jharkhand elections
-
Jharkhand: జేఎంఎంకే పట్టం
జార్ఖండ్‌లో అధికారం మారబోతోందా?. మళ్లీ అదే ప్రభుత్వం కొనసాగనుందా? మరికొద్ది గంటల్లో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. -
Jharkhand Election: మొదటి దశ ముగిశాక బీజేపీ, జేఎంఎం వాదనలివే..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13 జరిగింది. తొలి విడత పోలింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌ను అభివృద్ది దిశగా నడిపేందుకు, మనం కన్న కలలను నెరవేర్చుకునేందుకు తొలి దశ ఎన్నికల్లో అందరూ ఓటువేశారన్నారు.బీజేపీ కుట్రలను తుదముట్టించి, కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చారు. శౌర్య భూమి అయిన సంతాల్, ఉత్తర ఛోటానాగ్పూర్లలో బీజేపీ పన్నిన కుట్రలను తుదముట్టించాలని హేమంత్ పేర్కొన్నారు.ఇదేవిధంగా ఓటింగ్ ముగిసిన 43 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసిగి వేసారిన మహిళలు.. గూండాలు, అక్రమార్కులను పెంచి పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ఓటు వేశారన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ సిబ్బంది, పోలీసులకు బాబులాల్ మరాండీ కృతజ్ఞతలు తెలిపారు.ఇది కూడా చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం -
ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున మిథున్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈయన పాల్గొన్న సభలో దొంగలు చేతివాటం చూపించారు. ఏకంగా ఈయన పర్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)పర్స్ పోయిందనే విషయాన్ని గుర్తించిన మిథున్ చక్రవర్తి.. నిర్వహకులకు చెప్పగ వాళ్లు మైక్‌లో, పర్స్ తిరిగిచ్చేయమని చాలాసేపు బతిమాలాడారు. అయినా సరే ఎవరూ పర్స్ తిరిగివ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన మిథున్ చక్రవర్తి.. ఉండాల్సిన టైమ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.బాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తి.. కొన్నాళ్ల క్రితం నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ 'గోపాల గోపాల' మూవీలో చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు. ఏదేమైనా ఈయన పర్స్ పోవడం, తిరిగిచ్చేయమని నిర్వహకులు బతిమాలడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
జార్ఖండ్ పోలింగ్: 65 శాతం ఓటింగ్ నమోదు
Updatesజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం పోలింగ్ నమోదు64.86 pc voters exercise franchise in first phase Jharkhand polls till 5 pmRead @ANI Story | https://t.co/tFstV6aCDt#Jharkhandelections #SeraikellaKharsawan #Ranchi #voterturnout pic.twitter.com/EbdTX3lkW8— ANI Digital (@ani_digital) November 13, 2024 మధ్యా హ్నం 3 గంటల వరకు 59.28 శాతం పోలింగ్ నమోదుభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని పోలింగ్ బూత్‌లో సతీమణి సాక్షితో కలిసి ఓటు వేశారు.మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్ నమోదైంది.सराइकेला खरसावाँ जिलांतर्गत कुचाई प्रखंड के नक्सल प्रभावित क्षेत्र जैसे जाम्बरो, रेगाबेड़ा,कोमाय, गिलुआ,सियाडीह,तरंबा मतदान केंद्रों पर कड़ी सुरक्षा के बीच भयमुक्त और शांतिपूर्ण वातावरण में मतदान।@ECISVEEP @SpokespersonECI #VoteDeneChalo pic.twitter.com/xM3z1eYJqV— Chief Electoral Officer, Jharkhand (@ceojharkhand) November 13, 2024 బీజేపీ నేత జయంత్ సిన్హా హజారీబాగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | BJP leader Jayant Sinha casts his vote in Hazaribag as polling in the first phase of Jharkhand Assembly elections is underway pic.twitter.com/3JNGBaGveV— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి సోనాపిలోని ప్రాథమిక విద్యాలయం వద్ద ఓటర్లు నక్సల్స్ బెదిరింపులను ధిక్కరించి భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చారు. నక్సలైట్లు.. పోస్టర్లు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా బలగాలు పోస్టర్లు, అడ్డంకులను విజయవంతంగా తొలగించాయి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌లోని సోనాపి, జగన్నాథ్‌పూర్ పోలింగ్ బూత్ నంబర్ 25లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.Voters at Prathmik Vidyala Sonapi defied naxals threat and came out in huge numbers to vote. Naxalite put up posters and tried obstructing the way. Security forces successfully removed the posters and obstacles and by 11 AM, 60% voting turnout was recorded at polling booth number… pic.twitter.com/ugpccrm3D5— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 29.31 శాతం ఓటింగ్ నమోదైంది#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Hemant Soren, his wife Kalpana Soren cast their votes at a polling station in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/QCOCNn57p8— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.04 శాతం ఓటింగ్ నమోదు#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు అర్జున్ ముండా, ఆయన భార్య మీరా ముండా ఓటు శారు.సెరైకెలా ఖర్సావాన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.పొత్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మీరాముండా బరిలో ఉన్నారు.#WATCH | Former Union Minister and BJP leader Arjun Munda, his wife Meera Munda show their inked fingers after casting vote at a polling station in Seraikela KharsawanMeera Munda is BJP's candidate from Potka Assembly constituency. #JharkhandAssemblyPolls2024 https://t.co/Xu8vO30qAR pic.twitter.com/mvKTxUy56H— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.ఒడిశా గవర్నర్ , జార్ఖండ్ మాజీ సిఎం రఘుబర్ దాస్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటువేశారు.#WATCH | #JharkhandAssemblyElections: Odisha Governor and former Jharkhand CM Raghubar Das along with his family show their inked finger after casting their votes at a polling station in Jamshedpur. He says "It is the responsibility of the people to come out and use their… pic.twitter.com/QwUeRj0S3a— ANI (@ANI) November 13, 2024 కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి ఓటు హకక్కు వినియోగించుకున్నారు.కోడెర్మాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.#WATCH | Koderma, Jharkhand: Union Minister Annapurna Devi shows her inked finger after casting vote at a polling station in Koderma#JharkhandElections2024 pic.twitter.com/qpuLt4hEO9— ANI (@ANI) November 13, 2024 రాంచీలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.పోలీసులు డ్రోన్లను ఉపయోగించి నిఘా పెట్టారు.#WATCH | Ranchi, Jharkhand: Police use drones for surveillance in Ranchi as voting is underway for the first phase of #JharkhandAssemblyElections2024 pic.twitter.com/cjZow4klOn— ANI (@ANI) November 13, 2024 హజారీబాగ్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మున్నా సింగ్ ఓటు వేశారు.హజారీబాగ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు తీసుకురావడానికి ఓటు వేయాలని హజారీబాగ్ ఓటర్లందరినీ అభ్యర్థించారు.#WATCH | Hazaribagh, Jharkhand: After casting his vote, Congress candidate from Hazaribagh Assembly seat Munna Singh says, "I request all voters of Hazaribagh to vote to bring development and prosperity in Hazaribagh."#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/ljbEs0xlAP— ANI (@ANI) November 13, 2024 పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి: ప్రధాని మోదీజార్ఖండ్ తొలి దశ పోలింగ్‌లో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓరట్లను కోరారు. తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు క్యూలైన్లలో ఉన్నారు. PM Modi urges citizens to vote with full enthusiasm in Jharkhand pollingRead @ANI Story | https://t.co/DlZb7WiwWK#PMModi #Jharkhandpolls #Assemblyelections pic.twitter.com/ogsyZoxYqU— ANI Digital (@ani_digital) November 13, 2024 జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. జంషెడ్పూర్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అజోయ్ కుమార్ ఓటు వేశారు. జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | East Singhbhum, Jharkhand: Congress candidate from Jamshedpur East, Dr Ajoy Kumar casts his vote at a polling station in Jamshedpur. pic.twitter.com/2Hen7AFJd1— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ ఓటు వేశారు.#WATCH | #JharkhandAssemblyElection: Union Minister Sanjay Seth casts his vote at a polling station in Ranchi. pic.twitter.com/DFMWrKKrlK— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.జంషెడ్పూర్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి, జేడీయూ నేత ఓటు హక్కు వినియోగించుకున్నారు.సరయూ రాయ్ జంషెడ్పూర్ వెస్ట్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా పోటీ చేస్తున్నారు. #WATCH | Jharkhand: NDA candidate from Jamshedpur West Assembly seat and JDU leader Saryu Roy casts his vote at a polling booth in Jamshedpur West Congress's Banna Gupta is contesting against him. pic.twitter.com/KIK8I2yJUD— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Santosh Kumar Gangwar, Governor of Jharkhand casts his vote at a polling booth in Ranchi, Jharkhand #JharkhandAssemblyElections2024 pic.twitter.com/bwRe4JFlzB— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ కొనసాగుతోంది.రాంచీలోని జవహర్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలైన్లో ఉన్నారు.#WATCH | People queue up at a polling station in Ranchi to vote in the first phase of Jharkhand Assembly electionsVisuals from a polling station in Jawahar Nagar pic.twitter.com/MVWrj3OnuU— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. రాంచీలోని పోలింగ్ బూత్ నంబర్లు 50,60, 61 పోలింగ్ జరుగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లతో నిల్చున్నారు.ఈ సందర్భంగా ఓ మహిళ సంప్రదాయ డోలు వాయిస్తూ ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు.#WATCH | Ranchi: A woman plays a traditional drum and appeals to people to vote during the first phase of Jharkhand assembly elections.(Visuals from polling booth numbers 50,60 and 61 in Ranchi) pic.twitter.com/bjE5uDHQVp— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది.ఈ దశలో 81 స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.జంషెడ్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటుర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. #WATCH | Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Visuals from a polling centre in Jamshedpur pic.twitter.com/cqSwJqSV6c— ANI (@ANI) November 13, 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు.తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. #WATCH | Preparations underway at St Columbus College polling booth in Hazaribagh, ahead of the first phase of voting to be held today.#JharkhandAssemblyPolls2024 pic.twitter.com/EY6WBe9YiT— ANI (@ANI) November 13, 2024 తొలిదశ పోలింగ్ జరుగుతున్న 43 స్థానాల్లో 17 జనరల్, 20 ఎస్టీ రిజర్వ్, ఆరు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపయి సోరెన్ పోటీ చేస్తున్న సెరాయ్‌కెల్లా నియోజకవర్గంలోనూ ఇవాళే పోలింగ్ జరునుంది.కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి బరిలో దిగారుఇక్కడ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కోడలు పూర్ణిమా సాహూ పోటీచేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సతీమణి గీత బీజేపీ తరఫున బరిలో దిగారు. ఇక్కడ కాంగ్రెస్ నేత సోనారాం సింకూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జంషెడ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నేత, ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా పోటీచేస్తున్నారు. ఈయనపై జేడీయూ నేత సరయూరాయ్ బరిలోకి దిగారు. సరయూరాయ్ 2019లో నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌నే ఓడించడం విశేషం. రాంచీలో ఈసారి జేఎంఎం ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మహువా మాఝీని రంగంలోకి దింపింది. తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి!బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
‘ఇదే నా సవాల్.. దమ్ముంటే అలా చెప్పాలి’
రాంచి : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సీఏఏపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలలో భయాల్ని రెచ్చగొట్టి అల్లర్లకు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని బెర్హైత్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ ద్వారా కాంగ్రెస్.. దాని అనుబంధ పార్టీ నాయకులకు ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్లకు దమ్ముంటే.. పాకిస్తానీయులకు భారత పౌరసత్వం ఇవ్వడం తమకు సమ్మతమేనని, ఆర్టికల్ 370 కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పాలి. అప్పుడు వారినేం చేయాలో భారత ప్రజలే నిర్ణయిస్తారు’అని అన్నారు. ఏ ఒక్క భారతీయుడి హక్కులకు పౌరసత్వ చట్టం విఘాతం కలిగిందని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాల్లో ఉన్న.. పీడనకు గురవుతున్న మైనారిటీల కోసం ఈ చట్టం తెచ్చాం. 2015కు ముందు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం. దీంతో భారత ప్రజల హక్కులకు భంగం ఎలా కలుగుతుంది..? కాంగ్రెస్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కావాలనే ముస్లిం ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ విభజించు పాలించు విధానంతో ఇప్పటికే దేశం ఓసారి ముక్కలైంది. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మళ్లీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ’అని ప్రధాని వ్యాఖ్యానించారు. -
జార్ఖండ్‌లో కింగ్... కశ్మీర్లో కీలకం!
-
జార్ఖండ్ కొత్త సీఎం ఎవరు?
రాంచీ: జార్ఖండ్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీతో విజయం కట్టబెట్టడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సంప్రదింపులు ప్రారంభించింది. అయితే, సీఎం పదవి ఎవరిని వరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రఘువర్‌దాస్, సరయూరాయ్, మాజీ సీఎం అర్జున్‌ముండా సీఎం పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జార్ఖండ్ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం పీఠానికి అర్జున్ ముండా పేరుపై జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికల్లో ఓడిపోవడం ముండాకు ప్రతికూలంగా మారనుంది. ప్రజలు తిరస్కరించిన వారికి బదులు కొత్తవారితో ప్రయోగం చేసేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ముండాకు సీఎం చాన్స్ లేనట్లే. ఇక, రఘువర్‌దాస్ 2010లో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. జంషెడ్పూర్ ప్రజల మద్దతును చూసి గర్విస్తున్నానని, జార్ఖండ్ ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని రఘువర్‌దాస్ ప్రకటించడం చూస్తే సీఎం పీఠంపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సరయూరాయ్కు ఆర్ఎస్ఎస్ మద్దతు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నది బుధవారం తెలియనుంది. -
జార్ఖండ్‌లో కింగ్... కశ్మీర్లో కీలకం!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మెజారిటీ; జమ్మూకశ్మీర్‌లో ‘మిషన్ 44’ విఫలం ⇒కశ్మీర్లో అతిపెద్ద పార్టీగా పీడీపీ; రెండో స్థానంలో కమలం ⇒ఒక స్థానంలో ఓడి, మరో స్థానంలో గెలిచిన ఒమర్ అబ్దుల్లా ⇒రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా ఓడిన కాంగ్రెస్ సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆశలు పెట్టుకున్న మోదీ హవా జార్ఖండ్‌లో స్పష్టంగా కనిపించగా, కశ్మీర్లో అనుకున్నంత ప్రభావం చూపలేదు. జార్ఖండ్‌లో 42 స్థానాలతో బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ 37, మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5 సీట్లు గెలుపొంది, మెజారిటీకి అవసరమైన 41 కన్నా ఒకటి ఎక్కువగా సాధించాయి. కశ్మీర్లో 28 స్థానాల్లో గెలిచి పీడీపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘మిషన్ 44’ ఆశించిన ఫలితమివ్వలేదు. కానీ, గత ఎన్నికలకన్నా మెరుగైన ఫలితాలు సాధించిం ది. 2008 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచిన కమలదళం ఈసారి 25 స్థానాలు గెలుచుకుంది. అవన్నీ జమ్మూ ప్రాంతంలోనివే కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల శాతంలో బీజేపీనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయ పరంపరను కొనసాగించింది. కశ్మీర్లో 12 స్థానాలతో 4వ స్థానంలో, జార్ఖండ్‌లో 11 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది. కశ్మీర్లో 2008 ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అధికారంలోకి వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయి 15 సీట్లే గెలుచుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ నవంబర్ 25-డిసెంబర్ 20 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆశల పల్లకీ.. జమ్మూకశ్మీర్ స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల సభలో పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కశ్మీర్ ప్రజలు పట్టించుకోలేదు. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదవడంతో విజయంపై బీజేపీ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. 87 స్థానాల అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా 44 స్థానాల మెజారిటీ ఇవ్వకుండా ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠకు తెరలేపారు. నంబర్ గేమ్‌ను తెరపైకి తెచ్చి అన్ని ప్రధాన పార్టీలకు అధికారంలోకి వచ్చే అవకాశం కల్పించి ఆశలు రేపారు. జమ్మూలోని మూడు ప్రధాన ప్రాంతాల్లోని ఫలితాల్లో స్పష్టమైన భేదం కనిపించింది. మొత్తం 25 స్థానాలనూ జమ్మూలోనే గెలుచుకున్న బీజేపీ.. కశ్మీర్ లోయ, లడఖ్ల్లోని 50 స్థానాల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. జమ్మూలోని మొత్తం 37 స్థానాలున్నాయి. మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్ లోన్ నేతృత్వంలోని జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫెరెన్స్ 2 స్థానాల్లో, జేకేపీడీఎఫ్, సీపీఎం చెరో సీట్లో గెలుపొందగా, స్వతంత్రులు 3 నియోజకవర్గాల్లో గెలిచారు. బీజేపీకి 23%, పీడీపీకి 22.7%, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 20.8%, కాంగ్రెస్‌కు 18% ఓట్లు లభించాయి. రెండు స్థానాల్లో పోటీ చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా సోనావర్ స్థానంలో ఓటమి పాలై.. బీర్వా సీటును కేవలం 1,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. ఓడిన ప్రముఖుల్లో ఒమర్ మంత్రివర్గంలోని కాంగ్రెస్ నేత అబ్దుల్ రాథర్ ఒకరు. 1977 నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చిన రాథర్ తొలిసారి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచిన ముఖ్యుల్లో పీడీపీ ముఖ్యనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్(అనంత్‌నాగ్), జేకే బ్యాంక్ మాజీ చైర్మన్ హసీబ్ ద్రాబు(పుల్వామా) తదితరులున్నారు. ఒమర్ ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేయనున్నారు. కాగా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పీడీపీ సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. బీజేపీతో పీడీపీకి సైద్ధాంతిక వైరుధ్యాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వడంతో.. ఆ పార్టీతోనూ కలిసే పరిస్థితులపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది. కశ్మీర్, జార్ఖండ్‌లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటవుతాయని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, కశ్మీర్‌లోయలో బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో ఒక్కరు మినహా అం దరూ డిపాజిట్లు సైతం కోల్పోవడం అక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. లోయలోని 46 సీట్లలో 34 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. హబ్బా కదల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోతీ కౌల్ మాత్రమే 2,596 ఓట్లు సాధించి డిపాజిట్ నిలుపుకున్నారు. కశ్మీర్ ఎన్నికల్లో 47,652 మంది ఓటర్లు నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ-పైన పేర్కొన్న ఎవరికీ కాదు) గుర్తుకు ఓటేశారు. సుస్థిర ప్రభుత్వం దిశగా.. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన 14 ఏళ్ల తరువాత.. ఇన్నాళ్లూ అస్థిర ప్రభుత్వాల ప్రతికూల ప్రభావాలను చవిచూసిన జార్ఖండ్ ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు. ప్రచారంలో మోదీ వాడిన అభివృద్ధి మంత్రం కూడా పనిచేసి 81 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 37, ఆ పార్టీ మిత్రపక్షం ఏజేఎస్‌యూ 5 సీట్లు గెలుచుకున్నాయి. అధికార జేఎంఎం 19 సీట్లలో, కాంగ్రెస్ 6, జేవీఎం 8 స్థానాల్లో గెలుపొందాయి. 2009 ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో అంతకు రెట్టింపునకు పైగా స్థానాలు గెలుచుకోవడం విశేషం. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జేఎంఎం నేత, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బారైత్ స్థానం నుంచి 24 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ సిటింగ్ స్థానమైన దుమ్కాలో ఓటమి పాలయ్యారు. ఆయన మంత్రివర్గంలోని 9 మంది ఓడిపోయారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జేవీఎం(పీ) 8 స్థానాల్లో గెలుపొందింది. కానీ మరాండీ గిరిధ్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు జేడీయూ, ఆర్జేడీలు ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 31.4%, జేఎంఎం 20.5%, జేవీఎం(పీ) 10%, కాంగ్రెస్ 10.3% ఓట్లు సాధించాయి. బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఖార్సావన్ స్థానం నుంచి ఓటమి పాలు కాగా, మరో కీలక నేత, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ జంషెడ్పూర్ నుంచి గెలుపొందారు. ఏజేఎస్‌యూ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహతో సిలీ స్థానం నుంచి, మరో మాజీ ముఖ్యమంత్రి, జైభారత్ సమతా పార్టీ చీఫ్ మధు కోడా మాఝ్గావ్లో ఓడిపోయారు. ఆయన భార్య గీతా కోడా జగంత్పూర్ నుంచి గెలుపొందారు. మొత్తంమీద సీఎంలుగా పనిచేసిన నలుగురు, ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం విశేషం. అర్జున్ ముండా (బీజేపీ), తారాచంద్ (మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్), బాబూలాల్ మరాండి(జార్ఖండ్ వికాస్ మోర్చా), హేమంత్ సోరెన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), మధుకోడా (జయభారత్ సమతా పార్టీ), ఏజేఎస్‌యూ పార్టీ అధినేత, మాజీ డిప్యూటీ సీఎం సుదేశ్ కుమార్ ఓడిపోయిన వారిలో ఉన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాజీనామా చేశారు. -
జార్ఖండ్‌లో బీజేపీ పాగా?
ఐదు దశల్లో ఎన్నికలు ముగిసిన జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా, రెండూ కమలానికే పట్టంగట్టాయి. ఏబీపీ నీల్సన్ సంస్థ నిర్వహించిన పోల్స్‌లో.. బీజేపీ 52, జేఎంఎం 10, కాంగ్రెస్ పార్టీ 9, జేవీఎం 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. ఇక ఇండియాటుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో అయితే బీజేపీ 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్ 7-11, జీవీఎం 0, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ జేఎంఎం- కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. -
‘హింసను వీడి దేశాన్నిబలోపేతం చేయండి’
భవనాథ్పూర్: హింసాకాండకు స్వస్తిపలికి జనజీవన స్రవంతిలోకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పలు బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీరావడానికి హింసనుమాని దేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని నక్సల్స్‌ను కోరారు. రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసేందుకు, కేంద్రప్రభుత్వంతో కలసిమెలసి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని, ఇకపై తెల్లజెండాలు ఎగురవేయాల్సిన పనిలేదని బీఎస్ఎఫ్ను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.