డీఎస్‌పై అనర్హత వేటు? | Disqualification on D Srinivas? | Sakshi
Sakshi News home page

డీఎస్‌పై అనర్హత వేటు?

Published Sun, Sep 9 2018 2:17 AM | Last Updated on Sun, Sep 9 2018 2:17 AM

Disqualification on D Srinivas? - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ రాజ్యసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయించే దిశగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఇందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు ఢిల్లీలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే.. డీఎస్‌ ఎంపీ పదవీకాలం 2022 వరకు ఉంది.

ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణినే అవలంబించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జూన్‌ 27న టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానం చేసి అధిష్టానానికి పంపిన విషయం విదితమే. ఈ విషయమై ఇటీవల కేసీఆర్‌ స్పందిస్తూ ‘పార్టీలో ఉంటే ఉంటడు.. పోతే పోతడు.. ఇంకా ఏదీ నిర్ణయించలేదు..’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement