Huzurabad bypoll 2021
-
కోట్లు పట్టుకుని.. మళ్లీ ఇచ్చేశారు!: విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో దొరికిన డబ్బునంతా దాదాపు తిరిగి ఇచ్చేశారు. నమోదు చేసిన పోలీస్ కేసుల పరిస్థితి సైతం బుట్టదాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ – కేసుల నమోదు తదితర అంశాలపై సుపరిపాలనా వేదిక సేకరించిన సమాచారంలో విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడైయ్యాయి. ఈ మేరకు ఫోరం కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కు లేఖ రాస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైన తీరుపై తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా తగ్గించేందుకు వెంటనే తగు మార్గదర్శకాలు విడుదల చేయాలని పద్మనాభ రెడ్డి కోరారు. 94 కేసులు నమోదు... హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అక్టోబర్1 నుంచి నవంబర్ 2 వరకు వివిధ ప్రాంతాల్లో రశీదులు లేని రూ.3.80 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 94 కేసులు నమోదు చేశారు. ఇందులో కేవలం 18 లక్షలే కోర్టుకు సమర్పించి, మిగిలిన కేసుల్లో డబ్బంతా వాపస్ ఇచ్చేశారు. 94 కేసుల్లో కేవలం ఐదు కేసుల్లోనే అభియోగాలు నమోదు చేయగా, అందులో రెండు కేసులు పేకాటకు సంబంధిం చినవి కాగా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన డబ్బు పంపిణీకి సంబంధించి మూడు కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేశారు. చదవండి: మోదీ జీ... ప్లీజ్ పెంచండి.. పోస్ట్‌కార్డ్ సందేశాల పవర్ ఇది! -
‘ఓటు’ బదలాయింపునకు బాధ్యులెవరు?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌కు ఒకదాని మీద మరో సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జరిపిన సమీక్షకు కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం మరో జగడానికి తెరతీసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అనుబంధ సంఘాల ఇన్చార్జిగా, 4 పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిగా ఉన్న తనకు శనివారం ఢిల్లీలో జరిగిన భేటీ గురించి కనీస సమాచారం ఇవ్వలేదంటూ ఆయన శనివారం ఏఐసీసీకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి తనను ఆహ్వానించకపోవడం బాధ కలిగించిందని, అందుకే లేఖ రాస్తున్నానని తెలిపారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ.వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌కు పంపిన ఈ లేఖలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థిని పోటీకి ఎందుకు దింపలేదని, చివరి నిమిషంలో బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేతలు 3 నెలల ముందు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని నిలబెట్టి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలు ఆయనకు సాయం ఎందుకు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలన్నారు. దీనికి బాధ్యులెవరని ఆ లేఖలో ఆయన ప్రశ్నించారు. తాను ఇదే విషయాన్ని ఫలితం వచ్చిన రోజు మీడియాతో మాట్లాడానని, ఆ తర్వాతి రోజు జరిగిన పీఏసీ సమావేశంలో కూడా లేవనెత్తానని లేఖలో వెల్లడించారు. మీడియాతో ఎందుకు మాట్లాడతారని కొందరు నేతల అభిమాన సంఘాలు సోషల్‌మీడియాలో తనను ఆ రోజు ప్రశ్నించాయని, మరి ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశం గురించి మీడియాకు లీకులు ఎలా వచ్చాయని, అలా రావడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఆవేదనతోనే కొన్ని విషయాలను పంచుకుంటూ ఈ లేఖను రాస్తున్నట్లు జగ్గారెడ్డి ఏఐసీసీకి వెల్లడించారు. -
హుజూరాబాద్ ఓటమి పై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్
-
ఉత్తమ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్చార్జ్గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. -
అభ్యర్థి ఎంపికే కొంపముంచింది!
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌లో ఓటమికి నువ్వంటే.. నువ్వే కారణం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. వేదికలు మారినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆరోపణలు మాత్రం తగ్గలేదు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన హైకమాండ్ సమీక్ష సమావేశంలోనూ రాష్ట్ర నాయకుల ఆరోపణల పర్వం కొనసాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశం మరోసారి గ్రూపు రాజకీయాలకు వేదికైందని సమాచారం. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన మొదటి సమీక్షా సమావేశం గంటన్నర పాటు సాగింది. కాగా, సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమీక్షా సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ పార్టీ హైకమాండ్ తరఫున పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ సీనియర్ నేతలు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు, హుజూరాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్ హాజరయ్యారు. కాగా ఉపఎన్నికలో పార్టీ వైఫల్యం, అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను వేణుగోపాల్ తెలుసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వేణుగోపాల్ సైతం ఓటమిపై సంజాయిషీ అడిగారని తెలిసింది. రేవంత్‌కు వ్యతిరేకంగా రాహుల్‌కు సురేఖ రాసిన లేఖ ప్రతిని ఈ సందర్భంగా హనుమంతరావు వేణుగోపాల్‌కు అందజేశారు. అయితే భేటీ తర్వాత పొన్నం పలు ఆరోపణలు చేయగా, ఆ సమయంలో అక్కడే ఉన్న రేవంత్ తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దంటూ బదులిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభ్యర్థిని నేనే ప్రతిపాదించా.. ‘కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిపోవడం వల్లనే హుజూరాబాద్‌లో ఓడిపోయాం. పార్టీలో కొందరు టీఆర్ఎస్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిని నేనే ప్రతిపాదించా. ఎంపిక చేశా’. – పొన్నం ప్రభాకర్ కొందరు నన్ను కార్నర్ చేస్తున్నారు... నాతో ఈటల ఫోన్లో మాట్లాడారు. కానీ, కలవలేదు. కౌశిక్‌రెడ్డితో నాకున్న బంధుత్వానికి, ఆయన పార్టీ వీడిపోవడానికి సంబంధం లేదు. అయినా జూలైలో కౌశిక్ కాంగ్రెస్‌ను వీడితే, అక్టోబర్ దాకా హుజూరాబాద్ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదు?. వెంకట్ స్థానికేతరుడు కావడం కూడా ఓటమికి ప్రధాన కారణం. కౌశిక్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న విభేదాలు, తగాదాలను నాకు రుద్దడం సబబు కాదు. కౌశిక్‌రెడ్డి అంశాన్ని సాకుగా తీసుకుని నన్ను కొందరు కార్నర్ చేస్తున్నారు. – ఉత్తమ్ సొంత ఇమేజ్‌పైనే శ్రద్ధ... హుజూరాబాద్‌లో కొండ సురేఖను అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేయలేదు? తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించింది. కానీ, ఉప ఎన్నిక జరిగిన హుజూరాబాద్‌లో ఎందుకు సభ నిర్వహించలేదు? కొందరు నాయకులకు సొంత ఇమేజ్ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పార్టీ ఇమేజ్ పెంచడంపై లేదు. – వి.హనుమంతరావు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కంటే అన్ని రకాలుగా టీఆర్ఎస్, బీజేపీలు చాలా బలంగా ఉన్నాయని దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈటలతో కలిసి మాట్లాడాను కానీ, పార్టీలో చేరే విషయం చర్చకు రాలేదని భట్టివిక్రమార్క వెల్లడించారు. ఓటమి సమష్టి బాధ్యత అని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డి వెళ్లిపోవడం వల్లనే ఓడిపోయామని చెప్పడం సరైంది కాదని, పరస్పరం నిందలు వేసుకోవడం పార్టీకి మంచిది కాదని మధుయాష్కీగౌడ్ సూచించారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... పార్టీని పటిష్ట పరుస్తున్నాం.. ‘గతంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న సవాళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికీ సిగ్గులేకుండా అమిత్ షాతో బంధం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్.. అమిత్ షా పాదాల వద్ద తాకట్టుపెట్టారు. ధాన్యాన్ని కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని పటిష్ట పరచడమే కాకుండా, లోటుపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాం’ –మాణిక్యం ఠాగూర్ సీనియర్లతో కలసి పోరు... ‘హుజూరాబాద్ ఎన్నిక, పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలో కేంద్ర నాయకత్వం నుంచి పరిశీలకులు రాష్ట్రానికి వస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, అనవసర విషయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. దీనిపై సీనియర్లు అందర్నీ కలుపుకొని పోరాడుతాం. 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాం.’ – రేవంత్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం.. ‘హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. అందరం కలిసికట్టుగా 2023 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పోరాడుతాం. దీనికోసం యాక్షన్‌ప్లాన్ రెడీ చేస్తున్నాం. బీజే పీ, టీఆర్ఎస్ల నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం’ –మల్లు భట్టివిక్రమార్క నన్ను ఎవరూ సస్పెండ్ చేయలేరు.. ‘పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇలాగైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టమే. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కూడా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో కోరా. ఈటల రాజేందర్ రూపంలో దొరికిన ఆయుధాన్ని పార్టీ సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఉత్తమ్ నన్ను హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదు’. – పొన్నం ప్రభాకర్ -
కమలం చేతికి చిక్కిన కాంగ్రెస్
హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా పాఠాలనే నేర్పింది. హోరాహోరీగా ఉంటుందని ఊహించిన ఎన్నికలో టీఆర్ఎస్ చతికిల పడింది. కాంగ్రెస్ నేల కరిచింది. ఈటెల రాజేందర్ బీజేపీని గెలిపించాడు. కాంగ్రెస్ ప్రభా వమున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటుబ్యాంకును తమకు అను కూలంగా మార్చుకుని కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న బీజేపీ లక్ష్యం సంపూర్ణంగా అమలు జరిగింది. ప్రజామోదం కలిగిన నాయకులను పార్టీలోకి ఆహ్వా నించి, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో బీజేపీ కృత కృత్యమైంది. కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇది కాంగ్రెస్ సహజశైలికి విరు ద్ధంగా జరిగిన ప్రయోగం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కబళించాలనేది బీజేపీ వ్యూహం అని తెలిసి కూడా తమ ఓటుబ్యాంకును రక్షించుకోవడం పక్కనబెట్టి టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా భావించడం వల్ల కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయింది. తెరాసకు మంచి పట్టున్న నియో జక వర్గాలైన దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలలో ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును అనుకూలంగా మలచుకోవడంతో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే 20 శాతం ఓటుబ్యాంకు కలిగి ఉన్నదనీ, దాన్ని నిలుపుకోవడంతో పాటు, పెంచుకోగలగడం కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమైతే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలదని విశ్లేషిం చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. దేశంలో మరే పార్టీకి లేని అవకాశం ఒక్క కాంగ్రెస్‌కే ఉన్నదనీ, అలా చేసిన పక్షంలో ప్రాంతీయపార్టీల సహకారంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటుబ్యాంకు కలిగి ఉండటం తెరాసకు కలిసివచ్చే అంశమనీ, ఆ పార్టీ ఉనికి కోల్పో వడం తమకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనీ దుబ్బాక ఉప ఎన్నికలోనూ, హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ తెరాస గ్రహించివుంటుంది. 2018 సాధారణ ఎన్నికలలో తెరాస ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలిచి 61,121 ఓట్లు సాధిం చింది. ఉప ఎన్నికలో 95.07 శాతం ఓట్లు నష్టపోయి కేవలం 3,014 ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు పట్టున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కనీసం ఇలాంటి చోటైనా పార్టీ జాతీయ నాయకత్వం తమ శక్తియుక్తులు ఉపయోగించి తమ ఉనికిని కాపాడుకోవాలి. బీజేపీని వదలి, టీఆర్ఎస్ను మాత్రమే ఓడించడం లక్ష్యంగా పెట్టుకోవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే. ఓటర్లు సహితం కాంగ్రెస్ క్యాడ ర్తో ఈటెలను తద్వారా బీజేపీని గెలిపించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 58,107 ఓట్లను కోల్పోయింది. ఓటర్లు ఒక పార్టీనుండి ఇంకొక పార్టీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపి గెలిపించిన సందర్భమిది. కాంగ్రెస్ కోల్పోయిన ఈ ఓట్లలో 75 శాతం మంది ఈటెల వైపు మొగ్గు చూపి ఉంటారనుకోవ డంలో సందేహం లేదు. ఈటెల సాధించిన మెజారిటీ 23,855. తెరాస గత ఎన్నికలతో పోలిస్తే 19 శాతం ఓటుబ్యాంకును కోల్పోయింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం 11.58 శాతంగా నిలిచింది. కాంగ్రెస్ 40 శాతం ఓటుబ్యాంకు నిలుపుకోగలిగినా పోటీ నువ్వా నేనా అనేటట్లు ఉండటమే గాక, జాతీయ ప్రత్యర్థి బీజేపీకి సవాలుగా మారివుండేది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీయే గానీ టీఆర్ఎస్ కాదు. అందుకే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలించి, బీజేపీ వలలో ఎలా పడ్డారో విశ్లేషించుకోవాలి. ఈ ఉప ఎన్నికలో ఓడిపోవడం వల్ల టీఆర్ఎస్కు జరిగిన నష్టం పెద్దదేమీ కాదు. ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఎన్నికలలో ఇలాంటి ఓటములు సహజం. దాన్ని ఆ పార్టీ తట్టుకుని నిలబడగలదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాంటిది కాదు. ప్రతి ఎన్నిక వారికి ఒక సవాలు. హుజూరాబాద్‌లో జరిగిన నష్టం జాతీయ నాయకత్వం చిన్నదిగా భావించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే బీజేపీ వ్యూహ కోరల్లో కాంగ్రెస్ చిక్కుకుందని మాత్రం జాతీయ నాయకత్వం కచ్చితంగా గ్రహించాలి. వ్యాసకర్త: డా. జి.వి. సుధాకర్ రెడ్డి ఏపీపీఎస్సీ సభ్యులు -
స్వయంకృతాపరాధాలే ఓడించాయా?
కొరివితో తల గోక్కుంటే ఏమవుతుందో తెలియాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రశాంతంగా సాగి పోతుందనుకున్న ఆ పార్టీ రాజకీయ భవిత వ్యాన్ని ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా సంక్షోభం లోకి నెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ కేసీఆర్ వెన్నంటే ఉండి అంకితభావంతో పనిచేసిన బలమైన తెలం గాణ వాది ఈటెల రాజేందర్‌ను పార్టీ నుంచి, మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని హుజూరాబాద్ ప్రజలు జీర్ణించుకోలేక పోవడంతోనే టీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందనడంలో సందేహం లేదు. ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస ఓడిపోయిందా, ప్రజలు పట్టుబట్టి ఓడించారా అంటే అక్కడ రెండూ జరిగాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈటెలను రాజకీయంగా సమాధి చేయడం ద్వారా బీజేపీని ఓడించి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు, నాయకు లను అక్కడే మోహరించారు. బహుశా దేశ చరిత్రలో తొలిసారి ఓటర్లు రోడ్ల మీదికొచ్చి తమకు ఓటుకు ఆరు వేలు అంద లేదని తెరాస నాయకుల ఇళ్ల ముందు ధర్నా చేశారు. కొంతమంది అధికారులు హుటాహుటిన ప్రజల సమస్యలు తీరుస్తూ గులాబీ బాస్ మెప్పు పొందాలని చేయని ప్రయత్నం లేదు. ఆగమేఘాల మీద రేషన్ కార్డులు జారీ అయ్యాయి. దళిత బంధు పథకం ప్రారంభించి దళితుల అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి దాకా అగ్రవర్ణాలకే పరిమితమైన సీఎంఓలోకి దళిత అధికారిని తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఏళ్లుగా జరుగని అభివృద్ధి పనులను కేవలం కొన్ని వారాల వ్యవధిలో పూర్తి చేయించారు. ఈ పరిస్థితి చివరికి ఎక్కడి దాకా పోయిందంటే తమ నియో జకవర్గ తెరాస ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమకూ హుజూరాబాద్లాగా సౌకర్యాలన్నీ సమకూరుతాయని ఓటర్లు భావించేదాకా. కేసీఆర్ ఒక్కరే గొప్ప రాజకీయ నాయకుడు కాదు, తాము అంత కంటే గొప్ప వారమని ఓటర్లు నిరూపించారు. ఈటెలను గెలిపిం చుకొని బీజేపీ సత్తా చాటాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్రంగా శ్రమించారు. గతంలో రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించినా, కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతిలాంటి మరెందరో తెలంగాణ వాదులను తొలగించినా చెల్లినట్లు ఈటెలతో ఏం నష్టం జరుగుతుం దని కేసీఆర్ భావించి ఉంటారు. దేశంలో పలుచోట్ల ఉప ఎన్ని కలు జరుగుతున్నా జాతీయ మీడియా సైతం హుజూరాబాద్ లోనే మోహరించిం దంటే ఈ ఎన్నిక ఎంత ప్రత్యేక మైందో ఊహిం చవచ్చు. టీఆర్ఎస్ గెలిచి ఉంటే వచ్చే ఎన్ని కల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయ్యేది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఓడిపోవడంతో సమీప భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులొచ్చాయి. ఇక ఆ పార్టీల లోని అసంతృప్తివాదులు అప్పుడే బీజేపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వ్యాసకర్త: శ్యామ్‌సుందర్ వరయోగి బీజేపీ రాష్ట్ర నాయకులు -
కేసీఆర్‌ను వదిలి బయటకు రండి: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులు సీఎం కేసీఆర్‌ను వదిలి బయటకు రావాలని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ స్వభావం, నైజం బయటపడిందని, ఆయన టక్కుటమార విద్యలను అర్థం చేసుకుని నిజమైన ఉద్యమకారులు, మేధావి వర్గం ఇప్పటికైనా ఆలోచించి పార్టీని బహిష్కరించాలని కోరారు. సందర్భం వచ్చినపుడు హుజూరాబాద్ ప్రజల మాదిరిగానే కేసీఆర్ అహంకారం, అణిచివేత పద్ధతులపై యావత్ తెలంగాణ ప్రజానీకం చెంప చెల్లుమనిపించడం ఖాయమన్నారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తానని, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌లో తన గెలుపు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇదే తీర్పు మొత్తం తెలంగాణలో పునరావృతం కాబోతోందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల రాజేందర్ బుధవారం శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఈటల, పార్టీ నేతలు నివాళులర్పించారు. చదవండి: (హుజూరాబాద్ ఫలితంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..) ప్రజల తీర్పుతో కేసీఆర్ దిమ్మతిరిగింది... తాను అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకగా కొనసాగుతానని ఈటల అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీ ఎదుటనున్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత కోసం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు. ‘హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు రూ.600 కోట్ల అక్రమ సంపాదన ఖర్చు చేయడంతో పాటు, రూ.2,500 కోట్లతో దళితబంధు ప్రవేశపెట్టారని, వందల మంది మఫ్టీ పోలీసులతో ప్రజలకు కౌన్సెలింగ్ చేసి అసెంబ్లీలో నా ముఖం కనబడకుండా చూడాలని కేసీఆర్ శపథం చేసినా ప్రజలిచ్చిన తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మతిరిగి పోయింది’అని అన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక గంటలకొద్దీ ప్రెస్మీట్స్ పెట్టి కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు. చదవండి: (ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్) -
హుజూరాబాద్ ఫలితంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నిక ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న పీసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజీపీ నేత ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు ఉండేవని అన్నారు. చదవండి: ‘దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా’ ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ రూ. 600 కోట్టు ఖర్చు పెట్టిందని అన్నారు. -
అక్కడ టీఆర్ఎస్కు తొలిసారి ఎదురుదెబ్బ.. తేడా ఎక్కడా?!
సాక్షి , కరీంనగర్: కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండుసార్లు ఎంపీ పదవికి కేసీఆర్, ఎమ్మెల్యేల పదవికి కేటీఆర్, ఈటల రాజేందర్ రాజీనామా చేసినా ప్రజలు గెలిపించారు. అలాంటి బలమైన పునాదులు ఉన్న జిల్లాలో.. అందులోనూ పార్టీలో సీనియర్ నేత ఎంపీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు సొంత ప్రాంతమైన హుజూరాబాద్‌లో ప్రతికూల ఫలితం రావడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. ఆ కంచుకోటపై నేడు కాషాయజెండా ఎగరడంపై టీఆర్ఎస్ పార్టీ సమీక్ష ప్రారంభించింది. 23,855 ఓట్ల తేడాతో తమ సిట్టింగ్ స్థానంలో ప్రత్యర్థి విజయం సాధించడంతో.. ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే పనిలో మునిగింది. పార్టీ జిల్లా నాయకత్వాన్ని అధిష్టానం నివేదిక అడగనున్నట్లు తెలిసింది. పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రత్యర్థిదే పైచేయి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో కమలాపూర్ ఈటల రాజేందర్ సొంతప్రాంతం. ఇక్కడ బీజేపీకి ఆధిక్యంరావడంలో వింతేంలేదు. మిగిలినవి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక. ఈ ప్రాంతాల్లోని మెజారిటీ గ్రామాల్లో టీఆర్ఎస్ అనుకూల సర్పంచులే. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. హుజూరాబాద్ మున్సి పాలిటీ, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో భారీ మెజారిటీ వస్తుందనుకున్న గులాబీఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. దీంతో జిల్లా గులాబీ నాయకత్వం గ్రామాలవారీగా పోస్టుమార్టం ప్రారంభించింది. ఎక్కడు ఏ కారణం చేత ఓట్లు తగ్గిపోయాయే తెలుసుకునే పనిలో పడింది. చదవండి: (హుజూరాబాద్ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్) గట్టి నేతలు ఉన్నా.. పాడి కౌశిక్‌రెడ్డి సొంతమండలం వీణవంకలో టీఆర్ఎస్కు 162 ఓట్ల మెజారిటీ వచ్చింది. జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ ప్రచారం చేసిన ఇల్లందకుంట ప్రాంతంలో బీజేపీ మెజారిటీ 1,423 ఓట్లు. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 549ఓట్లు అధికంగా రావడం గమనార్హం. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్బాబుల సొంతగ్రామం సింగాపూర్‌లో టీఆర్ఎస్ కేవలం 133ఓట్ల మెజారిటీ సాధించింది. ఎస్సీ కార్పొరేషన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ల స్వస్థలమైన హుజూరాబాద్ పట్టణంలోనూ బీజేపీకి మెజారిటీ వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రకటించిన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో బీజేపీకి 137మెజారిటీ రావడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిలో ఉందని సమాచారం. త్వరలోనే నివేదిక ఓటమి విషయంలో అధిష్టానం త్వరలోనే ఓ నివేదిక కోరే అవకాశముందని సమాచారం. నాలుగున్నర నెలలుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం చేసినా.. సానుకూల ఫలితం రాకపోయేసరికి జిల్లా నేతలు ఆత్మావలోకనం ప్రారంభించారు. పార్టీలో భారీగా చేరికలు జరిగినా, దళితబంధులాంటి సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా, పెండింగ్ పనులు పూర్తి చేసినా, రూ.కోట్లాది నిధులు విడుదల చేసినా ఎందుకు ప్రజలు తమను తిరస్కరించారు? అన్న విషయంలో బుర్రలు బద్ధలు కొంటుకుంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజేందర్ విజయానికి సానుభూతే కారణమని.. పార్టీ అ డిగిందే తడవుగా.. వివరణ ఇచ్చేందుకు సిద్ధపడ్డారని సమాచారం. -
హుజూరాబాద్ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఒక నిశ్శబ్ద తీర్పు. నియోజకవర్గఓటర్లు మనసులో మాటను ఎక్కడా బయట పెట్టకుండా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. మూడు ప్రధానపార్టీలు పోటీ పడ్డా.. స్థానిక, పాతనేతకే పట్టంకట్టారు. నాలుగున్నర నెలలుగా నువ్వా– నేనా అన్నట్లుగా సాగిన ప్రచారంలో ఎవరూ ఎక్కడా తగ్గలేదు. వ్యక్తిగతంగా, రాజకీయంగా పరస్పర ఆరోపణలతో హుజూరాబాద్ రాజకీ యం ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. దళితబంధు పథకంతోపాటు, పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తిచేసిన టీఆర్ఎస్ పార్టీ బీజేపీని విధానపరంగా దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నింది. తమకు అభివృద్ధి నినాదమని, చేసిన పనులకే ఓట్లు అడుగుతున్నామని ప్రజలకు వివరించింది. అదే సమయంలో కేవలం ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకెళ్లిన రాజేందర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, అది ఎక్కడా బయటపడకపోవడం గమనార్హం. పోలింగ్ రోజు వరకు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మాత్రం అలాగే కొనసాగిన ఈ రాజకీయ చదరంగం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. చదవండి: (నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల) కలిసి వచ్చిన పోలింగ్ సమయం.. అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఓటరు ఎక్కడా బయటపడలేదు. పోలింగ్ సమయం ఈసారి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటల వరకే ఉండేది. దీంతో దూర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు తరలివచ్చారు. నియోజకవర్గంలో ఈసారి 2.36 లక్షల ఓట్లు ఉంటే.. అందులో మొత్తం 2,05,236 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ 1,06,780 ఓట్లు ఒక్క రాజేందర్ ఖాతాలోనే వేసుకోవడం గమనార్హం. దీనికితోడు మంత్రి పదవి నుంచి ఆయన్ను బర్తరఫ్ చేసిన తీరుపై ప్రజల్లో సానుభూతి వచ్చింది. తనకు అన్యాయం జరిగిందని, తనను తిరిగి గెలిపించాలంటూ రాజేందర్ చేసిన విజ్ఞప్తిని మెజారిటీ ప్రజలు మన్నించారు. దీనికితోడు ప్రచార ముగింపులో ఆయన తనను ‘సాదుకుంటారో.. ? సంపుకుంటారో..?’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను తనవైపు తిప్పుకునేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: (గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే) ఆఖరువారంలో చక్రం తిప్పిన ‘బండి’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన ఆయుధం దూకుడు. ఉత్సాహపరిచే ప్రసంగాలతో ఓటర్లలోకి చొచ్చుకెళ్లడమే ఆయనకున్న ప్రత్యేకత. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియాలోనూ ఆయన ఇదే తరహాలో పార్టీకి విజయాలను అందించారు. ప్రజాసంగ్రామ యాత్ర కారణంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆరంభంలో ఆయన ఎక్కు వ కాలం రాజేందర్‌కు ప్రచారం చేయలేకపోయారు. కానీ, ఆయన ప్రజా సంగ్రామయాత్ర ముగింపు తరువాత మాత్రం పూర్తి సమయాన్ని రాజేందర్ కోసం కేటాయించారు. ఇక్కడే బండి తన చతురత ప్రదర్శించారు. ఒకవైపు రాజేందర్‌ను ప్రచారం చేయిస్తూనే.. మరోవైపు తానూ ఒంటరిగా పలు గ్రామాలను చుట్టేశారు. కేంద్ర పథకాలు అందుతున్న తీరును వివరించారు. ఈసారి తన సహజత్వానికి విరుద్ధంగా పిట్టకథలు, ఛలోక్తులు, పంచ్‌డైలాగులతో సభలో నవ్వులు కురిపిస్తూ ముందుకుసాగారు. ఐదు మండలాల్లో వీలైనన్ని గ్రామాలను బండి సంజయ్ తన రోడ్‌షోల ద్వారా చుట్టేయగలిగారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న ఆదరణతో పూర్తిస్థాయిలో వారిని తనవైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. -
డబ్బు పంపకాల్లో గొడవతోనే ఉపఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక పార్టీల పంచాయతీ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతోనే ఆ ఎన్నిక జరిగిందని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. సీఎం సీటు, డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలసి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ పరాజయంపై పీఏసీ సమావేశంలో చర్చించామని చెప్పారు. ఓట్లెందుకు తగ్గాయి? అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగిందనే అంశాలపై చర్చించామని.. ఓటమిపై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక నవంబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో ప్రతి జిల్లాలోని నాయకత్వం స్థానికంగా పాల్గొంటుందని.. రోజుకు 7 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర నిర్వహణ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో మండల, జిల్లా, డివిజన్ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీతో అంటకాగేది ప్రాంతీయ పార్టీలే.. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న టీఆర్ఎస్ ఆరోపణలు సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. గాడ్సేవాదంతో నడిచే బీజేపీతో గాంధేయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పటికీ కలవదన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ప్రాంతీయ పార్టీలే బీజేపీ, అమిత్‌షా, మోదీలతో అంటకాగుతున్నాయని, టీఆర్ఎస్ కూడా బీజేపీకి మడుగులొత్తుతోందని విమర్శించారు. తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? పేదోళ్ల రక్తతర్పణంతో వచ్చిన తెలంగాణను రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీ అభ్యర్థి రాజేం దర్ రూ.500 కోట్లు, అహంకారంతో టీఆర్ఎస్ నేతలు రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. డబ్బుల కోసం ఓటర్లు ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలుక్షుద్ర రాజకీయాలతో తెలంగాణను ఎటు తీసుకెళుతున్నాయో మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అర్థం చేసుకోవాలన్నారు. -
దారుణ ఓటమి... కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ఉప ఎన్నిక ఫలితాల సరళి వెలువడిన వెంటనే కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం.. బుధవారం జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీలోనూ సెగలు పుట్టించింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడం ఏమిటి, అసలు తప్పు ఎక్కడ జరిగిందనే అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరిగా వ్యవహరించలేదని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు ఓటమి కారణాలను లోతుగా పరిశీలించేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. ఇక ఉప ఎన్నిక ఫలితం ఇలా ఉంటుందని ముందే ఊహించామంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీకి సంబంధించి అంశాలపై కొందరు నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నట్టు తెలిసింది. అంతర్గత ప్రజాస్వామ్యంపేరుతో ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టుగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. బుధవారం గాంధీభవన్‌లో మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు, పార్టీ సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర, విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. హుజూరాబాద్‌లో ఎందుకిలా? కాంగ్రెస్ పీఏసీ భేటీలో ఉప ఎన్నిక పరాజయం అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగింది, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోయింది?, ఎందుకు ఇంత దారుణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్న ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఎంపిక అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేస్తారనే ఆలోచనతోనే.. పార్టీకి కట్టుబడి ఉండే బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపామని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనిపై వీహెచ్ మాట్లాడుతూ.. కొండా సురేఖ వంటి బలమైన నాయకురాలు ఉన్నా ఎందుకు బరిలోకి దించలేదని ప్రశ్నించినట్టు సమాచారం. స్థానిక కుల సమీకరణాల ఆధారంగా అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని, లేదంటే ఎస్సీ వర్గాలకు వ్యక్తిని నిలబెట్టాల్సి ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థి ఖరారు అంశాన్ని భట్టి విక్రమార్క, దామోదర రాజ నర్సింహలతో కూడిన కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకే అభ్యర్థిని ఖరారు చేశామని వివరించినట్టు తెలిసింది. అయితే.. హుజూరాబాద్ ఓటమికి రేవంత్‌రెడ్డి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని, తానే బాధ్యత వస్తానని రేవంత్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ఈ ఓటమికి పార్టీ నేతలందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ సరైన వ్యూహంతో వెళ్లలేకపోయిందని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోటీలో సరిగా వ్యవహరించలేకపోయామని మరికొందరు నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. హుజూరాబాద్ ఓటమి గల కారణాలను తేల్చేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ ఎదురుకాకుండా సూచనలు చేసేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఈ కమిటీని ప్రకటించాలని.. ఆ కమిటీ అన్ని అంశాల్లో విచారణ జరిపి పీఏసీకి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. సామాజిక వర్గ ముద్రను తొలగించుకోవాలి ఈటల విజయాన్ని తేలికగా తీసుకోవద్దని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అంటే ఫలానా సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలని.. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, బీసీల నుంచి మంచి నేతలను తయారుచేసి ముందు నిలబెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇక గతంలో తాను హుజూర్నగర్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినప్పుడు ముందే ఎలా చెప్తారని తప్పుబట్టిన నేతలు.. ఇప్పుడు పెద్దపల్లి, భూపాలపల్లిలో అభ్యర్థులను ముందుగానే ఎలా ప్రకటిస్తారని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేసినట్టు తెలిసింది. పీఏసీ సమావేశాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరు కాకపోవడంపైనా చర్చ జరిగింది. ఇటు సమావేశాలకు రాకుండా, అటు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఓ కీలక నేత ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై మరో నేత స్పందిస్తూ.. ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా చాలా మంది అలా ఇష్టానుసారం మాట్లాడారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. చివరిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జనజాగరణ యాత్రను విజయవంతం చేయడంపై చర్చించారు. టీపీసీసీ నాలెడ్జ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బహిరంగ విమర్శలు వద్దు హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమితో నేతల మధ్య ఒక్కసారిగా విమర్శలు, ప్రతి విమర్శలతో క్రమశిక్షణ పట్టుతప్పుతున్న విషయాన్ని మా ణిక్యం ఠాగూర్ సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా పీఏసీ భేటీల్లోనే చర్చించాలని, లేదంటే నేరుగా సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా మా ట్లాడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయాలే కాకుండా ఇతర పరిణామాలపై టీవీ చానళ్లలో జరిగే డిబేట్లకు కూడా ఎవరంటే వారు వెళ్లవద్దని, ఇందుకోసం ప్యానెల్ తయారుచేయాలని, ఆ ప్యానెల్లో ఉన్న వారే ఆయా కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతోపాటు కమిటీ సభ్యులు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రేణుకాచౌదరి, బలరాంనాయక్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాత్రం రాలేదు. -
ఊసులో లేకుండాపోయిన కాంగ్రెస్, TRS ఓడిపోవడానికి ముఖ్య కారణాలు
-
నన్ను చెప్పనిస్తే ఉంటా.. లేదంటే వెళ్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా... లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..) ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తాం: షబ్బీర్ అలీ రెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు. ‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్ అలీ తెలిపారు. -
ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశంలో.. క్యాడర్‌ను కూడా కాపాడుకోలేని స్థితిలో పార్టీ ఉందంటూ పలువరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో భేటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వరకు పార్టీ వ్యవహారాలకు, కార్యాక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇవాళ్టి సమావేశంలో చివరి సారిగా తాను మాట్లాడతానని చెప్పారు. చదవండి: (నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల) 'నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటు. వాస్తవాలు చెప్తే.. నాపై అబాండాలు వేస్తున్నారు. ఓ సెక్షన్ మీడియా నన్ను టార్గెట్ చేసింది. వాస్తవాలు చెప్తే నేరమన్నట్లుగా తప్పుపడుతున్నారు. ఒక్కోసారి మాట్లాడక పోవడమే మంచిదనిపిస్తుంది. ఈ రోజు లాస్ట్ మీటింగ్‌లో ఏదోటి తేల్చుకుంటా. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది ఈ రోజు డిసైడ్ అవుద్ది. నేను మాట్లాడకపోతే పోయేదేంలేదు. నా సీటు నేను ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నా. ఇక నుంచి అంతర్గత వ్యవహారాలపై మాట్లాడను. షోకాజ్ నోటీసులు ఇస్తారా అనేది చూద్దాం. మాణిక్కం ఠాగూర్‌కు ఏం తెలియదు. మంచి చెప్తే వినకపోతే నాదేం పోతుంది. అన్ని విషయాలు లోపల మాట్లాడ్తా. నా బలహీనతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. హుజూరాబాద్‌కు స్టార్లు, సూపర్ స్టార్లు పోతేనే దిక్కు లేదు నేను పోతే ఓట్లు పడతాయా..?' అని జగ్గారెడ్డి అన్నారు. చదవండి: (Huzurabad Bypoll: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం) -
Huzurabad Bypoll: అస్త్రాలన్నీ విఫలం.. ఫలించని టీఆర్ఎస్ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో తాజా ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక్కడ గెలుపే లక్ష్యంగా ‘ఆపరేషన్ హుజూరాబాద్’ పేరిట టీఆర్ఎస్ సంధించిన అస్త్రాలన్నీ విఫలమయ్యాయి. ఈటల రాజీనామా నాటి నుంచి ఉప ఎన్నిక పోలింగ్ దాకా టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డినా.. అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. (చదవండి: నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల) చేరికలతో చేకూరని ప్రయోజనం..: ఈటలపై అవినీతి ఆరోపణలు వచ్చిన మొదట్లోనే హుజూరాబాద్‌లో పార్టీ యంత్రాంగం చేజారకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్తపడ్డారు. మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో మంత్రులు కమలాకర్, ఈశ్వర్ తదితరుల బృందానికి ‘ఆపరేషన్ హుజూరాబాద్’ బాధ్యతలు అప్పగించా రు. టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కో–ఆపరేటివ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలెవరూ ఈటల వెంట నడవకుండా కట్టుదిట్టం చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఈటలపై పోటీచేసిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని, బీజీపీలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డిలను, ఆ పార్టీల స్థానిక నేతలను వరుసబెట్టి పార్టీలో చేర్చుకుంది. వివిధ సా మాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రస్థాయిలో ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు వంటి వారికి కేసీఆర్ కండువా కప్పి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కానీ ఈ చేరికలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నామినేటెడ్ పదవులు.. విద్యార్థి నేతకు టికెట్..: టీఆర్ఎస్ హుజూరాబాద్ నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. స్థానిక ఎస్సీ నేత బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, గతంలో ఈటలపై పోటీచేసి ఓడిన వకుళాభరణం కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ ఈటల రాజకీయ అనుభవం ముందు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వం అంత బలంగా పనిచేయలేదని తాజా ఫలితంతో వెల్లడైంది. ప్రచారానికి కేసీఆర్, కేటీఆర్ దూరం..: హుజూరా బాద్‌లో ఏదో ఒకచోట జరిగే సభలో సీఎం కేసీఆర్.. రోడ్‌షోలలో కేటీఆర్ పాల్గొంటా రని పార్టీ నేతలు తొలుత ప్రకటించారు. కానీ వారు ఉప ఎన్నిక ప్రచారానికి దూ రంగా ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్లీనరీలో మినహా కేసీఆర్ ఎక్కడా ఈటల గురించి మాట్లాడలేదు. అయితే హరీశ్ సారథ్యంలోని బృం దం సర్వశక్తులూ ఒడ్డటంతో టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కేసీఆర్ సమీక్ష హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల ను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి సమీక్షించారు. నియోజకవర్గంలో ప్రచారానికి సారథ్యం వహించిన మంత్రి హరీశ్ హైదరాబాద్‌లోని తన ని వాసం నుంచి హుజూరాబాద్‌లోని ఇన్చార్జిలతో మా ట్లాడుతూ వివరాలు సేకరించారు. బూత్‌లవారీగా పా ర్టీకి అనుకూలంగా పోలైన ఓట్లపై ఆరా తీశారు. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ ప్ర క్రియ, ఫలితాలపై హరీశ్ త్వరలో పార్టీ అధినేతకు సవివర నివేదిక అందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి నినాదం.. దళితబంధు పథకం టీఆర్ఎస్ నుంచి ఈటల నిష్క్రమణకు ముందే హుజూరాబాద్‌లో అడుగుపెట్టిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇతర నేతలు.. నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాను తెరమీదకు తెచ్చారు. పెండింగ్ పనుల పూర్తి, కొత్త పనులు చేపట్టడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు అందేలా చూడటం, కొత్త పింఛన్ల వంటి అనేక పనులు చేపట్టారు. సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి, పథకాల అమలును ప్రకటించారు. మరో వైపు సీఎం హుజూరాబాద్‌లో ‘దళితబంధు’పైలట్ ప్రాజెక్టును ప్రకటించారు. ఆగస్టు 16న నియోజకవర్గంలో లబ్ధిదారులతో సభ నిర్వహించారు. అయినా ఓటర్లు పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపలేదు. అడుగడుగునా పార్టీ యంత్రాంగంతో.. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిల పేరిట టీఆర్ఎస్ పెద్ద సంఖ్యలో నేతలను మోహరించింది. ముగ్గురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 30 మంది నియోజకవర్గంలో మకాం వేయగా.. పొరుగు జిల్లాల నుంచి వందల మంది నేతలు హుజూరాబాద్‌వ్యాప్తంగా తిష్టవేశారు. అయితే బయటి నేతల పెత్తనంపై స్థానిక కేడర్‌లో అసంతృప్తి, బయటి నుంచి వచ్చిన నేతలు చాలాచోట్ల మొక్కుబడిగా పనిచేయడం, ఇన్చార్జుల మధ్య సమన్వయం లోపంతో నష్టం జరిగినట్టు పోలింగ్ ముగిసిన తర్వాత పార్టీ విశ్లేషించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అవగాహన అంటూ.. అవినీతి ఆరోపణలతో ఈటలపై వేటు వేసిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించకపోవడంతో నష్టం జరిగిందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంకు ఉండేది. కానీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ జాప్యం చేసిందని.. ఈటలకు అనుకూలంగా ఓట్లు పడేలా కాంగ్రెస్, బీజేపీ లో పాయకారీ ఒప్పందం చేసుకున్నాయని ఆరోపిస్తోంది. దళితబంధు అమ లుపై ఎన్నికల సంఘం ఆంక్షలు కూడా తాము గట్టిగా నమ్ముకున్న ఓ సామాజికవర్గం ఓటర్లలో అయోమయాన్ని సృష్టించందనే భావన టీఆర్ఎస్లో కనిపిస్తోంది. -
Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో వాడివేడిగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సాగింది. సమావేశానికి కోమటిరెడ్డి, జగ్గారెడ్డి హాజరుకాలేదు. సమావేశం మధ్యలోనే జానారెడ్డి వెళ్లిపోయారు. రేవంత్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హుజురాబాద్ :1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. హుజూరాబాద్‌లో పడిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ఘోర పరాభవాన్ని చవి చూపించింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపు 30 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ మంగళవారం దారుణ పరాజయం పాలయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు (1.5 శాతం) మాత్రమే పోలయ్యాయి. కనీసం డిపాజిట్ దక్కించుకునేందుకు దరిదాపుల్లో కూడా లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను నివ్వెర పరిచింది. శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సందర్భంగా సీనియర్లు చేసిన పలు వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేశాయి. చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’ టీఆర్ఎస్, బీజేపీల నడుమ హోరాహోరీ అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలు ఎవరికీ లేకున్నా గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి కనీసం అందులో సగమైనా వస్తాయని భావించారు. కానీ పూర్తి నిరాశాజనకంగా కేవలం 3 వేల ఓట్లకు మాత్రమే పార్టీ పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలంటున్నాయి. దారుణ ఓటమికి కారణాలెన్నో.. ఇంతటి ఘోర పరాజయానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్థి ఎంపికలో విపరీత జాప్యం, కేడర్‌కు భరోసా ఇవ్వడంలో వైఫల్యం, మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అసలు తాము పోటీలో ఉన్నామనే భావనను అక్కడి ఓటర్లలో కలిగించడంలో విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని పొందిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారం పేరుతో గ్రామాలను చుట్టి వస్తుంటే పార్టీ నేతలు కనీసం హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడకుండా వేరే ప్రాంతాల్లో బహిరంగసభలు, సమావేశాలు పెట్టి కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో ఆయన ప్రభావం ఎక్కడా కనిపించలేదు. చిత్తుగా ఓటమిపై రచ్చ ఉప ఎన్నికలో పార్టీ ఘోర వైఫల్యంపై సీనియర్ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక, సాగర్‌లలో పనిచేసినట్టు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పనిచేయలేదనిఅన్నారు. ఈ ఎన్నికను రేవంత్ వదిలేశారని విమర్శించారు. ఉప ఎన్నికపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా టీఆర్ఎస్ ఓడిపోయినందుకు పండుగ చేసుకుందామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో బల్మూరిని బలిపశువుని చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్, భట్టిలు కలిసి తీసుకున్న నిర్ణయం వర్కవుట్ కాలేదన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై సీరియస్‌గా చర్చ ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ తీర్పు ఊహించినట్టుగానే వచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సి ఉందని చెప్పారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల
సాక్షి, కరీంనగర్: కేసీఆర్ అహంకారంపై ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారు. హుజూరాబాద్ ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారు. చివరకు హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారు. ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు. చదవండి: (హుజూరా‘బాద్’షా ఈటలే) కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు.. అయినా ఎవరూ లొంగలేదు. మేము దళిత బస్తీలకు పోయినపుడు దళిత బంధకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారు. మేం పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు నా వైపే నిలబడ్డారు. ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?. కేసీఆర్ మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయి. నేను పార్టీలు మారినవాడిని కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు, నా గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు. నాకు అండగా ఉన్న అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఈటల రాజేందర్ అన్నారు. చదవండి: (Etela Rajender: బాగారెడ్డి రికార్డు సమం.. ఈటలకు అడ్డురాని 7వ నంబర్) -
హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు?
Gellu Srinivas Yadav On Huzurabab Election Results: 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో ఉన్నా.. చివరికి ఓటర్లు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో 24,068 ఓట్ల మెజారీటితో బీజేపీ సత్తాచాటిన విషయం తెలిసిందే. తనకు ప్రజల మద్దతు ఉందన్న విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజేందర్ ఉప ఎన్నికలో గెలిచి జిల్లాలో మరోసారి తన బలాన్ని చాటుకున్నారు. ఈటల రాజేందర్‌కు 1,06,780 వేల ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 82,712 ఓట్లతో రెండో స్థానానికి పరిమితయ్యారు. చదవండి: గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే ఇక ఉప ఎన్నిక ఫలితంపై గెల్లు శ్రీనివాస్ స్పందిస్తూ హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తుండటంతో ఆయన తన సన్నిహితుల వద్ద వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో 9వ రౌండ్ తర్వాత బీజేపీ 5 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉందని, ఆసమయంలో గెల్లు కంటతడి పెట్టిన్నట్లు సౌమిత్ యక్కటి అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశారు. అయితే ఈ వీడియో ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. ఫలితాల నేపథ్యంలో వైరల్‌గా మారింది. చదవండి: Huzurabad Bypoll:1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. #Huzurabad 😂😂 After 9th Round BJP Lead - 5,111 pic.twitter.com/mJAkUQmZI8 — Sowmith Yakkati (@sowmith7) November 2, 2021 -
గిట్లెట్లాయే: జితేందర్ వర్సెస్ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే
సాక్షి, కరీంనగర్: బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. అన్నీ తామై వ్యవహరించిన ఆ ఇద్దరు నేతల్లో జితేందర్దే పైచేయి అయ్యింది. వాస్తవానికి దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, జితేందర్ తన వ్యూహాలతో చక్రం తిప్పారు. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో తొలిసారిగా మంత్రి హరీశ్‌రావుకు భంగపాటు ఎదురైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం ఈటల రాజేందర్ విజయం సాధించడంలో జితేందర్ మరోసారి హరీశ్‌పై పైచేయి సాధించారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గిట్లెట్లాయే.. హుజూరాబాద్: ఉప ఎన్నిక ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో ఉన్నా.. చివరికి ప్రజలు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 191ఓట్ల ఆధిక్యం రావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. చదవండి: Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే.. వీణవంకలో.. వీణవంక మండలం ఎలబాక గ్రామంలో బీజేపీకి 417 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే గ్రామంలో టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ మాడ వనమాల–సాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మవురం విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టీఆర్ఎస్ నుంచి ఇన్‌చార్జీలుగా వ్యవహరించినా కనీస ఓట్లు రాబట్టలేకపోయారు. అలాగే ఎంపీపీ ముసిపట్ల రేణుక స్వగ్రామం దేశాయిపల్లిలో టీఆర్ఎస్ ఘోర ఓటిమి పాలయింది. హుజూరాబాద్‌లో.. ఎంపీపీ ఇరుమల్ల రాణి సొంత గ్రామం చెల్పూర్లో 86 ఓట్లు, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి స్వగ్రామం కందుగులలో బీజేపీకి 467 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాజాపల్లిలోపీఏసీఎస్ చైర్మన్ శ్యాసుందర్‌రెడ్డి పరిధిలో టీఆర్ఎస్ 36 ఓట్లతో లీడింగ్ సాధించింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక వార్డులో 36, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వార్డులో బీజేపీకి 33 ఓట్ల మెజార్టీ వచ్చింది. జమ్మికుంటలో.. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ స్వగ్రామం ఇల్లందకుంటలో బీజేపీకి 265 ఓట్లు, జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ స్వగ్రామం ఆబాది జమ్మికుంటలో 28 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇల్లందకుంట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పింగిళి రమేశ్ స్వగ్రామం విలాసాగర్లో, లక్ష్మాజిపల్లి సింగిల్ విండో చైర్మన్ ఉప్పుల తిరుపతిరెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఇలాఖాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రముఖ నేతలైన పాడి కౌశిక్‌రెడ్డి (వీణవంక 884) కెప్టెన్ లక్ష్మీకాంతరావు గ్రామాల్లో (సింగాపూర్ 133) టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కింది. -
హుజురాబాద్ :1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్..
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం కలిసి రావట్లేదు. వరుసగా పరాజయాలను మూటకట్టుకుని చిక్కిశల్యమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఈ ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిటే కోల్పోయింది. అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత బలమైన అభ్యర్థినే బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగింది. ఈస్థానం నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్యల పేర్లు వినిపించాయి. అధిష్టానం చివరి నిమిషంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కాగా, ఇక.. పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. 1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. 1952 ఏర్పడిన హుజూరాబాద్ ద్వి శాసనసభ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరఫున పున్నమనేని నారాయణరావు, సోషలిస్టు పార్టీ నుంచి జి.వెంకటేశం గెలుపొందారు. తిరిగి 1957లో జరిగిన ద్వి శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నర్సింగరావు, రాములు విజయం సాధించారు. 1962లో ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు మరోసారి గెలుపొందారు. 1967లో పోల్సాని నర్సింగరావు, 1972లో వొడితెల రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జయకేతనం ఎగుర వేశారు. అనంతరం 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2008, 2009, 2010, 2014, 2018లో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరు గెలుపొందిన దాఖలాలు లేవు. ఆ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన ఓట్లు పొంది డిపాజిట్ దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన విజయం సాధించగా మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. 1978 నుంచి నేటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందకపోగా మొదటిసారి బీజేపీ ఇక్కడి నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు. చదవండి: Telangana: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ -
హుజురాబాద్ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే
సాక్షి, కరీంనగర్: ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్లో నిస్తేజం నెలకొంది. ఊహించని విధంగా మంగళవారం కౌంటింగ్ ప్రారంభం నుంచే ఈటలకు మెజార్టీ పెరగడంతో కార్యకర్తల్లో నైరా శ్యం నెలకొంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి.. హుజూరాబాద్‌లోనే మూడు నెలలు మకాం వేసి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో లీడర్లతో పాటు క్యాడర్లో స్తబ్ధత నెలకొంది. మీసేవ కార్యాలయంలో మంత్రి.. మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌బాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మేయర్ సునీల్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్, తదితరులు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే గడిపారు. రౌండ్ల వారీగా వస్తున్న ఫలితాలపై ద్వితీయ శ్రేణి నాయకత్వంతో చర్చిస్తూ గడిపారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ ఘన విజయం టీవీలకు అతుక్కుపోయిన జనం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల సరళిని తెలుసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలు, హోటళ్లలో ప్రజలు హుజూరాబాద్ ఫలితంపై ఆరా తీస్తూ చర్చల్లో మునిగిపోయారు. -
నీతి, నిజాయితీకి పట్టం: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ప్రజలు నీతి, నిజాయితీకి పట్టం కట్టారని, నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యమని నిరూపించారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కితాబు ఇచ్చారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో హుజూరాబాద్ ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. హుజూరాబాద్ ఫలితాల అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి మీద ప్రజ లకు విశ్వాసం ఉంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పనిచేయదని రుజువైం దన్నారు. 40 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు చూడలేదని, ఈ విజ యం హుజూరాబాద్ ప్రజల విజయమని ఆయన తెలిపారు. ఈ ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్ని రకాల పథకాలతో మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు ధర్మానికి కట్టుబడి ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ: హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. మంగళవారం సాయంత్రం జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు, తదనంతర పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. -
Etela Rajender: బాగారెడ్డి రికార్డు సమం.. ఈటలకు అడ్డురాని 7వ నంబర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/కరీంనగర్: ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఓటమె రుగని నేతగా రికార్డు నమోదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ విజయం ఆయననే వరించింది. క్రమశిక్షణగల కార్యకర్తగా, నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఈటల పని చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బలంగా వినిపించారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరిం చిన రాజేందర్ అనివార్యంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతీయ జనతా పార్టీలో చేరి ఉప ఎన్నికల బరిలో నిలబడిన ఆయనను హుజూరాబాద్ ప్రజలు అంత కుముందులానే ఆదరించారు. ‘చంపుకుంటారా.. నన్ను సాదుకుంటారా.. మీ ఇష్టం’అన్న ఈటలను గెలిపించి.. ‘సాదుకుంటాం’అన్న సంకేతాలిచ్చారు. ఈటల రాజకీయ ప్రస్థానం... రాజేందర్ రాజకీయ ప్రస్థానం 2002లో మొదలైంది. ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆయన పౌల్ట్రీ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గజ్వేల్ ప్రాంతంలో కోళ్ల ఫారాలు నిర్మించుకున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించగా, 2002లో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అనూహ్యంగా కమలాపూర్ నుంచి పోటీ చేయాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఢీకొనే అభ్యర్థి లేడనుకున్నా.. 2004లో పోటీచేసి ఈటల ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ రద్దయింది. 2009లో హుజూరాబాద్ కేంద్రంగా కమలాపూర్, జమ్మికుంట(పాతది), వీణవంక మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. 2009 నుంచి 2021 వరకు జరిగిన సాధారణ, ఉప పోరులో ఈటల హుజూరాబాద్ నుంచి ఐదు పర్యాయాలు అప్రతిహతంగా విజయం సాధించారు. (చదవండి: 8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ) అడ్డురాని 7వ నంబర్ వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈటల గత రికార్డును సమం చేశారు. జహీరా బాద్ నుంచి ఎం.బాగారెడ్డి వరుసగా (1957, 62, 67, 72, 78, 83, 85) అసెంబ్లీకి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఈటల తాజా విజయంతో సమం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ఏడో నంబర్ ఎవరికీ కలసిరాలేదు. దీంతో ఏడో నంబరు అంటే నేతలంతా భయపడేవారు. అసలు ఏడోసారి పోటీ చేసే వరకు రాజకీయ, శారీరక అనుకూలతలు కూడా కలిసిరావాలి కూడా. ఇవి రెండూ ఈటలకు కలిసిరావడం గమనార్హం. రెండుసార్లు మంత్రిగా... రాజేందర్ 2004 నుంచి టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో రెండుసార్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2018 నుంచి కేసీఆర్, ఈటల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రివర్గం నుంచి సీఎం తొలగించడంతో ఆత్మాభిమానం పేరిట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలను కేసీఆర్, ఈటల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈటలపై మరో తెలంగాణ ఉద్యమకారుడు, నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌కు చెందిన గెల్లు శ్రీనివాస్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలో నిలిపింది. అధిష్టానమే అన్ని తానై వ్యవహరించింది. అయినా మంగళవారం ఓట్ల లెక్కింపులో ఈటల రాజేందర్ ఘన విజయం సా«ధించారు. 5సార్లు ఓట్ల శాతం..సగానికి సగం ఈటల రాజేందర్ వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తే.. అందులో ఐదుసార్లు 50 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. తొలుత కమలాపూర్, తర్వాత హుజూరాబాద్ శాసనసభకు ప్రతినిధ్యం వహించిన రాజేందర్.. 2008 ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికలో మాత్రమే 50 శాతానికి తక్కువగా ఓట్లు పొందారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా 59.34% ఓట్లు పొందిన ఈటల.. అదే స్థానం నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా 52.02% ఓట్లు సాధించారు. 2018లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి రఘు 1,683 ఓట్లే (0.95%) పొందగా, నోటాకు 2,867 ఓట్లు రావడం గమనార్హం. ఇదిలాఉండగా, హుజూరాబాద్ తాజా ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 ఎన్నికల్లో 61,121(34.60%) ఓట్లు రాగా, ఈ ఉప ఎన్నికలో 1.5 శాతం ఓట్లతో దారుణ ఓటమి చవిచూసింది. (చదవండి: Telangana: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్) -
హుజూరా‘బాద్’షా ఈటలే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాలుగున్నర నెలల ఉత్కంఠ పోరుకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,873 ఓటర్లు ఉండగా.. రికార్డు స్థాయిలో 2,05,236 మంది (86.64%) ఓటేశారు. మరో 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 242).. టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 83,167 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 455) వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థిపై 23,855 ఓట్ల మెజార్టీతో ఈటలవిజయం సాధించారు. నియోజకవర్గంపై తనపట్టును మరోసారి నిరూపించుకున్నారు. దాదాపు 20ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ (ఇంతకుముందు కమలాపూర్) నియోజకవర్గంలో తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది. ప్రతి రౌండులోనూ.. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించా రు. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఈవీ ఎం ఓట్లు లెక్కిం చారు. అప్పటి నుంచి చివరిదాకా బీజేపీ అభ్యర్థి ఈటలకు మెజారిటీ కొనసాగింది. 8వ రౌండులో 162 ఓట్లు ఎక్కువ రావ డంతో టీఆర్ఎస్ శిబిరంలో ఆశలు రేగాయి. కానీ 9, 10 రౌండ్లలో టీఆర్ఎస్ వెనుకబడింది. తిరిగి 11 రౌండ్లో 385 ఓట్లు ఎక్కువగా సంపాదించింది. ఆ తర్వాత ఏ దశలోనూ టీఆర్ఎస్ పోటీ ఇవ్వలేదు. కారుకు పట్టున్న చోటా.. హుజూరాబాద్ అర్బన్, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో టీఆర్ఎస్కు బాగా పట్టు ఉంది. కానీ ఆ ప్రాంతాల్లో కూడా కారు జోరు కనిపించలేదు. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా 15వ రౌండు (జమ్మికుంట మండలం)లో 2,049 ఓట్లు లీడ్, 18వ రౌండు (ఇల్లందకుంట మండలం)లో 1,876 ఓట్ల ఆధిక్యం, 19వ రౌండు (కమలాపూర్ మండలం)లో 3,047 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎక్కువ ఆధిక్యం వచ్చిన కమలాపూర్ ఈటల సొంత మండలం కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఈటల రాజేందర్‌కు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
ఈటల ఘన విజయం.. బీజేపీ శ్రేణుల సంబరాలు..
-
హుజూరాబాద్ గెలుపుపై ఈటల స్పందన
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ విజయం సాధించారు. హుజూరాబాద్‌లో గెలుపొందిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను హుజురాబాద్ ప్రజలు కాపాడారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పుడు స్వేచ్ఛగా నోరువిప్పే పరిస్థితి నియోజకవర్గంలో వచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు ప్రజలు ఓర్చుకొని తనకు అండగా నిలిచారని అన్నారు. అఖండ విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి దండం పెడుతున్నానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఇక్కడ నడుస్తున్న రాజ్యం డబ్బులు రాజ్యమని, దోచుకున్న డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లు సొంత భూమిలో కట్టుకోవడానికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కోసం కొట్లాడుతానని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా టెంట్ వేసుకుని కూర్చున్నా వారి పక్షాన పోరాడుతానని అన్నారు. ఉద్యమకారుడిగానే తన పోరాట పంథాను కొనసాగిస్తానని తెలిపారు. -
హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్
-
హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
-
Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే..
సాక్షి, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. హుజురాబాద్ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్ ముందు.. టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఫుల్లు ఖుషీగా ఉంది. మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్ ఎన్నిక ఏకంగా కేసీఆర్ వర్సెస్ ఈటలగా సాగింది. కారు గుర్తు అభ్యర్థి గెలుపు కోసం టీఆర్ఎస్ ముఖ్యులంతా రంగంలోకి దిగారు. ఇక ఈ ఉప ఎన్నికలో గెలవడం కోసం టీఆర్ఎస్ దళితబంధు వంటి భారీ ప్రజాకర్షక పథకాన్ని ప్రకటించింది. దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్‌ను కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు, మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు చేశారు. ఇక ఓట్ల కోసం డబ్బులు ఇష్టారీతిన వెదజల్లారు. ఏకంగా ఒక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ ఏకంగా 2000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇంత చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ ఫలితం టీఆర్ఎస్పై ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఈటల పట్ల కేసీఆర్ తీరు కూడా సరికాదని జనం తమ ఓట్లతో చెప్పకనే చెప్పారు. ఇక టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే.. ఈటల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం.. వాటిపై కేసీఆర్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈటల 100 ఎకరాల భూమిని కబ్జా చేశాడనే ఆరోపణలు వచ్చిన వెంటనే కేసీఆర్ స్పందించారు. కలెక్టర్ ద్వారా సమగ్ర రిపోర్ట్ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజీనామా చేశారు. ఈటల వ్యవహరంలో కేసీఆర్ తీరుపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకు కొన్ని రోజుల ముందే ఓ మంత్రిపై భూకబ్జా ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. కేసీఆర్ ఆ వ్యవహారాన్ని కనీసం పట్టించుకోలేదు. కానీ ఈటల విషయంలో హుటాహుటిన దర్యాప్తుకు ఆదేశించారు. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల ఒకరకంగా.. వెనకబడిన తరగతికి చెందిన నాయకుడి పట్ల మరో రకంగా ప్రవర్తించినట్లుగానే జనాల్లోకి వెళ్లింది. ఆదుకోని దళితబంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ గెలుపు వ్యూహాలు రచించారు. దానిలో భాగంగానే హుజూరాబాద్‌లో బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న దళితులను ఆకర్షించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించేలా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌నే ఎన్నుకుని..1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల వరకూ నిధుల కేటాయించారు. ఇక బీసీ ఓట్లు చీలినా.. దళిత ఓట్లు అన్ని కారు గుర్తుకే అని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. అయితే ఓట్ల కోసం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం.. బెడిసికొట్టి కారుకే షాకిచ్చింది. ఇది కేవలం ఓట్ల కోసమే తీసుకువచ్చినట్లు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇక ఈ పథకంపై మిగతా సామాజిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. పేదలు అంటే కేవలం దళితులు మాత్రమే కాదు.. మిగతా సామాజిక వర్గాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి వారి అభివృద్ధి సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా అన్ని వర్గాలకు దళితబంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... కేసీఆర్‌ను ఇరుకునపెట్టాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ అందరికి దళితబంధు ఇస్తానని ప్రకటించాడు. కానీ ఎన్నికలకు ముందు హైకోర్టు దళితబంధుపై స్టే విధించింది. దాంతో జనాల్లో.. ఇది కూడా జీహెచ్ఎంసీ వరద సాయం మాదిరి మూలనపడుతుందనే అభిప్రాయం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితబంధు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందనే విషయం స్పష్టంగా అర్థం అయ్యింది. నిరుద్యోగుల అసంతృప్తి.. ఇక టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. 2018లో వచ్చిన పోలీస్ నోటిఫికేషనే తెలంగాణలో చివరి భారీ నోటిఫికేషన్. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో 80 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. కానీ వాటి భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మూడేళ్ల నుంచి ఉద్యోగ ప్రకటన లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి.. రానున్న రోజుల్లో వెలువడే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కోల్పోనున్నారు. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అలానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ కారణలన్ని నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతకు కారణమయ్యాయి. వెరసి హుజురాబాద్ ఉప ఎన్నికలో కారు ఓటమికి నిరుద్యోగ యువత కూడా ఓ కారణంగా నిలిచారు. ఇదే కాక కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సహకరించిందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తమకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు.. కానీ టీఆర్ఎస్ మాత్రం గెలవకూడదని బలంగా నిశ్చయించుకున్న కాంగ్రెస్.. బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూ... ఈటలకు భారీ విజయం దక్కేలా చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. -
హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్
సాక్షి, కరీంగనర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. విద్యార్థి నాయకుడు వెంకట్‌ని బలిపశువును చేశాయని గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై కేటీఆర్, హరీశ్‌రావు కూడా స్పందించారు. (చదవండి: హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్) ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ కేవలం 3000పైచిలుకు ఓట్లకే పరిమితం అయ్యింది. చదవండి: Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు -
ఈటల రాజేందర్ ఘన విజయం
-
Huzurabad Bypoll Results: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ ఓటమిపాలైన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదని గుర్తుచేశారు. ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీశ్ తెలిపారు. -
హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక్క ఎన్నిక ఫలితం పార్టీని ప్రభావితం చేయలేదు అన్నారు. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ అనేక ఎత్తుపల్లాలను చూసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence My compliments to @GelluSrinuTRS on a spirited fight 👍 Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles — KTR (@KTRTRS) November 2, 2021 ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపొందారు. ఈటల సెంటిమెంట్ ముందు కారు ఎత్తుగడలు ఏవి పనిచేయలేదు. దళిత బంధు టీఆర్ఎస్ను ఏమాత్రం ఆదుకోలేకపోయింది. చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’ -
కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు బుద్ది చెప్పారు
-
హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఈటలదే గెలుపు
హుజురాబాద్: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈటల తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. (చదవండి: 30 వేల మెజారిటీతో గెలుస్తాం: బీజేపీ ) రెండు రౌండ్లు మినహా ప్రతిసారి ఈటలదే పై చేయి అయ్యింది. హుజురాబాద్ నుంచి ఈటల ఏడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలమైన సెంటిమెంట్ ముందు టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం, ప్రచారం ఏమాత్రం పని చేయలేదు. చదవండి: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు -
హుజురాబాద్‌లో ఈటల పవర్
-
కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’
సాక్షి, హైదరాబాద్: ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్‌లో గెలుపు కోసం రేవంత్ శ్రమించలేదని మండిపడుతున్నారు. (చదవండి: దక్షిణ తెలంగాణకు మరణశాసనం: రేవంత్ ) ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు. (చదవండి: గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌లో బల్మూర్ వెంకట్‌ని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారా. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా ఉన్నారు’’ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. చదవండి: రేవంత్.. హుజూరాబాద్ ఎందుకు వెళ్లడం లేదు? -
హుజూరాబాద్ కౌంటింగ్: బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోయింది. టీఆర్ఎస్ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం కనబర్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఫలితాలపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్ అమిత్‌షాకు తెలిపారు. ఇక హుజూరాబాద్ ఫలితాలపై అమిత్ షా టీం ఎప్పటికప్పుడు ఆరా తీసింది. (చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఫలితాలపై సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. బాణసంచా, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. చదవండి: Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్ -
Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్
సాక్షి, కరీంనగర్: ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడంలో కారు పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తడబడ్డారు. గెల్లు సొంత గ్రామమైన వీణవంకలోని హిమ్మత్ నగర్లో ఈటల రాజేందర్‌కు 191 ఓట్ల మెజారిటీ లభించడమే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన గెల్లుకు సొంతూరి ప్రజలే షాకివ్వడం ఈటల ప్రభంజనాన్ని తెలియజేస్తోంది. ఎనిమిదో రౌండ్లో భాగంగా జరిగిన లెక్కింపు ప్రక్రియలో హిమ్మత్ నగర్ గ్రామంలో బీజేపీకి 548 రాగా, టీఆర్ఎస్కు 358 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామంతోపాటు కౌశిక్ రెడ్డి సొంతూరు ఓట్ల లెక్కింపు కూడా జరిగింది. రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ మొత్తం 22 రౌండ్ల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: (ఈటల విజయం ఖాయం.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం) -
Dalit Bandhu: కేసీఆర్‌కు షాకిచ్చిన శాలపల్లి ఓటర్లు.. ఈటలకే మద్ధతు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం హుజురాబాద్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దళిత బంధును తమకు భారీ విజయాన్ని కట్టబెడుతుందని భావించిన కారు పార్టీకి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల పరిస్థితే ఎదురైంది. ఒక్క 8వ రౌండ్, 11వ రౌండ్ మినహా మిగతా అన్నింటిలోనూ బీజేపీ అభ్యర్థి ఈటలకే ఓటర్లు మద్దతు పలికారు. దళిత బంధుతో గెలుపు తమదేనని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేయగా.. అంచనాలకు విరుద్ధంగా ఓటర్లను ఈ పథకం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోని ఓటర్లు టీఆర్ఎస్కు బిగ్ షాకిచ్చారు. శాలపల్లిలో టీఆర్ఎస్పై బీజేపీ 129 ఓట్లు ఆధిక్యత సాధించింది. మొత్తం గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు పడగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 రౌండ్ల ఫలితాలకు గాను మెజార్టీ రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 20 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 2 రౌండ్లలో మాత్రమే ఆధిక్యం సాధించారు. ఫలితంగా ఈటల 24వేల పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోంది: బండి సంజయ్ -
హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోంది: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడని, ఈటల గెలుపు బీజేపీ గెలుపని, బీజేపీ గెలుపు ఈటల గెలుపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పై ప్రజలకు విశ్వాసం లేదని, దళిత బంధు అమలు చేసినా ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. కాగా, ఇప్పటిదాకా వెలువడిన హుజూరాబాద్ ఫలితాల్లో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. చదవండి: (రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?) -
Huzurabad By Election Results 2021: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ దూకుడు
-
Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు
రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు ఓట్లు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మొత్తం ఓట్లు 82712 106780 3012 రౌండ్-22 3715 5048 109 రౌండ్-21 3431 5151 136 రౌండ్-20 3795 5269 107 రౌండ్-19 2869 5916 97 రౌండ్-18 3735 5611 94 రౌండ్-17 4187 5610 203 రౌండ్-16 3977 5689 135 రౌండ్-15 3358 5407 149 రౌండ్-14 3700 4746 152 రౌండ్-13 2971 4836 101 రౌండ్-12 3632 4849 158 రౌండ్-11 4326 3941 104 రౌండ్-10 3709 4295 118 రౌండ్- 9 3470 5305 174 రౌండ్- 8 4248 4086 89 రౌండ్- 7 3792 4038 94 రౌండ్- 6 3639 4656 180 రౌండ్- 5 4014 4358 132 రౌండ్- 4 3882 4444 234 రౌండ్- 3 3159 4064 107 రౌండ్- 2 4659 4851 220 రౌండ్- 1 4444 4610 114 -
హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం
సాక్షి, కరీంనగర్: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ ఈవీఎంలు మొరాయించినా.. ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్ తీర్పు నేడే ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ ఘన విజయం
Live Updates: 06:30PM: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 22వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్లో 1333 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత 23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ భారీ విజయాన్ని సాధించారు. 06:21PM: 21వ రౌండ్లో బీజేపీ 1720 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 21వ రౌండ్లో బీజేపీ-5151, టీఆర్ఎస్-3431 ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొత్తం 22,735 ఓట్ల ఆధిక్యం సాధించారు. 05:58PM: 20వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం. 20వ రౌండ్లో బీజేపీ 1474 లీడ్‌లో ఉంది. 20 రౌండ్లు ముగిసేసరికి ఈటల ఆధిక్యం 20 వేలు దాటింది. ఈటల రాజేందర్ 21,015 లీడ్‌లో ఉన్నారు. 05:41PM: 19వ రౌండ్లో ఈటల ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు. 19వ రౌండ్లో ఈటల 3047 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 19,541 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 19 రౌండ్ ముగిసేసరికి మొత్తంగా బీజేపీ-91,306, టీఆర్ఎస్-71,771, కాంగ్రెస్- 2660 ఓట్లు వచ్చాయి. 05:24PM: 18వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1976 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ ఈటల రాజేందర్ ఆధిక్యం 15 వేలు దాటింది. 18 రౌండ్లు ముగిసేసరికి ఈటల16, 594 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుతున్నారు. 18వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ-85,396, టీఆర్ఎస్-68,902, కాంగ్రెస్-2563 ఓట్లు వచ్చాయి. 04:59PM: 17వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్లో బీజేపీ-5610, టీఆర్ఎస్-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్లో బీజేపీ 1423 లీడ్ సాధించింది. 17వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ- 79,785, టీఆర్ఎస్-65,167, కాంగ్రెస్- 2469 ఓట్లు వచ్చాయి. సిలివేరు శ్రీకాంత్(చపాతీ మేకర్ గుర్తు) అభ్యర్థి 1468 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 04:38PM: 16వ రౌండ్లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. 16వ రౌండ్లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం సాధించింది.16వ రౌండ్లో బీజేపీ-5689, టీఆర్ఎస్-3917 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 13,255 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. 04:08PM: 15వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 వ రౌండ్లో బీజేపీ-5507, టీఆర్ఎస్- 3358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 10 వేలు దాటింది. ఇప్పటివరకు ఈటల రాజేందర్ 11,583 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు బీజేపీ-68,486, టీఆర్ఎస్- 57,003, కాంగ్రెస్-1982 ఓట్లు సాధించాయి. 03:44PM: 14వ రౌండ్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. 14వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1046 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 14వ రౌండ్లో బీజేపీ-4746, టీఆర్ఎస్-3700, కాంగ్రెస్-152 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు బీజేపీ 63079, టీఆర్ఎస్-53627 ఓట్లు సాధించగా.. బీజేపీ 9434 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. 03:20PM: 13వ రౌండ్లో ఈటల ఆధిక్యం సాధించారు. 13వ రౌండ్లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్లో బీజేపీ- 4836, టీఆర్ఎస్-2971, కాంగ్రెస్-101 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం బీజేపీ-58,333, టీఆర్ఎస్- 49,945 ఓట్లు వచ్చాయి. 03:08PM:12 రౌండ్లో బీజేపీ 1217 ఓట్ల ఆధిక్యం సాధించింది. 12 రౌండ్లో బీజేపీ-4849, టీఆర్ఎస్-3632, కాంగ్రెస్-158 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్ల తర్వాత 6523 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. 02:42PM: 11వ రౌండ్లో మళ్లీ ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ. 11వ రౌండ్లో టీఆర్ఎస్ 385 ఓట్ల ఆధిక్యం సాధించింది. 11 వ రౌండ్లో టీఆర్ఎస్-4326, బీజేపీ-3941, కాంగ్రెస్-104 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు బీజేపీ-48,588, టీఆర్ఎస్- 43,324 ఓట్లు వచ్చాయి. 11 రౌండ్లు ముగిసేసరికి 5, 306 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ. 02:31PM: బీజేపీ అభ్యర్థి ఈటల పదో రౌండ్లోను ఆధిక్యం సాధించారు. 10 రౌండ్ల తర్వాత 5631 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుంది. పదో రౌండ్లో బీజేపీ 526 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ-4295, టీఆర్ఎస్-3709 ఓట్లు సాధించాయి. 02:24PM హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఇక ఇప్పటికి వరకు హుజూరాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. 02:00PM బీజేపీ దూకుడు హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక్క ఎనిమిదో రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తున్నారు. 01:52PM 9వ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం బీజేపీ అభ్యర్థి ఈటల తొమ్మిదో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్లో ఈటల 1835 ఓట్ల ఆధిక్యం సాధించి మొత్తంగా.. 5,105 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్లో టీఆర్ఎస్ 3,470.. బీజేపీ 5,305.. కాంగ్రెస్ 174 ఓట్లు సాధించాయి. చదవండి: (Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు) 01:42PM టీఆర్ఎస్ అభ్యర్థి స్వగ్రామంలోనూ బీజేపీ ఆధిక్యం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఆయన వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 548 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 358 ఓట్లు సాధించింది. 01:22PM టీఆర్ఎస్ ఆధిక్యం ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో టీఆర్ఎస్కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎనిమిది రౌండ్ల తర్వాత బీజేపీ 35,107.. టీఆర్ఎస్ 31,837.. కాంగ్రెస్ 1175 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్లో గెల్లు, కౌశిక్ రెడ్డి సొంత గ్రామాల ఓట్ల లెక్కింపు జరిగింది. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ 4248.. బీజేపీ 4,086.. కాంగ్రెస్ 89 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల 8 రౌండ్లు ముగిసేసరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 01:06PM అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం బీజేపీ అభ్యర్థి ఈటల ఏడో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీ 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్లో ఈటల 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 3,792.. బీజేపీ 4,038.. కాంగ్రెస్ 94 ఓట్లు సాధించాయి. ఇప్పటిదాకా వెలువడిన అన్ని రౌండ్లలోనూ ఈటలదే ఆధిక్యం. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 31021.. టీఆర్ఎస్ 27589.. కాంగ్రెస్ 1086 ఓట్లు సాధించాయి. 12:43PM వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి ఈటల ఆరో రౌండ్లోనూ ఆధిక్యం సాధించారు. ఈటల ఆధిక్యం రౌండ్ రౌండ్‌కు పెరుగుతోంది. ఆరు రౌండ్ల తర్వాత బీజేపీ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆరో రౌండ్లో బీజేపీ 4656.. టీఆర్ఎస్ 3639 ఓట్లు సాధించాయి. ఆరో రౌండ్లో బీజేపీ 1017 లీడ్ సాధించింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 26,983.. టీఆర్ఎస్ 23,797.. కాంగ్రెస్ 992 ఓట్లు సాధించాయి. 11:50AM ఈటల హవా.. హుజూరాబాద్‌లో ఈటల తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఐదు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఐదు రౌండ్లు ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్లో బీజేపీ 4,358.. టీఆర్ఎస్ 4,014.. కాంగ్రెస్ 132 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి. 11:23AM 1,825 ఓట్ల ఆధిక్యంలో ఈటల నాలుగు రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్లో ఈటలకు 562 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 4 రౌండ్ల తర్వాత 1,825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్లో బీజేపీ 4,444.. టీఆర్ఎస్ 3,882.. కాంగ్రెస్ 234 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 17,969.. టీఆర్ఎస్ 16,144.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి. 10:58AM మూడు రౌండ్ల తర్వాత పార్టీల వారీగా ఓట్లు వరుసగా మూడు రౌండ్లలోనూ టీఆర్ఎస్ వెనుకబడింది. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్ఎస్ 12,262.. కాంగ్రెస్ 446 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 1263 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10:48AM దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ ఆధిక్యం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు వచ్చాయి. 10:35AM మూడో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యత మూడో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యతను కొనసాగించింది. మూడో రౌండ్లో 905 ఓట్ల ఆధిక్యం సాధించిన బీజేపీ, మొత్తంగా 1,263 ఓట్ల ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్లో హుజూరాబాద్ మున్సిపాలిటీ ఓట్లను లెక్కించారు. 10:15AM రెండో రౌండ్‌ముగిసే సమయానికి బీజేపీ 9,461.. టీఆర్ఎస్ 9,103.. కాంగ్రెస్ 339 ఓట్లు సాధించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10:08AM రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం హుజూరాబాద్ రెండో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 192 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల తర్వాత బీజేపీ మొత్తం 358 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్లో బీజేపీ 4,851, టీఆర్ఎస్ 4,659 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ కేవలం 220 ఓట్లు సాధించింది. 10:00AM కాంగ్రెస్ అభ్యర్ధి కంటే రోటీ మేకర్‌కు ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఓట్లు(114) కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కిస్తారు. 9:30 AM తొలిరౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ 4610, టీఆర్ఎస్ 4444, కాంగ్రెస్ 114 ఓట్లు సాధించాయి. 08:52AM పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. 08:38AM ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్లో హుజూరాబాద్ టౌన్ ఓట్లను లెక్కిస్తున్నారు. 08:28AM హుజూరాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 08:20AM పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 08:00AM హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 8.30 వరకూ కొనసాగనుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడనున్నాయి. తొలుత హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామం (పోలింగ్ స్టేషన్)తో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి (పీఎస్ నెం.305)కి చెందిన ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. -
30 వేల మెజారిటీతో గెలుస్తాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫలితాన్ని తారుమారు చేసేందుకు ఈవీఎంలను కూడా మా ర్చేందుకు ప్రయత్నించిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సోమ వారం జరిగిన పదాధికారుల సమావేశానికి పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహాయ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్, సీనియర్ నేతలు విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, జి.మనోహర్‌రెడ్డితో ప్రేమేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజాసింగ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిశాక బీజేపీ గెలుస్తుందని వార్తలు రావడంతో ఈవీఎంలు మార్చేందుకు కూడా ప్రయత్నించారని మండిపడ్డారు. 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఈ నెల 12న హైదరాబాద్ వేదికగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రదీప్‌కుమార్ తెలిపారు. కాగా, ఈనెల 21 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో రెండో విడత ప్రజాసంగామ యాత్ర చేపట్టనున్నట్లు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి తెలిపారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వ సిద్ధమైంది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. రేపు(మంగళవారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, ముందుగా వాటిని లెక్కించనున్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేయగా హాలుకు 7 టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఫలితాలు సాయంత్రం నాలుగు గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్ ఫలితానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పందించారు. వాటిని మార్చేందుకు అవకాశం లేదని తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ... శనివారం రాత్రి పోలింగ్ ముగించుకుని కరీంనగర్‌కు వస్తున్న జమ్మికుంట మండలం కొరటపల్లి, వెంకటేశ్వరపల్లి 160,161,162 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలతో ఉన్న బస్సు జమ్మికుంట ఫ్లైఓవర్ వంతెన వద్ద టైర్ పంక్చర్ కావడంతో సేప్టీటైర్ అమర్చే క్రమంలో కొంత ఆలస్యమైందన్నారు. -
హుజురాబాద్ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
-
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఉత్కంఠ
సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక కూడా చర్చనీయాంశంగా మారింది. శనివారం పోలింగ్ అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలకు చేరాక నేతలు విజయావకాశాలపై ఎవరి లెక్కలు వారు ప్రారంభించారు.కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలింగ్ సమయం గతం(ఉ.7గంటల నుంచి సా.5 గం.లవరకు)తో పోలిస్తే ఈసారి రెండు గంటలు అదనంగా రాత్రి 7గంటలకు పెంచారు. ఈ అంశాలన్నీ ఈసారి భారీగా పోలింగ్ నమోదవడానికి దోహపడ్డాయి. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని ఆదివారం హుజురాబాద్ ఆర్డీవో, ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. గతంలో ఉప ఎన్నికలో ఎన్నడూ ఇంతటి భారీ పోలింగ్ నమోదవలేదని అన్నారు. భారీగా ఓటింగ్ పాల్గొన్న ఓటర్లను అభినందించారు. కొన్ని గ్రామాల్లో 90 శాతంపైగా పోలింగ్ నమోవడం గమనార్హం. మరోవైపు నవంబరు 2న ఫలితాలు వెల్లడవనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీల ఇన్చార్జులు ఎన్నిక జరిగిన తీరుపై విశ్లేషణలు ప్రారంభించారు. పెరిగిన పోలింగ్ శాతం..! హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారాయి.రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ ఉపఎన్నిక ఫలితాలను ముడిపెట్టడంతో అంతా ఒక్కసారిగా హుజురాబాద్ వైపు చూడటం ప్రారంభించారు. అక్కడ ఏం జరిగినా, మీడియాలో పతాకశీరి్షకన రావడంతో స్థానిక ఓటర్లతోపాటు తెలుగురాష్ట్రాల ప్రజల్లో రోజురోజుకు ఆసక్తి పెంచింది. శనివారం అంతా అనుకున్నట్లుగానే భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. హుజూరాబాద్ (85.66%), వీణవంక (88.66%), జమ్మికుంట (83.66%), ఇల్లందకుంట(90.73%), కమలాపూర్ (87.57%) భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. చదవండి: Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు నియోజకవర్గంలో పురుషులు 87.05శాతం ఓటు వేయగా.. మహిళలు 86.25శాతం ఓటేశారు.వాస్తవానికి నియోజకవర్గంలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిలవడం గమనార్హం. మొత్తం మీద 86.64 % పోలింగ్ నమోదవడం అటు అధికారుల్ని, ఇటు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గంలో 2,36,873 మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. సైలెంట్ ఓటుపై ఇరుపార్టీల ధీమా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా టీఆర్ఎస్– బీజేపీల మధ్య ‘నువ్వా–నేనా’ అన్న స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి. దీంతో సైలెంట్ ఓట్లపై ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరు ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీనేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసకుంటున్నారు. ఈవీఎంలు మార్చే అవకాశం లేదు: కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చేందుకు అవకాశంలేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ... శనివారం రాత్రి పోలింగ్ ముగించుకుని కరీంనగర్‌కు వస్తున్న జమ్మికుంట మండలం కొరటపల్లి, వెంకటేశ్వరపల్లి 160,161,162 పోలింగ్‌బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలతోఉన్న బస్సు జమ్మికుంట ఫ్లైఓవర్ వంతెన వద్ద టైర్ పంక్చర్ కావడంతో సేప్టీటైర్ అమర్చే క్రమంలో కొంత ఆలస్యమైందన్నారు. బస్సులో పోలింగ్ సిబ్బందితోపాటు బీఎస్ఎఫ్ పోలీసులున్నారని, ఈవీఎంలను బస్సు నుంచి కిందకు దించలేదని తెలిపారు. పనిచేయని వీవీప్యాట్‌ను ఎన్నికల అధికారి సిబ్బంది కారులో నుంచి తీస్తుండగా కొందరు వీడియోలు, ఫొటోలు తీసి ఈవీఎంలను మార్చుతున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేసినట్లు చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చడానికి ఎక్కడా అవకాశం లేదని, ఐఏఎస్, ఐపీఎస్‌లు కుమ్మక్కైయ్యారంటూ ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిగిన సంఘటనపై సీసీ ఫుటేజీలతో సహా ఎన్నికల కమిషన్‌కు సమగ్ర నివేదిక పంపించినట్లు తెలిపారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ లక్ష్మీబాబులు పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
సాక్షి, కరీంనగర్: పోలింగ్ 95.11 శాతమేంటీ అనుకుంటున్నారా.. మీరు చదివేది నిజమండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓ పోలింగ్ బూత్‌లో నమోదైన ఓటింగ్ శాతమిది. జిల్లా ఎన్నికల చరిత్రలో హుజూరాబాద్ ప్రత్యేకత చాటుతుండగా ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదైంది. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంట 67.13 శాతం(పోలింగ్ బూత్ 170), పోలింగ్ బూత్ 172), హుజూరాబాద్‌లోని పోలింగ్ కేంద్రం 40లో 69.10 శాతం ఓటింగ్ నమోదవగా మిగతా అన్ని పోలింగ్ బూత్‌ల్లో 80శాతం దాటడం ఆహ్వానించదగ్గ పరిణామం. చదవండి: Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు! ఆ 30 గ్రామాలు.. 90 శాతంపైనే ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పోలింగ్ 90శాతం దాటడం శుభపరిణామం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఓటుపై మమకారం చాటారు. మల్యాల పోలింగ్ బూత్ 235లో 93.57శాతం నమోదవగా, 1,011 మంది ఓటర్లకు గాను 946 మంది ఓటేశారు. గునిపర్తి 282 పోలింగ్ కేంద్రంలో 93.41శాతం నమోదవగా 607కు 567 మంది ఓటు వేశారు. నేరెళ్ల (284)లో 92.96 శాతం నమోదవగా 582కు 541 మంది ఓటు వేశారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ సిరిసేడులో 92.94 శాతం, చిన్నకోమట్పల్లి (223)లో 92.81 శాతం, హుజూరాబాద్(27)లో 92.70 శాతం, దేశ్రాజ్పల్లి (302)లో 92.51 శాతం, టేకుర్తి (222)లో 92.31 శాతం, గంగారాం(125)లో 91.92 శాతం, మల్లన్నపల్లి(119)లో 91.87 శాతం, సీతంపేటలో 91.86 శాతం, నాగంపేట, కందుగులలో 91.68 శాతం, వంతడ్పుల 91.61 శాతం, శాయంపేట 91.41 శాతం, నాగారం 91.32 శాతం, వంగపల్లి, పంగిడిపల్లి, కనగర్తి, భీంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, అంబాల, వంతడ్పుల, గూడూరు, కేశవపూర్, గండ్రపల్లి, బేతిగల్, బొంతుపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. -
Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం గల్లంతవలేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఓ ఈవీఎంను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం, ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్ ఆర్ కళాశాల వద్ద వీవీప్యాట్ యంత్రాన్ని బస్సు నుంచి కారులోకి మారుస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి అది ఈవీఎం కాదని, వీవీప్యాట్ యంత్రమని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్–200లో మాక్ పోలిం గ్ సమయంలో ఒక వీవీ ప్యాట్ యంత్రం పనిచేయలేదని, అందుకే రిజర్వ్‌లో ఉన్న మరో యంత్రాన్ని వినియోగించామని తెలిపారు. మొరాయించిన యంత్రాన్ని బస్సులో బందోబస్తు మధ్య కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించామన్నారు. అయితే అప్పటికే అక్కడ 150 బస్సులు పార్కు చే యడంతో స్థలాభావం వల్ల కాలేజీ ఆవరణకు ముం దే ఆ బస్సును నిలిపివేశారని తెలిపారు. సెక్టోరియ ల్ అధికారి సూచనల మేరకు ఆయన డ్రైవర్ వీవీప్యాట్ యంత్రాన్ని బస్సులోంచి కారులోకి మార్చా రని రవీందర్‌రెడ్డి వివరించారు. దీన్ని గుర్తుతెలి యని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమా ల్లో తప్పుగా ప్రచారం చేశారన్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మికుంటలో ఈవీఎంలు తరలిస్తున్న బస్సు విషయంలోనూ వదం తులు వచ్చాయని విలేకరులు ప్రశ్నించగా బస్సు టైరు పంక్చర్ అయితే దాన్ని మార్చారే తప్ప ఈవీఎంలను మార్చలేదని రవీందర్‌రెడ్డి వివరించారు. రికార్డు స్థాయిలో పోలింగ్.. 135 కేసులు నమోదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.64% పోలింగ్ నమోదైందని ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 135 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు, ఓటర్లు ఎందరో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద విపక్షాల ధర్నా.. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద భద్రపరిచిన ఈవీఎంలను అధికారులు మార్చారని ఆరోపిస్తూ శనివారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అనుచరులతో కలసి కాలేజీ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ తులా శ్రీనివాసరావు.. బల్మూరి వెంకట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈవీఎంను కారులో ఎలా తరలిస్తారంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఏసీపీ తుల శ్రీనివాసరావుతో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈవీఎంల తరలింపులో అక్రమాలు జరిగాయని, ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్వంలో బీజేపీ కార్యకర్తలు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక మండలాలు, కరీంనగర్ పట్టణంలోనూ బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. -
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు: రవీందర్ రెడ్డి
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల
సాక్షి, కరీంనగర్: అధికార పార్టీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారని ఆరోపించారు. ఈవీఎంలు కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గం. టీఆర్ఎస్ కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఈటల తెలిపారు. (చదవండి: Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్) -
Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో పాటు ప్రధాన పార్టీలకు ప్రతి ష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై కోట్ల మొత్తంలో పందేలు కాస్తున్నారు. రెండు పార్టీల నాయకులతో పాటు భారీ స్థాయిలో కమీషన్ దండుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. హుజూరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాం తాల్లోనే రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే ఫలితంపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఈటల.. కాదు గెల్లు రాజకీయ నాయకులు, పార్టీలు, గెలుపు, మెజారిటీ.. ఇలా నాలుగు రకాల బెట్టింగ్‌లకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు తెరలేపారు. ఈటల గెలుస్తాడని లేదు గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని రెండు పార్టీలుగా విడిపోయిన నాయకులు అభ్యర్థులపై రూ.10 లక్షలు చొప్పున బెట్టింగ్‌లు పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం భారీ స్థాయిలో బెట్టింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని మరో పార్టీకి చెందిన నాయకులు రూ.3 కోట్లు పోటీ బెట్టింగ్ కాశారు. మెజారిటీపై బెట్టింగ్.. ఈటల గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్న ఆయన అభిమానులు ఈ మేరకు భారీ స్థాయిలో పందేలు కాసినట్టు తెలిసింది. 35 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలుస్తారని కొందరు బెట్టింగ్ కాయగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 25 వేల మెజారిటీతో గెలుస్తాడని టీఆర్ఎస్ నేతలు పోటీ బెట్టింగ్ కాసినట్టు హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. మెజారిటీపై ఒక్క హుజూరాబాద్‌లోనే రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు కూడా.. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, సింగపూర్, సౌదీలో ఉన్న వాళ్లు సైతం బెట్టింగ్‌లు కాశారు. జమ్మికుంట, కమలాపూర్, భూపాలపల్లి, హుస్నాబాద్, బెజ్జంకికి చెందిన కొంతమంది ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఈటల, గెల్లు గెలుపుపై బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఈ మేరకు తమ సంబంధీకులను సంప్రదిస్తున్నారు. ఎటు వైపు వేయాలి? ఎంత వేయాలి? మెజారిటీ మీద వేయాలా? లేక కేవలం గెలుస్తారని మాత్రమే వేయాలా? అని ఆరా తీసినట్లు సమాచారం. కొందరు ఏకంగా వాట్సాప్ గ్రూపు పెట్టి రూ.10 లక్షల చొప్పున ఇద్దరు అభ్యర్థులపై బెట్టింగ్‌లు వేశారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో 48 మంది ఉన్నారని తెలిసింది. తగ్గేదే లేదన్న కార్పొరేట్లర్లు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్న కొంతమంది లీడర్లు కూడా పోటాపోటీగా బెట్టింగ్‌కు దిగారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న ఎన్నికపై ఎవరు గెలుస్తారన్న దానిపై రూ.20 లక్షల చొప్పున బెట్టింగ్‌కు దిగారు. కరీంనగర్‌లోని ఓ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. బీజేపీ తరఫున గెలిచిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కొంతమంది ఈటల 40 వేల మెజారిటీతో గెలుస్తారని రూ.10 లక్షల చొప్పున నలుగురు టీఆర్ఎస్ కార్పొరేట్లర్లతో బెట్టింగ్‌లు పెట్టినట్టు చర్చ జరుగుతోంది. -
పొలిటికల్ CO2
స్కాట్లాండ్ పేరు చెప్పగానే ఎక్కువమందికి టక్కున గుర్తుకొచ్చేది స్కాచ్ మద్యం. చాలా తక్కువమందికి ఈరోజు గ్లాస్గో అనే పట్టణం పేరు గుర్తుకొస్తుంది. పుడమి తల్లి పది కాలాల పాటు పచ్చగా బతకాలని కోరుకునేవాళ్లు, అందుకోసం ఉడతాభక్తి సాయమందించేందుకు సిద్ధపడేవాళ్లు ఆ తక్కువ మందిలో ఉంటారు. మానవుడు చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశ పడేవాళ్లు, విశ్వాంతరాళమంతటా విస్తరించాలని కలలు గనే వాళ్లూ ఆ తక్కువమందిలో ఉంటారు. ఆ గ్లాస్గో పట్టణంలో ఈరోజు వాతావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్) ప్రారంభమవుతున్నది. పారిశ్రామిక విప్లవం తర్వాత కర్బన ఉద్గారాలను విచ్చల విడిగా ప్రకృతిలోకి వెదజల్లుతున్నందు వలన భూమాత ఉష్ణోగ్రమవుతున్నది. ఈ పరిణామం ఇంకా కొంతకాలం కొనసాగితే ఒక మహావిలయానికి మన కువలయం బలికావచ్చును. మరో పది పన్నెండు తరాల తర్వాత మనుష్యజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదాన్ని నివారించవచ్చన్న మేలుకొలుపే ‘కాప్’ సదస్సుకు ప్రాతిపదిక. ప్రమాదం అంచుకు భూగోళాన్ని నెట్టిన పాపం మాత్రం సంపన్న దేశాలదే! ఆ దేశాల్లోని బడా సంపన్నులదే! సంపద సృష్టి అనే అందమైన పేరుతో వీరు సాగించిన ప్రకృతి వేట వికృతరూపం దాల్చిన ఫలితమే – ఈ భూతాపం. జనబాహుళ్యంలో ఒక జానపద కథ ప్రచారంలో ఉన్నది. ఒక పాత్రలో తైలాన్ని తీసుకొని ఒక బాలిక వీధిగుండా వెళు తున్నదట. ఇంతలో ఆ పాత్ర జారిపడి తైలమంతా భూమిలోకి ఇంకిపోతుంది. ఇంటికి వెళితే తల్లి దండిస్తుందని ఆ బాలిక విలపిస్తున్నదట. అటుగా వెళ్తున్న కర్ణుడికి ఈ దృశ్యం కనిపించింది. ఆ బాలికను ఊరడించడంకోసం తైలం ఒలికిన ప్రదేశంలోని మట్టిని పిడికిట్లోకి తీసుకొని గట్టిగా పిండి, మళ్లీ ఆ పాత్రలో తైలం నింపాడట. అప్పుడు భూదేవి ఆగ్రహించింది. ‘ఓయీ కర్ణా! నాలో ఇంకిన చమురును పిండి నా శరీరాన్ని కష్టపెట్టావు. నీ జీవితంలోని కీలక యుద్ధ సమయంలో నీ రథచక్రం కూడా నాలో దిగబడిపోతుంది. అదే నీ చావుకు కారణమవుతుంద’ని శపించింది. పిడికెడు మట్టిని పిండితేనే అప్పుడు భూదేవి శపించింది. ఇప్పుడు భూగర్భంలోకి చొరబడి శిలాజాలను మండించి చమురు వాయువులను పిండుకుంటున్నప్పుడు, తివిరి ఇసు మున తైలమును తీస్తున్నప్పుడు, అడవుల్ని, కొండల్ని కరెన్సీ లోకి మారకం చేస్తున్నప్పుడు శపించకుండా ఉంటుందా? పలు మార్లు శపించి ఉంటుంది. ఆ శాపాలకు విమోచన మార్గాలను అన్వేషించడమే ఇప్పుడు జరుగుతున్న ‘కాప్’ సదస్సు పని! దేశాలనూ – వాటి విదేశాంగ విధానాలనూ, ప్రభుత్వా లనూ – వాటి ప్రాధాన్యాలనూ బడా సంపన్నులే నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ ‘కాప్’ సదస్సు ఏమైనా సాధిస్తుందా లేక కాకి గోలగా మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా లేక పోలేదు. మీడియాతో సహా అనేక వ్యవస్థల మీద ‘మిగులు ధనం’ పట్టు బిగిస్తున్నది. ఫలితంగానే పర్యావరణం వంటి ప్రాణప్రదమైన అంశాల మీద జన చేతన జ్వలించడం లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి సంపాదించిన డబ్బు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా దిగజారుతున్న క్రమం మన కళ్లముందున్నది. వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆయనకు ఒంటి మీద ఒక ముతక ఖద్దరు లాల్చీ, పంచె, భుజం మీద ముతక కండువా, చేతిలో గుడ్డ సంచీ, అందులో కొన్ని కాగితాలు. అంతే! ఆయనలో ఏ మార్పూ రాలేదు. పైసా ఖర్చు పెట్టకున్నా జనం ఆయనకు ఓట్లే శారు. గెలిపించారు. మొదటి నాలుగు ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉప్పల మల్సూర్ గెలిచారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలను పార్టీకే ఇచ్చేవారు. తన కనీస అవసరాలకోసం పార్టీ ఇచ్చే డబ్బుతోనే గడిపేవారు. (అప్పట్లో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలందరికీ ఈ నియమం ఉండేది). ఇరవయ్యేళ్ల తర్వాత ఉదర పోషణార్థం ఆయన చేతనైనంతకాలం చెప్పులు కుట్టు కుంటూ గడిపారు. ఓట్లకోసం ఆయనగానీ, ఆయన పార్టీగానీ ఏనాడూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టింది లేదు. మొదటి ఐదారు శాసనసభలకు సంబంధించి ఇటువంటి ఉదాహరణలు ఎన్న యినా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పర్యటన కోసం బయల్దేరాడంటే అదొక ధనబీభత్స దృశ్యమే. అదుపు తప్పిన మదపుటేనుగు రోడ్డు మీద పడ్డట్టే! ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికైన 533 మంది సభ్యుల్లో 475 మంది కోటీశ్వరులు. ఇది వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నిర్ధారించిన సంఖ్య. 88 శాతం మంది కోటీశ్వరులతో నిండి వున్న మన పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదా లేక ధనస్వామ్యా నికా? తేల్చవలసి ఉన్నది. సంఘసేవకులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు చట్టసభల్లో పలచబడుతున్నారు. వ్యాపారులు చిక్కబడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ.. ఎక్కడైనా వ్యాపారులూ, కాంట్రాక్టర్లదే హవా! ఎందుకంటే వాళ్లు ఓట్లను కొనుగోలు చేయగలుగుతారు. అందుకని రాజకీయ పార్టీలు వారిని చేరదీస్తున్నాయి. వారి కరెన్సీ నోట్ల కట్టల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి కర్బన ఉద్గా రాలు వెలువడుతున్నాయి. బొగ్గు పులుసు వాయువు (ఛిౌ2) దట్టంగా అలుముకుంటూ రాజకీయ వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తున్నది. క్రీస్తుశకం 1498లో వాస్కోడిగామా అనే ఐరోపా యాత్రికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత సరిగ్గా ఐదొందల యేళ్లకు తెలుగు నేలపై ఓటు సాధనకు నోటు మార్గాన్ని 1996లో చంద్రబాబు కనిపెట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో వాతావరణ మార్పులు మొదలయ్యాయి. క్రమేణా పేద పార్టీలు దివాళా తీశాయి. అందులో కొన్ని ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తూ అద్దె మైకులుగా రూపాంతరం చెందాయి. సంఘసేవకులు సన్యాసం పుచ్చుకున్నారు. మేధావులు, వృత్తి నిపుణులు రాజకీయాలకు దూరమయ్యారు. 1996లో దర్శి, పాతపట్నం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. అప్ప టికి ఏడాది క్రితమే అంతఃపుర కుట్ర ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తన స్థానాన్ని పదిలపరుచుకోవడా నికి ఈ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఒక్కో ఓటుకు ఐదొందల రూపాయలు పంచారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు ఎక్కడో ఒకచోట వందో, యాభయ్యో.. అదీ, నిరుపేద వర్గాలకు ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం సామ్యవాద పద్ధతిలో ధనిక – బీద తేడా లేకుండా అందరి ఓట్లనూ అధిక ధరలకు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. 1998లో అత్తిలి స్థానానికి ఉపఎన్నిక జరి గింది. సాధారణ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. అయినా చంద్రబాబు తేలిగ్గా తీసుకోలేదు. ఓటుకు వెయ్యి పంచారని వార్తలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దండు శివరామరాజే ఆ ఖర్చును చూసి జడుసు కున్నారట! మొదటిసారిగా ఓటుకు నాలుగంకెల ధర 1998లో పలికింది. ఆ తర్వాత ఇరవై మూడేళ్లకు ఇప్పుడు ఐదంకెల మార్కును తాకినట్టు వార్తలు వస్తున్నాయి. సెన్సెక్స్ నాలు గంకెలు దాటిన రోజునుంచి లెక్కిస్తే ఐదంకెలు తాకడానికి పదహారేళ్లు పట్టింది. హుజూరాబాద్ నుంచి వస్తున్న వార్తలు నిజమైతే వోటెక్స్కు ఈ సమయం ఇరవైమూడేళ్ళు పట్టినట్టు! ఇంచుమించుగా సెన్సెక్స్‌కు ధీటుగా ఉన్నట్టే! హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ ఓటర్లకు ఒక్కొక్కరికి పదివేలు పంచిందని ప్రచారం జరిగింది. మొదటిదఫా ఆరువేలు, రెండోదఫా నాలుగువేల చొప్పున పంచారట. ఆ పంపకం కూడా చాలా కళాత్మకంగా ఉన్నట్టు కొందరు కొనియాడుతున్నారు. మొదటిరౌండ్ పంపకాన్ని ఒకానొక నడిజామురేయి దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూ ర్తంలో ప్రారంభించి వెలుగురేకలు పరచుకొనే సుప్రభాత వేళకల్లా పూర్తిచేశారట. అంటే ముచ్చటగా మూడు గంటల్లో గరిష్ఠ స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నాలుగైదు మాసాలపాటు ప్రచార కార్యక్రమాన్ని సాగదీసినందువల్ల రెండు ప్రధాన పార్టీలకు ఖర్చు భారీ మొత్తంలోనే అయినట్లు అంచనా లొస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హుజూరా బాద్ ఖర్చు బహుశా రికార్డు సృష్టించవచ్చు. మూడోపార్టీగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభిం చింది. ఎన్నికల ఖర్చుపై కూడా పెద్దగా ధ్యాసపెట్టినట్టు కనబడలేదు. కౌంటింగ్ జరిగితే తప్ప హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర ఏమిటో అర్థం కాదు. హుజూరాబాద్ ఎన్నిక ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు మారినట్టు? ఇంత పెద్ద ధనప్రవాహం ఎందుకు అవసర మైనట్టు? ఒకవేళ ఈటల రాజేందర్ పట్ల జనంలో సానుభూతి ఉన్నమాటే వాస్తవమైతే ఎన్ని డబ్బులు గుమ్మరించినా ఓడిం చడం సాధ్యం కాదు. సానుభూతి అనేది లేకపోతే – ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తాయి. పైగా మొన్న ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆ పథకాలన్నింటినీ మరోసారి గుర్తుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన ప్రసంగాన్ని వినే ఏర్పాట్లను కూడా చేశారు. ‘దళితబంధు’ పేరుతో ఒక విప్ల వాత్మక కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభిం చారు. ఇంతచేసినా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు చెమటలు పట్టినట్టు? ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ తర్వాత అంతటి దిట్టగా పేరున్న హరీశ్‌రావు సారథ్యంలో ఒక పెద్ద సైనిక పటాలాన్ని అక్కడ ఎందుకు మోహరింపజేసినట్టు? ఓటు ధరలు ఆకాశాన్నంటుకున్నట్టు వార్తలెందుకు షికారు చేసినట్టు? మరో ఆసక్తికరమైన అంశమేమంటే అధికార పార్టీకి ధీటుగా ఈటల రాజేందర్ కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చగలగడం! బీజేపీ సమకూర్చిందా? లేక సొంత వనరులా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ సొంత వనరులే అయితే షాకింగ్ న్యూసే! ఏపీలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక హుజూరాబాద్‌తో పోలిస్తే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయింది. వరుస ఓటము లతో కుదేలైన ప్రధాన ప్రతిపక్షం సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ముందుగానే తప్పుకున్నది. కానీ లోపాయకారిగా బీజేపీకి అను కూలంగా పనిచేసినట్టు సాక్ష్యాధారాలతో వెల్లడైంది. మెజారిటీ పోలింగ్ స్టేషన్లలో టీడీపీవారే బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారట. కాంగ్రెస్ పార్టీ పోటీ కేవలం సంకేతప్రాయమే. గెలుపు ఎవరిదో ముందే తెలిసినందువల్ల ఏ పార్టీ అభ్యర్థి కూడా పెద్దగా ఖర్చు చేసినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ వారు పార్టీ తరఫున ఖర్చు చేయలేదు. కానీ, అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా నిరోధించగలిగారా? ఓట్ల కొనుగోలు వ్యూహాలకు చెక్ చెప్పకపోతే ప్రజా స్వామ్యానికి అర్థంలేదు. రాజకీయ వ్యవస్థలో ధనస్వామ్యం ముప్పు తొలగాలంటే కచ్చితంగా ఒక ఉద్యమం కావాలి. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాధనాన్ని అడ్డ గోలుగా దోచేసి భోంచేస్తున్నారన్న అభిప్రాయం జన సామా న్యంలో ఏర్పడింది. అందుకే ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని దబాయించి మరీ అడుగుతున్నారు. హుజురాబాద్‌లో కనిపించిన దృశ్యాలవే! గ్లాస్గో సదస్సు ప్రేరణతోనైనా సరే రాజకీయ కాలుష్యంపై పోరాడేందుకు ఒక ప్రజాస్వామిక ఉద్యమ బీజం పడాలని కోరుకుందాము. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అంతిమ విజయం ప్రజలదే..
-
30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా
-
ముగిసిన హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్
-
కాసేపట్లో ముగియనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
-
కొన్నిచోట్ల డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చాయి: శశాంక్ గోయల్
-
హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ (ఫోటోలు)
-
హుజురాబాద్: కౌన్సిలర్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తల బైఠాయింపు
-
ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్
-
పోలింగ్ కేంద్రంలో కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
-
చరిత్రలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడు చూడలేదు: ఈటల
Huzurabad By Elections 2021: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉన్నారు. ఈటల అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దు, బొంద పెట్టాలని సీఎం కేసిఆర్ కుట్ర పన్నారు. భావోద్వేగంతో ప్రజలకు అప్పీల్ చేశాను. చంపుకుంటారో, సాదుకుంటారో ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నా. వందల కోట్లు డబ్బులు పంచినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు తమ వైపే ఉన్నారు. చరిత్రలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడు చూడలేదు. ఐదు నెలలుగా జనంలో ఉన్నా, కానీ ప్రలోబాలతో మూడు రోజుల్లోనే మార్చేశారు. ఇంత నీచంగా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసిన పరిస్థితి చూడలేదు' అని ఈటల అన్నారు. చదవండి: (Huzurabad Bypoll: కౌశిక్‌రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ) -
Huzurabad Bypoll: ఓటెత్తిన హుజూరాబాద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన హుజూరాబాద్ ఉపఎన్నిక అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తడంతో రికార్డు స్థాయిలో 86.33% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 82.19% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్)లు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఈటల, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత చేకూరింది. 12 గంటల పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికే 45% దాటిన పోలింగ్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్‌లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు. పోలింగ్ సమయం రాత్రి 7 గంటల వరకు ఉన్నా.. మధ్యాహ్నం లోగానే ఓటు వేసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మధ్యాహ్నం ఒంటిగంటకే పోలింగ్ 45 శాతం దాటడం అధికారులను ఆశ్చర్యపరిచింది. రైతులు, ఇతర వ్యవసాయ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో సెటిలైనవారు మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి పడినా.. అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా అంతా ఇబ్బందుల్లేకుండా ఓట్లేశారు. చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది. మూడంచెల భద్రతలో ఈవీఎంలు గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసేది. కానీ కరోనా నిబంధనలతో రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. అయినా మండలాల్లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాంటి కేంద్రాల్లో 7 గంటల తరువాత ఈవీఎంలను సీజ్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక వంటి కొన్ని పోలింగ్స్టేషన్లలో ఓటర్లు సాయంత్రం కూడా బారులు తీరారు. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది. భారీ బందోబస్తు నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 172 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, 73 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 1,800 మంది (90 కంపెనీలు) కేంద్ర బలగాలు, 2,000 మందికి పైగా స్థానిక పోలీసులు కలిపి మొత్తం సుమారు 4,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ► జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో అధికార పార్టీ వారు డబ్బులు పంచుతున్నారని బీజెపీ నేతలు ధర్నాకు దిగారు. ► జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో అధికార పార్టీ తరఫున ఓ మీడియా ప్రతినిధి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ► హుజూరాబాద్‌లోని రెండు వార్డుల్లో డబ్బులు పంపిణీ చేసిన ఓ పార్టీకి చెందిన స్థానికేతర నేతలను స్థానికులు అడ్డుకోవడం గొడవకు దారితీసింది. ► ఇల్లందకుంట మండలం సిరిసేడు, శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్నారంటూ గొడవలు జరిగాయి. ► తమ డబ్బులు ఇవ్వలేదంటూ వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ► మధ్యాహ్నం వరకు స్థానికులు, ఆ తరువాత ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉండే వర్గాలన్నీ అకస్మాత్తుగా మరో పార్టీకి ఓటేశాయనే ప్రచారం ప్రధాన పార్టీల్లో జరిగింది. దీంతో ఎవరి ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో తెలియని అయోమయం నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపు ప్రతి పోలింగ్‌స్టేషన్ వద్ద పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించాయి. ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. కానీ చాలామంది తీర్పును వెల్లడించేందుకు నిరాకరించారు. దీంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు అన్న విషయంలో అన్ని పార్లీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. -
డబ్బుల్లేక ప్రచారానికి వెళ్లలేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తాను ఎందుకు వెళ్లలేదన్న అంశంపై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తనదైన శైలిలో బదులి చ్చారు. తాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కరీంనగర్ పార్లమెంటు ఇన్చార్జిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరపున ప్రచారానికి వెళ్లలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. అందుకు కారణం తన దగ్గ ర డబ్బులు లేకపోవడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు చెరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, డబ్బులు లేకుండా తాను వెళ్లి అక్కడ ఏం చేయలేను కనుకనే ప్రచారానికి వెళ్లలేకపోయానని జగ్గారెడ్డి తెలిపారు. -
ఓటర్లకు మాస్కు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. కోవిడ్ నిబంధనలతో పోలింగ్‌ను నిర్వహిస్తామని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఓటర్లు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఓటు వేసేవారు కరోనా టీకా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాలకు చేరాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 32 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ సరళిని పరిశీలిస్తారని, 3,868 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.3.5 కోట్ల నగదును పట్టుకున్నామని, ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని పేర్కొన్నారు. అంధ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గోయల్ విజ్ఞప్తి చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తాం ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ స్థానికులు కొందరు ఆందోళన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని శశాంక్ గోయల్ చెప్పారు. డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని, వారు డబ్బులు అడిగినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు
-
Huzurabad Bypoll: రేపు ఉపఎన్నికకు పోలింగ్
-
ఛాలెంజ్ ఓటు, టెండర్డ్ ఓటు గురించి తెలుసుకోండి!
సాక్షి, కరీంనగర్: ఈ నెల 30న(శనివారం) జరిగే హజూరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు మాక్ పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ కారణంగా ఈసారి రెండు గంటలు అదనంగా సమయం ఇచ్చారు. గతంలో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసేది. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. చదవండి: ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు ► ముందుగా పోలింగ్ జరిగే తేదీన సిబ్బంది ఉదయం 5.30 కల్లా రెడీగా ఉంటారు. పోలింగ్ ఏజెంట్లు కూడా హాజరవుతారు. ►పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి ఫాం–10ని సిబ్బంది తీసుకుంటారు. వాటిపై ఏజెంట్ల సంతకాలు తీసుకొని, అడ్మిషన్ పాసులు ఇస్తారు. ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కరు మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉంటారు. ►పోలింగ్ ఏజెంట్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదు. నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఫొటోలు తీయకూడదు. ►పోలింగ్ ఏజెంట్ల పేరు ఆ ఓటరు లిస్టులో నమోదై ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ యంత్రాన్ని సిద్ధం చేసుకొని, ఉదయం 7గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ►మాక్ పోలింగ్ అనేది ఏజెంట్ల సమక్షంలోనే జరుగుతుంది. ఒకవేళ వారు లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల సమక్షంలో కనీసం 50 ఓట్లకు తగ్గకుండా నిర్వహిస్తారు. ►మాక్ పోలింగ్ నిర్వహించేటప్పుడు ముందుగా కంట్రోల్ యూనిట్‌లోని క్లియర్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ డిస్ప్లే సెక్షన్ “0’ని చూపిస్తుంది. అలాగే వీవీ ప్యాట్లోని డ్రాప్ బాక్స్ కూడా క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఏజెంట్లకు కూడా చూపించాలి. అనంతరం పోలింగ్ ఏజెంట్లను పిలిచి, వాళ్లకు ఇష్టమైన గుర్తును నొక్కమని చెప్పి, ఇలా సుమారుగా 50 ఓట్లకు పైగా వేయిస్తారు. చదవండి: అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా? ►ఈ క్రమంలో ఆ ఏజెంట్ పేరు, వేసిన గుర్తు, ఎన్ని ఓట్లు వేశాడు? అనే విషయాన్ని ఒక పేపరు మీద రాసుకోవాలి. ఏజెంట్లు అందరూ ఓటింగ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ నొక్కాలి. ఒకసారి క్లోజ్ బటన్ నొక్కాక బ్యాలెట్ యూనిట్లో ఏ గుర్తుకు ఓటు వేసినా మనకు ఇన్వ్యాలిడ్ అని చూపిస్తుంది. అనంతరం టోటల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో చూపిస్తుంది. తర్వాత రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే అభ్యర్థి వారీగా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో చూపిస్తుంది. అనంతరం వీవీ ప్యాట్లోని స్లిప్పులను ప్రింట్ తీసి, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. ►ఏజెంట్లు వేసిన ఓట్లు, వీవీ ప్యాట్లోని స్లిప్పుల్లో వచ్చిన ఫలితం లెక్క సరిపోయిందో లేదో సరిచూసుకుంటారు. తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీంతో అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్లీ “0’ నుంచి మొదలవుతుంది. ►అనంతరం స్లిప్పుల వెనకాల మాక్‌పోల్ అనే ముద్ర వేసి, ఒక కవర్లో వేసి, సీల్ చేస్తారు. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేశాక అక్కడ ఉన్న ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచి, పింక్ కలర్ ట్యాగ్‌తో సీల్ చేస్తారు. ఆ ట్యాగ్ మీద కూడా పీఓ (ప్రిసైడింగ్ అధికారి) సంతకంతోపాటు పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ►ప్లాస్టిక్ బాక్స్ మీద నియోజకవర్గం పేరు, నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, నంబర్ స్పష్టంగా రాయాలి. తర్వాత పీఓ అనుబంధం–14 ఫాంను నింపాలి. ఈ మాక్ పోల్ అయిపోయాక కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లకు పటిష్ఠంగా సీలు వేయాలి. ఈ విధంగా మాక్ పోలింగ్‌ను ఉందయం 6 గం. నుంచి 7గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ ఓటు ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తిని అతను నిజమైన ఓటరు కాదని బూత్‌లో ఉన్న ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఎన్నికల అధికారి అక్కడికక్కడే నిలిపివేస్తారు. ఆ సమయంలో ఛాలెంజ్ ఓటు అనుమతిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి ఓటరుతోపాటు ఏజెంటు అభ్యంతరాలను విన్న తర్వాత అక్కడ క్యూలో ఉన్న ఓటర్లతో విచారణ చేపడతారు. అతను నిజమైన ఓటరు అని తేలితే ఓటు వేయడానికి అనుమతిస్తారు. కాదని తేలితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి. ఛాలెంజ్ ఓటరు వివరాలను అక్కడికక్కడే నమోదు చేస్తారు. టెస్టింగ్ ఓటు ఓటు వేశాక ఓటరు తన ఓటు వివరాలు సక్రమంగా రాకపోతే వెంటనే అధికారికి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో అక్కడికక్కడే పోలింగ్‌ను నిలిపివేయడానికి అవకాశముంది. తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి నమోదైనట్లుగా స్లిప్పులో వివరాలు వస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఏజెంట్ సమక్షంలో విచారణ చేపడతారు. ఓటరు చేసిన ఆరోపణ నిజమైతే పోలింగ్‌ను నిలిపివేస్తారు. తప్పని తేలితే అతనిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. టెండర్డ్ ఓటు ఓటరు తాను ఓటు వేయడాని కంటే ముందుగానే మరో వ్యక్తి అతని ఓటు వేసిన నేపథ్యంలో బాధితుడి టెండర్డ్ పద్ధతిలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు అని ఏజెంట్లతో విచారణ చేసినపుడు నిర్ధారణ అయితే అతడికి బ్యాలెట్ పత్రాన్ని అందజేసి, ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ విధంగా వేసిన ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చినపుడు టెండర్డ్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు. -
ఈసీ ఉత్తర్వులు సబబే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళితబంధు’అమలును నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ దశలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘దళితబంధు’ను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ఎన్నిక పూర్తయ్యే వరకు ‘దళితబంధు’ను నిలిపివేస్తూ సీఈసీ ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నేత జడ్సన్‌తోపాటు దళితబంధును ఆపాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దళితబంధు పథకంతో నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఆపాలన్న ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
గెల్లు శ్రీనివాస్‌కే మా మద్దతు
ఖైరతాబాద్(హైదరాబాద్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల్సిందిగా 120 బీసీ సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు, సంఘాల నేతలు ఈ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు తాము అనేక కారణాలు చెప్పగలమని, ఈటల రాజేందర్‌కు మీరు మద్దతు ఇవ్వడానిగల కారణాలు చెప్పగలరా అని ఆయన సవాలు చేశారు. గురువారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీబంధు పథకం పెట్టాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామని, అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి బీసీబంధు పథకంపై సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. జనగణనలో బీసీలను లెక్కించడానికి ఒప్పుకోని బీజేపీ, దేశంలోని 70 కోట్లమంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. -
ఓటరు ఎటువైపు?.. కీలకంగా చివరి 24 గంటలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉం టుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్‌లో ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. (చదవండి: Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?) అంచనాలకు అందకుండా.. ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయని.. పోలింగ్ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓటర్లలో చాలా వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన పార్టీల స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరినైనా పలకరిస్తే.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారని, పోలింగ్ నాడే నిర్ణయించుకుంటామని చెప్తున్నారని పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. (చదవండి: బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!) ప్రలోభాల ‘వార్’! డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో విపరీతంగా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఒకపార్టీ ఓటుకు రూ.6 వేలు, ప్రతిగా మరోపార్టీ రూ.10 వేలు పంచుతున్నట్టుగా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. జోరుగా బెట్టింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. దీనిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ దందాలు మొదలైనట్టు సమాచారం. శనివారం ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ప్రధాన పార్టీల మధ్య సమాన స్థాయిలో పందేలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. శనివారం పోలింగ్ సరళిని బట్టి బెట్టింగ్ ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్‌లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాగా చెప్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. (చదవండి: ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?) -
హుజురాబాద్ లో గందరగోళం
-
అసలీ పోలింగ్ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత? ఓటు వేయడమెలా?
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ పోలింగ్‌కు అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల క్రతువుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమే ఎదురుచూస్తున్న యుద్ధానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు సమకూర్చిన అధికారులు ఈ నెల 30న పోలింగ్ నిర్వహణకు సమాయత్తమయ్యారు. శనివారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కార్యనిర్వాహక దళం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బాధ్యత గల పౌరులుగా మనం ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఓటు వేసే సమయంలో పరిసరాలపై అవగాహన అవసరం. అసలు పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఉంటారు..? వారు ఏం చేస్తారు..? మనకు సందేహం వస్తే ఎవరిని అడగాలి..? ఓటింగ్ యంత్రాలు ఎక్కడ ఉంటాయి..? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కథనం. సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే మొదట సహాయ ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు), ఓటరు స్లిప్‌ను పరిశీలించి ఓటరు జాబితా (మార్కింగ్ కాపీ)లో నమోదు చేసుకుంటారు. అటుపై పోలింగ్ కేంద్రంలో ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు వినిపించేలా ఓటరు పేరు వివరాలను చదువుతారు. వెల్లడించిన వివరాలను పోలింగ్ కేంద్రంలోని ఆయా పార్టీల ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. మూడో అధికారి మరో రెండడుగులు వేశాకా అధికారి కనిపిస్తారు. ఇతడు ఓటరుకు చెరిగిపోని సిరా గుర్తును పెట్టి అనంతరం ఓటరు రిజిష్టర్‌గా వ్యవహరించే ఫాం 17ఏ లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఓటరు సంతకాన్ని తీసుకుని ఓటరు స్లిప్‌ను అందిస్తారు. నాలుగో అధికారి సిరా మార్క్‌ను రూడీ చేసుకొని ఓటరు స్లిప్ తీసుకొని, కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్‌ను జారీ చేస్తారు. అప్పుడు బిజిలైట్ వెలగడంతో పాటు ఈవీఎంపై పచ్చ (గ్రీన్) లైట్ వెలుగుతుంది. అనంతరం ఓటరు కంపార్ట్మెంట్లోకి వెళ్లి తను ఎంచుకున్న అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న మీటాను నొక్కాలి. పక్కనే ఎడమ వైపుగా ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో 7 సెకన్ల పాటు తాను వేసిన ఓటును నిర్ధారించుకునే అవకాశాన్ని వినియోగించుకొని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలి. పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ కేంద్రంలో అన్ని వ్యవహారాలకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్ అధికారిదే. ఈయన నియోజకవర్గ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరవేస్తారు. ఓటింగ్ పూర్తయ్యాక అప్పగిస్తారు. పోలింగ్ కేంద్రంలో పర్యవేక్షణ చేస్తారు. ఈవీఎం పరికరాలు ఇలా.. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలో మూడు పరికరాలు ఉంటాయి. అవి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. కంట్రోల్ యూనిట్ పోలింగ్ అధికారి (మూడో అధికారి) వద్ద ఉంటుంది. దీన్ని ఈయనే నియంత్రిస్తుంటారు. బ్యాలెట్ యూనిట్ అంటే ఓటరు మీట నొక్కే విభాగం. దీంతోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీవీ ప్యాట్‌ను బ్యాలెట్ యూనిట్‌కు ఎడమ వైపుగా ఏర్పాటు చేస్తారు. మీట నొక్కిన తరువాత వీపీ ప్యాట్ సరిచూసుకోవడానికి వీలు కల్పిస్తూ ఏడు సెకన్ల పాటు నిలిచి ఉంటుంది. తర్వాత అది కట్ అయి ఎంపిక చేసిన బాక్స్‌లో పడుతుంది. ఏదైనా ఒకటి తప్పనిసరి ఓటు వేసేందుకు వెళ్లేటపుడు ఓటర్లు కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి తప్పక ఉంచుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ►ఓటరు చీటి ►ఆధార్ కార్డు ►పాస్‌పోర్టు ►డ్రైవింగ్ లైసెన్స్ ►పాన్‌కార్డు ►ఓటరు గుర్తింపు కార్డు ►ఉపాధి కూలీ కార్డు ►కార్మికుల ఆరోగ్య కార్డు ►పింఛను ధ్రువీకరణ ►ఉద్యోగి ఫొటో గుర్తింపు కార్డు(ప్రభుత్వ, ప్రైవేటు) ►బ్యాంకు పాసుపుస్తకం