సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు నాయలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో డీఎస్ ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులు సంజయ్ అరవింద్‌లను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక భూమిక పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రత్యేక చొరవతోనే 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్‌కు మంచి అనుబంధం ఉందని, బడుగు, బలహీన వర్గాల నేతలను ప్రోత్సాహించారని ప్రశంసించారు. డీఎస్ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అంతియ యాత్ర మొదలు కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి పాడెను మోశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment