యువతిపై దాడి ఘటనలో వివరణ కోరిన రాహుల్ | Tanzanian student assault case: Rahul Gandhi asks Karnataka Govt to explain and send report i | Sakshi
Sakshi News home page

యువతిపై దాడి ఘటనలో వివరణ కోరిన రాహుల్

Published Thu, Feb 4 2016 9:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

Tanzanian student assault case: Rahul Gandhi asks Karnataka Govt to explain and send report i

న్యూఢిల్లీ : బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి ఘటనకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... కర్ణాటక ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ సంఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక పంపించాలని ఆయన గురువారం ఆదేశించారు.

 

కాగా రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా దాడికి సంబంధించి టాంజానియా హై కమిషనర్ కేంద్ర  విదేశాంగ మంత్రి సుష్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మ స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం, ఇతర అధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement