ నటి -
BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం!
బెంగళూరు: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి తన కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. శుక్రవారం ఆయన శికారిపురలో కుమారుడు విజయేంద్రతో కలిసి హుచ్చరాయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని అంజనాపుర జలాశయాన్ని సందర్శించి వాయనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శికారిపుర ప్రజలు తనను అనేక పర్యాయాలు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆశీర్వదించి లక్షకుపైగా మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కలే మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవి కోసం కలలు కంటున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, వారిద్దరూ సీఎంలు కాలేరని యడియూరప్ప అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ విజయాన్ని కాంగ్రెస్, ఇతర ఏ పార్టీ కూడా అడ్డుకోలేదన్నారు. విజయేంద్ర మాట్లాడుతూ యడియూరప్ప కేవలం ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయరని, రాజకీయాలకు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశారు. -
కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు?.. జోరుగా ప్రచారం..
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు, కాంట్రాక్టర్ ఆత్మహత్య వంటి వివాదాలు తెరపైకి రావడంతో సీఎం బొమ్మై సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమని భావించిన బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు(సోమవారం) బెంగుళూరులో పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులతో చర్చించి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. దీనికితోడు బీజేపీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి బీ.ఎల్.సంతోష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానికి ఉందంటూ గుజరాత్లో చేసినట్లే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా.. కొంతకాలానికే ఆయను తొలగించి బసవరాజ్ బొమ్మైని సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలలు అవుతోంది. త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను త్వరలో విస్తరించాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా బెంగళూరు వస్తుండటంతో, పార్టీ నాయకత్వ మార్పు గురించి చర్చిస్తారనే ప్రచారం ఊపందుకుంది. చదవండి: మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే స్పందించిన యడియూరప్ప కర్ణాటకలో సీఎం మార్పు అంటూ వస్తున్న పుకార్తపై మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప స్పందించారు. తనకు తెలిసినంత వరకు రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరిగే అవకాశం లేదని అన్నారు. సీఎం బొమ్మై అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ యడియూరప్ప కితాబు ఇచ్చారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో 150 అసెంబ్లీ సీట్లు సాధించే దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వ్యూహాలపై సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. -
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య!
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి చెందింది ఈ రోజు (జనవరి 28 శుక్రవారం) ఉదయం 10 గంటలకి బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు రిజస్టర్ చేసుకున్నారు. కాగా, ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె వయసు 30 సంవత్సరాలు. యాడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్ నీరజ్‌తో ఆమెకు వివాహం జరగ్గా, నాలుగు నెలల పాప కూడా ఉంది. వృతిరిత్యా సౌందర్య డాక్టర్.. ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె పనిచేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్‌ఫామ్ హౌజ్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
"బెస్ట్ ఎమ్మెల్యే" అవార్డు అందుకున్న మాజీ సీఎం..
Yediyurappa Presented Best Legislator Award: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిన బీఎస్ యడియూరప్ప 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని.. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, న్యాయశాఖ మంత్రి మధుస్వామిలతో కూడిన కమిటీ ఈ అవార్డుకి యడియూరప్పని ఎంపిక చేసింది. అసెంబ్లీ సభ్యుడిగా ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను యడియూరప్పకి ఈ అవార్డు దక్కిందని కమిటీ పేర్కొంది. పార్లమెంట్లో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల తరహాలో ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు(మంత్రులకు కాదు) బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. ఇవాళ(సెప్టెంబర్ 24) ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. యడియూరప్పకి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమానికి సీఎం బసవరాజ్ బొమ్మై, శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే, శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి తదితరులు హాజరయ్యారు. కాగా, యడియూరప్ప 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసన మండలి, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పని చేసిన ఆయన.. నాలుగు సార్లు సీఎం అయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జులై 26న సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చదవండి: భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త! -
బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పదవి నుంచి అకారణంగా పంపించి వేసిన వైనంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి. పదవి నుంచి దిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే శివమొగ్గలో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రకు సహకరించనున్నట్లు సమాచారం. త్వరలోనే కుమారుడితో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) అయితే సోమవారం పార్టీ కర్ణాటక ఇన్చార్జి అరుణ్‌సింగ్ మూడు రోజుల పర్యటనకు మైసూర్ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే యడియూరప్ప తన బలం చూపించాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా తన అనుచరులకు ఈ మేరకు ఆదేశాలు పంపారంట. త్వరలోనే తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. తనకు తన వర్గానికి అప్రాధాన్యం ఇవ్వడంపై యడియూరప్ప వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. త్వరలోనే యడియూరప్ప వర్గం పార్టీలోనే ఉంటూనే తమ బలం నిరూపించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
కర్ణాటక: తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ ఎస్.బొమ్మైకి అసంతృప్త మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులతో తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త కేబినెట్, శాఖల కేటాయింపులపై అసమ్మతి గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం సీఎం బొమ్మై, తాజా మాజీ సీఎం యడియూరప్పతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరగంటపాటు యడియూరప్ప నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అసమ్మతి అంశంతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు బొమ్మై సన్నిహిత వర్గాలు తెలిపాయి. పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్, మునిసిపల్ పరిపాలన, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రి ఎన్.నాగరాజ్ తమకు కేటాయించిన శాఖలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపనులు, రవాణా శాఖల వంటివి తనకు అప్పగించాలని నాగరాజ్ డిమాండ్ చేస్తుండగా అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ అలిగిన ఆనంద్ సింగ్ బళ్లారి జిల్లా హోస్పేటలోని తన కార్యాలయాన్ని మూసివేశారు. మాజీ సీఎం యడియూరప్పతో, అనంతరం సీఎం బొమ్మైతో సమావేశమై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. అనంతరం సీఎం, రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ కలిసి ఆనంద్ సింగ్‌ను బుజ్జగించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ..తనకు సింగ్‌తో ఎలాంటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ప్రాధాన్యం కలిగిన శాఖను ఆనంద్ సింగ్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ఏ రామదాస్, ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర కూడా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారు సీఎం బొమ్మైతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి సీల్డ్ కవర్లో ఒక లేఖను అందజేసినట్లు అనంతరం రామదాస్ మీడియాకు తెలిపారు. ‘తీరిక సమయంలో ఆ లేఖను చదవాలని సీఎం బొమ్మైను కోరాను. రాష్ట్రం, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను అందులో వివరించాను’ అని ఆయన వెల్లడించారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ యోగీశ్వర మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రితో రెండుసార్లు సమావేశ మయ్యాను. అయితే, వీటికి కారణాలంటూ ఏమీ లేవు. నాకెలాంటి అసంతృప్తి లేదు. నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా’ అని తెలిపారు. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా రెండు రోజుల అనంతరం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
అలిగిన వారిని బుజ్జగిస్తానన్న సీఎం; కేబినెట్ హోదా వద్దన్న యడ్డీ
సాక్షి, బెంగళూరు: మంత్రి మండలి ఏర్పాటు, శాఖల పంపిణీ తరువాత అధికార బీజేపీలో భిన్నస్వరాలు పెరగడంతో సీఎం బసవరాజ బొమ్మై ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో చర్చించడానికి ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కావేరిబంగ్లాలో మాజీ సీఎం యడియూరప్పను కలిశారు. అర్ధగంటకు పైగా రహస్యంగా చర్చలు జరపడం కుతూహలానికి దారితీసింది. మంత్రులు ఆనంద్ సింగ్, ఎంటీబీ నాగరాజ్, వి.సోమణ్ణ. శశికకళా జొల్లె తదితరులు తమ శాఖలపై అలకలతో ఉన్నారు. పదవులు రాని పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇలా జరుగుతుందని ఊహించని బొమ్మై యడ్డిని కలిసి పరిష్కారానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అలిగినవారిని బుజ్జగిస్తా: సీఎం శాఖల పంపిణీలో అసంతృప్తికి గురైన మంత్రులతో మాట్లాడి సర్దుబాటు చేస్తానని సీఎం బొమ్మై తెలిపారు. విధానసౌధ ముందు పునఃప్రతిష్టించిన నెహ్రూ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సీఎం ఎస్.నిజలింగప్ప వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తరువాత మాట్లాడుతూ కోరిన శాఖ లభించలేదని మంత్రి ఆనందసింగ్ తనను కలిసి మాట్లాడారన్నారు. రాబోయే రోజుల్లో ఆయన వినతికి గౌరవమిచ్చేలా చూస్తానని, అలాగే మంచి శాఖ లభించలేదని అసంతృప్తితో ఉన్న ఎంటీబీ నాగరాజ్‌ను కూడా పిలిపించి మాట్లాడుతానని తెలిపారు. కేబినెట్ హోదా వద్దన్న యడ్డి మాజీ సీఎం యడియూరప్ప తనకు కేబినెట్ హోదా వద్దని, దానిని రద్దు చేయాలని సీఎంకి లేఖ రాశారు. మంత్రులకు శాఖల కేటాయింపు సందర్భంగా యడ్డికి కేబినెట్ హోదాను ప్రకటించడం తెలిసిందే. దీనిపై యడ్డి ఆదివారం సీఎంకు లేఖ రాస్తూ మాజీ సీఎంగా నాకు వచ్చే వసతులను మాత్రమే ఇవ్వండి. కేబినెట్ హోదా అవసరం లేదు అని కోరారు. చదవండి: కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర -
కొలువుదీరిన బొమ్మై కొత్త టీం.. యడ్డీ కుమారుడికి నిరాశ
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి.. చివరకు ఆయనకు మొండి చేయి ఎదురయ్యింది. కొత్త మంత్రలు జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. అలానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు భావించినప్పటికి.. చివరికి ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన 29 మంది వీరే.. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోవింద్ కరజోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్. అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, మురేగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, సీఎస్ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, ఎస్టీ సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజు, డాక్టర్ కె.సుధాకర్, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారయణ గౌడ, బీసీ నగేష్, వి.సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర్ పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బొమ్మై కేబినెట్లో ఎనిమిది మంది లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. -
ఇమేజ్ కాపాడుకునే పనిలో యడియూరప్ప
సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్ప అధికారంలో లేకున్నప్పటికీ తన ఇమేజ్ను, తన ప్రాభవాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును కొనసాగించేందుకు కొత్త ప్లాన్‌ను అమలు చేయనున్నారు. సీఎంగా రాజీనామా చేసినప్పటికీ మంత్రిమండలిలో తన అనుంగు అనుచరులను చేర్చేందుకు శ్రమిస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. 1983 నుంచి 2021 వరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో విరామం ఎరుగకుండా శ్రమించిన యడియూరప్ప దక్షిణాదిన తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టడంలో ముఖ్యభూమిక పోషించారు. 78 ఏళ్ల యడ్డి జూలై 26న సీఎంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులు ఇవ్వకూడదనే నియమాన్ని మోదీ హయాంలో పాటిస్తున్నప్పటికీ... యడియూరప్పకు మాత్రం మినహాయింపునిచ్చి రెండేళ్లు సీఎంగా కొనసాగడానికి అవకాశం ఇవ్వడం ఆయన బలాన్ని, అవసరాన్ని తెలియజేసింది. ఇప్పటికీ యడ్డినే పవర్ఫుల్.. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటికీ యడియూరప్పనే పవర్ సెంటర్‌గా మారారు. పార్టీలో ఇప్పటికీ యడియూరప్ప తన పట్టును కొనసాగిస్తున్నారు. ఇదే పట్టు, బలాన్ని వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల వరకు కొనసాగించాలని తీర్మానించుకున్నారు. గవర్నగిరీ వద్దని, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తాలూకాల యాత్రకు ప్లాన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరుతానని యడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. వారానికో తాలూకాకు వెళ్లిని పార్టీని బలోపేతం చేసి తద్వారా తనకు వయసు పైబడిన, అధికారం ఇవ్వకపోయినా రాజకీయంగా శక్తివంతుడినని హైకమాండ్‌కు తెలిసేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే గవర్నర్ పదవిని సైతం యడియూరప్ప తిరస్కరించినట్లు సమాచారం. తన ఇద్దరు కుమారులు విజయేంద్ర (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), రాఘవేంద్రలను రాజకీయంగా మంచి స్థాయిలో నిలబెట్టాలంటే ప్రజల్లో తిరుగుతూ తిరిగి తన శక్తిని అధిష్టానానికి తెలియజేయాలని భావించినట్లు తెలిసింది. వారి రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేయడం వంటి లక్ష్యాలు ఆయన ముందున్నాయి. -
Karnataka: టార్గెట్ 2023.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు
బెంగళూరు: గత కొద్ది రోజుల నుంచి కర్ణాటక రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు గురించి పలు ఊహాగానాలు వెలువడినప్పటికి మాజీ సీఎం యడియూరప్ప వాటిని ఖండించారు. కానీ దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. యడ్డీ వారసుడిగా ఆయన మంత్రివర్గంలో పని చేసిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఎం బొమ్మై కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బొమ్మై, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాక అతని కేబినెట్లో ఆరు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి.. అందునా యువకులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొమ్మై క్యాబినెట్లో గరిష్టంగా 34 మంది సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 లో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కూడిన జంబో బృందాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ సీనియర్ కార్యనిర్వాహక అధికారి ఒకరు తెలిపారు, ఎస్సీలు, ఎస్టీలు, వోక్కలిగాస్, లింగాయతులు, ఓబీసీ అనే ఐదు ప్రధాన సామాజిక వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2008 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటడానికి బీజేపీ కష్టపడుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు బీజేపీ అధిష్టానం ఐదుగురు డిప్యూటీ సీఎంల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా, పార్టీ కేంద్ర నాయకత్వం మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు లింగాయత్ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచింది. ప్రస్తుతం వారు ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఒక్క దెబ్బకు... రెండు పిట్టలు
చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు. ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్‌తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు. ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్‌ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్‌లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్‌ను కూడా తీర్చింది. వాజ్‌పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు. ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్‌ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం. -
Karnataka Politics: ఇంజనీరు రిపేర్ చేస్తాడా?
రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన యెడ్డీనే స్థానిక బీజేపీ నేతలు ఇబ్బంది పెట్టగా, సౌమ్యుడిగా పేరున్న బొమ్మై వీరితో ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. యెడ్డీ ఆశీస్సులతో పాటు, పార్టీ లో సీనియర్ నేతల మద్దతుందని బొమ్మై చెప్పారు. గతంలో సదానంద గౌడను యెడ్డీ మద్దతుతోనే సీఎం చేశారు. కానీ హైకమాండ్ ఆశించినట్లు గౌడ రాణించలేకపోయారు. సీఎంగా దిగినంత మాత్రాన యెడ్డీ ఊరికే ఉండరు. రాజకీయాల్లో యాక్టివ్గానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారులు సైతం బీజేపీలోనే కొనసాగుతారు. వీరిలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్రను సూపర్ సీఎంగా పిలిచేవారు. తండ్రి సీఎంగా దిగిపోయినా, విజయేంద్ర హవా కొనసాగించే యత్నాలు సాగించవచ్చు. యెడ్డీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్ ఎంతవరకు బొమ్మైకి సహకరిస్తారో తెలీదు. అరవింద్.. యెడ్డీ స్థానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ అధిష్టానం బొమ్మైను ఎంచుకుంది. వీరితో పాటు సీఎం పోస్టు ఆశించిన పలువురు ఆశావహులను బుజ్జగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బొమ్మైపై ఉంది. ఈ మెకానికల్ ఇంజనీరు యెడ్డీ వర్గాన్ని, అసమ్మతి వర్గాన్ని సముదాయించుకుంటూ సొంత పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తారో, లేదో వేచిచూడాల్సిందే! –నేషనల్ డెస్క్, సాక్షి 50%కి పైగా 2 ఏళ్ల లోపే... కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. కన్నడనాట సీఎంల పదవీకాలం వివరాలిలా ఉన్నాయి. పదవీకాలం సీఎంలు 0–1 ఏళ్లు 9 మంది 1–2 7 2–3 6 3–4 3 4–5 3 5+ 3 -
Karnataka Politics: కర్ణాటక కొత్త బాస్ బొమ్మై
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ సోమప్ప బొమ్మై(61)ని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. బీజేపీ హైకమాండ్ ఆదేశంతో సీఎం యడియూరప్ప సోమవారం ఉదయం రాజీనామా చేయడం తెలిసిందే. కొత్త సీఎం ఎంపిక వ్యవహారం పర్యవేక్షణకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డిని హైకమాండ్ నియమించింది. వీరిద్దరూ కలిసి రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి అరుణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటిల్, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఆపద్ధర్మ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో యడ్డీ కేబినెట్లో హోం, న్యాయవ్యవహారాల మంత్రిగా ఉన్న బొమ్మై పేరు ఖరారు చేశారు.అనంతరం మంగళవారం సాయంత్రం బెంగళూరులోని క్యాపిటల్ హోటల్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి లాంఛనంగా బొమ్మైని ఎన్నుకున్నారు. తదనంతరం బొమ్మై, యడియూరప్ప ఆశీస్సులు అందుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సీనియర్‌నేత సీటీ రవి, పలువురు మంత్రులు రేసులో ఉన్నా బొమ్మైకి యడియూరప్ప గట్టి మద్దతు ఇవ్వడం కలసి వచ్చింది. రేసులో పలువురు ఉన్నప్పటికీ ఉత్తర కర్ణాటక, లింగాయత్ వర్గానికే సీఎం పీఠం కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్ భావించింది. సీఎంగా ఎన్నికవగానే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతా: బొమ్మైకరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రాధాన్యమిస్తానని కర్ణాటక కొత్త సీఎంగా ఎన్నికైన బసవరాజ బొమ్మై చెప్పారు. వరదలు, కరోనాతో బాధలు పడ్డ ప్రజలకు ఊరటనిస్తానన్నారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో కరోనా భారీగా విజృంభించింది. ఇదే సమయంలో వరదలు సంభవించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, మాజీ సీఎం యడియూరప్పకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వీరి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. బొమ్మైను సీఎంగా ఎంపిక చేయడంతో ఆయన సొంత నియోజకవర్గం సిగ్గాన్లో సంబరాలు అంబురాన్నంటాయి. -
యడ్డీ మద్దతు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఆయనే!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా మాజీ సీఎం ఎస్.ఆర్.బొమ్మై కుమారుడే బసవరాజ్ బొమ్మై. ఇక దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీని గెలిపించిన నేతగా అరుదైన గుర్తింపు పొందిన బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. యడ్డీ వ్యతిరేక వర్గం ఒత్తిళ్ల నేపథ్యంలో సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న రోజే ఈ మేరకు పదవి నుంచి వైదొలగడం గమనార్హం. ఈ క్రమంలో... సీఎం రేసులో బసవరాజ్ బొమ్మై, అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు రాగా.. బసవరాజ్ బొమ్మైనే అదృష్టం వరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం జరిగే ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. -
యడ్డీ రాజీనామాతో ఆగిన గుండె.. విషాదంలో మాజీ సీఎం
బెంగళూరు: తమ అభిమాన నేత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో అతడు తల్లడిల్లిపోయాడు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారనే వార్త విన్న ఆ యువకుడు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలిసి అపద్ధర్మ ముఖ్యమంత్రి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ ఘటన తనకు షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ఆ కుటుంబంలో అతడి లోటును ఏమిచ్చినా పూడ్చలేమని తెలిపారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటకలో కొన్ని నెలలుగా సాగుతున్న పొలిటికల్ సస్పెన్స్‌కు సోమవారం తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాల కారణంగా.. అసమ్మతి వర్గం వైపు అధిష్టానం మొగ్గు చూపడంతో రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయారు. యడియూరప్ప రాజీనామాతో చామరాజనగర జిల్లాకు చెందిన రవి (35) మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యడియూరప్ప షాక్‌కు గురయ్యినట్లు ట్వీట్ చేశారు. ‘నా రాజీనామాతో మనస్తాపం చెంది రవి ఆత్మహత్యకు పాల్పడడం బాధ కలిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇది జీవితంలో అంగీకరించలేని వాస్తవం. అతడిని కోల్పోవడంతో ఆ కుటుంబం పడుతున్న బాధ అంతాఇంతా కాదు’ అని యడియూరప్ప ట్వీట్ చేశారు. త్వరలోనే మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించే అవకాశం ఉంది. కాగా, రవి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం రాజీనామాతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయనున్నారు. -
కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు
-
దక్షిణాది బీజేపీలో ఏకైక మాస్ లీడర్.. ఆటుపోట్లెన్నో..!
బెంగళూరు: దురదృష్టం అంటే ఇదేనేమో! కర్ణాటకలో ఇప్పటిదాకా ఏ నాయకుడికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఎస్.యడియూరప్ప(78) ఒక్కసారైనా పూర్తికాలం అధికారంలో కొనసాగలేకపోయారు. వరుసగా ఐదేళ్లు అధికారం అనుభవించలేకపోయారు. ఇందుకు ఒక్కటి కాదు.. ఎన్నెన్నో కారణాలున్నాయి. కర్ణాటకలో బీజేపీకి దశాబ్దాలపాటు పెద్ద దిక్కుగా ముద్రపడిన యడియూరప్ప రాజకీయ జీవితం ముగిసిపోయిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. చదువు పూర్తయిన తర్వాత సాధారణ ప్రభుత్వ గుమాస్తాగా జీవితం ఆరంభించి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన యడియూరప్ప ప్రస్థానం ఆసక్తికరమే. రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను తన చతురతతో సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ, మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. వయసు 75 ఏళ్లు దాటడం, 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో యడియూరప్ప తప్పుకోవాల్సి వచ్చింది. 75 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు అప్పగించరాదన్న నిబంధన బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు, నియంతలా వ్యవహరించడం, కుమారుడు, కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మితిమీరి జోక్యం వంటివి యడియూరప్ప నిష్క్రమణకు పైకి చెప్పని కారణాలు. దక్షిణాదిన ఉత్తరాది పార్టీ బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న జోస్యాలను అబద్ధం అని నిరూపించిన నేత యడియూరప్ప. దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు పరిచారు. ఎన్నెన్నో మలుపులు.. యడియూరప్పకు 2004లో ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారింది. 2004లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మంత్రాంగంతో కాంగ్రెస్, జేడీ(ఎస్) పొత్తు పెట్టుకున్నాయి. ధరంసింగ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక్కడే యడియూరప్ప తన చాతుర్యం ప్రదర్శించారు. 2006లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామితో చేతులు కలిపారు. ధరంసింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. మిగిలి ఉన్న మూడేళ్ల పదవీ కాలాన్ని ఇద్దరూ సగం సంగం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఒప్పందం చేసుకున్నారు. దీంతో తొలుత కుమారస్వామి సీఎం అయ్యారు. యడియూరప్ప తొలిసారిగా 2007 నవంబర్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, కేవలం 7 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. పొత్తు ఒప్పందం నుంచి కుమారస్వామి తప్పుకోవడమే ఇందుకు కారణం. 2008 మేలో రాష్ట్రంలో బీజేపీ గెలవడంతో యడియూరప్ప రెండోసారి సీఎం అయ్యారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు రావడంతో 2011 జూలైలో రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసుల్లో యడియూరప్ప అదే ఏడాది అక్టోబర్ 15న లోకాయుక్త కోర్టు ఎదుట లొంగిపోయారు. వారం పాటు జైల్లో ఉండి విడుదలైన తర్వాత బీజేపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి 2013 ఎన్నికల్లో పోటీ చేశారు. కేవలం 6 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. తన పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చి, 2014 జనవరి 9న బీజేపీలో విలీనం చేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28కి గాను 19 ఎంపీ సీట్లు గెలుచుకుంది. దీంతో పార్టీలో యడియూరప్ప పరపతి పెరిగిపోయింది. 2016 అక్టోబర్ 26న ఆయనకు భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసు, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించింది. దీంతో 2016 ఏప్రిల్లోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగోసారి నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ యడియూరప్పను గవర్నర్ ఆహ్వానించారు. మెజార్టీ నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు. అయితే, గవర్నర్ నిర్ణయంపై జేడీ(ఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు సుప్రీంకోర్టు యడియూరప్పకు కేవలం 24 గంటల గడువిచ్చింది. దీంతో యడియూరప్ప ప్రభుత్వం మెజార్జీ నిరూపించుకోలేక మూడు రోజులకే కుప్పకూలింది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి సీఎం అయ్యారు. 17 మంది కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ లేక 2019 జూలై 23న కుమారస్వామి సర్కారు కూలిపోయింది. వారి అండతో యడియూరప్ప 2019 జూలై 26న నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలు యడియూరప్ప మద్దతుతో బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో గెలిచారు. యడియూరప్ప మొత్తం నాలుగుసార్లు ముఖ్యమంత్రి కాగా, మొదటిసారి ఏడు రోజులు, రెండోసారి మూడేళ్ల రెండు నెలలు, మూడోసారి మూడు రోజులు, నాలుగోసారి సరిగ్గా రెండేళ్లు అధికారంలో కొనసాగారు. దక్షిణాది బీజేపీలో ఏకైక మాస్ లీడర్ బీఏ చదివారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం అనుభవించారు. సామాజిక సంక్షేమ శాఖలో క్లర్క్‌గా ఉద్యోగ జీవితం ఆరంభించారు. కొంతకాలానికి రాజీనామా చేసి, శికారిపురాలో ఓ రైసు మిల్లులో క్లర్క్‌గా చేరారు. అక్కడ కూడా రాజీనామా చేసి, శివమొగ్గలో హార్డ్‌వేర్ దుకాణం ప్రారంభించారు. తాను క్లర్క్‌గా పనిచేసిన రైసు మిల్లు యజమాని కుమార్తె మైత్రాదేవిని 1967 మార్చి 5న వివాహం చేసుకున్నారు. యడియూరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ ఎంపీ. రెండో కుమారుడు విజయేంద్ర కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు. ఎల్లప్పుడూ తన ట్రేడ్‌మార్కు దుస్తులు తెల్ల రంగు సఫారీ ధరించే యడియూరప్పకు కన్నడ సినిమాలంటే చాలా ఇష్టం. దక్షిణ భారతదేశంలో ‘మాస్ లీడర్’ అన్న గుర్తింపు కలిగిన ఏకైక బీజేపీ నేత యడియూరప్ప కావడం గమనార్హం. కర్ణాటకలోని బలమైన వీరశైవ–లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్పకు ఆ వర్గంలో గట్టి పట్టుంది. రాష్ట్రంలో లింగాయత్‌లు బీజేపీకి బలమైన మద్దతుదారులు. ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా బుకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప 1943 ఫిబ్రవరి 27న మండ్యా జిల్లాలోని కె.ఆర్.పేట తాలూకాలో బుకనకెరె గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పుట్టతాయమ్మ, సిద్ధలింగప్ప. 15 ఏళ్లకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. యడియూరప్పను అనుచరులు రాజా హులి(పులి రాజా) అని పిలుచుకొనేవారు. శివమొగ్గ జిల్లాలోని సొంత పట్టణం శికారిపురాలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. బీజేపీ మాతృసంస్థ అయిన జనసంఘ్‌లో చేరారు. 1970వ దశకంలో శికారిపురా తాలూకా జనసంఘ్ అధినేతగా పనిచేశారు. శికారిపురా పురసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా శికారిపురా ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం విశేషం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగానే కాదు శానసభలో ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగానూ పనిచేశారు. -
యడియూరప్ప రాజీనామా.. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్!
బెంగళూరు: కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్సెన్స్‌కు బి.ఎస్.యడియూరప్ప (78) తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ గహ్లోత్‌కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. యడియురప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలయ్యింది. బీజేపీ అధిష్టానం కొత్త సీఎంపై ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. యడియూరప్ప మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేశారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని పేర్కొంది. గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, నాయకులకు, సహకరించిన అధికారులకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే తప్పుకున్నానని, సీఎంగా ప్రజలకు సేవ చేసేందుకు ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. యడియూరప్ప ఏం చెప్పారంటే.. ‘ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా పూర్తిగా సహకరిస్తా. రాజీయాల్లో కొనసాగుతా. పార్టీ అండతోనే పైకి ఎదిగా. నాకు దక్కినన్ని అవకాశాలు బహుశా మరో నాయకుడికి లభించి ఉండకపోవచ్చు. పదవులు ఇచ్చినా స్వీకరించను గవర్నర్ పదవి స్వీకరించాలన్న ఉద్దేశం లేదు. వాజ్‌పేయి నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. వద్దని చెప్పా. కర్ణాటకలో బీజేపీ పటిష్టత కోసం పనిచేస్తా’అని యడియూరప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) నుంచి ఫిరాయించి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేల(ప్రస్తుత మంత్రులు) భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించగా.. తమతోనే కలిసి ఉంటారని స్పష్టం చేశారు. విధాన సౌధాలో భావోద్వేగంతో కంటతడి తన ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం విధాన సౌధాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యడియూరప్ప ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గద్గద స్వరంతో ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, రాజీనామాను సమర్పించబోతున్నట్లు తెలిపారు. బాధతో కాదు, సంతోషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, జనసంఘ్ సభ్యుడిగా పనిచేసినప్పటి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనకు 75 ఏళ్లు దాటినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్! యడియూరప్ప రాజీనామాతో ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవురు అవుతారన్న దానిపై పడింది. 2023లో జరగబోయే శానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలుపు తీరానికి చేర్చే నాయకుడు ఎవరన్న చర్చ మొదలయ్యింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు, పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ వెల్లడించారు. శాసనసభా పక్షం భేటీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. యడియూరప్ప రాజీనామాకు గల కారణాలను ఆయనే వివరిస్తారని స్పష్టం చేశారు. కొత్త సీఎం ఎంపిక కోసం నిర్వహించే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
నేడు తేలనున్న యడియూరప్ప భవితవ్యం
-
యడ్డి వారసుడెవరో? బీజేపీ చేతిలో ఆ 8 మంది పేర్లు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప స్థానంలో బలమైన మరోనేతను నియమించడం బీజేపీకి సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప (78)ను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు అవుతుంది. యడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన, ప్రజాదరణ కలిగిన నేతను వెతికిపట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. దక్షిణాదిలో తమకు అత్యంత కీలకమైన కర్ణాటకలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. కొత్త సీఎంగా మొత్తం ఎనిమిది మంది పేర్లను బీజేపీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యడ్డి వారసుడిగా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలనేదే అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్ ఆర్ఎస్ఎస్లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అరవింద్ బెల్లాద్ ఇంజనీరింగ్ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్ఇమేజ్ ఉంది. బాగల్కోట్ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది. నన్నెవరూ సంప్రదించలేదు: ప్రహ్లాద్ హుబ్బళి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. ‘ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ప్రసారమాధ్యమాలు(మీడియా) మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. కొత్త సీఎంగా నన్ను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ నాతో ఇంతవరకూ ప్రస్తావించలేదు’ అని మీడియాతో అన్నారు. అత్యంత ముఖ్యాంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలదే తుది నిర్ణయమని చెప్పారు. -
యడ్డీకి అస్త్ర సన్యాసమే మార్గమా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో రాజకీయాలు ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటివరకు సీఎం కుర్చీ నుంచి దిగేది లేదని తెగేసి చెప్పిన యడియూరప్ప స్వరం మార్చారు. అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని గురువారం విధానసౌధలో మీడియా ముందు ప్రకటించడం సంచలనం రేపింది. తదుపరి సీఎంగా ఎవరు ఉండాలో తాను చెప్పలేనన్నారు. పెద్దసంఖ్యలో స్వామీజీలు ఆయన రాజీనామా చేయకూడదని రెండురోజుల నుంచి బెంగళూరులో చర్చలు జరపడం తెలిసిందే. ఈ తరుణంలో యడియూరప్ప అస్త్ర సన్యాస ప్రకటన వెలువడింది. ఆ మంత్రుల మద్దతు.. మరోవైపు యడియూరప్ప మద్దతుదారులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలా అని వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి మంత్రులైనవారు రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తోంది. వారు యడియూరప్పకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. మంత్రులు కె.సుధాకర్, కె.గోపాలయ్య, భైరతి బసవరాజ్, శివరామ్ హెబ్బార్, బీసీ పాటిల్, ఎస్టీ సోమశేఖర్ తదితరులు సీఎం బీఎస్‌వైతో రహస్య మంతనాలు చేసినట్లు సమాచారం. సీఎం రేసులో లేను: సీటీ బనశంకరి: నేను పార్టీ కార్యకర్తను మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేసులో లేనని, కానీ తన పేరు మీడియాలో వస్తోందని చెప్పారు. సీఎం నియామకం వెనుక మఠాధీశుల హస్తం ఉందా, లేదా అనేది హైకమాండ్ గమనిస్తుందని అన్నారు. నేను రేసులో ఉన్నా: కత్తి యశవంతపుర: ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే అయిన తనకు రాష్ట్రాన్ని పాలించే ఆశ ఉన్నట్లు మంత్రి ఉమేశ్‌కత్తి చెప్పారు. ఆయన బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడుతూ నేను యడియూరప్పకు సమానంగా ఉన్నా. నేను సీఎం కావడానికి 15 ఏళ్లు అవకాశం ఉంది. ఏదో ఒక రోజు సీఎం కావటం తథ్యం అన్నారు. సీఎం పదవి నుంచి యడియూరప్పను గౌరవప్రదంగా సాగనంపాలన్నారు. -
కర్ణాటకీయం: 25న కొత్త ముఖ్యమంత్రి?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు. కొన్ని నెలలుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రెండు వర్గాలుగా ఏర్పడింది. అయితే ఇందులో యడియూరప్ప వ్యతిరేక వర్గం బలంగా ఉంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి దింపేయాలని పలుసార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానానికి విన్నవించారు. ఇక కర్ణాటకలో బాహాటంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇక యడియూరప్పను సాగనంపాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వర్గాలు కర్ణాటక నాయకులకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. మూడు రోజుల్లో అంటే ఈనెల 25వ తేదీనే యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అధికారికంగా వెల్లడవుతున్న సమాచారం. (చదవండి: రాజీనామాకు సీఎం సిద్ధం.. చివరిసారి అందరికీ విందు) యడ్డి స్థానంలో పార్టీలోని సీనియర్ నాయకుడిని అధిష్టానం ప్రకటించనుందట. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై యడియూరప్ప స్పందించారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తానని ప్రకటించారు. సీఎం పదవికి ఎవరిని సూచించినా తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. 78 ఏళ్ల యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జూలై 26వ తేదీన ఓ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా అవన్నీ రద్దయ్యాయి. అధిష్టానం ఆదేశాల మేరకు యడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ నియమితులవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. -
BS Yediyurappa: యడియూరప్ప వారసుడెవరు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బి.ఎస్.యడియూరప్ప(78) మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తదుపరి సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ పలువురు నాయకులు లీకులిస్తున్నారు. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమని మరో వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అనుకున్నంత సులభం కాదు కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలని చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. లింగాయత్ వర్గం జనాభా కర్ణాటకలో 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల పట్ల ఈ వర్గం గుర్రుగా ఉంది. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. ఒక్కళిగ వర్గంలో పట్టుకోసం ఆరాటం కర్ణాటక తదుపరి సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా కొత్త నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు విందు వాయిదా కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ నెల 25న తలపెట్టిన విందు వాయిదా పడింది. సీఎంగా రెండేళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు భారీ విందు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే, ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఈ విందు వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విందు కోసం తదుపరి తేదీని ఇంకా ఖరారు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. యడియూరప్ప గత వారమే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. సీఎం మార్పుపై చర్చించడానికే యడియూరప్పను పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారన్న వార్తలు వెలువడ్డాయి. -
రాజీనామాకు సీఎం సిద్ధం: చివరిసారి అందరికీ విందు
బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి వీడుతారని చర్చ కొనసాగుతోంది. యడ్డి మార్పును సొంత పార్టీ నాయకులే కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. స్వయంగా నాయకులు మోదీ, అమిత్ షాతో సమావేశమై యడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా యడ్డికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. ఈ పోరు భరించలేక సీఎం పదవికి రాజీనామా చేసేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని సమాచారం. అందుకనుగుణంగా కర్ణాటకలో పరిణామాలు మారుతున్నాయి. పదవి వీడేలోపు సొంత ప్రాంతం శివమొగ్గలో ముఖ్యమంత్రి హోదాలో భారీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు యడియూరప్ప కార్యాచరణ రూపొందించుకున్నారు. చివరిసారి సీఎం హోదాలో తన ప్రాంతం శివమొగ్గలో ఈనెల 23, 24వ తేదీల్లో పర్యటించేందుకు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారందరికీ భారీ స్థాయిలో ఈనెల 25వ తేదీన విందు ఏర్పాటు చేయాలని యడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం హోదాలో మళ్లీ సచివాలయానికి రాకపోవచ్చనే ఓ స్థిర నిర్ణయానికి యడ్డి వచ్చారు. సచివాలయాన్ని వీడలేక విడిపోతున్న సందర్భంగా అందరికీ గుర్తుండేలా యడియూరప్ప ఈ మేరకు విందు నిర్వహించనున్నారట. గతవారం ఢిల్లీ పర్యటన చేపట్టగా అధిష్టానం ఆదేశాల మేరకు యడియూరప్ప పదవి వీడేందుకు సిద్ధమయ్యారని చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యడ్డి బిజీబిజీగా మారారు. చివరి రోజుల్లో తన మార్క్ చూపించాలని వివిధ పనులు స్వయంగా పురమాయించుకుంటున్నారు. ఫొటో సెషన్ కూడా ఏర్పాటు చేశారంట. అయితే 2023లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే యడియూరప్ప దిగిపోవాల్సిందేనని పార్టీ నాయకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే యడ్డి సీఎం పదవి నుంచి దిగిపోనున్నారు. జూలై 26వ తేదీన యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది. -
కర్ణాటకలో ఆడియో క్లిప్ కలకలం: ‘జూలై 26న సీఎం మార్పు’
Nalin Kumar Kateel Audio Clip బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రిగా తప్పించబోతున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం మార్పుకు సంబంధించి కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నలిన్ కుమార్ కతీల్దిగా భావిస్తోన్న ఆడియో క్లిప్ ఒకటి ఆదివారం అంతా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ఆడియో క్లిప్‌లో కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి మరొకరితో తులు భాషలో మాట్లాడినట్లు ఉంది. కతిల్‌గా భావిస్తున్న వ్యక్తి ‘‘దీని గురించి ఎవరికీ చెప్పవద్దు. మేము ఈశ్వరప్ప, షెట్టర్ బృందాన్ని తొలగిస్తాము. ఆ స్థానంలో కొత్త బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా మన నియంత్రణలో ఉంటుంది. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.. వారిలో ఒకరిని ఎప్పుడైనా ప్రకటించవచ్చు. ఢిల్లీ ఆఫీసు కొత్త సీఏం పేరును ప్రకటిస్తుంది’’ అని ఉంది. ఈ ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో కతీల్ దీనిపై స్పందించారు. ‘‘ఇది ఫేక్ ఆడియో క్లిప్.. పార్టీలో కలహాలు సృష్టించడం కోసం ఎవరో నా గొంతును అనుకరించారు. దీనిపై సీఎం లోతైన దర్యాప్తు చేయాలని కోరాను’’ అన్నారు. సీఎం యడియూరప్ప స్థానంలో జూలై 26 న, బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త కర్ణాటక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించిన సంగతి తెలిసిందే. కర్ణాటక సీఎంగా కొనసాగాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తనను కోరిందని యడియూరప్ప వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఆరు బ్యాగులతో ఢిల్లీకి కర్ణాటక సీఎం’
యశవంతపుర(కర్ణాటక): సీఎం యడియూరప్ప ఇద్దరు కొడుకులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఆరు పెద్ద పెద్ద బ్యాగులను తీసుకెళ్లారు, ఆ బ్యాగుల్లో ఏముందో నాకు తెలియదు అని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ప్రధానిని కలవడానికి వెళ్లిన యడియూరప్ప ఆరుబ్యాగులను ఎందుకు తీసుకెళ్లారు?. త్వరలో అన్ని విషయాలూ బయటపడతాయి అని చెప్పారు. ప్రధానిని కలిసిన యడియూరప్పకు ఎంత గౌరవ మర్యాదలు లభించాయో చూడాలన్నారు. అక్రమ గనులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు నా మద్దతు ఉంటుందని అన్నారు. -
నా రాజీనామా వార్తలన్నీ పుకార్లే: యడియూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎంగా కొనసాగాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తనను కోరిందని బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదన్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు గురించి చర్చించినట్లు ఆయన చెప్పారు. శనివారం ఉదయం ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో మరో సారి ఢిల్లీకి వస్తానని చెప్పారు. తను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ‘ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలతో భేటీ కావడంతో తప్పు లేదు, అంతమాత్రాన రాజీనామా చేస్తున్నట్లు కాదు, ఆ పరిస్థితే రాలేదు’ అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల వరకు కర్ణాటక సీఎంగా కొనసాగుతాననీ, రాష్ట్రంలో తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తమిళనాడుతో తలెత్తిన జలవివాదంపైనా ప్రధానితో చర్చించినట్లు యడ్డి తెలిపారు. కావేరీ నదిపై తలపెట్టిన మేకెదాటు పథకం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరానన్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయి చర్చించానన్నారు. కాగా, హోం మంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో, బెంగళూరుకు రావడానికి యడియూరప్ప ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతలోనే హోం మంత్రి అమిత్‌షా నుంచి పిలుపు రావడంతో వెళ్లి అరగంటపాటు ఆయనతో భేటీ అయ్యారు. -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
-
సీఎం యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం నిర్ణయానికి ఆయన తల వంచినట్లు తెలుస్తోంది. కాగా సీఎం మార్పు అంశంపై యడ్డీ వ్యతిరేకులు గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... శుక్రవారం రాత్రి సీఎం యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో భాగంగా రాజీనామాకు యడ్డీ అంగీకరించినట్లు సమాచారం. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని యడియూరప్ప కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన యడియూరప్ప తన కుమారులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. దీంతో... సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా ఈ విషయంపై స్పందించిన యడియూరప్ప రాజీనామా ప్రచారాన్ని ఖండించారు. కానీ, ఆయన వ్యతిరేకులు మాత్రం యడ్డీ కుర్చీ దిగే సమయం ఆసన్నమైందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కర్ణాటక: మళ్లీ సీఎం మార్పు చర్చ.. నేడు ఢిల్లీకి యడియూరప్ప
సాక్షి, బెంగళూరు: సీఎం యడియూరప్ప నేడు శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. సీఎం మార్పు కోసమే హైకమాండ్ ఆయనను పిలిపించిందా? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది. అపాయింట్మెంట్లు కుదరకపోతే శనివారం కూడా ఢిల్లీలోనే మకాం వేయవచ్చు. కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన, పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ కర్ణాటకపై పూర్తి దృష్టి సారించినట్లు కథనం. యడ్డి దిగిపోయేలా ఈసారి ఒప్పించవచ్చని ఆయన వ్యతిరేకులు ఆశాభావంతో ఉన్నారు. సీఎం పర్యటన గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఉదయం 11 గంటలకు వెళ్తారని తెలిసింది. రాష్ట్రమంత్రివర్గ ప్రక్షాళన గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ముగ్గురు, నలుగురికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని వినికిడి. -
యడ్డి, ఆప్తులకు ఊరట.. అబ్రహాం అర్జీ కొట్టివేత
సాక్షి, బెంగళూరు: బీఎస్ యడియూరప్ప, సన్నిహితులకు ఊరట దక్కింది. 2021 జూన్ 6న అవినీతి ఆరోపణల నేపథ్యంలో యడియూరప్ప, కుమారుడు బీవై విజయేంద్ర, వారి సన్నిహితులు శశిధర మరడి, విరూపాక్షప్ప, యమకన మరడి, సంజయశ్రీ, చంద్రకాంత్ రామలింగం, మంత్రి ఎస్టీ సోమశేఖర్, ఐఏఎస్ అధికారి జీసీ ప్రకాశ్, హోటల్ యజమాని కె.రవిలపై విచారణకు అనుమతివ్వాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అందరూ కలిసి నకిలీ కంపెనీల్లోకి ప్రభుత్వ వివిధ పథకాల నుంచి కోట్లాది రూపాయలను పెట్టుబడుల రూపంలో తరలించారని ఫిర్యాదులో ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. వారి విచారణకు గవర్నర్ నుంచి అనుమతి తీసుకోనందున కొట్టివేస్తున్నట్లు తెలిపింది. -
నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్డౌన్ ఖాయం
సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా తగ్గినట్లే తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,743 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. 3,081 మంది కోలుకున్నారు. 75 మంది కన్నుమూయడంతో మొత్తం మరణాలు 35,601 మందికి పెరిగాయి. కరోనా కేసుల మొత్తం 28,62,338, డిశ్చార్జ్‌లు 27,87,111 కి చేరాయి. 39,603 మంది కరోనాతో చికిత్స పొందతుండగా పాజిటివిటీ రేటు 1.64 శాతంగా ఉంది. బెంగళూరులో 611 కేసులు.. ఐటీ సిటీలో తాజాగా 611 కేసులు, 693 డిశ్చార్జిలు, 12 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,17,507కు పెరిగింది. అందులో 11,87,666 మంది కోలుకున్నారు. 15,702 మంది మరణించారు. 14,138 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,66,631 నమూనాలు పరీక్షించారు. మొత్తం టెస్టులు 3,53,18,762 అయ్యాయి. మరో 2,08,439 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. దీంతో మొత్తం టీకాల సంఖ్య 2,46,91,636 కి పెరిగింది. నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్డౌన్ దొడ్డబళ్లాపురం: అన్‌లాక్ చేశామని జనం ఇష్టానుసారంగా తిరిగి కరోనా వ్యాప్తికి కారణమయితే 15 రోజుల్లో మళ్లీ లాక్డౌన్ అమలు చేయాల్సి వస్తుందని, కాబట్టి కరోనా నియమాలను కట్టుదిట్టంగా పాటించాలని సీఎం యడియూరప్ప ప్రజలను హెచ్చరించారు. దొడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభించారు. 70 బెడ్లతో ఆస్పత్రిని నిర్మించామన్నారు. కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
స్టాలిన్‌కు లేఖ రాశాను.. స్పందన లేదు: సీఎం
బెంగళూరు: కావేరి నదిపై తాము నిర్మించే మేకెదాటు ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని కర్ణాటక సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. విధానసౌధ ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేకెదాటు ప్రాజెక్టును నిర్మించితీరుతాం. దీనిని ఎవరూ అడ్డుకోలేరు’అని పరోక్షంగా తమిళనాడును ఉద్దేశించి అన్నారు. ‘ఈ విషయంలో సామరస్యంగా సాగిపోదామని తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశాను. అందుకు సరైన స్పందన లభించలేదు. ఏదేమైనా ప్రాజెక్టును కొనసాగిస్తాం. ఈ పథకంతో కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాలకూ లబ్ధి కలుగుతుంది’అని సీఎం చెప్పారు. చట్ట పరిధిలోనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం, ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు. -
ఢిల్లీ చేరనున్న ‘డ్యాం’ పంచాయితీ..!
సాక్షి, చెన్నై: కావేరి తీరంలోని మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన డ్యాం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దురై మురుగన్ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్యాం నిర్మాణ ప్రయత్నాలను వీడాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం లేఖ రాశారు. డ్యాం నిర్మాణానికి అడ్డుచొప్పొద్దని కోరుతూ సీఎం స్టాలిన్‌కు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. డ్యాం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించబోతున్న సంకేతాలతో ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి డ్యాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ కూడదని ఒత్తిడి తెచ్చేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. మంగళవారం ఈ బృందం కేంద్ర మంత్రితో భేటీ కానుంది. కావేరి జల వివాదం, డ్యాం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పట్టుబట్టడమే కాకుండా, మార్కండేయ నదిలో కర్ణాటక నిర్మించిన ఆనకట్ట తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే సీఎం స్టాలిన్ తరఫున కేంద్ర మంత్రికి లేఖ సమరి్పంచనున్నారు. యడ్డీకి లేఖాస్త్రం తనకు యడ్యూరప్ప రాసిన లేఖకు సమాధానంగా సీఎం స్టాలిన్ ఆదివారం లేఖాస్త్రం సంధించారు. అందులో కావేరి జల వివాదం, కోర్టు తీర్పు, నీటి పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో సాగుతున్న కావేరి పథకాలను గుర్తు చేస్తూ, ఈ పథకాల కారణంగా తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని మేఘదాతులో నిర్మించతలపెట్టిన డ్యాం కారణంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్ప మేరకు సరిహద్దులోకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరాల్సి ఉందన్నారు. తమిళ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేయ వద్దని కోరారు. బెంగళూరుకు నీటి అవసరాల పేరిట ఈ డ్యాం నిర్మాణాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మెరుగు, కొనసాగింపు లక్ష్యంగా ఈ డ్యాం నిర్మాణ ప్రయత్నాన్ని వీడాలని కోరారు. ఇదిలా ఉండగా మార్కండేయ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కృష్ణగిరిలో రైతులు నిరసన తెలపనున్నారు. -
యడియూరప్పకు చుక్కెదురు
సాక్షి బెంగళూరు: బెంగళూరులో స్థలం డీ నోటిఫికేషన్ కేసులో ముఖ్యమంత్రి యడి యూరప్పకు చుక్కెదురైంది. యడియూరప్పపై నమోదైన ఈ డీనోటిఫికేషన్ కేసు విచారణను మూసివేయాలని లోకాయుక్త విభాగం ఇచ్చిన బీ–రిపోర్టును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం తోసిపుచ్చింది. జడ్జి శ్రీధర్ గోపాలకృష్ణ ఆ బి–రిపోర్టును తిరస్కరిస్తూ నివేదిక సక్రమంగా లేదని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారం మళ్లీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తెలిపారు. కేసు పూర్వపరాలు.. 2000–01లో నగరంలోని వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల భూములను ఐటీ కారిడార్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మారతహళ్లి, బెళ్లం దూరు, సర్జాపుర, దేవరబీసనహళ్లి, కాడుబీ సనహళ్లి, కరిమమ్మన అగ్రహార గ్రామాల్లోని 434 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేఐఏడీబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్ప కేఐఏడీబీ స్వాధీనం చేసుకున్న దేవరబీసనహళ్లి సర్వే నంబర్ 49లో ఉన్న 4.30 ఎకరాలు, బెళ్లందూరు గ్రామం సర్వే నంబర్ 46లో ఉన్న 1.17 ఎకరాలు, సర్వే నంబర్18లో ఉన్న 1.10 ఎకరం, సర్వే నంబర్ 10.33 గుంటల స్థలాలను అక్రమంగా డీనోటిఫై చేశారని 2013 జూలై 10న వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని లోకాయుక్త కోర్టు 2015, ఫిబ్రవరి 18న పోలీసులను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు 2015, ఫిబ్రవరి 21న ఎఫ్ఐఆర్ దాఖలు చేసి యడియూరప్పను ఏ2గా లోకాయుక్త పోలీసులు చేర్చారు. అయితే 2019, జనవరి 25న తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని యడియూరప్ప హైకోర్టును కోరగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ కేసులో విచారణను పారదర్శకంగా చేపట్టాలని లోకాయుక్త పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్‌డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
కేసులు తగ్గుముఖం: జూలై 5 నుంచి అన్‌లాక్ 3!
సాక్షి బెంగళూరు: కన్నడనాట కొత్తగా 3,222 కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. 14,724 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 28.40 లక్షల మంది కోవిడ్ బారిన పడగా 27.19 లక్షల మంది బయటపడ్డారు. ఇంకా 85,997 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివిటీ రేటు 2.54 శాతంగా ఉంది. మంగళవారం 93 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాలు 34,929 కి పెరిగాయి. మరణాల రేటు 2.88 శాతంగా ఉంది. ఇక బెంగళూరులో కొత్తగా 753 మంది కరోనా బారిన పడగా, 16 మంది మరణించారు. టీకాలు, టెస్టులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలో అన్‌లాక్–3 రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జూలై 5న మూడో అన్‌లాక్‌ను ప్రకటించే అవకాశముంది. సాంకేతిక సలహా కమిటీ, సీనియర్ మంత్రులతో చర్చించిన తరువాత సీఎం బీ.ఎస్.యడియూరప్ప ఆ వివరాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలను మినహాయిస్తే 27 నుంచి 28 జిల్లాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. మైసూరు, దక్షిణ కన్నడ, కొడగు జిల్లాల్లో కొంచెం తీవ్రంగానే ఉంది. ఈ దఫా అన్‌లాక్‌లో మాల్స్, థియేటర్లు, పబ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు తదితర హైఎండ్ వ్యాపారాలను అనుమతి లభించే అవకాశముంది. ప్రస్తుతమున్న రెండో అన్‌లాక్‌లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు సాధారణ వ్యాపారాలకు, రవాణా సేవలకు అనుమతించడం తెలిసిందే. వీకెండ్ కర్ఫ్యూ యథాతథంగా ఉంది. మూడో అన్‌లాక్‌లో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేసే అవకాశముంది. టెన్త్ పరీక్షలు ఇప్పుడా ? మైసూరు: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మూడవ దశ ప్రారంభం అవుతుందని తెలిసి కూడా టెన్త్ పరీక్షల్ని నిర్వహించడం సరికాదు, విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకోవద్దు అని బీజేపి ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడో దశ త్వరలోనే దాడి చేయనుంది, ఈ సమయంలో పరీక్షలు జరపరాదని కోరారు. చదవండి: మాస్క్ లేకుండా నెలరోజుల్లోనే లక్షన్నర మంది.. -
మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరి
సాక్షి బెంగళూరు: డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికారులకు సూచించారు. డెల్టాప్లస్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సి ముందస్తు చర్యలపై శుక్రవారం సాయంత్రం సీఎం తన నివాసంలో మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రస్తుతానికి డెల్టా వైరస్ ప్రభావం ఎక్కువగా లేకున్నప్పటికీ దానిపై గట్టి నిఘా ఉంచాలని సీఎం సూచించారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలపై దృష్టిసారించి వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. కల్యాణ మంటపాలు, హోటల్స్, పార్టీ హాల్స్, రిసార్టుల్లో 40 మందికి మించకుండా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. చదవండి: పోలీస్ బాహుబలి! -
నాయకత్వ మార్పు ప్రసక్తే లేదు.. వారిపై కఠిన చర్యలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న అంశాలు, తీర్మానాలపై మీడియాకు వివరించారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్ కమిటీ మీటింగ్‌లో తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకత్వ మార్పు అంశం చర్చకు రాలేదన్నారు. యడియూరప్పే తమ నాయకుడని పేర్కొన్నారు. ప్రభుత్వ, బీజేపీ ప్రతిష్ట పెరిగేలా చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 21న ప్రతి తాలూకాలో యోగా దినోత్సవాన్ని, 23న శ్యామ్‌ప్రకాశ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా బూత్‌స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని, జూలై 6 వరకు ముఖర్జీ జ్ఞాపకార్థం మొక్కల నాటే కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు బీజేపీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలను అధిష్టానం ఎంతమాత్రం సహించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అరుణ్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కమిటీ పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులతో ఆయన సమావేశమై చర్చించారు. రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రానున్న జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల సిద్ధతపై చర్చించారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని అరుణ్ సింగ్ హెచ్చరించారు. పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ బనశంకరి: బీజేపీ నేతలతో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. కర్ణాటక నుంచి అరుణ్‌సింగ్, సీటీ.రవి, నళిన్‌కుమార్‌కటీల్ పాల్గొ -
హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్
సాక్షి బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిజ్రాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర సర్కార్ తెలిపింది. హిజ్రాలకు రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంగమ స్వయం సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది విజయకుమార్ పాటిల్ తన వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలానుసారం అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం పోస్టులను హిజ్రాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కర్ణాటక పౌరసేవా నియామక చట్టం–1977 సెక్షన్ 9ని సవరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే రెండు నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్లపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20కు వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి -
సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి
సాక్షి బెంగళూరు: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విజయేంద్ర ఆలయంలో పూజలు చేసిన ఘటనపై లెట్‌కిట్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నంజనగూడు ఆలయానికి విజయేంద్ర వెళ్లడం నిజమేనని, 5నిమిషాలు మాత్రమే ఆయన ఆలయంలో ఉన్నారని అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడింది. ఆలయంలోకి ప్రవేశించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. చదవండి: ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు! -
Leadership Crisis: తలోమాట చెరోబాట; మావల్లే గొడవలు అన్న జార్కిహోళి!
సాక్షి, బెంగళూరు: నాయకత్వ సంక్షోభం సుడులు తిరుగుతుండగా, సీఎం యడియూరప్ప తన శక్తిని చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులతో సమావేశాలు జరుపుతూ నా బలం ఇదీ అని ప్రదర్శిస్తున్నారు. గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బోర్డు, కార్పొరేషన్ అధ్యక్షులు సీఎంను కలిశారు. మీరు సీఎం పదవి నుంచి తప్పుకోరాదని పట్టుబట్టారు. సీఎం నివాసం కావేరిలో హోం మంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు జే.సీ.మాధుస్వామి, అంగార, మరికొందరు యడియూరప్పను కలిసి రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. తరువాతర వీరందరూ పార్టీ ఇన్చార్జ్ అరుణ్‌సింగ్‌ను కలవాలని అనుకున్నా సీఎం వద్దని వారించారు. సెవెన్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న సీఎం రాజకీయ కార్యదర్శి ఎం.పీ.రేణుకాచార్య ఇంట్లోనూ సీఎం మద్దతుదారులైన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వారు కూడా అరుణ్‌సింగ్‌ను కలిసి యడ్డికి మద్దతుగా గొంతు వినిపించాలని అనుకున్నారు. కానీ చివరక్షణంలో భేటీని రద్దు చేసుకున్నారు. యడ్డిపై యోగీశ్వర్, యత్నాళ్ ధ్వజం యడియూరప్పపై తిరుగుబాటు వర్గంలోనున్న మంత్రి సీపీ యోగీశ్వర్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్ మరోసారి భగ్గుమన్నారు. యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటు కావడానికి సహకరించిన తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని, కానీ రామనగర జిల్లా ఇన్చార్జ్ ఇవ్వలేదని సీపీ యోగీశ్వర్ దుయ్యబట్టారు. రామనగరలో డీకే శివకుమార్, చెన్నపట్టణలో హెచ్డీ కుమారస్వామితో యడియూరప్పకు ఒప్పందం ఉందని, వారు అడిగిన అధికారులను నియమిస్తారని విమర్శించారు. యత్నాళ్ మాట్లాడుతూ యడ్డి ప్రభుత్వంలో అవినీతి, సీఎం తనయుడు విజయేంద్ర జోక్యం పెరిగిపోయిందన్నారు. యడ్డికి ఆరోగ్యం, వయసు మీరింది, ఆయనను మార్చాలని అన్నారు. గొడవలు మావల్లే: జార్కిహొళి మరో రెండేళ్ల పాటు యడియూరప్ప సీఎంగా కొనసాగుతారని మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి చెప్పారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో బీజేపీలో గందరగోళం నెలకొందని మంత్రి ఈశ్వరప్ప అనడంలో తప్పు లేదన్నారు. తాము యడియూరప్ప, అమిత్‌షాను నమ్ముకొని బీజేపీలోకి వచ్చామన్నారు. కోపతాపాలు ఉంటే పిలిపించి పరిష్కరించాలన్నారు. తాను సీఎం రేస్‌లో లేనని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నారని యలహంక ఎమ్మెల్యే ఎస్.ఆర్.విశ్వనాథ్ ధ్వజమెత్తారు. సర్కారును రద్దు చేయాలి: సిద్ధు శివాజీనగర: అధికార బీజేపీలో అంతర్గత కలహాలతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది, అందుచేత గవర్నర్ తక్షణం యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ చూడాల్సిన మంత్రులు ఆఫీసులకు వెళ్లకుండా బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తంలో రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్లయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. నా ఫోన్ ట్యాపింగ్: బెల్లద్ బనశంకరి: తన ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ పరోక్షంగా సీఎం యడియూరప్పపై ఆరోపణలు చేశారు. నగరంలో అరవింద్ బెల్లద్ విలేకరులతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం రాజస్వామి అనే వ్యక్తి ఫోన్ చేసి తనను అనవసరంగా జైలుకు పంపించారని వాపోయాడన్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, దీనిపై స్పీకర్, హోంమంత్రి, డీజీపీకి లేఖ రాశానన్నారు. జైలులో ఉన్న వ్యక్తికి నా ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారనేది విచారించాలన్నారు. నేను జ్యోతిష్యుణ్ని కాను దొడ్డబళ్లాపురం: బీజేపీలో ఎవ్వరూ లక్ష్మణరేఖ దాటడం లేదు. అయితే రాబోవు రోజుల్లో ఏం జరగబోతోందో నేను చెప్పలేనని, తాను జ్యోతిష్యున్ని కానని డీసీఎం అశ్వత్థనారాయణ అన్నారు. రామనగర పట్టణంలో గురువారం రోటరీ బీజీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ ఇప్పటికే నాయకత్వ మార్పునకు సంబంధించి స్పష్టం చేసారన్నారు. అరుణ్ సింగ్ రాష్ట్రానికి రావడాన్ని భూతద్దంలో చూడవద్దన్నారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్నారు. నాయకత్వ మార్పుపై తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు. చదవండి: నా పదవికి ఢోకా లేదు: సీఎం -
నా పదవికి ఢోకా లేదు: సీఎం
శివాజీనగర: నాయకత్వ మార్పు ప్రస్తావనే లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టంచేయడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యూహాత్మక మౌనం దాల్చారు. రాష్ట్ర ఇన్చార్జ్ అరుణ్‌సింగ్ పర్యటన నేపథ్యంలో వ్యతిరేకులు ఫిర్యాదులకు పదును పెట్టగా, యడ్డి క్యాంపులో ప్రశాంతత నెలకొంది. బుధవారం మామూలుగానే కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి ఇంటికి సన్నిహిత ఎమ్మెల్యేలు, నాయకులు దండుగా వచ్చి తమ మద్దతును వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పునకు అవకాశం ఇవ్వబోమని, అరుణ్‌సింగ్‌ను కలిసి ఇదే మాటను చెబుతామని తెలిపారు. అరవింద బెల్లద్, బసనగౌడ పాటిల్ యత్నాళ్, సీపీ.యోగేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప మద్దతుతారులు.. సీఎంను మారిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మద్దతుదారులకు సీఎం సాంత్వన పలికి, ఏమీ జరగదు, నేనే సీఎంగా కొనసాగుతాను, అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపుతున్నారు. అంతా బాగుంది: అరుణ్‌సింగ్ సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో అందరూ ఒక్కటేనని, సీఎం యడియూరప్ప ప్రభుత్వం చక్కగా పాలన సాగిస్తోందని రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అరుణ్ సింగ్ అన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన తొలిరోజు బుధవారం పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. యడియూరప్ప నాయకత్వం మార్పు అనే ఊహాగానాల మధ్య అరుణ్ సింగ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యడియూరప్పను మార్చాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. తప్పుకోవడానికి తానూ రెడీ అని యడ్డి చెప్పడంతో సెగలు రేగాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్ సింగ్, సీఎం యడియూరప్ప, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు విషయంపై స్పందించా, కొత్తగా చెప్పేందుకు ఏమి లేదని అరుణ్‌సింగ్ అన్నారు. తమ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు. నేతల మధ్య విభేదాలు ఉంటే మీడియా ముందు కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని సూచించానని తెలిపారు. -
కరోనాతో చనిపోతే రూ. లక్ష పరిహారం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్ సోకి మృతి చెందిన బీపీఎల్ కుటుంబాలకు రూ. లక్ష పరిహారం అందిస్తామని సీఎ యడియూరప్ప తెలిపార. సోమవారం కృష్ణాలో ఆయన మీడియాలో మాట్లాడారు. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీధిపాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీపీఎల్(పేద) కుంటుంబంలో ఎవరైనా కరోనాతో చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి రూ. లక్ష సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు మొత్తం రూ. 250 నుంచి 300 కోట్లు వినియోగిస్తామన్నారు. బీపీఎల్ కార్డ్ ఉన్న కుటుంబాలకు ఈ పరిహారం వర్తిస్తుందని చెప్పారు. -
సీఎం మార్పు కోసం ఆగని యత్నాలు
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని బీజేపీ అధిష్టానం పెద్దలు చెప్పినా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా ఆయన విరోధి వర్గం తెరవెనుక మంతనాలు, కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ఢిల్లీ పర్యటన పలు అనుమానాకు తావిచ్చింది. శుక్రవారం యడియూరప్ప మాట్లాడుతూ రానున్న రెండేళ్లు తానే సీఎంనని ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. సీఎం ప్రకటన తరువాత శనివారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు అరవింద బెల్లద్ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. పార్టీ ఇన్చార్జ్ రాకపై దృష్టి యడియూరప్పను వ్యతిరేకించే ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలను కలసి త్వరలో శాసనసభపక్ష భేటీ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయాలని కోరారు. ఈ నెల 16 లేదా 17న కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ జరిపే రాష్ట్ర పర్యటనలో యడియూరప్పను మార్చాలని వ్యతిరేకవర్గం పట్టుబట్టనుంది. తన ఢిల్లీ పర్యటనలో పూర్తిగా వ్యక్తిగతమని ఎమ్మెల్యే అరవింద బెల్లద్ చెప్పారు. -
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ నాయకత్వం ఒక స్పష్టతనిచ్చింది. సీఎంగా యడియూరప్ప బాగానే పనిచేస్తుందన, ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయనను తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. యడియూరప్ప సీఎంగా కొనసాగుతారన్నారు. ఆయనతోపాటు, మంత్రులు, పార్టీ శ్రేణులు కోవిడ్ మహమ్మారి సమయంలో మంచిగా పనిచేస్తున్నారంటూ కితాబునిచ్చారు. యడియూరప్పను పక్కకు తప్పించే విషయంలో హైకమాండ్ స్థాయిలో ఎటువంటి చర్చలు జరగలేదని ఢిల్లీలో గురువారం అరుణ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌తో తాను మాట్లాడానంటూ వస్తున్నవన్నీ కేవలం ఊహలు, వదంతులేనని స్పష్టం చేశారు. యడియూరప్ప నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త అని తెలిపారు. సీఎం పదవి, నాయకత్వ మార్పిడి, రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, నేతలెవరూ వ్యాఖ్యలు చేయరాదని, ఒకవేళ ఎవరైనా అటువంటి వాటికి పాల్పడితే వివరణ కోరుతామన్నారు. ఏదైనా విషయం ఉంటే నేరుగా తనతో మాట్లాడవచ్చని, త్వరలోనే ఆ రాష్ట్రానికి వెళ్తున్నానని అరుణ్ సింగ్ వివరించారు. చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు! చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్! -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’
బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు -
కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. చదవండి: ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
శివాజీనగర: ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నది కరోనా సవాల్ మాత్రమే. దానిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో చేస్తాను. ఢిల్లీకి వెళ్లినవారికి హైకమాండ్ తగిన సమాధానం చెప్పి పంపింది. శాసనసభా పక్ష సమావేశం గురించి మీ ముందు చర్చించలేను అని సీఎం యడియూరప్ప అన్నారు. సీఎం మార్పు కోసం బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందించారు. జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కలసికట్టుగా కోవిడ్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఎవరో ఒకరు ఎక్కడికో వెళ్లి వచ్చారంటే వారికి హైకమాండ్ సమాధానం చెప్పి పంపారు కదా అన్నారు. యడియూరప్పని తొలగించాలని బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారని వార్తలు రావడం తెలిసిందే. -
Black Fungus: ఉచితంగా చికిత్స
బెంగళూరు: కోవిడ్ తర్వాత తలెత్తుతున్న బ్లాక్ ఫంగస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలపై బ్లాక్ ఫంగస్ మరింత భారాన్ని పమోపుతుంది. ఈ క్రమంలో ఏపీలో బ్లాక్ ఫంగస్‌ని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో రాష్ట్రం చేరింది. బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. అంతేకాక రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకూ పొడిగించినట్టు ఆయన వెల్లడించారు. మంత్రులు, సీనియర్ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం యడియూరప్ప ఈ నిర్ణయాలు ప్రకటించారు. నిపుణుల అభిప్రాయం తీసుకున్న మీదట కఠిన నియంత్రణలను జూన్ ఏడు వరకూ కొనసాగించాలని నిర్ణయించామని అన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. చదవండి: ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల -
1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పలు వర్గాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.1,250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తక్షణమే అర్హులకు ఆర్థికసాయం అందిస్తామని సీఎంయడియూరప్ప తెలిపారు. పండ్లు, కూరగాయల రైతులకు ప్రతి హెక్టార్‌కు రూ.10 వేలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3 వేలు, నిర్మాణ కార్మికులకు రూ.3 వేలు, చర్మకారులు, అసంఘటిత కార్మికులకు తలా రూ.2 వేలు, వీధి వ్యాపారులకు రూ.2 వేలు, కళాకారులు, కళా బృందానికి రూ.3 వేలు చొప్పున అందజేస్తామని సీఎం తెలిపారు. రుణ వాయిదాల చెల్లింపులకు మూడునెలలు విరామమిచ్చారు. ఈ మూడునెలల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రెండు నెలలు ఉచిత రేషన్ అందజేస్తామని చెప్పారు. -
రూల్స్ బ్రేక్ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్‌ను బ్రేక్ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: గొర్రెల ధర్నా: బర్త్ డే నాడు గవర్నర్‌కు చేదు అనుభవం -
కరోనా: కోలుకున్నా ఇళ్లకు వెళ్లని రోగులు.. సీఎం ఆగ్రహం
శివాజీనగర: కరోనా నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లకుండా కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రోగుల తీరుపై సీఎం యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నాటకలోని శివాజీనగరలో మంగళవారం కోవిడ్ వార్ రూమ్‌లను సీఎం తనిఖీ చేశారు. సుమారు 503 మంది 20 రోజులు ఆస్పత్రుల్లో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందన్నారు. బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఈ సంద్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. వార్ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
2 వారాలు సర్వం బంద్.. నేటి నుంచి పూర్తి లాక్డౌన్
సాక్షి, బెంగళూరు: పాక్షిక లాక్డౌన్ వల్ల కరోనా కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో కర్ణాటక సర్కారు సోమవారం నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనుంది. రాష్ట్రంలో నిత్యం 45 వేలకు పైగా పాజిటివ్‌లు, సుమారు 350కి పైగా మరణాలు సంభవిస్తూ ప్రజా జీవితం అతలాకుతలమవుతోంది. ఏ ఆస్పత్రి చూసినా కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో కోవిడ్ కట్టడికి రెండువారాల కింద నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత ఏప్రిల్ 27 నుంచి మే 12 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులతో లాక్డౌన్ విధించారు. ఇవేమీ కూడా కరోనా విజృంభణను నిలువరించలేకపోయాయి. దీంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌కు యడియూరప్ప సర్కారు సిద్ధమైంది. చదవండి: (కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ) రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. తరువాత జన సంచారంతో పాటు మొత్తం బంద్ అవుతాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్లవచ్చు. వివాహాలకు 50 మందికి మాత్రమే అవకాశం. నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లవచ్చు. సిటీ, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్. కేవలం రైళ్లు, విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. -
కర్ణాటకలో సంపూర్ణ లాక్డౌన్
-
కర్ణాటక: రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్
బెంగళూరు: కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం కేబినేట్ భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యవసర సర్వీసులకు మాత్రం ఉదయం 6నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ, మహారాష్ట్రల కన్నా మన దగ్గర పరిస్థితి భయంకరంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రానున్న రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు విధిస్తాం. మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం ఎలాను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలి’’ అని కోరారు. ఇక తాజాగా కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే 34 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 143 మంది మృతి చెందారు. బెంగళూరు అర్బన్‌లో 20,733 కేసులు వెలుగు చూశాయి. చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య -
కరోనా విలయం: కర్ణాటక కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు రోజుకు 20 వేలను తాకుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ అనకుండానే అటువంటి చర్యలను ముమ్మరం చేసింది. ఒకరకంగా హాఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. గురువారం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రమంతటా 144వ సెక్షన్‌ను విధించింది. ప్రజలు గుంపులుగా తిరగరాదని, పని లేకుండా బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. బట్టలషాపులు, మాల్స్, థియేటర్లు, కిరాణా షాపులను, బేకరీలను కూడా మూసేయించారు. బస్సులు, రవాణా వ్యవస్థను మినహాయించారు. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ, శని–ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించడం తెలిసిందే. ఈ నిషేధాజ్ఞలు మే 4వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభు త్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేశారు. కరోనా నుంచి కోలుకున్న సీఎం యడ్డి సాక్షి, బెంగళూరు: కరోనా బారిన పడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కోలుకున్నారు. ఈ నెల 16న ఆయనకు పాజిటివ్ అని తేలగా, అప్పటినుంచి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు గురువారం పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యారు. అక్కడి నుంచి అధికారిక నివాసమైన కావేరి బంగ్లాకు చేరుకున్నారు. తనకు విశ్రాంతి అవసరం లేదని, అధికారిక సమావేశాలను నిర్వహిస్తానని తెలిపారు. కరోనా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన కరోనాకు గురై కోలువడం ఇది రెండవసారి. చదవండి: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి తమ్ముడి వరుస అబ్బాయితో గర్భం.. కుటుంబీకులే ప్రసవం! -
బెంగళూరులో రాత్రి కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండగా ప్రభుత్వం పలు కఠిన చర్యలకు నాంది పలికింది. తక్షణం అమల్లోకి వచ్చేలా రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. బెంగళూరులో రోజూ 10 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. విధానసౌధలో రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ అధ్యక్షతన పలువురు సీనియర్ మంత్రులతో సమావేశం జరిగింది. కోవిడ్‌కు గురై ఆస్పత్రిలో ఉన్న సీఎం యడియూరప్ప వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సీఎం ససేమిరా .. ప్రతి శని, ఆదివారాల్లో బెంగళూరులో లాక్డౌన్ విధించాలని మంత్రులు సూచించగా సీఎం అంగీకరించలేదు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోతామన్నారు. స్కూళ్లు, మాల్స్, కళ్యాణ మండపాలు తదితరాలను కొంతకాలం మూసేయాలని చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప మంగళవారం ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరిపి మరిన్ని చర్యలు తీసుకుంటారని సమాచారం. -
కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, బెంగళూరు : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కోవిడ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా చేరారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మళ్లీ కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. స్వల్పంగా జ్వరం ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఈ రోజు(శుక్రవారం) ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఇటీవల నన్ను కలిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి’ అని సూచించారు. అయితే బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చేరిన సీఎంకు పాజిటివ్ రావడంతో మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా ఆయనకు, తన కుమార్తె పద్మావతి ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. చదవండి: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్ బెంగళూరులో వైరస్ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు Karnataka CM BS Yediyurappa tests positive for #COVID19. He'll be shifted to Manipal hospital from Ramaiah Memorial hospital where he was admitted earlier today: Karnataka Chief Minister's Office (CMO) He had held an emergency meeting over COVID, at his residence earlier today. pic.twitter.com/i5fPumgIIl — ANI (@ANI) April 16, 2021 -
లేదంటే లాక్డౌన్ విధిస్తాం: సీఎం హెచ్చరిక
సాక్షి, శివాజీనగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెచ్చరిల్లుతున్నందున త్వరలో అఖిల పక్ష సమావేశం నిర్వహించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీఎం యెడియూరప్ప తెలిపారు. సోమవారం బీదర్‌లో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు అనివార్యమైతేనే ఇంటినుంచి బయటకి రావాలన్నారు. కరోనా నియమాలను పాటించాలని, రద్దీ ఉండరాదు అని కోరారు. వైరస్ పెరుగుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడమైనది, ప్రజలు సహకరించాలి. లేకపోతే లాక్‌డౌన్‌తో పాటు మరిన్ని కఠిన చర్యలు అవసరమవుతాయి అని హెచ్చరించారు. ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికల తరువాత కరోనా వైరస్ కట్టడికి మరిన్ని కఠిన నియమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: లాక్డౌన్ : వలస కార్మికుల గుండెల్లో ‘రైళ్లు’ -
భూకుంభకోణం: ముఖ్యమంత్రికి భారీ ఊరట
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. పదేళ్ల కిందట సీఎంగా ఉన్న యడియూరప్ప 24 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 2012లో లోకాయుక్తలో చార్జిషీటు కూడా దాఖలైంది. ఈ చార్జిషీట్ ఆధారంగా విచారణ చేయాలని ప్రత్యేక కోర్టుకు కర్నాటక హైకోర్టు గతనెలలో ఆదేశించింది. దీంతో యడియూరప్ప పదవికి గండం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కర్నాటక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీంతో యడియూరప్పకు భారీ ఊరట లభించింది.