జార్ఖండ్లో బీజేపీ పాగా?
ఐదు దశల్లో ఎన్నికలు ముగిసిన జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా, రెండూ కమలానికే పట్టంగట్టాయి. ఏబీపీ నీల్సన్ సంస్థ నిర్వహించిన పోల్స్లో.. బీజేపీ 52, జేఎంఎం 10, కాంగ్రెస్ పార్టీ 9, జేవీఎం 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు.
ఇక ఇండియాటుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అయితే బీజేపీ 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్ 7-11, జీవీఎం 0, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ జేఎంఎం- కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది.