d srinivas
-
డీఎస్ కుటుంబానికి బొత్స పరామర్శ
నిజామాబాద్, సాక్షి: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకోసం సోమవారం ఉదయం ప్రగతి నగర్‌లోని డీఎస్ నివాసానికి బొత్స వెళ్లారు.కాంగ్రెస్‌లో ఉండగా డీఎస్‌తో బొత్సకు మంచి అనుబంధం ఉంది. డీఎస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన కుటుంబ సభ్యుల్ని బొత్స ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. జూన్ 30వ తేదీన హైదరాబాద్ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
-
ఇక సెలవు.. ముగిసిన డీఎస్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు నాయలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో డీఎస్ ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులు సంజయ్ అరవింద్‌లను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక భూమిక పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రత్యేక చొరవతోనే 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్‌కు మంచి అనుబంధం ఉందని, బడుగు, బలహీన వర్గాల నేతలను ప్రోత్సాహించారని ప్రశంసించారు. డీఎస్ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అంతియ యాత్ర మొదలు కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి పాడెను మోశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
నిజామాబాద్ కు డి శ్రీనివాస్ భౌతికకాయం
-
ధర్మపురి శ్రీనివాస్ ప్రస్థానం
-
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ కన్నుమూత
-
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.కాగా, ఎంపీ అర్వింద్ ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. My father, Sri D. Srinivas Garu has been admitted to the ICU of a private hospital due to a urinary tract infection and sodium loss. Please keep him in your thoughts and prayers. pic.twitter.com/6xZtEaP6SN— Arvind Dharmapuri (Modi Ka Parivar) (@Arvindharmapuri) June 1, 2024 -
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది. ‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం. :::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం!
ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే.. నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది. దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్‌కు బీజం పడినట్లయింది. సీఎం కేసీఆర్‌కు కౌంటర్.. పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రెండు సవాళ్లు ఇవే.. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్‌తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్‌కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్‌గానే మారింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్‌తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్‌ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
డీఎస్ ఇంట్లో రాజకీయ రచ్చ.. అన్న ఆరోపణలపై స్పందించిన అరవింద్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వ్యవహారంపై ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి మైల్డ్ పెరాలసిస్‌తో పాటు, చెప్పింది మర్చిపోయే డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయనను గాంధీభవన్‌కు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పడం సబబు కాదన్నారు. ' మా నాన్న మైండ్ స్ట్రోక్ వచ్చి బాధపడితే కనీసం సోనియా గాంధీ గానీ ఇంకెవరు గానీ పలకరించినవాళ్లు లేరు. నా తండ్రి కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అని నేనే పలుమార్లు చెప్పాను. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లినా, కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇది సమయం కాదు.. జాయిన్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సోనియానో , ఇంకెవరైనా ఆ స్థాయి వాళ్లో ఆయన ఇంటికే వెళ్లి కండువా కప్పితే భావ్యం తప్ప ఇది పద్ధతి కాదన్నదే నా ఉద్దేశం' అని అరవింద్ అన్నారు. కాగా.. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీభవన్ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఒక్కరోజుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. తాను పార్టీలో చేరలేదని, కానీ చేరినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ లేఖను తన తమ్ముడు అరివింద్ బ్లాక్మెయిల్ చేసి రాయించాడని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అన్నాదమ్ముల మధ్య పొలిటికల్ హీట్ పెంచింది. సంజయ్ ఆరోపణల నేపథ్యంలోనే అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా? -
కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా?
డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది? -
కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పాటు ఆయన తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. డీఎస్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, గత కొంతకాలంగా సంజయ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. డీఎస్ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. అయితే, తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్‌తో పాటుగా సంజయ్ టిఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. గత కొద్దికాలంగా బీఆర్ఎస్కు సంజయ్ దూరంగా ఉంటున్నారు. డీఎస్ చేరికపై ట్విస్టు కాగా, డీఎస్ కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ స్వయంగా ప్రకటించారు. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డీఎస్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన పత్రికా ప్రకటన ‘‘కాంగ్రెస్‌లో చేరుతున్నా కాబట్టే గాంధీభవన్‌కు వచ్చా. రాహుల్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్ చేరుతున్నా. నేను కాంగ్రెస్ వ్యక్తిని.. నన్ను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్‌పై అనర్హత వేటువేసే వారికి అసలు అర్హత ఉందా?. రాహుల్ ఊహించని దానికంటే గొప్పగా పనిచేస్తున్నారు’’ అని డీఎస్ అన్నారు. -
సీనియర్ నేత డీ.శ్రీనివాస్‌కు అస్వస్థత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు. మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f — Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023 -
రాజ్యసభ మాజీ ఎంపీ డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల
-
డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల.. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి కరమైన చర్చ సాగింది. వైఎస్సార్‌తో ఉన్న పాత అనుభవాలను డీస్ గుర్తు చేశారు. వైఎస్సార్‌పై తెలంగాణ ప్రజల అభిమానం చెక్కు చెదరలేదన్నారు. షర్మిలను బలమైన మహిళగా డీఎస్ పేర్కొన్నారు. షర్మిల కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైఎస్ సీఎం అవుతారని 2003లోనే చెప్పానని డీఎస్ గుర్తు చేసుకున్నారు. చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
మండవకు ‘రాజ్య’యోగం దక్కేనా..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం అయింది. రెండు సాధా రణ స్థానాలు కాగా, ఒకటి ఉప ఎన్నిక. జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి శ్రీనివాస్ పదవీకాలం వచ్చే నెల 21న ముగియనుంది. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు సభ్యత్వం కాలపరిమితి ముగియనుంది. మరొక స్థానం విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి ఈ నెల 19 వర కు నామినేషన్ల గడువు ఉంది. మిగిలిన రెండు సాధారణ స్థానాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే జిల్లా నుంచి డీఎస్ ఖాళీ చేస్తున్న స్థానాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ ఆశిస్తున్నారు. కాగా జిల్లా నుంచి ఇప్ప టికే రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి ఉన్నా రు. రాజ్యసభ సీట్లను ఆశించేవారి సంఖ్య అధికార పార్టీలో భారీగానే ఉంది. దీంతో అనేక స మీకరణాలు ప్రభావితం కానున్నాయి. ఈ మేర కు సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారేనే విషయ మై వివిధ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆశావహుల్లో ప్రధానంగా మండవ వెంకటేశ్వరరావు పేరు మాత్రమే వినిపిస్తోంది. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
మళ్ళీ కాంగ్రెస్ గూటికి డి. శ్రీనివాస్
-
ఓ కుటుంబ కథా చిత్రం..
-
కాంగ్రెస్‌లోకి రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్..!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ డీఎస్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే రెండు, మూడు రోజుల్లోనే ఇది వాస్తవరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డి.శ్రీనివాస్ కొనసాగుతున్నారు. త్వరలోనే డీఎస్ రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. కాగా, కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అధిష్టానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: (గుడ్‌న్యూస్! హైదరాబాద్‌కి పెట్ కేర్.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..) 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్ స్వయంగా డీఎస్ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు. ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్ కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగానే ఉంటున్నారు. -
ఉత్తమ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్చార్జ్గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. -
డీఎస్‌తో ఈటల భేటీ, రెండు గంటలపాటు చర్చలు!
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌తో బుధవారం భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు. చదవండి: ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం -
ఆస్తులు రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ వరకు అన్నీ ఆన్లైన్లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది! వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సిటిజన్ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్‌కు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. ఆ తర్వాత ఫ్లాట్ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ మేర ఫీజు, మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్ అడ్వైజరీ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్సైట్ నుంచి సబ్రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్లోడ్ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్‌బుక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్హెడ్తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్‌తో పాటు మెరూన్ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ డీడ్ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది. డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు ధరణి పోర్టల్ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిస్ సంబంధిత పోర్టల్‌లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన నవంబర్ 12న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్ వేలిముద్రలు, ఐరిస్ ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలలేదు. దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఐరిస్ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్‌ను అప్డేట్ చేసుకున్నారు. అప్డేట్ చేసిన ఆధార్ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్ మ్యాచింగ్ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్ మ్యాచ్ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డీఎస్ తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82 సాక్షి, హైదరాబాద్: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్ బుక్ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ సాక్షి, నెట్వర్క్: అమావాస్య సెంటిమెంట్‌కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్‌కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్లో 1 రిజిస్ట్రేషన్ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు. అరగంటలోనే పనైంది.. నా భర్త పేరిట ఉన్న ఆర్సీసీ భవనం (బిల్డింగ్) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్ బుక్ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్‌కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు, ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ -
దమ్ముంటే చర్యలు తీసుకోండి: డీఎస్
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పు చేశానని.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా అని టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తనపై ప్రశాంత్‌రెడ్డి చేసిన విమర్శలను డీఎస్ తీవ్రంగా ఖండించారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. తన సస్సెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని డీఎస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనపై సోనియాగాంధీకి తప్పుడు నివేదిక ఇవ్వటం వల్ల తాను మనస్తాపంతో కాంగ్రెస్‌పార్టీని వీడానని డీఎస్ వెల్లడించారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు డీఎస్ బహిరంగ లేఖ -
సీఎం కేసీఆర్‌కు డీఎస్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం డీఎస్ బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ‘కార్మికుల పోరాట పటిమ చూస్తోంటే లక్ష్య సాధనలో శ్రుతి మించకు.. ఎవరికి తల వంచకు’ అనే స్పూర్తి గోచరిస్తోందని లేఖలో తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలు అండగా ఉండటం తెలంగాణ మట్టిలోనే ధైర్యం పరిమళిస్తుందని గుర్తుకు వచ్చిందన్నారు. ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచక నిలబడటంలో శౌర్యం కనిపిస్తుందన్నారు. ‘ప్రభుత్వంలోని ఏ సంస్థను అయినా ఎలా నడపాలి అనే విషయంలో ముఖ్యమంత్రిగా మీకు విశేష విచక్షణాధికారులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఆస్తుల పంపకం జరగక ముందే టీఎస్ ఆర్టీసీ పూర్తి చట్టబద్ధత కాకముందే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం సరి కాదు. సాధ్యం కూడా కాదన్న విషయం మీకు తెలియంది కాదు. హైకోర్టు చెప్పినట్టు ఉన్నత స్థాయిలో అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే అనుచితమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించడం వల్లే ఈ అస్తవ్యస్త అసందిగ్ధ ఆందోళనకర వాతావరణం ఏర్పడిందని’ లేఖలో పేర్కొన్నారు తెలంగాణ కోసం ఉద్యమించిన ఆర్టీసీ పోరు బిడ్డల పట్ల మీ స్వభావానికి విరుద్దంగా ఇంత కఠినంగా మీరు వ్యవహరించడం చూస్తుంటే ఎవరిదో కుట్ర ఉన్నట్టు అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ బిడ్డలు ఎవరికీ తలవంచరూ అనే విషయం మీకు తెలియంది కాదని.. ఆర్టీసీ కార్మికులనే కాకుండా వారి కుటుంబాలను కూడా మీ ద్వారానే బెదిరించే దుస్సాహసానికి పాల్పడ్డ కుట్ర దారులు ఎవరో అర్థం కావడం లేదన్నారు. ‘కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులలైన వారి మీద గుండె రగులుతోంది. కార్మికులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇంకా పంతాలు పట్టింపులకు పోకుండా వెంటనే కార్మికులందరికి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా వారిలో విశ్వసనీయతను కల్పించాలి. సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలను అంగీకరించాలి. వెంటనే ఆర్టీసీ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను అప్పుడే తెలంగాణ ప్రజలు మీ నిర్ణయాన్ని హర్షిస్తారు’ అని లేఖలో పేర్కొన్నారు. -
ఏపీ గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ
సాక్షి, విజయవాడ : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్ భవన్లో గవర్నర్‌తో సమావేశమైన యార్లగడ్డ తాను రచించి, అనువదించిన సాహితీ సంపుటాలను గవర్నర్‌కు బహుకరించారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించటం ద్వారా, ఉత్తర భారత దేశానికి దక్షిణాదికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని యార్లగడ్డ గవర్నర్‌కు వివరించారు. నాటి నన్నయ మొదలు నేటి నారాయణ రెడ్డి (సినారే) వరకు పలువురు ప్రముఖ కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంధ పేటికను యార్లగడ్డ గవర్నర్ కు అందించారు. గవర్నర్ దానిని ఆసక్తిగా పరిశీలించి అలనాటి నుండి నేటి తరం వరకు సాహిత్య సంపదను కాపాడుతూ వస్తున్న కవుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని పలువురు సాహితీ వేత్తలను వీరు గుర్తు చేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలిపిన లక్ష్మి ప్రసాద్ జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య నాయుడితో కలిసి జైలు జీవితం గడిపానని వివరించారు. అనంతరం బిశ్వ భూషన్ సైతం గత స్మృతులను మననం చేసుకుంటూ, జైలు జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుందని అన్నారు. అయా ప్రాంతాల భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని అదే క్రమంలో జాతీయతను మరువకూడదని గవర్నర్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ డి. శ్రీనివాసులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాజ్ భవన్లో శుక్రవారం కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో శ్రీనివాసులు తాను రచించిన 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకం యొక్క ఆంగ్ల భాషా కాపీని గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో..ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలలో ఐఎఎస్ అధికారిగా సేవలు అందించిప్పుడు ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకంగా ఎంపిక చేసినట్లు శ్రీనివాసులు గవర్నర్‌కు వివరించారు. -
‘ఇందూరుకు నిజామాబాద్ పేరు అరిష్టం’
సాక్షి, నిజామాబాద్: ఇందూరుకు నిజామాబాద్ పేరు ఉండటం అరిష్టమని ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశానికి ప్రధాని మోదీ అవసరమని అన్నారు. తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రధాని మోదీ నాయకత్వానన్న బలపరిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్ అనుచర వర్గానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొలుత తాను బీజేపీలో చేరతానంటే వద్దన్న మా నాన్న ఇప్పుడు తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన బీజేపీ కండువా కప్పకొనే యోచనలో ఉన్నారని, పెద్దాయన కాబట్టి బయటపడట్లేదని వెల్లడించారు. జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్ నిండటం లేదని, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూత పడిందని, నిజామాబాద్ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీగా మిగిలిపోయిందని, దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని....దేశంలో కామన్ సివిల్ కోడ్ (సీసీసీ)ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులందరూ ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని బల్దియాలపైనా కాషాయజెండా ఎగుర వేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీజేపీలోకి త్వరలో టీఆర్ఎస్ ఎంపీ
సుభాష్‌నగర్: తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్ అనుచరవర్గానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్ నిండడం లేదని, నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ మూత పడిందని, నిజామాబాద్ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. వెంటనే ఇందూరుగా పేరు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని మోదీ.. దేశంలో కామన్ సివిల్ కోడ్ (సీసీసీ)ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. -
‘జైపాల్, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిచెందినట్లు తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సంతాపం తెలిపారు. రాజకీయ జీవితంతో మచ్చలేని నాయకుడిగా జైపాల్ ఎదిగారని కొనియాడారు. ఇద్దరం కలిసి దేవరకొండ హైస్కూల్లో కలిసి చదుకున్నామని, ఒకేసారి ఎమ్మెల్యేలుగా శాసనసభకు వెళ్లామని గుర్తు చేశారు. జైపాల్ మరణం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన నా రాజకీయ గురువు జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థి దశ నుంచే తనను ప్రొత్సహించారని, ఆయనే తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. ఏ పార్టీలో ఉన్న ఆయనతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించానన్నారు. నిజమాబాద్‌కు మంచినీటి, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులకోసం మొదట 100 కోట్లు ఇచ్చింది జైపాల్ రెడ్డినేనని గుర్తుచేశారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. జైపాల్ రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలి : ఉత్తమ్ జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. జైపాల్‌రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేపు అంతిమ యాత్ర ఆయన ఇంటి నంచి ఉంటుందన్నారు. నెక్లెస్ రోడ్లో దహనకార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. -
డీఎస్, టీఆర్ఎస్.. దాగుడుమూతలు
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. వారి మధ్య దాగుడుమూతలు కొనసా గుతున్నాయి. ఒకరేమో సస్పెన్షన్ కోరుకుంటుండగా, మరొకరేమో అనర్హత వేటు వేయాలని కాచుకొని ఉన్నారు. ఈ నెల 10న ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్ మరుసటిరోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంపై టీఆర్ఎస్ ఆరా తీస్తోంది. బీజేపీలో డీఎస్ చేరడం ఖాయమని భావిస్తున్న టీఆర్ఎస్.. తనతోపాటు ఎవరెవరిని వెంట తీసుకెళ్లే అవకాశం ఉందనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తనంత తానుగా టీఆర్ఎస్ను వీడకుండా సస్పెండ్ చేసే వరకు పార్టీలో కొనసాగాలనే వ్యూహాన్ని డీఎస్ అమలు చేస్తున్నట్లు టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. సస్పెన్షన్ వేటుపడే పక్షంలో తన రాజ్యసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదనే ఆలోచనలో డీఎస్ ఉన్నారు. పార్టీ మారకుండానే బీజేపీకి మద్దతు పలికే పక్షంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. పార్టీ వైఖరి తెలుసుకునేందుకే..? నిజామాబాద్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవితతో విభేదాలు తలెత్తడం, సీఎంకు ఫిర్యాదు చేయడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎంను డీఎస్ సవాల్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నరగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న డీఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే, ఆ సమావేశానికి సంబంధించిన సమాచారం టీఆర్ఎస్ ఎంపీలకు చేరవేసే క్రమంలో డీఎస్‌కు కూడా యథాలాపంగా వెళ్లి ఉంటుందని పలువురు ఎంపీలు చెప్తున్నారు.డీఎస్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనపై టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉందో అంచనా వేసుకునేందుకే ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. డీఎస్ కేవలం 20 నిమిషాలు మాత్రమే తమతో ఉన్నారని, టీ తాగడం మినహా పార్టీ వ్యవహారాలపై ఎలాంటి చర్చ జరపలేదని ఆ పార్టీ ఎంపీ ఒకరు వెల్లడించారు. పార్టీని వీడే అవకాశమున్నవారిపై నజర్ ఓ వైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు నోటిఫికేషన్ వెలువడే నాటికి డీఎస్‌సహా కొందరు టీఆర్ఎస్, కాం గ్రెస్ పార్టీల కీలకనేతలు తమ పార్టీలో చేరతారంటూ బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది. బీజేపీ నేతలది ‘మైండ్‌గేమ్’గా అని టీఆర్ఎస్ అంటూనే, పార్టీని వీడే అవకాశమున్న నాయకులపై ఓ నజర్ వేసినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఎవరైనా డీఎస్, బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారా అనే కోణంలోనూ నిఘా పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతోనూ డీఎస్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో డీఎస్ చేరినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ఆయన చేరికను ధ్రువీకరించలేదు. -
మాట్లాడేందుకే వచ్చా.. కాంగ్రెస్‌లో చేరలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ నివాసంలో సుమారు అరగంటకు పైగా సమావేశం జరిగింది. అనంతరం బయటకొచ్చిన డీఎస్‌ను మీడియా ప్రతినిధులు కలసి రాహుల్‌తో సమావేశ వివరాలు ఏంటని ప్రశ్నించగా.. రాహుల్‌తో ఏం మాట్లాడానన్నది మీకెందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. తాను ఎంతో మందిని కలుస్తుంటానని, అవన్ని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను కాంగ్రెస్‌లో చేరలేదని, కేవలం రాహుల్‌తో మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చారు. అయితే నర్సారెడ్డి, రాములునాయక్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనలో కలసి పనిచేసేందుకు డి.శ్రీనివాస్ రాహుల్‌ను కలసి మాట్లాడారని చెప్పారు. కాగా, సాయంత్రం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ డీఎస్ సమావేశమయ్యారు. -
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వరుసగా వలసలు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోని అసంతృప్తి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల తరుణంలో పలువురు చట్టసభల సభ్యులు, నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీకి దూరమవుతున్న తీరును పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పార్టీకి దూరమైన వారిని మినహాయిస్తూ.. ఇతర నేతలు వేరే పార్టీలో చేరడానికి గల కారణాలను విశ్లేషిస్తోంది. కచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే పరిస్థితుల్లోనూ పలువురు నేతలు పార్టీ వీడుతుండడానికి కారణాలు ఏమిటనే కోణంలో వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలోని పలువురు టీఆర్ఎస్ ముఖ్యులు శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వీరిలో ఉన్నారు. కఠిన వైఖరే... టీఆర్ఎస్లోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అందరికీ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినా కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తున్న సమాచారం అధిష్టానానికి చేరింది. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి సస్పెండ్ చేస్తోంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నర్సారెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇదే తరహాలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను సైతం గతంలో సస్పెండ్ చేసింది. ఇలాంటి నేతలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలించి ఇలాంటి నేతల జాబితా రూపొందిస్తోంది. పార్టీకి నష్టం చేస్తున్న నేతలపై చర్యల విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేచిచూసే ధోరణితోనే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలు సంగతి ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పలువురు నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రానివారితోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాలోనూ కీలక నేతలు టీఆర్ఎస్ను వీడారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు నారాయణఖేడ్ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్ఎస్ను వీడి ఇదే సెగ్మెం ట్లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరారు. పరకాల అసెంబ్లీ స్థానంలో సురేఖ ప్రచారం మొదలుపెట్టారు. పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు సెగ్మెంట్లలో వీరి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు సోదరులు కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింగరావు రెండోస్థానంలో నిలిచారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు వారసులుగా కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉండేలా వీరు ప్రభావం చూపుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ కాంగ్రెస్‌లో చేరారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి 3 రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అబ్బయ్య గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున ఇల్లందులో పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి రంగారెడ్డిలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. రత్నం గత ఎన్నికలలో చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కె.శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. -
నేడు కాంగ్రెస్‌లోకి డీఎస్, నర్సారెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆయన సస్పెండైన నాటి నుంచే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో శనివారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్యంగా డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. డీఎస్ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. పదవి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంతో పాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరటం, టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంతో జిల్లా నాయకత్వం అంతా డీఎస్‌ను పార్టీ నుంచి తొలగించాలని అధినేతకు సిఫార్సు చేసింది. ఆ మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆనాటి నుంచి ఆయన కేసీఆర్‌పై మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఢిల్లీలో సంబంధాలున్న నేతలను కలసి తిరిగి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు భేటీ నిర్వహించారు. ఇటీవల రాహుల్ కామారెడ్డి పర్యటన సందర్భంగానే డీఎస్ చేరిక ఉంటుందని భావించినా, ఆయన ఢిల్లీలోనే చేరేందుకు సుముఖత చూపారు. పలు భేటీల తర్వాత నర్సారెడ్డి.. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.నర్సారెడ్డి సైతం డీఎ స్తో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నా ఆయన.. ఇదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద పలుమార్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆయన ఇటీవల భేటీ అయ్యారు. అయితే మంత్రి హరీశ్‌రావు స్వయంగా నర్సారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ గురువారం రాత్రి ఉత్తమ్‌తో మరోమారు సమావేశమైన ఆయన కాంగ్రె స్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయి శుక్రవారం ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇప్పటికే ఖాయమైనందున నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి సస్పెండైన ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం రాహుల్ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరే అవకాశముంది. ఆయన శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఐతే విజయశాంతి.. లేదా స్థానికుడికే నర్సారెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించనున్నారన్న వార్తల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు అలెర్టయ్యారు. సీనియర్ నేతలు సుప్రభాత్రావు, బట్టి జగపతి, చంద్రపాల్ తదితరులు శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. ఇస్తే విజయశాంతికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. కూటమిలోని మిగతా పక్షాలకు గానీ, స్థానికేతరులకు కానీ ఇవ్వరాదని విన్నవించారు. ఇదే విషయమై వీరంతా విజయశాంతిని సైతం కలసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే..: నర్సారెడ్డి కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకనే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నర్సారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓడినా ప్రజాసేవ చేయాలన్న తపనతో టీఆర్ఎస్లో చేరానన్నారు. ఆయన వద్ద తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకపోయిందన్నారు. ఆయన తీరు నచ్చకే రహదారులు అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఈలోపే పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాసేవ కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. కృష్ణయ్య, తుల ఉమ కూడా? ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వేములవాడ నుంచి టికెటు హామీ ఇస్తే ఉమ చేరే అవకాశముందని సమాచారం. -
రేపు కాంగ్రెస్‌లోకి డీఎస్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. డి.శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సైతం జోక్యం చేసుకోకపోవడంతో డీఎస్ పార్టీ వీడక తప్పలేదు. ఆయన రాకను కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నా.. పాత పరిచయాలతో డీఎస్ మార్గం సుగమం చేసుకున్నారు. -
‘అర్బన్’లో ఆసక్తికరం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. తెరవెనుక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత టీఆర్ఎస్లో ఉన్న కార్పొరేటర్ కాపర్తి సుజాత తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేయడం కాంగ్రెస్‌తో పాటు, ఇటు టీఆర్ఎస్లో కూడా కలకలం రేగింది. గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సుజాత కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీఎస్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆమె కూడా కారెక్కారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడం విదితమే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు రుజువు చేసి, సస్పెండ్ చేయండి లేదా.. క్షమాపణ చెప్పండని అధినేత కేసీఆర్‌కు డీఎస్ ఘాటు లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల తర్వాత టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కాపర్తి సుజాత ఇప్పుడు అర్బన్ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం టికెట్ కోసం బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణు, ప్రేమలతా అగర్వాల్, నరాల కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు కాపర్తి సుజాత దరఖాస్తు కూడా ఇప్పుడు టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉండటం గమనార్హం. పోటీ చేయాలని డీఎస్‌పై అనుచరుల ఒత్తిడి.. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ త్వరలో టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి సొంత గూటికి చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన అనుచరులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్‌లో డీఎస్‌తోనే పోటీ చేయించాలని ఆయన అనుచరవర్గం పట్టుబడుతోంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన మైనార్టీల్లో డీఎస్‌కు గట్టి పట్టుంది. దీనికి తోడు ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఈ రెండు సామాజికవర్గాల ఓట్లు ఏకపక్షంగా సాధించాలంటే డీఎస్ స్వయంగా బరిలోకి దిగితేనే సాధ్యమవుతుందని డీఎస్ అనుచరవర్గం పేర్కొంటోంది. అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకూ తెరవెనుక అనూహ్య మలుపులు తిరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. -
27న డీఎస్ కీలక నిర్ణయం
రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్లో కొనసాగాలా.. వద్దా ? అంశంపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తన సన్నిహితులతో జరిపిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో కొనసాగి ప్రయోజనం లేదని ఆయన అనుచవర్గం ఒత్తిడి చేసినట్లు సమాచారం. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ మరోమారు తన అనుచరవర్గంతో సమావేశమవడం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ లోని ప్రగతినగర్‌లో తన నివాసంలో సుమారు 40 మంది సన్నిహిత అనుచరులతో మంతనాలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఇంకా వేచి చూసి ప్రయోజనం లేదని అనుచరులు స్పష్టం చేశారు. త్వరలోనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుచరగణం ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఈనెల 27న డీఎస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా డీఎస్ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం జోరందుకుంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలతో పాటు, అర్బన్ నుంచి కూడా అనుచరులు హాజరయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ డీఎస్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయా లని జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. రెండు నెలల పాటు వేచి చూసిన డీఎస్ ఈనెల 4న విలేకరుల సమావేశం నిర్వహించి తనపై చేసిన తీర్మానంపై లేఖాస్త్రాన్ని సంధించారు. ‘‘నేను టీఆర్ఎస్ను వీడితే ప్రజల దృష్టిలో మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పు కున్నట్లు అవుతుంది.. అందుకే నా అంతగా నేను పార్టీకి రాజీనామా చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి.. అది మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి తీసుకోండి..’’ అంటూ అధినేత కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఈ విషయమై అధినేత కేసీఆర్ కూడా స్పందించారు. పార్టీలో ఉంటే ఉంటారు.. పోతే పోతారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ మరోమారు సన్నిహిత అనుచరవర్గంతో సమావేశం కావడం ప్రాధాన్య త సంతరించుకుంది. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఈ విషయమై ‘సాక్షి’ డీఎస్‌ను సంప్రదించగా తాను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని తన అనుచరులు పూర్తి విశ్వాసాన్ని తనపై ఉంచారని అన్నారు. -
మళ్లీ కాంగ్రెస్‌లోకి డీఎస్?..
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. ఈ గురువారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డీఎస్‌తో సమావేశం అయ్యారు. తిరిగి పార్టీలోకి రావాలని ఉత్తమ్ డీఎస్‌ను ఆహ్వానించారు. ఈ ఉదయం డీఎస్ ఇంటికి వెళ్లిన ఉత్తమ్ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో రాహుల్ గాంధీతో డీ శ్రీనివాస్ భేటీ కానున్నారు. గతంలో డీఎస్‌పై నిజమాబాద్ నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కొద్దిరోజులుగా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిజామాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరికకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. భూపతిరెడ్డికి నిజామాబాద్ రూరల్ టికెట్ కేటాయించినట్లు సమాచారం. -
సొంతగూటికి నందీశ్వర్‌గౌడ్!
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ సొంతగూటికి చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యులను నందీశ్వర్‌గౌడ్ కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ ముఖ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిక లాంఛనప్రాయం కానుంది. సోమవారమే పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరాల ని నందీశ్వర్‌గౌడ్ నిర్ణయించుకున్నారు. డీఎస్ శిష్యుడు: నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్‌లో ఉన్నపుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్‌కు అనుంగు శిష్యుడిగా గుర్తింపు పొందారు. డీఎస్ టీఆర్ఎస్లోకి వెళ్లినపుడు ఆయన బీజేపీలో చేరారు. అయితే డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే సంకేతాల నేపథ్యంలో ఆయన సూచన మేరకే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ నెల 12న రాహుల్ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. -
డీఎస్‌పై అనర్హత వేటు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సీనియర్ నేత డి.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయించే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. డీఎస్ ఎంపీ పదవీకాలం 2022 వరకు ఉంది. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణినే అవలంబించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జూన్ 27న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపిన విషయం విదితమే. ఈ విషయమై ఇటీవల కేసీఆర్ స్పందిస్తూ ‘పార్టీలో ఉంటే ఉంటడు.. పోతే పోతడు.. ఇంకా ఏదీ నిర్ణయించలేదు..’ అని వ్యాఖ్యానించారు. -
పార్టీ మారే యోచనలో డీఎస్
-
సొంతగూటికి రాజ్యసభ సభ్యుడు డీఎస్!
-
డీఎస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
-
డి.శ్రీనివాస్‌పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌పై కే చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్ ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని తెలిపారు. మొదట పార్టీ అడ్వయిజర్‌గా నియమించి ఆయనను గౌరవించామని తెలిపారు. డీఎస్ కోరిక మేరకు రాజ్యసభకు కూడా పంపామని కేసీఆర్ వెల్లడించారు. అయితే, డీఎస్ కొడుకు అరవింద్ వేరే పార్టీలోకి వెళ్లడంతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతోందని నిజామాబాద్ నాయకులు ముక్త కంఠంతో తనకు ఫిర్యాదు చేశారని కేసీఆర్ తెలిపారు. కొడుకు వ్యవహారంపై డీఎస్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. ఇష్టం మేరకు టీఆర్ఎస్లో చేరిన డీఎస్‌ను తగిన విధంగా గౌరవించుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పార్టీలో ఉండాలనుకోవడం, వెళ్లాలనుకోవడం ఆయన సొంత విషయమనీ, ఎవరూ ఆయనను బలవంత పెట్టరని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
సొంత గూటికి డీఎస్!
సాక్షి, నిజమాబాద్: ‘నేను రాజీనామ చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి. లేకుంటే తీర్మానం వెనక్కి పంపండి’అని మంగళవారం అల్టిమేటం జారీ చేసిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మరుసటి రోజే మళ్లీ సొంత గూటికే చేరుతున్నారనే ప్రచారం జోరు అందుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాలను డీఎస్ కలవనున్నారని, ఆయన చేరికకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సోనియా, రాహుల్ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తాల్లో వాస్తవం లేదు: డీఎస్ తను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీఎస్ తెలిపారు. మీడియాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని, తను తీసుకునే నిర్ణయం తన వ్యక్తిగతమన్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. తనకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సమాధానం కావాలని, నిన్న అన్ని విషయాలు చెప్పానన్నారు. తనడిగిన ప్రతి ప్రశ్నకు టీఆర్ఎస్ స్పష్టతను ఇవ్వాలన్నారు. కొందరు టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై తను స్పందించనన్నారు. డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవితతో పాటు పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారన్నారు. తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. అర్వింద్ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయంలో సీఎం కేసీఆర్ స్పందించని పక్షంలో సరైన సమయంలో.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానన్న డీఎస్ కాంగ్రెస్‌లో చేరికకు మార్గం సుగమం చేసుకోని ఇలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. -
సిగ్గు ఉంటే రాజీనామా చెయ్ : బాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సిగ్గు, లజ్జ ఉంటే ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ విసిరారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. డీఎస్ వల్ల టీఆర్ఎస్కి ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. డీఎస్‌కు రాజ్యసభ సీటు కోసం ఆరాటం తప్ప మరొకటి లేదని విమర్శించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజ్యసభ సభ్యుడిగా పదవిని అనుభవించవచ్చని డీఎస్ ఆరాటపడుతున్నారన్నారు. -
నేను రాజీనామా చేయను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘నేను టీఆర్ఎస్ను వీడితే ప్రజల దృష్టిలో మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది.. అందుకే నా అంతగా నేను పార్టీకి రాజీనామా చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి.. మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి పంపండి’’అని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ నిర్ణయం ప్రకటించకుండా తనను మనస్తాపానికి గురి చేయవద్దని అధిష్టానాన్ని కోరారు. మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరని చెప్పారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారని, అర్ధరాత్రి 12 గంటలకు జైలులో దించారని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సంజయ్‌ని పోలీసులు రిమాండ్ కోసం జిల్లా న్యాయమూర్తి దగ్గరకు తీసుకు వెళితే.. మరునాడు ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అయినా పోలీసులు ఊళ్లో ఉన్న జడ్జీల దగ్గరకు తిప్పి.. చివరికి ఫ్యామిలీ కోర్టు జడ్జీ దగ్గరకు వెళితే రాత్రి 11 గంటలకు ఆదేశాలిచ్చారు..12 గంటలకు జైలులో దించారు.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం చూపడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందనేది ఎవరికైనా అర్థం అవుతుంది’’అని ఆయన పేర్కొన్నారు. తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరికపై వివరణ ఇచ్చిన డీఎస్.. అది అర్వింద్ స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. ఈ రోజుల్లో ఎదిగిన కొడుకులు వాళ్ల భవిష్యత్ గురించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అర్వింద్ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేశానో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ బలహీన పర్చానో.. బీజేపీకి ఉపయోగపడేలా ఎప్పుడు మాట్లాడానో, తన అనుచరులను ఎవరిని బీజేపీకి పంపానో చెప్పాలన్నారు. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని డీఎస్ పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ఎల్లవేళలా వెన్నంటే ఉన్నందుకు తన అనుచరులకు రుణపడి ఉంటానన్నారు. సరైన సమయంలో నిర్ణయం తన విషయంలో సీఎం కేసీఆర్ స్పందించని పక్షంలో సరైన సమయంలో.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని డీఎస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందుకు డెడ్లైన్లు ఏమీ లేవన్నారు. -
14 రోజుల రిమాండుకు డీఎస్ కుమారుడు సంజయ్
-
డీఎస్ కుమారుడు సంజయ్ అరెస్టు
నిజామాబాద్ అర్బన్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఆదివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. సంజయ్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. వారు వేసిన రిమాండ్ పిటిషన్లను ఇద్దరు న్యాయమూర్తులు కొట్టి వేసినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగించడంతో రాత్రి 11 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంజయ్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి ఆయన్ను విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈలోపే పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. సక్రమంగా లేని అభియోగాలు.. అజ్ఞాతంలో ఉన్న సంజయ్ ఆదివారం ఉదయం 11 గంటలకు తన న్యాయవాదులతో కలసి నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించిన పోలీసులు.. ఆయన్ను రిమాండ్‌కు పంపేందుకు నివేదికను సిద్ధం చేసుకొని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ్నుంచి తీసుకువెళ్లి గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్ రిపోర్టు సక్రమంగా లేదని తోసిపుచ్చారు. సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు ఆయన్ను రిమాండ్‌కు తరలించే అవకాశం లేకపోయింది. ఇదే అంశాన్ని సంజయ్ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. రిమాండ్‌కు తరలించే కారణాలు బలంగా లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఏసీపీ సుదర్శన్ రిమాండ్ రిపోర్టులోని తప్పులను సవరించి మరో సారి మొదటి అదనపు జడ్జి ముందుంచారు. దీన్ని పరిశీలించిన జడ్జి సంజయ్‌ని రిమాండ్‌కు పంపకుం డా ఒకరోజు పోలీసుల అదుపులోనే ఉంచుకొని, సోమవారం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. చివరికి ఫ్యామిలీ కోర్టుకు.. మొదటి అదనపు జడ్జి రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించడంతో పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసం ఉండే మరో జడ్జి సూర్యచంద్రకళ వద్దకు సంజయ్‌ను తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్ రిమాండ్‌ను తిరస్కరించారు. మొదటి అదనపు న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించారు. అయినా పట్టు వదలని పోలీసులు.. వినాయక్‌నగర్‌లో గల ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ ఎదుట సంజయ్‌ను ప్రవేశపెట్టారు. రాత్రి 11 గంటలకు విచారణ కొనసాగింది. చివరకు న్యాయమూర్తి.. సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. -
లైంగిక వేధింపులు: ఎట్టకేలకు విచారణకు సంజయ్!
సాక్షి, నిజామాబాద్: నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆదివారం విచారణకు హాజరయ్యారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించారు. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. -
కాంగ్రెస్‌లో ‘డీఎస్’ కలకలం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘‘ఆయారాం.. గయారాంలు మళ్లీ వస్తున్నారు.. కష్ట కాలంలో పార్టీని పట్టుకుని ఉన్నాము.. మమ్మల్ని కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వద్దు..’’ అంటూ పరోక్షంగా రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్‌ను ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో జరిగింది. మొదట కార్యకర్తలనుద్దేశించి ముఖ్య నేతల ప్రసంగాలు కొనసాగాయి. అనంతరం పార్టీ జిల్లా ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ నియోజకవర్గాల వారీగా అంతర్గతంగా సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అంతర్గత సమీక్షకు సంబంధిత నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సమీక్ష సందర్భంగా పరోక్షంగా డీఎస్‌ను ఉద్దేశించి స్థానిక నాయకులు పరోక్షంగా ప్రస్తావించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానించిన నేపథ్యంలో డీఎస్ పార్టీ మారుతారనే చర్చ జోరుగా సాగుతోంది. తిరిగి ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆయన వ్యతిరేకవర్గం ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో అర్బన్ నాయకులు.. తిరిగి పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని ఆ పార్టీ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఇది పార్టీ అధిష్టానం పరిధి లోని అంశమని పార్టీ ఇన్చార్జ్ పేర్కొన్నట్లు సమాచారం. -
టీఅర్ఎస్ నుంచి బయటపడేందుకు డీఎస్ రంగం సిద్ధం?
-
అర్బన్లోనూ ఆధిపత్యపోరు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ టీఆర్ఎస్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి పరిమితం అనుకున్న ఆధిపత్య పోరు నిజామాబాద్ అర్బన్‌లో కూడా అంతర్గతంగా కొనసాగిందా.. ? ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా గ్రూపు విభేదాలు లోలోపల రగిలాయా..? రాజ్య సభ సభ్యులు, ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)పై క్రమశిక్షణ చర్యల ప్రతిపాదన క్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విడుదల చేసిన లేఖను పరిశీలిస్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లేఖలో డీఎస్ రూరల్‌తో పాటు, అర్బన్‌లో కూడా గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని స్పష్టంగా ఆరోపించారు. దీంతో ఇన్నాళ్లూ రూరల్ నియోజకవర్గంలోనే రచ్చకెక్కిన ఆధిపత్య పోరు అర్బన్‌ను కూడా తాకినట్లు తేటతెల్లమైంది. డీఎస్ కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ ఈ ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ రేసులో సంజయ్ ఉంటారనే ప్రచారం జరిగింది. ఇది సహజంగానే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తను అసంతృప్తికి గురి చేసింది. ఈ వ్యవహారాన్ని బిగాల పలుమార్లు పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అర్బన్‌లో ఇలా అంతర్గతంగా కొనసాగిన విభేదాలు ఈ లేఖతో బహిర్గతమయ్యాయి. డీఎస్ ప్రభావం ఏ మేరకు..? డీఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆయా పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. బలమైన బీసీ నేతగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో డీఎస్‌పై అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే ఏమేరకు ప్రభావం చూపుతుంది అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఆయనకు పట్టుంది. నందిపేట్ మండలం అధికార పార్టీ ముఖ్యనేత సుదర్శన్ డీఎస్‌తో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. డీఎస్ స్వస్థలం వేల్పుర్ మండలం కావడంతో బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఆయనకు సంబంధాలున్నాయి. గతంలో ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత కేసీఆర్ సమీక్ష సందర్భంగా డీఎస్ సేవలను బాల్కొండ నియోజవర్గంలో కూడా వినియోగించు కోవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి సూచించడం అక్కడ డీఎస్‌కు ఉన్న సంబంధాలను తెలియజేస్తోంది. మరోవైపు ముస్లిం మైనారిటీల్లో కూడా డీఎస్‌కు బలమైన పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యల ప్రతిపాదన అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. కొనసాగుతున్న సస్పెన్స్.. డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసిన నేపథ్యంలో అధినేత కేసీఆర్ కీలక నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తీర్మానం చేసిన రోజే బుధవారం మధ్యాహ్నం డీఎస్ సీఎంతో భేటీ అవుతారని, సాయంత్రం అపాయింట్మెంట్ ఉందనే ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ పిలుపు కోసం వేచి చూస్తున్నానని డీఎస్ కూడా ప్రకటించారు. ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. భూపతిరెడ్డి మాదిరిగానే డీఎస్‌పై చర్యల అంశాన్ని అధినేత వేచిచూసే ధోరణితో ఉంటారా? లేదా కీలక నిర్ణయమేదైనా తీసుకుంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో లేఖ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డీఎస్ ముఖ్య అనుచరగణం ఈ ఎపిసోడ్‌పై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కడా అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతోంది. -
‘డీఎస్ డిక్టేటర్ కాదు.. నేను బానిస కాదు’
సాక్షి, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీలోకి తనను డి.శ్రీనివాస్(డీఎస్) పంపారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆ పార్టీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి కుటుంబాన్ని లాగొద్దన్నారు. తమ కుటుంబంపై అర్థరహితంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. తమ కుటుంబంలో ‘డీఎస్ డిక్టేటర్ కాదు.. నేను బానిసను కాదు’ అని అరవింద్ వ్యాఖ్యానించారు. తాను ఎదగాలనుకుంటే 2004 లోనే రాజకీయాల్లోకి వచ్చేవాడినని తెలిపారు. ఎంపీ కవితలాగా తండ్రిపై, అన్నపై ఆధారపడి లేనన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కవితకు ఛాలెంజ్ బీజేపీలో తన ఎదుగుదలకు డీఎస్ ఏం చేశారో టీఆర్ఎస్ వద్ద సమాధానం ఉందా అని అరవింద్ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే నిరుపిస్తారా అని ఆయన ఎంపీ కవితకు సవాల్ విసిరారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేంటన్నారు. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన అన్న రాజేశ్వర్‌రావు ఏకకాలంలో భాజపా, సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పని చేశారు. అలాంటిది నేను, నాన్న వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేముంది’ అని ఆయన ప్రశ్నించారు. ‘డీఎస్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు.. బీజేపీలో కొడుకు ఎదుగుదల కోసం కృషి’ ఈ రెండూ పరస్పరం విరుద్ధం కావా అని నిలదీశారు. ఒక ఎంపీగా ఆమె చేసిన ఆరోపణల్లో స్పష్టత ఉండాలి కదా అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీఆర్ఎస్ నేతలు.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
డీఎస్ రాకపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
-
దొరకని సీఎం అపాయింట్మెంట్
-
కవితకు ఓటమి భయం: డి.అరవింద్
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ విమర్శించారు. డి.శ్రీనివాస్ మీద కవిత, ఇతర టీఆర్ఎస్ నేతలు రాసిన లేఖలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తోందన్నారు. భవిష్యత్ మీద వారి ఆందోళన చూసి జాలేస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలతో మాట్లాడారని లేఖలో వెల్లడించారని, వారి ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కొడుకు మీద కోపంతో తండ్రి మీద చర్యలు తీసుకోవడం విడ్డూరం, హాస్యాస్పదమన్నారు. డీఎస్ తనకు బీజేపీలో సాయం చేయడమేంటని.. తన పార్టీ వేరు.. ఆయన పార్టీ వేరని స్పష్టం చేశారు. డీఎస్, కవిత టీఆర్ఎస్లో ఉన్నారని.. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమన్నారు. ‘నా కోసం మా నాన్న (డీఎస్) ఒక్క ఫోన్ కాల్ కూడా చేసిన దాఖలాలు లేవు. నేను కవితలాగా తండ్రి చాటు బిడ్డను కాదు.. నేను బీజేపీలోకి సొంతంగా వచ్చాను. నా పార్టీని మీ రాజకీయాల్లోకి తీసుకువస్తే సహించను. నా రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే’అని అరవింద్ స్పష్టం చేశారు. -
డీఎస్‌పై చర్య తీసుకోండి
సాక్షి, నిజామాబాద్, హైదరాబాద్ : మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై సొంత పార్టీకే చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధులు బుధవారం సీఎంకు లేఖ రాశారు. ‘‘మొదట్నుంచీ గ్రూపులు కట్టడం, పైరవీలు చేయడం, అక్రమార్జనకు పూర్తిగా అలవాటు పడిన డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారు. అవినీతికి ఆస్కారం లేని మీ పరిపాలనలో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరతీశారు. మెల్లగా తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ.. పార్టీ ద్రోహానికి తలపడుతున్నారు. కాంగ్రెస్ ఆయనకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడానికి నిరాకరించింది. ఈ అవమాన బాధతో అలమటిస్తూ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొమ్మని మిమ్మల్ని వేడుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు అభ్యర్థించడంతో మీరు దయ తలచి పార్టీలో చేర్చుకొన్నారు.. ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆయనకున్న అనుభవం రీత్యా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగపడతారని భావించారు. తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటే అందులో ఒకటి డి.శ్రీనివాస్‌కు కేటాయించారు. మీరు విశాల దృష్టితో అత్యున్నత స్థానం కల్పించినా.. ఆయన మాత్రం వెనకటి గుణమేల మాను వినరా సుమతీ అన్న విధంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘డీఎస్ టీఆర్ఎస్లో కొనసాగుతూనే పచ్చి అవకాశవాదంతో తన కొడుకును బీజేపీలో ప్రవేశపెట్టారు. తన కొడుకు ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు. కొడుకును ఆశీర్వదించవలసిందిగా కోరుతూ బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లుతున్నారు. తన కొడుకు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను తీవ్ర పదజాలంతో దూషిస్తుంటే ఖండించకపోగా ఆయనే వత్తాసుగా నిలుస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారు’’అని ఆరోపించారు. ‘‘గతంలో డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ చేతిలో రెండుసార్లు ఓటమికి గురయ్యారు. మొత్తంగా మూడుసార్లు వరుసగా నిజామాబాద్ ప్రజల చేత తిరస్కరించబడిన నాయకుడు. ఆయన వల్ల టీఆర్ఎస్కు ఇసుమంత ప్రయోజనం కలగలేదు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోకపోగా ద్రోహానికి పాల్పడుతున్న డి.శ్రీనివాస్ విషయంలో వేచిచూసే ధోరణిని ప్రదర్శించకుండా సత్వరమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ..’’అంటూ ఆ లేఖలో నిప్పులు చెరిగారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు: తుల ఉమ డీఎస్‌కు సీఎం సముచిత స్థానం ఇచ్చినా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా వ్యవహారాల ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారునికి అండగా నిలవాలని కొన్ని కుల సంఘాల సమావేశంలో డీఎస్ పేర్కొన్నారన్నారు. మొన్న ఎమ్మెల్సీపై... నేడు ఎంపీపై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం నిజామాబాద్ జిల్లాలోనే రెండో ప్రజాప్రతినిధిపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆర్.భూపతిరెడ్డిపై పార్టీ నేతలు ఐదారు నెలల క్రితమే ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమావేశమై భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు నియోజకవర్గంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ భూపతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డీఎస్‌పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారు: కవిత టీఆర్ఎస్లో ఉంటూ బీజేపీలో ఉన్న తన కుమారునికి అండగా ఉండాలని డీఎస్ చెబుతుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కవిత అన్నారు. అడుగడుగునా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. డీఎస్ వ్యవహార శైలితో ఇటు నాయకులు, కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రతినిధులతో సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు అత్యుత్సాహం: డీఎస్ రాజకీయాల్లో క్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తనపై లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందో.. విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వారే సమాధానం చెప్పాలని, అలా చేసిన వారిది అత్యుత్సాహం తప్ప ఇంకోటి కాదని అన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి అన్యాయం చేసే ప్రయత్నం తన జీవితంలో చేయలేదని చెప్పారు. తనకు.. పార్టీకి, సీఎంకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ‘నేను వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్లా. నా నివాసానికి మరమ్మతుల గురించి వెళ్లా’అని వివరించారు. ఆజాద్‌ను కలిశారట కదా అని విలేకరులు ప్రశ్నించగా... ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నాయకులు తప్ప ఎవరూ దొరకరని వ్యాఖ్యానించారు. అయితే తాను ఆజాద్‌ను కలిశానన్నది మాత్రం పచ్చి అబద్ధమని, అసలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రాజకీయ నాయకులను కలవడమే మానేశానని వివరించారు. తన కుమారుడి కోసం తానేదో చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అలాంటి పనులు తానెప్పుడూ చేయనని చెప్పారు. ‘‘ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. అందరి పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటున్నారా? వాళ్ల కెరీర్ కూడా చూసుకుంటారు గదా.. చెప్పాల్సిందంతా చెప్పాం.. అయినా తను వినలేదు’’అని డీఎస్ వివరించారు. ఈ విషయాలన్నింటినీ తాను సీరియస్‌గా తీసుకోనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది సరైంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
కాంగ్రెస్‌లోకి డీఎస్.. అసలు ఏమైంది ?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : నిజామాబాద్ (ఇందూరు) రాజకీయాలే రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ను వీడటానికి కారణమయ్యాయి! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా డీఎస్ కుమారుడు అరవింద్ ప్రచారానికి పూనుకోవడం ఆమెకు ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు అదే డీఎస్ టీఆర్ఎస్ను వీడటానికి కారణమైందని ఆయన సన్నిహితులంటున్నారు. తనకు, తన అనుచరులకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదన్న అసంతృప్తితో ఉన్న డీఎస్‌కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం కుమార్తె కవిత నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం డీఎస్‌కు వ్యతిరేకంగా లేఖ రాసి చర్యలు తీసుకోవాలని పార్టీని కోరిన సంగతి పక్కన పెడితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు పూర్వరంగం ఎప్పుడో సిద్ధమైందని సమాచారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్న డీఎస్.. ఆయన ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో మాట్లాడారని, ఆమె అంగీకారం మేరకు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. పదవి ఉన్నా అసంతృప్తి! వాస్తవానికి డీఎస్ టీఆర్ఎస్లో చేరగానే ఆయన స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. అయితే పదవి ఇచ్చారు కానీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధ ఆయనలో ఉంది. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు తన సన్నిహితుల వద్ద చెప్పారు కూడా. ఈ ఆవేదనకుతోడు తన ముఖ్య అనుచరుడు భూపతిరెడ్డి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు రుచించలేదు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో తన వర్గీయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడే టీఆర్ఎస్ను వీడాలని డీఎస్ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్నుంచి ఆయన పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. టీఆర్ఎస్లో పేరుకు ఎంపీ పదవి ఉన్నా.. తన స్థాయికి తగిన ప్రాధాన్యం లేదని, తన అనుచరులను పట్టించుకోవడం లేదనే ఆవేదనతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్‌లో రాజుకున్న నిప్పును ఢిల్లీలో ఆర్పివేసేందుకు ఆయన ప్రయత్నించారని రాజకీయ వర్గాలంటున్నాయి. దాదా.. వినండి నా బాధ కాంగ్రెస్‌లో తన పునరాగమనానికి డీఎస్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎంచుకున్నారు. ఢిల్లీలోని తాల్‌కటోరాలో ఉన్న ప్రణబ్ నివాసానికి వెళ్లి తాను కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు మనోగతాన్ని వెల్లడించారు. తాను కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తన పట్ల వ్యవహరించిన తీరు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని దాదాకు వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరాలంటే తనకు సోనియా అపాయింట్మెంట్ లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో.. ప్రణబ్ అక్కడ్నుంచే సోనియాకు ఫోన్ చేయించి ఆమెతో మాట్లాడించారని సమాచారం. పార్టీని వీడినందుకు తొలుత సారీ చెప్పిన డీఎస్, ఆ తర్వాత దిగ్విజయ్ వైఖరితోనే తాను పార్టీని వీడానని సోనియాకు వివరించారని, ఆమె సమ్మతించడంతోపాటు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. డీఎస్ కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు రాష్ట్ర నాయకులకు అందాయి. దీంతో ఓ వర్గం నేతలు ఆయన రాకను గట్టిగావ్యతిరేకిస్తున్నారు. డీఎస్ కష్టకాలంలో కాంగ్రెస్‌ను వీడటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే సోనియా ఆదేశాలు ఉండటంతో సీనియర్ నేతలు ఈ వాదనను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఆమె సూచనల మేరకే పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు చర్చిస్తున్నట్లు రాష్ట్ర నేతలకు సమాచారం అందింది. -
ఢిల్లీకి వెళ్లాను కానీ.. అది అబద్ధం
-
నోరు విప్పిన డీఎస్; కేసీఆర్ కోర్టులో బంతి!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలో తన పాత్ర చుట్టూ చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపై ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఎట్టకేలకు నోరు విప్పారు. జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని, క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తనను కలిసిన విలేకరులతో ‘‘నో కామెంట్.. నన్నేమీ అడగొద్దు..’’ అన్న డీఎస్... సాయంత్రానికి హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్‌రావును డీఎస్ కలవాల్సిఉన్నా, అంతకుముందే ఆయన మీడియాతో మాట్లాడటం, అదే సమయంలో ‘కేసీఆర్‌తో డీఎస్ అపాయింట్మెంట్ రద్దు’ వార్తలు రావడం గమనార్హం. నాతో మాట్లాడితే సరిపోయేది: ‘‘నేను ఏ పార్టీలో ఉన్నా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాను. క్రమశిక్షణ గురించి ఒకరు నాకు చెప్పాల్సిన పనిలేదు. నిజామాబాద్‌లో జరుగుతోన్న పరిణామాలు దురదృష్టకరం. ఏవైనా తేడాలుంటే నాతో మాట్లాడాల్సింది. కానీ ఏకంగా ఫిర్యాదు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలనే అడగండి. సరే, ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అది ఆయన చేతుల్లోనే ఉంది. సీఎం అపాయింట్మెంట్ అడిగాను కానీ అటు నుంచి స్పందన ఏదీ రాలేదు’’ అని డీఎస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లాను కానీ.. అది అబద్ధం: తాను ఢిల్లీకి వెళ్లినమాట వాస్తవమేనని అయితే వ్యక్తిగత పనుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని డీఎస్ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలోని నా క్వార్టర్ రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఆ పని చూసుకుని తిరిగొచ్చేశాను. అక్కడ నేను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇతర పార్టీ నేతలను కలవడమే మానేశా. అయినా, ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు తప్ప ఇంకెవరు కనిపిస్తారు?’’ అని డీఎస్ పేర్కొన్నారు. కొడుకు అరవింద్ గురించి: ‘‘పెద్దాయన ఒక పార్టీలో ఉంటూ కార్యకర్తలను మాత్రం ఇంకో పార్టీలో చేరమని ప్రోత్సహిస్తున్నారు..’’అన్న ఎంపీ కవిత వ్యాఖ్యలకు డీఎస్ వివరణ ఇచ్చారు. ‘‘మా అబ్బాయి ఇండిపెండెంట్. తనకు తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. వాటితో నాకు సంబంధంలేదు. అతని వ్యవహారాల్లో నేను తలదూర్చను’’ అని డీఎస్ చెప్పుకొచ్చారు. డీఎస్‌పై చర్యలు తీసుకోండి: మూడేళ్ల కిందట కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన డి.శ్రీనివాస్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎంపీ కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. -
కేసీఆర్,డీఎస్ భేటీపై కొత్త ట్విస్ట్
-
‘కవిత కోసం కేసీఆర్.. కొడుకుల కోసం డీఎస్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంపై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనన్నారు. కవిత కోసం కేసీఆర్ తాపత్రయం పడితే.. కొడుకుల కోసం డీఎస్ ఆరాటం పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో బీసీలను అవమానిస్తున్నారని మాట్లాడిన దానం నాగేందర్, ఇప్పుడు డీఎస్‌కు జరిగిన అవమానంపై స్పందించాలని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటనపై కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్‌కు విజయవాడలో గుట్టమీద అమ్మవారు.. గుట్టకింద కమ్మ వారు గుర్తుకొచ్చారని రేవంత్ అన్నారు. -
సాయంత్రం కేసీఆర్‌తో డీఎస్ భేటీ
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గళమెత్తారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నేరుగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడంతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు డీఎస్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో సీఎం కార్యాలయం నుంచి డీఎస్‌కు పిలుపొచ్చింది. సాయంత్రం 6 గంటలకు కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. జిల్లా నేతలు తనపై చేసిన ఆరోపణలపై డీఎస్ ముఖ్యమంత్రికి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే డీఎస్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను మీడియా ప్రతినిధులు కలువగా మాట్లాడేందుకు నిరాకరించారు. -
డీఎస్‌పై జిల్లా నేతల తిరుగుబాటు
-
టీఆర్ఎస్ ఆరోపణలపై డీఎస్ కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంపై రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ స్పందించారు. తాజా పరిణామాలపై డీఎస్‌ను ప్రశ్నించిన మీడియాతో ఆయన ‘నో కామెంట్’ అని బదులిచ్చారు. జిల్లానేతలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు తెలియదని, ఆ విషయాన్ని వారినే అడగాలని చెప్పుకొచ్చారు. సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండన్నారు. ‘నేతలు అన్నది ఫిర్యాదు మాత్రమే కదా.. నా గొంతు కోస్తామని చెప్పలేదు కదా’ అని డీఎస్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తానిప్పుడే ఏం మాట్లాడలేనని తెలిపారు. కాగా, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయంతో డీఎస్ తన కుమారుడు సంజయ్, ముఖ్య అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కారణమిదేనా? టీఆర్ఎస్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన డీఎస్ పార్టీ మారాలనుకున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఓ కుమారుడు అరవింద్ బీజేపీలో చేరగా, మరో కుమారుడు సంజయ్‌కి పార్టీలో ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వాలని పలుమార్లు పార్టీ అధిష్టానికి డీఎస్ సూచించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన కుమారుడికి ప్రాధాన్యం లభించకపోవడంతో డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేస్తుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం మున్నూరు కాపు సమావేశంలో పాల్గొన్న డి. శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయి ఉండి, టీఆర్ఎస్లో ఎందుకు చేరావని కుల సంఘం నేతలు నిలదీశారు. ‘డీఎస్‌ను మేం ఆహ్వానించలేదు.. గతిలేక మా పార్టీలో చేరారు’ అని కవిత వ్యాఖ్యానించారని కుల సంఘం నేతలు డీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యత లేదని నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతోనే డీఎస్ పార్టీ మారే ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో డీఎస్ రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. సంబంధిత కథనం.. ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు! -
డీఎస్‌పై వేటుకు రంగం సిద్ధం!?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ సభ్యడు, సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై జిల్లా నేతతు తిరుగుబాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో ఎంపీ కవిత నివాసంలో బుధవారం పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. డీఎస్ వ్యవహారశైలిపై చర్చించిన నేతలు ఆయనపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రికి సిఫార్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు లేఖ రాశారు. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. ఈ భేటీకి బీబీ పాటిల్, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హనుమంతు షిండే హాజరయ్యారు. జిల్లా నేతల ఆగ్రహం సీనియర్ నాయకుడిగా డీఎస్‌కు గౌరవమిచ్చి పార్టీలో క్యాబినేట్ హోదా కల్పించారని, కానీ ఆయన మాత్రం మొదట నుంచి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీలు, అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ పెద్దలతో మంతనాలు ప్రారంభించారన్నారు. డీఎస్ వల్ల టీఆర్ఎస్కు ఎలాంటి ప్రయోజనం లేదని, ద్రోహానికి పాల్పడుతున్న ఆయనపై సత్వరమే క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని నేతలంతా కేసీఆర్‌ను కోరారు. వేటుకు రంగం సిద్దం డీఎస్ తీరుతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా డీఎస్ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోనున్నారని సమాచారం. స్పందించని డీఎస్ వర్గం అయితే జిల్లాలో తాజా పరిణామాలపై డీఎస్ వర్గీయులు స్పందించడం లేదు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు చేస్తున్న ఆరోపణలపై వారు నోరుమెదపడం లేదు. అధికార ప్రకటన వచ్చేంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని డీఎస్ వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంబంధిత కథనం ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు! -
ఎంపీ కవితపై డీఎస్ కుమారుడి మండిపాటు!
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, అవరసమైతే ఆయనపై వేటు వేయాలని నిజామాబాద్ జిల్లా అధికార పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు పార్టీ ఎంపీ కవిత నివాసంలో డీఎస్ విషయంపై భేటీ అయ్యి చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీఎస్ అక్రమాలకు సంబంధించి నాలుగు పేజీల లేఖను ఎంపీ కవితకు అందజేసి, సీఎం కేసీఆర్‌కు పరిస్థితి వివరించాలని కోరినట్లు సమాచారం. డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారని, మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఆయనపై వేటుకు రంగం సిద్ధమైందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై డీఎస్ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు. ఏదో సెలబ్రిటీగా ఎప్పుడో ఓసారి జిల్లాలో పర్యటించేవారు తప్ప ఆమె నిజామాబాద్ జిల్లా కోసం చేసిందేమీ లేదు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు స్వయంగా డీఎస్‌కు లేఖలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ అంతా సాధారణంగా పనిచేస్తుంది. గత మూడు రోజులుగా డీఎస్ ఏ కాంగ్రెస్ నేతను కలిశారో చెప్పాలని’ అరవింద్ డిమాండ్ చేశారు. ఓటమి భయంలో కవిత.. బీజేపీని టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లోకి లాగడాన్ని ఆయన ఖండించారు. ‘నా తండ్రి డీఎస్ నాకు బీజేపీలో సాయం చేయడమేంటి ?. డీఎస్, కవిత.. అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. ఓటమి భయంలో కవిత ఉన్నారు. అందుకే ఇలాంటి చర్యలకు సిద్ధపడుతున్నారు. నాకోసం మానాన్ని డీఎస్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. డీఎస్‌ను బీజేపీలోకి తేవాలంటే మా నాయకత్వం చూసుకుంటుందని’ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరవింద్ వివరించారు. గత మూడ్రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో డీఎస్ మంతనాలు జరిపారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. డీఎస్‌పై చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్‌కు సిఫార్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కవితతో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బుధవారం భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. డీఎస్ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నాడని లేఖలో పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎస్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉండగా, మరోవైపు ఎంపీ కవిత రెండు రోజులుగా జిల్లాలోనే ఉండటం గమనార్హం. కుమారుడికి పదవి, ప్రాధాన్యం ఇవ్వలేదనే డీఎస్.. టీఆర్ఎస్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీఎస్ భావిస్తున్నట్లు కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఓ కుమారుడు అరవింద్ బీజేపీలో చేరగా, మరో కుమారుడు సంజయ్‌కి ప్రొటోకాల్ వర్తించేలా ఏదైనా ప్రాధాన్యం ఉన్న పదవి ఇవ్వాలని పలుమార్లు పార్టీ అధిష్టానికి డీఎస్ సూచించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు, తన కుమారుడికి ప్రాధాన్యం లభించకపోవడంతో కాంగ్రెస్ వైపు డీఎస్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. -
ఉండనీయరు.. వెళ్ల గొట్టరు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతల విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..? ఇటు సస్పెండ్ చేయకుండా.. అలాగని పార్టీలో ఉంచకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచుతోందా..? సస్పెన్షన్ వేటు వేస్తే కాస్తో కూస్తో ప్రజల నుంచి వచ్చే సానుభూతిని కూడా వారికి రానీయకుండా.. స్వయంగా వారే పార్టీని వీడేలా చేస్తోందా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విషయంలో ఇదే జరుగుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకు ల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ విషయంలోనూ క్రమంగా ఇలాంటి పరిస్థితికి దారితీస్తోందని అంటున్నారు. ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఇలాంటి కీలక నేతల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. వేచిచూసే ధోరణితో.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యల ప్రతిపాదనకు దారితీసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి కుమారుడు జగన్ తనను దూషించారంటూ భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాసన మండలిలో ప్రివిలైజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని, జగన్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయినప్పటికీ భూపతిరెడ్డి స్పందించలేదు. ఈ క్రమంలో భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ 2017 డిసెంబర్ 13న జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. ఒక్క రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ మినహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో మంత్రి పోచారం నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానించారు. ఈ తీర్మానాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అప్పటి నుంచి పార్టీ ఏ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో ఆరు నెలలుగా భూపతిరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ అధికారిక కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. అయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అడపాదడపా ఆయన అనుచర వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తన విషయంలో అధినేత ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఎమ్మెల్సీ కూడా వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ధోరణితో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. మరోవైపు భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. డీఎస్ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే..? రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ పరిస్థితి కూడా పరోక్షంగా ఇలాగే ఉందనే అభిప్రా యం రాజకీయ వర్గాల్లో ఉంది. సీనియర్ నాయకులైన డీఎస్‌కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అనుచరవర్గం గుర్రుగా ఉంది. పార్టీ, అధికారిక కార్యక్రమా లకు సంబంధించి డీఎస్‌కు మొక్కుబడిగా ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన అను చరవర్గం అసంతృప్తితో ఉంది. ముఖ్య కార్యక్రమాలు సైతం జరిగినా.. ‘‘నిన్ననే ఖరారైంది.. కార్యక్రమానికి రండీ..’’ అంటూ మొక్కుబడి ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీ బహిరంగసభ వేదికపైన కాకుండా., ప్రజాప్రతినిధుల గ్యాలరీలో డీఎస్ కూర్చున్న ఫొటోలు, వీడియోలు అప్ప ట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇటు డీఎస్ కూడా తన అనుచరవర్గంతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తన అనుచరవర్గం ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని డీఎస్ ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ కవిత కూడా స్పందించారు. సీనియర్ నాయకులు డీఎస్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందని, సీఎం కేసీఆర్ చాంబర్లోకి నేరుగా వెళ్లగలిగే చొరవ డీఎస్‌కు ఉందని స్పష్టత ఇచ్చారు. ఇలా ఈ ముఖ్యనేతలిద్దరి విషయంలో పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, ఈ ఇద్దరు నేతలు సైతం ఆచితూచి అడుగులు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అనుచరుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా
-
టీఆర్ఎస్లోనే ఉంటా.. వాటిపై స్పందించను
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవం లేకుంటే ఒక్క నిమిషం కుడా పార్టీలో ఉండేవాడిని కాదని పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు. పార్టీలో తమకు గౌరవం దక్కడంలేదని, చిన్న చూపు చూస్తున్నరనే అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు. ప్రభుత్వ పథకాల విషయంలోటీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వివక్ష చూపిస్తున్నారంటూ తన అనుచరులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. తన అనుచరులు, కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్తానని తెలియచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నానని.. భవిష్యత్‌లో కూడా అదే పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, తనపై వస్తున్న ఊహాగానాలపై స్పందించని వెల్లడించారు. పార్టీ ఇంట్రెస్ట్‌లో సీఎం కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు డి శ్రీనివాస్ తెలిపారు. -
డీఎస్ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నిజామాబాద్ : సీనియర్ నేత, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌పై ఆయన తనయుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని డీఎస్‌ను అరవింద్ కోరుతున్నారు. బీజేపీ నేత అయిన అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని డీ శ్రీనివాస్‌ను కోరారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు(డీ శ్రీనివాస్) టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని అరవింద్ పేర్కొన్నారు. పనిలో పనిగా ఎంపీ కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని అరవింద్.. ఎంపీ కవితకు సూచించారు. -
రాష్ట్రాల హక్కుల కోసమే థర్డ్ ఫ్రంట్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలపై పెత్తనా న్ని చెలాయిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా, రాష్ట్రాల హక్కులను సాధించుకునేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను ప్రతిపాదించారని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను అన్ని పార్టీలు, వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలకు ఎంతసేపూ అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంక్షే తప్ప మరో ఆలోచన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ పిలిచినా తాను చేరబోనని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తనను అగౌరవపరిచి బయటకు వెళ్లేలా చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడి రాజకీయ జీవితం తన వ్యక్తిగతమని డీఎస్ చెప్పారు. -
ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తా: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తెలంగాణ మాదిగ జేఏసీ చేపట్టిన రెండో రోజు నిరసనలో డీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నిరసనలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నేతలను కలిసిన డీఎస్ తనయుడు
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ శనివారం బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్‌తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. కాగా అరవింద్ బీజేపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలను అరవింద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు డీఎస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని ఖండించారు. తాను టీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేదని డీఎస్ అన్నారు. -
ఆయన వెనకబడిన వర్గాల పక్షపాతి: డీఎస్
నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మున్నూరుకాపు సంఘం ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో డీఎస్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలితను ఘనంగా సత్కరించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల కోసం నిధులు కేటాయించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు మరువలేరని, అన్ని వర్గాల ప్రజలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనేక ఉన్నత పదవులు చేపట్టిన వారిలో వెనుకబడిన వర్గాల వారు ఉండడం సంతోషకరమన్నారు. స్పీకర్, రాజ్యసభ ఎంపీ పదవులు బీసీలకు కేటాయించారని తెలిపారు. తన రాజకీయ జీవితంలో మున్నూరుకాపులు ఎంతగానో అండగా నిలిచారని, వారిని ఎప్పటికి మరిచిపోలేన్నారు. చదువులో, క్రీడల్లో రాణించే మున్నూరుకాపు విద్యార్థులకు ప్రోత్సహకాలు అందించాలని సూచించారు. మేయర్ ఆకుల సుజాత, మాజీ మేయర్ సంజయ్, మున్నూరుకాపు సంఘం నాయకులు దారం సాయిలు, జెడ్పీటీసీ పుప్పాల శోభ, కార్పొరేటర్లు లావణ్య, సూదం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇంత గుండెధైర్యమున్న సీఎం మరొకరు లేరు
హైదరాబాద్: దేశంలో ఇంత గుండె ధైర్యమున్న సీఎం మరొకరు లేరని రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతులంతా సంబురాలు జరుపుకుంటున్నారు. ఎరువుల కోసం ఎకకరాకు రూ. 4 వేలు ఇవ్వాలనే నిర్ణయం సామాన్యమైనది కాదు. ఇచ్చిన హామీలన్నీటిని పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా పూర్తి కాలేదన్ని విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 25 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయించడం గొప్ప విషయం. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చాలా బాగుంది. ఎవరినో కాపీ కొట్టాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. 2014లో ప్రజలు మంచి తీర్పు వెలువరించారు. హామీలు ఇచ్చి మర్చిపోయే నాయకులు కొందరుంటారు. కానీ కేసీఆర్ అలాంటి వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు.. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని అన్నారు -
శ్రీవారిని దర్శించుకున్న టీ మంత్రి పద్మారావు, డీఎస్
తిరుమల: తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఉదయం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ శ్రీనివాసుని కృపతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. -
'ప్రతిపక్షాలవి అవగాహనలేమి వ్యాఖ్యలు'
నిజామాబాద్: మహారాష్ట్ర ఒప్పందంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు జరిగి ఉంటే బయటపెట్టాలని డీఎస్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ, పనులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. కోటి ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అభినందించారు. -
'కేసీఆర్ తప్ప ఎవరు సీఎం అయినా...'
నిజమాబాద్: ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధించలేనిది సీఎం కేసీఆర్ రెండేళ్లలో సాధించారని సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) అన్నారు. కేసీఆర్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పని అయిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు నిజామాబాద్ లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. 2019లోనూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా డీఎస్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. -
ధ్రువీకరణ పత్రం అందుకున్న విజయసాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆయన వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన శాయశక్తుల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని, ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీల మద్దతుతో ముందుకు వెళతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం అయిందని విజయ సాయిరెడ్డి విమర్శించారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం విదితమే. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ ఈ నెల 4వ తేదీనే ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. -
రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వారి ఎన్నిక లాంఛనమే అయింది. జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలకు పోటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ మరికాసేపట్లో ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా విజయ సాయిరెడ్డి ఈ నెల 6న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు. -
డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవం!
రాజ్యసభకు మంగళవారం నామినేషన్లు వేసిన నేతలు అభ్యర్థుల వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి ఎన్నికపై అధికారిక ప్రకటనే తరువాయి సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంట రాగా ఉదయం 11.55 నిమిషాలకు వారు నామినేషన్ పత్రాలను శాసనసభా కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ సదారాంకు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం రెండు స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో డీఎస్, కెప్టెన్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం చివరి రోజు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక డీఎస్, కెప్టెన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్ సీఎం కేసీఆర్ అనుగ్రహంతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందని.. ఈ పదవిని అదృష్టంగా భావిస్తున్నానని డీఎస్ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌లతో కసి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిస్వార్థంగా టీఆర్ఎస్లో చేరానని డీఎస్ తెలిపారు. ఎవరు ఎక్కడ ఉండాలో కేసీఆర్‌కు బాగా తెలుసని... ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, కేసీఆర్ అనేక విషయాలు చర్చించుకున్నామని, తమ మధ్య మంచి అవగాహన ఉండేదని, చాలా విషయాల్లో సమన్వయంతో పనిచేశామని డీఎస్ వివరించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ బంగారు తెలంగాణకు అర్థం చెప్పారని, ఆయన అంచనాల మేరకు పనిచేస్తానన్నారు. వచ్చే మూడేళ్లలో 80 శాతం ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. వివిధ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ల ఎన్నికలతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం తన అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమని, తెలంగాణ ఉద్యమ ఫలితంగానే తాను రాజ్యసభకు వెళ్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్ముతున్నారని డీఎస్ వివరించారు. ఇది చేతల ప్రభుత్వం: కెప్టెన్ రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వమని మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్‌తో కలసి పనిచేశానని, ఎన్నికల హామీలను కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తానని, కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలసి నడుస్తానన్నారు. సమర్థులు, అనుభవజ్ఞులకే సీట్లు దక్కాయి: నాయిని, ఈటల సమర్థులకే రెండు రాజ్యసభ సీట్లు దక్కాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎస్, కెప్టెన్లు బాగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు. అనుభవం ఉన్న నాయకులకే అవకాశం దక్కిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణలో సీనియర్లకే అవకాశం దక్కిందని, వారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగ పడుతుందని కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్ అన్నారు. ఏపీలో టీడీపీ వ్యాపారవేత్తలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిందని, తెలంగాణలో మాత్రం ఉద్యమకారులను రాజ్యసభకు పంపుతున్నామని, ఇదే టీడీపీకి, టీఆర్ఎస్కు ఉన్న తేడా అని చెప్పారు. డీఎస్, కెప్టెన్లకు ఢిల్లీలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆంధ్రా మూలాలున్న టీడీపీ తెలంగాణలో అంతర్ధానం కావాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, జోగు రామన్న, చందూలాల్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
కాకలు తీరిన నేత.. డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ధర్మపురి శ్రీనివాస్. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు చక్రం తిప్పిన కాకలుతీరిన రాజకీయ యోధుడు. కాంగ్రెస్‌లో చిరకాలం కొనసాగి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సారథిగా 2 సార్లు పని చేశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనేక ఎత్తుపల్లాలను చవి చూశారు. తొలుత బ్యాంకు ఉద్యోగి అయిన డీఎస్, 1983లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి చవిచూశారు. మొత్తం ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలిచినా 1994లో ఓడిపోయారు. 1999, 2004ల్లో వరుసగా గెలుపొందారు. మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వహించారు. 1995-1998ల మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1999లో నిజామాబాద్ నుంచి రెండోసారి గెలిచి 2003 వరకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, 2003-2004, 2008-2011 మధ్య పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. బలమైన బీసీ నేతగా ఎదిగినా... నిజామాబాద్ లో ఆయనపై నెలకొన్న వ్యతిరేకత డీఎస్ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు డీఎస్ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా నిజామాబాద్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఎదురుదెబ్బ అయింది. తర్వాత ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లోనూ డీఎస్‌ను విజయం వరించలేదు. 2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2011లో ఎమ్మెల్సీగా అవకాశం రాగా, 2014 జులై నుంచి 2015 మార్చి వరకు మండలిలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. 2015 జులై 8న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. -
పెద్దల సభకు కెప్టెన్, డీఎస్
రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పేర్లు ప్రకటన ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ రాజ్యసభ ఎన్నికల పర్యవేక్షకులుగా ఈటల, నాయిని సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పార్టీ నాయకత్వం ఇద్దరు అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో బుధ, గురువారాల్లో సంప్రదింపులు జరిపాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పోటీ చేస్తారని ప్రకటించారు. అలాగే మిగతా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఎండి ఫరీదుద్దీన్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలకు పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. ఉత్కంఠకు తెర రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే టీఆర్ఎస్ ఆశావహుల్లో సందడి మొదలైంది. పార్టీ చేతిలో ఏకంగా 88 మంది ఎమ్మెల్యేలు ఉండటం, విపక్షాలు పోటీ చేసే అవకాశం దాదాపు లేకపోవడం వల్ల అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్లోని పలువురు సీనియర్లు అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లతోపాటు పార్టీ కోశాధికారిగా పనిచేసిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త సీఎల్ రాజం వంటి వారు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ కావడంతో అధినేత ఎవరి పేర్లను ప్రకటిస్తారోననే సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకొని కున్నాక సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు పలువురు సీనియర్ల అభిప్రాయం తీసుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. అలాగే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపైనా మరో చర్చకు అవకాశం లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును ప్రకటించి ఈ వ్యవహారానికి తెరదించారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ టికెట్ రావడం సంతృప్తి కలిగిస్తోంది. నాకు అవకాశం ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా. బంగారు తెలంగాణ సాధన కోసం పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్ రాజ్యసభ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక డీఎస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని, ఢిల్లీకి వెళ్లి సేవ చేసే అవకాశాన్ని కేసీఆర్ తనకు ఇచ్చారన్నారు. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతానన్నారు. పార్టీ మారినప్పుడు చాలా మంది తనకు భవిష్యత్తు సరిగా ఉండదన్నారని గుర్తుచేసిన డీఎస్...పార్టీలో పనిచేసే నేతలకు పదవులు వస్తాయన్నారు. -
చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ నేత డి. శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లి సేవచేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్ గురువారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారిలో డి.శ్రీనివాస్‌ను రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడారంటూ డీఎస్ వాపోయారు. పనిచేసే నేతలకు పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ అయిన పోటీ చేయొచ్చునని (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) పరోక్షంగా డి. శ్రీనివాస్ విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టు తెలిపారు. అందుకే తనకు ఈ అవకాశమిచ్చినట్టు చెప్పారు. టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని డీఎస్ చెప్పారు. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రెండు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్.. పలువురు నేతలతో మంతనాలు నిర్వహించిన తర్వాత పార్టీ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవానికి టీఆర్ఎస్లో రాజ్యసభ సీటు కోసం పోటీ గట్టిగానే కనిపించింది. సీఎల్ రాజం, కేసీఆర్ సన్నిహితుడు దామోదరరావు తదితరుల పేర్లు కూడా వినిపించినా, అన్ని లెక్కలను దృష్టిలో పెట్టుకుని పై రెండు పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో కేబినెట్ హోదాలోనే ఉన్నా, కేంద్రంలో ఆయనకున్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్ర దృష్ట్యా ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్కు ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఇద్దరిని గెలిపించుకునే బలం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నా, ప్రతిపక్షాల సభ్యులతో కలుపుకొన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి జరిగే ఎన్నికకు మెదక్ జిల్లాకు చెందిన మైనారిటీ నేత ఫరీదుద్దీన్‌కు అవకాశం కల్పించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనారిటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. -
రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!
► అధికార పార్టీ అభ్యర్థిగా ఖరారు ► చక్రం తిప్పిన ఎంపీ కల్వకుంట్ల కవిత ► బీసీ నేతగా ప్రతిపాదన ఓకే అన్న సీఎం కేసీఆర్ ► నేడో, రేపో అధికారిక ప్రకటన నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతకు రాజ్యసభలో అవకాశం కల్పించేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రయత్నం ఫలించింది. రెండు రాజ్యసభ స్థానాల కోసం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రయత్నం చేసిన క్రమంలో జిల్లాకు చెందిన డీఎస్‌కు అవకాశం రావడం కోసం ఎంపీ కవిత చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందన్న ఆమె ఆలోచనను పార్టీ అధిష్టానం బలపరిచింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ పేరు రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. 24న నోటిఫికేషన్ రాజ్యసభ ఎన్నికల కోసం ఈ నెల 24న నోటిఫికేషన్ వెలువడనుండగా.. అంతకంటే ముందగానే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. రోజులు గడిచిన కొద్దీ ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను తేల్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ కవిత రెండు రోజులుగా జిల్లాకు చెందిన డీఎస్ పేరును సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడ ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్యులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమాలోచనల మీదట డీఎస్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడ ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో ఆయనకు అన్నమాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆ పదవీకాలం ఇంకా మూడు నెలలు ఉండగానే రాజ్యసభకు డీఎస్ పేరును ఖరారు చేయడం చర్చనీయాంశం అవుతోంది. అంచెలంచెలుగా.. 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన డీఎస్.. 32 ఏళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1982 వరకు వేల్పూరు సహకార బ్యాంకులో అధికారిగా పనిచేసిన డీఎస్ అదే సంవత్సరం రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేశారు. 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా బరిలోకి దిగిన ఆయన మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట, కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న డీఎస్ 1989, 1994లో ఓటమి చెందినా... 1999, 2004లలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2015 మార్చి వరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి అవకాశం కల్పించకపోవడంతో చివరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం కేసీఆర్.. అదే ప్రకారం డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యునిగా అవకాశం దక్కనుండటం అరుదైన అవకాశంగా పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు ఎంపీగా అవకాశం దక్కనుండగా.. నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందన్న వార్త పట్ల డీఎస్ శిబిరంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. -
'బల్దియాపై ఎగిరేది మా జెండానే'
హైదరాబాద్: బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని చెప్పారు. అయితే, పాతబస్తీలో ఘర్షణ చోటుచేసుకోవడం దురదృష్టకరమని, చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసన తర్వాత మంత్రి కేటీఆర్, షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచార సరళి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోసారి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన మీడియాకు, పోలీసు యంత్రాంగానికి, జీహెచ్ఎంసీకి, పార్టీనాయకులకు, నేతలకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ప్రజల విశ్వాసం పొందారని చెప్పారు. మంత్రులందరిపై ప్రచార బాధ్యతలు పెట్టినా కేటీఆర్ కు ప్రధాన ప్రచార బాధ్యతలు అప్పగించి కేసీఆర్ మంచి పనిచేశారని, అలా చేయడం ద్వారా రాష్ట్రానికి, రాజధానికి మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగించారని చెప్పారు. కేటీఆర్ పనితీరు చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నారు. టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
'కేసీఆర్‌కు ఆంధ్రాలోనూ ఆదరణ'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) డిక్షనరీలో సెటిలర్స్ అనే పదం లేదని టీఆర్ఎస్ నాయకుడు ధర్మపూరి శ్రీనివాస్ (డీఎస్) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణవాదులేనని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదరణ లభిస్తోందని డీఎస్ తెలిపారు. -
పదవులకోసమే టీఆర్ఎస్లో చేరాడు
డీఎస్‌పై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర కలిగిన ఏకైక వ్యక్తి డి.శ్రీనివాస్ అని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ తనకేమిచ్చిందన్న డీఎస్ వ్యాఖ్యలపై వీహెచ్ తీవ్రంగా మడ్డిపడ్డారు. పార్టీ నేత మహేశ్‌గౌడ్‌తో కలసి శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామే గనుక నోరు తెరిస్తే డీఎస్‌కు తీవ్ర ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. పదవులు, పైరవీల కోసమే డీఎస్, టీఆర్ఎస్లో చేరారని ధ్వజమెత్తారు. డీఎస్ తీరు చూస్తుంటే రాజకీయాల్లోకి సంపాదించడానికే వచ్చినట్లుందన్నారు. కాంగ్రెస్‌లో ఎకరాల కొద్ది ఆస్తులు దొరకకపోవడం వల్లే టీఆర్ఎస్లో చేరినట్లుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడంలో డీఎస్ పాత్ర ఏమాత్రం లేదన్నారు. డీఎస్‌కున్న అర్హతలు, స్థాయికి మించి కాంగ్రెస్‌లో ఆయనకు పదవులు దక్కాయన్నారు. సీఎం కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్‌పార్టీని విమర్శిస్తే చూస్తూ సహించేదిలేదన్నారు. -
'కాంగ్రెస్ పార్టీ నాకేం ఇచ్చింది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని డీఎస్ అన్నారు. బంగారు తెలంగాణ సాధించేవరకూ కేసీఆర్ రిటైర్కారని చెప్పారు. తన ప్రతిభను గుర్తించే కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. బంగారు తెలంగాణ బ్యాచ్ (బీటీ) కొత్తది కాదని, ముందు నుంచీ ఉందని డీఎస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లినందుకు తనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తనకేం ఇచ్చిందని డీఎస్ ప్రశ్నించారు. అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. -
కల సాకారం
ప్రభుత్వ సలహాదారుగా డీఎస్ కేబినెట్ హోదా దక్కించుకున్న ధర్మపురి డీఎస్ శిబిరంలో సంబరాలు రెండు రోజుల్లో జిల్లాకు రానున్న శ్రీనివాస్ ‘బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్‌తో కలిసి పాలు పంచుకుంటా’నన్న సీనియర్ రాజకీయ వేత్త దర్మపురి శ్రీనివాస్‌కు తన కల సాకారం చేసుకునే తరుణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర స్థాయికి ఎదిగిన డి.శ్రీనివాస్ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనేక చేర్పులు, మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇటీవలే డీఎస్ టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచేకునేందుకు టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. కొద్ది రోజులకే డీఎస్‌కు కేబినేట్ హోదా గల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడటం విశేషం. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ అంచెలంచెలుగా ఎదిగిన ధర్మపురి... తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అంచెలంచెలుగా ఎది గారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో కీలక పదవుల్లో కొనసాగిన ఆయన చివరకు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం కేసీఆర్.. అదే ప్రకారం డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. 1982 వరకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు సహకార బ్యాంకులో అధికారిగా పనిచేసిన ఆయన అదే సంవత్సరం రాజకీయ అరంగేట్రం చేశారు. 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా బరిలోకి దిగారు. మొత్తం ఎనిమి ది పర్యాయాలు ఎమ్మెల్యేగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ రాష్ర్ట, కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1989, 1994లో ఓటమి చెందినా... 1999, 2004లలో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిం చారు. 2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2015 మార్చి వరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. - డీఎస్ శిబిరంలో హర్షాతిరేకాలు... ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో పాటు కేబినేట్ హోదా కల్పించడం పట్ల డీఎస్ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పేరున్న డి.శ్రీనివాస్‌కు అత్యున్నత స్థానం దక్కడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నా... కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే ఆయన అనుచరులు, అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు నిజామాబాద్‌లోని శ్రీనివాస్ ఇంటివద్ద స్వీట్లు పంచుకుని బాణాసంచాలు పేల్చారు కాగా.. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన డీఎస్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఆ తర్వాతే జిల్లాకు వస్తారని అంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు.. నిజామాబాద్‌కల్చరల్ : డి. శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించడాన్ని హర్షిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించి డీఎస్‌కు సముచిత స్థానం కల్పించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం డీఎస్ టీఆర్ఎస్లో చేరారన్నారు. మొదట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏ.ఎస్.పోశెట్టి, బీరెల్లి లక్ష్మన్‌రావు, రవీందర్‌రెడ్డి, అక్తర్‌ఖాన్, చాంగుభాయ్, పురుషోత్త, పుప్పాల శోభ, ఆకుల చిన్న రాజేశ్వర్, ఆమందు బాల్కిషన్, డి. రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా టీఆర్ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకులో అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా ఆయన పనిచేస్తారని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. ఈ నియామకం తొలుత ఏడాది పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారుగా డీఎస్‌కు లక్ష రూపాయల జీతం, ఇతర సదుపాయాలు కూడా ఉంటాయని జీఓలో తెలిపారు. అంతే కాకుండా కార్యాలయానికి ఐదుగురు సిబ్బందిని కూడా కేటాయించారు. ఈ నియామకానికి సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ - డీఎస్‌కు స్వయంగా తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ఇవాళ ఉదయం డీఎస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ ఇటీవల ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి అయింది. దాంతో మరోసారి ఎమ్మెల్సీ సీటును ఆయన ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎస్ జిల్లాకే చెందిన ఆయన శిష్యురాలు ఆకుల లలితకు ఆ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. దాంతో పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. దీంతో డీఎస్ హస్తం పార్టీకి రాజీనామా చేసి... టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
'నేను మంత్రి పదవి ఆశించడం లేదు'
హైదరాబాద్ : తాను మంత్రి పదవి ఆశించడం లేదని ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేత డీ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం బాధాకర అంశమని ఆయన అన్నారు. మొదటి నుంచి నేను ఫిరాయింపులకు వ్యతిరేకమేనని డీఎస్ చెప్పారు. యాంటీ డిఫెక్షన్ చట్టమున్నా వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, అందుకే వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నా సేవలను ఏ రకంగా ఉపయోగించుకున్నా తనకు ఓకేనని ఆయన అన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు సమైక్యవాదినే, కానీ ఈ తర్వాతే తాను వేర్పాటువాదిగా మారినట్లు ఈ సందర్భంగా డీఎస్ వివరించారు. -
రాష్ట్ర స్థాయిలోనే డీఎస్‌కు అవకాశం!
డీఎస్ ఇంటికి కేసీఆర్ * అర గంటకు పైగా భేటీ * తాజా రాజకీయాలపై చర్చలు * పుష్కరాల తర్వాత డీఎస్ భవితవ్యంపై నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. బుధవారం సీఎం, డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీఎస్ ఈనెల 8న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరిక సమయంలోనే త్వరలో డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి అన్ని విషయాలు చర్చిస్తానని సీఎం ప్రకటించారు. దీనిలో భాగంగా ఆయన బుధవారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని వెంటబెట్టుకుని డీఎస్ నివాసానికి మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య తాజా రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. డీఎస్ అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకుంటామని, ఆయనను గౌరవించుకుంటామని కూడా డీఎస్ చేరిక సమయంలో సీఎం పేర్కొన్నారు. ఈ ప్రకటనల నేపథ్యంలోనే డీఎస్‌ను రాజ్యసభకు పంపించి జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే, తాజా భేటీలో మాత్రం డీఎస్ రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి కనబరిచారని తెలిసింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, అది వీలుకాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిలో నియమించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉండడంతో ఆయనకు రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖతో కేబినెట్లో చోటిస్తారని అనుకుంటున్నారు. కాగా, పదవుల విషయం సీఎం, డీఎస్ భేటీలో ప్రస్తావనకు రాకున్నా, వీరిద్దరి మధ్య సంభాషణ అదే కోణంలో జరిగినట్లు సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికల్లో డీఎస్‌కు అవకాశం కల్పించి మంత్రి వర్గంలో చోటుతోపాటు మండలిలో పార్టీ నేతగా ప్రకటించవచ్చన్న మాటకూడా వినవస్తోంది. ఇదిలా ఉంటే అర్ధగంటకు పైగా సీఎం, డీఎస్, ఇతర నేతలు కలిసే ఉన్నారని, ఇద్దరు నేతలు ఏకాంతంగా ఏం మాట్లాడుకోలేదని, ఇతర నేతలు ఉండగానే కలసి భోజనం చే స్తూ వివిధ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గోదావరి పుష్కరాల హడావుడి ముగిశాక, డీఎస్ భవితవ్యంపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. -
డీఎస్‌తో కేసీఆర్ మంతనాలు!
-
జానారెడ్డిని మార్చం
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ నేత కుంతియా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్నిసేకరించలేదన్నారు. డీఎస్ వంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, ఆయన మారడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ నేత కుంతియా విమర్శించారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని కుంతియా వెల్లడించారు. ఇందుకోసం విరాళాలు సేకరిస్తామన్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వరంగల్ ఉపఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదన్నారు. రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ము స్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. -
డీఎస్‌కూ అదే గతి: కుంతియా
జహీరాబాద్(మెదక్): కాంగ్రెస్‌లో ఉన్నతమైన పదవులను అనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడిన వారే అన్ని విధాలుగా నష్టపోయారని ఆయన పలువురిని ఉదహరిస్తూ గుర్తు చేశారు. డీఎస్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు అన్నింటిని విస్మరించారని విమర్శించారు. -
టీఆర్ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే
* టీఆర్ఎస్లో డీఎస్ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్య * బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్లోకి: డీఎస్ సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్లో ఎవరు చేరినా.. టీఆర్ఎస్ బలోపేతమవుతుందని అంటున్నారు. ఎలాంటి డౌట్ లేదు. టీఆర్ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడం. తెలంగాణను తెచ్చిందే టీఆర్ఎస్. అది చరిత్ర. ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. పార్టీలు, రాజకీయాలు వేరు. శతృత్వాలు ఉండవు. డీఎస్‌తో నాకు 35 ఏళ్లుగా సంబంధాలున్నాయి. మాకు పదవులు లేనప్పుడు కూడా కలిసే ఉన్నాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. డీఎస్‌కు చిన్న చిన్న పదవులు లెక్కకాదని, రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వందల మందికి టికెట్లు ఇచ్చారన్నారు. డీఎస్ తెలంగాణ మేధావి అని, పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. సెల్యూట్ చేస్తున్నా.. ‘‘తెలంగాణ బలోపేతం గురించి ఆలోచన చేసిన డీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నా. పరిపక్వత ఉన్న వారికే ఈ ఆలోచన సాధ్యం. పదవులు లెక్కే కాదు. వర్తమాన రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని రూపు దిద్దుకుంటోంది. పార్టీలో చేరే వారు చేరొచ్చు. వారిని గౌరవించుకుంటం. డీఎస్‌కు అన్నీ తెలుసు. పది జిల్లాల్లో మూల మూలన పరిచయాలు ఉన్నాయి, వివాద రహితుడు, సం స్కారం ఉన్న వ్యక్తి. ఒక తమ్ముడిలా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఆయన సీనియారిటీ, అనుభవాన్ని తెలంగాణకు ఉపయోగించుకుంటం. రెండు మూడు రోజుల తర్వాత డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి అన్ని విషయాలు చర్చిస్తామ’’ని కేసీఆర్ పేర్కొన్నారు. దొంగను పట్టుకుంటే.. ఇంత గొడవా? ‘‘తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డపడుతున్నారు. దొంగను పట్టుకుంటే చంద్రబాబు ఒకటే గొడవ. మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కుతుండు. కరెంటు ఇవ్వరు, ఇయ్యం.. ఏం చేసుకుంటరంటడు. కార్పొరేషన్ల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తరు. ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు ఇవ్వరు. మీ బతుకేదో మీరు బతకండి. తెలంగాణ వేరైంది. దాని బతుకేందో అది బతుకుతది. హైదరాబాద్‌ను పట్టుకుని ఒకటే గుంజులాట.. ఇక అటు ఏపీ సహకరించడం లేదంటె.. ఇటు ఇక్కడి రాజకీయ నాయకులకూ ఓపిక లేకుండా పోయింది. ఏం జరగాలన్నా ఓ ఐదేళ్ల దాకా ఓపిక అవసరం కదా.. చాతనైతే సహకరించాలె. కానీ గొంతు పిస్కుడాయే..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అండగా ఉండేందుకే..: డీఎస్ ‘‘టీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయాన్ని నిర్దిష్టంగా తీసుకున్నా. ఇప్పుడు కేసీఆర్ నాకు కండువా కప్పారుగానీ... 2004లోనే మేం కండువాలు కప్పుకున్నాం. తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది కేసీఆర్.. ఆయన ఒత్తిడితోనే తెలంగాణ కల సాకారమైంది. బంగారు తెలంగాణ సాధన కోసం అంతా కలిసి పనిచేయాలి. నా అంతరాత్మ ప్రబోధం మేరకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. టీఆర్ఎస్లో చేరుతున్నా..’’ అని డీఎస్ చెప్పారు. కేసీఆర్‌కు అన్నివేళలా అండగా ఉంటానని, తన వెంట పార్టీలోకి వచ్చిన వారి బాగోగులు చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ సీఎం పనిచేస్తుంటే పక్క రాష్ట్ర సీఎం పనిలేక ఆటంకాలు పెడుతున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ఇది సెక్యులర్ తెలంగాణ ఇది సెక్యులర్ తెలంగాణ అని, గంగా జమున తహజీబ్ ప్రతీకగా ఉన్న తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారని.. ఈ తెలంగాణలో మనదైనటువంటి సంస్కృతితో ముందుకు వెళదామని చెప్పారు. ‘‘పాత వైభవం, పాత సంస్కృతి, మనదైనటువంటి సంస్కృతి, మనదైనటువంటి ఆలోచనా విధానంతో ప్రస్ఫుటంగా, ప్రబలంగా, అద్భుతంగా ముందుకు వెళదాం. హైదరాబాద్ రంజాన్ పండుగకు ఒకప్పుడు పెట్టింది పేరు. మహబూబ్ అలీఖాన్ రంజాన్ పండుగ రోజున చల్లే రూపాయలు తెచ్చుకునే వారు. అంత గొప్పగ జరిగేది. మధ్యలో వచ్చిన వారికి రంజాన్ తెలియదు, బక్రీద్ తెలియదు. హైదరాబాద్ సంస్కృతిని ధ్వంసం చేశారు. హిందూ ముస్లింలు ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవాలి. 750 సంవత్సరాల ముస్లిం రాజుల పాలనలో ఒక్కసారి కూడా మతకలహాలు జరగలేదు. మధ్యలో కొందరు లుచ్చాలు, గూండాలు మతకల్లోలాలు సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీ కూడా నిజాం గొప్పతనాన్ని, హైదరాబాద్ గొప్పతనాన్ని పొగిడారు. హైదరాబాద్‌ను చూసి ఉత్తర భారతం నేర్చుకోవాలన్నారు. ఈ గొప్ప తనాన్ని భవిష్యత్ తరాలకు ట్రాన్స్ఫర్ చేయాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కారెక్కిన శీనన్న!
-
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోచేరిన డీఎస్
-
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి డీ.శ్రీనివాస్ గుడ్‌బై చెప్పారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమంక్షంలో డీ.శ్రీనివాస్ గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగి ఈ కార్యక్రమంలో కేసీఆర్ పార్టీ కండువా కప్పి డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేశారు. కాగా డీఎస్‌కు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి కానీ, రాజ్యసభ సభ్యునిగా కానీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
'డీఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన డి.శ్రీనివాస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో డీఎస్ పార్టీ మారిన అంశాలపై వివరించారు. బంగారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన డీఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని రవి అన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోందని రవి ఈ సందర్భంగా ఆయన వారితో చెప్పారు. -
డీఎస్‌తో తుంటర్వ్యూ
-
నీ దారే నా దారి ...
ఇద్దరూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. హస్తినలో పార్టీ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడితోపాటు అత్యంత నమ్మకస్తులుగా పేరు సంపాదించారు. అంతే కాకుండా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో ఆ ఇద్దరు నేతలు... అధిష్టానం తలలో నాలుకగా వ్యవహారించారు. దీంతో వారిద్దరికి కొంచెం అటు ఇటుగా పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. పార్టీ అధిష్టానం వారి సేవలను గుర్తించి... పెద్ద పదవుల్లో కూర్చొబెట్టినా.. వారు వన్ మోర్ ఛాన్స్ అనటంతో... ఒక్క ఛాన్స్ ఇచ్చాం కదా అంటూ అధిష్టానం ససేమిరా అంది. దాంతో వారిద్దరూ హస్తానికి రాం రాం అని.... ఒకరు తర్వాత ఒకరు కొన్నేళ్ల తేడాతో అధిష్టానం పెద్దలకు 'చెయ్యి' చూపించి మరీ 'కారు' ఎక్కేశారు. వారిలో ఒకరు కారు ఎక్కిన మరుక్షణమే పెద్దల సభలో సీటు కొట్టేశారు. మరొకరు ఎమ్మెల్సీ లేదా పెద్దల సభలో సీటు ఏదైనా ఫర్వాలేదు మీరు ఇక్కడంటే ఇక్కడ... అక్కడంటే అక్కడ.. ఎక్కడైనా సరే అంటూ కర్చీఫ్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. వారిలో ఒకరు కె. కేశవరావు కాగా మరొకరు డీ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన కేశవరావు పదవి కాలం ముగియడంతో మరోసారి పదవి దక్కలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ పార్టీ తరపున పెద్దల సభలో సీటు సంపాదించేశారు. డీఎస్ కూడా అదే రీతిలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి... మరో సారి ఆ పదవి ఇవ్వమని అధిష్టానం పెద్దలను కోరారు. అందుకు వారు 'నో' అనకుండా ఆయన శిష్యురాలు అకుల లలితకు ఆ పదవిని కట్టబెట్టారు. దాంతో ఆయన హస్తం వీడి కారు ఎక్కేశారు. ఒకరు తర్వాత ఒకరు పీసీసీ మాజీ చీఫ్‌లు ఎంచెక్కా గులాబీ కారు ఎక్కేశారు. చూడబోతే నీ దారే నా దారంటూ ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుత టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావును మరో సీనియర్ నేత డీఎస్ ఫోలో అయినట్లు లేదు. -
'ఈనెల 8న టీఆర్ఎస్ లో చేరుతున్నా'
నిజామాద్:ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్న విషయాన్ని శనివారం సాయంత్రం వెల్లడించారు. ఈ నెల 8 వ తేదీన తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. తాను సీఎం పదవి మినహా అన్ని పదవులు పొందానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే కార్యకర్తలను తనతో రావాలని బలవంతం చేయడం లేదని డీఎస్ తెలిపారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే.. రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించింది కేసీఆరేనని మరోసారి పేర్కొన్నారు. -
గాంధీభవన్‌లో కేకే, బొత్స, డిఎస్ ఫోటోల తొలగింపు
-
'అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆరోపించారు. పదవులనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ పార్టీలో మరో బీసీ నేతను తయారు చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి అనుమతి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ అవినీతి, ఓటుకు కోట్లు అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని వీహెచ్ స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 20 వరకు జిల్లాల్లో ధర్నా నిర్వహించాలని పీసీసీని కోరినట్లు వీహెచ్ తెలిపారు. అంతకుముందు గాంధీభవన్ మీడియా హాల్ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్, కేకే, బొత్స సత్యనారాయణ ఫొటోలను వీహెచ్, మాజీ మంత్రి ఆర్ దామోదరరెడ్డి తొలగించారు. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో...
తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇంకేముంది కాంగ్రెస్ ఖాతాలో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గ్యారంటీ అంటు అధిష్టానం వద్ద గప్పాలు చెప్పి... ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీ కాంగ్రెస్‌లోని పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు డజన్లు ఎమ్మెల్యే సీట్లు కూడా రాలేదు. సరికదా రెండే రెండు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రం ఇచ్చిన ఓడిపోయాం... ఏం చేస్తాం భవిష్యత్తుపై దృష్టి పెట్టడంటూ అధిష్టానం ఆదేశించినా... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మొండి చెయ్యే మిగిలింది. అదికాక అధికార పార్టీ అకర్షణ ఆకర్ష్‌కి హస్తం వదిలి ఎవరికీ వారు కారేక్కేస్తున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో.... ఎవరు కారు ఎక్కునో అని టీ కాంగ్రెస్ నేతలు ఒకరి వంక ఒకరు సందేహంగా చూసుకుంటున్నారు. అందుకు టీ కాంగ్రెస్‌లో ఇటీవల తాజాగా నెలకొన్న పరిస్థితులే అందుకు ఉదాహరణ. సికింద్రబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీఆర్ఎస్లోకి జంప్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆమె కుమారుడు హీరోగా నటించిన చిత్రం ఆడియో ఫంక్షన్‌కు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ఈ పుకార్లకి మరింత బలం చేకూరింది. వచ్చేది వర్షాకాలం కాదు... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కాలం అంటూ కంగారు పడిన టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ... ఫోన్ చేసి జయసుధని వివరణ కోరారు. అదేమీ లేదు. అదంతా ఒట్టిదే అంటూ ఆమె వివరణ ఇచ్చుకోవడంతో హమ్మయ్యా అంటూ హస్తం నేతల మనసు తెలిక పడింది. ఆ ఘటన జరిగి వారం రోజులు అయిందో లేదో కానీ ఉమ్మడి అంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీ శ్రీనివాస్ ఉరుములు మెరుపులు లేకుండా ఇంకా చెప్పాలంటే ఏ మాత్రం ఊహకందని విధంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. కారు ఎక్కేందుకు ముహుర్తం కూడా ఖరారై పోయింది. అయితే దాదాపు ' థర్టీ ఇయర్స్‌కి పైగా ఇక్కడ పాలిటిక్స్' అంటూ 'చేతి' వేళ్లు పట్టుకుని మరీ నడిచి... ఒకానొక సమయంలో అధిష్టానం తలలో నాలుకలా మసలిన డీ శ్రీనివాస్యే హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. దాంతో హస్తం పార్టీ వేళ్లు పట్టుకుని ఎవరు నడుస్తారో ఎవరు విడిచి వెళ్తారో... ఏ నిమిషానికి ఏమీ జరుగునో... అని టీ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. -
ఒరిజనల్ టీఆర్ఎస్ నేతలు తిరగబడితే..
హైదరాబాద్: టీఆర్ఎస్ లో ఎంతో కాలంగా ఉండి పార్టీకి సేవ చేస్తున్న ఒరిజనల్ నేతలు తిరగబడితేనే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు దక్కకుండా ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డి శ్రీనివాస్(డీఎస్)ను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శనాస్త్రాలు గుప్పించారు. డీఎస్ తన ఆత్మను నమ్ముకుని టీఆర్ఎస్ లో చేరబోతున్నారని మండిపడ్డారు. ఒరిజనల్ టీఆర్ఎస్ నేతలు తిరబడితేనే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగ నేతలకు పదవులు దక్కకుండా ఉంటాయన్నారు. డీఎస్ ఒక కోవర్టు.. ఆయన కాంగ్రెస్ ను వీడటం సంతోషంగా ఉందన్నారు. బీసీల కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నాని డీఎస్ చెప్పడం ఆత్మవంచనేనన్నారు. టీఆర్ఎస్ నష్టపోయింది బీసీలేని శ్రవణ్ పేర్కొన్నారు. -
డీఎస్ మాకు చేసిందేమీ లేదు: లలిత
నిజామాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తమకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ పీసీసీ అధ్యక్షుడు ఇప్పించారని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బలహీన వర్గాలకు న్యాయం చేశామంటున్న డీఎస్ ఇప్పటివరకు ఎంతమందిని పైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసినా, ఆయన శిష్యురాలిని కాబట్టి ఊరుకున్నానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర కారణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. -
సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంతో పాటు, తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని ఆయన చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. -
ఆ నేతల ఫొటోలు తీసేశారు!
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి ఆపై పార్టీని వీడిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవులు, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన ద్రోహుల ఫొటోలను గాంధీభవన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని టీపీపీసీ నేతలు గురువారం ప్రతిపాదించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆలోచించండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై దృష్టి సారించాలని ఎంపీ వి.హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే దానిపై పరిశీలించాలని కోరారు. దిగ్విజయ్‌తో గురువారం ఇక్కడ వీహెచ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యటన ఒకట్రెండు రోజులకు పరిమితం చేయకుండా, వారం రోజులు ఉండి పరిస్థితులపై సమీక్షించాలని దిగ్విజయ్‌ను కోరారు. అనంతరం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్లోకి వెళ్లినట్టు చెబుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ నాడు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడుకు తరలిపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ‘లాబీయిస్టులను నమ్మితే ఇదే సమస్య’ పార్టీకి నమ్మకస్తులుగా పనిచేసే వారిని కాకుండా డీఎస్ లాంటి లాబీయిస్టులను నమ్మితే వ్యక్తిగత స్వార్థంకోసం పార్టీని కష్టకాలంలో విడిచిపెట్టి పోతారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్‌కు అర్హత కంటే ఎక్కువగా పదవులు వచ్చాయని, పార్టీ కోసం పని చేయకుండా ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని వీడాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. -
నువ్వుంటే ఎంత..? పోతే ఎంత..?
- పార్టీయే ఆయన్ను మోసిందని వ్యాఖ్య - పదవుల్లో 30 ఏళ్లు.. పదవి లేకుండా 30 రోజులు ఉండలేరా అని నిలదీత సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేత డి.శ్రీనివాస్ వదిలివెళ్లడం వల్ల పార్టీకి నష్టమేమీ లేదని టీపీసీసీ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ, మండలిలో విపక్షనేత జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఉన్నంతకాలం డీఎస్‌ను పార్టీయే మోసిందని, పార్టీని ఏనాడూ డీఎస్ మోయలేదన్నారు. ‘పార్టీలో 30 ఏళ్ల పాటు ఎన్నో పదవులను డీఎస్ అనుభవించారు. పదవి లేకుండా 30 రోజులు కూడా పార్టీకి సేవచేయలేకపోయారు. పార్టీకోసం లక్షలాదిమంది కార్యకర్తలు కష్టపడితే, ఆ ఫలితాన్ని ఆయన అనుభవించారు. ఆయన వెళ్లడం వల్ల సొంత జిల్లాలో ఎవరికీ నష్టంలేదు. కష్టకాలంలో పార్టీలో పనిచేయాలనే ఆలోచన లేని డీఎస్లాంటి వారు ఉంటే ఎంత, పోతే ఎంత’ అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌కు ఏనాడూ అవమానం జరగలేదని, ఎంతో గౌరవాన్ని చూపిందన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం, రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనను పారీ ్టగౌరవించిందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ప్రతిపక్షనేతగా గౌరవాన్ని కల్పించిందని టీపీసీసీ నేతలు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశాల్లేవని, అన్యాయం జరుగుతున్నదంటూ డీఎస్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఆయన రిటైరైతే ఆ స్థానంలో బీసీ వర్గానికే చెందిన మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, ఇది బీసీలకు అన్యాయం జరిగినట్టు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా పీసీసీకి 2 సార్లు అధ్యక్షునిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన డీఎస్ కూడా బీసీవర్గానికే చెందిన నేత అనే విషయం మరిచిపోవద్దన్నారు. పార్టీలో ఏ నిర్ణయం జరిగినా ఉమ్మడిగానే ఉంటుందని, ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్‌తో సహా ఏ ఒక్కరిపైనా నిందలు వేయడం డీఎస్లాంటి నేతకు సరైందికాదని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌నేతలు రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
దిగ్విజయ్ వంచకుడు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్(డీఎస్) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఆకుల లలితను తానే ప్రతిపాదించినట్టుగా దిగ్విజయ్ మాట్లాడటం పచ్చి అబద్ధమని డీఎస్ చెప్పారు. ఎమ్మెల్సీగా తాను రిటైరైతే, తనకు చెప్పకుండా ఆకుల లలితను ఎంపిక చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా 300 మందికి రెండు సార్లు ఎమ్మెల్యే బీ-ఫారాలు అందించానని... తనకు ఎమ్మెల్సీ పదవి లెక్కకాదని డీఎస్ పేర్కొన్నారు. కానీ ఆ సందర్భంగా జరిగిన అవమానమే బాధపెట్టిందన్నారు. పార్టీలో సీనియర్ అయిన తనతో మాట్లాడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేదా అని ప్రశ్నించారు. చెప్పుడు మాటలు విని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటూ పార్టీలో చర్చకు తానే కారణమయ్యానని, కానీ తెలంగాణ ఏర్పాటు జాప్యం కావడం వల్ల తనకు, పార్టీకి నష్టం జరిగిందని డీఎస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఆశిస్తున్న పరిపక్వతను, పరిణతిని టీపీసీసీ ప్రదర్శించలేకపోతోందని విమర్శించారు. దీనిని వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే.. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత ప్రజా సంబంధాలను బంగారు తెలంగాణ కోసం వినియోగిస్తానని డీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు. రాజ్యసభ కోసం, ఎమ్మెల్సీ కోసం టీఆర్ఎస్లో చేరడం లేదని... పదవుల గురించి కేసీఆర్‌తో చర్చించలేదని, తనను ఎలా ఉపయోగించుకున్నా సిద్ధమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే ఆంధ్రా శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని డీఎస్ చెప్పారు. కాంగ్రెస్‌ను వీడాల్సిన పరిస్థితులు వస్తాయనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీదే కీలకపాత్ర అయినా పార్టీని వీడాల్సిన పరిస్థితులు వచ్చాయని.. సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానని డీఎస్ వ్యాఖ్యానించారు. తనతో పాటు కాంగ్రెస్ నుంచి ఎవరినీ రావాలని కోరడం లేదన్నారు. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంచి ముహూర్తం చూసి చేరతానని వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు ఎవరూ తన చేరికను వ్యతిరేకించడం లేదని చెప్పారు. -
పార్టీని వీడిన వారి ఫొటోలు ఇంకా ఎందుకు..?
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీని వీడిన వారి ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీ ద్రోహుల ఫొటోలను గాంధీభవన్‌లో ఉంచాల్సిన అవసరమ లేదని టీపీపీసీ ముఖ్యనాయకుడొకరు గురువారం ప్రదిపాదించారు. ఈ ప్రతిపాదనతో టీపీసీసీ నేతలంతా అంగీకరించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి, ఈ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారి ఫోటోలు, వారు పని చేసిన కాలం వంటివాటితో అందరి ఫొటోలను గాంధీభవన్‌లో వరుసగా పెట్టే సంప్రదాయం ఉంది. అయితే, పార్టీ నుంచి పోయినవారి ఫొటోలను ఇప్పటిదాకా గాంధీభవన్ నుంచి తొలగించిన దాఖాలాల్లేవు. పార్టీ నుంచి బయటకు పోయి, కాంగ్రెస్ పార్టీనే తిడుతున్న ద్రోహుల ఫోటోలను ఎందుకు పెట్టాలంటూ పలువురు నేతలు ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..'
న్యూఢిల్లీ: నిందితుల బెయిల్ షరతులలో ర్యాలీలు, ప్రసంగాలు చేయవద్దని నిబంధనలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయమై న్యూఢిల్లీలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేసు నుంచి నిర్దోషిగా బయట పడినప్పుడే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ... డీఎస్ కాంగ్రెస్ ను వీడితే పార్టీకి నష్టమేమీ లేదన్నారు. టీఆర్ఎస్లో ఆహ్వానం అదిరేలా ఉంటుందని... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని వీహెచ్ అభిప్రాయపడ్డారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
హైదరాబాద్: సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు గురువారం మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేక పోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ ను దూషించిన కేసీఆర్ వద్దకే ఆయన వెళ్లారని చెప్పారు. పదే పదే పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదని పేర్కన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్ కు ఉన్నత పదవులు ఇచ్చిందని, ఆయనకు పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని వివరించారు. అన్ని పదవులూ అనుభవించి పార్టీని వీడడాన్ని ప్రజలెవరూ హర్షించరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. డీఎస్ పార్టీని వీడడం బాధాకరమని, ఆయనది అనాలోచిత నిర్ణయమని జానారెడ్డి అన్నారు. ఆయన రాజీనామా ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అవమానించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తాను పార్టీ సిద్ధాంత ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ ను విలీనం చేసే పనిని హైకమాండ్ ఎవరికి అప్పగించిందో తెలియదని, ఆ పనిని పార్టీ నేతలు సరిగా డీల్ చేయలేదని డీఎస్ ఎలా వ్యాఖ్యానించారో ఆయనే వివరించాలని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో డీఎస్‌కు పదవులు దక్కాయే తప్ప, అవమానాలు పడ్డారనడం వాస్తవం కాదని భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే డీఎస్ టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. -
'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
-
ఉద్యమ నాయకత్వ ఘనత కేసీఆర్ దే!
-
పదవి ఆశించి పార్టీ మారడం లేదు: డిఎస్
-
ఎమ్మెల్సీ పదవి నాకు లెక్కకాదు: డిఎస్
-
డీఎస్ ఓడినా పదవులు దక్కాయి: దిగ్విజయ్
-
డీఎస్ ఓడినా పదవులు దక్కాయి: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: డి.శ్రీనివాస్ గతంలో పలుసార్లు ఎన్నికల్లో ఓడినా పదవులు దక్కాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్ పార్టీని వీడతారని అనుకోవడం లేదు. కాంగ్రెస్‌కు ఆయన విధేయుడుగా ఉన్నారు. పార్టీ కూడా సముచితంగా గౌరవించింది. ఆయన గతంలో పలుసార్లు ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది. అందువల్ల మహిళను ఎంపిక చేశాం. పైగా ఆమెకు ఇవ్వాలని డీఎస్ కూడా ప్రతిపాదించారు’ అని అన్నారు. సీనియర్లు పార్టీని వీడడం అవకాశవాదమేనన్నారు. -
టీఆర్ఎస్లోకి డీఎస్!
⇒ గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయం ⇒ బుధవారం ముఖ్యమంత్రి ⇒ కేసీఆర్‌తో డీఎస్ భేటీ ⇒ ఆయనను స్వయంగా తీసుకెళ్లిన ఎంపీ కవిత ⇒ నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ⇒ ఇదే దారిలో దానం సహా మరికొందరు నేతలు సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తోభేటీ అయ్యారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత స్వయంగా డీఎస్‌ను క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. డీఎస్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని దీనితో తేలిపోయింది. అయితే అటు డీఎస్ కానీ, ఇటు టీఆర్ఎస్ నాయకత్వం కానీ ఆయన చేరికపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లుగా బుధవారం రాత్రే ఏఐసీసీ నాయకత్వానికి డీఎస్ ఒక లేఖను ఫ్యాక్స్ చేశారు. గురువారం ఉదయం ఆయన టీఆర్ఎస్లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కీలక పదవి ఇచ్చే అవకాశం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్‌కు టీఆర్ఎస్లో సముచిత స్థానమే దక్కనుంది. ఎమ్మెల్సీగా లేదా రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నా... డీఎస్ స్థాయికి తగిన పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆయనకు కట్టబెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి గెలిపించి ముఖ్యమైన శాఖలతో మంత్రి పదవి ఇవ్వనున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. రుణం తీర్చుకుందాం! వాస్తవానికి నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో ఉంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి డీఎస్‌ను తీసుకురావాల్సిన అవసరం లేదని ఆ జిల్లాకు చెందిన నేతలు సీఎం కేసీఆర్ ఎదుట వాదించారని సమాచారం. అయితే తెలంగాణ సాధనలో డీఎస్ కషిని విస్మరించలేమని, అన్నీ రాజకీయాల కోసమే చేయమని, కొన్ని విలువల కోసం చేస్తామని చెప్పి సీఎం వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. తెలంగాణవాదిగా ముద్రపడి కాంగ్రెస్‌లో ఇబ్బందిపడిన డీఎస్‌ను దగ్గరకు తీసుకుంటే బాగుంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమకాలం నుంచి డీఎస్‌కు, కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలే ఉండడంతో అదిప్పుడు వారు కలసి పనిచేయడానికి ఊతమిచ్చిందని పేర్కొంటున్నారు. ఇదే దారిలో.. టీఆర్ఎస్లో చేరడానికి మరికొందరు నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కే చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గులాబీ పార్టీలో చే రనున్నారని.. గత ఆరునెలలుగా ఆయన ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ల పేర్లు కూడా వినవస్తున్నాయి. అయితే వీరెవరూ డీఎస్‌తో పాటు టీఆర్ఎస్లో చేరే జాబితాలో లేరని అంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో మెజారిటీ కార్పొరేటర్లు, ఓ జెడ్పీటీసీ సభ్యురాలు డీఎస్ వెంట గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నన్ను అవమానించారు... సోనియాగాంధీకి డీఎస్ లేఖ తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో నావంటి నిజాయితీ కలిగిన నాయకులను అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, నిజాయితీ కలిగిన వారిని, అనుభవమున్న నాయకులను అంతర్గతంగా ఇబ్బందులు పెడుతున్నారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో నష్టపోయామన్నారు. పార్టీలో విద్యార్థి దశ నుంచి అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తున్న తనను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘జానారెడ్డి, జీవన్‌రెడ్డి వంటి నేతలు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్‌రెడ్డి జనతాదళ్‌లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి నేతలను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాతా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్‌సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్‌గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. నేడు రాజీనామా ప్రకటన.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. -
6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్
-
6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డీ.శ్రీనివాస్ బుధవారం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసే యోచనలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తో డీఎస్ భేటీ కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయం నుంచి డీఎస్ నేరుగా నిజామాబాద్ వెళ్లనున్నారు. జిల్లాలోని అనుచరులతో ఆయన మూడురోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. కాగా డీఎస్‌కు ఎలాంటి పదవి ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. -
సీఎంను పరామర్శించడానికే వచ్చా
-
కేసీఆర్‌ను పరామర్శించడానికే వచ్చా: డీఎస్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి పరామర్శించడానికి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం డీఎస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇతర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్ని మాత్రం డీఎస్ ప్రస్తావించలేదు. కాగా శాసనమండలిలో తిరిగి అవకాశం ఇవ్వనందుకు అసంతృప్తికి గురైన డీఎస్ హస్తానికి చేయిచ్చి, కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఈనెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు. -
కేసీఆర్‌తో డీ.శ్రీనివాస్ సమావేశం
-
కేసీఆర్‌తో డీ.శ్రీనివాస్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆపార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. డీ శ్రీనివాస్ ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరికాసేపట్లో డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా డీఎస్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న డీఎస్‌ను బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. డీఎస్ నివాసానికి బుధవారం ఉదయం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీ హనుమంతరావు తదితరులు వెళ్లినా... డీఎస్ లేకపోవటంతో వారు వెనుదిరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మారిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల తర్వాత మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ టికెట్ తీవ్రంగా యత్నించిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి డీఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు శిష్యులుగా పేరున్న ఆ కుల లలిత రాఘవేందర్‌లకు తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్న ఆవేదనను కూడా ఆయన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనపట్ల సానుకూలంగా ఉన్నా.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్లే అన్యాయం జరిగిం దని కూడ వాపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన డి.శ్రీనివాస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడ రాసినట్లు ప్రచారం జరిగింది. అ లేఖలో దిగ్విజయ్ సింగ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని డీఎస్ వీడేందుకే నిర్ణయించుకున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతుండగా, ఆయన మాత్రం ప్రత్యక్షంగా స్పందించకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. -
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?
-
టీఆర్ఎస్లో చేరనున్న డీఎస్?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంతో పలు అంశాల్లో తీవ్రంగా విభేదిస్తున్న డి శ్రీనివాస్.. గత కొంత కాలంగా తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా అగ్రనేత దిగ్విజయ్ సింగ్ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పిలిచినా కూడా.. మాట్లాడటం కాదు కదా, కనీసం ముఖం చూసేందుకు కూడా తనకు ఇష్టం లేదని ఆయన కటువుగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడింది దిగ్విజయ్ సింగేనన్నదే డీఎస్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావుతో కూడా మంగళవారం నాడు డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. పార్టీలో చేరే విషయంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారని అంటున్నారు. డీఎస్ గనక పార్టీలో చేరితే.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా సోనియాగాంధీ పిలిచి.. పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తానంటే తప్ప.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశమే లేదని అంటున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో ఈ విషయమై విస్తృతంగా చర్చించారు. ఇక ప్రస్తుతం బాల్ డీఎస్ కోర్టులోనే ఉంది. ఆయన ఓ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని చెబుతున్నారు. -
కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్...
హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై అనుచరులు, సన్నిహితులతో డీఎస్ తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి విధేయంగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, విశ్వాసంగా, వివాదరహితంగా, అందరితోనూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోవడమే కొందరు పెద్దలకు నచ్చడం లేదని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా సుముఖంగానే ఉన్నా దిగ్విజయ్ సింగ్ అసూయ, ఈర్ష్యతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలిసింది. -
రాజకీయలబ్ధి కోసమే సెక్షన్-8 ప్రస్తావన- డీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంతంగా, శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆందోళనలను సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమే సెక్షన్ 8 ప్రస్తావన అని పీసీసీ మాజీ అధ్యక్షులు, పార్టీ ఉన్నతస్థాయి కమిటీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సంబంధంలేని ఓటుకు నోటు వ్యహారాన్ని అడ్డంపెట్టుకుని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ఒకరు, హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించి లబ్ది పొందాలని మరొకరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలో రెండు రాష్ట్రాల్లోనూ సానుకూల వాతావరణం నెలకొందన్నారు. ఇప్పుడు మైండ్‌గేమ్ ఆడుతూ, మాసిపోయిన విద్వేషాలను రెచ్చగొట్టొద్దన్నారు. సెక్షన్ 8 అమలు ప్రస్తావన ఇప్పుడెందుకని, హైదరాబాద్‌లో ఎవరిపైనా దాడులు జరిగాయని డీఎస్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గవర్నరు జోక్యం చేసుకోవాల్సినంత అవసరం ఉందా అని అన్నారు. దేశ ప్రజలు ఎక్కడివారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడుతున్నా హైదరాబాద్‌లో స్వేచ్చగా జీవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. కేవలం దురుద్దేశం, రాజకీయ ప్రయోజనాలకోసమే ఇలాంటి ఆందోళన కలిగించే ప్రయత్నాలకు దిగుతున్నారని విమర్శించారు. సెక్షన్ 8 అమలుకు అవకాశమే లేదని, ఈ పరిస్థితుల్లోనే ఆమరణ నిరాహారదీక్ష అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టడం సరికాదన్నారు. సెక్షన్8ను అంగీకరించకుంటే విభజనను అంగీకరించబోమంటూ ఆంధ్రా మంత్రులు మాట్లాడుతున్న వాటిపై డీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమన్నా సమంజసంగా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికే 55 ఏళ్లుగా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణను సుఖంగా బతకనీయకుండా కుట్రలు చేయొద్దని హెచ్చరించారు. తెలంగాణ ఆదాయానికి గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు, ఆందోళనలను సృష్టించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తామని డీఎస్ హెచ్చరించారు. ఒక పార్టీ సీనియర్నేతగానే సెక్షన్ 8పై మాట్లాడుతున్నానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. -
'ఏం అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి'
హైదరాబాద్: సెక్షన్ 8 ఎందుకు అమలు చేయాలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి లబ్ధిపొందేందుకు చంద్రబాబు టీమ్ రాద్ధాంతం చేస్తోందన్నారు. సెక్షన్ 8 అవసరం లేదనడానికి హైదరాబాద్ పరిస్థితులే నిదర్శనమని డీఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తే ప్రజలు సహించరని చెప్పారు. విభజన ప్రక్రియ ప్రశాంతగా జరిగిందని, విఘాతం కలిగించాలని బాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్షన్ 8 అమలు చేస్తే ఆమరణ దీక్ష చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం సరికాదన్నారు. సెక్షన్ 8 అవసరం రాదని మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆనాడే చెప్పామని డీఎస్ తెలిపారు. -
కాంగ్రెస్ నేతల సమీక్ష రసాభాస
హైదరాబాద్:గాంధీభవన్ లో ఆదివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాలు సమావేశమైయ్యారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్, మహేష్ కుమార్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో జోక్యం చేసుకుంటారని డీఎస్ ను మహేశ్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురు నేతలకు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
సోనియా జన్మదినం... ప్రత్యేక పూజలు, అర్చనలు
నిజామాబాద్: రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బంగారు తెలంగాణ అప్పగించారని శాసన మండలిలో ఆ పార్టీ నేత డి. శ్రీనివాస్ తెలిపారు. బంగారు తెలంగాణను రత్నాల తెలంగాణగా మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డీఎస్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం. ఈ నేపథ్యంలో నగరంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో సోనియా పేరుతో డి.శ్రీనివాస్ ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. అనంతరం దేవాలయం వెలపల డీఎస్ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా జన్మదినమైన డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభజన విషయంలో ఎన్నో అడ్డంకులు, విమర్శులు ఎదురైనా... వాటికి ఎదురు నిలిచి సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోనియాగాంధీ పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనం జరుపుకుంటున్నారు. -
ఎన్టీఆర్ పేరు పెడతారా ... దారుణం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం దారుణమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డీఎస్, షబ్బీర్ అలీ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో వారు మాట్లాడుతూ... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించి వ్యక్తి అని వారు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం అవమానకరమన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా వ్యవహారిస్తుందని డీఎస్, షబ్బీర్ అలీ విమర్శించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డమెస్టిక్ టెర్మినల్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పేరే ఆ టెర్మినల్ పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, రాజీవ్ గాంధీ పేరే ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. -
ఇది అంకెల గారడీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆదాయాన్ని అధికంగా చూపడంతో బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని శాసన మండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. ఇది వాస్తవికత లేని బడ్జెట్ అని అభివర్ణించారు. శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చలో తొలుత ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం కనీసం కృతజ్ఞతలు తెలపకపోవడం శోచనీయమన్నారు. తాము రాష్ట్రాన్ని ఇచ్చే నాటికే ఆర్థిక మిగులుతో తెలంగాణ బంగారు తెలంగాణగా ఉందని..ఇపుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని సవాలు విసిరారు. గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల తలసరి ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన గణాంకాలు చదివి వినిపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి రామగుండం ఎన్టీపీసీకి విద్యుత్‌ను తరలించి అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా చేసే అంశాన్ని సాంకేతికంగా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వాటర్‌గ్రిడ్ పథకానికి కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడంతో ఈ పథకం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. మరో రూ.23 వేల కోట్లను ఎక్కడి నుంచి సమకూరుస్తారన్నారు. ఈ పథకానికి తగిన ప్రణాళిక లేకపోవడం శోచనీయమన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు పూచీకత్తునిచ్చి రుణమాఫీ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీపై ఆసక్తికర చర్చ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదని విపక్ష నేత డి.శ్రీనివాస్ తన ప్రసంగంలో పేర్కొనడంతో..సభలో ఉన్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొక్కిపెట్టిన రూ.450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను మంజూరు చేసిన ఘనత తమదేనన్నారు. ఎర్రజొన్న రైతులకు సంబంధించిన రూ.11.92 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మండలి సోమవారానికి వాయిదాపడింది. ఇది ప్రజల బడ్జెట్... తెలంగాణ తొలి బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మండలిలో సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతురుణాల మాఫీ, కల్యాణ లక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్య, వాటర్‌గ్రిడ్, యాదగిరిగుట్ట అభివృద్ధి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు. కేజీ టు పీజీపై రగడ ‘‘గత ఎన్నికల్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అత్యంత ప్రాచుర్యం పొందిన నినాదం. ప్రతి ఎన్నికల సభలో ఈ నినాదాన్ని అధికార పార్టీ బలంగా వినిపించింది. బడ్జెట్లో ఈ పథకానికి నామమాత్రంగా రూ.25 కోట్లు కేటాయించారు. ఇంత ప్రాచుర్యం పొందిన పథకానికి కేటాయింపులు ఇంతేనా ? ఈ పథకాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన వ్యాఖ్య అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ‘గాలికి వదిలేయడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు..ఆంధ్ర ప్రభుత్వం అంతకన్నా కాదు’ అని విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఈ వ్యాఖ్యను తిప్పికొట్టడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా సభలో అన్‌పార్లమెంటరీ భాషను వినియోగిస్తే పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఇరుపక్షాలను శాంతపరిచారు. ఆ ఎమ్మెల్సీలను ఏపార్టీవారిగా గుర్తిస్తారు? ఇదిలా ఉండగా.. శుక్రవారం సభ ప్రారంభం కాగానే తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలను ఏ పార్టీ సభ్యులుగా గుర్తిస్తారో చెప్పిన తరువాతే ప్రశ్నోత్తరాలను ప్రారంభించాలని కాంగ్రెస్‌పక్ష నేత డి.శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుపట్టగా.. టీడీపీ సభ్యులు కూడా మద్దతు పలికారు. ఏ నిబంధన ప్రకారం ఈ ప్రశ్నను లేవనెత్తారనే విషయాన్ని స్పష్టం చేస్తే దీనిపై స్పందిస్తామని మంత్రి కె.తారక రామారావు బదులిచ్చారు. సభ్యులు పార్టీలు మారడం ఈ రోజు కొత్త కాదని, గతంలో చాలా సార్లు జరిగినదేనని స్పష్టం చేశారు. సభలో విపక్షాల ప్రశ్నించే అధికారాన్ని అధికార పక్షం అడ్డుకుంటోందని విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో వాతావరణం వేడెక్కింది. ఈ అం శంపైనే దాదాపు 15 నిమిషాల పాటు వాదోపవాదాలు జరిగాయి. ‘టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలపై విచారణ చేస్తున్నాం.. సభలో వారు అడిగే ప్రశ్నలను పార్టీలతో ప్రమేయం లేకుండా సభ్యులు వ్యక్తిగతంగా అడిగిన ప్రశ్నలుగానే గుర్తిస్తాం, సభ సజావుగా సాగేందుకు సహకరిం చాలి’ అని చైర్మన్ స్వామిగౌడ్ విజ్ఞప్తి చేయడం తో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు ఉపముఖ్యమంత్రి రాజయ్య రాష్ట్రంలో కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య స్పష్టం చేశారు. పాల కల్తీపై తనిఖీల కోసం త్వరలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ రసాయనాన్ని కలిపి సింథటిక్ పాలను విక్రయిస్తున్న ప్రైవేటు పాల వ్యాపార సంస్థలపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వి.భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డిలు లేవనెత్తిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సింథటిక్ పాల వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని, ప్రధానంగా హెరిటేజ్ సంస్థ పాలల్లో ఫార్మాలిన్ కలిపినట్లు నిర్ధారణ కావడంతో ఈ బ్రాండు పాలను నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం జీవోసైతం జారీ చేసిం దని యాదవరెడ్డి సభ దృష్టికి తీసుకు రాగా.. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ సభ్యులు సైతం కల్తీ పాలపై ఆందోళన వ్యక్తంచేశారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని పత్రికల్లో మాత్రమే చూశామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా సింథటిక్ పాలను పట్టుకున్నట్లు సమాచారం లేదని మంత్రి రాజయ్య సమాధానమిచ్చారు. -
సర్కార్ తీరుపై డీఎస్ విమర్శనాస్త్రాలు
హైదరాబాద్ : ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బుధవారం డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సందర్భంగా డీఎస్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఈ సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు, విద్యార్థులు సహా వివిధ వర్గాలు పలు సమస్యలతో సతమతం అవుతున్నా... వాటిపై ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన కూడా చేయకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందే కానీ...ప్రతిపక్షాలను సంప్రదించాలన్న కనీస గౌరవాన్ని కూడా పాటించటం లేదని డీఎస్ మండిపడ్డారు. -
వారిని కర్ర పట్టుకుని కాపలా కాయాలా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశమైంది. పార్టీ సభ్యత్వ నమోదు, నేతల వలసలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించి రాజకీయాలే ఎజెండాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పుగా అభివర్ణించారు. ఇతర పార్టీలను లొంగదీసుకోవాలనే కేసీఆర్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కౌన్సిల్ చైర్మన్, స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతామని జానారెడ్డి, డీఎస్, పొన్నాల పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ముందు పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలా రాజీనామా చేసినవారినే టీఆర్ఎస్లో చేర్చుకోవటం నైతికత అన్నారు. స్వార్థం కోసం పార్టీ వీడుతున్న నేతలను కట్టడి చేయటమంటే కర్ర పట్టుకుని కాపలా కాయాలా? అని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాయకత్వ లోపంతోనే పార్టీ వీడుతున్నామని ...పార్టీ వీడుతున్నవారు చెబితే లోపాలు సరిచేసుకుంటామన్నారు. -
'అధికారం కోసమే కేసీఆర్ హామీలిచ్చారు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. అనంతరం డీఎస్ మాట్లాడుతూ ప్రతిపక్షమే లేకండా చేయాలనే ధోరణిలో అధికార పక్షం ఉందని మండిపడ్డారు. ఓట్లు దండుకుని అధికారంలోకి రావడానికే కేసీఆర్ ఎన్నికల హామీలు ఇచ్చారే తప్ప, వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డీఎస్ తెలిపారు. -
'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'
హైదరాబాద్ : గురుశిష్యులైన చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు ఘర్షణ మానుకుని, తెలంగాణలో కరెంట్ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ హితవు పలికారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల సీఎంలో కొట్లాటలు మాని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్పత్తికి సహకరించుకోవాలని సూచించారు. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. రైతులకు భరోసా ఇవ్వటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని డీఎస్ ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలో చేరితేనే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇస్తామనటం సరికాదన్నారు. మన రాష్ట్రం-మన పాలన అని తెలంగాణను తెచ్చుకుంటే ప్రభుత్వం తీరు తలకొట్టుకునేలా ఉందని డీఎస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమనటం అర్థరహితమన్నారు. కొత్త సర్కార్ పూర్తిగా అటకెక్కిందని, ఇప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ లేదని అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రత్యామ్నాయమే లేదని డీఎస్ అన్నారు. గాంధీ కుటుంబ పాలనను కోరుకుంది ప్రజలే కానీ....నేతలు కాదని డీఎస్ పేర్కొన్నారు. -
'సోనియా తర్వాత రాహులే నాయకుడు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప మరో నాయకత్వం లేదని సీనియర్ నేత డీ శ్రీనివాస్ అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డీఎస్‌తో పాటు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా తర్వాత కాంగ్రెస్ భావి నేత రాహుల్ గాంధీయేనని డీఎస్ అన్నారు. పొన్నాల మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలన్నింటినీ ఆదుకోనందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్పై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని, అందువల్లే ప్రభుత్వ తీరుకు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు. -
సీఎం పచ్చి మోసకారి: డీఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసకారి అని, ఆయన తన కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ మేలు చేయరని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తలవంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు రైతు సమస్యలపై తాము ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. గోదావరి దాటి నాలుగు అడుగులు వేస్తే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు వస్తుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ది అవగాహన రాహిత్యమా.. లేక ప్రజలను మోసం చేయడమా అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరి జానారెడ్డి ప్రశ్నించారు. కరెంటు సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. -
సోనియాతో డీఎస్ మంతనాలు, పొన్నాలకు పిలుపు
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్, రెండుసార్లు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డీఎస్ హస్తినలో సోనియా మంతనాలు జరపడం తెలంగాణా కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తేవడంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు డీఎస్ కృషి కూడా ఉంది. దాంతో తన సొంత నియోజక వర్గంలో మూడుసార్లు ఓడిపోయినా డీఎస్‌కు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చింది. అలాగే డీఎస్ ఎమ్మెల్సీ పదవి వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సోనియాను కలిసిన డీఎస్ తనకు మరో దఫా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని లేకుంటే తెలంగాణా పిసిసి పగ్గాలైనా అందించాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే పొన్నాల నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన్ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీలో పలువురు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్ మంతనాలు, పొన్నాలను అధిష్టానం నుంచి పిలుపు రావటం మరోసారి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. -
'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు'
నిజామాబాద్: రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం భరోసాయాత్ర నిర్వహించారు. కరెంట్ కష్టాలతో పంటలు ఎండిపోయిన రైతులను వారు పరామర్శించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. రుణాలు మాఫీకాక అప్పులు పెరిగిపోవడంతో 220 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కరువు మండలాలు ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కోల్పోయిన పంటబీమా నష్టాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. -
సమస్యలపై కాంగ్రెస్ నేతల పర్యటన
తొలుత నిజామాబాద్... ఆ తరువాత పాలమూరు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే అన్ని జిల్లా ల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెం బ్లీ సమావేశాల సందర్భంగా కరెంట్ కష్టాలు, రుణమాఫీ వంటి అంశాలతోపాటు రైతుల ఆత్మహత్యలకు కారణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 9న తొలుత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ప్రారంభమయ్యే పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌సహా కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం పొన్నాల నివాసంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై జిల్లాల పర్యటనలపై చర్చించారు. కమిటీ సభ్యులు పొన్నాల, జానారెడ్డి, డీఎస్, షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పీసీసీ కిసాన్‌సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం ఆయా నేతలతో కలసి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలు కడగండ్లు తెలుసుకుని భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమైనట్లు చెప్పారు. త్వరలో టీపీసీసీ కార్యవర్గ ప్రక్షాళన... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పలువురు పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో సమావేశమై సభ్యత్వ నమోదు, సంస్థాగత మార్పులు చేర్పులపై అభిప్రాయాలు సేకరించారు. ధైర్యముంటే బహిరంగ చర్చకు రా.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమెవరనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత, విద్యుత్ శాఖ మాజీమంత్రి షబ్బీర్‌అలీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంగళవారమిక్కడ గాం ధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి పదేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్‌అలీ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్.. చేతగాకుంటే తప్పుకో: డీకే అరుణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకుండా సీఎం కేసీఆర్ విపక్షాలను విమర్శించడం విడ్డూరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. విద్యుత్ సవుస్యను పరిష్కరించడం చేతగాకుంటే కేసీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. -
నేడు వికారాబాద్‌కు పొన్నాల
- సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ - హాజరుకానున్న జానా, డీఎస్, ఉత్తమ్ సహా పలువురు నేతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓటమి భారంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం వికారాబాద్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తలసమావేశంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యే ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి సహా అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గౌలికార్ ఫంక్షన్లో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. తనపై నమ్మకంతో రెండోసారి డీసీసీ పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్యామ మాట్లాడారు. సీనియర్లతో ఏలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా సమన్వయంతో వ్యవహరిస్తానని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 109 హామీలిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గద్దెనెక్కిన తర్వాత కేవలం రెండు, మూడు హామీలను మాత్రమే అమలు చేసిందని, మిగతావాటిని బుట్టదాఖలు చేసే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తామని మల్లేశ్ స్సష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 48డివిజన్లలో పార్టీని పటిష్టంచేసేందుకు త్వరలోనే డివిజన్లవారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని క్యామ మల్లేశ్ అన్నారు.