సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ఘనతను బీజేపీ ప్రభుత్వం గుర్తించిందంటూ ఆదివారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.
‘‘సుష్మా గారు.. మీకు ధన్యవాదాలు. ఐఐటీ, ఐఐఎంల గురించి మీ ప్రసంగంలో ప్రస్తావించారు. కనీసం ఇలాగైనా మా పార్టీ గొప్పతనాన్ని గుర్తించారు ’’ అంటూ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్ని నెలకొల్పి మేధావులను తయారుచేస్తుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందంటూ సుష్మా ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తమ ప్రభుత్వ హయాంలోనే నెలకొల్పామన్న ఉద్దేశ్యంతో రాహుల్ కామెంట్ చేశారన్న మాట.
మరోవైపు సోషల్ మీడియా రాహుల్ ట్వీట్‌కు వెనువెంటనే పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. ఐఐటీ, ఐఐఎంలతోపాటు బడా స్కాంలు కూడా మీ హయాంలో జరిగాయని, మీరు పార్టీ గురించి మాట్లాడితే.. సుష్మా దేశం గొప్పతనం గురించి మాట్లాడరని ఇలా రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
Sushma ji, thank you for finally recognising Congress governments' great vision and legacy of setting up IITs and IIMs
— Office of RG (@OfficeOfRG) September 24, 2017
Congress gave corruption
— jithendra damodar (@gee2pree) September 24, 2017
Congress gave Dynasty
Congress gave Cast divide
Congress gave communal riots too
😂😂😂