1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం | Karnataka Govt Announces Rs 1,250 Crore Covid-19 Relief Package | Sakshi
Sakshi News home page

1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం

May 20 2021 3:31 AM | Updated on May 20 2021 3:34 AM

Karnataka Govt Announces Rs 1,250 Crore Covid-19 Relief Package - Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పలు వర్గాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.1,250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తక్షణమే అర్హులకు ఆర్థికసాయం అందిస్తామని సీఎంయడియూరప్ప తెలిపారు. పండ్లు, కూరగాయల రైతులకు ప్రతి హెక్టార్‌కు రూ.10 వేలు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.3 వేలు, నిర్మాణ కార్మికులకు రూ.3 వేలు, చర్మకారులు, అసంఘటిత కార్మికులకు తలా రూ.2 వేలు, వీధి వ్యాపారులకు రూ.2 వేలు, కళాకారులు, కళా బృందానికి రూ.3 వేలు చొప్పున అందజేస్తామని సీఎం తెలిపారు. రుణ వాయిదాల చెల్లింపులకు మూడునెలలు విరామమిచ్చారు. ఈ మూడునెలల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రెండు నెలలు ఉచిత రేషన్‌ అందజేస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement