ఇంత గుండెధైర్యమున్న సీఎం మరొకరు లేరు | cm kcr have a forms the heart, d srinivas | Sakshi
Sakshi News home page

ఇంత గుండెధైర్యమున్న సీఎం మరొకరు లేరు

Published Sat, Apr 15 2017 12:16 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఇంత గుండెధైర్యమున్న సీఎం మరొకరు లేరు - Sakshi

ఇంత గుండెధైర్యమున్న సీఎం మరొకరు లేరు

హైదరాబాద్‌: దేశంలో ఇంత గుండె ధైర్యమున్న సీఎం మరొకరు లేరని రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతులంతా సంబురాలు జరుపుకుంటున్నారు. ఎరువుల కోసం ఎకకరాకు రూ. 4 వేలు ఇవ్వాలనే నిర్ణయం సామాన్యమైనది కాదు. ఇచ్చిన హామీలన్నీటిని పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా పూర్తి కాలేదన్ని విషయం గుర్తుపెట్టుకోవాలి.

రాష్ట్రంలో ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 25 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయించడం గొప్ప విషయం. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా చాలా బాగుంది. ఎవరినో కాపీ కొట్టాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. 2014లో ప్రజలు మంచి తీర్పు వెలువరించారు. హామీలు ఇచ్చి మర్చిపోయే నాయకులు కొందరుంటారు. కానీ కేసీఆర్‌ అలాంటి వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు.. కేసీఆర్‌ గొప్ప విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement