సాక్షి, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేలపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి నా, దినపత్రిక, టీవీ మాధ్యమాల్లో ప్రసారం చేసినా.. ఎన్నికల నిబంధనల మేరకు శిక్షార్హులని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment