
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు.
మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment