తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులను జయ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి కర్ణాటక తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ 2003 నవంబర్ 18న సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టును, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014 వరకు ఈ కోర్టులో విచారణ జరిగింది. ఈ పదేళ్లలో రూ. 2.86 కోట్లు ఖర్చయినట్లు లెక్కగట్టారు.