
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవం లేకుంటే ఒక్క నిమిషం కుడా పార్టీలో ఉండేవాడిని కాదని పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు. పార్టీలో తమకు గౌరవం దక్కడంలేదని, చిన్న చూపు చూస్తున్నరనే అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు. ప్రభుత్వ పథకాల విషయంలోటీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వివక్ష చూపిస్తున్నారంటూ తన అనుచరులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. తన అనుచరులు, కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్తానని తెలియచేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని.. భవిష్యత్‌లో కూడా అదే పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, తనపై వస్తున్న ఊహాగానాలపై స్పందించని వెల్లడించారు. పార్టీ ఇంట్రెస్ట్‌లో సీఎం కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు డి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment