Exit polls
-
ఖబర్దార్.. ఢిల్లీ దంగల్
-
Exit Polls: ఢిల్లీలో అంచనాలు తప్పేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్ మాత్రం ‘హ్యాట్రిక్’ విజయంపై ధీమాతోనే ఉంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls)ను ఆప్ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్‌పోల్స్ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.‘‘ఈ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్‌పోల్స్ నివేదికలతో ఫుల్ జోష్‌లో ఉంది. బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్(Weepresie), మైండ్ బ్రింక్లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.అధికారంపై బీజేపీ ఆశలు1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్‌ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
బీజేపీకి జైకొట్టిన పీపుల్స్ పల్స్ కొడిమో ఎగ్జిట్ పోల్స్
-
ఢిల్లీలో కమల వికాసం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా సున్నా చుడుతుందని స్పష్టం చేశాయి. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని రెండు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే మొగ్గు మాత్రం బీజేపీవైపేనని తెలిపాయి. ఆప్ గెలుస్తుందని మరో రెండు చెప్పుకొచ్చాయి. బీజేపీకి 51 నుంచి 60 దాకా రావచ్చని, ఆప్ 10 నుంచి 19కి పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. కాంగ్రెస్ సున్నా చుడుతుందని చెప్పింది. బీజేపీకి 40–44, ఆప్‌కు 25–29, కాంగ్రెస్‌కు 2 సీట్లొస్తాయని పీపుల్స్ ఇన్సైట్ చెప్పింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈసారి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. అందరి కళ్లూ 8వ తేదీన వెలువడబోయే ఫలితాలపైనే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. విజయానికి 36 సీట్లు కావాలి. ప్రస్తుత అసెంబ్లీలో ఆప్‌కు ఏకంగా 62 సీట్లున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చగా బీజేపీ నేతలు విజయంపై ధీమా వెలిబుచ్చారు. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘనవిజయం సాధించింది. -
ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆప్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేయనుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని విడుదల చేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను అధికార ఆమ్ ఆద్మీ కొట్టి పారేసింది. శనివారం విడుదల కానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఎగ్జిట్ పోల్స్అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కొద్ది సేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అప్ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడారు. 2015, 2020 ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అప్పడు మేం అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. VIDEO | Delhi Elections 2025: On exit poll predictions, AAP leader Reena Gupta (@Reena_Guptaa) says: "You look at any exit poll historically, AAP is always given a smaller number of seats, whether its 2013, 2015 or 2020. But whatever is shown, AAP gets a lot a greater number of… pic.twitter.com/KZmGNzg6XK— Press Trust of India (@PTI_News) February 5, 2025మరో నేత సుశీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇది మా నాలుగో ఎన్నిక. ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ మాకు వ్యతిరేకంగా వచ్చాయి. కానీ మేం ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేశాం. విజయం సాధిస్తూ వచ్చాం. ఈ సారి కూడా అంతే. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పనిచేశారు. మా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. తిరిగి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’ అని అన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్-కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.పీపుల్స్‌పల్స్-కొడిమోబీజేపీ-51-60ఆప్- 10-19కాంగ్రెస్-0ఇతరులు-0ఏబీపీ-మ్యాట్రిజ్బీజేపీ- 35-40ఆప్ - 32-37కాంగ్రెస్- 0-1టైమ్స్ నౌబీజేపీ-39-45ఆప్-29-31కాంగ్రెస్-0-2చాణక్య స్ట్రాటజీస్బీజేపీ-39-44ఆప్-25-28రిపబ్లికన్ పీ మార్క్ బీజేపీ 39-41ఆప్ 21-31ఆత్మసాక్షిబీజేపీ 38-47ఆప్ 27-30కాంగ్రెస్ 0-3పీపుల్ ఇన్సైట్ బీజేపీ-40-44ఆప్- 25-29కాంగ్రెస్- 0-1జేవీసీబీజేపీ 39-45ఆప్ 22-31కాంగ్రెస్ 0-2 -
ఢిల్లీలో ఆ పార్టీదే హవా..! ఎగ్జిట్ పోల్స్ విడుదల
సాక్షి,న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తయింది. పోలింగ్ పూర్తయిన వెంటనే సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది..వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న దానిపై పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్-కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.పీపుల్స్‌పల్స్-కొడిమోబీజేపీ-51-60ఆప్- 10-19కాంగ్రెస్-0ఇతరులు-0ఏబీపీ-మ్యాట్రిజ్బీజేపీ- 35-40ఆప్ - 32-37కాంగ్రెస్- 0-1టైమ్స్ నౌబీజేపీ-39-45ఆప్-29-31కాంగ్రెస్-0-2చాణక్య స్ట్రాటజీస్బీజేపీ-39-44ఆప్-25-28రిపబ్లికన్ పీ మార్క్ బీజేపీ 39-41ఆప్ 21-31ఆత్మసాక్షిబీజేపీ 38-47ఆప్ 27-30కాంగ్రెస్ 0-3పీపుల్ ఇన్సైట్ బీజేపీ-40-44ఆప్- 25-29కాంగ్రెస్- 0-1జేవీసీబీజేపీ 39-45ఆప్ 22-31కాంగ్రెస్ 0-2తుది ఫలితాల్లో మాదే విజయం: ఆప్ ధీమా ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆమ్ఆద్మీపార్టీ స్పందించింది. తమకు ఎగ్జిట్ పోల్స్‌లో ఎప్పుడూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని, చివరకు విజయం సాధించేది తామేనని ఆప్ నేత రీనా గుప్తా అన్నారు.2013,2015,2020 ఎన్నికల్లో ఇదే జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. VIDEO | Delhi Elections 2025: On exit poll predictions, AAP leader Reena Gupta (@Reena_Guptaa) says: "You look at any exit poll historically, AAP is always given a smaller number of seats, whether its 2013, 2015 or 2020. But whatever is shown, AAP gets a lot a greater number of… pic.twitter.com/KZmGNzg6XK— Press Trust of India (@PTI_News) February 5, 2025 -
జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు..
-
ఎగ్జిట్ పోల్స్ డిబేట్లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. -
వారం పాటు ‘ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలు, 48 శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సందర్భంగా మీడియా సంస్థలు లేదా మరే ఇతర పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు ఎగ్జిట్ పోల్స్ఫై ఆంక్షలు విధించారు. -
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈసీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న, జార్ఖండ్‌కు రెండు విడతల్లో నవంబర్ 13న, 20న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారుఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు శాంపిల్ సైజ్ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.చదవండి:మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. -
ఎగ్జిట్‌పోల్స్.. జమ్ము కశ్మీర్లో విజయం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్(90 స్థానాలు) ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా అక్టోబర్ ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ 46. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఇలా..మెగా ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్:33బీజేపీ: 27కాంగ్రెస్: 12పీడీపీ: 08ఇతరులు: 10 #JammuAndKashmir #Elections2024 #HaryanaElections2024#HaryanaElection #JammuKashmir #Exitpoll #ExitpollFirst EXIT-POLL by Electoral Edge for the J&K Assembly Polls 2024 :- NC : 33 - BJP : 27- INC : 12- PDP : 08- OTH : 10 pic.twitter.com/OCxFdPK6dv— Himanshu Singh (@Himans304) October 5, 2024దైనిక్ భాస్కర్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి: 35-40బీజేపీ: 20-25పీడీపీ: 04-07ఇతరులు: 12-16.పీపుల్స్ పల్స్ ప్రకారం.. నేషనల్ కాన్ఫరెన్స్: 33-35కాంగ్రెస్: 13-15బీజేపీ: 23-27పీడీపీ: 7-11ఇతరులు: 04-05.రిపబ్లిక్ మ్యాట్రిజ్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్: 15 కాంగ్రెస్: 12బీజేపీ: 25పీడీపీ: 28.ది కశ్మీరియల్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్: 26-30కాంగ్రెస్: 08-14బీజేపీ: 24-29పీడీపీ: 06-09ఇతరులు: 10-20Exit polls by @TheKashmiriyat show a tight race. If BJP secures 30 seats, they could form the government with support from independents and regional parties like AiP, AP etc. Expect a closely contested outcome. pic.twitter.com/rR5VDVZcEE— Muzzafar مظفر 🇵🇸 (@MuzzafarCh) October 5, 2024 -
Peoples Pulse Exit Polls 2024: జమ్ము కశ్మీర్లో బిగ్ ట్విస్ట్.. గెలుపు ఎవరిదంటే?
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని సేకరించింది.సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్ము కశ్మీర్లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్‌సభ సభ్యులు ఇంజినీర్ రషీద్‌కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.కాంగ్రెస్-జేకేఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది కాంగ్రెస్-జేకేఎన్సీ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ది చేకూరింది. జమ్మూలో కాంగ్రెస్ పేవలమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసివచ్చింది. అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఏఐపీ) ఒక్క సీటుకే పరిమితం కావచ్చు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు దాదాపు 4 నుండి 5 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తి చూపారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. అభివృద్ధిలో కొంత మెరుగ్గా ఉందని 30 శాతం మంది అభిప్రాయపడినా, 40 శాతం కంటే ఎక్కువ మంది గత 5-6 సంవత్సరాలలో అభివృద్ధికి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించలేదని చెప్పారు. 22 శాతం మంది అభివృద్ధి మరింత దిగజారిందన్నారు. ఇటీవల శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని 30 శాతం మంది చెప్పగా, మిగతావారు పెదవి విరిచారు. జమ్ము కశ్మీర్ పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పలు హామీలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భద్రతకు సంబంధించి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, విద్యాపరంగా అభివృద్ధిపై ప్రజల్లో ఆందోళన కనిపించింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, రాష్ట్ర హోదాను తొలగించి లడఖ్‌ను వేరు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమైంది. రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని 67 శాతం మంది గట్టిగా కోరారు. జమ్ము కశ్మీర్లో 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, జేకేపీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఈ సంకీర్ణ ప్రభుత్వం 2018లో రద్దయ్యింది. 2022లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుండి 90 పెరగడంతో రాజకీయంగా ఇది కీలకంగా మారింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుండి 43కు పెరగగా, కశ్మీర్ లోయలో సీట్లు 46 నుండి 47కు పెరిగాయి. పీపుల్స్ పల్స్, డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్ము కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వే నిర్వహించాయి. శాస్త్రీయమైన పద్దతిలో ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ నుండి నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రోల్ రోల్స్ నుండి అన్ని ప్రాంతాల్లో కులం, మతం, వయస్సు, పురుషులు, మహిళలు సరిసమాన నిష్పత్తిలో ఉండేలా ఎంపిక చేసుకొని మొత్తం 2016 శాంపిల్స్ సర్వే కోసం సేకరించడం జరిగింది.సర్వే కోసం తయారు చేసిన నిర్మాణాత్మకమైన ప్రశ్నాపత్రంతో సంస్థ తరఫున రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను ముఖాముఖిగా కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో పీపుల్స్ పల్స్ సీనియర్ పరిశోధకులు జి. మురళీకృష్ణ, ఐ.వి. మురళీకృష్ణశర్మ రూపొందించారు.-ఆర్.దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
ఫ్రాన్స్ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్ గుబులు
పారిస్: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?
జూన్ 1న ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు! ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4న స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్ మార్కెట్‌కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్‌పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ జరిగిందా అన్నది ప్రశ్న.మే 31–జూన్ 4 మధ్య నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజి (ఎన్.ఎస్.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్’ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. మొదటిది– మే 31న ఎన్.ఎస్.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. రెండవది– ఎన్.ఎస్.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్ ఇన్వెస్టర్లే (ఎఫ్ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. మే 31కి, జూన్ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం జూన్ 3న స్టాక్ మార్కెట్ రాకెట్లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్ మార్కెట్ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్ మార్కెట్లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్ పోల్స్ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్ పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లీక్ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్ పోల్స్‌ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్ పోల్స్ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్ టైమ్స్’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు. ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్ మార్కెట్‌కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
-
పైకి ధీమా.. లోన టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కే ఓటేశారని, దీంతో జహీరాబాద్‌లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు. విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్ఎస్కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.ఇవి చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు -
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్ ఎడిటర్ రాజీదీప్ సర్దేశాయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు రాజ్‌దీప్ సర్దేశాయ్ చురకలంటించారు.స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్ రాహుల్ కన్వల్ స్పందిస్తూ.. కేజ్రివాల్ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్ సోరేన్ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ 2021లో పశ్చిమ్ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. -
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కా
సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్ భాస్కర్ గ్రూప్... రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ తద్భిన్నం.. బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్ఎన్ న్యూస్–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్‌సీపీగానీ అటు ఎన్డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా? విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్ సీపీ గుర్తును కూడా ఆప్ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసుకుంది. మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్ తక్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో టుడేస్ చాణక్య వెల్లడించడం గమనార్హం. జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్... జూన్ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. వైఎస్సార్సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్ కావడం.. మహిళలు ఎన్డీఏ కూటమి కంటే వైఎస్సార్సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్ నాడు అక్రమాలకు తెగబడటానికే! రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్ సీపీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు. -
మళ్లీ ఫ్యాన్ హవా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అగ్నివీర్.. ఆరా మస్తాన్.. ఆత్మసాక్షి.. జన్మత్పోల్.. ఆపరేషన్ చాణక్య... ఏబీపీ సీఓటర్... ఇలా పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్కటే ఫలితాలు! ‘ఫ్యాన్’ మరోసారి సునామీ సృష్టిస్తుందని అంచనా వేసి చెబుతున్నాయి. గత నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయా లను క్రోడీకరించి ఈ సంస్థలు శనివారం వెల్లడించాయి. ఏవో ఒకటీ రెండు మినహా మిగతావన్నీ ఒకేతరహా ఫలితాలను అంచనావేస్తూ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని చేపట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం అప్పటి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ సంచలన విజయానికి వ్యూహరచన చేశారు. పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ గత ఐదేళ్లలో ప్రజలకు చేరువయ్యారు. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినా రాష్ట్రంలో మాత్రం ఆయన పర్యవేక్షణలో వైద్యసేవలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శప్రాయం అయ్యాయి. అందుకే ‘మీ ఇంటిలో మంచి జరిగిందంటేనే ఓటు వేయండి’ అని ధైర్యంగా అడిగిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలమనసులో ఒక దమ్మున్న నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలనే సంకల్పంతోనే ఓటర్లు గతంలో కనీవినీ ఎరుగని రీతిలో గత నెల 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే రోజున ఓటర్ల నాడి తెలుసుకునేందుకు కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌కు నడుంబిగించాయి. 👉 విజయం మళ్లీ వారిదే... రెండు జిల్లాల్లోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు వైఎస్సార్సీపీకే అండగా నిలిచారని ఎగ్జిట్ పోల్స్ తేలి్చచెప్పాయి. ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకూ బారులు తీరి మరీ సంక్షేమ ప్రభుత్వానికే ఓటు వేశారని అంచనా వేస్తున్నాయి. బీసీలు, పేద, అణగారిన వర్గాలు అత్యధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో ఫ్యాన్‌దే హవా ఉంటుందని చెప్పకనే చెప్పాయి. అంతేకాదు వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా విజయపతాకం ఎగురవేయనున్నారని అంచనా వేశాయి. ఈ ప్రకారం... 👉విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ మరోసారి విజయం సాధించనున్నారు. అరకు లోక్‌సభ స్థానంలో కొత్తగా బరిలో నిలిచిన డాక్టర్ తనూజారాణి కూడా గెలుపు సాధించనున్నారు. 👉ఉపముఖ్య మంత్రి పీడిక రాజన్నదొర సాలూరు (ఎస్టీ) నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీడీపీ కూటమి అభ్యరి్థని మట్టికరిపించి అభిమానుల మనసులో మన్యం పులిగా నిలిచిపోనున్నారు. మరో రెండు ఎస్టీ నియోజకవర్గాలైన కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోనున్నారు. 👉ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన పార్వతీపురం, రాజాంలో కూడా వైఎస్సార్సీపీ జెండా మరోసారి రెపరెపలాడనుంది. పార్వతీపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగుపెట్టించిన అలజంగి జోగారావు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రజలు ఆశీర్వదించినట్టు సర్వేలు తేల్చాయి. రాజాం ప్రజలకు వైద్యసేవలతో చేరువైన డాక్టర్ తలే రాజేష్ కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించనున్నారు. 👉బీసీల జిల్లాలో తమను విస్మరించి అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించిన టీడీపీ కూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి తమ విజయాన్ని నమోదు చేయనున్నారు. బొబ్బిలిలో టీడీపీ కూటమి అభ్యర్థి బేబీ నాయన గెలుపు ఖాయమంటూ ఓ వర్గం గత రెండేళ్లుగా ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడైన శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడికే మద్దతు పలికారనే సంకేతాలు వెలువడుతున్నాయి. శృంగవరపుకోటలో కూడా కడుబండి శ్రీనివాసరావు ప్రత్యర్థుల ఆశలను గల్లంతు చేస్తూ మంచి మెజార్టీతో మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. 👉విజయనగరం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులతో రూపురేఖలు మార్చేసిన డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియరు నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి గెలుపు ఖాయమనే క్యాడర్ అంచనాలు వాస్తవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.వైఎస్సార్సీపీదే పైచేయి... ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు కొత్తగా జిల్లాల ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లా నుంచి విలీనమైన రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చాటిచెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ఈ రెండు జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వీటి పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4వ తేదీన వెల్లడికానున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా అదే తరహాలో సునామీని సృష్టిస్తాయని వైఎస్సార్సీపీ క్యాడర్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు అదే తరహాలో ఫలితాలు ఉంటాయని చాటిచెబుతున్నాయి. ఈ తీపికబురుతో వైఎస్సార్సీపీ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. 4వ తేదీన కౌంటింగ్‌కు ఎంతో ఉత్సాహంతో సిద్ధమవుతున్నవారిలో ఊపు తీసుకొచ్చింది. -
తెలంగాణలో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా, జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో పోటాపోటీ వాతావరణం ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఈ రెండుపార్టీలు నువ్వా, నేనా అన్నంత స్థాయిలో పోటీపడినట్టుగా ఆయా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను.. బీజేపీ అధిక ఎంపీ సీట్లలో గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తే.. అదేస్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ మరికొన్ని సంస్థలు లెక్క వేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నేసి గెలుస్తాయంటే.. ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా ఏకంగా బీజేపీ 11–12 సీట్లలో, జన్‌కీబాత్ 9–12 సీట్లలో బీజేపీ గెలుపొందుతుందనిఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని ఆరా(08–09), ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ (08–10), న్యూస్ 18 సంస్థ (07–10) అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై చాణక్య స్ట్రాటజీ సంస్థ 09–10,, ఏబీసీ–సీ ఓటర్ 07–09, పీపుల్స్ పల్స్ 07–09, ఆరా 07–08 స్థానాలు లెక్కన సర్వే ఫలితాలు వెల్లడించాయి. మొత్తంగా వివిధ సంస్థల అంచనాల్లో...కొంచెం అటూ ఇటుగా బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సగం సీట్ల మేర గెలుచుకోవచ్చనే విధంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఇమేజీ ప్రభావంతో బీజేపీకి మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇక అన్ని సంస్థల ఎగ్జిట్‌పోల్స్ బీఆర్ఎస్కు నిరాశాజనక ఫలితాలే రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నాయి. దాదాపుగా అన్ని మెజారిటీ సర్వే సంస్థలు హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం నిలుపుకుంటుందని పేర్కొనడం గమనార్హం. -
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్సార్సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. ‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
-
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్ సర్వేఆరా మస్తాన్ సర్వే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్ లాబొరేటరీపోల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్ఎస్ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్ఎస్కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్ స్టార్ట్ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్ చాణక్య ఆపరేషన్ చాణక్య ప్రకారం.. కాంగ్రెస్ 7, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్ ఆఫ్ ఇండియాటైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్ఎస్ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్ 24న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. -
నో డౌట్ పక్కా సీఎం జగన్
-
వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..
-
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
-
2019 ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది?
ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఈరోజుతో ముగియనున్నాయి. ఆ తర్వాత అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.పలు ఏజెన్సీలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకూ నిజమయ్యాయో ఇప్పుడు చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని స్పష్టంగా వెల్లడయ్యింది. ఫలితాల్లో కూడా అదే జరిగింది. 2019లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీనే రికార్డు స్థాయిలో 303 సీట్లు దక్కించుకుంది.2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ 90 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను ఎన్డీఏ 49 సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్‌లో వెలువడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 సీట్లు గెలుచుకుంది. రాయ్‌బరేలీ సీటు ఎస్పీకి దక్కింది. 10 సీట్లు బీఎస్పీ, కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.ఎగ్జిట్ పోల్స్‌లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీలకు 29 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 71 బీజేపీకి, రెండు అప్నాదళ్‌కు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్ఏడీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..
జూన్ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్ ట్యాగులు ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో!. -
ఎగ్జిట్ ఉత్కంఠ
సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. మన రాష్ట్రంలో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ ముగిసినా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. చివరిదశ పోలింగ్ నేడు(శనివారం) ముగియనుంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగుస్తుంది. దీంతో 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ను సర్వే సంస్థలు వెల్లడించనున్నాయి. దీని కోసం బెట్టింగ్ రాయుళ్లు, రాజకీయపార్టీల నేతలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ నాలుగో తేదీన ఉన్నప్పటికీ ఎగ్జిట్‌పోల్స్‌తో గెలుపోటములపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ ‘ఎగ్జిట్’ ఉత్కంఠ నెలకొంది. – సాక్షిప్రతినిధి కర్నూలు: సార్వత్రిక సమరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. పోలింగ్, కౌంటింగ్‌కు 22 రోజులు గడువుంది. ఈ మధ్యలో జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు జరిగాయి. 14 అసెంబ్లీలలో అభ్యర్థుల విజయావకాశాలను బట్టి అభ్యర్థులు ఎవరికివారు లెక్కలు వేసుకుని ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కొంతమంది పోలింగ్‌రోజే ఎగ్జిట్‌పోల్స్ చేయించారు. మరికొందరు పోలింగ్ ముగిసి తర్వాత పోలింగ్‌బూత్‌ల వారీగా ఏజెంట్లు, ముఖ్యనేతలను పిలిపించుకుని బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలై ఉంటాయనే లెక్కలు వేసుకున్నారు. ఆపై అభ్యర్థులు, ముఖ్యనేతలు వారి పరిధిలో పరిచయం ఉన్న మీడియా ప్రతినిధులు, సర్వేసంస్థల ప్రతినిధులను కలిసి ఓ అంచనాకు వచ్చారు. దీని ప్రకారం బెట్టింగ్‌లు కాశారు.ఉమ్మడి జిల్లాలో రూ. వంద కోట్లకుపైగా బెట్టింగ్లుఅసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా బెట్టింగ్‌లు నడిచాయి. గత నాలుగు ఎన్నికల ఫలితాలు, ఈ దఫా జరిగిన పోలింగ్‌ను బట్టి రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కై వసం చేసుకుంటుందనే అభిప్రాయం ప్రజలతో పాటు రాజకీయపార్టీల్లో కూడా స్పష్టత ఉంది. అయితే ఏ అసెంబ్లీ వైఎస్సార్సీపీ గెలుస్తుంది? ఎక్కడ టీడీపీ గెలుస్తుందనే అంశంలోనే అందరిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశమే బెట్టింగ్‌లు భారీగా కాసేందుకు ప్రభావం చూపింది. ఫలానా అసెంబ్లీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుస్తుందంటే, లేదు అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్‌లకు సిద్ధమయ్యారు. బెట్టింగ్‌లు చాలా రకాలుగా జరిగాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు? ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఇలా రకరకాలుగా బెట్టింగ్‌లు కాశారు. మెజార్టీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, మెజార్టీ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుస్తుందని బెట్టింగ్ నిర్వహించారు. అప్పటి వరకూ 1:1 లెక్కన బెట్టింగ్ జరిగింది. పల్లెల్లో రూ.50వేలు, లక్ష నుంచి ఓ స్థాయి నాయకులు రూ.10లక్షలు, రూ.50లక్షలు బెట్టింగ్ కాశారు. మరికొందరు గుంపుగా ఏర్పడి రూ.కోటి, 2కోట్లు కూడా బెట్టింగ్ కాశారు.సీఎం వ్యాఖ్యల తర్వాత మారిన తీరుపోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఆపై నాలుగురోజులకు 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ల కంటే అధిక స్థానాలు గెలువబోతున్నామని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇదే అందరిలోనూ గుబులు రేకిత్తించింది. పక్కా సమాచారం లేకుండా సీఎం వ్యాఖ్యానించరని, కచ్చితమైన రిపోర్టులతోనే ఈ ప్రకటన చేశారని అంతా భావించారు. ఈ ప్రకటనల తర్వాత చాలామంది బెట్టింగ్‌లు వెనక్కి తీసుకున్నారు. అయితే తర్వాత నాలుగైదురోజులకు బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య 1:2, 1:3 లెక్కల బెట్టింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అంశంలోనూ ఈ రకమైన పందమే జరిగింది. దీంతో చాలామంది టీడీపీ నేతలు, బెట్టింగ్‌రాయుళ్లు పోతే ఒకటే, గెలిస్తే 2, 3 రెట్లు డబ్బు వస్తుందని పందెం కాశారు. దీంతో తిరిగి పందేలు ఊపందుకుని రూ.100 కోట్లకుపైగా జరిగి ఉంటాయని తెలుస్తోంది. కొందరు పొలాలు, స్థలాలు కూడా పందెం కాశారు. మరి కొంతమంది యువకులు విదేశీపర్యటనల ఖర్చును బెట్టింగ్ కాశారు. అయితే నగదుపై జరిగిన బెట్టింగ్ ఎక్కువగా ప్రొద్దుటూరు, విజయవాడ, గుంటూరుతో పాటు తూర్పు, పశ్చిమ గోదావారి ప్రాంతంలోని వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. వీరితో పాటు హైదరాబాద్ కేంద్రంగా కూడా ఇక్కడి వ్యక్తులు బెట్టింగ్ కాచారు. రెండువైపుల నగదును హైదరాబాద్‌లోని మధ్యవర్తులకు ఇచ్చారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా రేపు వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటితో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉంది. అయితే.. నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. రేపు అంటే జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 తరువాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ పేర్కొంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో అంతటా పోలింగ్ ముగిసిన తర్వాతే వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు మార్చి 28వ తేదీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈసీ స్పష్టం గా పేర్కొంది. -
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అప్పటి వరకూ ఎగ్జిట్ పోల్స్ వద్దు.. ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 19 ఉదయం 7.00 నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒపీనియన్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించడం నిషేధమని నోటిఫికేషన్లో ఈసీఐ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. -
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్‌ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్‌లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్‌గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్‌ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్‌నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్‌గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్‌రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్‌కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
నయా పాలి‘ట్రిక్స్’.. గెలిచేది సారే.. వచ్చేది కారే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నిలక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్కువ సంఖ్యలో ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో సైలెంట్ వేవ్‌తో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సెలైంట్ వేవ్‌తో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని గెలిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. Silent wave is mostly favorable to BRS just like the same happened in West Bengal - Prof. Sanjay Kumar pic.twitter.com/eii3WZ7Kqc — చార్వాక (@Charwaka99) December 1, 2023 మరోవైపు.. కొందరు సోషల్ మీడియాలో వేదికగా కూడా కేసీఆర్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నిలకల్లో ‘చేయి’ ఎత్తి ‘కారు’ను ఆపడం సాధ్యమేనా అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎవరి విశ్లేషణలో వారు బిజీగా ఉన్నారు. మరోవైపు, గెలుపు ఓటములు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తూ పంచ్‌లు విసురుతున్నారు. నాకెందుకో ఈసారి కూడా తెలంగాణ లో "కార్" తిరుగుతుందని అనిపిస్తుంది,.. "చెయ్యి" ఎత్తి "కార్" ని ఆపగలం అనుకుంటున్నారు కానీ, అది సాధ్యం కాదని రేపు తెలుస్తుంది...😄 #TelanganaElections #KTR #BRSParty #KCRHattrick #KCROnceAgain — పంచభట్ల సారంగపాణి (@Siddart9Praveen) December 2, 2023 ఇక, థర్డ్ విజన్ నాగన్న సర్వే ఎగ్జిట్‌పోల్స్ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా సమీకరణాలను వెల్లడించింది. బీఆర్ఎస్ దాదాపు 60-68 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు 33-40 సీట్లు వస్తామయని తెలిపింది. Now Third Eye Vision Naganna Survey has also been released and the Prediction is clear BRS party led by #KCR garu is forming Government once again in #TelanganaAssemblyElections2023 థర్డ్ ఐ విజన్ నాగన్న సర్వే కూడా ఎన్నికల్లో కేసిఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి… pic.twitter.com/0F0H8VFeYI — Dinesh Chowdary (@dcstunner999) November 29, 2023 -
Madhya Pradesh: ఐ డోంట్ కేర్.. మాజీ సీఎం వ్యాఖ్యలు
భోపాల్: తాను ఏ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోనని, మధ్యప్రదేశ్ ఓటర్లపై తనకు నమ్మకం ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికం బీజేపీకే ఆధిక్యాన్ని ఇచ్చాయి. అత్యధిక సీట్లతో ఆ పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలను ప్రకటించాయి. మరోవైపు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ గణనీయ స్థానాలు సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘నేను ఏ పోల్ (ఎగ్జిట్) గురించి పట్టించుకోను. మధ్యప్రదేశ్ ఓటర్లపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లో ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ అలా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా కనీసం 140 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండోర్-1 నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గియాదే పైచేయిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో వచ్చినప్పటికీ ఆయన దేశానికి బలమైన నాయకుడు అవుతాడేమో కాని తన అసెంబ్లీ నియోజకవర్గానికి కాదని, అక్కడ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. -
రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు?
రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వివిధ పార్టీల నేతలకు గుండె దడను పెంచాయి. ఫలితాలు వెలువడకముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ బలమైన స్వతంత్రులను, రెబల్స్‌గా ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులతో సంప్రదింపులు మొదలుపెట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పార్టీ నుండి టిక్కెట్ రాకపోవడంతో రెబల్‌గా ఎన్నికలలో పోటీ చేసిన చిత్తోఢ్‌గఢ్ తిరుగుబాటు అభ్యర్థి చంద్రభన్ సింగ్ అక్యాతో బీజేపీ టచ్‌లో ఉందని అంటున్నారు. ఇలాంటి తిరుగుబాటు నేతలు తమ కుటుంబ సభ్యులేనని, వారు ఎక్కడికీ వెళ్లరని, వారితో టచ్‌లో ఉన్నామని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా ప్రయత్నాలను ప్రారంభించింది. తమ పార్టీ రెబల్స్, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులను కూడా సంప్రదించడం మొదలుపెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, తమ విజయవంతమైన పాలనకు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కూడా అదే జరగనుందని’ అన్నారు. డిసెంబర్ 3న వెలువడే ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకే మెజారిటీ వస్తుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత? -
మినీ కురుక్షేత్రంలో విజేతగా నిలిచేదెవరు ?
-
రెండు ఎగ్జిట్‌పోల్స్ సర్వేల్లో గెలిచాడట!
రెండు ఎగ్జిట్‌పోల్స్ సర్వేల్లో గెలిచాడట! -
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్‌లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం -
ఎగ్జిట్ పోల్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్షన్
-
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
-
ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. -
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. అధికార బీఆర్ఎస్కు 36 శాతం ఓట్లతో 34–44 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లతో 63–73 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 14శాతం ఓట్లతో 4 నుంచి 8 సీట్లు రావొచ్చని.. ఎంఐఎం 8శాతం ఓట్లతో 5–7 సీట్లు సాధించవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గురువారం పోలింగ్ ముగియగానే.. జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేశాయి. చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా శుక్రవారం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. బీఆర్ఎస్ సర్కారుపై వివిధ వర్గాల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఎగ్జిట్‌పోల్ సర్వేలో కనిపించిందని పేర్కొంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇవ్వడం, వారిపై స్థానికంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపిందని విశ్లేషించింది. ప్రాంతాల వారీగా పరిశీలన జరిపి రాష్ట్రంలో ఉత్తర, మధ్య (సెంట్రల్), దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల వారీగా ఇండియాటుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగిందని.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్దే పైచేయిగా ఉందని వివరించింది. దక్షిణ, మధ్య తెలంగాణలలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిందని, ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ► ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 5 సీట్లు రావొచ్చని పేర్కొంది. ► దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్కు 6, కాంగ్రెస్‌కు 27, బీజేపీకి ఒక స్థానం వస్తాయని అంచనా వేసింది. ► మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 22 సీట్లు సాధించవచ్చని తెలిపింది. ► హైదరాబాద్‌లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఎంఐఎం 6 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ► తెలంగాణ తదుపరి సీఎంగా కేసీఆర్ ఉంటే బాగుంటుందని 32శాతం మంది, రేవంత్‌రెడ్డి కావాలని 21 శాతం మంది, ఇతర కాంగ్రెస్ నాయకుడు సీఎం కావాలని 22 శాతం మంది, బీజేపీ నాయకుడు ఉంటే బాగుంటుందని 12 శాతం మంది తమ సర్వేలో పేర్కొన్నట్టు వెల్లడించింది. ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ అంచనాలివీ పార్టీ-- సీట్లు-- ఓట్ల శాతం బీఆర్ఎస్ 34–44 32 శాతం కాంగ్రెస్ 63–73 42 శాతం బీజేపీ 4–8 14 శాతం ఇతరులు (ఎంఐఎం సహా) 5–8 (ఎంఐఎం–8%, ఇతరులు–4%) -
మ్యాజిక్ ఫిగర్.. ఎంతెంత దూరం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపోటములపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈసారైనా అధికారంలోకి వస్తున్నామా, లేదా అన్నదానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలమనే లెక్కలు, ‘చేతి’కి మొగ్గు ఉందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమవుతాయా, మ్యాజిక్ ఫిగర్ దాటి పవర్లోకి వస్తామా అన్న దానిపైనే శుక్రవారం పొద్దంతా కాంగ్రెస్ శ్రేణులు చర్చలతో గడిపాయి. కౌంటింగ్‌కు మరోరోజు ఉన్న నేపథ్యంలో.. ఎన్ని స్థానాల్లో గెలుస్తాం? ఎక్కడెక్కడ గట్టి పోటీ అవకాశముంది? ఎక్కడెక్కడ ఓడిపోవచ్చు? దక్షిణ తెలంగాణను నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్, శివారు నియోజకవర్గాల పరిస్థితేంటి? అన్న అంశాలపై నేతలు లెక్కలు వేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇదే తీరు కావడం గమనార్హం. ఉత్కంఠలో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాము గెలుస్తామా లేదా అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతూ.. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో తమ కు పడిన ఓట్లెన్ని? ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత తక్కువ వస్తాయనే అంశాలతో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కోసం ఏజెంట్లు, వారికి కావాల్సిన పత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నామో, కౌంటింగ్ కేంద్రాల్లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తేడా రాకుండా కౌంటింగ్‌ను పరిశీలించాలని ఏజెంట్లకు సూచనలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏఐసీసీతో సంప్రదింపులు తెలంగాణ ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వారికి వివరిస్తూ, ఏయే పరిణామాలు తలెత్తితే ఎలా ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. మరోవైపు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పోలింగ్ సరళిపై ఇచ్చిన నివేదికలో పార్టీకి అధికారం వస్తుందని పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా టీపీసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. హైదరాబాద్‌లోని రేవంత్, భట్టి నివాసాలకు పలువురు పార్టీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఏ జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న దానిపై చర్చించారు. పూర్తి మెజార్టీ రాకుంటే ఏం చేద్దాం? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఆదివారం వెలువడే ఫలితాల్లో పార్టీకి వచ్చే సీట్లను బట్టి పావులు ఏఐసీసీ, టీపీసీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎలాంటి సమస్యా ఉండదని నేతలు పేర్కొంటున్నారు. కానీ ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా పూర్తి మెజార్టీ రాకుంటే.. గెలిచిన నాయకులందరినీ తక్షణమే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టిందని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపాలని నిర్ణయించిందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ శనివారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక కొన్నిసీట్లు తక్కువపడితే ఎంఐఎం మద్దతు తీసుకోవాలా, వద్దా? అన్న అంశంపైనా ఏఐసీసీతో టీపీసీసీ నేతల సంప్రదింపుల సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. -
ఆగమెందుకు.. మళ్లీ మనమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆగమాగం, పరేశాన్ ఎందుకు అయితున్నరు. మళ్లా మనమే గెలుస్తున్నం. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మళంగా ఉండండి. 3వ తేదీన అందరం కలసి సంబురాలు చేసుకుందాం..’’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం పొద్దంతా ఓటింగ్ సరళి, ఇతర అంశాలపై సమీక్షించిన సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ నెల 4న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, కేబినెట్ భేటీ నిర్వహణకు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రగతిభవన్‌కు బారులు తీరిన నేతలు సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకోగా.. శుక్రవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు ప్రగతిభవన్‌కు బారులు తీరారు. పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మంత్రి నిరంజన్‌రెడ్డి, మధుసూదనాచారి, బాల్క సుమన్‌తోపాటు నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన నేతలు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కే సానుకూలంగా ఉంటాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావులతో సమీక్ష పార్టీ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వార్రూమ్ల నుంచి, వివిధ వర్గాల నుంచి అందిన గణాంకాలు, నివేదికలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జులు, అభ్యర్థుల నుంచి అందిన వివరాలను విశ్లేంచారు. కీలక నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్‌లో ఓటింగ్ సరళిపైనా పోస్టుమార్టం చేశారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్కు అనుకూలంగానే ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హంగ్ ఫలితాలకు అవకాశం లేదని, స్పష్టమైన మెజారిటీతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్స్ లెక్క! అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తనను కలసిన నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పకడ్బందీగా చేసిన పోల్ మేనేజ్‌మెంట్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చీల్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్కే సానుకూలత ఉందని చెప్పినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఎగ్జాక్ట్ పోల్‌నే లెక్క అని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారని.. ఏజెంట్ల నియామకం మొదలు ప్రక్రియ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో పార్టీ అభ్యర్థులతో టచ్‌లో ఉండాలని కేటీఆర్, హరీశ్‌రావులకు సూచించారని తెలిసింది. -
ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు ఆసక్తికర వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే కీలక నెంబర్లను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్ పేర్కొంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. BRS.. 34-44 Congress.. 63-73 BJP.. 4-8 Others.. 5-8 ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు స్పష్టం పేర్కొంది ఇండియా టుడే. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లేనట్టేనని ఇండియా టుడే తెలిపింది. ఇక, గురువారం ఎగ్జిట్‌పోల్స్‌లో పలు సర్వేలు కాంగ్రెస్, బీజేపీకి రెండింటికి ఛాన్స్ ఉందని తెలిపిన విషయం తెలిసిందే. According INDIA Today - Axis my India Congress winning 68 seats I. Telangana!#ExitPolls #ExitPolls2023 #ExitPoll pic.twitter.com/WoeSqLf8t1 — Ashish Singh (@AshishSinghKiJi) December 1, 2023 -
ఇండిపెండెంట్లే కీలకం.. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు. రాజస్థాన్‌లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. -
రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
కావేవీ మీమ్స్‌కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్‌లకు డిమాండ్ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది. #ExitPoll Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/NDKixJkBaL — वेल्ला इंसान (@vella_insan1) November 30, 2023 Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/KcEHtjVb5S — Pakchikpak Raja Babu (@HaramiParindey) November 30, 2023 Resort owners right now after Exit poll predicts hung assembly #ExitPolls pic.twitter.com/7dx0ysXQ9a — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) November 30, 2023 -
ఈసారి ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు..? సీనియర్ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే రానుందని ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి సీఎం ఎవరనేదానిపై రాష్ట్రంలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం సంతోషంగా ఉంది. అయితే ఈసారి మేం అటు ఇటుగా 60 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. హై కమాండ్ నిర్ణయించిన వ్యక్తిని సీఎంగా ఏకగగ్రీవంగా ఎన్నుకుంటాం. రెండున్నరేళ్ల పవర్ షేరింగ్ లాంటి ప్రతిపాదనలేవీ లేవు’ అని సింగ్ దేవ్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ సింగ్ దేవ్ సీఎం పదవి కోసం పోటీపడ్డారు. అయితే భూపేష్ భగేల్‌ను ఆ పదవి వరించింది. ఈ ఏడాది జూన్ దాకా క్యాబినెట్ మంత్రిగా ఉన్న సింగ్‌దేవ్‌ను జూన్‌లో డిప్యూటీ సీఎంగా నియమించారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందన్న అంచనాల నేపథ్యంలో సింగ్ దేవ్ మళ్లీ సీఎం రేసులోకి రావడం విశేషం. #WATCH | On CM face, Chhattisgarh Dy CM and Congress leader T S Singh Deo says, "...In the last five years, our experience related to two and a half years was not good... We decided unanimously that what the high command decides is final... We do not want speculation, as it… pic.twitter.com/txIJ0QROvc — ANI (@ANI) December 1, 2023 ఇదీచదవండి..ఆ ఆటలన్నీ ఆడాం: టన్నెల్ వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
Election Results: ప్చ్.. ఎగ్జిట్ ఎవరికో?
అది 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైం. దశలవారీగా పోలింగ్ జరుగుతూ వస్తోంది. ఫలితాలకు కొన్నిరోజుల ముందు దాదాపుగా ఓ 20 సర్వే సంస్థలు ఎగేసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. అందులో సగానికిపైనే బీజేపీ 90కిపైనే స్థానాలు సాధిస్తుందని.. మరికొన్నేమో ఏకంగా బంపర్ విక్టరీ సాధిస్తుందని చాటింపేసుకున్నాయి. తీరా ఫలితాలు చూస్తే ఒకటి, రెండు సర్వేలు మాత్రమే ఆ అంచనాల్ని అందుకోగా.. మిగతావన్నీ బొక్కాబోర్లా పడ్డాయి. బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చేశాయోచ్.. అని అవి పట్టుకుని అటు బిజీబిజీ చర్చావేదికల్లో పాల్గొనే నేతలు, ఇటు గుంపుగా గుమిగూడి ఓ తెగ మాట్లాడేసుకునే జనాలు.. ఎవరు గెలుస్తారనేది చెప్పేశాం, మా బాధ్యత తీరింది అని చేతులు దులిపేసుకునే సర్వే సంస్థలు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. మరి తీరా ఫలితం వచ్చాక ఆ అంచనాలు సరిపోలుతాయా? అంటే.. తలకిందులే అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతం గుర్తు చేస్తోంది. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమైపోతుంది. ఆ టైంలో ప్రముఖ ఛాన్సెల్స్ ఎగ్జిట్ పోల్స్ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. యూపీఏకు అధికంగా సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. ఎగ్జిట్‌పోల్స్ ఎక్కువసార్లు అంచనాల్ని అందుకోలేకపోతూ వస్తున్నాయి. పక్కా ఫలితం.. అంత వీజీ కాదు ఎగ్జిట్‌పోల్స్‌కు కచ్చితత్వం.. శాస్త్రీయతలు ఉన్నాయా?.. ఆ సంగతిని పక్కనపెడితే.. మీడియా సంస్థలపై ఎగ్జిట్ పోల్స్ ఒత్తిడి మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఓటర్ పల్స్ ఏంటన్నది టీవీ ఛానళ్లకు కచ్చితంగా దొరకడం లేదు. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి అభిప్రాయ సేకరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతా అయ్యాక చూస్తే.. ఓటర్ ఏకంగా ‘అంతరిక్ష పల్టీ’ కొడుతున్నాడు. ఓటు వేసేది ఒకరికని అభిప్రాయ సేకరణలో చెప్పి.. పోలింగ్ టైంలో మరొకరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్ సర్వే సంస్థలు మాత్రం కేవలం ఒక్క శాతం, రెండు శాతమో అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా? సారీ తప్పైంది! ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు. ఒక్కోసారి ఆ అంచనాలు అందుకోవచ్చు.. లేదంటే దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ, ఓటర్ నాడి పసిగట్టలేక ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలే ఎక్కువున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఎగ్జిట్‌పోల్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి కూడా. ఉదాహరణకు 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీటీవీ ఒక అడుగు ముందుకేసింది. ‘‘క్షేత్రస్థాయిలో జరిగిన సమాచార సేకరణ మొత్తం తప్పైంది. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..’’ అంటూ ఎన్డీటీవీ కో చైర్పరసన్ ప్రణోయ్ రాయ్ బహిరంగ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆ మీడియా సంస్థ ఎగ్జిట్‌పోల్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. #BiharResults Final party wise breakdown: RJD 80, JDU 71, BJP 53, INC 27, LJP 2, RLSP 2, HAM 1, CPI 3, Independent 4 — ANI (@ANI) November 8, 2015 సర్వే సంస్థల్లో లోపిస్తోన్న అంశాలు వయస్సు పరంగా ఓటర్లను కలవాలి (యువత, వృద్ధులు, మధ్య వయస్సు) వృత్తి పరంగా ఓటర్లను కలవాలి (రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు) మతం ప్రాతిపదిక తీసుకోవాలి (హిందూ, ముస్లిం, క్రిస్టియన్) కులం ప్రాతిపదిక ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) జెండర్ ప్రాతిపదిక ఉండాలి (పురుషులు వేరు, మహిళల ఓటు తీరు వేరు) ప్రాంతం అత్యంత కీలకం (నగరం, పట్టణం, గ్రామం, కొండ ప్రాంతం, అటవీ సమీప ప్రాంతం) ఓటర్లకు విసుగెత్తి.. ప్రస్తుతం మార్కెట్లో సర్వే చేస్తోన్న సంస్థలో శాస్త్రీయత లోపించడం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే.. సర్వే చేపడుతున్న సెఫాలజిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో.. ఓటర్లు ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చాలా సార్లు లోపం కనిపిస్తోంది. పైగా ఓటరు కచ్చితంగా ఎటు ఓటు వేస్తాడనే దానిపై పక్కా అభిప్రాయం రాబట్టాలని.. చాలా ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా జరిగే సర్వేల సంగతి సరేసరి. పదే పదే ఓటర్లకు ఫోన్లు చేసి విసిగిస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో సాధారణంగానే చికాకులో ఉండే ఓటర్లు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. విద్యార్థుల్ని ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో అసలు ఫలితం చాలా సార్లు తేడా కొడుతోంది. ఈసీ ఏమందంటే.. ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ స్పందించింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అనేవి తెర వెనుక వ్యవహారాలు. వాటిని అసలు అనుమతించకూడదని అన్నారు. ‘‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఇవి కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీటిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు కూడా. నేతలది అలాంటి మాటే.. తమకు అనుకూలంగా వస్తే మంచిది. లేకుంటే చెడ్డది. ఎక్కడైనా ఇది కనిపించే తంతే. అయితే.. ఎగ్జిట్‌పోల్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అనేకం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. న్యూసెన్స్ అంటూనే ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని, పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. పోలింగ్ సమయం అధికారికంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటలకు. అర గంట తర్వాత ఎగ్జిట్‌పోల్స్ బయటకు వచ్చాయి. కానీ, తెలంగాణలో పోలింగ్ కోసం ఓటర్లు సాయంత్రమే ఎక్కువగా వచ్చారని.. రాత్రి 10 గంటలదాకా ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొచ్చా?.. పోనీ ఆ అంచనాలే ఫలిస్తాయా?.. తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే. -
MP: నడిపించేది విజన్.. టెలివిజన్ కాదు.. కమల్‌నాథ్ గీతోపదేశం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రజలు అంతా సిద్ధం చేశారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ పేర్కొన్నారు. బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవచ్చని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు కమల్‌నాథ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలందరికీ వారి బలాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రజలే కాంగ్రెస్ శక్తి. మీ (కార్యకర్తలు) కృషి, అంకితభావం కారణంగానే ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేస్తారు’ అన్నారు. దేశాన్ని నడిపించేది విజన్ అని, టెలివిజన్ కాదని పేర్కొన్న కమల్ నాథ్.. "కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాయి. మరికొన్ని భిన్న అంచనాలను ప్రకటించాయి. వీటిని పట్టించుకోవద్దు" అని సూచించారు. ‘అర్జునిడి లాగా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఓట్ల లెక్కింపు రోజున పూర్తి దృష్టిని కేంద్రీకరించి, కాంగ్రెస్‌కు వచ్చిన ప్రతి ఓటును సరిగ్గా లెక్కించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసుకోవాలి’ అని కార్యకర్తలకు గీతోపదేశం చేశారు. -
70 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం
-
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు: భట్టి విక్రమార్క
-
పోలింగ్ ట్రెండ్స్ తారుమారు అవుతాయి: బీజేపీ నేత బండి సంజయ్
-
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
-
ఎగ్జిట్ పోల్స్ లెక్క ఈసారి పక్కాయేనా..?
-
ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు?
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ పూర్తయింది. డిసెంబర్ 3న వెలువడే ఫలితాల కోసం అటు ప్రజానీకం, ఇటు రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫలితాలకు ముందే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైవిధ్యంగా ఉన్నాయని అన్నారు. దీని గురించి మేం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 130కి పైగా సీట్లు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై విసిగిపోయారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో తమకు పోటీ లేదని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశం, అమిత్ షా వ్యూహాలు, జేపీ నడ్డా నాయకత్వం, కార్యకర్తల కృషి, బీజేపీ ప్రభుత్వ పథకాలు.. మొదలైనవన్నీ రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవి-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 140 నుంచి 159 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర! -
కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడగొడుతున్నాం: రేవంత్
-
కాంగ్రెస్ కు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్..ఎగ్జిట్ పోల్స్ నమ్మం అంటున్న బీఆర్ఎస్
-
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్‌లో 19న, రాజస్థాన్‌లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్‌ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్‌కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్‌కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్‌లో కమల వికాసమే రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్‌లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్‌కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్‌కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్‌కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్‌కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్‌కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్‌కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్‌కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్‌కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్‌గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్‌కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్‌కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్‌కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్‌కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే!
లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి. 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకందని తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
హస్తం గాలి ‘వీచినట్టేనా’!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందనే ధీమా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గురువారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు కనిపించాయని, 70కి పైగా స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికి ప్రజలు తమను ఆదరించారని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలూ తమవైపు మొగ్గుచూపాయనే అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని విజయం దక్కుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్లలో గెలుపు తమదేనని వారు లెక్కలు వేస్తున్నారు. సింగరేణి ప్రాంత ఓటర్లు కూడా తమవైపే నిలిచారని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నారు. ఇక, హైదరాబాద్ శివార్లలో కూడా తమకు భారీగా పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ కూడా తమదే అధికారం అని చెపుతున్న నేపథ్యంలో ఈనెల 3న∙ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్రుతతో ఎదురుచూస్తుండడం గమనార్హం. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్మున్షీ, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ గాం«దీభవన్‌లోని వార్‌రూంలో కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. నియో జకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల నాడి అనుకూలంగానే ఉన్నా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఓట్లన్నీ కచ్చితంగా పోలయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వార్ రూం కోఆర్డినేటర్ విజయభాస్కర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్యాదవ్ వార్‌రూం సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అభ్యర్థులు, స్థానిక పార్టీ నేతలతో మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టి పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఎప్పటికప్పుడు వార్రూంతో టచ్‌లో ఉంటూ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన సునీల్ కనుగోలు ఆయన బృందం కూడా పోలింగ్ సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని స్థానాల్లో సానుకూలత ఉందన్న లెక్కలు కట్టింది. ఆ నాలుగు.. మావే జిల్లాల వారీగా విశ్లేషిస్తే పోలింగ్ తీరును బట్టి నాలుగు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తామనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు వరంగల్ జిల్లాల్లో ఉన్న 46 స్థానాల్లోనే 35 తమకు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోనికి వచ్చే స్థానాల్లో కూడా 4–5 చోట్ల గెలుపునకు అవకాశాలున్నాయని, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10 స్థానాల వరకు చేరుకుంటామని అంటున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఓ 10 సీట్లు ఎక్కువే వస్తాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణను గెలుస్తున్నాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ‘రబ్బిష్ ’అని, డిసెంబర్ 3న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70కి పైగా స్థానాల్లో గెలిచి తీరుతామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. వందకు వంద శాతం తాము మరోమారు అధికారంలోకి వస్తున్నామని, తెలంగాణను గెలుస్తున్నామని అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకమునుపే కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగియకుండా కొనసాగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడి గడువు కుదించడంలో తమ ప్రమేయం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్తకాదు ‘మేము 88కి పైగా స్థానాల్లో గెలుస్తామని అను కున్నా చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయి. జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు సర్వే చేయకుండానే కొద్దిపాటి గణాంకాలను రాకెట్ సైన్స్ లాగా చూపుతారు. ఎగ్జిట్ పోల్స్ పేరిట వారు చేసే న్యూసెన్స్, నాన్సెన్స్‌తో ఆ సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుందనే విషయాన్ని గమనించాలి. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్త కాదు, గతంలోనూ ఇదే తరహాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించి, ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. ప్రజలు ఓ వైపు ఓటు వేస్తున్న సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా సాధ్యమని మేము మిమ్మల్ని నిలదీయవచ్చు కానీ అంతదూరం వెళ్లదలుచుకోలేదు. అనని మాటలు అన్నట్లు సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో చేస్తున్న ప్రచారంపైనా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి. హైదరాబాద్ సహా దేశంలోని అనేక పెద్ద పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో ఏవో చిన్నా చితకా ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీల సహకారంతో ఇది సాధ్యమైంది..’అని కేటీఆర్ అన్నారు. -
Chhattisgarh: 57 అప్పటికి 75 అవుతుంది.. ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బఘేల్
రాయపూర్: ఎగ్జిట్ పోల్ అంచనాలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యాన్నే అందించడాన్ని తోసిపుచ్చుతూ తమ పార్టీ భారీ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా సర్వేలు కాంగ్రెస్‌కు సీట్లు 57 అని అంచనా వేస్తున్నప్పటికీ కౌంటింగ్ రోజైన డిసెంబర్ 3న ఫలితాలు వెలువడే నాటికి ఆ సంఖ్య 75కి పెరుగుతుందన్నారు. గురువారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైన అనంతరం బఘేల్ మీడియాతో మాట్లాడారు. "ఏడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంకెలు స్థిరంగా ఉన్నాయా? రెండు రోజుల తర్వాత, ఈ ఎగ్జిట్-పోల్ అంచనాలలో పేర్కొన్న సంఖ్యలు స్థిరపడతాయి. ఎగ్జిట్-పోల్ అంచనాలతో సంబంధం లేకుండా మేము ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అన్నారు. ఒక ఎగ్జిల్ పోల్ ఫలితాన్ని ప్రస్తావిస్తూ 57 (కాంగ్రెస్ సీట్లు) ఏమిటి? కౌంటింగ్ నాటికి ఇది 75 అవుతుంది అన్నారు. ఇండియా టుడే చాణక్య నిర్వహించిన సర్వేలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 57-66 సీట్లు వస్తాయని, బీజేపీకి 33-42 సీట్లు వస్తాయని, 0-3 సీట్లు ఇతరులకు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు స్వల్ప మెజారిటీ సూచనల నేపథ్యంలో బీజేపీ 'ఆపరేషన్ కమలం' ప్రారంభిస్తుందా అనే దానిపై సీఎం బఘేల్ స్పందిస్తూ వారికి ఆ అవకాశం లేదని, తమకు మెజారిటీ ఉందని, తమ కృషిపై, ప్రజలపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు. మూడు సర్వేలు కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధిస్తుందని అంచనా వేయగా, మరికొన్ని ఆ పార్టీ గెలుపు రేంజ్లో ఉందని చెప్పాయి. ఏబీపీ సీ-ఓటర్ అంచనాల ప్రకారం.. 90 మంది సభ్యుల అసెంబ్లీ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ 41-53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీకి 36-48 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ కాంగ్రెస్‌కు 40-50 సీట్లు, బీజేపీకి 36-46 సీట్లు, ఇతరులకు 1-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు 44-52 సీట్లు, బీజేపీకి 34-42 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వచ్చాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ పోల్ కాంగ్రెస్‌కు 46-56 సీట్లు, బీజేపీకి 30-40 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్ 42-53, బీజేపీ 34-45, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 44.6 శాతం ఓట్లతో 46-54 సీట్లు, 42.9 శాతం ఓట్లతో బీజేపీ 35-42 సీట్లు, 12.5 శాతం ఓట్లతో ఇతరులు 0-2 సీట్లు సాధిస్తాయని పీ-మార్క్ పోల్ పేర్కొంది. -
బీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ షాక్ !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 48 సీట్లే: సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ : ఆరా మస్తాన్ సర్వే తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్‌కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్‌ఎ్‌స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాణక్య స్ట్రాటజీస్లో బీఆర్ఎస్కు 30 సీట్లే.. చాణక్యస్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్‌లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్ఎస్కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ : పల్స్ టుడే పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్ గ్రాఫ్, థర్డ్ విజన్లాంటి సంస్థలు బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది. మెజారిటీ పోల్స్‌లో వెనుకబడ్డ కారు సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది : కేటీఆర్ కాగా, ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది. ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్‌ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్‌లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా.. 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు నిర్మల్‌లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్ ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్ బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్ సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్ సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్ దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్ తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్ మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్ అంబర్ పేటలో కారుకే ఛాన్స్ తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్ కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్ బర్రెలక్క కి 10 వేల ఓట్లు ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్ మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్ ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్ పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది -
మళ్లీ మాదే అధికారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ చూడి కార్యకర్తలు కంగారు పడొవద్దని.. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం(నవంబర్ 30) సాయంత్రం పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు కంగారు పడొద్దు. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌పోల్స్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. క్యూ లైన్లో చాలామందే ఉన్నారు. ఓటింగ్ కచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలైన ఫలితం డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
Rajastan: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సీఎం గెహ్లాట్
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇదివరకే పోలింగ్ పూర్తవగా తెలంగాణలో ఈరోజు పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం గెహ్లాట్ అన్నారు. పార్టీ ఎన్నికల అవకాశాల గురించి సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవలేదు" అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారం ఎవరిదంటే?
ఢిల్లీ/ జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిల్ పోల్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ నెంబర్ 100 మార్క్ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. దీంతో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. అధికార కాంగ్రెస్‌కు మరోసారి పట్టం కడాతరని చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇక, ఎగ్జిట్ పోల్స్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు. రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఎగ్జిట్‌పోల్స్ వివరాలు ఇలా.. పీపుల్స్ పల్స్ సర్వే.. BJP.. 95-115 Congress.. 73-95 Others.. 8-11. ఇండియా టుడే.. BJP.. 55-72 Congress.. 119-141 Others.. 4-11 News Nation BJP.. 89-93 Congress.. 99-103 Others.. 05-09 News18.. BJP.. 111 Congress.. 74 Others.. 14 Republic TV.. BJP.. 118-130 Congress.. 97-107 Others.. 0-2. Jankibaat BJP.. 100-122 Congress.. 62-85 Others.. 14-15. TV9 Bhararvarsh Polstrat.. BJP.. 100-120 Congress.. 90-100. Times Now-ETG.. BJP.. 108-128 Congress.. 56-72. Times Now-ETG Rajasthan Election #ExitPolls2023: BJP Set To Get Majority With 108-128 Seats, Congress To Bag 56-72 #ExitPolls #ElectionsWithMirrorNow #RajasthanElections — Mirror Now (@MirrorNow) November 30, 2023 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీదే హవా !
సాక్షి, ఢిల్లీ : వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి. పీపుల్స్ పల్స్ మొత్తం స్థానాలు 90 బీజేపీ 29-39 కాంగ్రెస్ 54-64 ఇతరులు 2 ఇండియా టుడే బీజేపీ 36-46 కాంగ్రెస్ 40-50 ఇతరులు 0-5 సీఎన్ఎన్ న్యూస్ 18 బీజేపీ 41 కాంగ్రెస్ 46 స్వతంత్రులు 3 జన్ కీ బాత్ బీజేపీ 34-45 కాంగ్రెస్ 42-53 ఇతరులు 0 ఏబీపీ సీ ఓటర్ బీజేపీ 36-48 కాంగ్రెస్ 41-53 ఇతరులు 0 ఇండియా టీవీ సీఎన్ఎక్స్ బీజేపీ 30-40 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 దైనిక్ భాస్కర్ బీజేపీ 36-46 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
Telangana Assembly Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్! ఆసక్తికరంగా..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రకాల ఏజెన్సీలు ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయి. మెజార్టీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని, సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. బీజేపీలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఇలా పోలింగ్ ముగియగానే.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎగ్జిట్ పోల్స్ సైతం వెలువడ్డాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం జనాలు టీవీలకు.. ఫోన్లకు అతుక్కుపోయారు. తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :- సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్-56 బీఆర్ఎస్-48 బీజేపీ-10 ఎంఐఎం-5 సీ-ప్యాక్ కాంగ్రెస్ : 65 బీఆర్ఎస్ : 41 బీజేపీ : 04 ఇతరులు : 09 ఆరా మస్తాన్ సర్వే (ఇది ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58-67 బీఆర్ఎస్ 41-49 బీజేపీ 5-7 ఎంఐఎం, ఇతరులు 7-9 పల్స్ టుడే బీఆర్ఎస్ : 69-71 కాంగ్రెస్ : 37-38 బీజేపీ : 03-05 ఎంఐఎం : 06 ఇతరులు : 01 చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ : 67-78 బీఆర్ఎస్ : 22-30 బీజేపీ : 06-09 ఎంఐఎం : 06-07 ఇతరులు : 00 న్యూస్18 సర్వే బీఆర్ఎస్: 48 కాంగ్రెస్: 56 బీజేపీ: 0 ఎంఐఎం: 5 ఇతరులు: 0 థర్డ్ విజన్ సర్వే బీఆర్ఎస్ 60-68 కాంగ్రెస్ 33-40 బీజేపీ 1-4 ఎంఐఎం 5-7 ఇతరులు- 0-1 పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్(PTS) కాంగ్రెస్: 65-68 బీఆర్ఎస్: 35-40 బీజేపీ: 7-10 ఇతరులు: 6-9 పొలిటికల్ గ్రాఫ్ బీఆర్ఎస్: 68 కాంగ్రెస్: 38 బీజేపీ: 5 ఎంఐఎం-7 ఇతరులు-1 జనంసాక్షి బీఆర్ఎస్: 26-37 కాంగ్రెస్ : 66-77 బీజేపీ: 4-9 ఎంఐఎం: 6-7 ఇతరులు: 0-1 పార్థదాస్ సర్వే బీఆర్ఎస్: 40 కాంగ్రెస్: 68 బీజేపీ: 4 ఎంఐఎం: 6 ఇతరులు: 1 ఆత్మసాక్షి బీఆర్ఎస్:58-63 కాంగ్రెస్:48-51 బీజేపీ: 7-8 ఎంఐఎం: 6-7 ఇతరులు: 1-2 పోల్‌స్ట్రాట్ బీఆర్ఎస్:48-58 కాంగ్రెస్:49-59 బీజేపీ:5-10 ఎంఐఎం:6-8 రాష్ట్ర బీఆర్ఎస్: 45 కాంగ్రెస్:56 బీజేపీ:10 ఎంఐఎం, ఇతరులు:8 రేస్ బీఆర్ఎస్: 45-51 కాంగ్రెస్:57-67 బీజేపీ:1-5 ఎంఐఎం, ఇతరులు: 6-7 పీపుల్స్ పల్స్ బీఆర్ఎస్: 35-46 కాంగ్రెస్:62-72 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు:7-9 మాట్రిజ్ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్: 58-58 బీజేపీ: 4-9 ఎంఐఎం: 5-7 సీఎన్ఎక్స్ బీఆర్ఎస్: 31-47 కాంగ్రెస్: 63-79 బీజేపీ: 2-4 ఎంఐఎం: 5-7 స్మార్ట్ పోల్ బీఆర్ఎస్: 24-36 కాంగ్రెస్:70-82 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు: 6-8 రిపబ్లిక్ టీవీ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్:58-68 బీజేపీ: 4-9 ఎంఐఎం, ఇతరులు: 5-7 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరక్ట్..!
న్యూఢిల్లీ: లోక్‌సభకు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 5.30 గంటల నుంచి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రానున్న ఫలితాలకు ఈ ఎన్నికల రిజల్ట్స్ ప్రివ్యూగా భావిస్తున్నారు.ఎన్డీఏ జైత్రయాత్రను సవాల్ చేస్తున్న ఇండియా కూటమి భవితవ్యం కూడా ఈ ఎన్నికలతో తేలిపోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్,, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యే ఫైట్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య ప్రధాన పోరు ఉండగా మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్‌కు మధ్య ఫైట్ నడిచింది. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌లో 5 రాష్ట్రాల్లో జనాల మూడ్ ఎలా ఉందో తేలిపోనుంది. అయితే సాధారణంగా ఎగ్జిట పోల్స్ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనేదాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఫైనల్ ఫలితాలు వచ్చాయి. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌ను పూర్తిస్థాయిలో నమ్మడానికి లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇదీచదవండి..రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం -
మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు!
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం ఒకే దశలో ఎన్నికలు జరగ్గా, చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో పూర్తి అయ్యింది. తెలంగాణలో నవంబర్ 30 గురువారం సాయంత్రంతో పూర్తి కానున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే అంచనాలతో వాతావరణం హీటెక్కిపోతుంది. అయినా అధికారికంగా ఫలితాలు ప్రకటించక మునుపే వెల్లడించే ఈ ఎగ్జిట్ ఫలితాలు అంటే ఏంటీ? ఎవరు నిర్వహిస్తారు? దీనిలో వాస్తవం ఎంత? ఎగ్జిట్ ఫలితాలు అంటే.. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి అంచానే వేసే ప్రక్రియ. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తారు. ప్రజలు ఎవరకు పట్టం కడతారు? ఏ పార్టీ గెలుస్తుందని అంచానా వేసి చెబుతారు. ముందుగా ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించి తద్వారా విజేతలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ..ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను ఇస్తాయి. ఎన్నికలకు ముందు కూడా ఇలా ఓటింగ్ సర్వే చేస్తారు. దీన్ని ప్రీపోల్స్ అంటారు. ఈ ప్రీపోల్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు చేపట్టే ప్రక్రియ. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల పొత్తలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుంది అనేదాని గురించి విశ్లేషిస్తారు. ఇది పోలింగ్ తేది సమీపిస్తున్నప్పుడూ నియోజక వర్గాల వారీగా కొంతమంది ఓటర్లను కలుసుకుని సర్వే చేసి..ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ జరిగిన ఆ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే చేసి చెబుతారు. ఎప్పుడూ ప్రకటిస్తారంటే.. నవంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇలానే ఎందుకంటే.. ఎన్నికల సంఘం నవంబర్ 30 వరకు ఐదు రాష్ట్రాలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించింది. కచ్చితత్వం ఎంతంటే.. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మందిని పకడ్బందీగా, విస్తృతంగా సర్వే చేస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్ అప్డేట్స్ని ఎలా చూడాలి.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు నవంబర్ 30న సాయంత్రం ప్రకటించడం జరుగుతుంది. వీటి ప్రత్యక్ష ప్రసారాన్ని న్యూస్ ఛానల్స్ తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో వీక్షించి తెలుసుకోవచ్చు. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఎవరికీ పట్టం కట్టారు? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనేదానిపై ఓ స్పష్టత రానుంది. ఓటింగ్ శాతం! 2023లో రాజస్థాన్‌లో 74.6% ఓటింగ్ నమోదవ్వగా, 2018 నాటి 74.24 % కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. మధ్యప్రదేశ్ 2018లో 75%తో ఓటింగ్‌తో పోలిస్తే 2023లో దాదాపు 76% ఓటింగ్‌తో మెరుగ్గా ఉంది నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరంలో 77.04% పోలింగ్ నమోదైంది. అదే రోజు, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ జరిగిన 20 అసెంబ్లీ స్థానాల్లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. మిగలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరో పర్యాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. (చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?) -
అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక, తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. EVMల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై DEOను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యల పై DEOకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రూరల్‌లో పోలింగ్ శాతం బాగానే ఉంది.. అర్బన్‌లో పెరగాల్సి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలు
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కొన్ని సంస్థలు అంచనా వేసిన విధంగానే కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, జేడీఎస్ 20 లీడింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాల్లో పోలిస్తే జేడీఎస్ దాదాపు 17 స్థానాలు కోల్పోయింది. 2018లో జేడీఎస్ 37 స్థానాల్లో గెలిచింది. వరుస ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే క్రమంగా జేడీఎస్‌కి ఆదరణ తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఎగ్జిట్ పోల్స్‌లో 'యాక్సిస్ మై ఇండియా' కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 140 సీట్లు, బీజేపీకి 62 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనా ఇప్పుడు నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ అంచనాల కంటే మించి ఫలితాలు కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేసిన సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు Follow https://t.co/Fg8UHp55I6 for #KarnatakaElection#KarnatakaElectionResults#KarnatakaElections2023 latest updates pic.twitter.com/yWe36EbKaS — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.