
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున మిథున్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈయన పాల్గొన్న సభలో దొంగలు చేతివాటం చూపించారు. ఏకంగా ఈయన పర్స్ కొట్టేశారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)
పర్స్ పోయిందనే విషయాన్ని గుర్తించిన మిథున్ చక్రవర్తి.. నిర్వహకులకు చెప్పగ వాళ్లు మైక్‌లో, పర్స్ తిరిగిచ్చేయమని చాలాసేపు బతిమాలాడారు. అయినా సరే ఎవరూ పర్స్ తిరిగివ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన మిథున్ చక్రవర్తి.. ఉండాల్సిన టైమ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తి.. కొన్నాళ్ల క్రితం నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ 'గోపాల గోపాల' మూవీలో చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు. ఏదేమైనా ఈయన పర్స్ పోవడం, తిరిగిచ్చేయమని నిర్వహకులు బతిమాలడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!)

Comments
Please login to add a commentAdd a comment