సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి.
శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది.
‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం.
:::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment