'కేజీఎఫ్' ఫేమ్ యష్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఊహించని వివాదంలో ఈ చిత్రబృందం చిక్కుకుంది. అన్యాయంగా వేలాది చెట్లు నరికేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమే అనేలా కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్‌పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?
బెంగళూరులోని పీణ్య-జలహళ్లి దగ్గరలో యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్ చేస్తున్నారు. అయితే చిత్రీకరణ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములని గెజిట్‌లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండానే హెచ్‌ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది.
(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడి పర్స్ కొట్టేశారు)
కానీ వ్యాపార అవసరాల కోసం హెచ్‌ఎంటీ భూమిని అద్దెకు ఇస్తోంది. ఈ క్రమంలోనే 'టాక్సిక్' చిత్రబృందం కొన్నిరోజుల కోసమా అని లీజుకు తీసుకుంది. కానీ సెట్స్ వేసేందుకు వందలాది ఎకరాల అటవీ భూమిలోని చెట్లను నరికివేశారని విమర్శలొచ్చాయి. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ ప్రాంతాన్ని సందర్శించి మరీ శాటిలైట్ ఫొటోలు తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అనుమతి లేకుండా చెట్లను నరికడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.
ఇది జరిగి కొన్నిరోజులు అవుతుండగా కర్ణాటక అటవీశాఖ ఇప్పుడు సీరియస్ అయింది. టాక్సిక్ మూవీ నిర్మాతలపై కేసు పెట్టింది. అలాగే కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్‌పైన కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడీ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment