![AP Ex Minister Botsa Satyanarayana Meet DS Family](/styles/webp/s3/article_images/2024/07/1/Botsa-Satyanarayana_0.jpg.webp?itok=Myz7QPRS)
నిజామాబాద్, సాక్షి: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకోసం సోమవారం ఉదయం ప్రగతి నగర్‌లోని డీఎస్ నివాసానికి బొత్స వెళ్లారు.
కాంగ్రెస్‌లో ఉండగా డీఎస్‌తో బొత్సకు మంచి అనుబంధం ఉంది. డీఎస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన కుటుంబ సభ్యుల్ని బొత్స ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. జూన్ 30వ తేదీన హైదరాబాద్ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment