ఇందిరమ్మ రాజ్యమా.. రాక్షస రాజ్యమా? | Congress Leader Ponnam Prbhakar Fires On TRS Party In Huzurabad Bypoll Campaign In Karimnagar | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ రాజ్యమా.. రాక్షస రాజ్యమా?

Published Tue, Oct 12 2021 1:54 AM | Last Updated on Tue, Oct 12 2021 1:56 AM

Congress Leader Ponnam Prbhakar Fires On TRS Party In Huzurabad Bypoll Campaign In Karimnagar - Sakshi

మాట్లాడుతున్న పొన్నం. చిత్రంలో బల్మూరి

సాక్షి, ఇల్లందకుంట (కరీంనగర్‌): ఇందిరమ్మ రాజ్యం కావాలా.. లేక నియంతృత్వంగా పాలిస్తున్న టీఆర్‌ఎస్‌ రాక్షస పాలన కావాలనేది ప్రజలే ఆలోచించుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఇల్లందకుంటలో హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమానికి పార్టీ ఎలక్షన్‌ ఇన్‌చార్జి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు.

సీతారామచంద్రస్వా మి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్యాల, వాగుఒడ్డు రామన్నపల్లిల్లో పొన్నం మాట్లాడారు.  ఈ ఎన్నికలను ఈటల, కేసీఆర్‌ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆయనకు ప్రజలే  గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement