Karnataka government
-
కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీట్రాప్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం.. ఇవాళ మళ్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై శాసనసభలో చర్చించాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ ఒక్కసారిగా అలజడి రేగింది. ఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. ప్రతిగా.. కాంగ్రెస్ సభ్యులు బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.The #KarnatakaAssembly has passed a contentious bill that proposes providing 4% reservation to the Muslim community in contracts awarded by the state government. Opposing the move, the BJP MLAs stormed the well of the House and chanted slogans against the ruling Siddaramaiah… pic.twitter.com/0vVrJdpt9f— News9 (@News9Tweets) March 21, 2025పబ్లిక్ కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమంటున్న బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. మరోవైపు సభలో ఇవాళ జరిగిన పరిణామాలపై బీజేపీ ఎమ్మెల్యే భరత్‌శెట్టి స్పందించారు. ‘‘హనీ ట్రాప్ వ్యవహారంపై చర్చించకుండా.. ముస్లిం కోటా బిల్లును ప్రవేశపెట్టడంపైన సీఎం సిద్ధరామయ్య దృష్టి పెట్టారు. అందుకే మేం నిరసన తెలిపాం. అంతేగానీ మేము ఎవరికీ హాని తలపెట్టలేదు’’ అని అన్నారాయన.ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదు: సీఎం సిద్దుఇంకోవైపు ముస్లిం కోటా నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకుంది. సామాజిక న్యాయం, మైనారిటీలకు ఆర్థిక సాధికారకత కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah).. ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు.ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయిలోని నాయకులు కూడా ఉన్నారంటూ బాంబ్ పేల్చారాయన. అయితే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ వలపు వల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ హస్తమే ఉందని, కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. -
కారుణ్య మరణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి బెంగళూరు: తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక, వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం కర్ణాటకలో ఈ చారిత్రక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. మొండి వ్యాధి బాధితులు, మరణాంతక రోగగ్రస్తులు లేదా కోమా స్థితిలో ఉన్న వారికి, ఎలాంటి చికిత్స అందించినా బతకడం అసాధ్యం అనే వారికి ఈ ఆదేశాల ద్వారా గౌరవప్రదమైన మరణానికి అవకాశం లభించింది. కారుణ్య మరణానికి అవకాశం కల్పించేందుకు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్యులు కారుణ్య మరణానికి ఆ రోగి అర్హుడా కాదా అనే విషయాన్ని ధ్రువీకరిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వైద్య నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ తొలుత సంబంధిత రోగి ఎలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండబోదని ధ్రువీకరించిన తర్వాతే కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఆ రోగి కుటుంబ సభ్యుల వినతి మేరకు మాత్రమే వైద్యుల బృందం ఈ పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతించాక రోగి లైఫ్ సపోర్టు సిస్టమ్‌ను తొలగిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. -
యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు
'కేజీఎఫ్' ఫేమ్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఊహించని వివాదంలో ఈ చిత్రబృందం చిక్కుకుంది. అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అనేలా కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్‌పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములని గెజిట్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడి పర్స్ కొట్టేశారు)కానీ వ్యాపార అవసరాల కోసం హెచ్ఎంటీ భూమిని అద్దెకు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'టాక్సిక్' చిత్రబృందం కొన్నిరోజుల కోసమా అని లీజుకు తీసుకుంది. కానీ సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలొచ్చాయి. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ శాటిలైట్ ఫొటోలు తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అనుమతి లేకుండా చెట్లను నరికడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.ఇది జరిగి కొన్నిరోజులు అవుతుండగా కర్ణాటక అటవీశాఖ ఇప్పుడు సీరియస్ అయింది. టాక్సిక్ మూవీ నిర్మాతలపై కేసు పెట్టింది. అలాగే కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడీ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపీలోని విరూపాక్ష ఆలయంలో చారిత్రక స్తంభాన్ని తవ్వినట్లు వచ్చిన ఆరోపణలపై భారత ఆర్కియోలాజికల్ సర్వే కర్ణాటక దేవదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో జెండా ఏర్పాటు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. చారిత్రక ప్రదేశంలో తవ్వే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆక్షేపిస్తోంది. హంపీ విరూపాక్ష ఆలయ సముదాయం కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే రక్షణలో ఉందని, అనుమతులు లేకుండా ఆలయాన్ని మూసివేయడం, స్తంభాల మధ్య రంధ్రాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని దేవదాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారికి ఇచ్చిన నోటీసులో భారత ఆర్కియోలాజికల్ సర్వే పేర్కొంది.చారిత్రక కట్టడాల రక్షణ చట్టం (AMASR Act)లోని సెక్షన్ 30ను ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధాని నగరంగా ఉన్న హంపిలోని స్మారక కట్టడాల సమూహంలో విరూపాక్ష ఆలయం భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో విజయనగర రాజు రెండవ దేవరాయ నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1986లో యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి వివిధ స్మారక చిహ్నాలను కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే పరిరక్షిస్తోంది. -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే
Updates: ►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత ప్రమాణ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొఫైల్ ►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం ►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, ►2013 నుంచి 18 వరకు సీఎం, ►13సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్. ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక ►కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫైల్ ► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ ►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు ►సాతనౌర్ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ ►2008లో కనకపుర నుంచి గెలుపు ►2008, 2013, 2018లో హ్యాట్రిక్ విక్టరీ ►2014 నుంచి 18 వరకు విద్యుత్‌శాఖ మంత్రి ►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర ►దేశంలోనే ధనిక రాజకీయనేత ►కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్ ►కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే కేజీ జార్జ్ ప్రొఫైల్ ►సర్వగ్న నగర్ నియోజకవర్గం, క్రిస్టియన్ నేత, 5 సార్లు ఎమ్మెల్యే ►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక ►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు కేహెచ్ మునియప్ప ప్రొఫైల్ ► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ ► చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్ ► రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నిర్వహణ ► ఏడుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక ► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం జీ పరమేశ్వర ప్రొఫైల్ ►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం ►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే ►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు ►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు 2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు ►వీరప్పమొయిలీ, ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్లో మంత్రిగా విధులు మాజీ డిప్యూటీ సీఎం, ఎంబీ పాటిల్ ప్రొఫైల్ ►లింగాయత్ నేత, బబలేశ్వర్ నియోజకవర్గం. ►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ► కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి. సతీశ్ జర్కిహోళి ప్రొఫైల్ ►ఎస్టీ నేత(వాల్మికీ నాయక) ► గోకక్ నియోజకవర్గం. ►నాలుగుసార్లు ఎమ్మెల్యే, ►రెండుసార్లు ఎమ్మెల్సీ, ►కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రియాంక్ ఖర్గే ప్రొఫైల్ ►దళిత నేత, ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ►చిత్తాపూర్ నియోజకవర్గం. ►మూడుసార్లు ఎమ్మెల్యే. ►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ►చామరజ్పేట్ నియోజకవర్గం ►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక ► మాజీ హజ్, వక్ఫ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి ►ఓబీసీ నేత ►బీటీఎమ్ లేఔట్ నియోజవకర్గం ►8సార్లు ఎమ్మెల్యే, ►మూడు సార్లు మంత్రిగా సేవలు. ►కర్ణాటక మాజీ హోంమంత్రి #WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1 — ANI (@ANI) May 20, 2023 Karnataka swearing-in ceremony | Karnataka Deputy CM-designate DK Shivakumar welcomes Tamil Nadu CM MK Stalin and other DMK leaders at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/TS3uVNcydI — ANI (@ANI) May 20, 2023 ►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్‌హాసన్, శవరాజ్ కుమార్ హాజరయ్యారు. Actor and Makkal Needhi Maiam chief Kamal Haasan attends the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/mrTmOo7vU4 — ANI (@ANI) May 20, 2023 ►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. #WATCH | Karnataka Deputy CM-designate DK Shivakumar arrives at Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony of the newly-elected Karnataka Government will begin shortly. pic.twitter.com/sQHEch9Rd8 — ANI (@ANI) May 20, 2023 శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్‌పథ్– 10లో ఉంటున్న రాహుల్ గాంధీని వెళ్లి కలిశారు. కేబినెట్లోకి 20 మంది? గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్‌లు పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల సీఎంల రాక ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్ బన్సల్ భేటీ -
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
‘బొమ్మై’ ప్రభుత్వంలో ‘అవినీతి’ అందలం.. ప్రధానికి 13,000 స్కూల్స్ ఫిర్యాదు!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ సుమారు 13,000 పాఠశాలలు.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాయి. ‘ద అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్’, ‘ద రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశాయి. విద్యాసంస్థలకు గుర్తింపు పత్రం జారీ కోసం రాష్ట్ర విద్యాశాఖ లంచం డిమాండ్ చేసిన ఘటనను పరిశీలించాలని కోరాయి. ‘అశాస్త్రీయమైన, అహేతుకమైన, వివక్షణ లేని, పాటించని నిబంధనలు అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. భారీ అవినీతి జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, వాటిని పక్కనపెట్టేశారు. బీసీ నగేశ్ రాజీనామా చేయాలి. మొత్తం వ్యవస్థలోని దుర్భర పరిస్థితులను అర్థం చేసుకోవటం, సమస్యలను పరిష్కరించటంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. పాఠశాలల బడ్జెట్‌కు ఇద్దరు బీజేపీ మంత్రులు తీరని నష్టం చేకూరుస్తున్నారు. మరోవైపు.. వారి విద్యాస్థల్లోకి భారీగా పెట్టుబడి దారులను ఆహ్వానిస్తూ విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.’ అని లేఖలో పేర్కొన్నాయి పాఠశాలల యాజమాన్యాలు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం సూచించిన పుస్తకాలు పాఠశాలలకు చేరలేదని అసోసియేషన్స్ ఆరోపించాయి. తల్లిదండ్రులు, విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆచరణాత్మకంగా అమలు చేయగల నిబంధనలను రూపొందించి.. నియంత్రణలను సరళీకరించడానికి విద్యాశాఖ మంత్రికి శ్రద్ధ లేదని పేర్కొన్నాయి. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని కర్ణాటక విద్యాశాఖ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరాయి. ఇదీ చదవండి: Jayalalitha Death Mystery: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు -
హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కిందకు రాదు: కర్ణాటక ప్రభుత్వం
సాక్షి, బెంగుళూరు: భారత్‌లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే విద్యా సంస్థల్లో క్రమశిక్షణ పరంగా హిజాబ్‌పై కొన్ని రకాల పరిమితులున్నాయని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ దాఖలైన విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందన్న వాదన సరైంది కాదన్నారు. అయితే ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హిజాబ్ ధరించే హక్కుని రాజ్యాంగం కల్పించిందన్నారు. చదవండి: హిజాబ్ కాకున్నా చద్దర్‌తో అయినా కప్పుకోండి! దీని ప్రకారం కొన్ని సంస్థల్లో సహేతుకమైన కారణాలతో హిజాబ్ ధరించకూడదని చెప్పే అధికారాలు ఉంటాయని తన వాదనల్ని వినిపించారు. ఫుల్ బెంచ్ ఈ వారంలో విచారణను పూర్తి చేయనుంది. హిజాబ్ పిటిషన్‌దారుల్లో ఒకరైన హజ్రా షిఫా అల్లరిమూకలు తన సోదరుడిపై దాడికి దిగారని, తమ ఆస్తుల్ని ధ్వంసం చేశారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే దాడులకు దిగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సంఘ్ పరివార్ పనేనని ఆమె ఆరోపించారు. చదవండి: హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం -
పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Karnataka CM Announce Karnataka Ratna Award To Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ నటించినవి మొత్తం 29 చిత్రాలే అయినా తన మరణాన్ని జీర్ణించుకోలేని తన అభిమానులు 21 మంది గుండెలు ఆగిపోయాయి. తన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు తనకు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. 46 ఏళ్ల వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కర్ణాటకలో ఆయన నామస్మరణ జరుగుతుంది. ప్రతి రోజూ లక్షలాది మంది వచ్చి పునీత్ రాజ్‌కుమార్ సమాధిని దర్శించుకుంటున్నారు. అంతే కాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రేమ జంటలు ఆయన సమాధి దగ్గర పెళ్లి చేసుకుంటున్నారంటే కర్ణాటకలో పునీత్ పేరు ప్రఖ్యాతులు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పునీత్ ఉన్నా లేకపోయినా తను చేస్తున్న సేవా కార్యక్రమాలు మాత్రం ఆగకూడదని కొన్నేళ్ల కిందే తన ట్రస్టులో 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దీని తర్వాత అక్కడి ప్రజలకు పునీత్‌పై అభిమానం మరింత పెరిగింది. ఇలాంటి మంచి మనిషిని దేవుడు ఎందుకు ఇంత చిన్న వయసులోనే తీసుకెళ్ళిపోయాడు అంటూ కన్నడిగులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. అత్యుత్తమ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల అభిమానం పొందిన అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చే పురస్కారం కర్ణాటక రత్న. ఇది కన్నడిగులకు మాత్రమే ఇచ్చే పురస్కారం అని తెలుస్తుంది. అయితే దీనితో పాటు పునీత్‌కు బసవ శ్రీ బిరుదు కూడా ఇవ్వాలని అభిమానులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. దాని గురించి కూడా ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం. -
లాక్డౌన్ ఎత్తివేత?: అన్‌లాక్ వైపు ప్రభుత్వం మొగ్గు
బనశంకరి: రాష్ట్రంలో వారం నుంచి కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అన్‌లాక్ గురించి యోచిస్తోంది. రెండో దశ కోవిడ్ వికటాట్టహాసం చేసి భారీగా ప్రాణాలను బలిగొంటున్న తరుణంలో మే 10 నుంచి రెండో లాక్డౌన్ ఆరంభమైంది. జూన్ 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఒకనెల రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోగా కరోనా మెల్లగా అదుపులోకి వస్తోంది. బెంగళూరు కూడా కరోనా పీడ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అన్‌లాక్‌కు సన్నాహాలు చేస్తోంది. దిగ్బంధం వల్ల పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. దీంతో అన్‌లాక్ చేయడం యడియూరప్ప సర్కారుకు అనివార్యమైంది. జూన్ 7 నుంచి దశలవారీగా దిగ్బంధాన్ని సడలించి ఆర్థిక కార్యకలాపాలకు పచ్చజెండా ఊపడం తప్ప గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు సర్కారుకు సూచించారు. పొడిగించాలని కమిటీ నివేదిక జూన్ 7వ తేదీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలి అనే అంశాలతో కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే ఎన్నిరోజులు, అన్‌లాక్ ఎలా ఉండాలి తదితర అంశాలను పేర్కొంది. ఈ నివేదిక ను ఆరోగ్య మంత్రి సుధాకర్‌కు సమితి అందజేసింది. నివేదికను కృష్ణాలో సీఎం యడియూరప్పకు ఆయన అందజేశారు. మరో 14 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని సమితి నివేదికలో సిఫార్సు చేసింది. దీని గురించి ఇరువురూ చర్చించారు. జూన్ 4, 5 తేదీల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. 2-3 వేలకు తగ్గినప్పుడే: అశోక్ కోవిడ్ సలహాసమితి నివేదిక ఆధారంగా లాక్డౌన్ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ కేసుల సంఖ్య ఆధారంగా తీర్మానం చేస్తామని అన్నారు. బెంగళూరులో నిత్యం 500 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదు కావాలి, రాష్ట్రంలో వెయ్యి, మూడు వేల కేసుల స్థాయికి తగ్గినప్పుడే లాక్డౌన్ సడలింపుపై నిర్ణయానికి వస్తామన్నారు. దొడ్డబళ్లాపుర వద్ద అత్యాధునిక వసతులతో కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించామని, ఇందులో 100 పడకలు ఉంటాయని, ఐసీయూ, వెంటిలేటర్ వసతి ఉందని తెలిపారు. -
1,250 కోట్లతో కరోనా ప్యాకేజీ.. పలు వర్గాలకు సాయం
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పలు వర్గాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.1,250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తక్షణమే అర్హులకు ఆర్థికసాయం అందిస్తామని సీఎంయడియూరప్ప తెలిపారు. పండ్లు, కూరగాయల రైతులకు ప్రతి హెక్టార్‌కు రూ.10 వేలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.3 వేలు, నిర్మాణ కార్మికులకు రూ.3 వేలు, చర్మకారులు, అసంఘటిత కార్మికులకు తలా రూ.2 వేలు, వీధి వ్యాపారులకు రూ.2 వేలు, కళాకారులు, కళా బృందానికి రూ.3 వేలు చొప్పున అందజేస్తామని సీఎం తెలిపారు. రుణ వాయిదాల చెల్లింపులకు మూడునెలలు విరామమిచ్చారు. ఈ మూడునెలల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రెండు నెలలు ఉచిత రేషన్ అందజేస్తామని చెప్పారు. -
పార్కింగ్ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో వాహనం కొనడం ఒకెత్తయితే, దాని పార్కింగ్‌కు స్థలం దొరకడం మరొక ఎత్తు. ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ స్థలం కొరతతో నగరవాసులు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రజలు కొత్తవాహనాలను కొనే ముందు వాటిని పార్కింగ్‌కు సొంత స్థలం ఉందని ప్రమాణపత్రం ఇవ్వాలని తీర్మానించింది. స్మార్ట్‌పార్కింగ్ వ్యవస్థను అమలు చేయనుంది. చదవండి: (రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం) నగరమంతటా పార్కింగ్ ఫీజులు సీఎం విధానసౌధలో ఉన్నతాధికారులతో పార్కింగ్ సమస్యపై చర్చించారు. విధానాల రూపకల్పన కోసం కమిటీని వేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు మాదిరిగా నగరమంతటా ప్రధాన స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు నిర్ణీత ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలను పార్కింగ్ ప్రదేశాలుగా వాడుకోవాలని చర్చించారు. కమిటీ నివేదిక వచ్చాక పార్కింగ్ ప్రదేశాలను ఖరారు చేస్తారు. -
బెంగళూరు ముందడుగు
కర్ణాటక రాష్ట్రం మహిళల సౌకర్యం కోసం ఒక వినూత్న ప్రయోగం చేసింది. పాతబడిపోయిన ఆర్టీసీ బస్సులను వాష్‌రూములుగా మార్చింది. వీటికి ‘స్త్రీ టాయిలెట్’ పేరు పెట్టింది. ఒక్కో బస్సులో మూడు వెస్టర్న్, మూడు ఇండియన్ టాయిలెట్లు ఉంటాయి. ముఖం కడుక్కోవడానికి వీలుగా వాష్ బేసిన్లు కూడా ఉన్నాయి. చంటి పిల్లల తల్లులకు ఉపయోగకరంగా పిల్లలకు పాలివ్వడానికి, డయాపర్లు మార్చడానికి వీలుగా మరొక అమరిక కూడా ఉంది. వీటితోపాటు పీరియడ్స్ సమయంలో ఉన్న మహిళలకు నాప్కిన్ వెండింగ్ మెషీన్ (డబ్బులు వేస్తే నాప్కిన్ వస్తుంది), నాప్కిన్ ఇన్సినేటర్ (భస్మం చేసే మెషీన్) కూడా ఉంది. ఈ బస్సు నిర్వహణకు అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసం బస్సు పై భాగంగా సోలార్ ప్యానెల్ ఉంది. బస్సులోపలికి వెళ్లినప్పుడు లైట్లు వేసి, బయటకు వచ్చేటప్పుడు ఆపకుండా మర్చిపోవడం వంటి ఇబ్బంది లేకుండా సెన్సార్లు ఏర్పాటు చేశారు. మనిషి లోపలికి వెళ్లినప్పుడు లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. మనిషి బయటకు రాగానే ఆరిపోతాయి. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ బస్సులను మొదట బెంగళూరు నగరంలోని మెజిస్టిక్ బస్‌స్టాండ్‌లో పెట్టింది. మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. బస్సుగా నడపడానికి వీల్లేని, తుక్కు ఇనుము కింద అమ్మేయాల్సిన పరిస్థితి లో ఉన్న బస్సులను ఇలా ఉపయుక్తంగా మలిచింది కర్ణాటక ప్రభుత్వం. బస్సు లోపల పై ఏర్పాట్ల కోసం ఒక్కో బస్సుకు పన్నెండు లక్షలు ఖర్చయింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అథారిటీ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇది విజయవంతమై తీరుతుందని ఉద్యోగినులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాన్ని మన తెలుగమ్మాయి సుష్మ గత ఏడాది హైదరాబాద్‌లో చేపట్టింది. ఆమె ఆటోలో నమూనా మొబైల్ టాయిలెట్‌ను తయారు చేసి, పాతబడిన బస్సును ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ రిపోర్టు కూడా అందచేసింది. సుష్మ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి, ఇండియాకు వచ్చిన తర్వాత సమాజానికి తనవంతుగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఈ రకంగా నిర్వర్తిస్తు్తన్నట్లు చెప్పింది. కోఠీ వంటి మార్కెట్ ప్రదేశాల్లో టాయిలెట్లు లేక మహిళలు ఇబ్బంది పడడం తనకు అనుభవపూర్వకంగా తెలుసని, ఆ సమస్యకు పరిష్కారంగా మొబైల్ టాయిలెట్లకు రూపకల్పన చేశానని చెప్పిందామె. సుష్మ తన సొంతూరు కోదాడలో మొబైల్ టాయిలెట్ ఆటోను జనానికి పరిచయం చేసింది. సుష్మ ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించే లోపు కటక ఓ ముందడుగు వేసింది. అయితే ఇందులో తొలి రికార్డు మాత్రం తెలుగమ్మాయి సుష్మదే. -
సీఏఏ : యూపీ దారిలో కర్ణాటక
సాక్షి, బెంగళూరు : నిరసనల సందర్భంగా ఎవరైనా ప్రజా ఆస్థుల విధ్వంసానికి పాల్పడితే జరిగిన నష్టాన్ని వారి వద్దనుంచే వసూలు చేసే యూపీ తరహా చట్టాన్ని కర్ణాటకలో కూడా తెస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అశోకా గురువారం వెల్లడించారు. యూపీలో తెచ్చిన నూతన చట్టం ప్రకారం ఇప్పటికే ఆందోళనకారుల ఆస్థులు జప్తు చేస్తూ చాలా మందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిరసనల సందర్భంగా యూపీలో నెలకొన్న హింసాత్మక పరిస్థితే మంగూళూరులో కూడా ఉత్పన్నమైనందున యూపీ ప్రభుత్వ మార్గంలో నడవాలని నిర్ణయించినట్టు మంత్రి గురువారం తెలిపారు. ఈ విషయంపై మరో మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. నష్టాన్ని ఆందోళనకారులకు జరిమానా విధించి భర్తీ చేయడమే కాకుండా వారిపై గూండా చట్టం ప్రకారం కేసులు పెట్టాలని, ఇలా అయితేనే వ్యవస్థీకృత నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కన్నడ బీజేపీ ఎంపీ శోభా కరాండ్లేజ్ మాట్లాడుతూ.. పౌరులు శాంతియుతంగా నిరసన తెలపాలి. అంతేకానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం జరిగిన నష్టాన్ని భరించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, గత వారం సీఏఏకు వ్యతిరేకంగా మంగుళూరులో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆయా సంఘటనలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. దాదాపు 1500 నుంచి 2వేల మంది ఆందోళనకారులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పోలీస్ స్టేషన్ సమీపంలో గుమిగూడారు. పోలీసులు ఎంత చెదరగొట్టినా చెదరకపోగా, పోలీసులపైనే రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో మృతులకు నష్టపరిహారంగా ముఖ్యమంత్రి యడ్డియూరప్ప చెరో రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకొని మృతుల తప్పిదం లేదని విచారణలో తేలితేనే పరిహారం ఇస్తామని తేల్చిచెప్పారు. అనంతరం కాల్పుల ఘటనపై సీఐడీ, మెజిస్ట్రీయల్ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. ముసుగు వేసుకున్న పురుషులు సీసీకెమెరాలను ధ్వంసం చేయడం, రోడ్లను దిగ్భంధం చేయడం, వ్యాన్లను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి వీడియో ఇప్పటికే సేకరించారు. చదవండి :సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం -
చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...
సాక్షి, బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ ఈ ఏడాది మార్చి 25న రిట్ వేశాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మహమ్మద్ నవాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్) యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు వేసిన విద్యార్థికి రెండు వారాల్లోపు రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని కోర్టు ప్రత్యేకంగా సూచించింది. కోర్టు తీర్పు అనంతరం బాలుడు మంజునాథ్ మాట్లాడుతూ తన అర్జీపై హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నాడు. తన పోరాటానికి తండ్రి దేవరాజ్ సహకారం ఇవ్వడం వల్లే విజయం సాధించానని చెప్పాడు. -
ఆకాశానికి ఎదిగిన గిరి
ప్రఖ్యాత నటుడు, నాటకకర్త, దర్శకుడు గిరిష్ కర్నాడ్ (81) సోమవారం బెంగళూరులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబం తెలిపింది. కర్నాడ్ భార్య సరస్వతి గణపతి వైద్యురాలు. కుమారుడు రఘు రచయిత, జర్నలిస్టు. కుమార్తె షల్మలి ఆరోగ్యరంగంలో పని చేస్తున్నారు. మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. ఇంట్లో మరాఠి, కన్నడ... రెండు భాషలు మాట్లాడేవారు. బిఎస్సీ మేధమేటిక్స్ చదివినప్పటికీ కళారంగంలో తన అభిరుచిని గమనించిన కర్నాడ్ నాటకాల ద్వారా, సినిమాల ద్వారా గుర్తింపు పొందారు. జానపద, పౌరాణిక పరంపరను ఆధునికతతో సమ్మిళతం చేసి కొంత మార్మిక ధోరణిలో సాగిన కర్నాడ్ నాటక శైలి విశేష ఖ్యాతి సాధించి పెట్టింది. ప్రఖ్యాత కన్నడ రచయిత బి.వి.కారంత్‌తో కలిసి నాటకాల్లో, సినిమాల్లో కర్నాడ్ విశేష కృషి చేశారు. పారలల్ సినిమాలు ఊపందుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. శ్యాం బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంలో సాగే ‘అంకుర్’ కథలో కర్నాడ్ కనిపిస్తారు. ‘నిషాంత్’, ‘మంథన్’, ‘స్వామి’ ఆయన నటించిన ఇతర సినిమాలు. కర్నాడ్ చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందాయి. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. 1998లో ఆయనకు సాహిత్యంలో ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘జ్ఞానపీuЇ’ దక్కింది. కర్నాడ్ మృతి వార్త వెలువడిన వెంటనే కర్నాటక ప్రభుత్వం సోమవారం రోజు ప్రభుత్వ సెలవును ప్రకటించింది. మూడురోజుల సంతాప దినాలను పాటించాలని కోరింది. కర్నాడ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినా కర్నాడ్ చివరి కోరిక మేరకు కర్నాడ్ కుటుంబం సున్నితంగా తోసిపుచ్చింది. అభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలిరావడానికి కూడా అంగీకరించలేదు. కొంతమంది నాటకరంగ మిత్రులు మాత్రమే అంతిమ నివాళి అర్పించినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ దహనవాటిక ద్వారా గిరిష్ కర్నాడ్ అంతిమ సంస్కారాలు ముగిశాయి. నటుడుగా, నాటకకర్తగా, దర్శకుడిగా, చైతన్యకారునిగా, బుద్ధిజీవిగా తన కాలపు తరాలకే కాదు రాబోవు తరాలకు కూడా గిరిష్ కర్నాడ్ స్ఫూర్తిమంతంగా నిలిచాడు.81 సంవత్సరాల వయసులో జూన్ 10న ఆయన ప్రపంచమనే ఈ నాటకరంగాన్నిశాశ్వతంగా విడిచిపెట్టి అభిమానుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తెలుగువారికి నటుడుగా పరిచయం కావడానికి ముందే గిరిష్ కర్నాడ్ తెలుగు సినిమాల కోసం పని చేశాడు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ‘అనుగ్రహం’ సినిమాకు బెనగళ్‌తో పాటు ఆయన కూడా స్క్రీన్ ప్లే రాశాడు. వాణిశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అభిరుచి ఉన్న ప్రేక్షకులు నేటికీ మర్చిపోలేదు. నిజానికి కర్నాడ్– తాను నాటకం రాయగలడని, నటించగలడని, దర్శకత్వం వహించగలడని తెలియకుండా ఆయా దారుల గుండా ప్రయాణించి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, ఎత్తులకు ఎదిగాడు. కర్నాడ్‌కు ఇంగ్లిష్ కవి కావాలని ఉండేది. లండన్ తన శాశ్వత నివాస నగరి అని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాడు. లండన్‌లో చదువుకోవడానికి స్కాలర్షిప్ రావడం చాలా పెద్ద విషయం కనుక ఎక్కువ మార్కులు పొందడం ఒక్కటే మార్గం అనుకుని, తనకు పెద్దగా ఇష్టం లేని గణితంలో డిగ్రీ చేసి ఆశించినట్టుగా స్కాలర్షిప్ పొందాడు. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ నాటక రంగంతో పరిచయం ఉన్నవారు కావడం వల్ల తెలియకుండానే పుస్తకాల పట్ల, కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఉత్తర కర్ణాటకకు సాంస్కృతిక క్షేత్రమైన ‘ధార్వాడ్’లో ఇంటర్, డిగ్రీ చదవడం వల్ల, ఆ సమయంలో అక్కడికి వచ్చే ప్రఖ్యాత సాహిత్యకారులతో పరిచయం ఏర్పడటం వల్ల కర్నాడ్‌కు సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ రోజుల్లో ఊరూరా తిరిగి యక్షగానాలను ప్రదర్శించే బృందాలతో ప్రభావితం చెందాడు. సి.రాజగోపాలచారి మహాభారతానికి రాసిన వ్యాఖ్యాన ఉద్గ్రంథం చదివాక ఒకరోజు హటాత్తుగా ఉద్ధృతిగా ఆయన రాసిన తొలి నాటకమే ‘మానిషాద’. కాలేజీ ముగిశాక లండన్ వెళ్లే ముందు ఈ కన్నడ నాటకం రాసి, దాని సంగతి వదిలి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతూ అక్కడి ఇంగ్లిష్ కార్యకలాపాలలో మునిగాడు కర్నాడ్. ఇంగ్లిష్ కవిగా, నాటకకారునిగా గుర్తింపు పొందాలని తపన పడుతున్నప్పుడు ‘మా నిషాద’ కన్నడలో అచ్చయ్యి పేరు తెచ్చింది. లండన్‌కు పంపుతూ తండ్రి ‘నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి’ అని షరతు పెట్టడం గుర్తొచ్చి, భారతంలో ‘యయాతి’ కూడా తన కుమారులకు ‘మీ యవ్వనం ఇవ్వండి’ అని షరతు పెట్టాడు కదా అనుకుని లండన్‌లో ఉండగానే రాసిన మరో నాటకం ‘యయాతి’. కన్నడంలో రాసిన ఆ నాటకం గిరిష్ కర్నాడ్‌కు చాలా ఖ్యాతి తెచ్చిపెట్టింది. దాంతో కర్నాడ్ ‘ఇక ఇంగ్లిష్ నేలకు సెలవు... నా సాధనంతా నా మాతృభాషలో చేసుకుంటాను... నా సాహిత్యకృషి అంతా నా దేశంలోనే సాగాలి’ అనుకుని ఇక్కడకు వచ్చేశాడు. భారతదేశానికి వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, మద్రాసు శాఖలో పని చేస్తూ ఉండగా ప్రఖ్యాత అనువాదకుడు ఏ.కె.రామానుజన్ కర్నాడ్‌కు షికాగో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేసే అవకాశం కల్పించాడు. అంతే కాదు ఒక తాజా నాటకం రాయమని కర్నాటక ప్రాంతంలో ఉన్న ఒక జానపద కథను సూచించాడు. ఆ కథ ఆధారంగా కర్నాడ్ రాసిన నాటకమే ‘నాగమండల’. తనను పట్టించుకోని మొగునికి మందు పెడదామని ఒక ఇల్లాలు అనుకుని పాలల్లో మందు కలిపితే పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి ఇల్లాలితో కూడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. ఈ నాటకమే కాదు చరిత్ర పట్ల, చరిత్రను చూడాల్సిన చూపు పట్ల అవగాహన ఉన్న కర్నాడ్ ‘తుగ్లక్’, ‘టిప్పు సుల్తాన్’ నాటకాలు రాసి దేశంలో, విదేశాలలో గుర్తింపు పొందాడు. వద్దనుకుంటే పుట్టిన బిడ్డ గిరిష్ కర్నాడ్ తల్లికి మొదటి భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు. రెండవ పెళ్లి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. గిరిష్ కర్నాడ్ కడుపులో పడినప్పుడు ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కదా, అబార్షన్ చేయించుకుంటాను అని అనుకుందట తల్లి. అబార్షన్ కోసం ఒక డాక్టరమ్మ క్లినిక్‌కు కూడా వెళ్లిందట. అయితే అదృష్టవశాత్తు ఆ డాక్టరమ్మ ఆ రోజు క్లినిక్‌కు రాలేదు. లీవు పెట్టింది. మధ్యాహ్నం వరకూ కూచున్న కర్నాడ్ తల్లి విసుగొచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించుకోవాలనే మూడ్ పోవడంతో కర్నాడ్ పుట్టాడు. ‘ఈ సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. నేను పుట్టకుండా ఈ లోకం ఎలా ఉంటుంది ఎలా ఉండేది అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే’ అని నవ్వుతాడు కర్నాడ్. సారస్వత బ్రాహ్మణులు గిరిష్ కర్నాడ్ కుటుంబం సారస్వత బ్రాహ్మణ కుటుంబం. పూర్వం సరస్వతి నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన బ్రాహ్మణులు కనుక తాము సారస్వత బ్రాహ్మణులు అని వీరు అంటారు. వీరు ఆది నుంచి ఉన్నత విద్యావంతులు. బ్రిటిష్ హయాంలో మంచి హోదాలలో పని చేశారు. కర్నాటకలోని ధర్వాడ్ సమీపంలో ఉన్న సారస్వత్పూర్లో 1950లలోనే యాభై బంగళాలలో సారస్వత బ్రాహ్మణులు ఒక అగ్రహారంగా జీవించేవారు. కర్నాడ్‌కు అక్కడ ఒక సొంత బంగ్లా ఉంది. కర్నాడ్ తల్లి కృష్ణాబాయి. తండ్రి డాక్టర్ రఘునాథ్ కర్నాడ్. తల్లి బాల వితంతువు కాగా ఆమె నర్సుగా పని చేస్తూ డాక్టర్ అయిన రఘునాథ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె పెద్ద కొడుకు తన సవతి కొడుకని చాలా ఏళ్ల వరకూ తెలియకుండా తల్లి తమను పెంచిందని కర్నాడ్ చెప్పారు. కన్నడంలో సంచలనం సృష్టించిన నవల ‘సంస్కార’ (రచన: యు.ఆర్.అనంతమూర్తి) ఆధారంగా తీస్తున్న సినిమాలో మొదటిసారి ప్రధానపాత్రలో నటించాడు కర్నాడ్. దీనికి దర్శకత్వం వహించిన పఠాభి తెలుగువాడు కనుక కర్నాడ్‌ను స్క్రీన్ ఆర్టిస్ట్‌ను చేసిన ఘనత తెలుగువారిది అని సంతోషించాలి. ఆ తర్వాత శ్యాం బెనగళ్‌తో ఏర్పడిన పరిచయం త్వరత్వరగా కర్నాడ్‌ను హిందీ భాషల్లో ఇతర భారతీయ భాషల్లో వ్యాప్తి చెందేలా చేసింది. దేశంలో క్షీర విప్లవం తెచ్చిన కురియన్ అనుభవాల ఆధారంగా బెనగళ్ తీసిన ‘మంథన్’లో కర్నాడ్ హీరోగా నటించి చాలామందికి గుర్తుండిపోయాడు. జంధ్యాల దర్శకత్వంలో ‘ఆనందభైరవి’లో నటించి ‘శంకరాభరణం’ జె.వి.సోమయాజులు తర్వాత అంతటి పేరు పొందిన నటుడు కర్నాడ్. తనకు వచ్చిన నాట్యానికి వారసులు లేకుండా పోతారేమోనన్న చింతలో ఉండే నాట్యాచారునిగా, పట్టిన పట్టు కోసం చివరకు కపాలమోక్షం చేసుకునే ఆత్మాభిమానిగా కర్నాడ్ నటన తెలుగువారిని కట్టిపడేసింది. సాహిత్యం తెలిసినవాడు సినిమాల్లోకి వెళితే ఏం చేస్తాడో గిరిష్ కర్నాడ్ కూడా అదే చేశాడు. కన్నడంలో ఎస్.ఎల్.ౖభైరప్ప రాయగా విఖ్యాతమైన నవల ‘వంశవృక్ష’ను తొలిసారిగా డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత భైరప్పే రాసిన మరో నవల ‘గోధూళి’ని, మరో నవల ‘కాడు’ను సినిమాలుగా తీశాడు. ‘కాడు’ సినిమా ‘క్షత్రియ పుత్రుడు’ తీయడానికి తనకు ఇన్స్పిరేషన్గా పని చేసిందని కమల హాసన్ ఒక సందర్భంలో చెప్పాడు. ఇక శూద్రకుడు రాసిన విఖ్యాత సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’ను హిందీలో ‘ఉత్సవ్’ పేరుతో తీశాడు కర్నాడ్. శశికపూర్ నిర్మించిన ఈ సినిమా రేఖ, శేఖర్ సుమన్‌లకు చాలా పేరు తెచ్చి పెట్టింది. తన ఆసక్తికి తగిన పనులు చేస్తూ భుక్తికి కమర్షియల్ సినిమాలలో నటించాడు. శంకర్ దర్శకత్వంలోని ‘ప్రేమికుడు’లో ఆయన పోషించిన గవర్నర్ పాత్ర అందరికీ గుర్తు. ‘ధర్మచక్రం’లో వెంకటేశ్‌కు, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చిరంజీవికి కర్నాడ్ తండ్రిగా నటించాడు. హిందీలో ఇటీవల ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందాహై’లలో సల్మాన్ ఖాన్ బాస్‌గా ముఖ్యపాత్ర పోషించాడు. గిరిష్ కర్నాడ్ నటుడే కాదు నటగురువు కూడా. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపాల్‌గా ఉంటూ నసిరుద్దిన్ షా వంటి నటులకు పాఠాలు చెప్పాడు. విద్యార్థిగా ఉన్న నసిరుద్దీన్ షా ప్రిన్సిపాల్‌గా ఉన్న కర్నాడ్ మీద తోటి విద్యార్థులతో కలిసి సమ్మెకు దిగడం ఆనాటి ఒక ముచ్చట. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్గా ఖ్యాతి గడించడానికి కర్నాడ్ స్థిరం చేసిన ప్రమాణాలే కారణం. కొత్త టాలెంట్‌ను గమనించే కర్నాడ్ తన సినిమాల ద్వారా విష్ణువర్థన్, శంకర్నాగ్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళ్టి విఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ని కూడా కర్నాడే పరిచయం చేశాడు. అయితే సృజనకారుడు సృజన చేసి ఊరుకుంటే సరిపోదని అతనికి సామాజిక బాధ్యత ఉండాలని భావించినవాడు కర్నాడ్. భారతదేశం వెయ్యేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే మతం, కులం అంటూ కొట్టుకుంటూ ఉందని ఆవేదన చెందుతాడు. మతతత్వం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని బాహాటంగా కర్నాడ్ వేదికలెక్కి మాట్లాడాడు. సమాజాన్ని చైతన్యపరిచే ఇంటలెక్చువల్స్‌ని ‘అర్బన్ నక్సలైట్’లుగా ప్రభుత్వ ఏజెన్సీలు వ్యాఖ్యానిస్తుంటే అలాగైతే నేను కూడా అర్బన్ నక్సలైట్‌నే అంటూ మెడలో కార్డు వేలాడేసుకుని తిరిగినవాడు కర్నాడ్. బెదిరింపులు, హేళనల మధ్య తన నిరసన తెలిపే హక్కును కోల్పోని ధైర్యవంతుడు కర్నాడ్. నాటకశాలలో దీపాలు ఆరిపోయాక స్టేజ్ మీద దీపం వెలగాలి. అది బుద్ధికి దారి చూపాలి. సాహిత్యం, సినిమా కూడా చేయాల్సింది అదే. కాని ఇవాళ వెలుతురు ఇవ్వాల్సిన అన్ని కళలకు, సాహిత్య రూపాలకు, ప్రశ్నించే మాధ్యమాలకు నిర్బంధం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, నోరున్నా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని కర్నాడ్ ఆవేదన చెందుతాడు. ధైర్యం లేని జాతి మానసిక సంకుచితానికి గురికాక తప్పదని భావించే కర్నాడ్లాంటి సృజనకారులను స్మరించుకుంటూ ఉండాలంటే సదా వివేచనతో హేతువుతో ప్రజాస్వామిక విలువలతో ముందుకు సాగాలి.అలా చేయగలగడమే ఆయనకు అసలైన నివాళి. – కె -
బాబు నిర్లక్ష్యం..కర్ణాటకకు వరం
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో టీడీపీ సర్కారు ఘోర వైఫల్యానికి ఇదో మచ్చుతునక. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలసంఘం ఆదేశాలను తుంగలో తొక్కుతూ చేపట్టిన మూడు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి నీళ్లు వదిలేందుకు సిద్ధమైనా గుడ్లప్పగించి చూసిన చంద్రబాబు సర్కారు కనీసం అభ్యంతరం కూడా తెలపకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జలాల్లో వాటా ఆధారంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా తాము మూడు ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కు కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలు పంపింది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను పరిశీలించిన సీడబ్ల్యూసీ 2016 నవంబర్ 30న అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. కానీ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తూ ఆ మూడు ప్రాజెక్టులను చేపట్టిన కర్ణాటక సర్కార్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఈ సీజన్లోనే 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కర్ణాటక సిద్ధమైంది. ప్రజాప్రయోజనాలా.. వ్యక్తిగత లబ్ధా? చంద్రబాబు సర్కారు తీరును అలుసుగా చేసుకున్న కర్ణాటక ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపుతూ కృష్ణా జలాల్లో అదనంగా 21 టీఎంసీలను వినియోగించుకునేలా 2016లో షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టులను చేపట్టింది. అయితే ఆ మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించిన సీడబ్ల్యూసీ అందులో లోపాలను గుర్తించి అనుమతి నిరాకరించింది. కానీ కర్ణాటక సర్కార్ దీన్ని తుంగలో తొక్కుతూ మూడు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ సీజన్లో 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కర్ణాటక సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదు. 1996లో హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలో యూడీఎఫ్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలోనే కృష్ణా నదిపై కర్ణాటక ఆల్మట్టిని పూర్తి చేసింది. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పట్లో ఆల్మట్టిని అడ్డుకోలేకపోయారు. తాజాగా ఆల్మట్టిని ఎత్తు పెంచుతున్నది దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కావడం గమనార్హం. కుమారస్వామి సర్కార్‌కు చంద్రబాబు మద్దతు పలుకుతుండటం, దేవేగౌడతో కలసి ఎన్నికల ప్రచారం చేయటాన్ని బట్టి ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది ఏపీలో కృష్ణా ఆయకట్టు ఎడారే.. షిగ్గాన్, సింగటలూరు, అప్పర్ భద్ర ప్రాజెక్టుల ద్వారా ఈ సీజన్ నుంచే కర్ణాటక ప్రభుత్వం కృష్ణా జలాలను ఆయకట్టుకు మళ్లించనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు శరవేగంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఎగువ నుంచి కృష్ణా వరద జలాలు రాష్ట్ర సరిహద్దుకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. ఎగువ నుంచి రాష్ట్రానికి చుక్క కూడా నీరు చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాడూ, నేడూ చంద్రబాబు తీరు వల్లే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని, ఈ పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది. గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్న నేపథ్యంలో తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక, మహారాష్ట్రలు అప్పట్లో కోరాయి. దీంతో కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునేలా గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు తెలంగా>ణ సర్కార్ కూడా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించాయి. కర్ణాటక సర్కార్ కృష్ణా జలాలను కావేరి పరీవాహక ప్రాంతానికి మళ్లించింది. ఈ నేపథ్యంలో పోలవరం జలాలపై 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెల్లదని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎగువ రాష్ట్రాలు ఒక నది నుంచి మరో నది పరీవాహక ప్రాంతానికి జలాలను మళ్లించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956 ప్రకారం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు తాజాగా గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి జలాలను పునఃపంపిణీ చేయాల్సిందిగా కోరాలని నాలుగేళ్లుగా సాగునీటి నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. -
జూరాలకు 2.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై అక్కడి అధికారులతో చర్చించిన కుమార స్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. ఆ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో జూరాలకు... నిజానికి జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం అందులో కేవలం 1.93 టీఎంసీల నీటి నిల్వే ఉంది. పూర్తిగా డెడ్‌స్టోరేజీకి నిల్వలు చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి నీటి విడుదల అవస్యం కావడంతో కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నీటి విడుదలకు ఒప్పించారు. ప్రస్తుతం ఎగువ నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గానూ 18.64 టీఎంసీల నిల్వలున్నాయి. అయితే ఇక్కడ ఎండీడీఎల్ పరిధిలోనే నీరుండటంతో ఆల్మట్టిలో లభ్యతగా ఉన్న 31.58 టీఎంసీల నిల్వల నుంచి కర్ణాటక నారాయణపూర్‌కు నీటి విడుదల చేసి, అటు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి లేక శనివారం నీటి విడుదల మొదలు పెట్టినా, వారం రోజుల్లో నీరు జూరాలకు చేరుతుందన్నారు. ఒక టీఎంసీ నీరు జూరాలను చేరినా జూన్ మొదటి వారం వరకు మహబూబ్‌గనర్ జిల్లా తాగునీటి అవసరాలు తీరినట్టేనని పేర్కొంటున్నారు. -
కలెక్టర్ల భేటీలో కాగ్నా వివాదానికి తెర!
బషీరాబాద్: కాగ్నా నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాద్గిరా– పోతంగల్ దగ్గర కాగ్నా నదిలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలు గురువారం వివాదాస్పదమైన సంగతి విదితమే. సరిహద్దుల విషయంలో బషీరాబాద్ చించొళ్లీ రెవెన్యూ, పోలీసుల మధ్య వాగ్వాదాలతో సమస్య మరింత జఠిలమవ్వడంతో, చివరకు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెకర్లు ఉమర్ జలీల్, జి. వెంకటేశ్ కుమార్ రంగంలోకి దిగారు. శుక్రవారం వివాదాస్పద కాగ్నా నదిలో ఇరువురు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల సరిహద్దు నక్షలు, భూ రికార్డులను పరిశీలించారు. అయితే రెండు రాష్ట్రాల నక్షల ప్రకారం తమకంటే తమకే ఎక్కువ వాటాలు వస్తాయని ఏడీఎస్ఎల్ఆర్ అధికారులు తెలిపారు. వీటితో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇద్దరు కలెక్టర్లు రాజీ మార్గంగా ఉమ్మడి సర్వే చేయించి నదిలో సమాన భూ భాగం పంచుకోవడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న రైతుల పట్టాభూముల బౌండరీలను గుర్తించి, మిగిలిన నదీ భాగంలో రెండు సమాన భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. వెంటనే కలెక్టర్లు, నదిలో కర్ణాటక అధికారులు పాతిన హద్దురాళ్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎక్కడ ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సంయుక్తంగా ప్రకటించారు. నదీ భూ భాగంలో ఇరు ప్రభుత్వాలకు సమాన వాటా తీసుకోవడానికి అంగీకరించామని, ఇక సరిహద్దు సమస్య ఏమీ ఉండదన్నారు. నీళ్లపల్లి దగ్గర అటవీ భూమికి చెందిన సరిహద్దు సమస్యను కూడా త్వరలో తేలుస్తామని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10 నుంచి 30 మీటర్లు చొచ్చుకొచ్చిన కన్నడిగులు... కాగ్నాలో రెండు జిల్లాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్లు నరహరిరావు, జిదగేధర్ ఆధ్వర్యంలో డీజీపీఎస్ శాటిలైట్ సర్వేచేశారు. నదికి ఇరువైపుల ఉన్న కాద్గిరా – పోతంగల్ గ్రామాల రైతుల పట్టా భూముల హద్దులను గుర్తించారు. మిగిలిన నదీ భాగంలో సర్వే చేయగా కర్ణాటక అధికారులు కిలోమీటరు పొడవులో 10 నుంచి 30 మీటర్ల మేర తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు బహిర్గతమైంది. దీంట్లో కొంత మేర తెలంగాణ నదీభాగంలో కన్నడిగులు ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. నదికి ఇరువైపులా ఉన్న హద్దులతో రెండు రాష్ట్రాలకు సమాన భాగాలను గుర్తించి హద్దురాళ్లు పాతారు. కార్యక్రమంలో సేడం రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ బి.సుశీల, గుల్బర్గా ట్రైనీ కలెక్టర్ సుధర్ స్నేహల్‌లొకండే, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మైన్స్ అధికారులు రేణుకాదేవి, రవికుమార్, జియాలజిస్ట్ రామారావు, చించొళ్లీ, బషీరాబాద్ తహసీల్దార్లు పండిత్ బీరాధర్, ఉమామహేశ్వరి, డీఎస్పీలు రామచంద్రుడు, బస్వరాజు రెవెన్యూ, మైన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
టిప్పు సుల్తాన్ జయంతి : కుమారస్వామి వర్సెస్ బీజేపీ
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలా..లేదా అనేది బీజేపీయే తేల్చుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల గురించి తాను ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని, దేశంలో భిన్న వర్గాలు వారికిష్టమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయని మాత్రమే వ్యాఖ్యానించానన్నారు. కాగా టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ఈనెల 10న నిర్వహించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఖండించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని (మాండ్య) కాపాడుకునే క్రమంలో మరణించారు. కన్నడ భాషకు, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను నిర్వహించడాన్ని పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని నిర్ణయించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం
బెంగళూరు : పెట్రోల్, డీజిల్ ధరలపై కర్నాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ధరలను నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలను క్రాష్ చేస్తోంది. ‘ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు, పన్నులు తగ్గి, ధరలు తగ్గితే బాగుండని భావించారు. కుల్బర్గి నుంచి ప్రకటిస్తున్నా.. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కనీసం రెండు రూపాయల పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. మా సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కర్నాటక ప్రజలకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు, రెండున్నర రూపాయలు తగ్గించాయి. కాగా.. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.06గా, కోల్‌కతాలో రూ.83.91గా, ముంబైలో రూ.89.44గా, చెన్నైలో రూ.85.31గా, బెంగళూరులో రూ.84.74గా ఉంది. డీజిల్ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78గా, కోల్‌కతాలో రూ.75.63గా, ముంబైలో రూ.78.33గా, చెన్నైలో రూ.78గా, బెంగళూరులో రూ.76.16గా రికార్డైంది. -
‘రాహుల్ గాంధీతో నేను మాట్లాడుతా’
బెంగళూరు : కాంగ్రెస్ నేతల్లో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించాలంటే మిగిలిన మంత్రి పదవులను వెంటనే భర్తి చేయాలని కాంగ్రెస్ లోక్‌సభ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయంపై తర్వలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కర్ణాటకలోని జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీ కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు కేటాయించిన మంత్రి పదవుల్లో ఆరు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తే అసమ్మతి వర్గాలు చల్లపడుతాయని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై రాహుల్‌తో మాట్లాడి మంత్రిపదవులను తక్షణమే భర్తీ చేయమని కోరతానన్నారు. హెచ్ డీ కుమార స్వామి నేతృత్వంలోని మంత్రివర్గంలో తమకు స్థానం దక్కనందుకు కాంగ్రెస్ నేతలు ఎం బీ పాటిల్, సతీశ్ జర్కిహోలి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరే కాకుండా రోషన్, హారిస్, రామలింగా రెడ్డి, హెచ్ కే పాటిల్ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కేబినేట్లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావెశమై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కవలసి ఉంది. అయితే కాంగ్రెస్ కోటాలోని 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జేడీఎస్ కూడా ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచింది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని జేడిఎస్, కాంగ్రెస్ చెరో 30 నెలలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ..ఒప్పందంలో ఇది లేదని, సంకీర్ణ ధర్మం పాటించాలని పేర్కొన్నారు. -
కావేరీ ఇష్యూ: సుప్రీం కోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: కావేరీ జలాల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పిటిషన్‌పై విచారణ జరిపింది. ‘మే నెలకుగానూ కర్ణాటక ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ కేంద్రాన్ని కోర్టు నిలదీసింది. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సమాధానమిస్తూ.. ‘ డ్రాఫ్ట్‌కు కేబినెట్ ఆమోదం లభించలేదు. ప్రస్తుతం ప్రధాని, మంత్రులు కర్ణాటకలో ఉన్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్నారు. పైగా ఈ విషయంలో నిపుణుల నుంచి కాకుండా కర్ణాటక నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని కేంద్రం భావిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రుల నుంచి సలహాలు తీసుకోవాలని కేంద్రం యత్నిస్తోంది’ అని బదులిచ్చారు. మరో పది రోజుల గడువు ఇవ్వాలని కేంద్రం తరపున ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అంగీకరించలేదు. ‘ఎన్నికలతో మాకు సంబంధం లేదు. తక్షణమే విధివిధానాలపై స్పష్టత ఇవ్వండి. రాష్ట్రాలకు ఈ వ్యవహారంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణలో డ్రాఫ్ట్ వివరాలను సమర్పించండి’ అని సీజే.. అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం కావేరీ జలాలను రాజకీయం చేస్తోందని తమిళనాడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
గౌరీ లంకేశ్ కేసు... సీబీఐ కాదు సిట్ కరెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ విచారణకు కూడా ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను అస్సలు నమ్మలేమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టే తాము సీబీఐ విచారణను వద్దంటున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు సిట్ కరెక్ట్. సీబీఐను నమ్మటానికి అస్సలు లేదు. అది నైతిక విలువలు లేని ఓ సంస్థ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరో నేత పీఎల్ పునియా ఘటనను భావ ప్రకటన హక్కుపై దాడిగా అభివర్ణించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా కేసు చిక్కుముడి విప్పుతుందని భావిస్తున్నట్లు పునియా తెలిపారు. ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం గౌరీ లంకేశ్ హత్య కేసు కోసం నియమించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబడుతుండగా, అందుకు తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
గౌరీ లంకేశ్ హత్య కేసుపై సిట్
-
గౌరీ లంకేశ్ హత్య కేసుపై సిట్
♦ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం ♦ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, జర్నలిస్టుల నిరసనలు ♦ ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు పూర్తి సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటుచేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తునకు ఇంటెలిజెన్స్ ఐజీ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశామని మీడియాతో చెప్పారు. గౌరి కుటుంబ సభ్యులు కోరినట్లుగా సీబీఐ విచారణకూ తాము సిద్ధమేనని చెప్పారు. ఆమె హత్యపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. మిన్నంటిన ఆందోళనలు లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు, పౌర సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశాయి. బెంగళూరు, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాయి. గౌరీ హత్య పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన దాడి అని, ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే వారిని భయపెట్టడమే అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. లంకేశ్ హత్యను అమెరికా ఖండించింది. బుధవారం టీఆర్ మిల్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లంకేశ్ అంత్యక్రియలు జరిగాయి. సీఎంసహా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం గౌరీ లంకేష్ హత్యతో కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగింది. దేశంలో స్వేచ్ఛావాదులు, జర్నలిస్టులు, హేతువాదులకు రక్షణ లేకుండా పోయిందని, అసమ్మతి తెలియజేసినా, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిపై దాడులకు తెగబడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలు నిరాధారం, బాధ్యతారాహిత్యమని, కేంద్రానికి, బీజేపీకి, తమ పార్టీకి చెందిన ఏ సంస్థకూ ఈ హత్యతో సంబంధం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. గౌరీ లంకేశ్ హత్యను ముందుగా పసిగట్టడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందంటూ జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ ఆరోపించారు. లంకేశ్ ముప్పును ముందే ఊహించారా? లంకేశ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే ఊహించినట్లు ఆమె ట్వీటర్ పోస్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది. ఆమె హత్యకు కొద్దిగంటల ముందు తన ట్వీటర్ ఖాతాలో ‘మనలో కొందరికి నకిలీ ఖాతాలతో నకిలీ పోస్ట్‌లు, బెదిరింపులు వస్తున్నాయి. వాటికి భయపడాల్సిన పని లేదు’ అని ఆమె పోస్ట్ చేశారు. నెలరోజులుగా తనకు కొంత మంది ఫోన్‌చేసి హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె తమ సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. కాగా, లంకేశ్ హత్యోదంతం వెనక ఉన్నది మావోయిస్టులా లేక మత ఛాందసవాదులా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటకలో నక్సల్స్‌ను జనజీవన స్రవంతి లోకి తీసుకురావడం కోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌరి లంకేష్ తమను బలహీనపరిచేలా ప్రవర్తిస్తున్నారని భావించిన నక్సలైట్లు చంపేశారని ప్రచారం సాగుతోంది. -
డీఎస్పీ గణపతి కేసులో కర్ణాటకకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: మడికెర డీఎస్పీ ఎంకే గణపతి ఆత్మహత్య కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా తన సూసైడ్ నోటులో మాజీ హోంమంత్రి జార్జి పేరును డీఎస్పీ గణపతి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది (2016 జూన్7) కొడగు జిల్లా మడికెరి నగరంలోని ఓ లాడ్జ్‌లో డీఎస్పీ గణపతి ఉరివేసుకుని మరణించిన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏదేని విపరీత నిర్ణయం తీసుకున్నా, లేదా తనకు ఏమైనా జరిగినా అందుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, సీనియర్ ఐపీఎస్ అధికారులైన ప్రణవ్ మొహంతి, ఎ.ఎం ప్రసాద్‌లు కారణమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడైన నేహాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇదే సందర్భంలో విమర్శలు వెల్లువెత్తడంతో కే.జే జార్జ్‌తో రాజీనామ చేయించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గణపతి మరణానికి– జార్జ్, ఇతర అధికారులకు సంబంధం లేదని తేలిందని సీఐడీ రిపోర్టును అందజేయడంతో జార్జ్‌కి మళ్లీ నగరాభివృద్ధి మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం విజ్ఞప్తిని తిరస్కరించింది. -
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
-
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
సాక్షి,బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు భారీ నిధులతో ఒక ప్రణాళికను కూడా సిద్దం చేసింది. దీని ప్రకారం ఒకటవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంతవరకు బాలికలు ఉచితంగా విద్యాభ్యాసం చేసే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. 2018-2019 విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా సుమారు 18 లక్షలమందికి లబ్ధి చేకూరనుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో గ్రాడ్యుయేషన్ స్థాయికి రాష్ట్రంలోని మొత్తం బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి రూ.110 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని దాదాపు 18లక్షల మంది విద్యార్థినులకు ఇది ఉపయోగపడనుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయరెడ్డి ప్రకటించారు. అయితే పట్టణ, గ్రామీణ, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ పథకం ప్రకారం ముందుగా ఫీజు చెల్లించి , అనంతరం ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేసుకోవచ్చు. అయితే పరీక్ష ఫీజును ఈ పథకంనుంచి మినహాయించారు. ఈ పథకం అమలులో గందరగోళం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి, లబ్ధిదారులకు తిరిగి చెల్లించడం మంచిదని తాము భావించామని మంత్రి చెప్పారు. కాగా వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
దేవుని దర్శించుకోవడానికీ ఆధార్..
సాక్షి, బెంగళూరు : ఉత్తరఖాండ్‌లో ప్రతేడాది ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభోవంగా జరిగే బద్రినాథ్, కేదర్నాథ్, గంగోత్రి, యమునోత్రి తీర్థయాత్రలకు వెళ్లాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఈ పుణ్యయాత్రలకు వెళ్లే వారికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. యాత్రికులకు ప్రభుత్వం అందిస్తున్న 20వేల రూపాయల ట్రావెల్ సబ్సిడీ దుర్వినియోగమవుతుందనే భయాందోళనతో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న ప్రభుత్వం సమీక్షించిన ఛార్ ధామ్ తీర్థయాత్ర నిబంధనల ప్రకారం, సబ్సిడీని పొందడానికి దరఖాస్తుదారులకు ఆధార్ కార్డును ఫ్రూప్‌గా పరిగణించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. '' రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగిన 1000-1500 మంది ప్రజలకు ఛార్ ధామ్ యాత్రం కోసం ప్రతేడాది ట్రావెల్ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఏడాది యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశముంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలపై ట్రావెల్ ఆపరేటర్లు భక్తులకు పలు తప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. తప్పుడు ప్రయాణ పత్రాలు సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని దుర్వినియోగ పరచాలని చూస్తున్నారు. దీంతో ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 2014లో సిద్ధరామయ్య ప్రభుత్వం దగ్గర్నుంచి ఈ యాత్రకు వెళ్లే కొంతమంది రాష్ట్ర నివాసులకు సబ్సిడీ అందించడం ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ యాత్రకు వెళ్లేందుకు ఈ ట్రావెల్ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. -
జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసులో జయలలితను దోషిగా తేల్చాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జయలలితను దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటక సర్కార్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు... జయలలిత మినహా శశికళతో పాటు మిగతావారిని దోషులుగా తేల్చిన విషయం విదితమే. కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అనారోగ్యంతో జయలలిత మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు అదే సమయంలో అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్ సారాంశం. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ల నుంచి కర్ణాటక ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధరుసుం వసూలు చేయాలి. మరోవైపు ఈ కేసులో దోషిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. -
త్వరలో జయలలిత ఆస్తుల వేలం
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో రూ.100 కోట్ల అపరాధ సొమ్మును వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనారోగ్యంతో జయలలిత మృతి చెందడంతో ఆమె శిక్షను రద్దు చేసున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు అదే సమయంలో అపరాధ రుసుం రూ.100 కోట్లను వేరే రూపంలో వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇదిలావుండగా ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయలలితకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదనేది ఈ పిటిషన్ సారాంశం. ఈ పిటిషన్ త్వరలో సుప్రీంకోర్టు విచారణకు రానుంది. కాగా జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయలలిత, శశికళ, ఇళవరసి, దివాకరన్ల నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ. 130 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చేయాలి. అలాగే శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ.30 కోట్ల అపరాధరుసుం వసూలు చేయాలి. దీనిపై డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బలగన్ తరఫున హాజరైన న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్ మాట్లాడుతూ బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసిందని, దీంతో జయలలిత మృతి చెందినా ఆమెకు విధించిన రూ.100 కోట్ల అపరాధ సొమ్మును చెల్లించాల్సి ఉందని తెలిపారు. జయలలిత ఆస్తులను వేలం వేసి అపరాధ సొమ్మును వసూలు చేయవచ్చని న్యాయమూర్తి కున్హా కూడా తీర్పులో వివరంగా తెలిపారన్నారు. త్వరలో ఆస్తులను వేలం వేయాలనే ఉద్దేశంతో పిటిషన్ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వానికి కేసు ఖర్చునిమిత్తం రూ.12 కోట్ల 50 లక్షలు తమిళనాడు ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయలలిత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 117 కోట్లు. ఈ సంపదంతా శశికళ నటరాజన్‌కు దక్కిందట... స్థిర, చర ఆస్తులన్నీ శశికళ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక 'ది టెలిగ్రాఫ్' జయలలిత మరణించగానే ఓ కథనం ఇచ్చింది. జయలలితకు చెందిన ఆస్తులకు శశిశళ, ఆమె కుటుంబ సభ్యులు వారసులని టెలిగ్రాఫ్ తెలియచేసింది. అయితే జయ ఆస్తులకు సంబంధించి అసలు పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. -
మా వంద కోట్ల మాటేమిటి?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో తమకు రావాల్సిన వంద కోట్ల రూపాయల కోసం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణం కారణంగా ఆమె మీద విధించిన జరిమానాను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేయడంతో.. ఆ తీర్పును మరోసారి సమీక్షించాలని కర్ణాటక కోరుతోంది. ఏదైనా కేసులో శిక్ష పడినప్పుడు దానిపై అప్పీలు చేసినా, నిందితులు జరిమానా చెల్లించడం, జైలుశిక్ష అనుభవించడం లాంటి విషయాలలో మినహాయింపులు, రద్దులు చెల్లబోవని, నిందితులందరికీ సమానత్వం అమలవుతుందని, ఈ కేసులో జైలుశిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించాని తమ పిటిషన్లో తెలిపింది. ప్రస్తుత కేసులో జయలలిత జైలుశిక్ష అనుభవించే ప్రసక్తి రాదు గానీ.. ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక సర్కారు కోరింది. ఈ కేసులో విధించిన మొత్తం జరిమానాలో జయలలిత వాటాగా 100 కోట్ల రూపాయలు ఉన్న విషయం తెలిసిందే. ఆ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సి ఉండటంతో.. దాని కోసం ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేసింది. -
నిరసనలకు తలొగ్గిన సర్కారు.. ప్రాజెక్టు రద్దు
ప్రజలు గట్టిగా పోరాడితే ప్రభుత్వాలు తల వంచాల్సిందే. ఆ విషయం మరోసారి కర్ణాటకలో రుజువైంది. బెంగళూరు నగరంలో రూ. 1761 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించాలని తలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 800కు పైగా చెట్లను నరికేస్తారని, దానివల్ల నగరంలో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు. నగరంలో స్టీల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించబోవడం లేదని బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 6.72 కిలోమీటర్ల మేర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించాలని బెంగళూరు అభివృద్ధి మండలి (బీడీఏ) తలపెట్టింది. దీనికి పర్యావరణవేత్తలు, ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టును 2016 అక్టోబర్ నెలలో ఎల్అండ్టీ కంపెనీకి ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే ఈ ఫ్లైఓవర్ తప్పనిసరిగా రావాల్సిందేనని సీఎం సిద్దరామయ్య, మంత్రి కేజే జార్జ్ ఇంతకుముందు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల నిరసనలకు తలొగ్గి ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకున్నారు. -
జయలలిత కేసు విచారణ ఖర్చు ఎంతో తెలుసా ?
-
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
⇒ 2003 నుంచి ఇప్పటివరకు అయిన ఖర్చు రూ. 5 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు ⇒ జయ సొత్తు వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఖర్చులు రాబట్టుకోనున్న కర్ణాటక సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులను జయ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి కర్ణాటక తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ 2003 నవంబర్ 18న సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టును, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014 వరకు ఈ కోర్టులో విచారణ జరిగింది. ఈ పదేళ్లలో రూ. 2.86 కోట్లు ఖర్చయినట్లు లెక్కగట్టారు. ఈ కోర్టు, కార్యాలయం ఏర్పాటుకు రూ.4.81 లక్షలు, టెలిఫోన్ బిల్లులకు రూ.1.37 లక్షలు ఖర్చయినట్లు తేలింది. ప్రత్యేక కోర్టు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులే రూ.90.13 లక్షలయినట్లు తేలింది. తమిళ భాషలో ఉన్న వేలాది పేజీల దస్తావేజులను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడానికి రూ.6.51లక్షలు, వాటి జిరాక్స్‌కు రూ.2.17 లక్షలు ఖర్చయింది. తమిళనాడు సెషన్స్ కోర్టులోని దస్త్రాలను ఇక్కడికి తేవడానికి అయిన ఖర్చు రూ.8.63 లక్షలుగా తేల్చారు. ఇతరత్రా అన్ని ఖర్చులు మరో 1.70 కోట్లు అయిందని అధికారవర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా జయలలిత, శశికళ తదితరులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారికి కల్పించిన భద్రతకే భారీగా ఖర్చయినట్లు సమాచారం. ప్రత్యేక కోర్టులో 2014లో విచారణ ముగిసింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా జయలలిత, ఇతరులకు భద్రత, ఇతరత్రా ఖర్చులు, వారు జైలుకు వచ్చినప్పుడు అయిన ఖర్చులు కనీసం రూ. 2 కోట్లు అయ్యాయని అధికారులు వెల్లడించారు. జయ బృందం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం రాబట్టుకొంటుందని సమాచారం. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
తుంగభద్రలో క‘ర్నాటకం’!
భారీ జల దోపిడీకి తెరతీసిన కర్ణాటక ప్రభుత్వం - టీబీ డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడాన్ని సాకుగా చూపుతోన్న వైనం - 35 టీఎంసీల సామర్థ్యంతో రూ.5,600 కోట్లతో కొత్త జలాశయం నిర్మాణం - హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకం - ప్ర తిపాదనలకు అంగీకరించాలని ఏపీ సర్కార్‌కు లేఖ - అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాలను ఇప్పటికే అడ్డగోలుగా తోడేస్తోన్న కర్ణాటక.. జలదోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సరి కొత్త నాటకాలకు తెర తీసింది. తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో పూడిక పేరుకుపోవడాన్ని సాకుగా చూపి.. డ్యాం ఎగువన కొప్పళ జిల్లా నవిలే గ్రామం సమీపంలో రూ.5600 కోట్ల అంచనా వ్యయంతో 35 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. ఇందులో 35 శాతం వ్యయాన్ని భరించాలని ఏపీ సర్కార్‌ను కోరింది. టీబీ డ్యాం కుడిగట్టు ఎగువ కాలువ(హెచ్చెల్సీ), ఎడమ గట్టు కాలువ(రాయచూర్ కాలువ)కు సమాంతరంగా వరద కాలువ తవ్వడానికి సహకరించాలని ప్రతిపాదిస్తూ వారం క్రితం ఏపీ సర్కార్‌కు లేఖ రాసింది. కర్ణాటక ప్రతిపాదనలకు అంగీకరిస్తే.. తుంగభద్ర జలాలు ఒక్క చుక్క కూడా రాష్ట్రానికి దక్కవని, రాయలసీమ ఎడారిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్క కట్టిన బచావత్ ట్రిబ్యునల్ హెచ్చెల్సీకి 32.50 టీఎంసీలు, ఎల్లెల్సీకి 24, కేసీ కెనాల్‌కు 10, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం)కు 6.91, నీటి ప్రవాహ నష్టాలు 5.50.. వెరసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 78.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీలను కేటారుుంచింది. 1953లో టీబీ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు. పూడిక పేరుకుపోతోండటంతో ఏటా 53 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలకు తగ్గింది. దాంతో నీటి లభ్యత 151 టీఎంసీలకు పడిపోరుుందని లెక్క కట్టిన టీబీ బోర్డు.. దామాషా పద్ధతిలో రాష్ట్రానికి 48.50 టీఎంసీలు కేటారుుస్తూ వస్తోంది. కానీ మూడేళ్లుగా ఏనాడూ కేటారుుంచిన మేరకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాదీ హెచ్చెల్సీకి 22.50 టీఎంసీలు కేటారుుస్తే 6.5టీఎంసీలు, ఎల్లెల్సీకి 17.45 టీఎంసీలు కేటారుుస్తే 2.49, కేసీ కెనాల్‌కు 1.01 టీఎంసీలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. దాంతో రాయలసీమలో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు బంజరుగా మారింది. వ్యూహాత్మకంగా పావులు.. భారీగా జల దోపిడీ టీబీ డ్యాంలో పూడికతీతకు భారీగా ఖర్చు వస్తుందని ఆ ప్రతిపాదనలను కర్ణాటక ప్రభుత్వం పక్కన పెట్టింది. నూతన జలాశయం నిర్మాణం.. హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి టీబీ బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేరుుంచింది. హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ తవ్వాలని ఐదు దశాబ్దాలుగా ఏపీ సర్కార్ కోరుతున్నా పట్టించుకోని కర్ణాటక సర్కారు.. ఇప్పుడు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తూనే రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువ తవ్వకానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించాలని మెలిక పెట్టింది. తుంగభద్ర ప్రధాన ఉప నది తుంగపై అప్పర్ తుంగ ప్రాజెక్టు, సింగటలూరు ఎత్తిపోతల పథకం, మరో ఉప నది భద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్టును అధికారికంగా చేపట్టి పూర్తి చేసింది. ఆ ప్రాజెక్టుల దిగువన భారీ ఎత్తున ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను చేపట్టి అడ్డగోలుగా నీటిని తోడేస్తోంది. పర్యవసానంగా తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గిపోరుుంది. హెచ్చెల్సీ 196.43 కి.మీలలో 105.487 కి.మీలు కర్ణాటక పరిధిలో ఉంది. ఎల్లెల్సీ 348.2 కి.మీలలో కర్ణాటక పరిధిలో 131.50 కి.మీలు ఉంది. ఏపీ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక పరిధిలో రైతులు ఎక్కడికక్కడ గండ్లు కొడుతూ నీటిని తరలిస్తోన్నా ఏపీ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో కర్ణాటక పరిధిలో లోలెవల్ కెనాల్(ఎల్లెల్సీ)పై 118.2 కి.మీల వద్ద అదనంగా మరో డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుకు టీబీ బోర్డు ఆమోదముద్ర వేసినా ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీని వల్ల కర్ణాటక జలదోపిడీకి ఏపీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లరుుంది. అంగీకరిస్తే అంతే సంగతి కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ అంగీకరిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోవడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాయచూర్ కెనాల్‌కు ఇష్టారాజ్యంగా నీటిని విడుదల చేస్తూ జలదోపిడీ చేస్తోన్న కర్ణాటక.. వరద కాలువ తవ్వితే జలదోపిడీకి అడ్డే ఉండదు. మరో జలాశయం నిర్మాణం తర్వాత భారీ ఎత్తున ఎత్తిపోతల పథకాలను చేపట్టి నీటిని తరలించడానికి కర్ణాటక ఎత్తులు వేస్తోంది. ఈ ప్రతిపాదనల వల్ల ఏపీ సర్కార్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోనే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని వినియోగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ఆధునికీకరణకు కర్ణాటక సర్కార్ ససేమిరా అంటోండటం గమనార్హం. ఈ అంశంపై ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావును ‘సాక్షి’వివరణ కోరగా.. టీబీ డ్యాంకు ఎగువన కొత్త జలాశయం నిర్మాణం, హెచ్చెల్సీ, రాయచూర్ కెనాల్‌కు సమాంతరంగా వరద కాలువల తవ్వకానికి అంగీకరించాలని కోరుతూ కర్ణాటక సర్కార్ లేఖ రాసిందని చెప్పారు. రాయచూర్ కెనాల్ ద్వారా కర్ణాటక ఇప్పటికే భారీ ఎత్తున నీటిని అక్రమంగా వినియోగిస్తోందన్నారు. కర్ణాటక ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
కర్ణాటకపై ఫైర్
సాక్షి ప్రతినిధి, చెన్నై:కావేరీ నదీ జలాల విడుదలపై సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించిన కర్ణాటక ప్రభుత్వ వైఖరి తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేయాల్సిందిగా జయలలిత ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు, కావేరీ డెల్టా రైతులు ఒత్తిడి తెస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజల ఆందోళనకు తలొగ్గి నీటి విడుదలను నిలిపి వేసింది. దీంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 3400 ఘనపుటడుగులకు పడిపోయింది. కావేరీ నీటి విడుదలను నిలిపివేయాలని శుక్రవారం నాటి కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయబోతోందని ప్రతిపక్షాలు అంచనావేస్తున్నాయి. కావేరీ జలాలపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 27వ తేదీన విచారణకు వచ్చినపుడు అసెంబ్లీ తీర్మానాన్ని అనుసరించి నీటిని విడుదల చేశామని కర్నాటక ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అనుమానిస్తున్నారు. కర్నాటక కుట్రను ఎదుర్కోవాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి సైతం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీల బలాన్ని కేంద్రానికి తెలిపేలా అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటు చేయాలని తమాకా అధ్యక్షులు జీకే వాసన్ కోరుతున్నారు. కావేరీ నదీజలాల హక్కును కాపాడుకునేందుకు త్వరలో ఇతర పార్టీలతో కలిసి సంయుక్త పోరాటానికి దిగుతున్నట్లు వీసీకే అధినేత తిరుమావళవన్ గురువారం ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పును అవమానించిన కర్నాటక ప్రభుత్వంపై అత్యవసర కేసును దాఖలు చేయాలని తమిళనాడు వ్యవసాయదారుల సంఘం సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు పీఆర్ పాండియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుచ్చిరాపల్లిలోని రైతులు కావేరీ నది నడుములోతు నీళ్లలోకి దిగి గురువారం నిరసన పోరాటం సాగించారు. -
సుప్రీం చెప్పినా..నీళ్లు వదలం
బెంగళూరు: సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కావేరి జలాలను తమిళనాడుకు వదలడంపై కర్ణాటక తాత్సారం చేస్తోంది. నీటి విడుదలను మరో 2 రోజులపాటు వాయిదా వేసింది. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 23న గవర్నరు అనుమతితో ఉభయ సభలను సమావేశ పరచాలని బుధవారం జరిగిన అఖిలపక్ష, మంత్రివర్గ భేటీల్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 23వరకు నీటిని వదలబోమని సీఎం సిద్ధరామయ్య బుధవారం చెప్పారు. ఈ నిర్ణయాన్ని మంత్రి మండలి ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. కావేరీ జలాలను బుధవారం నుంచి ఈ నెల 27వరకు రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని సుప్రీం మంగళవారం ఆదేశించడం తెలిసిందే. దీంతో.. కర్ణాటక సర్కారు బుధవారమంతా చర్చలు జరిపి పై నిర్ణయానికి వచ్చింది. రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించి బాగా పొద్దుపోయాక సిద్ధరామయ్య వివరాలను మీడియాకు చెప్పారు. అఖిలపక్ష భేటీకి బీజేపీ గైర్హాజరైంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలుజగదీష్‌శెట్టర్, సదానందగౌడ తదితరులు ప్రధాని నరేంద్ర మోదీని కలసి కావేరి విషయంలో కలుగజేసుకోవాలని కోరగా ఆయన నిరాకరించినట్లు సమాచారం. -
నేడు రాష్ట్ర బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులను ఖండిస్తూ, వారికి తగిన బందోబస్తు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పుదుచ్చేరీ సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా తమిళనాడు, పుదుచ్చేరీల్లో ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగాయి. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేశారు. కర్ణాటకలో తమిళుల రక్షణ కోసం వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార సంఘాలు, లారీ యజమానుల సంఘాలు గురువారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. కర్ణాటకలో ఆందోళనకారుల విధ్వంసకర చర్యలను ఈ సమావేశంలో ఖండించడంతోపాటూ కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తమిళనాడు, పుదుచ్చేరీల్లో బంద్ నిర్వహించాలని తీర్మానించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖండన పోరాటం నిర్వహించాలని నిర్ణయించారు. బంద్‌లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార సంస్థలన్నిటినీ మూసివేయనున్నారు. ట్రక్కులు, ట్యాంకర్ లారీలు, సాధారణ లారీలను కూడా నిలిపివేస్తున్నట్లు యజమానుల సంఘం తెలిపింది. వ్యాన్, ఆటోలు సైతం తిరగవు. అయితే ప్రభుత్వ సిటీ బస్సులను పోలీసు బందోబస్తుతో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. నాడు, పుదుచ్చేరీల్లో శుక్రవారం ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఉపాధ్యా, అధ్యాపక సంఘాలు తెలిపాయి. పెట్రోలు బంకులు, కోయంబేడు మార్కెట్ మూతపడనున్నాయి. పుదుచ్చేరీలో వివిధ పార్టీలు, సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. డీఎంకే, ఎండీఎంకే బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆత్మాహుతి యత్నం:కర్ణాటక ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కావేరీ జలాల కోసం నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ ఆధ్యర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన విఘ్నేష్‌కుమార్ అనే కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. -
కావేరీ వస్తోంది
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు డెల్టా జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాల సంబసాగుకు సిద్ధంగా ఉంది. ఈ 15 లక్షల ఎకరాల సాగులో అధికశాతం కావేరీ జలాలపై ఆధారపడి ఉంది. తమిళనాడుకు వాటా జలాలు ఇవ్వాలని గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అమలు చేయకపోవడంతో డెల్టా జిల్లాలో సాగు ప్రశ్నార్థకమైంది. నాట్లు వేసి కొందరు, నాట్లు వేయాలా వద్దా అనే అనుమానంతో కొందరు రైతులు దిగాలులో పడిపోయారు. ఈ పరిస్థితిలో ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి 50 టీఎంసీల కావేరీ జలాలు విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవల మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఈనెల 6వ తేదీన విచారణకు రాగా, సెకనుకు 15వేల ఘనపుటడుగులు లెక్కన పదిరోజులపాటు నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. సుప్రీంతీర్పుపై ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌తో అత్యవసరంగా సమావేశమైనారు. సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించేందుకు వీలులేదని, విడుదల చేయకుంటే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని న్యాయవాదులు స్పష్టం చేశారు. అంతేగాక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లయితే కర్ణాటక పరంగా పోరాటానికి మార్గం సుగమం అవుతుందని న్యాయవాదులు వివరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో సీఎం సిద్ధరామయ్య నీటి విడుదలకు అంగీకరించారు. కావేరీ జల ప్రవాహం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం మంగళవారం రాత్రి 12.30 గంటలకు కావేరీ జలాలను విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హెచ్‌టీ కోట్టై తాలూకాలోని కబినీ జలాశయం నుంచి సెకనుకు 5 వేల ఘనపుటడుగుల నీరు, మాండియాలోని కేఆర్ఎస్ జలాశయం నుంచి 10వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు తమిళనాడు వైపు పరుగులు తీస్తూ ప్రవహించడం ప్రారంభించింది. మేట్టూరు జలాశయంలో మంగళవారం ఇన్‌ఫ్లో 3935 ఘనపుటడుగులతో 75.83 అడుగుల నీటిమట్టం నమోదై ఉంది. మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన కావేరీ జలాలు గురువారం ఉదయానికి హొగనెకల్కు, మేట్టూరు జలాశయానికి మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం గురువారం సాయంత్రానికి వేగంగా పెరిగే అవకాశం ఉంది. మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 90 అడుగులకు చేరుకున్న పక్షంలో డెల్టా సాగుకు నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. కావేరీ జలాలు కరుణించే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కావేరీ మంటలు
తమిళనాడుకు కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహంతో భగ్గుమంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదంటూ కర్ణాటకలో చెలరేగిన ఆందోళనలతో కావేరీ సమస్య మరోసారి అగ్గిలా రాజుకుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : కావేరీ నది నుంచి తమిళనాడుకు సెకండుకు 15వేల ఘనపుటడుగుల లెక్కన పది రోజులపాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఈనెల 16వ తేదీన విచారణకు రాబోతుండగా సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటక ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన బాటపట్టారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతాంగం మంగళవారం పలుచోట్ల విధ్వంసానికి పాల్పడడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొనడంతో తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సులను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. ఈరోడ్డు, కోవై, తిరుప్పూరు తదితర జిల్లాల నుంచి సత్యమంగళం, పన్నారీ ఆశనూరు, తాళవాడి మీదుగా ప్రతిరోజూ 50కి పైగా బస్సులు మైసూరు, బెంగళూరుకు వెళుతుంటాయి. ఈ బస్సులన్నీ రెండో రోజైన మంగళవారం కూడా నిలిచిపోయాయి. స్వల్ప సంఖ్యలో బస్సులు కర్ణాటక సరిహద్దు పులింజూర్ వరకు ప్రయాణికులను చేరవేశాయి. ఈరోడ్డు జిల్లా పన్నారీ చెక్‌పోస్టు నుంచి కొండ ప్రాంతాల మీదుగా ప్రతిరోజూ వందకుపైగా లారీలు, భారీ వాహనాలు వెళుతుంటాయి. కర్ణాటకలో ఆందోళనల కారణంగా వీటన్నింటినీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. కోయంబత్తూరు-కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగళూరు, మండియా, కొల్లొ క్కాల్ ప్రాంతాల మధ్య ప్రతిరోజూ తిరిగే 60 బస్సులు సోమవారం ఉదయం నుంచే బస్‌స్టేషన్‌కే పరిమితమయ్యాయి. వినాయక చతుర్థి పండుగను పురస్కరించుకుని కర్ఱాణటకకు వెళ్లాల్సిన ప్రయాణికులు సరిహద్దుల వరకు ఏదో ఒక వాహనంలో చేరుకుని, అక్కడి నుంచి ఆ రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణికుల వత్తిడిని తట్టుకోలేక పోలీసు బందోబస్తుతో రాత్రి వేళ కొన్ని బస్సులను నడిపారు. ఊటీ, కొడెక్కైనాల్ను సందర్శించిన పర్యాటకులు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో బెంగళూరుకు బయలుదేరగా కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారి వాహనాలను పోలీసులు అనుమతించలేదు. మంగళవారం రెండోరోజూ కూడా పర్యాటకుల వాహనాలు సరిహద్దుల్లో బారులుతీరి నిలబడి ఉన్నాయి. ఆయా వాహనాల్లోని కొందరు ప్రయాణికులు కాలినడకతో కొన్ని కిలోమీటర్ల దూరం చేరుకుని కర్ణాటక వాహనాల్లో గమ్యాన్ని చేరుకున్నారు. తమిళనాడు నుంచి హొసూరు మీదుగా బెంగళూరుకు చేరుకునే మరో 300 బస్సులు సోమవారం నుంచే నిలిచిపోయాయి. శని, ఆది, వినాయక చవితి సెలవులు ముగిసి కర్ణాటక చేరుకోవాల్సిన ప్రయాణికులు సోమవారం రాత్రంతా సరిహద్దుల్లో జాగారం చేశారు. ఇదిలా ఉండగా, కర్ణాటక- హోసూరు మధ్య నడిచే ఆ రాష్ట్ర బస్సులు యథావిధిగా తిరగడంతో వాటిల్లో ప్రయాణికులు కిటికిటలాడిపోయారు. కర్నాటక రాష్ట్రం తాళవాడి సమీపం సామ్రాజ్యనగర్ నంజన్ గూడు, మైసూరులలో అక్కడి రైతులు రాస్తారోకో, ఆందోళనలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తున్న తమిళులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. పార్టీల నిరసన: సుప్రీంకోర్టు తీర్పు, కర్ణాటక నిరాకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చిచెప్పాలని డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జయలలితను డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం దిక్కరిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య దేశంలో ఆయన ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ వ్యాఖ్యానించారు. షెడ్యూలు ప్రకారం సాగునీటి జలాల విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు హామీ ఇవ్వాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కావేరీ క్రమబద్ధీకరణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఎండీఎంకే అధ్యక్షులు వైగో, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగా కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్షంతో సమావేశమైందని, అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా భవిష్య కార్యాచరణ ప్రణాళికపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని వీసీకే అధ్యక్షులు తిరుమా విజ్ఞప్తి చేశారు. మేట్టూరు నీటికై డిమాండ్: కావేరీ జలాల విడుదల జఠిలం కావడంతో రాష్ట్ర రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కావేరీ జలాలు క్రమం తప్పకుండా విడుదలైన పక్షంలో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 50 టీఎంసీలకు చేరుకుంటుంది. మేట్టూరు జలాశయంలో ఇప్పటికే 37.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున ఈనెల 16వ తేదీ నాటి సుప్రీం తీర్పుకోసం ఎదురుచూడకుండా సాగునీటిని విడుదల చేయాలని తమిళనాడు వ్యవసాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటి కార్యదర్శి నల్లస్వామి కోరుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సాగునీటిని పారించకుంటే సంబసాగును కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్ యోగా షోపై మరో వివాదం
గత నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను బాలీవుడ్ నటి బిపాసాబసుకు ఫీజు విషయంపై మరో వివాదం చెలరేగింది. కంఠీరవ స్టేడియంలో ప్రముఖ రాజకీయ నాయకులు, బిపాసా పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు బిపాసాకు భారీ మొత్తం చెల్లించారని అప్పట్లో ఆరోపణలు, విమర్శులు వచ్చాయి. కాగా బిపాసాకు డబ్బు చెల్లించే విషయంలో తాజాగా మరో వివాదం ఏర్పడింది. యోగా కార్యక్రమం నిర్వహించినందుకుగాను తమకు 45 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్వాహకులు కోరారు. అయితే, బిపాసాకు, కార్యక్రమ నిర్వాహకులకు భారీ మొత్తం చెల్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో బిపాసాకు ఎవరు డబ్బు చెల్లిస్తారన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. -
జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ‘కృష్ణా’ నుంచి తప్పించండి
♦ కృష్ణా జలాల వివాదంలో కర్ణాటక మెలిక ♦ కేంద్ర జల వనరుల శాఖకు ఆ రాష్ట్ర సీఎస్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త పేరుతో తాజాగా ఇంకో మెలికపెట్టింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిని ఆ నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా నియమించడం సబబు కాద ని, దీని వల్ల భవిష్యత్తులో కొత్త వివాదం తలెత్తవచ్చని కర్ణాటక ప్రభుత్వం జనవరి 14న కేంద్ర జల వనరుల శాఖకు ఒక లేఖ రాసింది. కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఉంటే భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాలకు అనుమానాలు, అపోహలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆయనను తప్పించాలని కోరింది. ఇదే అంశాన్ని మధ్యంతర దరఖాస్తు రూపంలో మంగళవారం ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ నివేదించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్కు కర్ణాటక సీఎస్ అరవింద్ జాదవ్ రాసిన లేఖలోని అంశాలను ఆయన వివరించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యానే: కర్ణాటక అనిల్ దివాన్ తన వాదన వినిపిస్తూ ‘ట్రిబ్యునల్ విచారణ కొనసాగాక రేపు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కేవలం ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఈ అంశాన్ని లేవనెత్తాం’ అని పేర్కొన్నారు. మాకేమీ అభ్యంతరం లేదు: మహారాష్ట్ర ఈ విషయంలో మహారాష్ట్రకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం తరఫు సీనియర్ న్యాయవాది అంద్యార్జున చెప్పారు. ఇప్పటికే నదీ జలాల వివాద పరిష్కారం ఆలస్యమవుతోందని, అవార్డు నోటిఫై చేయలేదని ఆయన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది: ఏపీ ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ తన వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునళ్ల విషయంలో ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదని, కానీ కర్ణాటక ఈ అంశాన్ని లేవనెత్తాక దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందనిపిస్తోందన్నారు. తమ ప్రభుత్వ వైఖరి తెలుసుకుని నివేదిస్తామని చెప్పారు. తాము కూడా తమ ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని నివేదిస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు చెప్పారు. ఇది ఫోరం కాదు: కేంద్రం కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఖాద్రీ తన వాదనలు వినిపిస్తూ.. ‘నియామకం జరిపినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? అయినా, ఒకవేళ వారికి అభ్యంతరం ఉంటే, నియామకాన్ని సవాలు చేసేందుకు తగిన ఫోరం ఈ ట్రిబ్యునల్ కాదు. ట్రిబ్యునల్ సభ్యుడిని భారత ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. మేం కేవలం నోటిఫికేషన్ ఇస్తాం..’ అని అన్నారు. కేంద్రం వైఖరిని తెలుసుకుని నివేదించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేశారు. -
యువతిపై దాడి ఘటనలో వివరణ కోరిన రాహుల్
న్యూఢిల్లీ : బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... కర్ణాటక ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ సంఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక పంపించాలని ఆయన గురువారం ఆదేశించారు. కాగా రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా దాడికి సంబంధించి టాంజానియా హై కమిషనర్ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మ స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం, ఇతర అధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆ విషయమే నాకు తెలియదు: రాజమౌళి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం తెలుగు సినీరంగం నుంచి రాజమౌళిని పద్మ శ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు గాను ప్రభుత్వం ఈ దర్శక ధీరుణ్ని అత్యుతన్నత పురస్కారంతో గౌరవించింది. ఇప్పటికే ఈ గౌరవానికి తాను అర్హుడిని కాదంటూ ప్రకటించిన రాజమౌళి, మరిన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ' గత ఏడాది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును పంపాలని నన్ను సంప్రదించింది. నేను కాదన్నాను. ప్రభుత్వం నాపై చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నేను రిక్వెస్ట్ చేయటంతో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును ఎంపిక చేయలేదు. కానీ ఈ సారి మాత్రం నన్ను సంప్రదించకుండానే నా పేరును అవార్డు కమిటీకి పంపారు. ఈ పని ఎవరు చేశారా అని ఆరా తీస్తే, కర్ణాటక ప్రభుత్వం నా పేరును అవార్డుకు పంపినట్టుగా తెలిసింది. నేను పుట్టింది కర్ణాటకలో, చదువుకుంది ఆంద్ర ప్రదేశ్ లో, పని చేసింది తమిళనాట, ప్రస్తుతం ఉంటున్నది తెలంగాణలో ఇన్ని రాష్ట్రాలతో అనుబందం ఉన్నందుకు ఆనందంగా ఉంది' అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు రాజమౌళి. Last year the govt of AP wanted to recommend my name for Padma Sri. I requested them not to citing the same reasons. They insisted. But upon — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 my repeated requests, they dropped my name. This year i was not consulted. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 I was wondering how this happened when I came to know that I was recommended by the Karnataka government. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 I was born in Karnataka, studied in Andhra Pradesh, worked in Tamil Nadu and settled in Telangana. Happy to be a son of all the states. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 -
జయ కేసు విచారణ జనవరి 8కి వాయిదా
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు కేసు విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తీర్పు వెలువరించటాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ ...ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తీర్పుపై అనుమానాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం ఉన్నత ధర్మాసనంలో పిటిషన్ వేసింది. కాగా అక్రమాస్తుల కేసులో జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ..సుప్రీంను ఆశ్రయించింది. -
చి‘వరి’కి ఊరట!
♦ టీబీ డ్యాం నుంచి నీటి విడుదల ♦ ఎట్టకేలకు స్పందించిన కర్ణాటక ప్రభుత్వం శాంతినగర్ : చి‘వరి’ ఆయకట్టు రైతాంగానికి ఎట్టకేలకు ఊరట కలిగింది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కింది రబీలో సాగుచేసిన పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులు ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో పైర్లకు ప్రాణం పోసినట్లయింది. తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం లేదని దిగువకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక అధికారులు తేల్చిచెప్పడంతో గత 15 రోజులుగా ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇండెంట్ ద్వారా చుక్కనీటిని కూడా విడుదల చేయకపోవడంతో రబీకి ఆర్డీఎస్ కెనాల్‌కు నీరురాదని, పంటలు ఎండిపోతాయని రైతులు దిగులు చెందారు. అటు ఏపీకి చెందిన కేసీ కెనాల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు తెలంగాణకు చెందిన ఆర్డీఎస్ అధికారులు మంత్రులు, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి కర్ణాటక ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. అంతేగాకుండా ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం, అధికారులు స్పందించారు. శనివారం తుంగభద్ర డ్యాం నుంచి(టీబీ డ్యాం) 2,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు మరో నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సింధనూరుకు చేరనుంది. వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ ప్రధాన కాల్వకు వారం రోజుల్లో నీరు చేరవచ్చని సీతారామిరెడ్డి తెలిపారు. -
జయ కేసులో సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక సర్కార్
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తీర్పు వెలువరించటాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ ...ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తీర్పుపై అనుమానాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా అక్రమాస్తుల కేసులో జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ..సుప్రీంను ఆశ్రయించింది. -
అప్పీలు కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తలమునకలై ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు పిడుగుపాటులాంటి ఈ సమాచారంతో ఆందోళనలో మునిగిపోయాయి. ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పు కారణంగా జయ జైలు పాలుకావడమేగాక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులను సైతం కోల్పోయారు. బెయిల్‌పై విడుదలైన జయ తనకు పడిన శిక్షపై అప్పీలు చేయగా కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. తాజా తీర్పుతో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టారు. ముఖ్యమంత్రిగా జయ కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నందున ఆర్కేనగర్ సిద్ధమైంది. ఈనెల 5వ తేదీన జయలలిత నామినేషన్ దాఖలు చేస్తుండగా, 27వ తేదీన ఉప ఎన్నికపై పోలింగ్ జరగనుంది. అప్పీలుపై ఆందోళన: ఆస్తుల కేసులో ముద్దాయి నుంచి నిర్దోషిత్వంతో ముఖ్యమంత్రిగా మారిన జయలలితకు అప్పీలుతో కొత్త చిక్కువచ్చి పడింది. గత నెల 11వ తేదీన జయను నిర్దోషిగా పేర్కొంటూ తాజా తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే సంబరాలు చేసుకుంది. అమ్మ వెంటనే సీఎం కాబోతున్నారని ఆనందపడిపోయింది. రాష్ట్రంలోని విపక్షాలు సైతం తీర్పును నిరసిస్తూ అదే స్థాయిలో విరుచుకుపడ్డాయి. అప్పీలుపై కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. జయ, కేంద్రప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం కారణంగానే ఇలాంటి తీర్పు వెలువడిందని విపక్షాలు విమర్శించాయి. జయ ఆస్తుల లెక్కలను తారుమారు చేసి నిర్దోషిగా చూపారని కోర్టు తీర్పునే దుయ్యబట్టాయి. కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఆచారి సైతం అప్పీలుకు వెళ్లాలని తమ ప్రభుత్వాన్ని కోరారు. తీర్పు అనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై జయలలిత 12 రోజుల పాటూ న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. న్యాయకోవిదుల నుండి ఎటువంటి హామీ వచ్చిందో ఏమో గత నెల 23 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా, అప్పీలుపై తర్జనభర్జనలు చేసిన కర్నాటక ప్రభుత్వం సోమవారం మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించి అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించింది. జయ కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు వెళ్లాలని మంత్రి మండలి సమావేశాల్లో తీర్మానించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు. మరో రెండురోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలు చేయబోయే తరుణంలో జయ నామినేషన్‌కు సిద్ధం అవుతున్నారు. అప్పీలులో ఏఏ అంశాలు ప్రతిపాదిస్తారోనని రాష్ట్రంలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తాజాతీర్పు అమలుపై తక్షణం నిషేధం విధించాలని, మలి తీర్పు వెలువడే వరకు జయ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకుండా ఉత్తర్వులు జారీచేయాలని కర్నాటక ప్రభుత్వం కోరిన పక్షంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఇరుకున పడుతుందని అంటున్నారు. కర్నాటక ప్రభుత్వం కోరిన రీతిలోనే సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన పరిస్థితిలో అమ్మ మరోసారి పదవీచ్యుతులు అవుతారా అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అదే జరిగితే అమ్మ కోసమే సిద్ధం చేసుకున్న ఆర్కేనగర్లో ఉప ఎన్నిక మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కర్నాటక ప్రభుత్వం అప్పీలును చట్టపరంగానే ఎదుర్కొంటామని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉత్సాహంగా ఉన్న అన్నాడీఎంకే నేతలను అప్పీలు వ్యవహారం నిరుత్సాహానికి గురిచేసింది. సుప్రీం కోర్టు నుండి ఏక్షణాన ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోననే ఆందోళన నెలకొని ఉంది. -
'మమ్మల్ని కర్ణాటక సర్కార్ ఆదేశించలేదు'
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బతగిలినట్లయింది. దర్యాప్తు విషయంలో కాల పరిమితి విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి డీకే రవి చనిపోవడం పలు అనుమానాలకు దారి తీసిన విషయం తెలిసిందే. రవి ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన చనిపోవడం వెనుక ఎవరోఒకరి హస్తం ఉండే ఉంటుందని ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు లేవనెత్తిన నేపథ్యంలో ఆ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయంలోగా దర్యాప్తును పూర్తి చేస్తారా అని ప్రశ్నించగా సీబీఐ వర్గాలు ఈ విధంగా స్పందించాయి. కాల పరిమితి విధించి ఆలోగా విచారణ పూర్తి చేయాలని ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే ఆదేశాలివ్వగలవని చెప్పింది. అయితే, ఈ కేసు కుటుంబ నేపథ్యానికిగానీ, లేక ల్యాండ్ మాఫియాకుగానీ పరిమితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రవి తన బ్యాచ్ మేట్ అయిన మహిళా ఐఏఎస్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆ ప్రేమలో విఫలం అవడంవల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. చనిపోవడానికి ముందు రవి తన ఫోన్నుంచి 'నా చావు వార్త విన్నాక తప్పకుండా నా వద్దకు రా.. నన్ను చూడు.. మనం బహుషా మరో జన్మలో కలుసుకుంటామేమో' అని వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ పంపించినట్లు తెలిసింది. -
రాష్ట్రానికి కర్ణాటక షాక్!
500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేక్ వేసవిలో వురింత కటకట సెక్షన్ 11 ప్రయోగించి సరఫరా నిలుపుదల కేంద్ర నిర్ణయూనికి వ్యతిరేకంగా చర్య సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుమారు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేకులు వేసింది. దీంతో వేసవిలో వురింత కటకట తప్పని దుస్థితి రానుంది. జాతీయ విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 11ను ప్రయోగించి.. కర్ణాటకలోని వివిధ విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కాకుండా నిలుపుదల చేసింది. తమ రాష్ర్టంలో విద్యుత్ కొరతను తగ్గించుకోవడానికే కర్ణాటక ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని జేఎస్‌డబ్ల్యు, శాలివాహన తదితర సంస్థల నుంచి సుమారు 500మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం గత ఏడాది ఫిబ్రవరిలోనే టెండర్లు పిలిచారు. 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. మార్చి వరకు కర్ణాటకలోని విద్యుత్ సంస్థల నుంచి మన రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరిగింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం సరఫరాను నిలిపివేసింది. దీనిపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సరికాదంటున్న కేంద్రం: ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను పూర్తిగా ఆ రాష్ట్రానికే ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను (ఐపీపీ) శాసించే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత ఏడాదిలో లేఖలు కూడా రాసింది. బయటి మార్కెట్లో విద్యుత్‌ను అమ్మకుండా ఐపీపీలను నియంత్రించడం సరికాదని పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికే పరిమితమై ఆలోచిస్తే... దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితి దెబ్బతింటుందని ఈ లేఖలో అభిప్రాయపడింది. జాతీయ విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 11ను ప్రయోగించి బయటి మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించకుండా నియంత్రించడం సరికాదని పేర్కొంది. వాస్తవానికి సెక్షన్ 11 ప్రకారం కేవలం విద్యుత్‌ను ఉత్పత్తి చేయూలంటూ ఆదేశించే అధికారం మాత్రమే రాష్ట్రానికి ఉంటుంది. సొంత రాష్ట్రానికే విద్యుత్‌ను సరఫరా చేయాలని నిబంధన విధించే అధికారం లేదు. -
అక్రమ గనుల లెసైన్సుల రద్దు
సాక్షి, బళ్లారి (కర్ణాటక): సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన 51 గనుల లెసైన్సులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చే సింది. అలా రద్దయిన గనుల కంపెనీల యజమానుల్లో కాంగ్రెస్ నేతలే అధికంగా ఉన్నారు. బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్, జిల్లాకు చెందిన మంత్రి సంతోష్‌లాడ్, హొస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్పలకు చెందిన మైనింగ్ కంపెనీల లెసైన్సులు రద్దయ్యాయి. అయితే, మంత్రి పదవుల నుంచి కూడా వారిని తొలగిస్తారా? లేదా? అన్న చర్చ సాగుతోంది. బీజేపీ, ఇతర పార్టీల వారే అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని అప్పటి కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే ఎన్నికల్లో అక్రమ గనుల యజమానులకు టికెట్లను కేటాయించి, గెలిచిన తర్వాత వారిని మంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో అక్రమ గనుల తవ్వకాల్లో కాంగ్రెస్ వారే అధికంగా ఉండటంతో వారి లెసైన్సులు రద్దు చేస్తారా లేదా అన్నదానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సి వచ్చింది. -
కార్మికుల పిల్లల విద్యకు రూ. వెయ్యి కోట్లు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కార్మికుల పిల్లల విద్య కోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ నాయక్ వెల్లడించారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి మహా నగర పాలికెలో ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు ఆశ్రమ పాఠశాలలను కార్మికుల పిల్లల కోసమే ప్రత్యేకంగా నిర్మించనున్నట్లు తెలిపారు. వీటిల్లో ఒకటో తరగతి నుంచి పీయూసీ వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు చెప్పారు. ఈ పాఠశాలల్లో బోధన ప్రైవేటు సంస్థలకు దీటుగా ఉండాలనే లక్ష్యంతో వీటి నిర్వహణను ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు అప్పగించే ఆలోచన ఉందన్నారు. పీయూసీ లేదా డిప్లొమా చదువుతున్న కార్మికుల పిల్లలకు ఏడాదికి రూ.20 వేల ప్రోత్సాహక ధనాన్ని, ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు నెలకు రూ.2 వేలు చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తామని వివరించారు. బృహత్ బెంగళూరు మహా నగర పాలికె పరిధిలో రూ.24 కోట్ల వ్యయంతో నాలుగు కల్యాణ మంటపాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రూ.3 కోట్లు చొప్పున ఖర్చుతో నిర్మిస్తామని చెప్పారు. సెస్ రూపంలో బిల్డర్ల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ.2,066 కోట్లు కార్మిక శాఖ వద్ద ఉందన్నారు. కనుక నిధుల కొరత ఎదురు కాబోదన్నారు.